కార్యక్రమంలో సీసీ అంజనీకుమార్ (ఎడమ వైపు)
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేవలం రెండు ర్యాగింగ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వచ్చే సంవత్సరం ఒక్క ర్యాగింగ్ ఘటన చోటుచేసుకోకుండా పనిచేస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. కాలేజీలలో ర్యాగింగ్ రూపు మాపాలనే ఉద్దేశంతో బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం యాంటీ ర్యాంగింగ్ అవగాహనా కార్యాక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాల యాజమాన్యాలు ర్యాగింగ్ నిర్మూలనపై, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. హైదరాబాద్ పోలీసులు, షీ టీమ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అడిషనల్ సీసీ షికా గోయల్, అన్ని జోన్‌ల డీసీపీలు, కాలేజీ రిజిస్ట్రార్‌లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment