
న్యూఢిల్లీ: రైళ్లలో ఇకపై ఆహారపదార్థాల జాబితాను ధరలతో సహా రైళ్లలో ప్రదర్శించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ‘బిల్లు ఇవ్వకుంటే మీ భోజనం ఉచితమే. దయచేసి టిప్ ఇవ్వకండి’ అనే సందేశాన్ని టిన్ ప్లేట్లపై ముద్రించనున్నారు. రైల్వేమంత్రి గోయల్ అధ్యక్షతన రైల్వేబోర్డు, జోనల్ మేనేజర్లు, డివిజినల్ మేనేజర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో అన్ని సాధారణ ఫిర్యాదుల కోసం ఒకే హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని గోయల్ అన్నారు. ప్రస్తుతం 723 స్టేషన్లకున్న ఉచిత వైఫై సౌకర్యాన్ని 2వేల స్టేషన్లకు విస్తరించాలని ఆదేశించారు. ఈ ఏడాది మార్చికల్లా రైళ్లలో కేటరింగ్ సిబ్బందికి పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్)యంత్రాలను అందిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment