ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌లో టీడీఎస్‌కి కీలక మార్పులను ప్రకటించారు. సీనియర్ సిటిజన్‌లకు, ఇళ్లు, భవనాలపై అద్దె ఆదాయాన్ని పొందేవారికి భారీ ఊరట కల్పించారు. అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్ మినహాయింపు పరిమితిని రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచారు.
"ఇది టీడీఎస్ వర్తించే లావాదేవీల సంఖ్యను తగ్గిస్తుంది. తద్వారా చిన్న చెల్లింపులను స్వీకరించే చిన్న పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది" అని సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రేట్ల సంఖ్యను తగ్గించడం, పరిమితి మొత్తాలను పెంచడం ద్వారా టీడీఎస్ ఫ్రేమ్‌వర్క్‌ను సరళీకృతం చేసే ప్రణాళికలను కూడా ఆమె వివరించారు.
టీడీఎస్‌లో ప్రధాన మార్పులు ఇవే..
సీనియర్ సిటిజన్లకు పన్ను రహిత ఆదాయ పరిమితి రూ.50 వేల నుంచి రూ.1లక్షకు పెంపు
అద్దె ఆదాయంపై టీడీపీ పరిమితి వార్షికంగా రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంపు.
లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద చెల్లింపులపై వసూలు చేసే టీసీఎస్ పరిమితిని రూ.7 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంపు
పాన్ కార్డు లేని పన్ను చెల్లింపుదారులకు అధిక టీడీఎస్ నిబంధన వర్తిస్తుంది.
విద్యా రుణాల చెల్లింపులపై టీసీఎస్ పూర్తీగా తొలగింపు
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు
Comments
Please login to add a commentAdd a comment