PM aavas yojana
-
మాఫియా స్థలాల్లో పేదవారికి ఇళ్ళు.. దటీజ్ యోగి..
లక్నో: ఇటీవల హత్య చేయబడ్డ యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కబ్జా చేసిన స్థలాన్ని హస్తగతం చేసుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద 76 ఫ్లాట్లను నిర్మించి పేదలకు అందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కబ్జా చేసిన స్థానాలను తిరిగి గవర్నమెంట్ పరం చేసిన యూపీ ముఖ్యమంత్రి ఆ స్థలాల్లో పేదలకు ఇళ్ళు కట్టిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద మొత్తం 76 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేశారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్యతో కలిసి సందర్శించిన యోగి నిర్మాణాన్ని పరిశీలించి ఆ ఫ్లాట్ల తాళాలను లాటరీ పద్దతిలో ఎంపిక చేసిన లబ్దిదారులకు అందజేశారు. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 41 చదరపు మీటర్లు ఉన్న ఈ ఫ్లాట్ల కోసం 6000 మంది దరఖాస్తు చేసుకోగా అర్హులైన 1590 మందిని మాత్రమే లాటరీకి ఎంపిక చేశారు. ఈ సందర్బంగా యోగి మాట్లాడుతూ... 2017కు ముందు భూబకాసురులు ఇష్టానుసారంగా భూములను కబ్జా చేస్తుంటే నిర్భాగ్యులైన పేదవారు అలా చూస్తుండడం తప్ప ఏమీ చేయలేకపోయేవారని అన్నారు. అలాంటి ల్యాండ్ మాఫియాను అణచి అదే స్థలాలలో పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వడం కంటే గొప్ప విజయం మరొకటి లేదని అన్నారు. మొత్తానికి దోపిడీదారులు, అక్రమార్కుల ఆటలు కట్టించి దగాపడ్డ వారికి న్యాయం చేస్తూ యూపీ సీఎం యోగి అభినవ రాబిన్ హుడ్ అనిపించుకుంటున్నారు. #Prayagraj | Uttar Pradesh CM #YogiAdityanath interacts with children at the site of the flats that will be handed over to the poor shortly. The flats have been built on land confiscated from slain gangster-turned-politician #AtiqAhmed, in Prayagraj (via ANI) pic.twitter.com/1ZOeSrh3Ho — Hindustan Times (@htTweets) June 30, 2023 -
భర్తల కొంప ముంచిన ‘పీఎంఏవై’ రుణాలు.. లవర్లతో భార్యలు పరార్!
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం డబ్బులు తీసుకున్న నలుగురు వివాహితలు.. తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో పరారయ్యారు. భార్యలు చేసిన ఊహించని ఘనకార్యం తెలుసుకొని ఆశ్చర్యపోవడం భర్తల వంతైంది. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం.. దీని ద్వారా దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు రుణాలు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద వివిధ వర్గాల వారికి మూడు నుంచి 18 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. అయితే పీఎంఏవై కింద ఇచ్చే రుణాలను కేంద్రం మహిళల పేరు మీదనే అందిస్తుంది. అంటే ఇంటి యజమాని తప్పనిసరిగా మహిళనే అయి ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న 40 మందికి రుణాలు మంజూరయ్యాయి. అందులో మొదటి విడతగా ఒక్కో లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో రూ.50,000 చొప్పున నగదును జమచేశారు. అయితే ఈ పథకం కింద రుణాలు పొందిన వారిలో నలుగురు మహిళలు తమ అకౌంట్లకు చేరిన 50 వేల రుపాయలతో కనిపించకుండా పోయారు. భర్తలు వారి కోసం ఆరా తీయగా షాకింగ్ విషయం తెలిసింది. వారి భార్యలు తాము ప్రేమించిన వ్యక్తులతో పరారైనట్లు తెలింది. ఇలా పారిపోయిన వాళ్లలో జిల్లాలోని బెల్హారా, బంకీ, జైద్పూర్, సిద్ధౌర్ నగర పంచాయతీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. కాగా భార్యలు పారిపోవడం భర్తల పాలిట శాపంగా మారింది. ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ వింత ఉదంతం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేపట్టకపోతే ఇచ్చిన డబ్బులను రికవరీ చేస్తామని జిల్లా అధికారులు బాధిత భర్తలను హెచ్చరించారు. నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులు నోటీసులు పంపారు. దీంతో కంగుతిన్న భర్తలకు ఏమి చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. చివరికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో తమ భార్యలు ప్రేమించిన వారితో వెళ్లిపోయారని.. వారి బ్యాంక్ ఖాతాలలోకి పీఎంఏవై రెండో విడత రుణాలను జమచేయవద్దని అధికారులకు మొరపెట్టుకున్నారు. మరోవైపు పారపోయిన లబ్ధిదారుల నుంచి సొమ్మును ఎలా రికవరీ చేయాలో తెలియక జిల్లా అధికారులు తలపట్టుకుంటున్నారు. చదవండి: పార్లమెంట్లో మోదీ ప్రసంగం.. రాహుల్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్.. -
లబ్ధిదారులకే ఫ్లాట్ల నిర్వహణ పగ్గాలు
సాక్షి, అమరావతి: పట్టణాల్లో ఇళ్లులేని పేదలు, మధ్యతరగతి వర్గాల కోసం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ (పీఎంఏవై–యు) పథకంలో నిర్మించిన ఇళ్లను అధికారులు పరిశీలించారు. అక్కడ అమలుచేస్తున్న విధానాలను అధ్యయనం చేసి, మనకు ఇక్కడ అనువైన నిబంధనావళిని రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో 88 యూఎల్బీల్లో 2.62 లక్షల టిడ్కో ఇళ్లను అన్ని సౌకర్యాలతో జీ+3 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఇవి ప్రాంతాన్ని బట్టి 1000 నుంచి 12 వేల వరకు ఉన్నాయి. ప్రతి వెయ్యి నివాసాలకు ఒక సంక్షేమ సంఘం చొప్పున ఫ్లాట్ల యజమానులతోనే కమిటీ ఏర్పాటుచేసి వీటి అంతర్గత నిర్వహణను యజమానులకే అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. కమిటీల ఏర్పాటు తర్వాత ఒక్కో ఫ్లాట్‌కు రూ.100 నుంచి రూ.150 మధ్య నిర్వహణ రుసుం వసూలు చేసి, వారే నిర్వహించుకునేలా ఏర్పాట్లుచేస్తున్నారు. మరోవైపు.. పీఎంఏవై–యు కింద భోపాల్‌లో తొమ్మిది అంతస్తుల్లో ఫ్లాట్లను నిర్మించగా, రాజ్‌కోట్‌లో అంతకుమించి అంతస్తుల్లో అపార్ట్మెంట్లను నిర్మించి, దిగువ, మధ్యాదాయ వర్గాలకు కేటాయించారు. వాటి నిర్వహణను సైతం వాటి యజమానులకే కేటాయించినప్పటికీ, నిర్వహణ రుసుం భారీగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. భోపాల్‌లో రూ.850, రాజ్‌కోట్‌లో రూ.200 ఇక మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్మించిన పీఎంఏవై–యూ అపార్ట్మెంట్లలో ఫ్లాట్‌కు రూ.850 చొప్పున సంక్షేమ సంఘం వసూలుచేస్తుండగా, గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ప్రతి ఫ్లాట్ యజమాని రూ.30 వేల డిపాజిట్‌తో పాటు ప్రతినెలా రూ.200 చెల్లిస్తున్నారు. ఈ నగదుతో ఆయా సంఘాలు అపార్ట్మెంట్ ప్రాంగణంలోని అంతర్గత పారిశుధ్యం, విద్యుత్, తాగునీటి మోటార్ల నిర్వహణ, రక్షణ వంటి అంశాలకు ఖర్చుచేస్తున్నారు. రెండ్రోజులుగా భోపాల్‌లోని నివాసాలను టిడ్కో చైర్మన్ జమాన్న ప్రసన్నకుమార్, గృహనిర్మాణ శాఖ అధికారుల బృందం పరిశీలించింది. గృహాల నిర్మాణం, సౌకర్యాల విషయంలో మన రాష్ట్రమే మెరుగ్గా ఉన్నట్లు వారు తెలిపారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాల వాటా తక్కువ పట్టణ పేదల కోసం మధ్యప్రదేశ్, గుజరాత్ చేపట్టిన అపార్ట్మెంట్ల నిర్మాణంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వాటా మన రాష్ట్రంతో పోలిస్తే చాలా తక్కువ. అక్కడి నివాసితులతో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటుచేసిన తరువాత లబ్ధిదారులు భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా, వీధిలైట్లు, అంతర్గత రోడ్ల శుభ్రత వంటి వాటికోసం భోపాల్‌లో ప్రతి ఇంటి నుంచి రూ.850 వసూలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోనూ అవి నామమాత్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. – జమాన్న ప్రసన్నకుమార్, ఏపీ టిడ్కో చైర్మన్ -
సంక్షేమమా..అదెక్కడ!?
సాక్షి, అమరావతి: గత నాలుగేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమాన్ని అటకెక్కించింది. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలుకాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలైన ఏజెన్సీల్లో ఆదివాసీల జీవితాలు దారుణంగా ఉన్నాయి. విద్య, వైద్యం పూర్తిస్థాయిలో వారికి అందటంలేదు. విజయనగరం జిల్లా పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏల పరిధిలోని ఆదివాసీల పరిస్థితి దారుణంగా ఉంది. గూడేలకు కనీస వసతుల్లేవు. తాగేందుకు ఊట చెలిమల నుంచి వస్తున్న నీరే దిక్కు. గూడేలకు దూరంగా వైద్యశాలలు ఉండటం, సిబ్బంది సకాలంలో చేరుకునే పరిస్థితి లేకపోవడంతో వైద్యం అందని ద్రాక్షలా మారింది. రోడ్డు సౌకర్యాల్లేవు. రూ.400 కోట్లతో రోడ్లు వేస్తున్నామని మాత్రం ప్రభుత్వం నాలుగేళ్లుగా ప్రచారం చేసుకుంటోంది. గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ నిర్వీర్యమైంది. బినామీల గుప్పెట్లో ఎస్సీల ఫలాలు ఇక ఎస్సీ సంక్షేమ పథకాలు బినామీలు ఎగరేసుకుపోతున్నారు. ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం కార్ల కొనుగోలు పథకం ప్రభుత్వం చేపట్టింది. అయితే, ఇవి ఎస్సీల పేరుతో పలువురు ఎమ్మెల్యేల బంధువులు, మంత్రుల బంధువుల వద్దకు చేరాయి. భూమి కొనుగోలు పథకాన్ని అమలుచేసినట్లు ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసుకుంటోంది. రూ.200 కోట్లతో 4333 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి భూమిలేని మహిళా వ్యవసాయ కూలీలకు 75శాతం సబ్సిడీపై ఇచ్చినట్లు ప్రకటించింది. కానీ, నాలుగేళ్లలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. - ఇక ఫీజు రీయింబర్స్మెంట్ విషయానికి వస్తే మొత్తం రూ.2,500కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇంకా రూ.800కోట్లు బకాయి ఉన్నారు. - మైనార్టీలకు రూ.500కోట్లకు మించి ఖర్చుపెట్టిన దాఖలాల్లేవు. వైఎస్సార్ హయాంలో స్వర్ణ యుగాన్ని చవిచూసిన ఆ వర్గం పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. - బీసీల్లో కుల వృత్తుల వారికి ఇస్తామన్న ఆదరణ పనిముట్లు ఇప్పటివరకూ ఇవ్వలేదు. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది బీసీలు ఉంటే ఏటా రుణాలు ఇచ్చేందుకు 50వేల మందినే ఎంపిక చేస్తున్నారు. అయినా, అందులో 25వేల మందికి కూడా ఇవ్వడంలేదు. - ఆదాయ పరిమితి పెట్టడంవల్ల చాలా కుటుంబాల వారు ‘పెళ్లి కానుక’ పథకానికి దూరమవుతున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన వధూవరులు 3,034 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్క జంటకు కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదు. - అలాగే, గిరిజనులకు ఉద్దేశించిన గిరిపుత్రిక కళ్యాణ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒక్క కొత్త జంటకు కూడా ప్రభుత్వం సాయం చేయలేదు. ముస్లింల కోసం ప్రవేశపెట్టిన దుల్హన్ పథకం కూడా అలంకారప్రాయంగా మారింది. ఒక్కరికీ ఈ పథకం లబ్ధిచేకూర్చలేదు. అలాగే, బీసీలకు ప్రభుత్వం కొత్తగా రూ.35వేలు ఇస్తామని ప్రకటించింది. వీరి విషయంలోనూ పూర్తిస్థాయిలో అమలుకాలేదు. కులాంతర వివాహాలు చేసుకున్నా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు మాత్రమే అర్హులని ప్రభుత్వం మెలిక పెట్టింది. - సంప్రదాయ చర్మకారుల జీవనోపాధి కోసం రూ.60 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతున్నా ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వలేదు. - మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి గత ఏడాది రూ.60 కోట్లు, ఈ సంవత్సరం రూ.100 కోట్లు కేటాయించారు. ఒక్కరికి కూడా సాయం అందించలేదు. స్టడీ సర్కిళ్లు నిర్వీర్యం ఇదిలా ఉంటే.. సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న స్టడీ సర్కిళ్లు నిర్వీర్యమయ్యాయి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ప్రభుత్వం వాటి గురించి ఆలోచించడం మానేసింది. దీంతో.. ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సివిల్స్, గ్రూప్స్ కోచింగ్‌కు దూరమవుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఉన్నా వాటిల్లో ఫ్యాకల్టీలు లేరు. మొక్కుబడిగా ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ ఈ పథకం కింద విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఏడాదికి రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థి యూనివర్సిటీలో చేరి అడ్మిషన్ వివరాలు పంపిస్తే మొదటి విడతగా రూ.5లక్షలు విడుదల చేస్తారు. సంవత్సరం ముగిసే సమయంలో మరో రూ.5లక్షలు ఇస్తారు. కానీ, విదేశాల్లో పీజీ చదవాలంటే కనీసం రూ.30 లక్షలు ఖర్చవుతాయి. బ్యాంకుల నుంచి రూ.10 లక్షలు రుణం ఇప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. ఉన్నతి లేని ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ పథకం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద సివిల్స్‌లో ఉచిత కోచింగ్‌కు సంబంధించి గత ఏడాది బీసీ, ఈబీసీలు కలిపి 1,240 మందికి, కాపులు 700 మందికి, ఎస్సీలు 700 మంది, ఎస్టీలు 300 మందిని ఎంపిక చేసి శిక్షణకు పంపించారు. ఒక్క బీసీలే సుమారు 50వేల మంది వరకు పరీక్ష రాశారు. మెరిట్ ప్రకారం ఎక్కువమందికి కోచింగ్ ఇప్పిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, శిక్షణ పొందిన వారికి నేటికి కూడా స్టైఫండ్ పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. దీంతో హాస్టళ్ల నిర్వాహకులు డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. అక్కరకు రాని ‘చంద్రన్న బీమా’ ఇక ‘చంద్రన్న బీమా’ పథకం ద్వారా పేదలకు సకాలంలో సాయం అందటంలేదు. ఈ పథకానికి కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి సుమారు రూ.600కోట్లు దారి మళ్లించారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి బీమా సొమ్ములో సగం కేంద్ర ప్రభుత్వ వాటా కాగా, మిగిలిన సగం రాష్ట్రానిది. కానీ, బడ్జెట్ నుంచి చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. తన వాటాను కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి తీసుకుని చెల్లిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, చిన్న పిల్లలకు తప్ప పెద్ద పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడంలేదు. అలాగే, 60 ఏళ్లు పైబడిన కార్మికులకు రూ.2,000లు పింఛన్ ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అదీ ఇవ్వడంలేదు. ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం రాష్ట్రంలో ఐదేళ్లలో 13 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నా పథకం మాత్రం ముందుకు సాగడంలేదు. బిల్లులు చెల్లించకపోవడమే కారణం. మరోవైపు.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తోంది. 23వేల ఇళ్లు నిర్మించామని రాష్ట్రం అంటే.. కాదు, 7,749మాత్రమే అని కేంద్రం అంటోంది. దీంతో కేంద్రం బిల్లులు చెల్లించడంలేదు. అలాగే, మరో 20.97 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రానికి రాష్ట్రం మరో ఉత్తరం రాసింది. దీంతో.. మొదట 23 వేల ఇళ్లకు లెక్కలు చెప్పండి అంటూ కేంద్రం ప్రత్యుత్తరం ఇవ్వడంతో ఇద్దరి మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. ఇక అర్బన్ హౌసింగ్ పథకం కింద దాదాపు 6 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటివరకు కేవలం 4,934 ఇళ్లు మాత్రమే పూర్తిచేశారు. 2019 నాటికి 5 లక్షల గృహాలు పూర్తిచేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినా ఆ మేరకు నిర్మాణాలు మాత్రం చేపట్టడంలేదు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో ఇళ్ల కోసం 12 లక్షల మంది పేదలు దరఖాస్తు చేసుకున్నా వీరి గురించి పట్టించుకునే నాథుడేలేడు. చేనేత, మత్స్య కారులందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని.. మధ్య తరగతి వర్గాల కోసం ప్రత్యేక గృహ నిర్మాణ పథకం ప్రవేశపెడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి ఇప్పటివరకు అతీగతీలేదు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఒక్కో ఇంటికి రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత దానిని రూ.1.50 లక్షలకు కుదించి పేదలను మోసం చేశారు. ఇలా హామీల మీద హామీలు ఇవ్వడం మినహా పేదలకు మాత్రం సొంతింటి కల నెరవేర్చలేదు. సంక్షేమ హాస్టళ్ల రద్దు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ హాస్టళ్ల రద్దు పర్వం మొదలైంది. మెరుగైన విద్యను అందించేందుకు హాస్టళ్లను రద్దుచేసి ఆ స్థానాల్లో గురుకుల విద్యాలయాలు పెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించి పేదలను మోసం చేసింది. - మొత్తం ప్రీమెట్రిక్ కింద ఎస్సీల హాస్టళ్లు 1,450కు గాను ఇప్పటివరకు 648 రద్దయ్యాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య 27,917 మంది. - అలాగే, మొత్తం 197 ఎస్టీ హాస్టళ్లకుగాను అన్నీ రద్దయ్యాయి. వీటిలో 16,250మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. - బీసీ హాస్టళ్లదీ దాదాపు ఇదే పరిస్థితి. మొత్తం 897 హాస్టళ్లకుగాను 201 రద్దయ్యాయి. వీటిలో 13,000మంది విద్యనభ్యసిస్తున్నారు. - ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కొత్తగా ఒక్క గురుకుల పాఠశాల కూడా నిర్మించలేదు. రద్దుచేసిన ఎస్టీ హాస్టళ్ల స్థానంలో 80 హాస్టల్ కన్వర్టెడ్ గురుకుల పాఠశాలలు, ఏజెన్సీలో 30 ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటుచేశారు. ఇవన్నీ రద్దుచేసిన పాత భవనాల్లోనే కొనసాగుతుండగా అక్కడి పరిస్థితులు పాత హాస్టళ్ల కంటే అధ్వాన్నంగా ఉన్నాయి. - కేంద్ర ప్రభుత్వం 14 ఏకల్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసి భవన నిర్మాణాలకు నిధులిచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసే విషయంలో తలెత్తిన వివాదం కోర్టుకు చేరడంతో ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కమీషన్ల విషయంలో తేడా రావడంతో ఈ భవనాలు ఆగిపోయినట్లు సమాచారం. -
ఓట్లు కాదు.. అభివృద్ధే మా లక్ష్యం
వారణాసి: దేశాభివృద్ధే బీజేపీకి ముఖ్యమని, ఓట్ల కోసం ఆ పార్టీ రాజకీయాలు చేయదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం ఆయన భారీ పశు ఆరోగ్య మేళా ప్రారంభించారు. ఓట్లు వస్తాయనుకుంటేనే కొందరు రాజకీయ నాయకులు పనిచేస్తారని తర్వాత బహిరంగ సభలో విపక్షాల తీరును ఎండగట్టారు. ‘దేశ సంక్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యం. మా రాజకీయాలు ఓట్ల కోసం కాదు. అభివృద్ధే మాకు ముఖ్యం. మా సంస్కృతి వేరు. పరిపాలన అంటే రాజకీయాలు, ఎన్నికల్లో గెలవడం కాదు’ అని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రధాన మంత్రి అవాస్ యోజన ధ్రువీకరణ పత్రాల్ని మోదీ అందచేశారు. 2022 నాటికి దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోనున్న వేళ పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే భేదం లేకుండా ప్రతీ పేద వ్యక్తికి సొంత ఇల్లు ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. కోట్లాదిమందికి సొంతిళ్లు లేవని, ఇంతటి కష్టసాధ్యమైన పనికి మోదీ పూనుకోకుంటే ఇంకెవరు చేస్తారన్నారు. ‘2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు కోసం కృషి చేస్తామని వాగ్దానం చేశాం. రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్రం కృషి కొనసాగిస్తోంది. ఇతర ఆదాయ మార్గాలుగా పాల ఉత్పత్తి, పశువుల పెంపకాన్ని ప్రత్యామ్నాయాలుగా చేసుకునేలా రైతుల్ని ప్రోత్సహించాలి. అలాంటి చర్యలతో సరికొత్త ప్రగతికి బీజాలు పడతాయి’ అని అన్నారు. ‘పశుధన్ ఆరోగ్య మేళాతో ఉత్తరప్రదేశ్‌లోని రైతులంతా లబ్ధి పొందుతారు. ఇలాంటి మేళాలు, ప్రదర్శనలు పశువులకు సరైన వైద్యం చేయించలేని పేద రైతులకు ఉపయోగకరం’ అని ప్రధాని అభిప్రాయపడ్డారు. మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రాజెక్టులో భాగంగా గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ‘స్వచ్ఛత ఒక పూజ. అది దేశ ప్రజల్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. మరుగుదొడ్ల శంకుస్థాపన ప్రాంతానికి ఇజ్జత్ఘర్(గౌరవప్రదమైన ఇల్లు) అని పేరుపెట్టడాన్ని అభినందించారు. ప్రజల ప్రతీ పైసా వారికే.. అవినీతిపరులు, నల్లకుబేరుల దోపిడీతో పేదలు ఎన్నో ఇక్కట్లు పడ్డారని, అందుకే కేంద్రం నల్లధనం, అవినీతిపై యుద్ధం ప్రారంభించిందని చెప్పారు. ‘ప్రస్తుతం నిజాయితీ కోసం సాగుతున్న ఉద్యమం ఉత్సవంలా ముందుకు పోతోంది. జీఎస్టీ అమలు, ఆధార్ అనుసంధానంతో వర్తక సోదరులు ఆ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ప్రజల ప్రతీ పైసా వారి సంక్షేమానికే ఖర్చుచేస్తాం’ అని అన్నారు. -
అందరికీ ఇళ్లు కింద 34 పట్టణాలు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంపిక చేసిన కేంద్రం కేంద్ర రాష్ట్రాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఇప్పటికే తొలివిడతగా రూ. 179.03 కోట్లు విడుదల మంచిర్యాల, భైంసా, రామగుండంలను చేర్చాలంటూ రాష్ట్రం వినతి త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలోని 34 నగరాలు, పట్టణాలను కేంద్రం ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ, రాష్ట్ర పురపాలక శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఎంపికైన నగరాల్లో హైదరాబాద్, వరంగల్‌తో పాటు అమృత్ పథకం కింద ఎంపికైన 9 నగరాలు, పట్టణాలున్నాయి. ఈ పథకం కింద ఇప్పటికే రాష్ట్రానికి తొలి విడతగా రూ.179.03 కోట్లను కేంద్రం విడుదల చేసింది. కాగా, మంచిర్యాల, రామగుండం, భైంసా పట్టణాలను కూడా ఈ పథకం కింద ఎంపిక చేయాలని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం త్వరలో ప్రతిపాదనలు పంపనుంది. పట్టణాలు, నగరాల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సర్వే చేసి అర్హులైన లబ్ధిదారుల జాబితాను తయారుచేయనుంది. వారికి గృ హాలు నిర్మించి ఇచ్చేందుకు కావాల్సిన నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు కేంద్రం కేటాయించనుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం, లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామన్న రాష్ట్ర ప్రభు త్వ హామీల నేపథ్యంలో ఒక్కో ఇంటిపై అదనంగా రూ.2 లక్షలు రాష్ట్రం భరించాల్సి ఉం టుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.