లక్నో: ఇటీవల హత్య చేయబడ్డ యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కబ్జా చేసిన స్థలాన్ని హస్తగతం చేసుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద 76 ఫ్లాట్లను నిర్మించి పేదలకు అందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.
యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కబ్జా చేసిన స్థానాలను తిరిగి గవర్నమెంట్ పరం చేసిన యూపీ ముఖ్యమంత్రి ఆ స్థలాల్లో పేదలకు ఇళ్ళు కట్టిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద మొత్తం 76 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేశారు.
ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్యతో కలిసి సందర్శించిన యోగి నిర్మాణాన్ని పరిశీలించి ఆ ఫ్లాట్ల తాళాలను లాటరీ పద్దతిలో ఎంపిక చేసిన లబ్దిదారులకు అందజేశారు. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 41 చదరపు మీటర్లు ఉన్న ఈ ఫ్లాట్ల కోసం 6000 మంది దరఖాస్తు చేసుకోగా అర్హులైన 1590 మందిని మాత్రమే లాటరీకి ఎంపిక చేశారు.
ఈ సందర్బంగా యోగి మాట్లాడుతూ... 2017కు ముందు భూబకాసురులు ఇష్టానుసారంగా భూములను కబ్జా చేస్తుంటే నిర్భాగ్యులైన పేదవారు అలా చూస్తుండడం తప్ప ఏమీ చేయలేకపోయేవారని అన్నారు. అలాంటి ల్యాండ్ మాఫియాను అణచి అదే స్థలాలలో పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వడం కంటే గొప్ప విజయం మరొకటి లేదని అన్నారు.
మొత్తానికి దోపిడీదారులు, అక్రమార్కుల ఆటలు కట్టించి దగాపడ్డ వారికి న్యాయం చేస్తూ యూపీ సీఎం యోగి అభినవ రాబిన్ హుడ్ అనిపించుకుంటున్నారు.
#Prayagraj | Uttar Pradesh CM #YogiAdityanath interacts with children at the site of the flats that will be handed over to the poor shortly.
— Hindustan Times (@htTweets) June 30, 2023
The flats have been built on land confiscated from slain gangster-turned-politician #AtiqAhmed, in Prayagraj
(via ANI) pic.twitter.com/1ZOeSrh3Ho
Comments
Please login to add a commentAdd a comment