నిన్న ఒక్కసారిగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు షాక్ గురయ్యారు. ఏడుగంటల పాటు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ నెట్‌వర్క్ పూర్తిగా నిలిచిపోయింది. సర్వర్స్‌లో నెలకొన్న సాంకేతిక సమస్య కారణంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో నిలిచిపోయిన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఫేస్‌బుక్ టెక్నాలజీ ఆఫీసర్ స్పందిస్తూ యూజర్ల అందరికి క్షమాపణలను తెలియజేశారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలను తిరిగి మాన్యువల్‌గా పునరుద్ధరించడంతో సుమారు 7 గంటల సమయం పట్టిన్నట్లు వెల్లడించారు. ఒక్కసారిగా ఫేస్‌బుక్ సర్వర్లు డౌన్ అవ్వడంతో బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకమ్‌బర్గ్ సుమారు 7 బిలియన్‌డాలర్లకు పైగా నష్టపోయాడని పేర్కొంది.
ఫేస్‌బుక్ యూజర్లకు మరో షాక్...!
ఒక్కసారిగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో షాక్ గురైన యూజర్లకు రష్యన్ ప్రైవసీ అఫైర్స్ మరో షాకిచ్చింది. ఫేస్‌బుక్ గ్లోబల్ నెట్‌వర్క్స్ అంతరాయం కల్గిన సమయంలో హ్యకర్లు డార్క్ వెబ్ హ్యాకర్ ఫోరమ్‌లో ఫేస్‌బుక్ యూజర్ల డేటాను విక్రయించారని నివేదించింది. ఫేస్‌బుక్ యూజర్ల చిరునామా, పేరు, ఈ-మెయిల్ చిరునామా, ఫోన్ నంబర్లను అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. ఒక నివేదిక ప్రకారం దాదాపు 1.5 బిలియన్ ఫేస్‌బుక్ ఖాతాలు డార్క్ వెబ్‌లో అమ్మకానికి వచ్చినట్లు రష్యన్ ప్రైవసీ అఫైర్స్ నివేదించింది.
కొంతమంది హ్యాకర్లు ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు నిర్ధారణలు ఉన్నాయి. ఫేస్‌బుక్ యూజర్ల డేటాను డార్క్‌వెబ్‌లో కొనుగోలు చేద్దామనుకున్న ఓ వ్యక్తికి హ్యాకర్లనుంచి 5,000 డాలర్లను చెల్లించగా తిరిగి ఎటువంటి డేటాను పొందలేదని ఆ వ్యక్తి రిపోర్ట్‌చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్ చివరలో, కొంతమంది హ్యాకర్లు తమ వద్ద 1.5 బిలియన్ ఫేస్‌బుక్ యూజర్ డేటా ఉందని పేర్కొంటూ పోస్ట్ చేసారు.
స్పందించిన ఫేస్‌బుక్..!
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ ఐనా సమయంలో యూజర్ల డేటా అసలు లీక్ అవ్వలేదని ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. యూజర్ల డేటాకు డోకా లేదని వెల్లడించింది. యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లకుండా ఫేస్‌బుక్ చర్యలను తీసుకుంటుందని తెలిపింది.
ఎందుకైనా మంచిది ఇలా చేస్తే బెటర్..!
ఫేస్‌బుక్ యూజర్లు తమ డేటాను చోరికి గురిఅవ్వకుండా ఉండడం కోసం 2 అథనిటికేషన్ పాస్‌వర్డ్‌ను యూజర్లు తమ ఖాతాలకు ఏర్పాటు చేయడం మంచిది. అంతేకాకుండా స్ట్రాగ్ పాస్‌వర్డ్‌లను కూడా తమ ఫేస్‌బుక్ అకౌంట్లకు ఏర్పాటు చేసుకోవాలని పలు టెక్నికల్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
“Data of Over 1.5 Billion Facebook Users Sold on Hacker Forum
— Amrita Bhinder 🇮🇳 (@amritabhinder) October 4, 2021
Information of over 1.5 billion Facebook users being sold on popular hacking-related forum, potentially enabling cybercriminals and unscrupulous advertisers to target Internet users globally” https://t.co/JE8uSJbOg9
చదవండి: కోట్లమంది చిరాకు.. డిలీట్ ఫేస్‌బుక్ ట్రెండ్! గ్యాప్‌లో కుమ్మేసిన ట్విటర్, టెలిగ్రామ్
Comments
Please login to add a commentAdd a comment