awareness camp
-
హైదరాబాద్‌లో 100 రెస్టారెంట్ల సిబ్బందికి శిక్షణ
అమెరికన్ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ) హైదరాబాద్‌లో 100 రెస్టారెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ‘ఇండియా సహయోగ్ ప్రోగ్రామ్’ పేరుతో ఇప్పటికే 2021లో స్థానికంగా 100 రెస్టారెంట్లలో పని చేస్తున్న వారికి ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ కల్పించింది. తాజాగా మరో 100 రెస్టారెంట్లలోని సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.ఇండియా సహయోగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎంపిక చేసుకున్న రెస్టారెంట్లలోని సిబ్బందికి ఆహార భద్రత, పరిశుభ్రత, కస్టమర్ సర్వీస్, లాభదాయకత..వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీనివల్ల స్థానిక రెస్టారెంట్లు వృద్ధి చెందడంతోపాటు కస్టమర్లకు మెరుగైన ఆహారం, సేవలందేలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, గౌహతి, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో దాదాపు 800 రెస్టారెంట్లలో సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా కేఎఫ్‌సీ ఇండియా, పార్టనర్ కంట్రీస్ జనరల్ మేనేజర్ మోక్ష్ చోప్రా మాట్లాడుతూ..‘ఆహార పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. మారుతున్న ట్రెండ్లు, కస్టమర్ ప్రాధాన్యతలు, వారి డిమాండ్లకు అనుగుణంగా సర్వీస్ అందించడం చాలా ముఖ్యం. ఇండియా సహయోగ్ కార్యక్రమంలో భాగంగా 2024 నాటికి దేశవ్యాప్తంగా 1000 రెస్టారెంట్లకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ కార్యక్రమం నిర్వహణకు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ), ఎఫ్ఎస్ఎస్ఏఐకు చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ (ఎఫ్‌ఓఎస్‌టీఏసీ) ప్రోగ్రామ్ అధికారులతో కలిసి పని చేస్తున్నాం. హైదరాబాద్‌లో ఈ ప్రోగ్రామ్ కింద 2021లో 100 రెస్టారెంట్లకు శిక్షణ ఇచ్చాం. తాజాగా మరో 100 రెస్టారెంట్లలోని సిబ్బందికి అవగాహన కల్పించనున్నాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: ఏళ్లు గడిచినా గతం గుర్తుండేలా.. కొత్త పరికరం ఆవిష్కరణతెలంగాణ ఆహార భద్రత కమిషనర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ..‘ఆహార భద్రత, పరిశుభ్రతకు వినియోగదారులు పెద్దపీట వేస్తున్నారు. పట్టణ ఆర్థిక వ్యవస్థలో స్థానిక రెస్టారెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆహార భద్రత విషయంలో ప్రతి రెస్టారెంట్ యాజమాన్యం సరైన నాణ్యతాప్రమాణాలు పాటించాలి. ఈమేరకు స్థానిక రెస్టారెంట్ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న కేఎఫ్‌సీ ప్రయత్నాలు అభినందనీయం’ అన్నారు. ఆహార భద్రత పరిశ్రమ వృద్ధికి ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) మద్దతుగా ఉంటుందని సంస్థ ప్రెసిడెంట్ సురేష్ సింఘాల్ తెలిపారు. -
అందుబాటులో ఉచిత న్యాయ సేవలు.. సద్వినియోగ పరుచుకోండి
గద్వాల క్రైం: ప్రతి పౌరుడికి ఉచిత న్యాయ సేవలను అందించాలనే లక్ష్యంతో లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ అమల్లోకి వచ్చిందని జిల్లా జడ్జి కుషా అన్నారు. గురువారం లీగల్ సర్వీస్ డే సందర్భంగా కోర్టు ఆవరణలో జాతీయ లీగల్ సర్వీస్ డే కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. సమస్యలు వచ్చినప్పుడు కోర్టు ద్వారా పరిష్కారం చేసుకునే క్రమంలో లాయర్లకు ఫీజులు చెల్లించలేని వారికి లీగల్ సర్వీస్ చేయూత అందిస్తుందన్నారు. ఉచితంగా న్యాయం పొందగలిగే విధానాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, మహిళలు, పిల్లలు, లైంగిక దాడులు, కిడ్నాప్, వరకట్న వేధింపులు, మానసిక – శారీరక హింస మొదలైన వాటి నుంచి న్యాయం పొందడానికి లీగల్ సర్వీస్ సెల్‌ను ఆశ్రయించవచన్నారు. ప్రస్తుతం యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులవుతున్నారని, ఈ క్రమంలో పాఠశాల, కళాశాల యాజమాన్యులతో లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలు సైతం చేపట్టామన్నారు. చట్ట పరిధిలోని ప్రతి సమస్యలకు ఉచితంగా న్యాయం అందించడమే లీగల్ సర్వీస్ డే ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో జడ్జిలు కవిత, ఉదయ్‌నాయక్ కోర్టు సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. చట్టాలపై అవగాహన అవసరం అలంపూర్: అట్టడుగు, వెనకబడిన పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే నేష్నల్ లీగల్ సర్వీస్ అధారిటీ లక్ష్యమని, ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జీ కమలాపురం కవిత అన్నారు. అలంపూర్‌లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డే గురువారం నిర్వహించారు.ఈ సమావేశానికి జడ్జీ కమలాపురం కవిత ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఏడాది నవంబర్ 9వ తేదిన నేషనల్ లీగల్ సర్వీసెస్ డేను నిర్వహించడం జరుగుతుందన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీతో వెనకబడిన పేద, అట్టడుగు వర్గాలకు ఉచిత న్యాయం, న్యాయ సేవలను అందించడం ముఖ్య ఉద్దేశమన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన సమానత్వం, సామాజిక న్యాయం ప్రాథమిక సూత్రాలను సమర్థిస్తుందన్నారు. కొందరికి న్యాయం ప్రత్యేక హక్కుగా కాకుండా అందరికి సమానమైన హక్కుగా వర్తిస్తోందన్నారు. కార్యక్రమంలో ఏజీపీ నరసింహులు, న్యాయవాదులు రాజేశ్వరి, సురేష్ కుమార్, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, ఆంజనేయులు, కిషన్ రావు, సాయితేజ ఉన్నారు. -
నేరగాళ్లుకు కలిసోచ్చే వెబ్... పట్టు కోసం కసరత్తులు చేస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నగరం కేంద్రంగా చోటు చేసుకున్న మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్‌లో సైబర్ నేరగాళ్లకు డార్క్ వెబ్ కలిసివచ్చింది. కేవలం ఇదొక్కటే కాదు అనేక సైబర్ నేరాలు చోటు చేసుకోవడానికి ఈ ఇంటర్నెట్ అథోజగత్తు కీలకంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే డార్క్ వెబ్‌పై పట్టు సాధించడానికి నగర పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నగరంతో పాటు ఇతర నగరాలు, వివిధ విభాగాలకు చెందిన అధికారులకు డార్క్‌వెబ్ సంబంధిత కేసుల దర్యాప్తుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అధీనంలో రాష్ట్ర పోలీసు అకాడెమీలో ఐదు రోజుల పాటు జరుగునున్న ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ప్రారంభించారు. లండన్‌కు చెందిన మాజీ పోలీసు అధికారి, సైబర్ సంబంధిత కేసుల దర్యాప్తు నిపుణుడు మార్క్ బెంట్లీ ఈ శిక్షణ ఇవ్వనున్నారు. హ్యాకింగ్ నుంచి లోన్ యాప్స్ వరకు మొత్తం 15 రకాలైన నేరాల దర్యాప్తుపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. నగర సీపీ ఆనంద్ ప్రారంభోపన్యాసం చేస్తూ కేవలం సైబర్ నేరాలకే కాదు మాదకద్రవ్యాల దందాకు అసాంఘికశక్తులు డార్క్ వెబ్ వాడుతున్నట్లు నగర పోలీసులు పట్టుకున్న గ్యాంగ్స్ ద్వారా వెలుగులోకి వచి్చందని, ఈ నేపథ్యంలోనే దీని సంబంధిత కేసులపై ప్రతి అధికారికీ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. (చదవండి: నిలువు దోపిడీ! కారు ధరలకు చేరువగా ఆటో రిక్షాలు) -
ఫోర్త్ వేవ్‌లో అనవసర ఆంక్షలు ఉండవు
బనశంకరి: కోవిడ్ నాలుగో దాడి పేరుతో అనవసరంగా ఎలాంటి ఆంక్షల్ని విధించరాదని, అవసరమైనంత వరకే నిబంధనలు ఉండాలని ప్రధాని మోదీ సూచించారు, ఆ మేరకు రాష్ట్రంలో చర్యలు తీసుకున్నామని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. బుధవారం నివాస కార్యాలయమైన కృష్ణాలో విలేకరులతో మాట్లాడారు. ప్రధానితో జరిగిన సీఎంల వీడియో సమావేశంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి గురించి చర్చించాను. రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా నియంత్రణలో ఉంది. ఈ నెల 9 తరువాత బెంగళూరులో పాజిటివ్ రేటు పెరిగింది అని చెప్పారు. ప్రతిరోజు 30 వేల కోవిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 వేలకు పైగా పడకలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షకు పైగా బెడ్లు అందుబాటులో ఉన్నాయి, ఆక్సిజన్‌ను సిద్ధం చేశామన్నారు. 12 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయడానికి కేంద్రం అనుమతించిందన్నారు. ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని, అలాగే వసతులను పెంచాల్సి ఉందన్నారు. జూన్ మొదటివారం నుంచి కేసులు పెరగవచ్చు కరోనా కేసులు పెరిగితే లాక్‌డౌన్‌తో పాటు కొన్ని కఠిన నియమాలను తెస్తారనే వార్తలను ఆరోగ్య మంత్రి సుధాకర్ తిరస్కరించారు. జూన్ మొదటి వారంలో కోవిడ్ వేవ్ రావచ్చునని నిపుణులు తెలిపారు, ముందు జాగ్రత్తలు చేపట్టామన్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోస్ వేస్తామని, 18 ఏళ్లు దాటినవారు వారికి రెండోడోస్ తీసుకున్న 9 నెలల తరువాత మూడో టీకాను వేసుకోవచ్చన్నారు. కోవిడ్ కాంట్రాక్టు వైద్య సిబ్బంది సేవలను 18 నెలల వరకు పొడించాలని ఆర్థికశాఖను కోరినట్లు తెలిపారు. నాలుగో వేవ్‌కు బీబీఎంపీ సిద్ధం కోవిడ్ నాలుగో వేవ్ పంజా విసిరితే సమర్థంగా ఎదుర్కొనేందుకు బీబీఎంపీ సిద్ధమైంది. సిబ్బంది, ఆరోగ్యచికిత్స పరికరాలను సమకూర్చుకోవడంలో పాలికె అధికారులు నిమగ్నమయ్యారు. బెంగళూరులో నిత్యం 60 నుంచి 80 కేసులు వెలుగుచూస్తున్నాయి. బెళందూరు, గసంద్ర, కోరమంగల, హెచ్ఎస్ఆర్.లేఔట్, వర్తూరు, హూడి, కాడుగోడితోపాటు మొత్తం 10 వార్డుల్లో కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ చికిత్సకు నాలుగు ఆసుపత్రుల్లో 1,365 సాధారణ పడకలు, ఐసీయు, వెంటిలేటర్ తో పాటు మొత్తం 2392 పడకలు సిద్ధం చేశారు. కరోనా వ్యాక్సిన్ రెండోడోస్ వేసుకోనివారి ఆచూకీ కనిపెట్టి పోలీసుల సాయంతో వారి ఇళ్ల వద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేయాలని యోచిస్తున్నారు. 60 ఏళ్లు లోపు వారికి బూస్టర్ డోస్ అందించడం పట్ల సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్ విరుచుకుపడితే అధికంగా నష్టపోయేది బెంగళూరేనని మూడుసార్లు స్పష్టమైంది. (చదవండి: ఫోర్త్ వేవ్ ముప్పు తప్పదంటున్న నిపుణులు..) -
అవగాహన అభాసుపాలు
గుంటూరు, ప్రత్తిపాడు: ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందంటూ రాజకీయ పక్షాల గగ్గోలు ఒకవైపు, ఒకరికి ఓటు వేస్తే వేరొకరికి ఓటు పడుతుందంటా అంటూ ఓటర్లలోనూ, ప్రజల్లోనూ అపోహ ఉంది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ నడుం బిగించింది. ప్రజల్లోనూ, రాజకీయపక్షాల్లోనూ అనుమానాల్ని పటాపంచలు చేసేందుకు ప్రణాళిక రచించింది. ఈవీఎంల పనితీరు, వీవీప్యాట్ల వినియోగం, ఎన్నికల సరళి, ఓటు హక్కు వినియోగించుకునే పద్ధతిపై ఓటర్లకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం పూనుకుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో ప్రతి గ్రామంలోని పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లకు వీవీప్యాట్లు, ఈవీఎంలపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. కానీ, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు, ఆశయాలకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం గండి కొడుతోంది. ఫలితంగా పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న నమూనా పోలింగ్ కార్యక్రమంలో ఓటర్ల భాగస్వామ్యం తగ్గిపోతోంది. అవగాహన ఇలా.. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై ఓటర్లుకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే మండలస్థాయిలో కొందరు అధికారులకు జిల్లా కేంద్రంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరు ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పోలింగ్‌బూత్‌ల వద్ద అందుబాటులో ఉండి ఓటర్లతో ఈవీఎం ద్వారా ఓటు వేయించి అవగాహన కల్పిస్తారు. వారు ఈవీఎంలో ఏ నంబరులో ఓటు వేశారు (మీట నొక్కారు)? వీవీప్యాట్‌లో ఏ నంబరు కనిపిస్తుంది? ఓటు వేసిన నంబరే వస్తుందా? లేక వేరేదయినా నంబరు కనిపిస్తుందా? వంటి వాటిపై సమగ్రంగా అవగాహన కల్పిస్తారు. రెవెన్యూ యంత్రాంగంలో అలసత్వం ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమంపై స్థానిక రెవెన్యూ యంత్రాంగం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్దకు వచ్చేలా ప్రచారం కల్పించడంలో విఫలమవుతోంది. గ్రామంలోని ఫలానా బూత్ వద్ద నమూనా ఓటింగ్ జరుగుతుందంటూ ముందస్తుగా గ్రామంలో అందుబాటులో ఉన్న ప్రచార సాధనాల ద్వారా విస్తృత ప్రచారం చేయిస్తే సానుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎక్కువ మంది బూత్‌ల వద్దకు వెళ్లి నమూనా ఓటింగ్‌లో పాల్గొనే వీలు ఉంటుంది. కానీ, రెవెన్యూ అధికారులు ఆదిశగా అడుగులు వెయ్యడం లేదు. పోలింగ్ బూత్‌ల వద్ద అందుబాటులో ఉన్న ఐదు పది మందిని పిలిచి ఫోటోలు దిగి పంపించి వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అవగాహన కార్యక్రమం అభాసుపాలవుతోంది. గురువారం ప్రత్తిపాడులోని భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన నమూనా పోలింగ్‌పై ప్రజలకు కనీస అవగాహన కూడా లేకపోవడంతో వెలవెలబోయింది. సంబంధిత కార్యక్రమంపై అధికారులు రూపొందించిన యాక్షన్ ప్లాన్ సైతం బయటకు పొక్కకుండా తహసీల్దార్ చర్యలు తీసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమ పరిసరాల్లో బీఎల్వోల జాడలే కనిపించడంలేదు. అవగాహన కార్యక్రమాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం ఆ దిశగా అడుగులు వెయ్యకపోవడంతో ఎన్నికల కమిషన్ ఉద్దేశం నీరుగారిపోతుంది. -
ఖర్జూరం ప్రత్యామ్నాయం
భూ నైసర్గిక స్వరూపంతో పాటు సాగునీటి వనరుల దృష్ణ్యా మెట్ట ప్రాంత రైతులకు నిమ్మసాగు అనివార్యమైంది. ధరల ఆటు పోటులతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా.. ఈ భూముల్లో ప్రత్యామ్నాయ దీర్ఘకాలిక పంట మరొకటి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఖర్జూరం సాగుకు ఈ ప్రాంత భూములు అనుకూలమేనని వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. దీంతో నిమ్మ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖర్జూరం సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తే సిరులు పండించవచ్చు. గూడూరు (నెల్లూరు): జిల్లాలోని మెట్ట ప్రాంత మండలాలైన గూడూరు, చిల్లకూరు, సైదాపురం, డక్కిలి, ఓజిలి, బాలాయపల్లి, వెంకటగిరి, పొదలకూరు, రాపూరు, చేజర్ల తదితర మండలాల్లో ప్రస్తుతం సుమారు 25 వేల హెక్టార్లలో నిమ్మ పంట సాగవుతోంది. నిమ్మ సాగు చేయాలంటే ఫలసాయం కోసం నాలుగు నుంచి ఐదేళ్ల పాటు వేచి చూడాల్సి వస్తుంది. ఈ క్రమంలో సాగు చేసి, కాపుకొచ్చే సమయంలో ధరలు ఉండక రైతులు అప్పులపావుతున్నారు. కానీ ఈ ప్రాంతాల్లో నీటి వనరులు, భూముల పరిస్థితిని బట్టి ప్రత్యామ్నాయ పంటలు లేక నిమ్మ సాగే అనివార్యమైంది. ఇదే నీటి వనరులు ఉన్న కరువు సీమలైన ఏపీలోని కర్నూలు, తెలంగాణలోని నల్గొండ జిల్లాల్లోని ఎందుకూ, ఏ పంట సాగుకూ పనికిరాని చవుడు భూముల్లో సైతం ఎడారి పంటగా పేరున్న ఖర్జూరం సాగు చేస్తూ రైతులు లాభాల బాటన నడుస్తున్నారు. పెట్టుబడులు అధికమే.. నాలుగేళ్లకే దిగుబడులు నిమ్మ పంటతో పోల్చితే ఖర్జూరం కూడా ఫలసాయం సమయం దాదాపు సమానంగానే ఉంది. టిష్యూ రకం నిమ్మ మొలక సుమారు రూ.10 మాత్రమే ఉంటుంది. కానీ ఖర్జూరం మొక్క అయితే మాత్రం టిష్యూ రకం ఒక్కొక్కటి రూ.3 వేల నుంచి రూ.3,500 వరకూ ఉంటుంది. అదే తరహాలో ఫల సాయం కూడా వస్తున్నట్లు సాగు చేసిన రైతులు చెబుతున్నారు. మొక్కల కొనుగోలుతో పాటు భూమిని చదును చేయడం, డ్రిప్, ఎరువులు, కూలీలు ఇతర ఖర్చులకు ప్రారంభంలో ఎకరాకు రూ.5 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. రెండో సంవత్సరం నుంచి కూడా ఏడాదికి ఎకరానికి సుమారు రూ. లక్ష లోపే ఉంటుంది. నాటిన నాలుగో సంవత్సరం నుంచి ఖర్జూర పంట దిగుబడులు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి కూడా ఎకరానికి ఏడాదికి సుమారు రూ. 4 లక్షలకు పైగానే ఆదాయం 40 నుంచి 50 ఏళ్ల వరకూ ఫలసాయం అందుకోవచ్చని సాగు చేస్తున్న రైతులే అంటున్నారు. ఎకరానికి 60 నుంచి 80 వరకూ మొక్కలు నాటాలి. వాటిలో కనీసం 10 నుంచి 12 మగ ఖర్జూరం మొక్కలుండేలా చూసుకోవాల్సి ఉంది. మూడేళ్ల పాటు జాగ్రత్తగా మొక్కలను నాలుగో ఏట కాపునకు వస్తాయి. ఫిబ్రవరి 15వ తేదీ పైన, మార్చి 15వ తేదీ లోపుగా చెట్లు పూత దశకు వస్తాయి. ఈ క్రమంలో పూతకు నెల ముందుగా నీటిని పెట్టకుండా ఆపేయాలి. అప్పుడే వాడి పూత ఎక్కువగా పూసే వీలుంటుంది. టన్ను ఖర్జూరం రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఎకరం ఖర్జూరం సాగు చేస్తే నాలుగో సంవత్సరం నుంచి ఎకరానికి కనిష్టంగా 3.5 టన్నుల నుంచి గరిష్టంగా 5 టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. దీంతో ఫల సాయం సుమారు ఎకరానికి రూ.4 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్జూరం సాగు చేస్తే హెక్టారుకు రూ. 2 లక్షల రాయితీ ఇస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. చవుడు భూములు ఖర్జూరం సాగుకు అనువే నల్గొండ ప్రాంతంలో ఎందుకూ పనికిరాని చవుడు భూముల్లో కూడా ఖర్జూరం సాగు చేసి రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. చవుడు భూముల్లో ఈత మొక్కలు మొలిచి ఉండడాన్ని గుర్తించిన రైతు, అక్కడి రైతులు కూడా విస్మయం చెందేలా ఫలసాయాన్ని పొందుతూ లాభాల బాటలో పయనిస్తున్నారు. అవగాహన కల్పిస్తే మంచిది నేను 3 ఎకరాల్లో నిమ్మ తోట సాగుచేస్తున్నా. ఈ ఏడాది పెట్టుబడి, నీటి వసతి కోసం బోర్లు వేసేందుకు ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ఈ ఏడాది రూ.2 లక్షల వరకూ నష్టపోయా. అవగాహన కల్పించి సాగుకు రాయితీలు ఇస్తే ఖర్జూరం సాగు చేస్తాం. – ఎన్.పెంచలయ్య, రైతు, అక్కమాంబాపురం, రాపూరు మండలం ప్రత్యామ్నాయ పంటలే దిక్కు నిమ్మ తోటలకు ప్రత్యామ్నాయ పంట వస్తే నిమ్మ రైతులందరూ ముందుకొస్తారు. మెట్ట ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉంది. ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సాహం అందిస్తే ఖర్జూరం వంటి పంటలు సాగు చేపడుతాం. – కె.పెంచలనరసయ్య, రైతు, చీకవోలు, సైదాపురం మండలం ప్రోత్సాహం అందిస్తే సాగు చేస్తాం డ్రిప్‌కు రాయితీతో పాటు, బోర్లు వేయడంతో పాటు, ఇతర ఖర్చులకు కూడా ప్రభుత్వం రుణాలు అందజేస్తే ఖర్జూరం సాగుకు సిద్ధమవుతాం. ప్రయోగం చేయాలంటే అది ముందుగా ఉద్యాన శాఖ ద్వారా జరిగితేనే మంచిది. – జి.భాస్కర్‌రెడ్డి, రైతు, వెడిచర్ల గూడూరు మండలం సాగుకు సిద్ధమైతే రాయితీకి ప్రతిపాదనలు జిల్లాలోని భూములు కూడా ఖర్జూరానికి అనువైనవే. ఎవరైనా రైతులు ఖర్జూరం సాగు చేసేందుకు సంసిద్ధమైతే రాయితీకి ప్రతిపాదనలు పంపుతాం. రైతులు ముందుకు వస్తే శాఖా పరమైన సహకారం అందజేస్తాం. – అనురాధ, ఉద్యాన శాఖ ఏడీ -
విదేశీ కార్మికులకు క్షమాభిక్ష
దుబాయ్: గడువు తీరిన తర్వాత దేశంలో నివసిస్తూ పట్టుబడిన కార్మికులకు యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ఇందులో భాగంగా 3 నెలల క్షమాభిక్ష కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న లక్షల మంది భారతీయులు సహా విదేశీ కార్మికులకు ఇది లబ్ధిచేకూర్చనుంది. ఈ కార్యక్రమం ద్వారా జరిమానాల్లేకుండా దేశం విడిచి వెళ్లడం లేదా ఆర్నెల్లలో ఉద్యోగం వెతుక్కునే చాన్సుంటుంది. యూఏఈ అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలో 28లక్షల మంది భారతీయ వలసదారులున్నారు. ఇందులో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు 15–20% కాగా, 20 శాతం మంది వివిధ ఉద్యోగాల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. మిగిలిన 65% మంది వివిధ పరిశ్రమల్లో కార్మికులు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు క్షమాభిక్ష అమల్లో ఉంటుందని ఈ మధ్యలోనే అక్రమంగా ఉంటున్న వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని యూఏఈ గుర్తింపు, పౌరసత్వ సంస్థ స్పష్టం చేసింది. ఈ దిశగా దేశ వ్యాప్తంగా కమ్యూనిటీ సెంటర్లు, వివిధ బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కేంద్రాలను ఏర్పాటుచేశారు. బుధవారం ముగ్గురు భారతీయులు అబుదాబిలోని బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సెంటర్లో క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. తొలిరోజే కావడంతో సంఖ్య పలుచగా ఉందని.. రానున్న రోజుల్లో మరింత మంది రావొచ్చని భావిస్తున్నారు. యూఏఈలో ఉన్న భారత కార్మికుల్లో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారే ఉన్నారు. ‘క్షమాభిక్ష గురించి సమాచారం తెలిసింది. స్వామి అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఏ1 ఆమ్నెస్టీ సెంటర్లో దరఖాస్తు చేసుకున్నారు. యూఏఈలో యజమాని.. భారత్‌లో ఉన్న తన కుటుంబసభ్యులతో మాట్లాడనివ్వనందునే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని లక్ష్మీదేవి రెడ్డి అనే మహిళ పేర్కొన్నారు. జూన్‌లోనే తన ఔట్‌పాస్ గడువు ముగిసిందని ఆమె తెలిపారు. యజమాని తనపై కేసు వేసినందున పోలీసు క్లియరెన్స్ రాలేదని.. మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆమె చెప్పారు. -
రాయగడలో లీగల్ సర్వీసెస్ అవగాహన శిబిరం
పర్లాకిమిడి : స్థానిక నవజీవన్ అంధ, అనాథ బాలబాలికల కేంద్రంలో జిల్లా న్యాయసలహా అథారిటీ తరఫున శుక్రవారం చైతన్య శిబిరం ఏర్పాటు చేశా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గజపతి జిల్లా జడ్జి, న్యాయ సలహా అథారిటీ అధ్యక్షుడు దుర్గాశంకరమిశ్రా హాజరై బాలబాలికలకు పీసీ, పీఎన్డీటీ చట్టం 1994 గురించి తెలియజేశారు. సన్మానిత అతిథిగా జిల్లా శిశుసంక్షేమ ప్రొటెక్షన్ అధికారి అరుణ్ కుమార్ సాహు పాల్గొని బాలబా లికలకు విభిన్న చట్టాలపై అవగాహన కల్పించా రు. ప్రాధికరణ కార్యదర్శి దీపా దాస్ అనాథబాలబాలికలకు ప్రభుత్వ సహాయం, పునరావాసం గురించి అవగాహన కల్పించారు. కోర్టు రిజిస్ట్రార్ సర్వేశ్వర్ దాస్, జిల్లా శిశుసురక్షా అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, సీడబ్ల్యూసీ చైర్మన్ వినోద్ జెన్నా, నవజీవన్ ట్రస్ట్ట్ ఇన్చార్జి ఎస్వీ రమణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీఎస్‌ఎన్‌రాజు, ఆర్.జనార్దన రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి నవజీవన్ ట్రస్ట్ విద్యార్థులకు రూ.ఇరవై వేల చెక్కును అందజేశారు. జిల్లా జడ్జి మిశ్రా ద్వారా నవజీవన్ ట్రస్ట్‌లో ఒక కంప్యూటర్ కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. -
‘ఒక్క ర్యాగింగ్ కేసు నమోదు కానివ్వం’
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేవలం రెండు ర్యాగింగ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వచ్చే సంవత్సరం ఒక్క ర్యాగింగ్ ఘటన చోటుచేసుకోకుండా పనిచేస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. కాలేజీలలో ర్యాగింగ్ రూపు మాపాలనే ఉద్దేశంతో బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం యాంటీ ర్యాంగింగ్ అవగాహనా కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాల యాజమాన్యాలు ర్యాగింగ్ నిర్మూలనపై, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. హైదరాబాద్ పోలీసులు, షీ టీమ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అడిషనల్ సీసీ షికా గోయల్, అన్ని జోన్ల డీసీపీలు, కాలేజీ రిజిస్ట్రార్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
17న రైతులకు అవగాహన: పోచారం
సాక్షి, హైదరాబాద్: వరి నాటే యంత్రాల పనితీరుపై ఈ నెల 17న రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతులకు ప్రదర్శన, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ ఉన్నతాధికారులతో శనివా రం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా పోచారం మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో కూలీల కొరత పెరుగుతోందన్నారు. దుక్కి దున్నడానికి ట్రాక్టర్లు, పంట నూర్పిడికి హార్వెస్టర్లను రైతులు విరివిగా వాడుతున్నారని చెప్పారు. రైతుల ఆసక్తికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ సబ్సిడీలతో ఆయా యం త్రాలను అందిస్తోందని తెలిపారు. వరి నాట్లు వేయడానికి, ఇతర పంటల విత్తనాలను విత్తే యంత్రాల ఉపయోగం ఇంకా పెరగలేదన్నారు. నాటు యంత్రాలతో కూలీల కొరత తీరడం, సమయానికి నాట్లు వేసుకోవడంతో పాటు రైతులకు ఖర్చులు తగ్గుతాయన్నారు. వ్యవసాయ వర్సిటీలో ప్రత్యేకంగా పెంచిన నారు ద్వారా వరి నాటే యంత్రాల పనితీరును కూడా రైతులకు చూపించాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది ప్రతి మండలానికి సుమారు పది వరి నాటే యంత్రాలను సబ్సిడీపై అందించాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ ఎం.జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ రైతు కావడం వల్లే ఇదంతా..!
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ముఖ్యమంత్రి స్వయానా రైతు కాబట్టి రైతుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుననీ, అందువల్లనే వారి కష్టాలు దూరం చేసేందుకు వ్యవసాయానికి కోతల్లేకుండా కరెంట్ ఇస్తున్నారని మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సర్దాపూర్‌లో జరిగిన రైతుబీమా అవగాహనా సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. లక్షలాది రైతు కుంటుంబాలకు రైతు బీమా పెద్ద భరోసా అని కేటీఆర్ అన్నారు. ‘సిరిసిల్ల అంటే నేతన్నల, రైతుల ఆత్మహత్యలతో కన్నీళ్లు తప్పితే, నీళ్లు తెలియని ప్రాంతంగా ఉండేది. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. మరో ఆరు నెలల్లో కాళేశ్వరం నీటితో జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు నీరందిస్తామ’ని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం లాభసాటిగా మారేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేటీఆర్ తెలిపారు. ప్రతి అయిదు వేల ఎకరాలకు ఒక విస్తరణాధికారి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2600 మందిని నియమించామనీ, రైతు బంధు పథకంతో 5700 కోట్ల రూపాయల లబ్ది రైతులకు చేకూర్చామని ఆయన వెల్లడించారు. రైతుబంధులో పక్షపాతం లేదు.. రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గానికి లక్ష ఎకరాల చొప్పున త్వరలో రెండు పంటలకు సాగునీరు అందిస్తామని మంత్రి పోచారం తెలిపారు. కోటి ఎకరాలకు నీరందించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబందు చెక్కులు అందించామని తెలిపారు. కుల, మత, పార్టీలలకు అతీతంగా నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు. -
టీడీఎస్‌పై అవగాహన సదస్సు
నెల్లూరు(వేదాయపాళెం) : నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో తిరుపతి ఆదాయపన్ను శాఖ అధికారులు టీడీఎస్‌పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. విజయవాడ ఆదాయ పన్నుశాఖ టీడీఎస్ అధికారి సత్యానంద మాట్లాడారు. జీతాలు, కాంట్రాక్ట్‌లు, ఇన్సూ్యరెన్స్‌లు, లాటరీలపై టీడీఎస్ పన్ను మినహాయింపు శాతాన్ని వివరించారు. టీడీఎస్ పన్నుల చెల్లింపు విషయంలో విజయవాడ ఆదాయ పన్నులశాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. అన్ని వర్గాల వారు సకాలంలో పన్నులు చెల్లించి టీడీఎస్ మినహాయింపు పొందాలన్నారు. టీడీఎస్‌కు పాన్, ట్యాన్, ఆధార్‌కార్డులతో అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఆదాయపన్నుల శాఖలోని వివిధ రాయితీలను వివరించారు. తిరుపతి ఆదాయ పన్నులశాఖ టీడీఎస్ విభాగం అధికారి ఎంవీ వేణుగోపాల్, నెల్లూరు ఆదాయ పన్నులశాఖ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆడిటర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులు, వివిధ శాఖల అధికారులు సదస్సులో పాల్గొన్నారు.