అందరికీ అర్థమయ్యేలా.. ఆదాయ పన్ను చట్టం | Nirmala Sitharaman Said She Will Introduce New Income Tax Bill Next Week in Her Budget Speech | Sakshi
Sakshi News home page

అందరికీ అర్థమయ్యేలా.. ఆదాయ పన్ను చట్టం

Published Tue, Feb 4 2025 9:18 PM | Last Updated on Tue, Feb 4 2025 9:18 PM

Nirmala Sitharaman Said She Will Introduce New Income Tax Bill Next Week in Her Budget Speech

వచ్చే వారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో.. ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ తెలిపారు. కొత్త బిల్లు పన్ను చెల్లింపుదారులకు అర్ధమయ్యే విధంగా ఉంటుందని అన్నారు.

నిజానికి కేంద్ర ప్రభుత్వం జూలై 2024లో ఆదాయపు పన్ను చట్టానికి సంబందించిన సమగ్ర సమీక్షను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, చదవడానికి, అర్థం చేసుకోవడానికి సులభతరం చేయడమే దీని లక్ష్యం అని అప్పుడే వెల్లడించింది. పన్ను చెల్లింపులకు సంబంధించిన విషయాలు స్పష్టంగా ఉన్నప్పుడే.. చెల్లింపుదారులకు పన్ను ఖచ్చితత్వం లభిస్తుంది. కాబట్టి దీనిని త్వరగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

పన్ను చెల్లింపులకు సంబంధించిన విషయాల సరళీకృతం జరుగుతున్నప్పుడు.. కేపీఎంజీ జనవరి 2025లో పరిశ్రమ అభిప్రాయాలను మరియు అంచనాలను సంగ్రహించడానికి ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 200 కంటే ఎక్కువ మంది అభిప్రాయాలను పొందుపరిచారు. ఇందులో పారిశ్రామిక తయారీ, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, వినియోగదారుల మార్కెట్లు, మౌలిక సదుపాయాలు, ఎనర్జీ అండ్ నేచురల్ రీసోర్సెస్, సాంకేతికత, లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, ఫార్మా మొదలైన ఇతర రంగాలకు సంబంధించిన కార్యనిర్వాహకులు ఉన్నారు.

సర్వేలో తేల్చిన విషయాలు
➤సుమారు 84 శాతం మంది సరళీకరణ చాలా అవసరమని చెప్పారు. ఇందులో 30 శాతం కంటే ఎక్కువమంది లావాదేవీ వర్గాలను కవర్ చేసే టీడీఎస్ నిబంధనలను సరళీకృతం చేయాలని అన్నారు. మూలధన లాభాల పన్ను, వ్యాపార ఆదాయ గణన వంటి ఇతర అంశాలు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

➤96 శాతం మంది ప్రభుత్వం ప్రచురించిన ఆదాయపు పన్ను వ్యాఖ్యానాన్ని రూపొందించడానికి మద్దతు ఇస్తున్నారు. ఇది చాలా స్పష్టంగా ఉందని అంటున్నారు. పన్ను సర్క్యులర్‌లు లేదా నోటిఫికేషన్‌ల నుంచి ఇప్పటికే తీసుకున్న ప్రయోజనకరమైన స్పష్టీకరణలను ఆదాయపు పన్ను చట్టంలో నేరుగా చేర్చాలని కోరుకుంటున్నారు.

➤87 శాతం మంది తప్పనిసరి TDS సర్టిఫికేట్ జారీని తొలగించాలని అంటున్నారు. 61 శాతం మంది ఫేస్‌లెస్ ఇంటరాక్షన్‌లకు మద్దతు ఇస్తున్నారు. డివిడెండ్ పన్నులతో సహా అధిక ప్రభావవంతమైన పన్ను రేట్లను పేర్కొంటూ 58% మంది కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలని చెబుతున్నారు. 34 శాతం మంది ప్రస్తుత రేట్లు బాగానే ఉన్నాయని చెబుతున్నారు. 7 శాతం మంది నాన్ రెసిడెంట్ కంపెనీలకు మాత్రమే తగ్గింపులను కోరుకుంటున్నారని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement