రోజురోజుకి టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తుందో...అంతే వేగంతో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. సైబర్ నేరస్తులు కొంత పుంతలు తొక్కుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. కొత్త మంది హ్యకర్లు ఏకంగా గూగుల్‌ప్లే స్టోర్‌లోకి నకిలీ యాప్స్‌ను చొప్పించి..సదరు యాప్స్ ద్వారా మాల్వేర్స్‌ను స్మార్ట్‌ఫోన్లలోకి ఎక్కిస్తున్నారు. ఇలాంటిదే తాజాగా కార్టూనిఫైయర్ యాప్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్ల ఫేస్‌బుక్ డేటాను దొంగిలిస్తోన్నట్లు తెలుస్తోంది.
లక్ష మందిపై ప్రభావం..!
కార్టూనిఫైయర్ యాప్‌లో FaceStealer అనే మాల్వేర్‌ను గుర్తించారు. కార్టూనిఫైయర్ యాప్(cartoonifier app)తో హ్యకర్లు ఆయా యూజర్ల ఫేస్‌బుక్ ఖాతాల పాస్‌వర్డ్స్‌ను సొంతం చేసుకుంటున్నట్లు ప్రడియో(Pradeo) వెల్లడించింది. ఇప్పటికే ఈ యాప్‌ను సుమారు లక్షకు పైగా ఆండ్రాయిడ్ యూజర్లు ఇన్‌స్టాల్ చేసినట్లు ప్రడియో తన నివేదికలో పేర్కొంది. కాగా ఈ యాప్‌పై గూగుల్ ప్రతినిధులు స్పందించారు.
'క్రాఫ్ట్‌సార్ట్ కార్టూన్ ఫోటో టూల్స్' పేరుతో ఉన్న యాప్ ఇకపై డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదని, ప్లే స్టోర్ నుంచి తొలగించమని గూగుల్ ప్రతినిధి ప్రముఖ టెక్ బ్లాగింగ్ సంస్థ బ్లీపింగ్ కంప్యూటర్‌కు తెలియజేశారు. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న వారు వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని సూచించారు. అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్‌లో సదరు యాప్స్‌ను చెక్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిందంటూ సూచించారు.
ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు వీటిని దృష్టిలో పెట్టుకోండి.
- యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు సంబంధింత యాప్ డెవలపర్ ఎవరో, తనీఖీ చేసి ధృవీకరించాలి.
- యాప్‌పై గల రివ్యూలను, రేటింగ్‌లను చూడడం మంచింది. మాల్వేర్ కల్గిన యాప్స్‌ను యూజర్లు రివ్యూలో రిపోర్ట్ చేస్తూ ఉంటారు.
- యాప్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మైక్రోఫోన్, కాంటాక్ట్స్, ఇతర డేటాను యాక్సెస్ చేసే వాటిని అసలు ఇన్‌స్టాల్ చేయకండి.
- ఎల్లప్పుడు Google Play Store లేదా Apple App store నుంచి మాత్రమే యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
చదవండి: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన రియల్‌మీ..! ధర ఎంతంటే..?
Comments
Please login to add a commentAdd a comment