సాక్షి, హైదరాబాద్: నగరం కేంద్రంగా చోటు చేసుకున్న మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్‌లో సైబర్ నేరగాళ్లకు డార్క్ వెబ్ కలిసివచ్చింది. కేవలం ఇదొక్కటే కాదు అనేక సైబర్ నేరాలు చోటు చేసుకోవడానికి ఈ ఇంటర్‌నెట్ అథోజగత్తు కీలకంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే డార్క్ వెబ్‌పై పట్టు సాధించడానికి నగర పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నగరంతో పాటు ఇతర నగరాలు, వివిధ విభాగాలకు చెందిన అధికారులకు డార్క్‌వెబ్ సంబంధిత కేసుల దర్యాప్తుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అధీనంలో రాష్ట్ర పోలీసు అకాడెమీలో ఐదు రోజుల పాటు జరుగునున్న ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ప్రారంభించారు. లండన్‌కు చెందిన మాజీ పోలీసు అధికారి, సైబర్ సంబంధిత కేసుల దర్యాప్తు నిపుణుడు మార్క్ బెంట్లీ ఈ శిక్షణ ఇవ్వనున్నారు. హ్యాకింగ్ నుంచి లోన్ యాప్స్ వరకు మొత్తం 15 రకాలైన నేరాల దర్యాప్తుపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.
నగర సీపీ ఆనంద్ ప్రారంభోపన్యాసం చేస్తూ కేవలం సైబర్ నేరాలకే కాదు మాదకద్రవ్యాల దందాకు అసాంఘికశక్తులు డార్క్ వెబ్ వాడుతున్నట్లు నగర పోలీసులు పట్టుకున్న గ్యాంగ్స్ ద్వారా వెలుగులోకి వచి్చందని, ఈ నేపథ్యంలోనే దీని సంబంధిత కేసులపై ప్రతి అధికారికీ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment