dark web
-
డార్క్ వెబ్‌లో హెరాయిన్ ఆర్డర్.. స్పీడ్ పోస్ట్‌లో డెలివరీ!
ఖమ్మం క్రైం: సాధారణంగా మానవ కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతుంటుందన్న విషయం తెలిసిందే. కానీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా, సరఫరాపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో డ్రగ్స్ బానిసలు కొత్తదారులను ఆశ్రయిస్తున్నారు. తాజా గా ఓ యువకుడు డార్క్ వెబ్‌లో ఆర్డర్ పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్న ఉదంతం ఖమ్మంలో వెలుగుచూసింది.అస్సాం నుంచి: ఖమ్మం టూటౌన్ ప్రాంతానికి చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ మత్తుపదార్థాలకు అలవాటు పడ్డాడు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న అతను అక్కడ పోలీసు నిఘా ఎక్కువగా ఉండటంతో ఖమ్మంకు తెప్పించుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించాడు. ఇందుకోసం హ్యాకర్లు, మాఫియా, విమెన్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్ చేసేవారు ఉపయోగించే డార్క్ వెబ్ (తమ గుర్తింపు, జాడను ఇతరులకు తెలియనివ్వకుండా ఇంటర్నెట్లోని హిడెన్ వెబ్సైట్లను ఉపయోగించేందుకు అవకాశం కల్పిస్తుంది) ఎంచుకున్నట్లు సమాచారం. ఆపై తన క్రెడిట్ కార్డు, ఇతర యాప్‌లు వాడకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసి హెరాయిన్‌ను అస్సాంలోని సిల్పుకురి నుంచి బుక్ చేసుకున్నాడు.యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘాతో..: డ్రగ్స్ ఆన్లైన్లో విక్రయిస్తుండగా కొందరు తెప్పించుకుంటున్నారనే అను మానంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన సాంకేతిక బృందం కొన్నాళ్లుగా నిఘా వేసింది. ఇందులో భాగంగా గ త నెల 31న ఖమ్మం యువకుడు డ్రగ్స్ బు క్ చేసుకున్నట్లు పసి గట్టింది. స్పీడ్ పోస్ట్ పార్సిల్ నంబర్‌ను హెరాయిన్ సరఫరా దారు ఖమ్మం యువ కుడికి పంపడంతో అస్సాంలో పార్సిల్ మొదలైనప్పటి నుంచి నిఘా వేసింది. ఈ నెల 8న ఖమ్మం చేరుకున్న పార్సిల్‌ను 9న ఆ యువకుడికి డెలివరీ చేస్తుండగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులతోపాటు ఖమ్మం టూటౌన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఆ పార్సిల్లో మ్యాగజైన్ మాత్రమే ఉండటంతో తొలుత యువకుడు బుకాయించాడు. అనంతరం అధికారులు మ్యాగజైన్‌లోని ఒక్కో పేజీని పరిశీలిస్తుండగా మధ్యలో ఓ కాగితానికి టేప్ వేసి ప్లాస్టిక్ కవర్లో ఉంచిన 2 గ్రా ముల హెరాయిన్ బయటపడింది. దీంతో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. దాన్ని సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో ఇంకా ఎవరెవరు తెప్పించుకున్నారనే కోణంలో ప్రశ్నించారు. యువకుడి కెరీర్ దృష్ట్యా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయం జరి గినట్లు తెలిస్తే 87126 71111 లేదా 1908 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. -
దిగ్గజ టెలికం కంపెనీలో కలకలం, 73 మిలియన్ల మంది యూజర్ల డేటా లీక్
అమెరికాలో అతిపెద్ద టెలికాం దిగ్గజం ఏటీ అండ్ టీలో కలకలం రేపింది. ఆ సంస్థ యూజర్ల డేటా డార్కెట్ వెబ్‌లో ప్రత్యక్షమైంది. రెండు వారాల క్రితం ‘డార్క్‌వెబ్’ లో విడుదలైన డేటా కారణంగా సుమారు 7.6 మిలియన్ల మంది ప్రస్తుత ఖాతాదారులు, 65.4 మిలియన్ల మాజీ ఖాతాదారులపై ప్రభావం చూపినట్లు సమాచారం. ఇదే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని ఏటీ అండ్ టీ ప్రతినిధులు వెల్లడించారు. పలు నివేదికల ప్రకారం.. డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షమైన ఏటీ అండ్ టీ కంపెనీ యూజర్ల డేటా 2019 సంవత్సరం నాటిదని తెలుస్తోంది. ఆ డేటాను ఉపయోగించిన సైబర్ నేరస్తులు అనధికారికంగా తమ డేటాను యాక్సిస్ చేసిన ఆధారాలు లేవని, అయితే డేటా లీకేజీ సంస్థ నుంచి వచ్చిందా లేదంటే సిబ్బంది వల్లే ఇలా జరిగిందా? అన్న అంశంపై ఏటీ అండ్ టీ విశ్లేషిస్తున్నట్లు వెల్లడించింది. పాస్వర్డ్లు రీసెట్ ఈ ఘటన తమ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని, డేటా లీకేజీ అందుకు గల కారణాల్ని అంచనా వేస్తున్నామని ఏటీ అండ్ టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. బాధిత యూజర్లతో ఏటీ అండ్ టీ సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుత 7.6 మిలియన్ యూజర్ల పాస్ వర్డ్‌లను రీసెట్ చేసింది. అవసరమైన చోట క్రెడిట్ మానిటరింగ్ అందిస్తామని తెలిపింది. కాగా, 5జీ నెట్వర్క్ యునైటెడ్ స్టేట్స్ అంతటా సుమారు 290 మిలియన్ల ప్రజలకు సేవల్ని అందిస్తోంది. ఫిబ్రవరిలో అంతరాయం ఫిబ్రవరిలో ఎటి అండ్ టిలో అంతరాయం ఏర్పడింది. దీంతో వేలాది మంది యుఎస్ వినియోగదారులు కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు పంపడంలో అంతరాయం కలిగింది. -
డార్క్‌వెబ్‌లో ‘బీఎస్ఎన్ఎల్’ యూజర్ల డేటా
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారుల సమాచారాన్ని చోరీచేసిన ఓ హ్యాకర్ ఆ వివరాలను ఆన్లైన్లో విక్రయానికి పెట్టాడు. దీంతో ఆయా కస్టమర్ల గోప్యతకు విఘాతం కలిగింది. తనను ‘పెరిల్’గా పేర్కొన్న ఓ హ్యాకర్.. డార్క్‌వెబ్‌లో ఆ సమస్త వివరాలను పొందుపరిచాడు. దీంతో యూజర్ల గుర్తింపు బహిర్గతమవడంతోపాటు వారి సమాచారం సాయంతో మరో ఆర్థిక మోసం, ఆన్లైన్మోసానికి ఆస్కారం ఏర్పడింది. దాదాపు 29 లక్షల వరుసల డేటాను సంపాదించానని హ్యాకర్ తన డార్క్‌వెబ్ పేజీలో పేర్కొన్నాడు. శాంపిల్‌గా మొదట 32,000 లైన్ల డేటాను అందరికీ కనిపించేలా పెట్టాడు. ఆయా బీఎస్ఎన్ఎల్ ఫైబర్, ల్యాండ్‌లైన్ యూజర్ల పేరు, ఈమెయిల్ ఐడీ, బిల్లుల సమాచారం, ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత డేటాను వెబ్సైట్లో విక్రయానికి పెట్టాడు. కస్టమర్ ఇన్ఫర్మేషన్, నెట్వర్క్ వివరాలు, ఆర్డర్లు, హిస్టరీ అందులో ఉన్నాయి. డేటా చోరీతో వెంటనే అప్రమత్తమై తమ యూజర్ల డేటా రక్షణకు బీఎస్ఎన్ఎల్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరిగాయి. ‘ ఇది బీఎస్ఎన్ఎల్కు, దాని వినియోగదారులపై విస్తృతస్థాయిలో దు్రష్పరిణామాలు చూపిస్తుంది’ అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఇండియా ఫ్యూచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కనిష్క్ గౌర్ ఆందోళన వ్యక్తంచేశారు. -
షాకింగ్..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారుల డేటా లీక్?
ప్రముఖ దేశీయ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అతి పెద్దదైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు వినియోగదారుల డేటా లీకైనట్లు తెలుస్తోంది. ఓ హ్యాకర్ వారి వ్యక్తిగత వివరాలకు సంబంధించిన 7.5 జీబీ డాటాను డార్క్ వెబ్‌లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే డేటా గల్లంతుపై వస్తున్న వరుస కథనాల్ని హెచ్డీఎఫ్సీ యాజమాన్యం కొట్టిపారేసింది. ఓ ప్రముఖ అండర్‌గ్రౌండ్ హ్యాకర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారుల సమాచారాన్ని డార్క్ వెబ్‌లో పోస్ట్ చేశాడు. పైగా అందులో ఎలాంటి పేమెంట్ చెల్లించకుండానే డేటాను తీసుకోవచ్చని తెలిపారు. ఈ డేటా గల్లంతుపై ఓ మీడియా సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి వివరణ కోరింది. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారి ప్రతినిధి మాట్లాడుతూ.. మా సంస్థలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించలేరు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను వేరేవాళ్లు యాక్సెస్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. మా కస్టమర్ల వ్యక్తిగత గోప్యతే లక్ష్యంగా.. సంబంధిత వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. -
నాడు ఎన్సీబీ నేడు హెచ్-న్యూ!.. ‘డార్క్ వెబ్–డ్రగ్స్ దందా’ గుట్టు రట్టు
సాక్షి, సిటీబ్యూరో: డార్క్ వెబ్ ద్వారా జరిగే డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసి, నిందితులను అరెస్టు చేయడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. సాంకేతిక అంశాలతో ముడిపడిన ఉన్న ఇలాంటి ఆపరేషన్లను దేశంలో ఇప్పటి వరకు కేంద్రం ఆదీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మాత్రమే చేసింది. ఇతర ఏ రాష్ట్ర పోలీసులతో సహా ప్రత్యేక విభాగాలు చేపట్టలేకపోయాయి. ఎన్సీబీ చరిత్రలో ఇలాంటి ఆపరేషన్లు ఎనిమిది ఉండగా... దాని తర్వాత ఆ కేటగిరీలోకి హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) చేరింది. ‘డార్క్ వెబ్... క్రిప్టో కరెన్సీ... డెడ్ డ్రాప్’ పంథాలో నెట్వర్క్ నడిపిస్తున్న ఇద్దరు సరఫరాదారులు, ఆరుగురు పెడ్లర్లను గురువారం పట్టుకున్న విషయం విదితమే. 25 మందితో 285కి చెక్... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన, ఆదేశాల మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్–న్యూకు రూపమిచ్చారు. డీసీపీ చక్రవర్తి గుమ్మి నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు పి.రాజే‹Ù, పి.రమేష్‌రెడ్డిలతో సహా మొత్తం 25 మందితో ఈ వింగ్ పని చేస్తోంది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో వివిధ మాదకద్రవ్యాలకు సంబంధించిన 58 కేసులు నమోదు చేసింది. వీటిలో నిందితులుగా ఉన్న స్థానికులు, ఇతర రాష్ట్రాల/దేశాల వారితో కలిపి మొత్తం 285 మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. మాదకద్రవ్యాలను హైదరాబాద్‌కు సరఫరా చేమంటూ పెద్దపెద్ద పెడ్లర్లే చేతులెత్తేసే స్థాయికి చేరింది. దీంతో అనేక మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లి డ్రగ్స్ ఖరీదు చేసుకుని రావడం మొదలెట్టారు. ఐదో అంచెలోకి అడుగు.. ఈ విషయం గుర్తించిన హెచ్–న్యూ తన పంథా మార్చింది. స్థానికులు, ఇతర జిల్లాల వారిని పట్టుకుంటే సరిపోదని, డ్రగ్స్ దందాకు పూర్తిగా చెక్ చెప్పాలంటూ పరిధిని మరింత విస్తరించుకోవాలని భావించింది. దీంతో ఇతర రాష్ట్రాల్లోనూ దాడులు చేసి పెడ్లర్స్‌ను పట్టుకోవడం మొదలెట్టింది. దీనికి తోడు ఈ దందాలో ఉన్న విదేశీయులను డిపోర్టేషన్ ద్వారా వారి దేశాలకు తిప్పి పంపుతోంది. ఇలా ఇప్పటి వరకు ఐదుగురిని బలవంతంగా తిప్పి పంపింది. ఐదో అంచెలోకి అడుగు పెట్టిన హెచ్–న్యూ అత్యంత క్లిష్టమైన డార్క్ వెబ్‌పై పట్టు సాధిస్తోంది. దీని ఆధారంగా సాగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారాన్ని విచ్ఛిన్నం చేయడంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే గురువారం నాటి అరెస్టులు చోటు చేసుకున్నాయి. కొరియర్ సంస్థలతో సమావేశం.. నగరంలో డెలివరీ అవుతున్న మాదకద్రవ్యాల్లో ఎక్కువ శాతం కొరియర్ రూపంలోనే వస్తున్నాయి. ఈ విషయం గుర్తించిన సిటీ పోలీసులు వాటి నిర్వాహకులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అందులో తమ దృష్టికి వచ్చిన కేసులను వివరించడంతో పాటు స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించనున్నారు. ఆ తర్వాత నిర్లక్ష్యంగా ఉన్న సంస్థలపై చర్యలు తీసుకుంటారు. మరోపక్క ఈ డ్రగ్స్ ప్రధానంగా సౌతాఫ్రికా, డర్బన్ తదితర ప్రాంతాల నుంచి వస్తున్నట్లు భావిస్తున్నారు. వీటిని అడ్డుకోవడానికి కేంద్ర ఏజెన్సీలు, ఇతర విభాగాలతో కలిసి పని చేయాలని నగర పోలీసులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ సమావేశం జరిగింది. త్వరలో మరో సమావేశం నిర్వహించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కొత్వాల్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. ఇతర విభాగాలకు అందులో శిక్షణ.. కేవలం డ్రగ్స్ దందాకు మాత్రమే కాదు అక్రమ ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా సహా అనేక అసాంఘిక కార్యకలాపాలకు డార్క్ వెబ్ అడ్డాగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇతర విభాగాలకు దీనిపై పట్టు ఉండేలా చేయాలని కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. దీనికోసం హెచ్–న్యూ సిబ్బందికి అదనపు శిక్షణ ఇప్పించడంతో పాటు వీళ్లు అటు టాస్క్‌ఫోర్స్, ఇటు సైబర్ క్రైమ్ పోలీసులకు తర్ఫీదు ఇచ్చేలా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరంలో డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వారికి రీహ్యాబ్ సంస్థల ద్వారా ఐదు దశల్లో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. ఇప్పటి వరకు 488 మందికి వివిధ దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. అధికారికంగా ‘విమోచన’ ఉత్సవాలు -
డెత్ డ్రాప్.. డ్రగ్ ట్రాప్! ఎవరికీ చిక్కకుండా కొత్త పంథాలో ‘సరుకు’ డెలివరీ
సాక్షి, హైదరాబాద్: సంపన్నుల పిల్లలు, యువత, విద్యార్థులే టార్గెట్.. ఎక్కడా చిక్కొద్దు.. డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్లు తీసుకోవడం.. బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు స్వీకరించడం.. ‘డెడ్ డ్రాప్’ విధానంలో డ్రగ్స్ అందజేయడం.. లేదంటే కొరియర్లో సరఫరా చేయడం.. ఎక్కడా ‘అసలు’ మనుషులు నేరుగా కనిపించరు. డ్రగ్స్ మాత్రం చేరిపోతాయి. ఎవరికీ చిక్కకుండా అత్యాధునిక, సరికొత్త విధానాల్లో వ్యవస్థీకృతంగా మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న ఇద్దరు సప్లయర్లు, రాష్ట్రానికి చెందిన ఆరుగురు పెడ్లర్స్ (స్థానిక డ్రగ్స్ విక్రేతల)ను అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న సంపన్నుల పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులపైనా కేసులు నమోదు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గురువారం ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆ వివరాల మేరకు.. ఫర్హాన్ మహ్మద్, నరేంద్ర ఆర్య డార్క్ వెబ్‌లో ఆర్డర్లు తీసుకుని.. హరియాణా, మధ్యప్రదేశ్ నుంచి వెళ్లి గోవా, రాజస్తాన్‌లలో స్థిరపడిన నరేంద్ర ఆర్య, ఫర్హాన్ మహ్మద్ అన్సారీ దేశవ్యాప్తంగా పెడ్లర్స్ (స్థానికంగా డ్రగ్స్ విక్రయించేవారు) నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎల్ఎస్డీ, ఎండీఎంఏ, చరస్, ఎక్స్టసీ, గంజాయి వంటి మాదకద్రవ్యాలను అంతర్జాతీయ ముఠాల నుంచి తెప్పించుకుని.. దేశవ్యాప్తంగా పెడ్లర్లకు సరఫరా చేస్తున్నారు. బికర్మీ యాప్‌లో హోలీ షాప్, ట్రిమినేటర్ పేర్లతో ఐడీలు క్రియేట్ చేసుకున్నారు. డార్క్‌వెబ్‌లోని డ్రగ్స్ ఫోరమ్స్‌లో ఈ ఐడీలతోపాటు తమ వద్ద లభించే డ్రగ్స్ వివరాలు, వాటి రేట్లను ప్రదర్శిస్తున్నారు. వీరితోపాటు ‘జుంబద కార్టెల్’ అనే ఐడీ ద్వారానూ డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయి. ఈ ఐడీ ఎవరిదన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది. ►హైదరాబాద్‌కు చెందిన డ్రగ్స్ పెడ్లర్లు ఉత్కర్‡్ష ఉమంగ్, సాహిల్ శర్మ, అబ్దుల్లా అన్సారీ అహ్మద్‌ఖాన్, ఇంద్రకుమార్, అవిటి చరణ్‌కుమార్, పి.భూషణ్‌రాజ్ డార్క్‌వెబ్‌లోని ఆ ఐడీలతో చాటింగ్ చేస్తూ డ్రగ్స్‌కు ఆర్డర్లు ఇస్తున్నారు. బినాన్స్, వజీరెక్స్ వంటి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ యాప్‌ల ద్వారా క్రిప్టో కరెన్సీని సరఫరాదారులకు పంపుతున్నారు. ►క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు అందాక.. సరఫరాదారులు కొరియర్ ద్వారా లేదా డెడ్ డ్రాప్ విధానంలో డ్రగ్స్‌ను పంపిస్తున్నారు. కొరియర్లో అయితే వస్తువులు, వస్త్రాల మాదిరిగా ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఎక్కడి నుంచి పంపేదీ, ఎవరు పంపేదీ తెలియకుండా తప్పుడు వివరాలు ఇస్తున్నారు. అయితే ఎక్కువశాతం డెడ్ ట్రాప్ విధానంలో డ్రగ్స్ అందిస్తున్నారు. ఏమాత్రం ఊహించని ఓ ప్రాంతంలో డ్రగ్ పార్శిల్ ఉంచి.. ఆ వివరాలను మెసెంజర్ ద్వారా పెడ్లర్స్‌కు అందిస్తున్నారు. దీన్నే డెడ్ డ్రాప్ విధానం అంటారు. ►ఇలా డ్రగ్స్ అందుకున్న పెడ్లర్స్ దాన్ని హైదరాబాద్‌లో ధనికుల పిల్లలు, యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు టార్గెట్‌గా విక్రయిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఈ పెడ్లర్ల నుంచి డ్రగ్స్ కొన్నవారిలో ఇప్పటివరకు 30 మందిని గుర్తించినట్టు తెలిసింది. బీబీఏ విద్యార్థులైన అన్సార్, ఉమంగ్, సాహిల్‌లు కొన్ని సందర్భాల్లో ఇంద్రకుమార్ నుంచీ డ్రగ్ ఖరీదు చేస్తున్నారు. గతంలో ఓసారి అరెస్టైన ఉమంగ్ ఫైవ్ స్టార్ హోటళ్లలో రేవ్ పార్టీలు ఇస్తుండేవాడని గుర్తించారు. నిఘా పెట్టి.. ఈ డ్రగ్ నెట్‌వర్క్‌పై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రాజేశ్, ఎస్సై జీఎస్ డానియల్ బృందం పక్కాగా నిఘా పెట్టింది. అదను చూసి వలపన్ని ఇద్దరు సరఫరాదారులతోపాటు ఆరుగురు పెడ్లర్స్‌ను అరెస్టు చేసింది. వీరి నుంచి 140 గ్రాముల చరస్, 184 బోల్ట్స్ ఎల్ఎస్డీ, 10 గ్రాముల ఎండీఎంఏ, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను హూమయూన్నగర్, చాదర్‌ఘాట్, జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించింది. నరేంద్రకు దేశవ్యాప్తంగా 450 మంది కస్టమర్లు ఉండగా గత ఏడాదిలో రూ.30 లక్షల విలువైన డ్రగ్స్‌ను, ఫర్హాన్ ఆరు నెలల కాలంలో రూ.15 లక్షల డ్రగ్స్‌ను సరఫరా చేసినట్టు గుర్తించారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి ఈ గ్యాంగ్ నుంచి డ్రగ్స్ కొంటున్న వారిలో సంపన్నులు, విద్యాధికుల పిల్లలు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులున్నారు. తల్లిదండ్రులు తమ ఇంటికి వస్తున్న పార్శిళ్లపై కన్నేసి ఉంచాలి. అనుమానాస్పదంగా ఉన్న వాటిని విప్పి పరిశీలించాలి. పిల్లల ప్రవర్తనలో తేడా కనిపిస్తే నిఘా పెట్టాలి. డ్రగ్స్ సప్లయర్లతోపాటు వినియోగదారులపైనా కేసులు నమోదు చేస్తున్నాం. వారికి కౌన్సెలింగ్, రీహ్యాబ్ తర్వాత ఏడాదిపాటు పరిశీలనలో ఉంచుతున్నాం. చార్జి షీట్ దాఖలు సమయానికి మార్పు వచ్చిన వారిని ఆయా కేసుల్లో సాక్షులుగా మారుస్తున్నాం. డ్రగ్స్ బానిసల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. –సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ -
నేరగాళ్లుకు కలిసోచ్చే వెబ్... పట్టు కోసం కసరత్తులు చేస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నగరం కేంద్రంగా చోటు చేసుకున్న మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్‌లో సైబర్ నేరగాళ్లకు డార్క్ వెబ్ కలిసివచ్చింది. కేవలం ఇదొక్కటే కాదు అనేక సైబర్ నేరాలు చోటు చేసుకోవడానికి ఈ ఇంటర్నెట్ అథోజగత్తు కీలకంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే డార్క్ వెబ్‌పై పట్టు సాధించడానికి నగర పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నగరంతో పాటు ఇతర నగరాలు, వివిధ విభాగాలకు చెందిన అధికారులకు డార్క్‌వెబ్ సంబంధిత కేసుల దర్యాప్తుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అధీనంలో రాష్ట్ర పోలీసు అకాడెమీలో ఐదు రోజుల పాటు జరుగునున్న ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ప్రారంభించారు. లండన్‌కు చెందిన మాజీ పోలీసు అధికారి, సైబర్ సంబంధిత కేసుల దర్యాప్తు నిపుణుడు మార్క్ బెంట్లీ ఈ శిక్షణ ఇవ్వనున్నారు. హ్యాకింగ్ నుంచి లోన్ యాప్స్ వరకు మొత్తం 15 రకాలైన నేరాల దర్యాప్తుపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. నగర సీపీ ఆనంద్ ప్రారంభోపన్యాసం చేస్తూ కేవలం సైబర్ నేరాలకే కాదు మాదకద్రవ్యాల దందాకు అసాంఘికశక్తులు డార్క్ వెబ్ వాడుతున్నట్లు నగర పోలీసులు పట్టుకున్న గ్యాంగ్స్ ద్వారా వెలుగులోకి వచి్చందని, ఈ నేపథ్యంలోనే దీని సంబంధిత కేసులపై ప్రతి అధికారికీ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. (చదవండి: నిలువు దోపిడీ! కారు ధరలకు చేరువగా ఆటో రిక్షాలు) -
ఆన్లైన్లో ‘పాఠాలు’ నేర్చుకుని.. డబ్బులు కొట్టేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: పేజీ సంస్థకు చెందిన సర్వర్‌ను హ్యాక్ చేసిన దినేష్ దాని పూల్ ఖాతా నుంచి రూ.52.9 లక్షలు కాజేయడంతో విషయం పోలీసుల వరకు వచ్చి చిక్కాడు. అదే ఓ హ్యాకర్ ఏదైనా పేమెంట్ గేట్‌వే సంస్థ లేదా ప్రైవేట్ బ్యాంక్ సర్వర్‌ను టార్గెట్ చేసి, దాని కస్టమర్ల ఖాతాల నుంచి రూ.10 చొప్పున కాజేస్తే అసలు బయటకే రాదు. సునామీ ఎటాక్స్‌గా పిలిచే ఈ తరహా సైబర్ దాడులు ఇటీవల పెరిగిపోయాయని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. హ్యాకర్లలో ఇంజినీరింగ్, బీటెక్ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని, ఆన్లైన్లో ‘పాఠాలు’ నేర్చుకుని, డార్క్‌వెబ్‌లో సాఫ్ట్వేర్లు ఖరీదు చేసి తమ పని పూర్తి చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఆందోళన కలిగించే ఈ అంశంపై దృష్టి పెట్టి సైబర్ నిఘా ముమ్మరం చేశామని పేర్కొంటున్నారు. ఎప్పుడూ పెద్ద మొత్తాల జోలికి పోరు.. సర్వర్లోకి ప్రవేశించే హ్యాకర్లు ఆయా సంస్థల పూల్ ఖాతాలకు యాక్సెస్ చేస్తారు. అక్కడ నుంచి ఒకేసారి పెద్ద మొత్తాలు కాజేస్తే విషయం కేసుల వరకు వెళ్లి వీళ్లు చిక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే హ్యాకర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద మొత్తాల జోలికి వెళ్లట్లేదు. ప్రధానంగా ఆయా సంస్థల వినియోగదారుల ఖాతాలను టార్గెట్ చేస్తున్నారు. ఒక్కో ఖాతా నుంచి, ఒక్కో దఫా కనిష్టంగా రూ.1 గరిష్టంగా రూ.5 మాత్రమే కాజేస్తారు. ఇలా ఒకేసారి వందల, వేల ఖాతాల్లోనివి తాము తెరిచిన వర్చువల్ ఖాతాల్లోకి మళ్లించి బిట్‌కాయిన్స్‌గా మార్చేస్తారు. గమనించినా ఫిర్యాదు చేయరనే... ఖాతాదారుల నగదు కాజేస్తున్న హ్యాకర్లు ఆ లావాదేవీకి సంబంధించిన అలెర్ట్ కూడా వారికి వెళ్లకుండా సర్వర్లోనే మ్యానేజ్ చేస్తున్నారు. ఫలితంగా తన ఖాతా నుంచి ఈ మొత్తం పోయిందనే విషయం కస్టమర్లు గుర్తించలేరు. రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.30 వేలు.. ఇలా రౌండ్ ఫిగర్ నగదు ఉన్న వాటి ఖాతాల జోలికి హ్యాకర్లు వెళ్లరు. అయినప్పటికీ వినియోగదారుడు నగదు పోయినట్లు గుర్తించినా చిన్నమొత్తం కావడంతో ఫిర్యాదు వరకు వెళ్లరు. ఇలా ఒకేసారి వందల, వేల ఖాతాలను టార్గెట్ చేస్తున్న హ్యాకర్‌కి చేరే మొత్తం మాత్రం భారీగానే ఉంటుంది. తన చేతిలో ఉన్న డబ్బు ఖర్చయ్యే వరకు లేదా విషయం ఖాతాదారుడు మర్చిపోతాడని భావించే కాలం వరకు ఈ సునామీ ఎటాక్ చేసిన హ్యాకర్ మరో ప్రయత్నం చేయరు. ఎక్కడా తమ ఉనికి బయటపడకుండా.. నగరానికి చెందిన అనేక మంది ఇంజినీరింగ్, బీటెక్ విద్యార్థులు హ్యాకర్లుగా మారారు. వివిధ రకాలైన యూట్యూబ్ వీడియోలు, ఆన్లైన్ అంశాల ఆధారంగా హ్యాకింగ్‌పై పట్టు సాధిస్తున్నారు. ఇది చేయడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్స్‌ను డార్క్‌వెబ్‌లో ఖరీదు చేస్తున్నారు. టార్గెట్ చేసిన సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేయడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) ఐపీలను వాడుతున్నారు. వీటి ఆధారంగా ఆ సంస్థ సర్వర్లోకి ప్రవేశిస్తున్నారు. వాటి ఫైర్ వాల్స్ బలహీనంగా ఉండటం, సైబర్ సెక్యూరిటీలో లోపాలు వీరికి కలిసి వస్తున్నాయని పోలీసులు వివరిస్తున్నారు. (క్లిక్: మ్యాట్రిమొనిలో ఎన్నారై పేరుతో మోసం! చివరకు..) బిల్లుల చెల్లింపులోనూ గోల్మాల్... ఈ సునామీ ఎటాక్స్ చేసే హ్యాకర్లు ‘బిల్లు చెల్లింపు’లోనూ గోల్‌మాల్స్ చేస్తుంటారు. వివిధ పోస్టు పెయిడ్ సేవలు పొందే పరియస్తులైన కస్టమర్ల కోసమే కమీషన్లు తీసుకుని ఈ పని చేస్తుంటారు. బ్రాండ్ బ్యాండ్ సహా వివిధ సేవలకు అందించే సంస్థలు తమ ఖాతాదారుడికి ప్రతి నెలా బిల్లు పంపిస్తుంటాయి. దీని చెల్లింపులు అతడు ఆన్లైన్లో చేస్తుంటాడు. రూ.10 వేల బిల్లు ఉంటే రూ.1000 తీసుకుని ‘మాఫీ’ చేయడం హ్యాకర్ పని. వినియోగదారుడి నుంచి ఈ మొత్తం కమీషన్‌గా తీసుకునే సునామీ హ్యాకర్ ఆ సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేసి, బిల్లు మొత్తం క్లియర్ అయినట్లు సున్నాగా మార్చేస్తుంటాడు. ఇది కేవలం పరిచయస్తులైన వారితో కుమ్మక్కై చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. హ్యాకింగ్ విషయాన్ని ఆయా సంస్థలు గుర్తించలేకపోతున్నాయని వివరిస్తున్నారు. (క్లిక్: హైఫై ఫ్లైఓవర్.. ఎస్సార్డీపీ పనుల్లో మరో ప్రత్యేకత!) -
వేలాది భారతీయుల వివరాలు లీక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన సర్వర్ నుంచి వేలాదిమంది భారతీయులకు చెందిన వ్యక్తిగత వివరాలు లీకయ్యాయి. పలువురి పేర్లు, మొబైల్ నెంబర్లు, చిరునామాలు, కోవిడ్ పరీక్షా వివరాలతో కూడిన డేటా ఆన్లైన్ సెర్చ్‌లో ప్రత్యక్షమైంది. ఈ లీకైన వివరాలను రైడ్ ఫోరమ్స్ వెబ్సైట్లో ఒక సైబర్ క్రిమినల్ అమ్మకానికి కూడా పెట్టాడు. ఇలా దాదాపు 20వేల ఇండియన్ల వ్యక్తిగత వివరాలు అమ్మకానికి కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి చెందిన ఒక సీడీఎన్ (కంటెంట్ డెలివరీ నెట్వర్క్) నుంచి ఈ వివరాలు బహిర్గతమయ్యాయని, ఈ వివరాలు డార్క్ వెబ్‌లో కూడా లభిస్తున్నాయని, సెర్చ్ ఇంజన్లలో లభిస్తున్న దాదాపు 9 లక్షల వివరాలను గూగుల్ ఇండెక్స్ చేసిందని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రాజశేఖర్ రాజాహారియా ట్వీట్ చేశారు. వీటన్నింటినీ డీ ఇండెక్స్ వెంటనే డీఇండెక్స్ చేయాలని హెచ్చరించారు. (ప్రశ్నలకు వేగంగా జవాబులిచ్చేందుకు సెర్చ్ ఇంజన్లు శోధనకు ముందు సమాచారాన్ని సమీకరించే ప్రక్రియను ఇండెక్సింగ్ అంటారు). ఈ విషయమై ఐటీ శాఖ ఇంతవరకు స్పందించలేదు. రాపిడ్ ఫోరమ్స్‌లో అమ్మకానికి పెట్టిన శాంపిల్ డాక్యుమెంట్లో ఈ వివరాలన్నీ కోవిన్ పోర్టల్‌లో అప్‌లోడింగ్‌కు ఉంచిన డేటాగా చూపుతోంది. కరోనా కాలంలో నిబంధనల పర్యవేక్షణ నుంచి వ్యాక్సినేషన్ వరకు పలు అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కువగా డిజిటల్ సాంకేతికతపై ఆధారపడింది. ఈ దశలో ప్రభుత్వ సర్వర్నుంచి డేటా లీకైనట్లు వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రజలు నకిలీ కాల్స్, ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజశేఖర్ సూచించారు. కోవిన్ నుంచి ఎలాంటి లీకులు లేవు కోవిన్ పోర్టల్ నుంచి ఎలాంటి లీకేజీ జరగలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లోని ప్రజల వివరాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. కోవిన్‌లో వ్యక్తుల చిరునామాలుకానీ ఆర్టీపీసీఆర్ పరీక్షా వివరాలు కానీ సేకరించలేదని గుర్తు చేసింది. కోవిన్ పోర్టల్ నుంచి డేటా లీకైందన్న వార్తలు వస్తున్నాయని, కానీ ఈ పోర్టల్ సురక్షితమని, ఎలాంటి వివరాలు బయటకు పోలేదని మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. -
రెస్టారెంట్‌కు వెళ్లిన గీతకు షాకిచ్చిన వెయిటర్.. ఏకంగా..
How To Secure Digital Payment Transactions Safe Expert Suggestions: ఫ్రెండ్స్‌కి పార్టీ ఇవ్వడానికి గీత (పేరు మార్చడమైనది) తన స్నేహితులతో రెస్టారెంట్‌కి వెళ్లింది. ఆర్డర్ ఇచ్చినవన్నీ టేబుల్ మీద అందంగా అమర్చారు అక్కడి వెయిటర్లు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ అక్కడి పదార్థాలను ఆస్వాదించారు. ఇక చివర్లో వెయిటర్ బిల్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. అది చూసిన గీత తన బ్యాగ్‌లో నుంచి క్రెడిట్ కార్డు తీసి, బిల్ ఉన్న బుక్‌లో పెట్టి వెయిటర్ని పిలిచి, పిన్ నెంబర్ కూడా చెప్పి, స్వైప్ చేసి తీసుకురమ్మంది. వెయిటర్ బిల్ పే చేసి, ఆమె కార్డును ఆమెకు తిరిగి ఇచ్చేశాడు. పది రోజులు గడిచాయి. తన క్రెడిట్ కార్డు నుంచి అరవై వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. షాక్ అయ్యింది గీత. తను ఎక్కడ ట్రాన్సాక్షన్స్ చేసిందో కూడా అర్థం కాలేదు. వేరే రాష్ట్రంలో తను షాపింగ్ చేసినట్టుగా మెసేజ్ వచ్చింది. బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే షాపింగ్ ఏ ప్రాంతంలో జరిగిందో చెప్పారు. మోసం జరిగిందనుకుంటే వెంటనే కార్డు బ్లాక్ చేసుకోమని, మరో కార్డుకు అప్లై చేయమని సూచించారు. క్రెడిట్ కార్డు తన వద్దే ఉంటే అసలు మోసం ఎలా జరిగిందో, ఎక్కడ జరిగిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు గీతకు. ∙∙ నగదును మన వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ మార్కెట్లోకి వచ్చేశాం. లావాదేవీలన్నీ చాలావరకు డిజిటల్ మార్గంలోనే జరుగుతున్నాయి. ఫలితంగా మోసగాళ్లు డిజిటల్ నుంచే పుట్టుకు వస్తున్నారు. ఏ విధంగా మన వద్ద ఉన్న మొత్తాన్ని రాబట్టాలో రకరకాల మార్గాల ద్వారా వ్యూహాలను పన్నుతున్నారు. గీతకు మోసం ఎక్కడ జరిగిందంటే.. రెస్టారెంట్ లో వెయిటర్‌కు బిల్ పే చేయమని కార్డు, పిన్ నెంబర్ ఇచ్చేసింది. దీంతో ఆ వెయిటర్ రెస్టారెంట్ స్వైప్ మిషన్ కన్నా ముందు అరచేతిలో పట్టేంత ఉన్న తన మరో మిషన్‌లో స్వైప్ చేశాడు. దీంతో కార్డులో ఉన్న చిప్ ద్వారా ఆ డేటా అతని మిషన్‌లోకి చేరింది. అటు తర్వాత రెస్టారెంట్ బిల్ పే చేసి, తిరిగి ఆ కార్డును ఆమెకు ఇచ్చేశాడు. ఆ వెయిటర్ అలా డేటా సేకరించడానికి మోసగాళ్లు అతనితో ముందుగానే ‘డీల్’ కుదుర్చుకున్నారు. దీంతో గీత కార్డు వివరాలన్నీ మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోయాయి. పది రోజుల తర్వాత గీత కార్డు బిల్ మొత్తం కట్టేశాక, క్రెడిట్ బ్యాలన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని గ్రహించిన మోసగాళ్లు అంత మొత్తాన్ని ఆమె కార్డు ద్వారా దొంగిలించేశారు. ∙∙ కార్డ్ స్కిమ్, కాపీ, క్లోన్... డేటా ద్వారా కొత్త కార్డులను తయారు చేసే ముఠాలు తయారవుతున్నాయి. ఎక్కువగా రొమేనియన్స్ చేసే ఈ మోసాలు ఇప్పుడు ఇతరులూ చేస్తున్నారు. డార్క్ వెబ్‌లో స్కిమ్మర్, బ్లాక్ కార్డ్ మేకర్స్ కూడా లభించడం, అచ్చం క్రెడిట్/ డెబిట్ కార్డులను పోలి ఉన్నవి తయారుచే సుకోవడం కూడా మోసం చేయడానికి రాచమార్గం. కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టాలంటే... ► మీ కార్డుల వివరాలకు ఎట్టి పరిస్థితులో మీరే రక్షకులు. ► కార్డు ద్వారా లావాదేవీలు జరుపుతున్నప్పుడు మీ దృష్టి మరల్చకూడదు ► స్వైప్ మిషన్ ద్వారా మీ కార్డు నుంచి డెబిట్ చేశాక, ఎంత మొత్తం డెబిట్ చేశారో రిటైలర్ ను అడగండి. ► కొత్త కార్డులు వచ్చిన వెంటనే, ఆ కార్డుపైన సంతకం చేయాల్సిన చోట తప్పనిసరిగా సంతకం చేయండి. ► బిల్లు చెల్లించి, రశీదు తీసుకున్నాక ఒకసారి ఆన్లైన్ స్టేట్మెంట్లో సరిచూసుకోవాలి. ► కార్డు లావాదేవీల ద్వారా పొందిన రశీదులను, మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని జాగ్రత్తపరచుకోవడాన్ని విస్మరించకూడదు. ► మీ కార్డులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. నగదు, మనీ పర్సుల్లానే జాగ్రత్త పరుచుకోవాలి. ► కార్డు మీద పిన్ నెంబర్ రాయకూడదు. అలాగే పిన్ నెంబర్ ఎవరికీ చెప్పకూడదు. ► ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నప్పుడు మీరు ఉపయోగించే సిస్టమ్ యాంటీవైరస్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ఉన్నదేనా అనే విషయాన్ని నిర్ధారించుకోండి. ► ఇంటర్నెట్ ద్వారా నమ్మకమైన సైట్స్ ద్వారా మాత్రమే కొనుగోళ్లు మాత్రమే చేయండి. అందుకు భద్రతా నియమాలు పాటించండి. ► ఎక్స్పైరీ డేట్ అయిపోయాక వాటి స్థానంలోకి రీప్లేస్మెంట్ కార్డ్స్ వస్తాయి. ఇలాంటప్పుడు పాత కార్డులను అలాగే పడేయకుండా వాటిలో ఉన్న మాగ్నెటిక్ చిప్‌ను తొలగించాలి. అలాగే ఉపయోగంలో లేని కార్డులను బ్లాక్ చేయాలి. ► లావాదేవీలు జరిపిన తర్వాత పిన్నెంబర్ను మార్చుకోవడం మంచిది. రివార్డ్ పాయింట్స్ రిడెమ్షన్ గురించి అయినా, కార్డు సమాచారం గురించైనా వచ్చే ఫోన్‌కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవతలి వ్యక్తులకు సివివి/ఓటీపీ/క్యూ ఆర్ కోడ్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. బ్యాంకుకు సంబంధించిన ఏ వ్యక్తులు కూడా ఈ గోప్యతా వివరాలను అడగరు. కాబట్టి, గోప్యతా వివరాల పట్ల జాగ్రత్త అవసరం. కార్డు ద్వారా చేసే పేమెంట్ (పిఒఎస్) కార్డు స్కిమ్మింగ్ (మీ వివరాలను కార్డు నుంచి రాబట్టే పరికరం) ఎక్కువగా రిటెయిల్ ఔట్లెట్స్, బార్లు, రెస్టారెంట్లు, పార్కింగ్ టికెట్ మెషిన్స్, పెట్రోల్ స్టేషన్లలో జరిగే అవకాశాలు ఎక్కువ. ► కార్డు ద్వారా నగదు బదిలీ చేసే సమయంలో మీ దృష్టి మరల్చకూడదు ► స్వైప్ చేసేటప్పుడు మీ కార్డు మీకు కనిపించాలనే విషయం స్పష్టంగా చెప్పండి. క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా మోసాలు ఎలా జరుగుతాయంటే..? ► మోసగాళ్ల దగ్గర స్టోర్ కార్డ్ రీడర్ మిషన్, దొంగ కార్డు మిషన్ రెండూ ఉంటాయి. ∙మీరు కార్డు ఇవ్వగానే కార్డు స్కిమ్మర్ చేసి, డేటా దొంగిలిస్తారు ∙ఎటిఎమ్ మిషన్లలో అయితే.. కీ బోర్డ్ ప్లేస్‌లో మోసగాళ్లు మరో కీ బోర్డ్‌ను ఇన్స్టాల్ చేస్తారు. ∙స్వైపింగ్ మిషన్‌కు సూక్ష్మమైన కెమెరాను సెట్ చేస్తారు. ఎటిఎమ్‌లలో కార్డును ఉపయోగిస్తుంటే.. ► కార్డును ఉపయోగిస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నవారి నుంచి జాగ్రత్త. ► మీ పిన్ నెంబర్ మీ నగదుకు కవచం అనే విషయం మర్చిపోవద్దు ► కార్డు పనిచేయనప్పుడు, మిషన్‌లో ఉండిపోయినప్పుడు వెంటనే బ్యాంక్‌కు తెలియజేయాలి ► ట్యాంపరింగ్ సంకేతాలు ఏమైనా కనిపిస్తే ఎటిఎమ్ కార్డును ఉపయోగించవద్దు. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Most Famous Afghanistan Refugee: అప్పుడూ ఇప్పుడూ.. ఆమే!.. పాపం మరోసారి -
ఫేస్బుక్ యూజర్లకు మరో భారీ షాక్..!
నిన్న ఒక్కసారిగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు షాక్ గురయ్యారు. ఏడుగంటల పాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ నెట్వర్క్ పూర్తిగా నిలిచిపోయింది. సర్వర్స్‌లో నెలకొన్న సాంకేతిక సమస్య కారణంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో నిలిచిపోయిన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఫేస్బుక్ టెక్నాలజీ ఆఫీసర్ స్పందిస్తూ యూజర్ల అందరికి క్షమాపణలను తెలియజేశారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలను తిరిగి మాన్యువల్‌గా పునరుద్ధరించడంతో సుమారు 7 గంటల సమయం పట్టిన్నట్లు వెల్లడించారు. ఒక్కసారిగా ఫేస్బుక్ సర్వర్లు డౌన్ అవ్వడంతో బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకమ్‌బర్గ్ సుమారు 7 బిలియన్డాలర్లకు పైగా నష్టపోయాడని పేర్కొంది. ఫేస్బుక్ యూజర్లకు మరో షాక్...! ఒక్కసారిగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో షాక్ గురైన యూజర్లకు రష్యన్ ప్రైవసీ అఫైర్స్ మరో షాకిచ్చింది. ఫేస్బుక్ గ్లోబల్ నెట్వర్క్స్ అంతరాయం కల్గిన సమయంలో హ్యకర్లు డార్క్ వెబ్ హ్యాకర్ ఫోరమ్‌లో ఫేస్బుక్ యూజర్ల డేటాను విక్రయించారని నివేదించింది. ఫేస్బుక్ యూజర్ల చిరునామా, పేరు, ఈ-మెయిల్ చిరునామా, ఫోన్ నంబర్లను అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. ఒక నివేదిక ప్రకారం దాదాపు 1.5 బిలియన్ ఫేస్బుక్ ఖాతాలు డార్క్ వెబ్‌లో అమ్మకానికి వచ్చినట్లు రష్యన్ ప్రైవసీ అఫైర్స్ నివేదించింది. కొంతమంది హ్యాకర్లు ఫేస్బుక్ వినియోగదారుల డేటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు నిర్ధారణలు ఉన్నాయి. ఫేస్బుక్ యూజర్ల డేటాను డార్క్‌వెబ్‌లో కొనుగోలు చేద్దామనుకున్న ఓ వ్యక్తికి హ్యాకర్లనుంచి 5,000 డాలర్లను చెల్లించగా తిరిగి ఎటువంటి డేటాను పొందలేదని ఆ వ్యక్తి రిపోర్ట్చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్ చివరలో, కొంతమంది హ్యాకర్లు తమ వద్ద 1.5 బిలియన్ ఫేస్బుక్ యూజర్ డేటా ఉందని పేర్కొంటూ పోస్ట్ చేసారు. స్పందించిన ఫేస్బుక్..! ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ ఐనా సమయంలో యూజర్ల డేటా అసలు లీక్ అవ్వలేదని ఫేస్బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. యూజర్ల డేటాకు డోకా లేదని వెల్లడించింది. యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లకుండా ఫేస్బుక్ చర్యలను తీసుకుంటుందని తెలిపింది. ఎందుకైనా మంచిది ఇలా చేస్తే బెటర్..! ఫేస్బుక్ యూజర్లు తమ డేటాను చోరికి గురిఅవ్వకుండా ఉండడం కోసం 2 అథనిటికేషన్ పాస్‌వర్డ్‌ను యూజర్లు తమ ఖాతాలకు ఏర్పాటు చేయడం మంచిది. అంతేకాకుండా స్ట్రాగ్ పాస్‌వర్డ్‌లను కూడా తమ ఫేస్బుక్ అకౌంట్లకు ఏర్పాటు చేసుకోవాలని పలు టెక్నికల్ నిపుణులు వెల్లడిస్తున్నారు. “Data of Over 1.5 Billion Facebook Users Sold on Hacker Forum Information of over 1.5 billion Facebook users being sold on popular hacking-related forum, potentially enabling cybercriminals and unscrupulous advertisers to target Internet users globally” https://t.co/JE8uSJbOg9 — Amrita Bhinder 🇮🇳 (@amritabhinder) October 4, 2021 చదవండి: కోట్లమంది చిరాకు.. డిలీట్ ఫేస్బుక్ ట్రెండ్! గ్యాప్‌లో కుమ్మేసిన ట్విటర్, టెలిగ్రామ్ -
హ్యాకర్స్ రూట్ మార్చారు, స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు
హ్యాకర్స్ తమ పంథాని మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు మాల్ వేర్ సాయంతో సంస్థలపై దాడులు చేసే సైబర్ నేరస్తులు ఇప్పుడు స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయా స్కూళ్ల డేటా బేస్‌లో ఉన్న స్కూల్ చిల్డ్రన్స్ డేటాను దొంగిలిస్తున్నారు. ఆ డేటాతో సొమ్ము చేసుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అడిగినంత ఇవ్వకపోతే అక్రమ వ్యాపార కార్యకలాపాలకు వేదికగా నిలిచే ‘డార్క్ వెబ్’లో అమ్ముకుంటున్నట్లు నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ(ఎన్బీసీ) ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈఏడాది 1200స్కూళ్లని టార్గెట్ చేసి.. నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ(ఎన్బీసీ) రిపోర్ట్ ప్రకారం..అమెరికాకు చెందిన ఓ జిల్లా స్కూల్‌కు చెందిన విద్యార్ధుల వ్యక్తిగత వివరాల్ని మాల్ వేర్ సాయంతో దొంగిలించారు. విద్యార్ధుల పేర్లు, డేటా బర్త్,సోషల్ సెక్యూరిటీ నెంబర్ల(ssn)ను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా సైబర్ దాడులతో డబ్బుల్ని డిమాండ్ చేశారని, అలా ఇవ్వలేదనే విద్యార్ధుల వ్యక్తిగత డేటాను డార్కెవెబ్‌లో అమ్ముకున్నట్లు ఎఫ్‌బీఐ విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ సైబర్ దాడులతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా టీచర్స్ సైతం ఈ సైబర్ దాడులు విద్యార్ధుల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా,ఈజీ మనీ ఎర్నింగ్ కోసం హ్యాకర్స్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్ని టార్గెట్ చేయడంతో పాటు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అమెరికాకు చెందిన 1200 స్కూళ్లకు చెందిన కంప్యూటర్లను మాల్ వేర్‌తో దాడులు చేసినట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అధ్యక్షుడి ప్రకటన తరువాతే కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ..ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఐటీ విభాగాల్ని మరింత పటిష్టం చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు సైబర్ నేరాలపై జరిగే న్యాయ విచారణకు మరింత ప్రాధాన్యం ఇచ్చే అంశాల్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటన చేశారో లేదు. హ్యాకర్స్ దాడుల్ని ముమ్మరం చేయడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: సాయిధరమ్ తేజ్... చిత్రలహరిలో చెప్పింది ఇదే -
దేశంలో వీపీఎన్ సర్విస్ బ్యాన్ కానుందా..?
సైబర్ బెదిరింపులు & ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి అడ్డుగా ఉన్న వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ సేవల(వీపీఎన్)ను మన దేశంలో హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిషేధించాలని చూస్తున్నట్లు సమాచారం. మీడియానామా మొదట నివేదించినట్లుగా వీపీఎన్ యాప్స్, సాధనాలు ఆన్లైన్లో సులభంగా అందుబాటులో ఉన్నాయని, దీంతో నేరస్థులు ఆన్లైన్లో అనామకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే దాని వాడకాన్ని నిషేదించాలని కోరుతున్నట్లు కమిటీ హైలైట్ చేసింది. భారతదేశంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో దేశంలో వీపీఎన్ సేవలను శాశ్వతంగా నిషేదించాలని కమిటీ సీఫారసు చేస్తుందని నివేదిక వెల్లడించింది. వీపీఎన్‌లను గుర్తించడానికి, శాశ్వతంగా నిరోధించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని కమిటీ హోం మంత్రిత్వ శాఖను కోరింది. దేశంలో వీపీఎన్ సేవలు, డార్క్ వెబ్ వాడకాన్ని పరిశీలించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ట్రాకింగ్, నిఘా యంత్రాంగాలను బలోపేతం చేయాలని మంత్రిత్వ శాఖను కమిటీ కోరింది. వీపీఎన్ అంటే ఏమిటి? వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ అని కూడా అంటారు. సాధారణంగా మనం ఇంటర్నెట్ లో ఏ పనిచేసిన.. ఫేస్బుక్ చూసిన, యూట్యూబ్ చూసిన, వెబ్సైట్లను సందర్శించినా.. ఇతర ఏవైనా పనులు చేసినా హ్యాకర్లు మన డేటాను తస్కరించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన డేటా సురక్షితంగా ఉండేందుకు వీపీఎన్ పనికొస్తుంది. అంటే, మనకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మధ్య సురక్షితమైన కనెక్షన్ సృష్టిస్తుంది. మీ ట్రాఫిక్ ఎన్ క్రిప్ట్ చేయబడ్డ ఛానల్ ద్వారా రూట్ చేస్తుంది. ఇది మీ ఐపీ చిరునామాను దాచిపెడుతుంది.(చదవండి: జీ-మెయిల్ యూజర్లకు అలర్ట్.. ఆ మెయిల్స్‌తో జాగ్రత్త!) ముఖ్యంగా, వీపీఎన్ యాప్స్ వినియోగదారులు తమ గుర్తింపును దాచేటప్పుడు తమ నెట్ వర్క్ వేరే భౌగోళిక ప్రదేశంలో ఉన్నట్లు చూపిస్తుంది. వాస్తవానికి మనం ఇక్కడ ఉన్న అమెరికా వంటి దేశాలలో ఉన్నట్లు చూపిస్తుంది. వీపీఎన్ వల్ల మన ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నదీ ఇతరులకు తెలియదు. దీని వల్ల మన డేటా ఎన్‌క్రిప్ట్ అయి సురక్షితంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు సాఫ్ట్ వేర్ కంపెనీలు హ్యాకర్ల నుంచి కాపాడుకోవడం కోసం తమ కార్యకలాపాలకు గాను వీపీఎన్‌లను ఉపయోగిస్తుంటాయి. ఉద్యోగులు ఆఫీస్ వర్క్ కోసం ఇంటి పనిచేసినప్పుడు లాక్ డౌన్ సమయంలో ఇవి చాలా భాగ ఉపయోగపడాయి. -
ఆన్లైన్ బ్యాకింగ్‌లో ఈ సూచనలు కచ్చితం..! లేకపోతే అంతే సంగతులు..!
‘రెండు గంటల్లో రూ.10,000 రుణం మీ ఖాతాలో జమ.. కొన్ని ప్రాథమిక వివరాలు సమర్పిస్తే చాలు..’ ఒకరోజు బాలాజీ (30) మొబైల్‌కి వచ్చిన సందేశం ఇది. ఒక ఇన్స్టంట్ లోన్ యాప్ ఈ సందేశాన్ని పంపింది. దీంతో స్నాప్ఇట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇన్స్టాల్ సమయంలో ఎటువంటి యాక్సెస్‌కు అనుమతులు ఇవ్వలేదు. కానీ, ఒక గంట తర్వాత వచ్చిన మెస్సేజ్ చూసి బాలాజీ కలవరానికి గురయ్యాడు. బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్ష డెబిట్ అయినట్టు వచ్చిన సందేశం అది. వెంటనే తన బ్యాంకు ఖాతాలు అన్నింటినీ బాలాజీ బ్లాక్ చేసేశాడు. ‘సేవ్‌దెమ్ ఇండియా ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద దర్యాప్తు సంస్థను సంప్రదించాడు. బాలాజీ స్పాన్ఇట్ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు కానీ, అందులోకి లాగిన్ అవ్వలేదు. కాంటాక్ట్‌లు, కెమెరా లేదా గ్యాలరీ ఎటువంటి యాక్సెస్‌కు అనుమతి కూడా ఇవ్వలేదు. కానీ, హ్యాకర్లు బాలాజీ ఫోన్లోకి యాప్ సాయంతో 59మాల్వేర్లు పంపించి తమ పని అంతా చక్కబెట్టేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. మాల్వేర్ల సాయంతో ఫోన్‌కు ఓటీపీలు పంపడమే కాకుండా, వాటితో లావాదేవీ నిర్వహించుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు. పర్సనల్ ఫైనాన్స్ (వ్యక్తిగత ఆర్థిక అంశాలు, లావాదేవీల నిర్వహణ) నేడు డిజిటల్‌గా మారి.. స్టాక్ ట్రేడింగ్ నుంచి, మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్, బ్యాంకు లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు అన్నింటికీ ఫోన్ ఆధారంగా మారినందున.. హ్యాక్‌కు గురైతే ఎంతటి నష్టమైనా ఎదురుకావచ్చు. ఈ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. సైబర్‌క్రైమ్ నేరాలు ఏటా భారీగా నమోదవుతున్నాయి. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ తాజా గణాంకాల ప్రకారం సైబర్‌నేరాల పరంగా భారత్ స్థానం 10. డిజిటల్ యుగం కారణంగా సాధారణ జీవనం యాప్‌లపైనే ఎక్కువగా ఆధారపడుతున్న తీరు సైబర్ నేరాలకు వరంగా మారుతోంది. సైబర్ దాడులకు ఎక్కువగా ప్రభావితమవుతున్నది అమెరికానేనని ఎస్పీఈకాప్స్ డేటా స్పష్టం చేస్తోంది. అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికాకు కూడా సైబర్ దాడుల సమస్య తప్పడం లేదు. మన దేశంలోనూ గత కొన్ని సంవత్సరాల్లో, ముఖ్యంగా గతేడాది కరోనా వచ్చిన తర్వాత నుంచి సైబర్ నేరాలు మరింత పెరిగాయి. వ్యక్తిగత ఆర్థిక డేటాను కొట్టేసిన తర్వాత హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టేయడం ద్వారా బిట్కాయిన్లను పోగేసుకుంటున్నారు. వ్యక్తుల ప్రొఫైల్స్ వివరాలు, పేరు, సామాజిక భద్రతా సంఖ్య, పుట్టిన తేదీ, బ్యాంకు ఖాతా నంబర్ ఇలాంటి వివరాలను 8–30 డాలర్ల మధ్య అమ్మేస్తున్నారు. డేటా విషయంలో అజాగ్రత్త పనికిరాదు.. ఈ డేటాను వారు ఎలా సంపాదిస్తున్నారు? అన్న సందేహం రావచ్చు. సిండికేట్ మోసం లేదా టెక్నాలజీ ఆధారిత మోసం రూపంలో ఈ సమాచారాన్ని వారు పొందుతున్నారు. కొన్ని రకాల దరఖాస్తులతోపాటు పాన్, ఆధార్ వివరాలు తీసుకోవడం సర్వసాధారణం. ఫైనాన్షియల్ కంపెనీ లేదా టెలికం కంపెనీ ఎగ్జిక్యూటివ్‌కు వాట్సాప్ వేదికగా ఈ డాక్యుమెంట్లను కూడా షేర్ చేస్తుంటాం. కానీ, అందరూ కాకపోయినా కొందరు ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో మనం పంచుకున్న వ్యక్తుల ఫోన్ హ్యాక్‌కు గురికావడం ద్వారా కూడా మన సున్నిత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఇలా సంపాదించిన ఇతరుల డాక్యుమెంట్లతో రుణాలు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి. రుణాలిచ్చే సంస్థలకు ఎక్కువ ఆందోళన కలిగించే అంశం ఇదేనంటారు ఎర్లీశాలరీ సీఈవో అక్షయ్ మెహరోత్రా. టెక్నాలజీ సాయంతో చేసే మోసాల్లో.. సిస్టమ్ ద్వారా కస్టమర్ ప్రొఫైల్‌ను చోరీ చేసి.. మాల్వేర్ను చొప్పించేందుకు అదే పనిగా నేరస్థులు ప్రయత్నిస్తుంటారు. ‘‘స్థానిక హైపర్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో కస్టమర్లు తమ వివరాలను పొందుపరుస్తుంటారు. ఆ ప్లాట్‌ఫామ్‌లపై 10,000 మంది యూజర్లు కూడా ఉండరు. క్యాష్‌బ్యాక్ కోసం వివరాలను వెల్లడించి మోసాల బారిన పడుతున్నారు’’ అని మెహరోత్రా వివరించారు. పాస్‌వర్డ్‌ను కొందరు తరచుగా మార్చుకుంటూ ఉండరు. గుర్తుండదన్న ఆలోచనే వారితో అలా చేయిస్తుంది. దీనికితోడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం, టెక్నాలజీ మోసాలపై అవగాహన లేకపోవడంతో సైబర్ నేరాలకు నష్టపోవాల్సి వస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చోరీ చేసిన డేటాను డార్క్‌నెట్ (డార్క్‌వెబ్)లో లేదంటే హ్యాకర్ ఫోరమ్‌లలో అమ్మేసుకోవడం నేరస్థులకు వ్యాపారంగా మారిపోయింది. క్రెడిట్‌కార్డ్ నంబర్లు, ఆన్లైన్ బ్యాంకింగ్ యూజర్‌నేమ్, పాస్వర్డ్లు, సామాజిక మాధ్యమాల్లో ఖాతాల లాగిన్ వివరాలను డార్క్ నెట్ ఫోరమ్‌లలో చాలా చౌకగా విక్రయించేస్తున్నారు. ఫోర్జరీ చేసిన పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆటో ఇన్సూరెన్స్‌లను కూడా అమ్మకానికి ఉంచుతున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ లాగిన్ వివరాలు డార్క్‌వెబ్‌లో సగటున 35 డాలర్లు పలుకుతోంది. విలువైన డేటాను విక్రయించడం ద్వారా లావాదేవీలను బిట్కాయిన్లలో చేస్తున్నారు. బిట్కాయిన్ల లావాదేవీలన్నీ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారితం. అధికారిక వ్యవస్థల ట్రాకింగ్‌కు దూరంగా ఉన్న సాధనం ఇదొక్కటే. 2020లో నమోదైన సైబర్ నేరాల్లో ఫిషింగ్ దాడులు కూడా ఒకటి. మీ డేటాకు రక్షణ ఇలా.. ఆన్లైన్లో ఎన్నో రకాల ఖాతాలను నిర్వహించడం నేటి జీవనంలో భాగం. కొందరు సులభంగా గుర్తుంటుందని అన్నింటికీ ఒక్కటే పాస్‌వర్డ్‌ను నిర్వహిస్తుంటారు. సైబర్ భద్రత పరంగా ఇదే అతిపెద్ద రిస్క్ అని తేలింది. కనుక ప్రతీ ఖాతాకు వేర్వేరు పాస్‌వర్డ్‌ను నిర్వహించడం ఎంతో అవసరం. పాస్వర్డ్ మేనేజర్‌ను వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ర్యాండమ్‌గా, బలమైన పాస్‌వర్డ్‌లను పాస్వర్డ్ మేనేజర్ ఇస్తుంటుంది. అలాగే, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను పాస్వర్డ్ మేనేజర్ సాయంతో ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాదు క్రమం తప్పకుండా డిజిటల్ సెక్యూరిటీ ఎలా ఉందన్నదీ స్కాన్ కూడా చేస్తుంది. టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే.. పాస్‌వర్డ్‌తో లాగిన్ తర్వాత మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే పూర్తి స్థాయి లాగిన్‌కు వీలు కల్పించేది. దీన్ని వినియోగించుకోవడం సురక్షితం. ఎక్కువ యాక్సెస్‌కు అనుమతులు అడిగే యాప్‌ల విషయంలోనూ జాగ్రత్త. మొబైల్లో ఇన్స్టాల్ సమయంలో చాలా యాప్‌లు.. కెమెరా, గ్యాలరీ, కాంటాక్ట్‌లు, మెస్సేజ్‌ల యాక్సెస్‌ను (వాటిల్లోకి ప్రవేశించి సమాచారాన్ని పొందేఅనుమతి) అడుగుతుంటాయి. దీంతో వ్యక్తిగత డేటా మూడో పక్షానికి వెళ్లే ప్రమాదం కల్పించినట్టే. అందుకే ప్రతీ యాప్‌నకు సంబంధించి సెట్టింగ్స్‌లోకి వెళ్లి పర్మిషన్స్‌ను పరిశీలించుకుంటూ ఉండాలి. అవసరమైన అనుమతులనే ఇవ్వాలి. మనం అనుమతులు ఇవ్వకపోయినా కొన్ని యాప్‌లు ఆటోమేటిక్‌గా ఆ పని చేస్తుంటాయి. కనుక అంతగా అవసరం లేని యాప్‌లకు దూరంగా ఉండడం మంచిది. సోషల్ మీడియాలో పంచుకునే సమాచారం విషయంలో కచ్చితంగా వ్యవహరించాలి. నియంత్రణల పరిధుల్లో లేకుండా సామాజిక మాధ్యమ వేదికలు పనిచేస్తున్నాయి. కనుక వాటిపై విలువైన, సున్నితమైన సమాచారం పంచుకోకుండా ఉండడమే శ్రేయస్కరం. మీ ఆర్థిక వివరాలు (క్రెడిట్‌కార్డ్, డెబిట్‌కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు) లీక్ అయినట్టు గుర్తించినా, సందేహం వచ్చినా వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి. ఎక్కువ మంది క్రెడిట్‌కార్డు హోల్డర్లు తమకు నెలవారీగా వచ్చే స్టేట్మెంట్లోని లావాదేవీల వివరాలను తెరచి చూడరు. చెల్లించి ఊరుకుంటుంటారు. కానీ, ప్రతీ లావాదేవీని పరిశీలించుకోవాలి. మోసపూరిత లావాదేవీలను గుర్తిస్తే వెంటనే క్రెడిట్ కార్డు కంపెనీకి ఫిర్యాదు చేయాలి. ఏడాదికోసారి అయినా క్రెడిట్రిపోర్ట్లను పరిశీలించుకోవాలి. ఎందుకంటే మీ వ్యక్తిగత వివరాలు, కేవైసీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ పత్రాల సాయంతో వేరొకరు రుణాలు తీసుకుని ఉంటే క్రెడిట్ రిపోర్ట్‌ల రూపంలో వెలుగులోకి వస్తాయి. మీ ప్రమేయం లేని రుణ ఖాతాలను గుర్తిస్తే వెంటనే అన్ని చానళ్ల వద్దా (క్రెడిట్ బ్యూరో, కార్డు కంపెనీ, పోలీస్ స్టేషన్, రుణదాత తదితర) ఫిర్యాదు దాఖలు చేయాలి. గాలం ఎలా? కేవైసీ వివరాలు కోరడం, మోసపూరిత క్యాష్ బ్యాక్‌లు ఆఫర్ చేయడం, డిజిటల్ వ్యాలెట్ మోసాలు, ఫిషింగ్, క్యూఆర్‌కోడ్స్, యూపీఐ ఫిషింగ్, లాటరీ మోసాలు, సోషల్ మీడియా స్కామ్‌లు ఇలా ఎన్నో రూపాల్లో నేరస్థులు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. అన్ని బ్యాంకులకు సంబంధించి సుమారు 5లక్షల క్రెడిట్‌కార్డుల వివరాలను డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టిన ఘటనను ఇటీవల ఓ నివేదిక ప్రస్తావించింది. 2017లో సైబర్ దాడుల వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకు 18.5 బిలియన్ డాలర్ల (రూ.1.39లక్షల కోట్లు) నష్టం వాటిల్లిందని అంచనా. ‘‘ముంబై పోలీసులు అందించిన గణాంకాలను పరిశీలిస్తే.. సైబర్ నేరాల్లో కేవలం 10 శాతాన్ని వారు పరిష్కరించగలుగుతున్నారు. కనుక భారతీయులు ఆన్లైన్ లావాదేవీలు, ఆర్థిక అంశాల విషయంలో ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలి’’ అని సైబర్ సెక్యూరిటీ క్లస్టర్–హెచ్ఎస్సీ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ బీవీ ప్రెసిడెంట్, సీఈవో అయిన జాకి ఖురేషి పేర్కొన్నారు. డార్క్ వెబ్ దీన్నే డార్క్ నెట్ అని కూడా అంటారు. అంటే ఇంటర్నెట్ ప్రపంచం. డార్క్‌నెట్‌లోని సైట్లలోకి వెళ్లాలంటే అందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరం. టార్ (ది ఆనియన్ రూటర్) ఇటువంటిదే. ఇది గుర్తు తెలియని బ్రౌజర్. ఈ సాఫ్ట్వేర్ సాయంతో యూజర్లు డార్క్నెట్లోకి ప్రవేశించి ఎవరూ గుర్తించకుండా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో అంచల ఎన్క్రిప్షన్ (గుప్తత) ఉంటుంది. దీంతో చట్టవిరుద్ధమై ఉత్పత్తులు, సేవల క్రయ విక్రయాలకు ఇది అడ్డాగా మారింది. టార్ నెట్వర్క్ ద్వారా యాక్సెస్ చేసుకునే పోర్టళ్లు డాట్‌కామ్, డాట్ నెట్, డాట్ ఓఆర్జీ బదులుగా.. డాట్ ఆనియన్ అని ఉంటాయి. అసలు డార్క్‌వెబ్ కాన్సెప్ట్ అన్నది చట్టవిరుద్ధమైన కార్యకలాపాల దృష్టితో వచ్చింది కాదు. ప్రజావేగులు, జర్నలిస్ట్‌లు, సామాజిక కార్యకర్తలు, దర్యాప్తు ఏజెన్సీలు ఇతరుల దృష్టిలో పడకుండా కీలక సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దీన్ని వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వాల నియంత్రణలు, నిఘా సంస్థల కళ్లలో పడకుండా ఈ వేదిక ఉపయోగపడుతుంది. కానీ, అక్రమార్కులకు సైతం ఇది వరంగా మారింది. డార్క్‌వెబ్‌లో సుమారు 5 లక్షల మంది యూజర్లున్నారు. ఏటా 3,20,000 లావాదేవీలు నమోదవుతున్నాయి. ఈ మార్కెట్ పరిమాణం ఎంతన్నది కచ్చితంగా తెలియదు. కానీ, ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం 2026 నాటికి సుమారు 840 మిలియన్డాలర్లుగా (రూ.6,300 కోట్లు) ఉంటుందని అంచనా. ఇవీ వాస్తవాలు.. 65,000 యూఆర్ఎల్లు డాట్ ఆనియన్ ఎక్స్‌టెన్షన్‌తో టార్ నెట్‌వర్క్‌పై అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ సామాజిక మాధ్యమ వెబ్సైట్లు, సెర్చ్‌ఇంజన్లు సైతం ఆనియన్ వెర్షన్లను నిర్వహిస్తున్నాయి. 20 లక్షలకు పైగా యూజర్లు టార్ నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉన్నారు. ప్రతీ 39 సెకండ్లకు హ్యాకర్ల దాడి నమోదవుతోంది. గత మూడేళ్లలో డార్క్‌వెబ్‌పై కార్యకలాపాలు మూడింతలయ్యాయి. 59 శాతం ఇక్కడ విక్రయిస్తున్నది చట్టవిరుద్ధ డ్రగ్స్, కెమికల్సే. 2020లో 2200 రికార్డులు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి వచ్చాయి. ఫార్చ్యూన్ 1000 కంపెనీలకు సంబంధించి 25.9 మిలియన్ ఖాతాలు, 543 మిలియన్ల ఉద్యోగుల వివరాలు డార్క్‌నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. 3,50,000 ఆర్థిక లావాదేవీల సున్నిత సమాచారం ఎప్పటికప్పుడు డార్క్‌వెబ్ చేరుతోంది. ఎక్కువగా ప్రభావితమవుతోంది బ్యాంకింగ్ రంగమే. సమాచారం లీక్ అయ్యే బాధిత దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2.9 కోట్ల భారత ఉద్యోగార్థుల వివరాలు డార్క్వెబ్ను చేరాయి. 35 లక్షల మంది భారతీయ యూజర్ల వ్యక్తిగత వివరాలు (8.2 టెరాబైట్స్) డార్క్‌నెట్‌లో విక్రయానికి పెట్టారు. అలాగే, 70 లక్షల మంది భారతీయుల డెబిట్, క్రెడిట్‌కార్డుల వివరాలు కూడా నేరస్థుల చేతుల్లోకి వెళ్లాయి. గతంలో ఎయిర్ ఇండియాకు సంబంధించి 45 లక్షల మంది ప్రయాణికుల వివరాలు లీక్ అయ్యాయి. 2021లో స్టాక్‌బ్రోకింగ్ కంపెనీ అప్‌స్టాక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేవైసీ వివరాలు లీక్ అయ్యాయి. డామినోస్ యూజర్లకు సంబంధించి 10 లక్షల క్రెడిట్ కార్డుల వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఎస్బీఐకి చెందిన 30 లక్షల ఖాతాదారుల వివరాలు కూడా గతంలో హ్యాక్‌కు గురయ్యాయి. -
డార్క్ వెబ్‌లో ఈ సోషల్‌మీడియా యూజర్ల డేటా అమ్మకం..!
గత కొన్ని రోజుల నుంచి బాగా ప్రాచుర్యం పొందిన సోషల్‌మీడియా యాప్ క్లబ్‌హౌజ్. ఈ యాప్‌తో ఆడియో రూపంలో యూజర్లు తమ భావాలను ఇతరులతో పంచుకోవచ్చును. ఈ యాప్ తొలుత ఆపిల్ ఐవోఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా క్లబ్హౌజ్పై సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. క్లబ్‌హౌజ్ యూజర్లకు చెందిన 3.8 బిలియన్ల ఫోన్ నంబర్లను హాకర్లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. భద్రతా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం..తాజాగా క్లబ్‌హౌజ్ డేటా బేస్ హ్యాక్ గురైనట్లు గుర్తించారు. మార్క్ రూఫ్ అనే సైబర్ నిపుణుడు క్లబ్‌హౌజ్‌కు చెందిన యూజర్ల ఫోన్ నంబర్లు డార్క్ నెట్లో ఉంచారనే విషయాన్ని ట్విటర్లో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విటర్లో పోస్ట్ చేశాడు. కేవలం క్లబ్‌హౌజ్‌లో ఉన్న వారివి మాత్రమే కాకుండా యూజర్‌కు చెందిన కాంటాక్ట్‌లు యాప్‌తో అనుసంధానించబడిన వ్యక్తుల ఫోన్ నంబర్లు కూడా డార్క్ నెట్లో అమ్మకానికి ఉంచినట్లు పేర్కొన్నాడు. కాగా ఈ డేటా బ్రీచ్‌పై క్లబ్‌హౌజ్ ఇంకా స్పందించలేదు. Full phone number database of #Clubhouse is up for sale on the #Darknet. It contains 3.8 billion phone numbers. These are not just members but also people in contact lists that were synced. Chances are high that you are listed even if you haven't had a Clubhouse login. pic.twitter.com/PfAkUJ0BL5 — Marc Ruef (@mruef) July 23, 2021 -
ఆన్లైన్ అంగట్లో లింక్డిన్ యూజర్ల డేటా..!
వాషింగ్టన్: ఉపాధి ఆధారిత ఆన్లైన్ సేవలను అందించే లింక్డిన్ యూజర్ల డేటా ఆన్లైన్లో లీకైనట్లు తెలుస్తోంది. సుమారు 700 మిలియన్ల లింక్డిన్ యూజర్ల డేటా ఆన్లైన్లో బహిర్గతమైనట్లు వార్తలు వస్తున్నాయి. హాకర్లు యూజర్ల డేటాను ఆన్లైన్లో అమ్మకానికి ఉంచారని తెలుస్తోంది. లింక్డిన్ సుమారు 756 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉండగా..సుమారు 92 శాతం వరకు వినియోగదారుల సమాచారం ఆన్లైన్లో లీకైంది. వినియోగదారుల ఈ మెయిల్, ఫోన్ నంబర్, పనిచేసే ఆఫీసు, పూర్తి పేరు, ఖాతా ఐడీలతో పాటుగా యూజర్ల సోషల్ మీడియా ఖాతాల లింకులు, వ్యక్తిగత వివరాలు లీకైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యూజర్ల సాలరీ వివరాలు కూడా లీకైనట్లు తెలుస్తోంది. కాగా తాజాగా లింక్డిన్ డేటా లీక్‌పై స్పందించింది. లింక్డిన్ ఒక ప్రకటనలో.. ‘యూజర్ల డేటా లీక్ జరగలేదని పేర్కొంది. కానీ ఇతర మ్యాడుల్ నెట్వర్స్క్తో హాకర్లు డేటాను పొందారని లింక్డిన్ తెలిపింది. కాగా డేటా లీక్‌పై లింక్డిన్ ప్రతినిధులు దర్యాప్తు చేపడుతున్నారని వివరించింది. కంపెనీ నిర్వహించిన ప్రాథమిక విచారణలో హాకర్లు ఇతర వనరులను ఉపయోగించి డేటాను పొందారని తెలిపింది. లింక్డిన్ తన యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. యూజర్లు తమ ఖాతాలకు కచ్చితంగా 2FA టూ ఫ్యాక్టర్ అథణ్టికేషన్ను ఉండేలా చూసుకోవాలని లింక్డిన్ సూచించింది. సుమారు ఒక మిలియన్ యూజర్ల డేటాను హాకర్లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. చదవండి: Reliance: అబుదాబి కంపెనీతో భారీ డీల్ -
మొబీక్విక్ వినియోగదారులకు షాక్: భారీగా డేటా లీక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపుల సంస్థ మొబీక్విక్ యూజర్లకు షాకింగ్ న్యూస్. లక్షలమంది మొబీక్విక్ వినియోగదారుల సమాచారాన్ని చోరీ చేసిన హ్యాకర్లు డార్క్‌వెబ్‌లో అమ్మకాని పెట్టారన్న వార్తలు మొబీక్విక్ వినియోగదారుల్లో ప్రకంపనలు రేపింది. 37 మిలియన్ల ఫైళ్లు, 3.5 మిలియన్ల వ్యక్తుల కెవైసీ వివరాలు, 100 మీలియన్ల ఫోన్ నంబర్లు, ఇమెయిళ్ళు, పాస్వర్డ్లు, జియోడేటా, బ్యాంక్ ఖాతాలు,సీసీ డేటా ఉన్నాయనే అంచనాలు యూజర్ల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. సుమారు 3.5 మిలియన్ల మంది డేటాను డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు భద్రతా పరిశోధకుడు పేర్కొన్నారు. కేవైసీ వివరాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డ్ డేటా ఇతర తదితరాలు హ్యాకింగ్ గురయ్యాయని, డార్క్ వెబ్ లింక్‌లో ఈ లీక్‌ను గుర్తించినట్లు తెలిపారు. దీంతో నిధుల సమీకరణలో భాగంగా భారీ ఐపీఓకి ప్లాన్ చేస్తున్న తరుణంలో ఈ డేటాబ్రీచ్ వార్తలతో మొబీక్విక్ ఇబ్బందుల్లో పడింది. ఫిబ్రవరిలో భద్రతా పరిశోధకుడు రాజ్‌శేఖర్ రాజహరియా ఈ లీక్‌ను మొదటిసారి నివేదించారు. ఫిబ్రవరి 26 న లీక్ వివరాలను ట్వీట్ చేశారు: “11 కోట్ల మంది భారతీయ కార్డ్ హోల్డర్ల కార్డ్ డేటా, వ్యక్తిగత వివరాలు, కెవైసి సాఫ్ట్ కాపీ (పాన్, ఆధార్, మొదలైనవి) భారతదేశంలోని కంపెనీ సర్వర్ నుండి లీక్ అయినట్లు తెలిపారు. మొబీక్విక్‌కు సంబంధించి నో-యు-కస్టమర్ వివరాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డ్ డేటాతో సహా 8.2 టెరాబైట్ల (టీబీ) డేటా చోరీ అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి స్క్రీన్షాట్లను కూడా ఆయన పోస్ట్ చేశారు. 1.5 బిట్ కాయిన్ లేదా 86,000 డాలర్లకు ఈ డేటాను విక్రయానికి పెట్టినట్టు సమాచారం. “బహుశా చరిత్రలో అతిపెద్ద కేవైసీ డేటా లీక్.అభినందనలు మొబీక్విక్...’ అంటూ మరోహ్యాకర్ ఇలియట్ హ్యాండర్సన్ కూడా ట్వీట్ చేశారు. లీక్ అయిన డేటాలో ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీ, కేవైసీ వివరాలున్నాయి కాబట్టి స్కామర్లకు ఈజీగా యాక్సెస్ లభిస్తుందని స్వతంత్ర భద్రతా పరిశోధకుడు ఇంద్రజీత్ భూయాన్ వ్యాఖ్యానించారు. Indian payment systems giant "Mobikwik" allegedly suffered what may be considered the largest KYC data leak in history. Over 37m files, KYC of 3.5m individuals, and a whopping 100m phone numbers, emails, passwords, geodata, bank accounts & CC data.@MobiKwik pic.twitter.com/dCFqTHEv1F — Alon Gal (Under the Breach) (@UnderTheBreach) March 28, 2021 Probably the largest KYC data leak in history. Congrats Mobikwik... pic.twitter.com/qQFgIKloA8 — Elliot Alderson (@fs0c131y) March 29, 2021 యూజర్ల డేటా సేఫ్‌గా ఉంది : మొబీక్విక్ అయితే ఈ వార్తలను మొబీక్విక్ ఖండించింది. తమ సెక్యూరిటీ సిస్టంలోఎలాంటి లోపాలులేవని స్పష్టం చేసింది.దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని, తమ వినియోగదారుల డేటా పూర్తిగా సురక్షితంగా ఉందని మోబిక్విక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. భద్రతా పరిశోధకులు అని పిలవబడే కొంతమంది సృష్టిస్తున్న పుకార్లని కొట్టిపాడేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 200-250 మిలియన్ డాలర్లను సమీకరించడానికి ఐపీఓకు రావాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు చేదువార్త..
క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు చేదువార్త. 70 లక్షల మంది భారతీయుల క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయ్యాయి. భారతీయ సైబర్ సెక్యురిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజారియా తెలిపిన వివరాల ప్రకారం, లీక్ అయిన డేటాలో భారతీయ క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆదాయ వివరాలు, ఖాతా వివరాలు మరియు మరిన్ని ఉన్నాయి. బయటకి వచ్చిన డేటాలో 2010 నుండి 2019 వరకు గల వినియోగదారుల సమాచారం ఉంది.(చదవండి: ఆ ఫోన్లు కొనకండి అంటున్న నాగార్జున) గూగుల్ డ్రైవ్ లింక్‌లోని 2 జీబీ డేటాబేస్‌లో క్రెడిట్, డెబిట్ కార్డుదారుల ఫోన్ నంబర్లు, ఇమెయిల్ చిరునామాలు, వినియోగదారుల యజమానుల పేరు, పాన్ కార్డ్, వార్షిక ఆదాయం వివరాలు ఉన్నాయి. డార్క్ వెబ్‌లోని ఫోరమ్స్ కస్టమర్ల డేటాను సర్క్యులేట్ చేస్తున్నట్టు రాజశేఖర్ గుర్తించారు. ఈ డేటాను సైబర్ నేరాలు, మోసాలు, ఫిషింగ్ దాడులు, ఆన్లైన్ మోసాలకు ఉపయోగించొచ్చు. డార్క్ వెబ్‌లో బహిర్గతం చేసిన డేటాలో యాక్సిస్ బ్యాంక్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, కెల్లాగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెకిన్సే అండ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులతో పాటు ఇంకొంత మందికి సమాచారం ఉన్నట్లు ఇంక్ 42 తన నివేదికలో పేర్కొంది. ఈ ఉద్యోగుల వార్షిక ఆదాయం రూ.7 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉంటుందని నివేదికలో పేర్కొంది. క్రెడిట్/డెబిట్ కార్డులను విక్రయించడానికి బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకున్న థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు డార్క్ వెబ్‌లో ఈ సమాచారాన్ని లీక్ చేసి ఉండవచ్చని రాజహరియా తన నివేదికలో పేర్కొన్నారు. ఫైనాన్షియల్ డేటా ఇంటర్నెట్లో అత్యంత ఖరీదైన డేటా అని రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్ రజారియా ఈ విషయం గురుంచి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్టి-ఇన్)ను సంప్రదించారు. కానీ ఈ సంస్థ నుంచి ఇంకా ఎటువంటి స్పందన లేదు. ఇంటర్నెట్లో డేటా లీక్‌ల కేసులు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు నవంబర్‌లో ఆన్లైన్ గ్రోసరీ స్టోర్ హ్యాకర్ల లక్ష్యంగా మారింది. సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుల ప్రకారం, బిగ్‌బాస్కెట్ వినియోగదారుల యొక్క పూర్తి పేర్లు, ఇమెయిల్ ఐడిలు, పాస్వర్డ్ హాష్లు, కాంటాక్ట్ నంబర్లు, చిరునామాలు వంటివి హ్యాకర్ల చేతికి చిక్కడంతో డార్క్ వెబ్‌లో బహిర్గతమయ్యాయి. బిగ్‌బాస్కెట్ యూజర్ల డేటాను హ్యాకర్లు సుమారు 30 లక్షల రూపాయలకు అమ్మారు. -
అతి చౌకగా ఫేస్బుక్ యూజర్ల డేటా
సాక్షి, న్యూఢిల్లీ : అతిపెద్ద డేటా లీక్ కుంభకోణంపై గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోసారి లీకుల ఇబ్బందుల్లో పడింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వినియోగదారుల సమాచారం అతి చౌగాగా అమ్ముడు పోయిందన్న వార్త అటు యూజర్లలో ఆందోళన రేపుతోంది. 267 మిలియన్ల మంది అంటే దాదాపు 26 కోట్ల మందికి పైగా ఫేస్బుక్ యూజర్ల పర్సనల్ డేటా ‘డార్క్ వెబ్’ చేతుల్లోకి వెళ్లినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘సైబుల్’ వెల్లడించింది. వినియోగదారుల ఐడీలు, పూర్తి పేర్లు, ఈ మెయిల్స్, వ్యక్తిగత అడ్రస్‌లు, వయసు, రిలేషన్ షిప్ స్టేటస్‌లతో లాంటి వివరాలన్నీ ‘డార్క్ వెబ్’ కు విక్రయించినట్టు పేర్కొంది. ప్రస్తుతానికి, ఈ డేటా ఉల్లంఘనకు కారణం తెలియనప్పటికీ ఫేస్బుక్ లోని థర్డ్ పార్టీ ఏపీఐ లోపాల ఆధారంగా ఈ డేటాను దొంగలించి ఉండే అవకాశం ఉందని సైబుల్ అభిప్రాయపడింది. ఫేస్బుక్ యూజర్ల డేటా ‘డార్క్ వెబ్’ లో అమ్మకానికి పెట్టినట్టుగా ఇది ధృవీకరించింది. 300 మిలియన్లకు పైగా డేటా లీక్ కావడంపై సైబుల్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ప్రొఫైల్‌తో సహా డార్క్ వెబ్‌లో అందుబాటులో 267 మిలియన్ యూజర్ల డేటా కేవలం 543 డాలర్లు (రూ. 4138 )కే లభ్యం కావడం సెక్యూరిటీ భద్రతను ప్రశ్నల్ని లేవనెత్తుతోందని పేర్కొంది. అయితే పాస్ వర్డ్ మాత్రం భద్రంగా ఉన్నాయనీ, యూజర్ల డేటాను రక్షణకు కఠిన పద్దతులను పాటించాలని సూచించింది. లేదంటే ఈ డేటాతో సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడవచ్చని హెచ్చరించింది. -
అమ్మకానికి 13 లక్షల పేమెంట్ కార్డుల డేటా
న్యూఢిల్లీ: భారతీయులకు చెందిన 13 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు డార్క్ వెబ్ అనే హ్యాకర్ల వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని హ్యాకర్లు ఓపెన్ సేల్‌లో ఉంచారు. ఈ కార్డుల్లో ఉన్న మొత్తం డబ్బు విలువ రూ. 922 కోట్లు కాగా ఒక్కో కార్డును దాదాపు రూ. 7వేలకు విక్రయిస్తున్నట్లుగా వెబ్సైట్లో ఉంచారు. డార్క్ వెబ్‌లోని జోకర్స్ స్టాష్‌లో వీటిని అందుబాటులో ఉంచారు. కార్డుల వివరాలను ఏదైనా ఏటీఎం నుంచిగానీ లేదా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్ల ద్వారా సేకరించి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కార్డులకు ఉండే మాగ్నటిక్ స్ట్రిప్‌లో వినియోగదారుడి వివరాలుంటాయి. వాటిని క్లోన్ చేయడం ద్వారా హ్యాకర్లు అకౌంట్లపై దాడి చేసే చాన్సుంది. గత జనవరిలో హ్యాకర్లు ఇలాగే 21 లక్షల అమెరికన్ కార్డుల వివరాలు హ్యాక్ చేసి ఓపెన్ సేల్‌లో ఉంచారు. -
జస్ట్ రూ.500కే క్రెడిట్ కార్డు వివరాలు
ఇండోర్ : సైబర్ కేటుగాళ్లు ఆగడాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను మధ్య ప్రదేశ్ పోలీసు సైబర్ స్క్వాడ్ అరెస్టు చేసింది. హ్యాక్ చేసిన క్రెడిట్ కార్డు వివరాలను ఆన్లైన్లో కొనుగోలు చేసిన వీరు, పెద్ద మొత్తంలో కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను ఎంజాయ్ చేస్తున్నారని సీనియర్ అధికారులు చెప్పారు. డార్క్ వెబ్ ద్వారా హ్యాక్ చేసిన క్రెడిట్ కార్డు వివరాలను వీరు పొందుతున్నారని, ప్రతి క్రెడిట్ కార్డును కొనుగోలు చేయడానికి రూ.500 నుంచి రూ.800 వెచ్చిస్తున్నారని రాష్ట్ర సైబర్ సెల్స్ ఇండోర్ యూనిట్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు జితేంద్ర సింగ్ తెలిపారు. బిట్ కాయిన్ ద్వారా పేమెంట్లు జరిపి క్రెడిట్ కార్డు వివరాలను రాబడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులను రామ్‌కుమార్ పిళ్ళై, రాంప్రసాద్ నాదర్‌గా అధికారులు గుర్తించారు. ముంబైకు చెందిన వీరు, పాకిస్తాన్‌కు చెందిన షైక్ అఫ్జల్ కా షోజి నడిపే అంతర్జాతీయ సైబర్ క్రిమినల్స్ గ్యాంగ్ తరుఫున పనిచేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లాహోర్‌కు చెందిన షోజి, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సందర్శించినట్టు ఎస్పీ చెప్పారు. నాదర్, పిళ్ళైతో షోజి స్కైప్‌లో మాట్లాడాడని తెలిపారు. ఈ సైబర్ గ్యాంగ్‌కు చెందిన సభ్యులు డార్క్ వెబ్ ద్వారా క్రెడిట్ కార్డు వివరాలు కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వివరాలతో బ్యాంకాక్, థాయ్‌లాండ్, దుబాయ్, హాంకాంగ్, మలేసియా వంటి ప్రాంతాలకు విమాన టిక్కెట్లు కొనుగోలు చేయడం చేస్తున్నారని, అదేవిధంగా పెద్ద మొత్తంలో ఖరీదైన వస్తువులు కొంటున్నారని ఎస్పీ తెలిపారు. -
డార్క్‌నెట్‌లో డ్రగ్స్
ఆర్డర్ చేస్తే పోస్ట్‌లో గుమ్మం ముందుకు.. - బ్లాటింగ్ పేపర్ రూపంలో వచ్చి చేరుతున్న వైనం - సొమ్మును ‘బిట్ కాయిన్’గా మార్చి అంతర్జాతీయ - మార్కెట్లో డ్రగ్స్ కొనుగోలు - నగరంలో ముఠా గుట్టు రట్టు - ఇద్దరి అరెస్ట్.. - 62 ఎల్ఎస్డీ స్ట్రిప్స్ స్వాధీనం సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో చాపకింద నీరులా విస్తరించిన మత్తు దందా కొత్త పంథాలో నడుస్తోంది! డార్క్‌నెట్‌లో ఆర్డర్ చేస్తే చాలు.. డ్రగ్స్ వచ్చి డోర్ తడుతున్నాయి. బయటకెళ్లే అవసరం కూడా లేకుండా పోస్ట్‌లో ఇంటికే వచ్చేస్తున్నాయి. హైదరాబాద్‌లో తాజాగా ఈ తరహా ఉదంతం బయటపడటం కలకలం రేపుతోంది. నార్కోటిక్ డ్రగ్ నియంత్రణ అధికారులకే దిమ్మ తిరిగే తరహాలో సాగుతున్న ఈ దందా వేళ్లూనుకుంటే ఆపటం ఎవరి తరం కాదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొదట్లో కొన్నాడు.. తర్వాత అమ్మాడు.. గురువారం ఎక్సైజ్ శాఖ అధికారులు మరో డ్రగ్స్ గ్యాంగ్ గుట్టును రట్టు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మూడోకంటికి తెలియకుండా, ఎవరికీ అనుమానం రాకుండా సాగుతున్న ఈ దందాను ఎక్సైజ్ యాంటీ నార్కోటిక్ టీం లీడర్ అంజిరెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం బయటపెట్టింది. వివరాలివీ.. ఓల్డ్ అల్వాల్ ప్రాంతానికి చెందిన సంతోష్ దీపక్ (22), ఏఎస్రావునగర్కు చెందిన కేపీ అనిరుధ్ (30) లు డార్క్‌నెట్ ద్వారా డ్రగ్స్ తెప్పించి విక్రయిస్తున్నారు. వారి వద్ద నుంచి 62 ఎల్ఎస్డీ డ్రగ్ బ్లాటింగ్ పేపర్ వృత్తాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి 200 ఎల్ఎస్డీ డ్రగ్స్ తెప్పించిన సంతోష్ దీపక్... ఇందులోంచి 138 బ్లాటింగ్ పేపర్ వృత్తాలను ఇప్పటికే విక్రయించినట్టు నిర్ధారించారు. వీటిని రాంకోఠిలోని రెండు కాలేజీలకు చెందిన విద్యార్థులకు రూ.4 వేల చొప్పున అమ్మినట్టు నిందితులు చెప్పినట్టు హైదరాబాద్ ఎక్సైజ్ డీసీ వివేకానందరెడ్డి వెల్లడించారు. సంతోష్ దీపక్ ఇంతకుముందు మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఓ కాలేజీలో చదివేవాడు. అయితే ఆయనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని గమనించిన యాజమాన్యం కాలేజీ నుంచి పంపేసింది. అక్కడ్నుంచి అతడు బెంగళూరు వెళ్లి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. అక్కడా అతడిని కాలేజీ నుంచి పంపేశారు. దీంతో హైదరాబాద్‌కు వచ్చిన సంతోష్ పూర్తిగా డ్రగ్స్‌కు బానిసగా మారాడు. మొదట్లో ఇతర డ్రగ్స్ ముఠాల వద్ద అడిగినంత డబ్బు ఇచ్చి కొనుగోలు చేసేవాడు. క్రమంగా తానే డ్రగ్స్ సరఫరా చేసే ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. యాప్.. డిజిటల్ మనీ.. ఇంటర్నెట్పై మంచి పట్టున్న సంతోష్ డార్క్‌నెట్ ద్వారా అంతర్జాతీయ డ్రగ్ మార్కెట్‌ను పట్టుకున్నాడు. జబ్‌పే (జెడ్ఈబీ) పే యాప్‌ను ఫోన్లో డౌన్‌లోన్ చేసుకొని దానికి తన బ్యాంకు ఖాతాను అనుసంధానం చేశాడు. డ్రగ్ అవసరమైనప్పుడల్లా తన ఖాతాలోని డబ్బును జబ్‌పే యాప్‌కు బదిలీ చేసేవాడు. ఈ డబ్బును జబ్‌పే యాప్ ‘బిట్ కాయిన్’గా మార్చి తిరిగి ఆయనకు ఇచ్చేంది. బిట్ కాయిన్ అంటే ప్రపంచ దేశాల్లో ఏ కరెన్సీలోకైనా మార్చుకోగలిగే డిజిటల్ మనీ అన్నమాట! ఈ డిజిటల్ మనీతో సంతోష్ అంతర్జాతీయ డ్రగ్ మార్కెట్లో 200 ఎల్ఎస్డీ డ్రగ్స్‌కు అర్డర్ ఇచ్చారు. ఇవి ఒక కవర్లో రూపంలో (బ్లాటింగ్ పేపర్‌పై చిన్నచిన్న వృత్తాలుగా) పోస్ట్ ద్వారా సంతోష్ ఇంటికి చేరాయి. ఆ డ్రగ్స్‌ను విక్రయించేందుకు ఇతడు ఓ కొరియర్ ముఠాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కేపీ అనిరుద్ ద్వారా పలువురుకి అమ్మాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్ యాంటీ నార్కోటిక్ డ్రగ్ టీం గురువారం ఉదయం వలపన్ని వీరిని పట్టుకుంది. నిందితుల సెల్ఫోన్లలోని కాల్‌డేటాను విశ్లేషిస్తున్నారు. అందులోని నంబర్ల వివరాలు బయటికి వస్తే ఎవరెవరు డ్రగ్స్ కొంటున్నారో బయటపడే అవకాశం ఉంది. ఎక్సైజ్ యాంటీ నార్కోటిక్ డ్రగ్ టీం ఏర్పడిన తొలిరోజే వీరు పట్టుబడటం గమనార్హం. డార్క్ వెబ్ అంటే.. ఇది ఇంటర్నెట్లోనే ఇదో ఓ మాయా జగత్తు. సాధారణ సెర్చ్ ఇంజన్లు, సాఫ్ట్వేర్స్లతో దీన్ని చూడలేం. డార్క్ నెట్‌వర్క్‌లో సభ్యులుగా ఉన్నవాళ్లు మాత్రమే ఇందులోకి ప్రవేశించగలరు. సెర్చింగ్ కోసం ప్రత్యేకమైన ట్రైజర్లు తప్పనిసరి. ఇందులో సభ్యుడిగా ఉన్నవారు ఒకే ఐడీ, పాస్ వర్డ్‌తో అన్ని లింక్డ్ సైట్లలోకి ఏకకాలంలో ప్రవేశించవచ్చు. డార్క్నెట్వర్క్లో సభ్యుడిగా చేరగానే చీకటి సామ్రాజ్యంలోని అన్ని నెట్వర్క్ వెబ్సైట్లలో సభ్యుడిగా చేరిపోతారు. నిఘా వర్గాలకు అంత సులువుగా చిక్కని ఈ డార్క్నెట్నే డ్రగ్స్ మాఫియా వినియోగించుకొంటోంది. దీనిద్వారా డ్రగ్స్‌తోపాటు ఇతర నిషేధిత వస్తువుల క్రయవిక్రయాలు సాగుతున్నాయని చెబుతున్నారు. బ్లాటింగ్ పేపర్‌పై వృత్తాలుగా.. గతంలో ఎల్ఎస్డీ (లిసర్జిక్ యాసిడ్ డై ఇథైలమైడ్) లిక్విడ్‌ను సిరంజీల ద్వారా నరాల్లోకి ఎక్కించుకునేవాళ్లు. అయితే దీంతో నొప్పితో కూడుకొని ఉండటంతో రూటు మార్చారు. ఇందులో భాగంగా ఎల్ఎస్డీ లిక్విడ్ చుక్కను బ్లాటింగ్ పేపర్‌పై వేస్తారు. ఈ పేపర్ లిక్విడ్‌ను పీల్చుకొని తనలోనే నిక్షిప్తం చేసుకుంటుంది. ఎంత కాలమైనా ఆ పేపర్లోనే ఉండిపోతుంది. కాగితంపై డ్రగ్ ఆవరించినంత మేరకు వృత్తాకారంలో గీతలు ప్రింట్ చేస్తారు. డ్రగ్ పరిమాణాన్ని బట్టి ఈ వృత్తాల సైజ్ ఉంటుంది. 125 మైక్రోగ్రామ్ నుంచి 250 మైక్రో గ్రాముల వరకు డ్రగ్‌ను మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. కాగితంపై ఉన్న వృత్తాన్ని (ఒక్కో వృత్తం ఖరీదు రూ.3,500 నుంచి రూ.4 వేల దాకా ఉంది) నాలుగు భాగాలుగా కత్తిరించి అందులోంచి ఒక భాగాన్ని నాలుకపై పెట్టుకొని చప్పరిస్తారు. ఇది ఒకసారి చప్పరిస్తే 8 గంటల వరకు మత్తులో ఉంటారు.