లక్నో: గ్యాంగ్‌స్ట్‌ర్, పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ గతేడాది హత్యకు గురయ్యారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతిక్ సంబంధించి ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న రూ. 50 కోట్ల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకుంది. ప్రయాగ్‌రాజ్ కోర్టు అతిక్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించినట్లు ప్రయాగ్‌రాజ్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది( క్రిమినల్) గులాబ్ చంద్రఅగ్రహారి తెలిపారు.
2.377 హెక్టార్ల భూమిని అతిక్ నేరకార్యకలాపాల ద్వారా సంపాధించినట్లు తెలిపారు. అయితే ఈ భూమి హుబాలాల్ అనే వ్యక్తి పేరు మీద ఉందని చెప్పారు. ఈ భూమిని పోలీసులు 2023 నవంబర్‌లో సీజ్ చేశారు. గ్యాంగ్‌స్టర్ చట్టంలోని సెక్షన్ 14(1)కింద పోలీసులు ఈ భూమిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ భూమికి సంబంధించి యజమాని ఎవరనేదానిపై ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు.
దీంతో పోలీసు కమిషనర్ కోర్టు ఈ కేసు ప్రయాగ్‌రాజ్ కోర్టుకు బదిలీ చేసింది. దీంతో బుధవారం జడ్జి వినోద్ చౌరాసియా పోలీసు కమిషనర్ కోర్టు తీర్పును సమర్థిస్తూ.. అతిక్ ఆస్తులను ఉత్తరపదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోలని ఆదేశించారు.
అతిక్, అతని సోదరుడు అష్రాఫ్ సుమారు వందకుపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదీకాక ఉమేష్ పాల్ హత్యకేసుతో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ అతిక్, అతని సోదరుడు అష్రాఫ్ హత్యకు గురయ్యారు. జర్నలిస్టులుగా నటిస్తూ దుండగులు అత్యంత సమీపంగా జరిపిన కాల్పుల్లో మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment