Criminal Conspiracy
-
అతీక్ అహ్మద్ లాయర్‌కు మరో షాక్! ఫొటోలు షేర్ చేశాడని క్రిమినల్ కేసు
లక్నో: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ ఖాన్ సౌతల్ హనీఫ్పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఉమేష్ పాల్ ఫొటోలను ఇతను అతీక్ కుమారుడు అసద్‌కు పంపినట్లు తెలిపారు. ఆ మరునాడే ఉమేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. అసద్ మరికొందరితో కలిసి ఉమేష్‌ను ఇంటిబయటే కాల్చి చంపాడు. ఉమేశ్‌పాల్ హత్యకు సంబంధించి క్రిమినల్ కాన్స్పిరసీ అభియోగాలతో హానీఫ్‌పై సెక్షన్ 120-బీ కింద ధుమన్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీసీపీ దీపక్ భూకార్ వెల్లడించారు. ఉమేశ్ కిడ్నాప్ కేసుకు సంబంధించి హానీఫ్కు ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. ప్రస్తుతం నైని కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఫొటోల వ్యవహారానికి సంబంధించి ఇతడ్ని రిమాండ్ కోసం పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ కీలక సాక్షిగా ఉన్నాడు. ఇతడ్ని గతంలోనే ఓసారి కిడ్నాప్ చేసింది అతీక్ అహ్మద్ గ్యాంగ్. ఈ కేసులోనే హనీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 24న ఉమేశ్ పాల్‌ను అతని ఇంటి ఎదుటే అతీక్ కుమారుడు అసద్, మరికొందరు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు. అనంతరం పరారయ్యారు. అయితే ఏప్రిల్ 13న అసద్‌ను ఎన్కౌంటర్లో హతమార్చారు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆ తర్వాత రెండు రోజులకే అతని తండ్రి అతీక్ అహ్మద్ కూడా దారుణ హత్యకు గురయ్యాడు. ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి పరీక్షల కోసం తీసుకెళ్లిన అతనిపై పోలీసులు, మీడియా ఎదుటే ముగ్గురు యువకులు తుపాకులతో కాల్పులు జరిపి హతమార్చిన ఘటన సంచలనం రేపింది. చదవండి: వాళ్లు కన్పిస్తే కాల్చి పడేయాలి.. గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను పొగుడుతున్నవారిపై కేంద్రమంత్రి ఫైర్.. -
ఐపీఎస్ ఆఫీసర్‌పై పిటిషన్ దాఖలు చేసిన ధోని
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని.. ఐపీఎస్ ఆఫీసర్ జి. సంపత్ కుమార్‌పై మద్రాస్ హైకోర్టులో క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తి కలిగించింది. క్రికెట్ బెట్టింగ్ సహా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి హైకోర్టుకు సమర్పించిన లిఖితపూర్వక అఫిడవిట్లో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని ధోనీ ఆరోపించాడు. ధోని పిటిషన్ ప్రకారం.. 2014లో హైకోర్టులో సంపత్ కుమార్ దావా వేశారని.. గతంలో ఆయన చేసిన ఆరోపణలు తనకు పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నట్లు తెలిసింది. అందుకే ఐపీఎస్ సంపత్ కుమార్ సహా పలువురు అధికారులపై క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేసినట్లు ధోని తెలిపాడు. చదవండి: కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు.. 'కింగ్' కోహ్లి.. కరగని శిఖరం -
నేరగాళ్లుకు కలిసోచ్చే వెబ్... పట్టు కోసం కసరత్తులు చేస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నగరం కేంద్రంగా చోటు చేసుకున్న మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్‌లో సైబర్ నేరగాళ్లకు డార్క్ వెబ్ కలిసివచ్చింది. కేవలం ఇదొక్కటే కాదు అనేక సైబర్ నేరాలు చోటు చేసుకోవడానికి ఈ ఇంటర్నెట్ అథోజగత్తు కీలకంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే డార్క్ వెబ్‌పై పట్టు సాధించడానికి నగర పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నగరంతో పాటు ఇతర నగరాలు, వివిధ విభాగాలకు చెందిన అధికారులకు డార్క్‌వెబ్ సంబంధిత కేసుల దర్యాప్తుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అధీనంలో రాష్ట్ర పోలీసు అకాడెమీలో ఐదు రోజుల పాటు జరుగునున్న ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ప్రారంభించారు. లండన్‌కు చెందిన మాజీ పోలీసు అధికారి, సైబర్ సంబంధిత కేసుల దర్యాప్తు నిపుణుడు మార్క్ బెంట్లీ ఈ శిక్షణ ఇవ్వనున్నారు. హ్యాకింగ్ నుంచి లోన్ యాప్స్ వరకు మొత్తం 15 రకాలైన నేరాల దర్యాప్తుపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. నగర సీపీ ఆనంద్ ప్రారంభోపన్యాసం చేస్తూ కేవలం సైబర్ నేరాలకే కాదు మాదకద్రవ్యాల దందాకు అసాంఘికశక్తులు డార్క్ వెబ్ వాడుతున్నట్లు నగర పోలీసులు పట్టుకున్న గ్యాంగ్స్ ద్వారా వెలుగులోకి వచి్చందని, ఈ నేపథ్యంలోనే దీని సంబంధిత కేసులపై ప్రతి అధికారికీ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. (చదవండి: నిలువు దోపిడీ! కారు ధరలకు చేరువగా ఆటో రిక్షాలు) -
క్రిమినల్ కేసుల వివరాల్లేవ్.. మమత నామినేషన్ తిరస్కరించండి
కోల్‌కతా: భవానీపూర్ ఉప ఎన్నికకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్లో ఆమెపై ఉన్న క్రిమినల్ కేసులను వెల్లడించలేదని, అందువల్ల ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలంటూ ఎన్నికల కమిషన్‌కు బీజేపీ లేఖ రాసింది. అయితే ఆ కేసులు మమతపై ఉన్నవి కాదని ఎన్నికల కమిషన్ ఇది వరకే తేల్చిందని టీఎంసీ స్పష్టం చేసింది. బీజేపీ తరఫున భవానీపూర్ బరిలో దిగుతున్న ప్రియాంక తిబ్రేవాల్‌కు, నియోజకవర్గానికి బీజేపీ ఎన్నికల చీఫ్ ఏజెంట్‌గా ఉన్న సజల్ ఘోష్ ఈసీకి లేఖ రాశారు. చదవండి: గేదెపై వచ్చి మరీ అభ్యర్థి నామినేషన్.. ఎందుకంటే?: West Bengal Bypoll తనపై ఉన్న క్రిమినల్ కేసులను వెల్లడించడంలో మమత విఫలమైనందున ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలని లేఖలో పేర్కొన్నారు. టీఎంసీ నేత, బెంగాల్ రవాణా మంత్రి ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ.. బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. మమత బెనర్జీ పేరుతో ఉన్న మరో మహిళపై ఆ కేసులు నమోదయ్యాయని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ కూడా గత ఎన్నికల్లో స్పష్టం చేసిందని చెప్పారు. -
లోక్‌సభ బరిలో నేర చరితులు!
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నేర చరిత్రను కలిగి ఉన్నారు. పెద్దపల్లి, మెదక్, చేవెళ్ల, వరంగల్ స్థానాలకు పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులెవరికీ ఎలాంటి నేర చరిత్ర లేదు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలన్నింటిలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 8 మంది కాంగ్రెస్, చెరో 5 మంది టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ సైతం కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ విశ్లేషించి ఈ వివరాలను వెల్లడించింది. కొన్ని ముఖ్యమైన కేసులు ►ఆదిలాబాద్ నియోజకవర్గంనుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సోయం బాçపూరావుపై 52 కేసులు పెండింగ్‌లో ఉండగా, అందులో ఓ కేసు తీవ్రమైన నేరారోపణ కలిగినది. మోసం, ఫోర్జరీ, పాస్‌పోర్టులో తన భార్యకు బదులుగా మరో మహిళను చూపించడం వంటి ఆరోపణలపై 2007లో ఆయనపై ఈ కేసు నమోదైంది. 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. ► ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నామా నాగేశ్వర్రావుపై 5 కేసులున్నాయి. అన్నీ కూడా తీవ్ర నేరారోపణలతో కూడిన కేసులే. అత్యాచారం, వివాహేతర సంబంధం, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడం, మోసం, హవాలా డబ్బు వినియోగం వంటి తీవ్ర ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. ► హైదరాబాద్ నుంచి ఎంఐఎం తరఫున పోటీ చేస్తున్న అసదుద్దీన్ ఒవైసీపై బిహార్, మహారాష్ట్ర, తెలంగాణలో 5 కేసులున్నాయి. ఒక కేసు 9 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉంది. ►మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన ఎ.రేవంత్‌రెడ్డిపై 42 కేసులున్నాయి. నేర చరితులకు టికెట్లు ఎలా ఇస్తారు: పద్మనాభ రెడ్డి అఫిడవిట్‌లోని సెక్షన్ 6(ఏ) ప్రకారం ప్రతి అభ్యర్థి తనపై ఉన్న కేసులు, వాటి పూర్తి వివరాలను సంబంధిత పార్టీకి తెలపాల్సి ఉం టుంది. పైన తెలిపిన అభ్యర్థులు తమ నేర చరిత్రను తెలియజేసినా ఆయా రాజకీయ పార్టీలు వారికి బీ ఫారం ఇవ్వడం సరికాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. గెలుపు గుర్రాలను ఎంచుకోవడం కోసం నేర చరిత్ర గల అభ్యర్థులను పార్టీలు ఎంపిక చేశాయని తప్పుబట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను తొందరగా పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యా యని తెలిపారు. రాష్ట్రంలో 2018 ఫిబ్రవరి 2న ఈ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు జీవో ఇచ్చారని, న్యాయాధిపతిని, తగిన సిబ్బందిని కేటాయించకపోవడం, మరో జడ్జికి అదనపు బాధ్యతలు అప్పగించడం, వివిధ జిల్లా ల కోర్టుల్లో ఉన్న కేసులను ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయడంలో ఆలస్యం వల్ల కేసుల విచారణ తొందరగా పూర్తి కావడం లేదన్నారు. నేరచరితులకు టికెట్లు కేటాయించడం, న్యాయవ్యవస్థలో విపరీత జాప్యంతో నేరచరితులు చట్ట సభల్లో ప్రవేశిస్తున్నారన్నారు. -
ఈ ‘నేరపూరిత కుట్ర’ ఎక్కడిది?
సాక్షి, న్యూఢిల్లీ : విరసం సభ్యుడు వరవరరావు సహా గృహ నిర్బంధంలో ఉన్న ఐదుగురు సామాజిక కార్యకర్తలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంతో పాటు ‘నేరపూరిత కుట్ర’ సెక్షన్‌ను కూడా పుణె పోలీసులు బనాయించారు. బ్రిటీష్ కాలం నాటి నుంచి అంటే, 1860 నుంచి భారతీయ శిక్షాస్మృతిలో ఉన్న ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతూనే ఉంది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎక్కడ ఏకాస్త ఆందోళన చెలరేగినా అణచివేసేందుకు బ్రిటిష్ పాలకులు ఈ చట్టాన్ని ఉపయోగించేవారు. ఈ చట్టంలో ఉన్న ఓ వెసులుబాటు ప్రకారమే ఈ చట్టం దుర్వినియోగం ఎక్కువగా జరుగుతోంది. దేశంలో ఏదో ఓ మూల ఎవరిపైనో ఒకరిపైన ‘నేరపూరిత కుట్ర’ కేసును బనాయించి ఇదే కేసులో దేశంలో ఎక్కడైనా, ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండడమే ఆ వెసులుబాటు. చరిత్రలో నిలిచిపోయిన 1923 నాటి కాన్పూర్ కుట్రకేసు, 1929 నాటి మీరట్ కుట్ర కేసులు ‘నేరపూరిత కుట్ర’ దుర్వినియోగానికి నిలువెత్తు దర్పణం. అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీని అణచివేసేందుకు బ్రిటీష్ పాలకులు ఈ చట్టాన్ని ప్రయోగించారు. ఇలాంటి చీకటి లేదా రాక్షస చట్టాలను ప్రపంచంలోని అనేక దేశాలు ఎత్తివేయగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎత్తివేయక పోవడం ఆశ్చర్యం, అర్థంకాని అంశం. 1972లో, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని తీసుకునేందుకు అన్నామలై యూనివర్శిటీకి వెళ్లినప్పుడు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉదయ్‌కుమార్ అనే విద్యార్థి మరణించారు. దానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరై విచారణ కమిషన్‌ను నియమించింది. పోలీసులు తమ చర్యను సమర్థించుకునేందుకు ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే కుడమురుట్టి వంతెన పేల్చివేసేందుకు ‘నేరపూరిత కుట్ర’ పన్నారని కమిషన్ ముందు పేర్కొంటూ అందుకు సాక్ష్యంగా ఓ ‘షెల్’ను చూపించారు. కుట్ర పన్నిన వారు మావోయిస్టులని మధ్యాహ్నం చెప్పిన పోలీసులు సాయంత్రానికల్లా వారిని నక్సలైట్లను చేశారు. లాఠీచార్జిలో మరణించిన ఉదయ్ కుమార్ అనే విద్యార్థి తండ్రి కూడా విచారణ కమిషన్ ముందు హాజరై తీవ్రవాద గ్రూపులతో కలిసి తన కుమారుడు అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడంటూ పోలీసుల బలవంతం వల్ల తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. ఈ ‘నేరపూరిత కుట్ర’ థియరీని విచారణ కమిషన్ బొత్తిగా విశ్వసించకుండా కొట్టి వేసింది. నాడు లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ కేసు కారణంగా తన ప్రభుత్వం ప్రతిష్ట మరింత పెరుగుతుందని కరుణానిధి భావించారుగానీ ఆ తర్వాత మూడేళ్లలో అవినీతి ఆరోపణల వల్ల ఆయన ప్రభుత్వం భ్రష్ట్రుపట్టి ఎమర్జెన్సీ కాలంలో అర్ధంతరంగా డిస్మిస్ అయింది. ఇప్పుడు కూడా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, సామాజిక కార్యకర్తలపై మోదీ ప్రభుత్వం కూల్చివేతకు ‘నేరపూరిత కుట్ర’ కోణాన్ని జోడించి 2019 సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందుదామని ఆయన ప్రభుత్వం చూస్తోందని, నాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడినట్లే రానున్న ఎన్నికల్లో ‘మహా కూటమి’ పేరిట ప్రతిపక్షాలు ఏకమై మోదీ ప్రభుత్వాన్ని మట్టి కరిపిస్తాయని సామాజిక కార్యకర్తలు ఆశిస్తున్నారు.