లక్నో: కొత్త ఏడాది వేడుకల వేళ ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అర్షద్ అనే వ్యక్తి తన తల్లి, నలుగురు చెల్లెళ్లను హోటల్ గదిలో దారుణంగా హత్య చేశాడు. వీరి హత్యకు కుటుంబ వివాదాలే కారణంగా నిందితుడు అర్షద్ అంగీకరించినట్టు లక్నో పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని నాకా ప్రాంతంలో ఉన్న హోటల్ శరంజిత్‌కు అర్షద్(24) సహా కుటుంబ సభ్యులు వెళ్లారు. ఈ క్రమంలో అర్షద్ తన తల్లి, నలుగురు చెల్లెళ్లను దారుణంగా హత్య చేశాడు. అనంతరం, ఈ ఘటనపై హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు అర్షద్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అర్షద్‌ను విచారించగా.. కుటుంబ వివాదాల కారణంగానే తన తల్లి, నలుగురు చెల్లెళ్లను హతమార్చినట్లు ప్రాథమికంగా అంగీకరించాడు. మరణించిన వారిని తల్లి అస్మా, అలియా (9), అల్షియా (19), అక్సా (16), రహ్మీన్ (18)గా గుర్తించారు. అయితే, ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడించినున్నట్టు డీసీపీ తెలిపారు.
Lucknow, Uttar Pradesh: A murder was reported at Hotel Sharanjeet in Thana Naka.
JCP Crime Bablu Kumar says, "We received information about five dead bodies in a hotel room at Naka police station. Immediately, the local police reached the spot, took possession of the bodies, and… pic.twitter.com/N6GmX8HCcU— IANS (@ians_india) January 1, 2025
Comments
Please login to add a commentAdd a comment