నిద్ర లేవడంతోనే స్మార్ట్ ఫోన్ లో ఆప్డేట్స్ చూసుకోవడం.. ఫ్రెండ్స్ సందేశాలకు రిప్లై ఇవ్వటం.. యాప్స్ నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకు ఇలా అనేక పనులు చేస్తుంటాం. కానీ, మీరు వాడే యాప్స్ మీ వ్యక్తిగత సమాచారాన్ని లాగేస్తున్నాయని మీకు తెలుసా?. తాజాగా 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఫేస్‌బుక్ యూజర్ల డేటాను దొంగలించినట్లు యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ తయారీ సంస్థ డాక్టర్ వెబ్ వెల్లడించింది. వీటిలో తొమ్మిది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ కోసం అందుబాటులో ఉన్నాయని, వాటి గురుంచి నివేదించిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు డాక్టర్ వెబ్ తెలిపింది.
ఈ యాప్స్ ని చాలా వరకు 1,00,000 మందికి పైగా ఇన్స్టాల్ చేసుకొన్నారు. మరొక దాన్ని 5 మిలియన్ మంది ఇన్ స్టాల్ చేశారు. డాక్టర్ వెబ్ నివేదిక ప్రకారం, ఫోటో ఎడిటింగ్ యాప్స్, పీఐపీ ఫోటో యాప్స్ ను 5 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ జాబితాలో వరుసగా App Lock Keep, App Lock Manager, Lockit Master యాప్స్ ఉన్నాయి. ఈ జాబితాలో మెమొరీ క్లీనర్, ఫిట్ నెస్ యాప్, రెండు హొరోస్కోప్ యాప్స్ కూడా ఉన్నాయి. వీటిని చాలా సార్లు ప్రజలు ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. Rubbish Cleaner, Inkwell Fitness, Horoscope Daily, HscopeDaily అనే వాటిని 1,00,000 మంది డౌన్‌లోడ్ చేశారు.
"ఈ స్టీలర్ ట్రోజన్ల యాప్స్ ను విశ్లేషించే సమయంలో ఎడిటర్ ఫోటోపిప్ అనే ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన తర్వాత కూడా ఇప్పటికీ సాఫ్ట్ వేర్ అగ్రిగేటర్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉంది" అని కంపెనీ తన బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది. చాలా మాల్వేర్ యాప్స్ లాగా కాకుండా ఇన్-యాప్ ప్రకటనలను నిలిపివేయడానికి, కొన్ని ఫీచర్స్ యాక్సెస్ చేసుకోవడానికి వారి ఫేస్‌బుక్ ఖాతాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది. వినియోగదారుల ఎంటర్ చేసిన లాగిన్ వివరాలను వారు దొంగలిస్తారు. డాక్టర్ వెబ్ తన బ్లాగ్ పోస్టులో చట్ట వ్యతిరేక కార్యక్రమాల కోసం యూజర్ల డేటాను దొంగలించి ఉండవచ్చు అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment