టీడీఎస్‌పై అవగాహన సదస్సు
నెల్లూరు(వేదాయపాళెం) : నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో తిరుపతి ఆదాయపన్ను శాఖ అధికారులు టీడీఎస్‌పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. విజయవాడ ఆదాయ పన్నుశాఖ టీడీఎస్ అధికారి సత్యానంద మాట్లాడారు. జీతాలు, కాంట్రాక్ట్‌లు, ఇన్సూ్యరెన్స్‌లు, లాటరీలపై టీడీఎస్ పన్ను మినహాయింపు శాతాన్ని వివరించారు. టీడీఎస్ పన్నుల చెల్లింపు విషయంలో విజయవాడ ఆదాయ పన్నులశాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. అన్ని వర్గాల వారు సకాలంలో పన్నులు చెల్లించి టీడీఎస్ మినహాయింపు పొందాలన్నారు. టీడీఎస్‌కు పాన్, ట్యాన్, ఆధార్‌కార్డులతో అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఆదాయపన్నుల శాఖలోని వివిధ రాయితీలను వివరించారు. తిరుపతి ఆదాయ పన్నులశాఖ టీడీఎస్ విభాగం అధికారి ఎంవీ వేణుగోపాల్, నెల్లూరు ఆదాయ పన్నులశాఖ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆడిటర్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులు, వివిధ శాఖల అధికారులు సదస్సులో పాల్గొన్నారు.