
సాక్షి, చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. చెంగల్పట్టు జిల్లా కోదండరామ్ నగర్‌లో ఘటన జరిగింది. మరణించిన వారిని గిరిజ (63), రాధ (55), రాజ్‌కుమార్ (47)గా గుర్తించారు. కుదువంచెరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: రెండు నెలల క్రితం లవ్ మ్యారేజ్.. అంతలోనే షాకింగ్ ఘటన.. అసలు ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment