న్యూఢిల్లీ: భారతీయులకు చెందిన 13 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు డార్క్ వెబ్ అనే హ్యాకర్ల వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని హ్యాకర్లు ఓపెన్ సేల్‌లో ఉంచారు. ఈ కార్డుల్లో ఉన్న మొత్తం డబ్బు విలువ రూ. 922 కోట్లు కాగా ఒక్కో కార్డును దాదాపు రూ. 7వేలకు విక్రయిస్తున్నట్లుగా వెబ్‌సైట్లో ఉంచారు. డార్క్ వెబ్‌లోని జోకర్స్ స్టాష్‌లో వీటిని అందుబాటులో ఉంచారు. కార్డుల వివరాలను ఏదైనా ఏటీఎం నుంచిగానీ లేదా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్ల ద్వారా సేకరించి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కార్డులకు ఉండే మాగ్నటిక్ స్ట్రిప్‌లో వినియోగదారుడి వివరాలుంటాయి. వాటిని క్లోన్ చేయడం ద్వారా హ్యాకర్లు అకౌంట్లపై దాడి చేసే చాన్సుంది. గత జనవరిలో హ్యాకర్లు ఇలాగే 21 లక్షల అమెరికన్ కార్డుల వివరాలు హ్యాక్ చేసి ఓపెన్ సేల్‌లో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment