అందరికీ ఇళ్లు కింద 34 పట్టణాలు | home for all implemented for 34 cities | Sakshi
Sakshi News home page

అందరికీ ఇళ్లు కింద 34 పట్టణాలు

Published Mon, Aug 31 2015 4:01 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

అందరికీ ఇళ్లు కింద 34 పట్టణాలు

అందరికీ ఇళ్లు కింద 34 పట్టణాలు

  •  ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంపిక చేసిన కేంద్రం
  •  కేంద్ర రాష్ట్రాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం
  •  ఇప్పటికే తొలివిడతగా రూ. 179.03 కోట్లు విడుదల
  •  మంచిర్యాల, భైంసా, రామగుండంలను చేర్చాలంటూ రాష్ట్రం వినతి
  •  త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు..
  •  సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలోని 34 నగరాలు, పట్టణాలను కేంద్రం ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ, రాష్ట్ర పురపాలక శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఎంపికైన నగరాల్లో హైదరాబాద్, వరంగల్‌తో పాటు అమృత్ పథకం కింద ఎంపికైన 9 నగరాలు, పట్టణాలున్నాయి. ఈ పథకం కింద ఇప్పటికే రాష్ట్రానికి తొలి విడతగా రూ.179.03 కోట్లను కేంద్రం విడుదల చేసింది.  కాగా, మంచిర్యాల, రామగుండం, భైంసా పట్టణాలను కూడా ఈ పథకం కింద ఎంపిక చేయాలని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం త్వరలో ప్రతిపాదనలు పంపనుంది.

    పట్టణాలు, నగరాల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సర్వే చేసి అర్హులైన లబ్ధిదారుల జాబితాను తయారుచేయనుంది. వారికి గృ హాలు నిర్మించి ఇచ్చేందుకు కావాల్సిన నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు కేంద్రం కేటాయించనుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం, లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామన్న రాష్ట్ర ప్రభు త్వ హామీల నేపథ్యంలో ఒక్కో ఇంటిపై అదనంగా రూ.2 లక్షలు రాష్ట్రం భరించాల్సి ఉం టుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement