Point of Sale
-
పీవోఎస్, యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: పాయింట్ ఆఫ్ సేల్, ఈ కామర్స్ సంస్థలకు రూపే డెబిట్ కార్ట్‌తో చేసే చెల్లింపులు, వరక్తుల వద్ద భీమ్ యూపీఐ ప్లాట్‌ఫామ్ సాయంతో చేసిన తక్కువ విలువ లావాదేవీలకు ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ ఉంచారు. రూపే కార్డు, భీమ్ యూపీఐ లావాదేవీ రూ.2,000లోపున్న వాటిపై ఈ ప్రోత్సాహకాలు అందనున్నాయి. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్లపై, ఈ కామర్స్ సైట్లపై రూపే డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసినప్పుడు.. స్వీకరించే బ్యాంకులకు 0.4 శాతం, గరిష్టంగా రూ.100 ప్రోత్సాహకంగా లభిస్తుంది. భీమ్ యూపీఐ ఆధారిత లావాదేవీలపై చెల్లింపులను స్వీకరించే బ్యాంకులకు 0.25 ప్రోత్సాహకం లభిస్తుంది. ఇవి రిటైల్ చెల్లింపులకు సంబంధించినవి. అలా కాకుండా ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వం, విద్య, రైల్వే తదితర రంగాల్లోని లావాదేవీలపై ప్రోత్సాహకాలు భిన్నంగా ఉన్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రోత్సాహకాలు ఏడాది పాటు అమల్లో ఉంటాయి. గరిష్టంగా రూ.2,600 కోట్లను ఈ ప్రోత్సాహకాల కోసం కేంద్రం కేటాయించింది. -
విక్రయాలలో సైట్ ఆఫీస్ కీలకం
సాక్షి, హైదరాబాద్: షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు మన చూపు అందంగా, సృజనాత్మకంగా తీర్చిదిద్దిన డిస్ప్లే వస్తువులపై పడుతుంది. వెంటనే ఆయా వస్తువుల కొనేందుకు లేదా ఎంక్వైరీకి ప్రయత్నిస్తాం. ఇదే తరహాలో రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ సైట్ ఆఫీస్ డిస్ ప్లే లాంటిది. శక్తివంతమైన మార్కెటింగ్ సాధనమిది. లగ్జరీ గృహాలతో పాటూ అఫర్డబుల్, మిడ్ సైజ్ గృహాల విక్రయాలలోనూ సైట్ ఆఫీస్ అనేది అత్యంత కీలకంగా మారింది. మన దేశంలో గృహ విక్రయాలు పోర్టా క్యాబిన్స్ లేదా నమూనా ఫ్లాట్ ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తుంటారు. సేల్స్ ఆఫీస్ అనేది ముందుగా లగ్జరీ ప్రాజెక్ట్‌లలో డెవలపర్లు అనుభవం, ప్రాజెక్ట్ ఆఫర్ల గురించి ఏర్పాటు చేసేవాళ్లు. తర్వాతి కాలంలో ఈ కాన్సెప్ట్ అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు కూడా పాకింది. ఎక్కువ మంది కస్టమర్లకు వసతి కల్పించడానికి, విక్రయాలను క్రమబద్దీకరించడానికి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి కొత్త ప్రాజెక్ట్ సైట్లో సేల్స్ ఆఫీస్ ఉంటుంది. సేల్స్, సైట్ ఆఫీస్ లేదా సేల్స్ గ్యాలరీ అనేది మొత్తం రియల్ ఎస్టేట్ లావాదేవీలో సమగ్రమైన, కీలకమైన విభాగం. ఆకర్షణీయమైన, సమగ్ర నిర్వహణ సేల్స్ ఆఫీస్ లేకపోతే విక్రయాలు కూడా గణనీయంగా క్షీణిస్తాయి. ప్రాజెక్ట్‌లోని ఉత్తమ ఫీచర్ల ప్రదర్శన, ప్రయోజనాల డిస్ప్లే, వాకిన్స్, సైట్ విజిట్స్ నిర్వహణ వంటివి సేల్స్ ఆఫీస్ ప్రత్యేకత. మార్కెటింగ్‌లో కీలకం.. ప్రాపర్టీల మార్కెటింగ్‌లో సేల్స్ ఆఫీస్ కీలకమైన విభాగంగా మారింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌పై కొనుగోలుదారులలో మంచి అభిప్రాయం కలిగేది సైట్ ఆఫీస్ నుంచే మొదలవుతుంది. మార్కెటింగ్ బృందానికి అప్పటికే చేతిలోకి రాని ప్రాజెక్ట్‌లోని ఫీచర్లు, ప్రయోజనాలు కస్టమర్లకు అనుభవపూర్వకం చేసే అవకాశం కలుగుతుంది. అభివృద్ధి పనులు జరుగుతున్న దశల వారీగా సైట్ ఆఫీస్‌లో ప్రదర్శించే వీలుంటుంది. ఆయా ప్రాజెక్ట్‌లో తాము భాగస్వామ్యమైతే భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందుగానే ఓ ఊహాజనిత చిత్రాన్ని చూపించేదే సైట్ ఆఫీస్. కొందరు కస్టమర్లు పలుమార్లు సైట్ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం ఉంటుంది కాబట్టి దీర్ఘకాలం ప్రభావవంతంగా, క్రియాత్మకంగా ఉండాలి. రియల్టీ ప్రాజెక్ట్ ప్రారంభమైన రోజు నుంచి 2–3 ఏళ్ల పాటు సాగుతాయి. ప్రాజెక్ట్‌లోని ఇన్వెంటరీలో 90 శాతం విక్రయాలయ్యే వరకూ సేల్స్ ఆఫీస్ ఉంటుందని అనరాక్ గ్రూప్ స్ట్రాటర్జీ హెడ్ సునీల్ మిశ్రా తెలిపారు. ► ప్రాజెక్ట్ నిర్మాణం, విక్రయాలు పూర్తయ్యే వరకూ సేల్స్ ఆఫీస్ ఉంటుంది. నిర్మాణ సంస్థకు, కొనుగోలుదారులకు మధ్య వారధి లాంటివి సేల్స్ ఆఫీస్. ఇక్కడి నుంచే కస్టమర్ల సందేహాలను నివృత్తి చేయడంతో పాటూ ప్రాజెక్ట్ ఫీచర్లను ప్రదర్శిస్తారు. దీంతో పాటు ధర నిర్ణయం, లావాదేవీలు కూడా జరుగుతాయి. ప్రవాస కస్టమర్లు మినహా వంద శాతం ప్రాపర్టీ లావాదేవీలు సైట్ ఆఫీస్‌ల నుంచే జరుగుతాయి. సేల్స్ ఆఫీస్ అనేది డెవలపర్ పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మాత్రమే కాదు.. కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్, 80–85 శాతం కస్టమర్ల ఫిజికల్ ప్రాపర్టీ అనుభవం ఇక్కడ్నుంచే జరుగుతాయి. మంచి సేల్స్ ఆఫీస్ కారణంగా కస్టమర్ల అంతర్గత ప్రచారంతో సైట్ విజిట్స్ పెరుగుతాయి. విక్రయాల నిష్పత్తి 4–5% వరకు వృద్ధి చెందుతాయి. కొత్త మార్కెట్లలో కూడా డెవలపర్ బ్రాండ్‌ను తెలిపేది సైట్ ఆఫీసులే. గ్రేడ్–ఏ, బీ డెవలపర్లు సేల్స్ ఆఫీస్‌ల నిర్వహణతో 50% విక్రయాలను మెరుగుపర్చుకుంటున్నారు. సేల్స్ ఆఫీస్ క్లబ్ హౌస్‌గా.. మంచి సేల్స్ ఆఫీస్ నిర్మాణం, నిర్వహణ మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 0.5 శాతం అవుతుంది. చాలా మంది డెవలపర్లు తాత్కాలిక సేల్స్ ఆఫీస్‌ను ఏర్పాటు కంటే శాశ్వత నిర్మాణాన్ని చేపడతారు. వాస్తవానికి ఇది మంచి నిర్ణయం. ప్రాజెక్ట్ పూర్తయ్యాక సేల్స్ ఆఫీస్‌ను క్లబ్ హౌస్‌గా మార్చేసి.. హౌసింగ్ సొసైటీకి అప్పగిస్తారు. దీంతో సైట్ ఆఫీస్ నిర్మాణం, నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. సాధారణంగా సేల్స్ ఆఫీస్ పరిమాణం 1,200 చ.అ. నుంచి 5,000 చ.అ. మధ్య ఉంటుంది. కొన్ని టౌన్‌షిప్‌లలో 8 వేల నుంచి 10 వేల చ.అ. కంటే విస్తీర్ణమైనవి కూడా ఉంటాయి. -
అమ్మకానికి 13 లక్షల పేమెంట్ కార్డుల డేటా
న్యూఢిల్లీ: భారతీయులకు చెందిన 13 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు డార్క్ వెబ్ అనే హ్యాకర్ల వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని హ్యాకర్లు ఓపెన్ సేల్‌లో ఉంచారు. ఈ కార్డుల్లో ఉన్న మొత్తం డబ్బు విలువ రూ. 922 కోట్లు కాగా ఒక్కో కార్డును దాదాపు రూ. 7వేలకు విక్రయిస్తున్నట్లుగా వెబ్సైట్లో ఉంచారు. డార్క్ వెబ్‌లోని జోకర్స్ స్టాష్‌లో వీటిని అందుబాటులో ఉంచారు. కార్డుల వివరాలను ఏదైనా ఏటీఎం నుంచిగానీ లేదా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్ల ద్వారా సేకరించి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కార్డులకు ఉండే మాగ్నటిక్ స్ట్రిప్‌లో వినియోగదారుడి వివరాలుంటాయి. వాటిని క్లోన్ చేయడం ద్వారా హ్యాకర్లు అకౌంట్లపై దాడి చేసే చాన్సుంది. గత జనవరిలో హ్యాకర్లు ఇలాగే 21 లక్షల అమెరికన్ కార్డుల వివరాలు హ్యాక్ చేసి ఓపెన్ సేల్‌లో ఉంచారు. -
కొత్త తరహాలో ఎరువుల సబ్సిడీ బదిలీ
న్యూఢిల్లీ: ఎరువులకు సంబంధించి రూ.70 వేల కోట్ల సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు కేంద్రం 3 కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎరువుల సరఫరా, లభ్యత, అవసరం తదితర వివరాలతో కూడిన ప్లాట్‌ఫాం, అభివృద్ధిపరిచిన పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) సాఫ్ట్వేర్, డెస్క్‌టాప్ పీవోఎస్ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి (డీబీటీ) ఎరువుల సబ్సిడీ బదిలీ చేసే పథకం రెండో విడతలో భాగంగా ఈ మేరకు ఈ సాంకేతికతలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఎరువుల సబ్సిడీ డీబీటీ మొదటి విడతను కేంద్రం 2017 అక్టోబర్‌లో ప్రవేశపెట్టింది. ఈ విడతలో పీవోఎస్ మెషీన్లలో నిక్షిప్తమైన డేటాను సరిచూసి సబ్సిడీ మొత్తాన్ని కంపెనీలకు బదిలీ చేసేవారు. ‘తాజా సాంకేతికతతో నేరుగా రైతులకు చేరువయ్యేందుకు ఎంతో దోహదపడుతుంది. ఎరువుల రంగంలో పారదర్శకత పెరుగుతుంది’అని ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ పేర్కొన్నారు. ఇప్పటివరకు 13 వెర్షన్ల పీవోఎస్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చామని, దేశంలోని 2.24 లక్షల రిటెయిల్ ఎరువుల దుకాణాల్లో పీవోఎస్ సాఫ్ట్‌వేర్‌ను తెచ్చామన్నారు. ల్యాప్టాప్స్, కంప్యూటర్లలో ఎరువుల విక్రయాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను వినియోగించొచ్చని చెప్పారు. -
రైళ్లలో క్రెడిట్, డెబిట్ కార్డులతో ఫుడ్
న్యూఢిల్లీ: రైళ్లలో ఆహార బిల్లుల్ని చెల్లించేందుకు 2,191 పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మెషీన్లను ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టింది. రైలు ప్రయాణికులు ఈ మెషీన్ల వద్ద తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఆహార బిల్లులను చెల్లించవచ్చు. ప్యాంట్రీకార్లున్న రైళ్లలో పీఓఎస్ మెషీన్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు రైల్వే శాఖ తెలిపింది. రైళ్లలో ఆహార పదార్థాలు కొనేటప్పుడు విక్రేతలు ప్రయాణికుల నుంచి అధికమొత్తాన్ని వసూలు చేయకుండా అరికట్టేందుకు ఈ మెషీన్లు ఉపయోగపడతాయని తెలిపింది. ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లల్లో జనవరి 26 నుంచి ఫిబ్రవరి 15వరకు పీఓఎస్ మెషీన్ల పనితీరు, ఆహారపదార్థాల కొనుగోలుపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామని పేర్కొంది. -
రైళ్లలో బిల్లు ఇవ్వకుంటే భోజనం ఫ్రీ
న్యూఢిల్లీ: రైళ్లలో ఇకపై ఆహారపదార్థాల జాబితాను ధరలతో సహా రైళ్లలో ప్రదర్శించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ‘బిల్లు ఇవ్వకుంటే మీ భోజనం ఉచితమే. దయచేసి టిప్ ఇవ్వకండి’ అనే సందేశాన్ని టిన్ ప్లేట్లపై ముద్రించనున్నారు. రైల్వేమంత్రి గోయల్ అధ్యక్షతన రైల్వేబోర్డు, జోనల్ మేనేజర్లు, డివిజినల్ మేనేజర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో అన్ని సాధారణ ఫిర్యాదుల కోసం ఒకే హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని గోయల్ అన్నారు. ప్రస్తుతం 723 స్టేషన్లకున్న ఉచిత వైఫై సౌకర్యాన్ని 2వేల స్టేషన్లకు విస్తరించాలని ఆదేశించారు. ఈ ఏడాది మార్చికల్లా రైళ్లలో కేటరింగ్ సిబ్బందికి పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్)యంత్రాలను అందిస్తామని వెల్లడించారు. -
పీఓఎస్ పరికరాలపై పన్నుల్లేవ్
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా విధానంలో భాగంగా దేశంలో ఈ–చెల్లింపులను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కీలక చర్య చేపట్టింది. నగదు రహిత లావాదేవీల ప్రక్రియలో ఉపయోగించే పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) పరికరాలపై అన్ని రకాల డ్యూటీలు తొలగించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. పీఓఎస్ పరికరాలైన కార్డు రీడర్లు, ఎంపీఓఎస్ మైక్రో ఏటీఎంలు (1.5.1 వెర్షన్ ), వేలిముద్ర రీడర్లు, స్కానర్లు, ఐరిస్ స్కానర్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ), ఎక్సైజ్ డ్యూటీ, కౌంటర్వెయిలింగ్ డ్యూటీ (సీవీడీ), స్పెషల్ అడిషనల్ డ్యూటీ (ఎస్ఏడీ) నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ పరికరాల స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు ఆయా పరికరాల్లో ఉపయోగించే విడిభాగాలకూ పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కేంద్రం నిర్ణయాన్ని ఎల్సినా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్వాగతించింది. ఈ చర్య డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. అయితే పన్ను మినహాయింపును తక్షణ అవసరాలను తీర్చుకునేందుకే పరిమితం చేయాలని సూచించింది. పన్ను మినహాయింపును దీర్ఘకాలం కొనసాగించడం వల్ల విదేశీ మార్కెట్ల నుంచి పీఓఎస్ పరికరాలు భారీ స్థాయిలో ముంచెత్తవచ్చని ఎల్సినా సెక్రటరీ రాజూ గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. పన్ను మినహాయింపును పూర్తి ఆర్థిక సంవత్సరంపాటు ఇవ్వకూడదని సూచించారు. -
కోటి దాటిన ‘డిజిధన్ అభియాన్’ శిక్షణదారులు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంచే కార్యక్రమం ‘డిజిధన్ అభియాన్’లో కేవలం 20 రోజుల్లోనే సుమారు కోటికి పైగా గ్రామీణులు చేరారని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం తెలిపారు. ‘డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతపై ఉమ్మడి సేవా కేంద్రాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో 80 లక్షల మంది ప్రజలు, 25 లక్షల మంది వ్యాపారులకు చేరువకావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దాన్ని అదిగమించి 20 రోజుల్లోనే 1.05 కోట్ల ప్రజలకు శిక్షణ అందించామ’ని చెప్పారు. 476 జిల్లాలు, 2782 బ్లాకుల్లో ఈ కార్యక్రమం అమలవుతున్నట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 15 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో నమోదుచేసుకున్నారు. 12.5 లక్షల మందితో ఛత్తీస్‌గఢ్ తరువాతి స్థానంలో నిలిచింది. పెద్దనోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. నవంబర్ 8–డిసెంబర్ 26 మధ్య కాలంలో రూపే కార్డు లావాదేవీలు 445 శాతం వృద్ధి చెందాయి. పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) చెల్లింపుల పరిమాణం 95 శాతం ఎగబాకింది. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 3 లక్షల మంది వ్యాపారులు డిజిటల్ రూపంలో చెల్లింపులు స్వీకరించడం ప్రారంభించారు. డిజిటల్ వ్యవస్థను పటిష్టపరచడానికి సమాచార సాంకేతికత(ఐటీ) చట్టాన్ని బలోపేతం చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని ప్రసాద్ పేర్కొన్నారు. -
ఈ పాస్ మొరాయింపు
సర్వర్ పనిచేయక బియ్యం పంపిణీలో జాప్యం ఇక్కట్లకు గురవుతున్న రేషన్ లబ్ధిదారులు జిల్లావ్యాప్తంగా ఇదే తీరు తాడితోట (రాజమహేంద్రవరం) : ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీ కోసం ప్రవేశపెట్టిన పీఓఎస్ (ఫాయింట్ ఆఫ్ సేల్) మెషీన్లు మొరాయిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ ఎప్పుడు పనిచేస్తుందోనని డీలర్లు, లబ్ధిదారులకు ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురుచూపులు తప్పడంలేదు. ప్రతినెలా రేషన్‌కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పాస్ విధానంలో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయని ఈనెల నుంచి ఏపీ ఆన్లైన్ నెట్వర్క నుంచి జాతీయ విజ్ఞాన కేంద్రానికి (ఎన్.ఐ.సి.)కి మార్పు చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 2,660కి పైగా రేషన్‌షాపులలో పీఓఎస్ మెషీన్లు పనిచేయడంలేదు. లబ్ధిదారుడు వేలిముద్ర స్వీకరించిన అనంతరం నో స్టాక్ అని వస్తోంది. దీంతో డీలర్లు రేషన్ సరుకులు ఇవ్వలేకపోతున్నారు. 5వ తేదీ వచ్చినప్పటికి జిల్లావ్యాప్తంగా 75 శాతం కూడా రేషన్ పంపిణీ జరగలేదని డీలర్లు అంటున్నారు. సరుకుల కోసం నిరీక్షణ రాజమహేంద్రవరం, కాకినాడ, గొల్లప్రోలు, పెద్దాపురం, రామచంద్రపురం, తదితర ప్రాంతాలలో మెషీన్లు పని చేయడంలేదు. కొన్నిచోట్ల సర్వర్ బాగా పనిచేసినప్పటికీ చాలాచోట్ల గంటకు ఒక కార్డు చొప్పున అవుతోంది. మరికొన్నిచోట్ల నోస్టాక్ అంటూ చూపిస్తుండడంతో డీలర్లు అవాక్కవుతున్నారు. దీంతో రేషన్‌బియ్యం కోసం లబ్ధిదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సి వస్తోంది. నాలుగురోజులుగా సర్వర్ పనిచేయకపోవడంతో కూలిపనులు సైతం మానుకుని రేషన్‌కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవరం వరకూ రేషన్ ఇచ్చేది లేదని కొందరు డీలర్లు చెబుతున్నారు. రేషన్ కోసం కూలిపనులు మానుకొని వచ్చిన వారికి నిరాశే మిగులుతోంది. దీనిపై వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.