సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంగా నిలిచిని పంజాబ్‌నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో మరిన్ని షాకింగ్ విషయాలు తాజాగా వెలుగు చూశాయి. పీఎన్‌బీకి చెందిన వేలాదిమంది వినియోగదారుల కార్డుల సమాచారం హ్యాకింగ్‌కు గురైనట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. కస్టమర్లకు చెందిన గోప్యమైన విషయాలు వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయనీ, కనీసం మూడు నెలలుగా ఈ పక్రియ కొనసాగుతున్నట్టు నివేదించింది.
బెంగళూరులోని సింగపూర్-రిజిస్టర్డ్ కంపెనీ ఈ డేటీ చోరికి పాల్పడినట్టు హాంకాంగ్ ఆధారిత పత్రికనుటంకిస్తూ ఆసియా నెట్‌వర్క్ రిపోర్ట్ చేసింది దాదాపు పీఎన్‌బీకి చెందిన 10వేల వినియోగదారుల సమాచారం లీక్ అయినట్టు తెలిపింది. ఇది గూగుల్ లాంటి ఇతర సెర్చ్ సైట్లలో ఇది కనిపించదనీ, కానీ చట్టవిరుద్ధంగా సున్నితమైన సమాచారం, కొనుగోలు, విక్రయాలు చేస్తాయని క్లౌడ్ సెక్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టెక్ అధికారి రాహుల్ శశి తెలిపారు. సీవీవీ సహా పేర్లు, గడువు తేదీలు, వ్యక్తిగత గుర్తింపు సంఖ్యలు , కార్డ్ ధృవీకరణ ఇతర డేటా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయన్నారు. ఇలా రెండు సెట్ల డేటా అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. సీవీవీ నెంబర్‌తో సహా కొందరివి, లేకుండా కొంత డేటా బహిర్గమైందన్నారు. డేటాలో చివరి స్టాంపు తేదీ జనవరి 29, 2018 ఉందనీ, అంటే ఇప్పటికీ వేలసంఖ్యలో పీఎన్‌బీ డేటా వారికి అందుబాటులో ఉన్నట్టుగా భావించాలన్నారు. మరోవైపు దీన్ని ధృవీకరించిన పీఎన్‌బీ అధికారి విర్వానీ..దీనిపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. దీంతో పీఎన్‌బీ కార్డుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment