debit card data
-
కార్డులతో చెల్లింపులు.. గూగుల్ కీలక ప్రకటన
Online Payments Google will NOT save your card details from 2022: స్మార్ట్ ఫోన్, ఇతర డివైజ్‌ల ద్వారా పేమెంట్లు చేసేవాళ్లకు గూగుల్ ముఖ్య గమనిక చేసింది. అదీ గూగుల్ బేస్డ్ మంత్లీ పేమెంట్లు చేసేవాళ్లకు. జనవరి 1,2022 నుంచి కస్టమర్ కార్డు వివరాలు సేవ్ చేయబోమని వెల్లడించింది. ఆన్లైన్ పేమెంట్, క్రెడిట్ కార్డ్, ఏటీఎం చెల్లింపుల విషయంలో ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. సాధారణంగా ఒక్కసారి పేమెంట్ చేశాక.. మంత్లీ పేమెంట్లు చేసే టైంలో కార్డు నెంబర్, ఎక్స్పైరీ డేట్ అనేవి ఆటోమేటిక్‌గా కనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ వివరాలతో యూజర్ అవసరానికి తగ్గట్లు ఆటోమేటిక్‌గా పేమెంట్ కూడా జరిగిపోతుంటుంది. అయితే ఇకపై గూగుల్ సంబంధిత యాప్స్ విషయంలో ఇలాంటి ఫార్మట్ కనిపించదని పేర్కొంది గూగుల్. ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన కార్డు స్టోరేజ్ రెగ్యులేషన్స్‌ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ వెల్లడించింది. పేమెంట్ అగ్రిగ్రేటర్స్(PA), పేమెంట్ గేట్వేస్(PG) కొరకు ఆర్బీఐ ఈ కొత్త మార్గదర్శకం జారీ చేసింది. ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం.. కార్డ్ జారీచేసినవాళ్లు, సంబంధిత నెట్వర్స్క్ తప్ప కార్డు వివరాల్ని(Card-on-File) ఇతర ప్లాట్‌ఫామ్స్ ఏవీ సేకరించడానికి వీల్లేదు. గూగుల్ ప్లే అకౌంట్, గూగుల్ వర్క్ అకౌంట్, చివరికి గూగుల్‌క్లౌడ్‌లో రికార్డయిన వివరాలు సైతం పని చేయవు. కాబట్టి, వచ్చే ఏడాదిలోనూ అదే కార్డును ఉపయోగించుకోవాలనుకునేవాళ్లు ఎప్పటికప్పుడు కార్డు వివరాల్ని రీఎంటర్ చేయాల్సి ఉంటుందని గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. లేనిపక్షంలో పేమెంట్లు క్యాన్సిల్, డిక్లయిన్ అవుతాయని స్పష్టం చేసింది. అయితే మన దేశంలో ఎక్కువ మంది కార్డు పేమెంట్ల ద్వారా ఎక్కువగా ఉపయోగించేది వీసా, మాస్టర్‌కార్డులే. వీటి విషయంలో మాత్రం ఊరట ఇచ్చే విషయం చెప్పింది గూగుల్. వీసా, మాస్టర్ కార్డు సంబంధిత డెబిట్, క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేయాలనుకుంటే.. డిసెంబర్ 31,2021లోపు కార్డు వివరాల్ని రీ-ఎంటర్ చేయాలని, తప్పనిసరిగా ఏదైనా కొనుగోలు లేదా పేమెంట్ చేస్తే ఆ వివరాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. లేనిపక్షంలో కార్డు వివరాలు ఆటోమేటిక్‌గా కనిపించవని, కాబట్టి.. వచ్చే ఏడాది నుంచి పేమెంట్లు చేసే టైంలో మళ్లీ ఆ వివరాల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక రూపే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డిస్కవర్, డైనర్స్ కార్డ్ వినియోగదారులు మాత్రం స్టోర్ కావని, పేమెంట్ చేసిన ప్రతీసారి వివరాలు సమర్పించాల్సిందేనని పేర్కొంది. చదవండి: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ..! -
క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు చేదువార్త..
క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు చేదువార్త. 70 లక్షల మంది భారతీయుల క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయ్యాయి. భారతీయ సైబర్ సెక్యురిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజారియా తెలిపిన వివరాల ప్రకారం, లీక్ అయిన డేటాలో భారతీయ క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆదాయ వివరాలు, ఖాతా వివరాలు మరియు మరిన్ని ఉన్నాయి. బయటకి వచ్చిన డేటాలో 2010 నుండి 2019 వరకు గల వినియోగదారుల సమాచారం ఉంది.(చదవండి: ఆ ఫోన్లు కొనకండి అంటున్న నాగార్జున) గూగుల్ డ్రైవ్ లింక్‌లోని 2 జీబీ డేటాబేస్‌లో క్రెడిట్, డెబిట్ కార్డుదారుల ఫోన్ నంబర్లు, ఇమెయిల్ చిరునామాలు, వినియోగదారుల యజమానుల పేరు, పాన్ కార్డ్, వార్షిక ఆదాయం వివరాలు ఉన్నాయి. డార్క్ వెబ్‌లోని ఫోరమ్స్ కస్టమర్ల డేటాను సర్క్యులేట్ చేస్తున్నట్టు రాజశేఖర్ గుర్తించారు. ఈ డేటాను సైబర్ నేరాలు, మోసాలు, ఫిషింగ్ దాడులు, ఆన్లైన్ మోసాలకు ఉపయోగించొచ్చు. డార్క్ వెబ్‌లో బహిర్గతం చేసిన డేటాలో యాక్సిస్ బ్యాంక్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, కెల్లాగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెకిన్సే అండ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులతో పాటు ఇంకొంత మందికి సమాచారం ఉన్నట్లు ఇంక్ 42 తన నివేదికలో పేర్కొంది. ఈ ఉద్యోగుల వార్షిక ఆదాయం రూ.7 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉంటుందని నివేదికలో పేర్కొంది. క్రెడిట్/డెబిట్ కార్డులను విక్రయించడానికి బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకున్న థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు డార్క్ వెబ్‌లో ఈ సమాచారాన్ని లీక్ చేసి ఉండవచ్చని రాజహరియా తన నివేదికలో పేర్కొన్నారు. ఫైనాన్షియల్ డేటా ఇంటర్నెట్లో అత్యంత ఖరీదైన డేటా అని రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్ రజారియా ఈ విషయం గురుంచి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్టి-ఇన్)ను సంప్రదించారు. కానీ ఈ సంస్థ నుంచి ఇంకా ఎటువంటి స్పందన లేదు. ఇంటర్నెట్లో డేటా లీక్‌ల కేసులు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు నవంబర్‌లో ఆన్లైన్ గ్రోసరీ స్టోర్ హ్యాకర్ల లక్ష్యంగా మారింది. సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుల ప్రకారం, బిగ్‌బాస్కెట్ వినియోగదారుల యొక్క పూర్తి పేర్లు, ఇమెయిల్ ఐడిలు, పాస్వర్డ్ హాష్లు, కాంటాక్ట్ నంబర్లు, చిరునామాలు వంటివి హ్యాకర్ల చేతికి చిక్కడంతో డార్క్ వెబ్‌లో బహిర్గతమయ్యాయి. బిగ్‌బాస్కెట్ యూజర్ల డేటాను హ్యాకర్లు సుమారు 30 లక్షల రూపాయలకు అమ్మారు. -
అమ్మకానికి 13 లక్షల పేమెంట్ కార్డుల డేటా
న్యూఢిల్లీ: భారతీయులకు చెందిన 13 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు డార్క్ వెబ్ అనే హ్యాకర్ల వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని హ్యాకర్లు ఓపెన్ సేల్‌లో ఉంచారు. ఈ కార్డుల్లో ఉన్న మొత్తం డబ్బు విలువ రూ. 922 కోట్లు కాగా ఒక్కో కార్డును దాదాపు రూ. 7వేలకు విక్రయిస్తున్నట్లుగా వెబ్సైట్లో ఉంచారు. డార్క్ వెబ్‌లోని జోకర్స్ స్టాష్‌లో వీటిని అందుబాటులో ఉంచారు. కార్డుల వివరాలను ఏదైనా ఏటీఎం నుంచిగానీ లేదా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్ల ద్వారా సేకరించి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కార్డులకు ఉండే మాగ్నటిక్ స్ట్రిప్‌లో వినియోగదారుడి వివరాలుంటాయి. వాటిని క్లోన్ చేయడం ద్వారా హ్యాకర్లు అకౌంట్లపై దాడి చేసే చాన్సుంది. గత జనవరిలో హ్యాకర్లు ఇలాగే 21 లక్షల అమెరికన్ కార్డుల వివరాలు హ్యాక్ చేసి ఓపెన్ సేల్‌లో ఉంచారు. -
షాకింగ్: వేలాది పీఎన్బీ కార్డుల డేటా లీక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంగా నిలిచిని పంజాబ్నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో మరిన్ని షాకింగ్ విషయాలు తాజాగా వెలుగు చూశాయి. పీఎన్బీకి చెందిన వేలాదిమంది వినియోగదారుల కార్డుల సమాచారం హ్యాకింగ్‌కు గురైనట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. కస్టమర్లకు చెందిన గోప్యమైన విషయాలు వెబ్సైట్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయనీ, కనీసం మూడు నెలలుగా ఈ పక్రియ కొనసాగుతున్నట్టు నివేదించింది. బెంగళూరులోని సింగపూర్-రిజిస్టర్డ్ కంపెనీ ఈ డేటీ చోరికి పాల్పడినట్టు హాంకాంగ్ ఆధారిత పత్రికనుటంకిస్తూ ఆసియా నెట్వర్క్ రిపోర్ట్ చేసింది దాదాపు పీఎన్బీకి చెందిన 10వేల వినియోగదారుల సమాచారం లీక్ అయినట్టు తెలిపింది. ఇది గూగుల్ లాంటి ఇతర సెర్చ్ సైట్లలో ఇది కనిపించదనీ, కానీ చట్టవిరుద్ధంగా సున్నితమైన సమాచారం, కొనుగోలు, విక్రయాలు చేస్తాయని క్లౌడ్ సెక్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టెక్ అధికారి రాహుల్ శశి తెలిపారు. సీవీవీ సహా పేర్లు, గడువు తేదీలు, వ్యక్తిగత గుర్తింపు సంఖ్యలు , కార్డ్ ధృవీకరణ ఇతర డేటా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయన్నారు. ఇలా రెండు సెట్ల డేటా అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. సీవీవీ నెంబర్‌తో సహా కొందరివి, లేకుండా కొంత డేటా బహిర్గమైందన్నారు. డేటాలో చివరి స్టాంపు తేదీ జనవరి 29, 2018 ఉందనీ, అంటే ఇప్పటికీ వేలసంఖ్యలో పీఎన్బీ డేటా వారికి అందుబాటులో ఉన్నట్టుగా భావించాలన్నారు. మరోవైపు దీన్ని ధృవీకరించిన పీఎన్బీ అధికారి విర్వానీ..దీనిపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. దీంతో పీఎన్బీ కార్డుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. -
మాజీ బాస్‌కు టోపీ.. రూ. 3 లక్షల షాపింగ్!
మాజీ బాస్ డెబిట్ కార్డు సమాచారం మొత్తాన్ని దొంగిలించి.. దాంతో ఏకంగా రూ. 3 లక్షల వరకు ఆన్లైన్ షాపింగ్ చేసిన ప్రబుద్ధుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అతడు కొన్నవాటిలో దాదాపు రూ. 1.50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో.. ఈ-కామర్స్ వెబ్సైట్లు కూడా అతడు ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ ఇవ్వకుండా ఆపేసి.. ఆ డబ్బును సదరు అకౌంటుకు తిప్పి పంపుతున్నాయి. తన ఖాతాలోంచి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు దాదాపు రూ. 3 లక్షల మేర ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు అకౌంటు బ్యాలెన్స్‌లో ఉందని శాంతినగర్ కాలనీలోని స్నిపర్ ఎలక్ట్రానిక్స్ అధినేత ఖాజా సల్మాన్ వాసిఫ్ పోలీసులకు ఈనెల 6వ తేదీన ఫిర్యాదుచేశారు. అయితే అసలు తాను ఆన్లైన్లో ఏమీ కొనలేదని, డెబిట్ కార్డు కూడా తన దగ్గరే ఉందని చెప్పారు. దాంతో సీసీఎస్‌లోని సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కామర్స్ వెబ్సైట్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం నిందితుడి మొబైల్ నెంబరు, అతడికి వస్తువులు డెలివరీ చేసిన చిరునామా పట్టుకున్నారు. అతడి మొబైల్ సిగ్నల్ శంకర్‌పల్లిలో ట్రేస్ అయింది. వాటి ద్వారా నిందితుడు శ్రీకాంత్ రెడ్డి (19)ని అరెస్టు చేశారు. శ్రీకాంత్ రెడ్డి స్నైపర్ ఎలక్ట్రానిక్స్‌లో ఆఫీస్ బోయ్‌గా పనిచేసేవాడు. యజమాని డెబిట్ కార్డు నెంబరు, సీవీవీ నెంబరు, ఎక్స్పైరీ డేట్ లాంటివాటిని జాగ్రత్తగా రాసుకుని, 2015 డిసెంబర్లో ఉద్యోగం మానేశాడు. తర్వాత ఫ్లిప్‌కార్ట్, ఎమెజాన్, మైంత్రా, జబాంగ్, జాపర్, షాప్‌క్లూస్ లాంటి ఈ కామర్స్ యాప్‌లను తన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఇక తన మాజీ బాస్ డెబిట్ కార్డుతో ఎడాపెడా కొనుగోళ్లు మొదలుపెట్టాడు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి తన పేరు, చిరునామా తప్పుగా ఇచ్చాడు. డెలివరీ బోయ్ కాల్ చేయగానే తానే స్వయంగా వెళ్లి వాటిని తీసుకునేవాడు. అయితే ఫోన్ నెంబరు మాత్రం అదే ఉండటంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు.