family death
-
అందుకే చంపేశా.. సంచలన విషయాలు వెల్లడించిన అర్షద్
‘మాకు సహాయం చేయమని చాలా మందిని అడిగాం, కానీ మాకు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు నా సోదరీమణులు చనిపోతున్నారు. కొద్దిసేపట్లో నేను కూడా చచ్చిపోతాను. మాకు జరిగిట్టుగా భారతదేశంలోని ఏ కుటుంబం కూడా వేధింపుల బారిన పడకుండా చూడాలి. బతికుండగా మాకు న్యాయం జరగలేదు. కనీసం చనిపోయిన తర్వాతైనా మాకు న్యాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నాను. మమ్మల్ని వేధించిన వారికి కఠిన శిక్ష పడాలి. రాజకీయ నాయకులు, పోలీసులతో వారికి సంబంధాలున్నాయి. మా స్థలంలో సగం లాక్కున్నారు. మరో సగం కూడా గుంజుకోవాలని ప్రయత్నిస్తున్నారు’- యూపీ రాజధాని లక్నోలో ఐదుగురు కుటుంబ సభ్యులను కిరాతంగా హత్య చేసిన అర్షద్(24) మాటలివి. తన తండ్రి సహాయంతో తల్లితో పాటు నలుగురు చెల్లెళ్లను అర్షద్ అత్యంత దారుణంగా చంపేశాడు. అనంతరం సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. తాను హత్యలు చేయడానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించాడు.చెల్లెళ్లను అమ్ముకోవడం ఇష్టం లేకనే..ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ పట్టణం అర్షద్ స్వస్థలం. తమ పొరుగున్న వారు, ల్యాండ్ మాఫియాతో కలిసి వేధింపులకు గురిచేయడంతో విసిగిపోయి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అర్షద్ వెల్లడించాడు. తనను, తన తండ్రిని కుట్రపూరితంగా దొంగ కేసుల్లో ఇరికించి.. తమ చెల్లెళ్లను అమ్మేయాలని చూశారని అతడు ఆరోపించాడు. దీంతో తన చెల్లెళ్లను చంపుకోవాల్సి వచ్చిందని వాపోయాడు. వేధింపులు భరించలేక ఒక దశలో తామంతా మతం మారాలనుకున్నామని చెప్పాడు. తమకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను అభ్యర్థించాడు. మాకెవరూ అండగా నిలబడలేదు‘ఇరుగుపొరుగు వారి వేధింపుల కారణంగా మా కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. మా అమ్మ, నా చెల్లెళ్లను నేనే చంపాను. నేను మాట్లాడిన ఈ వీడియో పోలీసులుకు దొరికినప్పుడు స్థానికులే బాధ్యులని వారికి తెలుస్తుంది. మా ఇంటిని కబ్జా చేసేందుకు నానారకాలుగా వేధించినా మేము గట్టిగా ప్రతిఘటించాం. కానీ మాకు ఎవరూ అండగా నిలబడలేదు. ఇల్లు వదిలిపెట్టి 15 రోజులుగా చలిలో తిరుగుతూ ఫుట్‌పాత్‌పైనే నిద్రపోయాం. పిల్లలు చలిలో తిరగడం మాకు ఇష్టం లేదు. కబ్జాకోరులు మా ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. కానీ పత్రాలు మా దగ్గరే ఉన్నాయ’ని అర్షద్ తన వీడియోలో తెలిపాడు.ఈ హత్యలకు బాధ్యులు వారే..తమ కుటుంబ నాశనానికి రాణు, అఫ్తాబ్, అలీమ్ ఖాన్, సలీం, ఆరిఫ్, అహ్మద్, అజార్ అనే వ్యక్తులు కారణమని అర్షద్ ఆరోపించాడు. బంగ్లాదీశీయులమని తమపై అసత్య ప్రచారం చేశారని వాపోయాడు. ‘వాళ్లు ల్యాండ్ మాఫియా. ఆడపిల్లలను అమ్మేస్తారు. నన్ను, మా నాన్నను తప్పుడు కేసులో ఇరికించి.. మా చెల్లెళ్లను హైదరాబాద్‌లో అమ్మేయాలని ప్లాన్ చేశారు. వాళ్ల బారిని నుంచి తప్పించడానికి మాకు మార్గం మరో లేకుండా పోయింది. అందుకే మా నాన్న సహకారంతో నా సోదరీమణులను గొంతు, మణికట్టు కోసి బలవంతంగా చంపాల్సి వచ్చింది. వారి గౌరవాన్ని కాపాడటానికి మాకు ఇంత కంటే మార్గం తోచలేదు. నేను ఉదయం వరకు జీవించి ఉండకపోవచ్చు. మా స్థలాన్ని ప్రార్థనాలయానికి, వస్తువులను అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాల’ని అర్షద్ తెలిపాడు. తన వీడియోలో తల్లి, చెల్లెళ్ల మృతదేహాలను చూపించాడు.చదవండి: ట్యూషన్ టీచర్‌కు 111 ఏళ్ల కఠిన కారాగార శిక్షకొనసాగుతున్న విచారణహోటల్ శరణ్‌జిత్‌లో ఐదుగురు మహిళల హత్యలు జరిగాయని సెంట్రల్ లక్నో డిప్యూటీ పోలీసు కమిషనర్ రవీనా త్యాగి తెలిపారు. ఘటనా స్థలంలోనే నిందితుడు అర్షద్‌ను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. విచారణ కొనసాగుతోందని, ఫోరెన్సిక్ నిపుణులు శాంపిల్స్ సేకరించారని చెప్పారు. -
లక్నోలో దారుణం.. తల్లి సహా నలుగురు చెల్లెళ్ల హత్య
లక్నో: కొత్త ఏడాది వేడుకల వేళ ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అర్షద్ అనే వ్యక్తి తన తల్లి, నలుగురు చెల్లెళ్లను హోటల్ గదిలో దారుణంగా హత్య చేశాడు. వీరి హత్యకు కుటుంబ వివాదాలే కారణంగా నిందితుడు అర్షద్ అంగీకరించినట్టు లక్నో పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని నాకా ప్రాంతంలో ఉన్న హోటల్ శరంజిత్కు అర్షద్(24) సహా కుటుంబ సభ్యులు వెళ్లారు. ఈ క్రమంలో అర్షద్ తన తల్లి, నలుగురు చెల్లెళ్లను దారుణంగా హత్య చేశాడు. అనంతరం, ఈ ఘటనపై హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు అర్షద్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అర్షద్‌ను విచారించగా.. కుటుంబ వివాదాల కారణంగానే తన తల్లి, నలుగురు చెల్లెళ్లను హతమార్చినట్లు ప్రాథమికంగా అంగీకరించాడు. మరణించిన వారిని తల్లి అస్మా, అలియా (9), అల్షియా (19), అక్సా (16), రహ్మీన్ (18)గా గుర్తించారు. అయితే, ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడించినున్నట్టు డీసీపీ తెలిపారు.Lucknow, Uttar Pradesh: A murder was reported at Hotel Sharanjeet in Thana Naka.JCP Crime Bablu Kumar says, "We received information about five dead bodies in a hotel room at Naka police station. Immediately, the local police reached the spot, took possession of the bodies, and… pic.twitter.com/N6GmX8HCcU— IANS (@ians_india) January 1, 2025 -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జహీరాబాద్–బీదర్ రహదారిపై కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. న్యాల్కల్ మండలం హుస్సేల్లి గ్రామం వద్ద ఈ ప్రమాదం సంభవించిందిఈ ప్రమాదంలో మరణించిన వారిని తండ్రి, కుమార్తె, అల్లుడు, మనువడిగా గుర్తించారు. వీరంతా పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.మాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Israel-Hamas war: రక్తమోడుతున్న గాజా
డెయిర్ అల్ బలాహ్: ఇజ్రాయెల్ సైన్యం యథేచ్ఛగా జరుపుతున్న దాడులతో గాజా ప్రాంతం రక్తమోడుతోంది. శనివారం ఉదయం జవైదా పట్టణంలోని ఓ నివాసంతోపాటు పక్కనే ఉన్న శరణార్థులు తలదాచుకున్న భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో సమీ జవాద్ అల్ ఎజ్లా, అతడి కుటుంబంలోని 18 మంది మృత్యువాతపగా, మరో వ్యక్తి గాయపడ్డారు. మృతులను సమీ ఇద్దరు భార్యలు, 2 నుంచి 22 ఏళ్ల వయస్సున్న 11 మంది సంతానం, వారి అమ్మమ్మ, మరో ముగ్గురు బంధువులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి గాజాలోకి చేపలు, మాంసం తరలించే ప్రక్రియకు సమీ సమన్వకర్తగా వ్యవహరించేవాడని, చాలా మంచి వ్యక్తని చెప్పారు. ఘటన సమయంలో రెండు భవనాల్లో కలిపి 40 మంది వరకు ఉన్నట్లు వివరించారు. ఇలా ఉండగా, సెంట్రల్ గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం పాలస్తీనియన్లను హెచ్చరించింది. ఆ ప్రాంతం వైపు నుంచే తమ భూభాగం మీదికి మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగిస్తున్నారని పేర్కొంది. -
కువైట్‌లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం
గల్ఫ్ దేశం కువైట్‌లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ భారతీయ కుటుంబం సజీవదహనం అయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కువైట్‌లోని అబ్బాసియా ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో చోటు చేసుకుంది.వివరాలు.. కేరళకు చెందిన నాలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు రాత్రి 9 గంటలకు నిద్రపోయిన తర్వాత వారిలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే ఆ కుటుంబం మంటల్లో సజీవదహనం అయింది.Four members of a #Malayali family died in a fire accident at their residence in Abbasiya, #Kuwait. The deceased are Mathew Muzhakkal, his wife Lini Abraham, and their children Isaac and Irene, all hailing from Thiruvalla, #Kerala.The fire broke out in the second-floor… pic.twitter.com/AAa8K7jZqz— South First (@TheSouthfirst) July 20, 2024మృతి చెందినవారిని మాథ్యూ ములక్కల్ (40), అతని భార్య లిని అబ్రహం (38), వారి పిల్లలు ఇరిన్ (14),ఇస్సాక్ (9)గా గుర్తించారు. వీరు కేరళలో అలప్పుజ జిల్లాలోని నీరట్టుపురానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇటీవల వారు కేరళ వచ్చి.. శుక్రవామరే అక్కడివెళ్లారు. అంతలోనే రాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనలో కుటుంబం మొత్తం మృతి చెందటంపై తల్లిదండ్రులు, కుటంబ సభ్యులు కనీరుమున్నీరు అవుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం ఇంట్లోని ఏసీ పవర్ ఫెయిల్యూర్ కారణంగా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో వారంతా విషపూరిత వాయువును పీల్చుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక.. గతనెల ఓ అపార్టుమెంట్లో భారీగా మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో మొత్తం 49 మంది మరణించగా.. 45 మంది భారతీయులేనని అధికారలు గుర్తించారు. ఇందులో కేరళ, తళమిళనాడుకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలకు కేరళ ప్రభుత్వం రూ. 5 లక్షలు పరిహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. -
హనుమకొండ: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
హనుమకొండ, సాక్షి: జిల్లా రహదారి నెత్తురోడింది. శుక్రవారం తెల్లవారుజామున ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఇసుక లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. గాయపడిన వాళ్లను వరంగల్ ఎంజీఎం తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లంతా ఏటూరునాగారంకు చెందిన ఒకే కుటుంబంగా నిర్ధారణ అయ్యింది. దైవదర్శనం కోసం శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతదేహాల్ని ఎంజీఎం మార్చురీకి తరలించి పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతులు మంతెన కాంతయ్య(72) మంతెన శంకర్(60) మంతెన భారత్(29) మంతెన చందన(16) చికిత్స పొందుతున్నవాళ్లు మంతెన రేణుక(60) మంతెన భార్గవ్(30) మంతెన శ్రీదేవి(50) -
విధి అంటే ఇదేనేమో.. స్వగ్రామానికి వస్తూ అనంతలోకాలకు..
కొణిజర్ల: పిల్లల సెలవులు కొద్ది రోజుల్లో ముగియనున్నాయి.. దీంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఆ దంపతులు ఊళ్లో ఉంటున్న తల్లిదండ్రులతో కలిసి తిరుమల వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ క్రమంలో కారులో స్వగ్రామానికి వస్తుండగా లారీ రూపంలో వారిని మృత్యువు కబళించింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేష్(40) భార్య సుజాత(35), కుమారులు దివిజిత్ శ్రీరామ్, అశ్విత్ శ్రీరామ్(13)తో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రగతినగర్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. పిల్లలకు వేసవి సెలవులు ముగియనుండడంతో విప్పలమడకలో ఉంటున్న తల్లిదండ్రులతో కలిసి తిరుమల తిరుపతి వెళ్లాలని రాజేష్ భావించారు. ఈ క్రమంలో కారులో హైదరాబాద్ నుంచి విప్పలమడకకు బుధవారం రాత్రి బయలుదేరారు. ఇంతలోనే కొణిజర్ల పోలీస్‌స్టేషన్ సమీపాన జాతీయ రహదారిపై ఒక ట్యాంకర్ మరమ్మతుకు రావడంతో రోడ్డుపైనే ఆగిపోయింది. ఆ ట్యాంకర్ వెనుకాల మరో లారీ ట్యాంకర్‌ను డ్రైవర్ నిలిపివేశాడు. అదే క్రమంలో రాజేష్ కూడా తమ కారుని ఆపాడు. అయితే, వెనుక నుంచి మరో లారీ అతివేగంగా వచ్చి వీరి కారును బలంగా ఢీకొట్టడంతో రెండు లారీల మధ్య కారు ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. ఘటనలో రాజేష్, సుజాత, అశ్విత్ ఘటనాస్థలిలోనే మృతి చెందగా పెద్దకుమారుడు దివ్యజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇంకో అర గంటలో ఇంటికి చేరతారనగా ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో షాక్ -
క్షణికావేశం.. తమిళనాడులో దారుణం!
క్షణికావేశం.. ఓ కుటుంబాన్ని చిదిమేసింది. నలుగురి ప్రాణాలను మంటలకు ఆహుతి చేసింది. కడలూరుజిల్లాలో భార్యతో గొడవ పడిన ఓ భర్త అత్తారింటికి వెళ్లి మరీ ఘోరానికి పాల్పడ్డాడు. ఏకంగా ఐదుగురిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో నిందితుడితో పాటు వదిన, అన్నెపుణ్యం ఎరుగని ఇద్దరు పసిబిడ్డలు నామరూపాల్లేకుండా పోయారు. భార్య, అత్త కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాతున్నారు. సాక్షి, చెన్నై: దంపతుల మధ్య విడాకుల వివాదం ఓ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. భార్యపై కోపంతో భర్త.. ఏకంగా ఆమె కుటుంబాన్నే తగల బెట్టేశాడు. కడలూరు చెల్లాంకుప్పంలో జరిగిన ఈ ఘటన బుధవారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. వివరాలు.. స్థానిక పిళ్లయార్ వీధిలోని ఓ ఇంట్లో ప్రకాష్(35), తమిళరసి(31), ఏడాది వయసున్న కుమార్తె హాసిని, తమిళరసి తల్లి సెల్వి నివాసం ఉంటున్నారు. తమిళరసి సోదరి ధనలక్ష్మికి రెండేళ్ల క్రితం దేవనంపట్నాకి చెందిన సద్గురుతో వివాహమైంది. వీరికి ఆరు నెలల మగ బిడ్డ ఉన్నాడు. ధనలక్ష్మి, సద్గురుల మధ్య నిత్యం గొడవలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విరక్తి చెందిన ధనలక్ష్మి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆమె తన ఆరునెలల బిడ్డతో సహా తమిళరసి ఇంటికి వచ్చేసింది. అయినప్పటికీ ధనలక్ష్మి, సద్గురు ఫోన్లో తరచూ గొడవపడేవారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయాన్నే ప్రకాష్ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లిపోయాడు. ఇంట్లో ధనలక్ష్మి, తమిళరసి, సెల్వి, పసి బిడ్డలు మాత్రమే ఉన్నారు. ఆగ్రహంతో ఇంట్లోకి వచ్చిన సద్గురు భార్య ధనలక్ష్మితో ఘర్షణ పడ్డాడు. తర్వాత తన వెంట తెచ్చుకున్న క్యాన్‌లోని పెట్రోల్‌ను ఇంట్లో ఉన్న వారందరిపై పోసి నిప్పంటించాడు. ఆపై తానూ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తమిళరసి, ఇద్దరు పసిబిడ్డలు అక్కడికక్కడే మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న ధనలక్ష్మి, అత్త సెల్వి, భర్త సద్గురును ఆసుపత్రికి తరలించారు. మార్గం మధ్యలో సద్గురు కూడా మరణించాడు. మృతదేహాలను పోస్టుమారా్టనికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ధనలక్ష్మి, సెల్వి పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. -
గంగాధర మిస్టరీ మరణాల్లో కొత్తకోణం.. మమత శరీరంలో ఆర్సెనిక్!
సాక్షి, కరీంనగర్: సంచలనం సృష్టించిన కరీంనగర్ జిల్లాలోని గంగాధర మిస్టరీ కేసు మరో మలుపు తిరగనుంది. పోలీసులు అనుమానిస్తున్నట్లు ఇంటి పెద్ద వేముల శ్రీకాంత్ తన భార్యాపిల్లలపై విషప్రయోగం చేశాడని నిర్ధారణ అయితే.. పిల్లల మృతదేహాలకూ పోస్టుమార్టం తప్పేలా లేదు. డిసెంబరు 30న అర్ధరాత్రి వేముల శ్రీకాంత్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇదే విషయాన్ని చికిత్స సమయంలో వైద్యులకు చెప్పాడు. ఈ పరిణామంతో పోలీసుల దర్యాప్తు అకస్మాత్తుగా శ్రీకాంత్ వైపు తిరిగింది. శ్రీకాంత్ బయోటెక్నాలజీలో పీజీ చేయడం.. ఫుడ్ సైన్స్ లెక్చరర్ కావడం.. రోజూ ప్రయోగాల కోసం ల్యాబ్‌లో రసాయనాలు వినియోగించడం.. వెరసీ అతనికి కెమికల్స్‌పై పూర్తిస్థాయి అవగాహన ఉందని పోలీసులు నిర్ధా రణకు వచ్చారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల తరహాలోనే తానూ రక్తపువాంతులు, విరోచనాలు చేసుకుని మరణించడంతో వారి శరీరంలోనూ సోడియం హైడ్రాక్సైడ్ చేరిందా..? అనే సందేహాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఫోరెన్సిక్ అధికారులు మమత శరీరంలో ఆర్సెనిక్ ఆనవాళ్లు ఉన్నాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు వారు మరింత లోతుగా రసాయన విశ్లేషణ జరుపుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై ఎఫ్ఎస్ఎల్ తుది నివేదిక పంపితే.. మమత మరణానికి స్పష్టమైన కారణం తెలియనుంది. 45 రోజుల్లో నలుగురు ఈ ఘటనల్లో తొలుత శ్రీకాంత్ కొడుకు అద్వైత్ (20నెలలు)వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురై నవంబరు 16న కన్నుమూశాడు. అవే లక్షణాలతో కూతురు అమూల్య (6) డిసెంబర్ ఒకటిన ప్రాణాలు విడిచింది. ఈ రెండు మరణాలకు వైద్యులు కారణాలు చెప్పలేకపోయారు. అంతుచిక్కని వ్యాధి, కలుషిత తాగునీరు కారణమనుకుని సమీపంలోని బావిలోని తాగునీటిని, బాధితుల బంధువుల రక్తాన్ని పరీక్షించారు. అయినా వారికి ఏమీ చిక్కలేదు. దీంతో మిస్టరీ మరణాలు చేతబడి, మంత్రాల కారణంగా జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. శ్రీకాంత్ భార్య మమత (26) కూడా అనారోగ్యానికి గురై డిసెంబరు 18న మరణించింది. డిసెంబరు 30న శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. 45 రోజుల వ్యవధిలో మొత్తం కుటుంబం అనుమానాస్పద స్థితిలో తుడిచిపెట్టుకుపోయింది. మమత శరీరంలో ఆర్సెనిక్..! మరి పిల్లల్లో..? పోలీసుల వినతి మేరకు మమత పోస్టుమార్టం సమయంలో వైద్యులు విస్రా (శరీరంలోని కీలక అంతర్భాగాలు)ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మమత శరీర భాగాల్లో ఆర్సెనిక్ ఆనవాళ్లను గుర్తించారు. దీన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఆమె శరీరంలోకి ఎలా చేరింది..? పిల్లల మరణాలకు కారణం ఆర్సెనికా..? లేదా సోడియం హైడ్రాక్సైడా..? అనే విషయాన్ని పోలీసులు ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. పిల్లలిద్దరూ అనారోగ్య లక్షణాలతో మరణించారని వారికి పోస్టుమార్టం నిర్వహించలేదు. ఇపుడు వారి మరణంపై అనేక సందేహాలు వెలుగులోకి రావడంతో వారి శవాలకు పోస్టుమార్టం తప్పనిసరి కానుంది. అందుకే పిల్లల శరీర భాగాల నుంచి విస్రా (అంతర్భాగాల నుంచి నమూనాలు)ను తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: వాడు నీ కొడుకే.. కిడ్నాప్ కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్! రెండు నెలల అనంతరం.. నవంబరు 16న 20 నెలల అద్వైత్ అనుమానాస్పదంగా మరణించాడు. అతడిని గంగాధర శివారులోని వంతెన సమీపంలో ఖననం చేశారు. డిసెంబరు ఒకటిన అమూల్య (6) కూడా కన్నుమూసింది. దీంతో తమ్ముడి సమాధి పక్కనే అక్కనూ ఖననం చేశారు. వీరిలో అద్వైత్ మరణించి 50 రోజులు, అమూల్య చనిపోయి 35 రోజులు దాటింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రావడానికి వారం పట్టవచ్చని పోలీసులు అంటున్నారు. ఒకవేళ మమత శరీరంలో విష ఆనవాళ్లు ఉంటే పిల్లల మరణాలకు కారణం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే నిజమైతే.. పిల్లలు మరణించిన దాదాపు రెండు నెలల అనంతరం పోస్టుమార్టం చేయాల్సి వస్తుందని పలువురు సీనియర్ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
తమిళనాడు: విషాదం.. ఫ్రిజ్ పేలి ముగ్గురు మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. చెంగల్పట్టు జిల్లా కోదండరామ్ నగర్లో ఘటన జరిగింది. మరణించిన వారిని గిరిజ (63), రాధ (55), రాజ్‌కుమార్ (47)గా గుర్తించారు. కుదువంచెరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రెండు నెలల క్రితం లవ్ మ్యారేజ్.. అంతలోనే షాకింగ్ ఘటన.. అసలు ఏం జరిగింది? -
విషాదం: గడ్డివాములో కుటుంబం అంతా ఆహుతి
సాక్షి, చెన్నై: హతమార్చి దహనం చేశారా..? లేదా బలవన్మరణానికి పాల్పడ్డారా..? కారణమేమైనా.. ఓ కుటుంబం గడ్డివాములో కడతేరిపోయింది. ముగ్గురి మృతదేహాలు ఆహుతి కావడం, మరొకరి మృతదేహం సగం కాలి ఉండడం మిస్టరీగా మారింది. శనివారం దిండుగల్ జిల్లా పళనిలో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలు.. దిండుగల్ జిల్లా పళని సమీపంలోని వత్తగౌండం వలసకు చెందిన చిన్న రాజా అలియాస్ మురుగేషన్(52) రైతు. ఇతడికి పళని సంతలో దుకాణం కూడా ఉంది. ఆయనకు భార్య వలర్మతి(45), శివరంజని(21) కుమార్తె, కార్తికేయన్(18) కుమారుడు ఉన్నారు. చదవండి: తాలిబన్లకు మద్దతిచ్చిన 15 మంది అరెస్టు పిల్లలు ఇద్దరు పళని, ఒట్టన్‌చత్రంలోని కళాశాలల్లో బీఎడ్, బీకాం చదువుకుంటున్నారు. పంట పొలంలోనే చిన్న ఇల్లు కట్టుకుని ఈ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో శనివారం ఉదయాన్నే ఆ ఇంటి ముందు ఉన్న గడ్డివాము, పక్క నే ఉన్న జొన్న పంట తగల బడుతుండటాన్ని సమీ పంలోని రైతులు గుర్తించారు. మురుగేషన్‌కు సమాచారం ఇచ్చేందుకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ఆహుతైన స్థితిలో.. సమాచారం అందుకున్న ఆయకుడి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు.అయితే, గడ్డివాములో సగంకాలిన స్థితిలో మురుగేషన్ మృత దేహం, పూర్తిగా కాలిన స్థితిలో మిగిలిన ముగ్గురి మృతదేహాలు బయటపడడం తీవ్ర కలకలం రేపింది. దిండుగల్ ఐజీ అన్భు, డీఐజీ విజయకుమార్, ఎస్పీ శ్రీనివాసన్, డీఎస్పీ శివకుమార్ నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుని విచారణ చేపట్టింది. ఇంట్లో అక్కడక్కడ రక్తపు మరకలు, చిందర వందరగా వస్తువులు పడి ఉండడంతో ఇది హత్యగా అనుమానించారు. చదవండి: ప్రేమ పేరుతో వంచించి.. నగ్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. అయితే, అక్కడకు ఇతర వ్యక్తులు వచ్చి వెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. మృతదేహాల్ని పోస్టుమార్టం చేయగా, నలుగురు విషం తాగి ఉన్నట్లు తేలడంతో ఈ కేసు పోలీసులకు ఓ సవాల్‌గా మారింది. భార్య, పిల్లలకు విషం ఇచ్చి హతమార్చినానంతరం, గడ్డివాములో పడేసి మురుగేషన్ నిప్పు పెట్టి ఉండ వచ్చని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: 200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత చివరకు తాను ఆ విషం సేవించి మంటల్లో ఆహుతై ఉండ వచ్చని , అందుకే అతడి మృతదేహం సగమే కాలినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే, కుటుంబం అంతా బలన్మరణానికి పాల్పడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ చేదింపునకు ఆయకుడి పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. -
కీసరలో విషాదం: అవమానం భరించలేక కుటుంబం ఆత్మహత్య
సాక్షి, కీసర: ఓ వివాదం.. దాడి.. అవమానం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అవమానం భరించలేనంటూ జీవితంపై విరక్తి చెందాడు. భార్యా, ఇద్దరు కన్నబిడ్డలకు ఉరిపోశాడు. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి ఓ కుటుంబం బలైంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన శుక్రవారం కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుషాయిగూడ అడిషనల్ డీసీపీ శివకుమార్, కీసర సీఐ నరేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణిగుంటకు చెందిన భిక్షపతి (37), ఉష (33) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు అక్షిత (11) యశ్వంత్ (7). కొన్నేళ్లుగా నాగారంలోని వెస్ట్‌గాంధీనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. భిక్షపతి ఆటోనడుపుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఇంటి సమీపంలోని ఫిల్టర్ వాటర్ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళ తన 15 ఏళ్ల కూతురుతో ఉంటోంది. ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆ బాలిక బంధువులు గురువారం సాయంత్రం భిక్షపతి ఇంటికొచ్చి గొడవకు దిగారు. అతడిపై దాడి చేశారు. ఇదే విషయమై శుక్రవారం పెద్దల సమక్షంలో మాట్లాడదామని చెప్పి భిక్షపతిని వదిలేశారు. శుక్రవారం ఉదయం భిక్షపతి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆటో తీసుకొని వెళ్తుండగా బాలిక కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షపతి ఇంట్లోకెళ్లాడు. మొదట భార్య, ఇద్దరు పిల్లలకు ఉరివేసి తర్వాత తానూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను బాలికతో ఎంతమాత్రం అసభ్యంగా ప్రవర్తించలేదని, కొంతమంది కావాలని తనపై నింద వేసినట్లు గురువారం రాత్రి స్థానికులు, బంధువులకు భిక్షపతి చెప్పినట్లు సమాచారం. సూసైడ్‌నోట్ రాసి.. ఇరుగుపొరుగు వారి సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని భిక్షపతి ఇంట్లోకెళ్లి పరిశీలించగా భార్య, ఇద్దరు పిల్లలు విగత జీవులుగా మంచంపై పడి ఉన్నారు. భిక్షపతి ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతిచెందినట్లు గుర్తించారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. ఓ సూసైడ్‌నోట్ కూడా దొరికింది. తమ చావులకు కారణమంటూ కొంతమంది పేర్లను భిక్షపతి రాసినట్లు గుర్తించారు. తర్వాత భిక్షపతి కుటుంబీకుల మృతదేహాలను తీసుకెళ్లనీయకుండా స్థానికులు, బంధువులు పోలీసులను అడ్డుకున్నారు. కారకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని, సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు స్పందించి ఉంటే.. గురువారం రాత్రి భిక్షపతిపై దాడి జరిగిన సమయంలో ఆయన భార్య ఉష డయల్ 100కు ఫోన్ చేసి తన భర్తను కొడుతున్నారని చెప్పింది. దీంతో పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పుడు గొడవకు దిగిన వారిలో కొందరు కులపెద్దల సమక్షంలో మాట్లాడి పరిష్కరించుకుంటామని చెప్పడంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం. గురువారం రాత్రే పోలీసులు సరిగ్గా స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు అన్నారు. ‘ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. తనపై దాడి వల్లనే మనస్తాపానికి గురై భిక్షపతి ఇలా ఘాతుకానికి పాల్పడ్డాడా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తాం. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం’అని కుషాయిగూడ అదనపు డీసీపీ శివకుమార్ చెప్పారు. -
కరోనా; ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఆళ్లగడ్డ: కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో నలుగురిని బలిగొంది. దీంతో రుద్రవరం మండలం నర్సాపురంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన రాచంరెడ్డి రామిరెడ్డి సోదరి దస్తగిరమ్మ(70) కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడింది. తర్వాత ఆమె కుమారుడు నాగార్జునరెడ్డి(48)కి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. కోలుకోలేక ఈ నెల 8వ తేదీ నాగార్జునరెడ్డి, ఈ నెల 11న దస్తగిరమ్మ చనిపోయారు. ఈ విషాదాన్ని మరచిపోకముందే దస్తగిరమ్మ అన్న రాచంరెడ్డి రామిరెడ్డి(80) ఈ నెల 13న, రామిరెడ్డి కుమారుడు రామ్మోహన్‌రెడ్డి(54) శుక్రవారం మృతిచెందారు. -
చిన్నతయ్యూరులో విషాదఛాయలు
శ్రీరంగరాజపురం : మండలంలోని చిన్నతయ్యూరు దళితవాడలో ఓ కుటుంబానికి సంబంధించిన అందరూ మృతిచెందడంతో మంగళవారం విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నతయ్యూరు దళితవాడకు చెందిన సుధాకర్ వ్యసనాలకు బానిస అయ్యాడని, అతని భార్య సింధు ఇద్దరు ఆడపిల్లలను సోమవారం బావిలో పడేసి ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడటం.. తరువాత ఈ సంఘటను చూసి సుధాకర్ అక్కడే చెట్టుకుని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడటం తెలిసిందే. మంగళవారం సుధాకర్(33), అతని భార్య సింధు(28), పిల్లలు మధుప్రియ(7), శ్రీలత(4) మృతదేహాలను గ్రామంలోకి తీసుకొచ్చారు. గ్రామస్తులు, బంధువులు, చుట్టు పక్కల ప్రజానీకం పెద్దఎత్తున గ్రామంలోకి చేరుకున్నారు. మృతదేహాలను చూసి వారు చలించిపోయారు. భోరున రోదించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లల మృత దేహాలకు శోకతప్త హృదయాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్ఐ శ్రీనివాస్‌రావు, పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు. -
కుటుంబం మృత్యువాత; జాడ లేని భర్త
సాక్షి, భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ వివాహిత, తన ముగ్గురు మైనర్ పిల్లలతో సహా మృతి చెందిన ఘటన స్థానికులను కలిచివేసింది. అక్కల్‌పూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ముప్పైయేళ్ల లక్ష్మీబాయి, తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో.. ఆదివారం నాడు లక్ష్మీతోపాటు ముగ్గురు పిల్లలు విగత జీవులుగా కనిపించారు. మృతుల్లో ఐదు సంవత్సరాల చిన్నారితో పాటు, నెల కూడా నిండని పసికందు ఉండటం గమనార్హం. ఇది హత్యా, ఆత్మహత్యా అన్న వివరాలు తెలియరాలేదు. అయితే మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వీరి మృతికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఇక కనిపించకుండా పోయిన మహిళ భర్త కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: భర్తే విషమిచ్చి హతమార్చాడు -
అయ్యో! దేవుడా.. ఎంత ఘోరం
కర్ణాటకలోని భద్రావతిలో ఏటా జరిగే జాతరకు వెళ్లొస్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన ఆ కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో అధికులు చిత్తూరు మండలంలోని కుర్చివేడు గ్రామస్తులు కావడంతో ఊరంతా కన్నీటి సంద్రమైంది. చిత్తూరు రూరల్: కర్ణాటకలోని బెంగళూరు–పుణె జాతీయ రహదారి హిరియూరు తాలూకా మేడికుర్కి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. చిత్తూరు మండలం కుర్చివేడుకు చెందిన మోహన్‌నాయుడు, ఆయన భార్య లక్ష్మి (తాయమ్మ) పుట్టినిల్లైన కర్ణాటకలోని భద్రావతికి ఆదివారం కారులో వెళ్లారు. ఏటా అక్కడ జరిగే జాతరకు క్రమం తప్పకుండా వెళ్లడం వీరి ఆనవాయితీ. మంగళవారం భద్రావతిలోని బండే మారెమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులంతా జాతరలో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. బుధవారం మధ్యాహ్నం స్వగ్రామానికి తిరుగుముఖం పట్టారు. హిరియూరు తాలూకా, మేడుకుర్కి వద్ద కారు ముందరి టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. బెంగళూరు–పుణే జాతీయ రహదారి 48 రోడ్డుపై డివైడర్‌ను దాటుకుని పల్టీలు కొడుతూ ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొంది. ఇదంతా క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడిక్కడికే మృత్యువాత పడ్డారు. మృతుల వివరాలు లక్ష్మి అలియాస్ తాయమ్మ (50), లత (26), వర్ణిక (09), జాహ్నవి (3), సుశ్మిత (13) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మోహన్‌నాయుడు భార్య లక్ష్మి, కోడలు లత, మనవరాలు వర్ణిక ఉన్నారు. వీరి మృతదేహాలు కుర్చి వేడు గ్రామానికి తీసుకొచ్చారు. పెద్దకుమార్తె కూతురు జాహ్నవి మృతదేహాన్ని పాలసముద్రం మండలంలోని ఆముదాల గ్రామానికి, బావమరిది కుమార్తె సుశ్మిత మృతదేహాన్ని బెంగళూరుకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కన్నీటి పర్యంతమవుతున్న మోహన్‌నాయుడు చిన్న కుమార్తె మంజుల నలుగురికి గాయాలు ఈ ప్రమాదంలో మోహన్‌నాయుడికి వెన్నెము క విరిగింది.ఆయన కుమారుడు ప్రకాష్ తలకు, పెద్ద కుమార్తె ద్రాక్షాయణి కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ద్రాక్షాయణి పెద్ద కుమార్తె లిఖిత స్వల్ప గాయాలతో బయటపడింది. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం అక్కడి ఆసుపత్రికి తరలించారు. గురువారం మధ్యాహ్నం మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి. దీంతో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. గ్రామంలో ఇది వరకు ఎన్నాడు లేని విధంగా ఒకే కుటుంబానికి ఐదుగురు మృతి చెందడం గ్రామస్తులు, బంధువులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన మోహన్‌నాయుడు కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. అయితే జిల్లాలో కరవు పరిస్థితులు, వ్యవసాయం చేయడం భారమైన నేపథ్యంలో మోహన్‌నాయుడు కుమారుడు ప్రకాష్ కొంతకాలంగా బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. -
పండగ ప్రయాణం విషాదాంతం
కోదాడరూరల్: బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి పండగను ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు.. తిరిగి హైదరాబాద్ వస్తున్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ దుర్ఘటనలో భార్య, భర్త, కూతురు మృతి చెందగా కుమారుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ దుర్ఘటన బుధవారం ఉదయం కోదాడ మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొమరబండ శివారులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాలోని చర్లపల్లి ఈసీనగర్‌కు చెందిన రావి నాగమురళీకృష్ణ(48) ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంతో పాటు వ్యాపారం చేస్తుంటాడు. ఇతడి భార్య కవిత(42) బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉన్నతోద్యోగం చేస్తోంది. ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు ధనుష(17), కుమారుడు యునిత్తో కలిసి సంక్రాంతికి అత్తగారి గ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపాలెం వెళ్లారు. అక్కడ బంధువులతో ఆనందంగా గడిపిన వారు బుధవారం ఉదయం హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలో కొమరబండ శివారుకు రాగానే వేగంగా వస్తున్నకారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం గాలిలోకి ఎగిరి అటువైపుగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టి.. పక్కనే ఉన్న కల్వర్టును బలంగా తాకింది. ఈ ఘోర ప్రమాదంలో యునిత్ చెయ్యి విరిగి గాయాలతో బయట పడగా.. మిగతా ముగ్గురూ అక్కడి కక్కడే మృతి చెందారు. యునిత్ కారు వెనుక సీ టులో పడుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని స్థానికులు తెలిపారు. తల్లిదండ్రులు, అక్క మృతి చెందడంతో బాలుడు అనాథగా మిగిలాడు. గాలిలో ఎగిరిపడిన మృతదేహాలు కారు వేగంగా కల్వర్టును ఢీకొట్టడంతో కవిత, ధనుషలు 15 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారు. కవిత తలపైభాగం విడిపోయి దూరంగా పడింది. సీటు బెల్టు పెట్టుకున్న మురళీకృష్ణ కారులోనే తీవ్ర గాయాలతో మృతి చెందాడు. కారులో ఇరుక్కుపోయిన అతన్ని పోలీసులు అతికష్టం మీద బయటకు తీశారు. కవిత, ధనుష మృతదేహాలు, చికిత్స పొందుతున్న బాలుడు యునిత్ అతివేగమే కారణమా? ఈ ప్రమాదానికి అతి వేగమే కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. వేగంగా ప్రయాణించడంతోనే అదుపుతప్పి కారు దాదాపు 20 మీటర్ల దూరం వరకు డివైడర్‌పై ఉన్న చెట్లను వేర్లతో సహా పెకిలించుకుని పూర్తిగా అవతలివైపునకు వెళ్లి బలంగా ఢీకొట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీంతోనే పాటు ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నా పగిలిపోవడం, మృతదేహాలు దూరంగా ఎగిరిపడడం చూస్తుంటే అతి వేగమే కారణమని నిర్థారిస్తున్నారు. మరో ముగ్గురికి గాయాలు నాగమురళీకృష్ణ కారు అవతలి వైపు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టడంతో ఓ కారులో ఉన్న ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన కంభంపాటి ఈశ్వర్, సోమనగారి స్వామి, హైదరాబాద్‌కు చెందిన కలువ అనిరుథ్లకు గాయాలయ్యాయి. వారు స్థానిక ప్రైవేట్ వైద్యాశాలలో చికిత్స పొందుతున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన విషయాన్ని తెలుసుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గాయపడిన బాధితులకు మెరుగైన సహాయం అందే విధంగా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అప్పటికే డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, పట్టణ, రూరల్ సీఐలు శ్రీనివాసరెడ్డి, రవితో పాటు రూరల్, అనంతగిరి ఎస్‌లు దశరథ, రామాంజనేయులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదంపై ఏపీ హోంమంత్రి ఆరా ప్రమాదం జరిగిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చిన్న రాజప్ప కోదాడ పోలీసులను ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్‌తో నలుగురు మృతి
శ్రీకాళహస్తి: గ్యాస్ గీజర్ లీకేజికి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ తోడవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం రాజులకండ్రిగ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ విషాదంచోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి (34) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య బుజ్జమ్మ అలియాస్ భాగ్యలక్ష్మి (28) ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో సెక్యూరిటీగా పని చేస్తోంది. వారికి భవ్య (6), నిఖిల్‌కుమార్‌రెడ్డి (4) సంతానం. వారు శనివారం రాత్రి రాజులకండ్రిగ లోని స్వగృహంలో నిద్రిస్తుండగా గ్యాస్ గీజర్ పైపు లీకైంది. దానికితోడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో నలుగురూ సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనివాసులురెడ్డి ఇంటికి సమీపంలోనే గృహప్రవేశం నిమిత్తం పలువురు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో నుంచి మంటలు వస్తుండడాన్ని గుర్తించి వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సహకరించారు. అయితే అప్పటికే శ్రీనివాసులురెడ్డి కుటుంబానికి చెందిన నలుగురూ మృతి చెందారు. వెంటనే పోలీసులు వారి బంధువులకు సమాచారమిచ్చారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రి వైద్యులను రాజులకండ్రిగ గ్రామానికి పిలిపించి అక్కడే పోస్ట్‌మార్టం, పంచనామా కార్యక్రమాలు పూర్తి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ పి.అనిల్‌బాబు తెలిపారు. ఘటనపై పలు అనుమానాలు.. అయితే ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం గ్యాస్ గీజర్ లీకై ఏర్పడిందా.. లేదా కావాలనే చేసుకున్నారా అని అనుమానిస్తున్నారు. శ్రీనివాసులురెడ్డి ఇటీవల ఇంటి స్థలం కొనుగోలు చేయడంతో పాటు రూ.10 లక్షల మేర వెచ్చించి పక్కా భవనాన్ని నిర్మించారు. దాంతో వారికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. పలుచోట్ల చీటీలు వేశారని, వాటిని కట్టడానికి నానా అగచాట్లు పడ్డారని స్థానికులు వెల్లడించారు. ఇద్దరూ సంపాదిస్తేనే ఆర్థిక కష్టాలు తీరుతాయనే ఉద్దేశంతో బుజ్జమ్మ సమీపంలోని ఓ కర్మాగారంలో సెక్యూరిటీగా చేరారు. ఉద్యోగంలో చేరిన తర్వాత శ్రీనివాసులురెడ్డికి భార్యపై అనుమానాలు మొదలయ్యాయని, మరోవైపు ఆర్థిక కష్టాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని, దాంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. -
విద్యుత్ తీగలే విషనాగులై..
విధి ఆ కుటుంబంపై విషం చిమ్మింది. కూలినాలి చేసుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్న వారిపై కన్ను కుట్టినట్లుంది. వారి రాతను తిరగరాసింది. నట్టింట కాపుకాసిన మృత్యువు ఆ ఇంట మరణ మృదంగం మోగించింది. మృత్యువు ఎదుటే ఆడుతున్నా ఆ ఇల్లాలు ముప్పును తప్పించలేకపోయింది. అభం, శుభం తెలియని పసికందులతోపాటు భర్త మృత్యుపాశాల్లో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటుంటే ఆమె ప్రాణం తల్లడిల్లిపోయింది. ఒకరి తరువాత ఒకరు మృత్యుడికి చేరుతుంటే కాపాడండి కాపాడండి.. అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించినా ఆమెకు గుండె కోతే మిగిలింది. గురువారం మండలంలోని గనికపూడిలో విద్యుత్ షాక్ గురై తండ్రీ, కొడుకు, కూతురు మృత్యు వాత పడ్డారు. గుంటూరు, గనికపూడి (ప్రత్తిపాడు): స్థానికులు, పోలీసులు, బంధువుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన గుమ్మడి ఏసు తన భార్యా పిల్లలతో కలిసి తమ బంధువైన గుమ్మడి పెద్దంకమ్మ గృహ ప్రవేశానికి హాజరయ్యేందుకు ఈ నెల 11వ తేదీన గనికపూడి వచ్చారు. 12వ తేదీన గృహ ప్రవేశం పూర్తయింది. తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోదామనుకున్నారు. అయితే వీరికి సమీప బంధువులైన మరొకరి ఇంట్లో 13వ తేదీన పుష్పాలంకరణ వేడుక ఉండటంతో ఆగిపోయారు. గురువారం కొత్తగా గృహ ప్రవేశం పూర్తి చేసిన ఇంట్లోకి కేబుల్ వైరు లాగేందుకు గుమ్మడి ఏసు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం ఎక్కి చిన్నపాటి మరమ్మతుటు చేశాడు. స్ప్రింగ్ వైర్ సాయంతో కేబుల్ వైర్‌ను ఇంటి లోపలకు లాగుతున్నాడు. ఇదే సమయంలో కూతురు ఎస్తేరురాణి (3) వైర్‌ను పట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయింది. కూతురిని కాపాడేందుకు తండ్రి ఏసు (28) ప్రయత్నించడంతో అతనూ షాక్‌కు గురయ్యాడు. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే చనిపోయారు. తండ్రి, చెల్లి కదలకుండా పడి ఉండటంతో వారిని పట్టుకున్న కొడుకు సాల్మన్‌రాజు (5) కూడా నోటి వెంట నురుగ కక్కుకుని మరణించాడు. గమనించిన తల్లి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ముందుగా ఇంటికి సరఫరా అవుతున్న కరెంటును నిలిపివేశారు. అప్పటికే ముగ్గురూ విగతజీవులయ్యారు. తల్లి గుమ్మడి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేబ్రోలు సీఐ నరేష్కుమార్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ.. విషయం తెలియడంతో ప్రత్తిపాడు ఎస్ఐ ఎస్ రవీంద్ర ఘటన స్థలానికి చేరుకున్నారు. విషయాన్ని గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తికి, చేబ్రోలు సీఐ నరేష్‌కుమార్‌కు తెలియజేశారు. వారు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేబుల్ వైర్ ఎలా షాక్ కొట్టింది. అసలు కేబుల్ వైర్ నుంచి ఎందుకు విద్యుత్ సరఫరా అవుతుంది? అనే విషయాలపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. బంధాల్ని బలిచేస్తూ.. అప్పటి వరకూ అన్నా చెల్లెళ్లిద్దరూ మారాం చేశారు.. చూడమ్మా అన్న ఏడిపిస్తున్నాడంటూ తల్లి కొంగుచాటుకు చేరిన చెల్లి.. కాదమ్మా చెల్లే నన్ను కొడుతోందంటూ అమ్మ అక్కున చేరిన కొడుకు.. నిండునూరేళ్లు అండగా ఉంటానంటూ అగ్ని సాక్షిగా ఏడగులు నడిచిన భర్త.. ఏడేళ్ల క్రితం ఒక్కటైన ‘మూడు’ ముళ్ల బంధం..అన్నీ అప్పటి వరకు తన చుట్టూనే అల్లుకుని ఉన్నాయి. ఆప్యాయత మధురిమల్లో సంతోషాన్ని కలబోసుకున్నాయి. కొడుకు, కూతురిపై ఆ తల్లి ఎన్నో కలలు, మరెన్నో ఆశలు నింపుకుంది. తానొకటి తలస్తే దైవం మరొకటి తలచింది. ఆమె ఆశల్ని సమాధి చేస్తూ.. బంధాల్ని బలి చేస్తూ.. తన పేగు బంధాలను చిదిమేసింది. భర్తతోపాటు ఇద్దరు పిల్లలు కళ్ల ముందు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేక గుండెలవిసేలా రోదించింది. ‘దేవుడా నేనేం పాపం చేశాను.. నన్నొక్కదాన్ని మాత్రం ఎందుకుంచావు.. నా బిడ్డలు, భర్తలేని లోకంలో నేనెందుకు.. ఏ దేవుడికీ నా మీద జాలి కలగలేదా.. ఏ ఒక్కరినీ నాకు మిగల్చాలనుకోలేదా’ నేనూ బతకలేను.. నన్నూ తీసుకుపో’.. అంటూ కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలిచివేసింది. గామాలపాడులోయువకుడి మృతి గామాలపాడు(దాచేపల్లి): విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని గామాలపాడులో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ నాగుల్ పాత ఇంటికి మరమ్మతులు చేస్తున్నారు. ఇంట్లో ఉన్న కరెంట్ మోటర్ పని చేయకపోవటంతో నాగుల్ కుమారుడు మస్తాన్ మోటర్ వైరును పరిశీలిస్తున్నాడు. ఈ క్రమంలో వైర్‌కు కరెంట్ సరఫరా కావటంతో షాక్‌కు గురై మస్తాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందు మస్తాన్ మృతి చెందటంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై షేక్ మహ్మద్ రఫీ పరిశీలించారు. పొస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భీమవరంలో మహిళ బలి భీమవరం(సత్తెనపల్లి): పొలంలో విద్యుత్ తీగలు తలిగి మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని భీమవరంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..భీమవరానికి చెందిన ఒంటిపులి శేషమ్మ(55) గురువారం మధ్యాహ్నం పొలం పనులకు వెళ్లింది. అక్కడ సూర్యా టెక్స్టైల్స్ జిన్నింగ్ మిల్లు చుట్టూ వేసి ఫెన్సింగ్‌కు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. సత్తెనపల్లి రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. పగలు సైతం ఫెన్సింగ్‌కు విద్యుత్ సరఫరా కావడాన్ని పరిశీలించారు. మృతురాలి సోదరి తిరుపతి లక్ష్మి ఫిర్యాదు మేరకు సూర్య టెక్స్టైల్స్ యజమాని జజ్జనం శ్రీలక్ష్మిపై కేసు నమోదు చేశారు. మృతురాలికి భర్త చిన కోటేశ్వరరావుతోపాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. -
విషాదం
తుగ్గలి: పొలం పనులకెళ్లిన ఓ కుటుంబం తిరిగిరాని లోకాలకు వెళ్లిన సంఘటన రామలింగాయపల్లిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి..గ్రామానికి చెందిన పసుపురాతి పెద్ద రంగన్నకు ఐదుగురు కుమారులు. వారిలో చిన్న కుమారుడైన గంగరాజు(29) వ్యవసాయం చేసుకుంటూ జీనవం సాగించేవాడు. కంది పంటకు పురుగు మందు పిచికారీ చేయాలని గురువారం ఉదయం ఇంటి నుంచి భార్య తిమ్మక్క(26), కుమారుడు రాధాకృష్ణ(8నెలలు)తో కలిసి ఎడ్లబండిలో పొలానికి వెళ్లారు. అయితే రాత్రి ఏడు గంటలైనా ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి వెతికారు. పొలం పక్కనే ఉన్న నీటి కుంట వద్ద ఖాళీ బిందెలు, చెప్పులు కనపడడంతో నీటిలో పడి ఉంటారేమోనని అందులో వెతికారు. నీళ్లు ఎక్కువగా ఉండడం, చీకటి కావడంతో పత్తికొండ ఫైర్ స్టేషన్‌కు సమాచారమిచ్చారు. వారు వచ్చి నీటి కుంటలో నీటిని బయటకు తోడేశారు. శుక్రవారం తెల్లవారుజామున నీటి కుంటలో పడి ఉన్న మృత దేహాలను గుర్తించి బయటకు తీశారు. మృత దేహాలను చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతిపై పలు అనుమానాలు.. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్య, భర్తల మధ్య గొడవ జరిగి క్షణికావేశంతో ఇద్దరూ బిడ్డతో సహ కుంటలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారని కొందరు, ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి మృతి చెందారని కొందరు అనుమానిస్తున్నారు. నీటిని తెచ్చేందుకు కుంట వద్దకు వెళ్లిన గంగరాజు ప్రమాదవశాత్తూ కుంటలో జారిపడడంతో అతన్ని కాపాడే క్రమంలో పక్కనే బిడ్డనెత్తుకున్న తిమ్మక్క కూడా అందులో పడి మృతి చెందారని మృతుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గ్రామంలో విషాద ఛాయలు మృతుడు గంగరాజు ఐదేళ్ల క్రితం గ్రామంలోని తన అక్క కూతురు తిమ్మక్కను పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల క్రితం అన్నదమ్ములు విడి భాగాలు పోయి జీవనం సాగిస్తున్నారు. ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఏ కష్టమొచ్చింది నాయనా ఇంత పని చేశావంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారందనీ కలచి వేసింది. విషయం తెలుసుకున్న డోన్ డీఎస్పీ బాబాపకృద్దీన్, ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ, జొన్నగిరి ఎస్ఐ నజీర్ అహ్మద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తండ్రి పులికొండ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పరిస్థితులు ఊహించే ఆత్మహత్య?
♦ ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణం ఘటన ♦ సత్యనారాయణ కుటుంబం చాలాకాలంగా బంధువులకు దూరం ♦ మృతదేహాన్ని ఎటు తీసుకెళ్లాలో తెలియక అయోమయం ♦ ఆ సంఘర్షణతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం ఘట్కేసర్: మృతదేహన్ని సొంతూరుకు తీసుకెళ్తే ఎదరయ్యే వ్యతిరేకతకు భయపడే నలుగురు ఆత్మహత్య చేసుకొని ఉంటారని మృతుల సమీప బంధువులు ఆదివారం తెలిపారు. వరంగల్ జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన పారుపల్లి సత్యనారాయణ (55) అనారోగ్యంతో మృతి చెందగా భార్య మీరా, కూతుళ్లు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణ అంకుశాపూర్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సత్యనారాయణ ఆదిలాబాద్ జిల్లాలో హౌసింగ్ డీఈగా పనిచేస్తున్నారు. భార్యాపిల్లలు హన్మకొండలోని టీచర్స్ కాలనీలో ఉంటున్నారు. తల్లిదండ్రులు లద్నూరులోనే నివాసం ఉంటున్నారు. ఆరోగ్యం దెబ్బతినడంతో సత్యనారాయణను చికిత్స నిమిత్తం తరలిస్తుండగా భువనగిరిలో మృతిచెందాడు. అయితే మృతదేహన్ని ఎక్కడికి తీసుకెళ్లి కర్మకాండలు నిర్వహించాలనే సమస్య కుటుంబసభ్యులకు ఎదురైంది. హన్మకొండలో అద్దె ఇంట్లో కర్మకాండలకు ఇంటివారు అనుమతించారు. మీరాకు తల్లిగారింటితోనూ సత్సంబంధాలు లేవు. చాలాకాలంగా సత్యనారాయణకు తల్లిదండ్రులకు రాకపోకలు లేవు. ఇన్నేళ్ల తరువాత మృతదేహాన్ని తీసుకెళ్తే ఇప్పుడు గుర్తొచ్చామా అంటారు. ఈ వ్యతిరేకతకు భయపడే ఆత్మహత్య చేసుకుని ఉంటారని బంధువులు భావిస్తున్నారు. ధైర్యం చెప్పేవాళ్లం.. సత్యనారాయణకు ఇద్దరు సోదరులు రవీందర్, శ్రీనివాస్ ఉన్నారు. మీరాతో పాటు మరో ముగ్గురు అక్కాచెల్లెళ్లు వారి భర్తలు, పిల్లలు ఉన్నారు. వారిలో ఎవరికైన మృతి చెందిన సమాచారం అందించవచ్చు. వారు అలా చేయలేదు. సమాచారం ఇచ్చి ఉంటే తాము ధైర్యం చెప్పేవారమని బంధువులు అంటున్నారు. కుమిలిపోయి, మానసిక సంఘర్షణతో చావే పరిష్కారమని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు పెళ్లీడుకొచ్చిన పిల్లలకు వివాహాలు కాకపోవడం కూడా ఆందోళనకు కారణమై ఉంటుందన్నారు. డీఈగా రెండు సంవత్సరాలే.. సత్యనారాయణ హౌసింగ్ బోర్డులో ఏఈగా వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో పనిచేసి సస్పెండ్‌కు గురయ్యారు. చాలకాలం విరామం తరువాత డీఈగా ప్రమోషన్‌పై ఆసిఫాబాద్‌కు బదిలీపై వెళ్లారు. మద్యానికి బానిసై ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదు. అక్కడ రెండేళ్లే పనిచేసి మృతిచెందారు. కొత్తకారు సంబరం నాలుగు రోజులే.. కొత్తకారు తీసుకొని గత నెల 26న రిజిస్టర్ చేయించారు. నాలుగురోజులే అందులో తిరిగారు. మృతుని కుమారుడు శివరామకృష్ణ డ్రైవింగ్ చేసేవాడు. 29న తండ్రి మృతితో వారు సైతం రైల్వేట్రాక్‌పై తలలు పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. చివరిసారి నల్లగొండ జిల్లాలో భువనగిరిలోని హోటల్లో భోజనం చేస్తే , ఘట్కేసర్ మండలం అంకుశాపూర్‌లో తుదిశ్వాస వదిలారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు.. గతంలో మండలంలోని కొండాపూర్‌కు బతుకుదెరువు నిమిత్తం ఓ రాజస్థానీ కుటుంబం వచ్చింది. రూ.10లక్షలకు గ్రామస్తుడొకరు టోకరా ఇవ్వడంతో కుటుంబం మొత్తం రైల్వేట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడింది. అంతకు ముందు మైసమ్మగుట్టకు చెందిన కూలీ ఒకరు కూలీపనులు చేస్తూ జీవనం సాగించేవాడు. రూ.50వేలు అప్పు కావడంతో కుటుంబం మొత్తం ఇలాగే బలవన్మరణానికి పాల్పడింది. దానికంటే ముందు నగరంలోని ముషీరాబాద్‌కు చెందిన ఓ యువతి తన చిన్నారి కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. -
మిస్టరీగా మారిన లాడెన్ కుటుంబసభ్యుల మృతి
లండన్: ఆల్కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యుల మృతి మిస్టరీగా మారింది. లండన్ సమీపంలోని హాంప్‌షైర్‌లోని బ్లాక్‌బుషే ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో లాడెన్ సవతి తల్లి, ఆమె భర్త, కూతురుతోపాటు పైలట్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటలీ నుంచి బ్రిటన్ వైపు వారు ప్రయాణిస్తున్న వేళ విమానం కండిషన్లోనే ఉందని విమానయాన నిపుణుడు జులియన్ బ్రే అభిప్రాయపడినట్లు బ్రిటిష్ మీడియా పేర్కొంది. ల్యాండ్ కావడానికి సరిపడినంతా రన్‌వే ఉన్నా పైలట్ విమానాన్ని పక్కనే ఉన్న కార్ల షెడ్ ఫెన్సింగ్‌పైకి తీసుకెళ్లడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగి పేలుడు సంభవించడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఎంత ఎక్కువ ఎత్తులో ఉన్నా, తక్కువ ఎత్తులో ఉన్నా అర మైలు దూరంలో ఉన్న ప్రాంతాన్ని కూడా గమనించేందుకు వీలుగా నాలుగు ఇండికేటర్లు ఉన్నాయని, అయినా పైలట్ అలా ఎందుకు చేశాడో అర్థం కావడంలేదని పైలట్ ఇన్స్ట్రక్టర్ సైమన్ మూర్స్ అనుమానం వ్యక్తం చేశారు. -
వాగు దాటుతూ నలుగురి మృతి