లక్నో: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ ఖాన్ సౌతల్ హనీఫ్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఉమేష్ పాల్ ఫొటోలను ఇతను అతీక్ కుమారుడు అసద్‌కు పంపినట్లు తెలిపారు. ఆ మరునాడే ఉమేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. అసద్ మరికొందరితో కలిసి ఉమేష్‌ను ఇంటిబయటే కాల్చి చంపాడు.
ఉమేశ్‌పాల్ హత్యకు సంబంధించి క్రిమినల్ కాన్‌స్పిరసీ అభియోగాలతో హానీఫ్‌పై సెక్షన్ 120-బీ కింద ధుమన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు డీసీపీ దీపక్ భూకార్ వెల్లడించారు.
ఉమేశ్ కిడ్నాప్ కేసుకు సంబంధించి హానీఫ్‌కు ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. ప్రస్తుతం నైని కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఫొటోల వ్యవహారానికి సంబంధించి ఇతడ్ని రిమాండ్ కోసం పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు.
బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ కీలక సాక్షిగా ఉన్నాడు. ఇతడ్ని గతంలోనే ఓసారి కిడ్నాప్ చేసింది అతీక్ అహ్మద్ గ్యాంగ్. ఈ కేసులోనే హనీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 24న ఉమేశ్ పాల్‌ను అతని ఇంటి ఎదుటే అతీక్ కుమారుడు అసద్, మరికొందరు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు. అనంతరం పరారయ్యారు.
అయితే ఏప్రిల్ 13న అసద్‌ను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆ తర్వాత రెండు రోజులకే అతని తండ్రి అతీక్ అహ్మద్ కూడా దారుణ హత్యకు గురయ్యాడు. ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి పరీక్షల కోసం తీసుకెళ్లిన అతనిపై పోలీసులు, మీడియా ఎదుటే ముగ్గురు యువకులు తుపాకులతో కాల్పులు జరిపి హతమార్చిన ఘటన సంచలనం రేపింది.
చదవండి: వాళ్లు కన్పిస్తే కాల్చి పడేయాలి.. గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను పొగుడుతున్నవారిపై కేంద్రమంత్రి ఫైర్..
Comments
Please login to add a commentAdd a comment