refrigerator
-
పవర్ బ్యాంక్ అనుకుంటే పొరపాటే.. ఇంకేంటో తెలుసా?
చూడటానికి పవర్బ్యాంకులా ఉంటుంది గాని, ఇది ఫ్రిజ్ ప్యూరిఫైయర్. ఈ పరికరం ఫ్రిజ్‌లో భద్రపరచిన ఆహారం మరింత కాలం తాజాగా ఉండేలా చేస్తుంది. ఫ్రిజ్‌లోని ఆహారంపై బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వంటి సూక్ష్మజీవులు పెరగకుండా నిరోధిస్తుంది. ఇటాలియన్ కంపెనీ ‘విటెసీ’ ఇటీవల ఈ బుల్లి పరికరాన్ని ‘షెల్ఫీ’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది.ఇందులోని అడ్వాన్స్డ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీతో పనిచేసే సెన్సర్లు ఫ్రిజ్‌లోని ఆహారంపై చేరిన సూక్ష్మజీవులను గుర్తించి, వాటిని క్షణాల్లోనే నాశనం చేస్తాయి. ఆహార వృథాను అరికట్టే ఉద్దేశంతోనే ఈ పరికరాన్ని రూపొందించినట్లు ‘విటెసీ’ కంపెనీ చెబుతోంది.ఈ పరికరం రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది ఫ్రిజ్‌లో భద్రపరచిన కూరగాయలు, పండ్లు, పాలు వంటివి ఎక్కువకాలం తాజాగా ఉండేలా చేస్తుంది. ఈ పరికరాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని, ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలు మరింతకాలం సురక్షితంగా ఉంటాయి. దీని ధర 179.99 డాలర్లు (రూ.15,126). -
ఫ్రిజ్ వాసన రాకుండా, కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా చేయండి!
రిఫ్రిజరేటర్ లేదా ఫ్రిజ్ ఇపుడు అందరి ఇళ్లల్లోనూ ఒక అవసరంగా మారిపోయింది. పాలు, పెరుగు, ఆకు కూరలు, కూరగాయలు, పండ్లతోపాటు వండిన పదార్థాలను పాడుకాకుండా, తాజాగా ఉంచేందుకు ఫ్రిజ్‌ను వాడతాం. మరి ఫ్రిజ్ శుభ్రత గురించి ఎపుడైనా ఆలోచించారా? ఫ్రిజ్‌లో బాక్టీరియా పేరుకుపోకుండా, మన ఆహారం శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? తెలుసుకుందాం.వారాలు, నెలల తరబడి ఫ్రిజ్‌ను శుభ్రం చేయకపోతే దుర్వాసన వస్తుంది. ఆహారం త్వరగా పాడవుతుంది. అలాగే రిఫ్రిజిరేటర్ బయటినుంచి కూడా క్లీన్‌గా కనిపించేలా జాగ్రత్తపడాలి.రిఫ్రిజిరేటర్‌ను ఎలా శుభ్రం చేయాలి?ముందు రిఫ్రిజిరేటర్‌ను ఆఫ్ చేసి, ప్లగ్ తీసి పక్కన బెట్టాలి. ఇలా చేయడం వల్ల షాక్ కొట్టకుండా ఉంటుంది.కఠినమైన రసాయనాలు వాడాల్సిన అవసరం లేదు. బేకింగ్ సోడా, వైట్ వెనిగర్, డిష్ సోప్‌తో శుభ్రం చేసుకోవచ్చు.ఫ్రిజ్ షెల్ఫ్‌లు, ఇతర డిటాచ్బుల్ డ్రాయర్లను, గ్లాసు ట్రే, ఎగ్ ట్రేలను తొలగించి బయట శుభ్రం చేసుకొని పొడి గుట్టతో తుడిచేయాలి. ఫ్రిజ్‌లో అమర్చేముందు వీటిపై ఆల్కహాల్ రుద్దితే కనిపించని బ్యాక్టీరియా కూడా పూర్తిగా పోతుంది.అవసరమైతేనే డీప్ ఫ్రిజ్‌ను డి-ఫ్రాస్ట్ చేయాలి. లేదంటే ఆ ఏరియా వరకు క్లీన్ చేసుకోవచ్చు. పాడైపోయిన, డేట్ ముగిసిన పదార్థాలను పారేయ్యాలి. ఫ్రిజ్ డోర్‌కి ఉండే గాస్కెట్ సందుల్లో మురికి పేరుకుపోతుంది. దీన్ని కూడా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. బయట కూడా డిష్ వాష్ లిక్విడ్‌లో ముంచిన స్పాంజి సాయంతో మురికి, మరకలు పోయేలా శుభ్రం చేసి, ఆ తరువాత మెత్తని పొడిగుట్టతోతుడిస్తే తళ తళ కొత్తదానిలా మెరుస్తుంది. ఫ్రిజ్‌లోని వస్తువులు ముట్టుకుంటే పడిపోయేలాగా కాకుండా, చిన్న చిన్న కంటైనర్లలో పళ్లు, కూరలు, తదితరాలను పొందికగా అమర్చుకోవాలి. -
‘మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్!..కరెంట్‌తో పనిలేదు..!
రిఫ్రిజిరేటర్... సామాన్య భాషలో ఫిడ్జ్. ఒకప్పుడూ అది అపురూపమైన వస్తువు. ధనికులు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. ఇప్పుడూ మధ్య తరగతి ఇళ్లల్లో కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. కానీ పేదవాళ్లకు మాత్రం ఇప్పటికీ అపురూపమైన వస్తువే. పైగా కొనాలంటే రూపాయి, రూపాయి పోగు చేసుకుని అప్పోసొప్పో చేసుకుని కొంటారు. పైగా దీన్ని వేసవిలోనే జాగ్రత్తగా వాడుకుంటారు. ఎందుకంటే..? దీనికి అయ్యే కరెంట్ బిల్లు కూడా ఎక్కువే. ఒకవేళ పాడైతే బాగు చేయించుకోవాలన్న కష్టమే. అలాంటి వాటికి చెక్‌పెట్టేలా ఎకో ప్రెండ్లీగా మట్టితో ఫ్రిడ్జ్‌ని ఆవిష్కరించారు గుజరాత్‌కి చెందిన డ భాయ్ ప్రజాపతి. ఎలా రూపొందించారంటే..‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్..ఇది పూర్తిగా బంకమన్నుతో తయారైన ఫ్రిజ్. అందుకే దీనికి ‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్ అని పేరు పెట్టి, మార్కెట్లోకి తెచ్చాడు ,మన్సుఖ్ . ఈ ఫ్రిడ్జ్ కు విద్యుత్ అవసరం లేదు. ఎటువంటి మరమ్మత్తులూ చేయాల్సిన పని లేదు. అయినా అద్భుతంగా పని చేస్తుంది. సాధారణ గది ఉష్ణోగ్రతలో రెండు రోజుల్లోనే పాడైపోయే కూరగాయలను ఇందులో భద్రపరిస్తే, ఐదారు రోజులు నిక్షేపంగా నవనవలాడుతూ తాజాగా ఉంటాయి. పెరుగు, దోశె పిండి లాంటివి కూడా పుల్లబడకుండా ఉంటాయి. జ్యూసులు, నీళ్లు పెడితే చల్లబడతాయి. ఇందులో 5 కిలోల కూరగాయలు, పండ్లను నిల్వ చేయవచ్చు. విద్యుత్ కోతలు తరచుగా ఉండే ప్రాంతాల్లో, మట్టి రిఫ్రిజిరేటర్‌ను ఉపయోగిస్తున్నారు. మిట్టి కూల్లో పైన ఉన్న అరలో 2 లీటర్ల నీటిని పోయాలి. ఈ ఫ్రిజ్ బాష్పీభవన సూత్రాలపై పనిచేస్తుంది. దీనికి నిర్వహణ ఖర్చు కూడా ఉండదని కనగరాజ్ తెలిపారు.విద్యుత్ అవసరం లేదుసాధారణంగా విద్యుత్ ఆధారితంగా పనిచేసే ఫ్రిడ్జ్‌లో ఉంచిన వస్తువులు తింటే కొంత అనారోగ్యానికి గురవుతారు. కాని మట్టితో తయారు చేసి.. సహజసిద్దంగా ఉండే మట్టితో తయారు చేసి ఈ మిట్టి కూల్ లోని వస్తువులు తింటే ఎలాంటి అనారోగ్యం రాదని చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ మిట్టి కూల్ కు అత్యంత డిమాండ్ ఉంది. ఇందులో ఉంచిన ఆహార పదార్ధాల్లో రుచిలో ఎలాంటి మార్పు రాదంటున్నారు మన్సుక్భాయ్ ప్రజాపతి.ప్రజాపతి నేపథ్యం..ప్రజాపతి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని మోర్బిలోని నిచ్చిమండల్ గ్రామంలో జన్మించాడు. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పి.. కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసేవాడు. అతను చిన్నతనం నుంచి సాంప్రదాయక మట్టి వస్తువుల తయారీపై సమగ్రమైన పరిజ్ఞానం ఉంది. దీంతో 1988లో ప్రజాపతి రూ. 30,000 చెల్లించి మట్టి పలకల తయారీకి సంబంధించిన తన సొంత కర్మాగారాన్ని ప్రారంభించాడు. కానీ మట్టి చిప్పల మన్నిక గురించి అతనికి చాలా ప్రతికూల అభిప్రాయాలు వచ్చాయి. అయినప్పటికీ పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అలా 1990లో అతని కంపెనీ రిజిస్టర్ అయ్యింది.ఇక 2001లో మిట్టికూల్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయబడింది. ఆ తర్వాత 2002 నుంచి పూర్తి స్థాయిలో దీనిపై పనిచేయడం మొదలు పెట్టారు. అదే ఏడాది GIANగా ప్రసిద్ధి చెందిన గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్ ఆగ్మెంటేషన్ నెట్‌వర్క్‌తో ప్రపంచానికి పరిచయమై.. ఈ మిట్టీకూల్ గురించి అందరికీ తెలియడం జరిగింది. ఇక బ్రిటన్, జర్మనీల్లో జరిగిన ప్రదర్శనల్లో ఈ ఫ్రిడ్జ్‌ను చూసి, అక్కడి శాస్త్రవేత్తలు ప్రశంసలు కురిపించారు. విద్యుత్తుతో పనిచేసే ఫ్రిజ్‌లతో పోలిస్తే, ఈ మట్టి ఫ్రిజ్ ఖరీదు చాలా తక్కువ. దీని ఖరీదు రూ. 8,500/అంతే!.(చదవండి: జపాన్ బుల్లెట్ రైలు తరాతని మార్చిన కింగ్‌ఫిషర్!) -
వందేళ్ల క్రితం కరెంట్ లేకుండానే పనిచేసిన ఫ్రిడ్జ్!
నేటి కాలంలో కరెంట్ లేకుండా పనే అవ్వదు. చెప్పాంలంటే అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితి. ఇదివరకటిలి భయానక కరెంట్ కోతలు లేవు. ఉంటే మాత్రం ఒక రోజు గడవడం కష్టమే అయిపోతుంది నగరాల్లో. ఎన్నో పనులు ఆగిపోతాయి. ఒక్కోసారి కరెంట్ లేని నాటి కాలంలో మన పెద్దవాళ్లు ఎలా ఉన్నారా? అని కూడా అనిపిస్తుంది. కానీ ఆ కాలంలోనే కరెంట్ లేకుండా నడిచిన ఓ ఫ్రిడ్జ్‌కి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో వందేళ్ల నాటి ఫిడ్జ్ ఉంది. అది కరెంట్తోనో, బ్యాటరీతోనే కాదు.. కేవలం కిరోసిన్‌తో పని చేసేది (kerosene Fridge). ఆ ఫ్రిడ్జ్ అడుగు భాగంలో దాదాపు 10 లీటర్ల ఆయిల్ ట్యాంక్ కూడా ఉంది. హిమ్లక్స్ కంపెనీకి చెందిన ఈ రిఫ్రిజిరేటర్కు సంబంధించిన అనేక సాంకేతిక అంశాలను వీడియోలో చూపించారు. కిరోసిన్ ఉన్న ట్యాంక్ కింది భాగంలో ఉన్న దీపాన్ని వెలిగిస్తారు. ఆ మంటతో నీరు, సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను మండిస్తే గ్యాస్ వెలువడుతుంది. ఫ్రిడ్జ్ వెనుక భాగంలో అమర్చిన పైప్ ద్వారా ఆ గ్యాస్ ఫ్రిడ్జ్ లోపలికి ప్రవేశించి అందులోని పదార్థాలను చల్లగా ఉంచుతుంది. కూలింగ్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా మంటను పెద్దది చేస్తే సరి. కూలింగ్ తక్కువ సరిపోతుందనుకుంటే మంటను చిన్నది చేయాలి. వందల ఏళ్ల క్రితం మన దేశంలోని ధనికులు ఫ్రాన్స్, లండన్ నుంచి ఈ ఫ్రిడ్జ్‌లను దిగుమతి చేసుకుని వాడేవారు. అప్పటి ఫ్రిడ్జ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతోంది. ఆ కాలంలోను వాళ్లకు అందుబాటులో ఉన్న వనరులతోనే పదార్థాలను కూలింగ్ చేసే టెక్నాలజీని డెవలప్ చేయడమంటే..నిజంగా గ్రేట్ కదూ!. View this post on Instagram A post shared by Virendra Jat (@indiandesitraveler) (చదవండి: చీరలు కొన్న వాటిలానే ఉండాలంటే ఇలా చేయండి!) -
ఈ 'గాడ్జెట్'.. రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా..
క్విక్ అండ్ ఈజీ టెక్నాలజీతో ఈ గాడ్జెట్.. వేసవిలో చల్లటి డ్రింక్స్‌తో కూల్‌గా ఉంచుతుంది. వింటర్లో వేడి వేడి కాఫీ, టీలతో వెచ్చబరుస్తుంది. పార్టీలను చిల్ చేస్తుంది. ఇది రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా పనిచేస్తుంది. డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్‌ని ఈ మగ్‌లో ఉంచి.. స్విచ్ ఆన్ చేస్తే.. అవి క్షణాల్లో కూల్ అవుతాయి. అలాగే ఓపెన్ చేసి.. వాటిని మగ్లోనే వేసుకుని మూత పెట్టుకోవచ్చు. అంతేకాదు వేడివేడిగా సూప్స్, టీ, కాఫీలనూ పెట్టుకోవచ్చు. చల్లగా కావడానికి వేరుగా.. వేడిగా కావడానికి వేరుగా ఆప్షన్స్ ఉంటాయి. ఏది కావాలనుకుంటే దాన్ని సెట్ చేసుకోవాలంతే. ఈ డివైస్ చిన్నగా.. తేలిగ్గా ఉండటంతో.. దీన్ని పార్టీలు.. బీచ్‌లకు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. బాగుంది కదూ!. ఈ కూల్ అండ్ హాట్ కప్ ధర 34 డాలర్లు (రూ.2,818). ఇవి చదవండి: అంతరించిన పక్షికి మళ్లీ ప్రాణం..! -
పంజాబ్‌లో విషాద ఘటన.. ఇంటిల్లిపాదీ సరదాగా క్రికెట్ మ్యాచ్ చూస్తూండగా.. అకస్మాత్తుగా..
-
ఖాళీ ప్రిజ్జు ... కోటీశ్వరుడిని చేసింది!
ఖాళీ రిఫ్రిజిరేటర్‌ను చూస్తే ఏమొస్తుంది? అదృష్టం బాగుంటే అద్భుతమైన ఐడియా వస్తుంది. అపూర్వ మెహతా తన ఇంట్లో ఖాళీగా ఉన్న రిఫ్రిజిరేటర్‌ను చూడడంతో గ్రాసరీ డెలివరీ స్టార్టప్ ‘ఇన్‌స్టాకార్ట్’ ఐడియా వచ్చి 37 సంవత్సరాల వయసులోనే కోటీశ్వరుడిగా మారాడు. తన ఇన్స్పిరేషన్ గురించి అపూర్వ మెహతా లింక్డ్ ఇన్‌లో షేర్ చేశాడు. అమెజాన్‌లో సప్లై చైన్ ఇంజనీర్‌గా పని చేçస్తున్న మెహతాకు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కలలు ఉండేవి. అయితే ఒకటి రెండు వ్యాపారాలు స్టార్ట్ చేసి విఫలం అయ్యాడు. శాన్ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో కూర్చున్న మెహతాకు ఎదురుగా ఖాళీ రెఫ్రిజిరేటర్ కనిపించింది. తాను తినడానికి అందులో ఏమీ లేవు. అలా ఖాళీ రిఫ్రిజిరేటర్‌ను చూస్తున్నప్పుడు ‘ఇన్‌స్టాకార్ట్’ స్టార్టప్‌కు ఐడియా పుట్టింది. -
ఫ్రిజ్‌లో ప్రతీది పెట్టేస్తున్నారా..!
రిఫ్రిజిరేటర్లో ప్రతిదీ... తోసేయకండి. సీజన్‌తో పనిలేకుండా అన్నిరకాల ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్లో పెట్టేస్తుంటారు కొందరు. అయితే అన్నింటిని రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. ఐదురకాల ఆహారాలను రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరం అసలు లేదు. అవేంటో చూడండి... ఫ్రిజ్‌లో పెట్టకూడని పదార్థాలు.. సాస్, జామ్, జెల్లీలను రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరంలేదు. టొమాటోలను ఫ్రిడ్జ్‌లో పెట్టడడం వల్ల వాటిలోని సహజసిద్ధమైన రుచి పోతుంది. వీటిని బయట ఉంచితేనే తాజాగా.. రుచిగా ఉంటాయి. అరటి పండ్లు త్వరగా పండిపోతాయని రిఫ్రిజిరేటర్లో పెడుతుంటారు. ఇది మంచిది కాదు. అరటిపండ్లను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితేనే మంచిది మీరు తులసి లేదా రోజ్మేరీని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే, అవి త్వరగా ఎండిపోతాయి. మీరు ఈ మూలికలను ఒక చిన్న గ్లాసులో కొద్దిగా గది-ఉష్ణోగ్రత నీటిలో ఉంచవచ్చు. లేదా వంటగదిలో సూర్యకాంతి నుంచి దూరంగా ఉంచవచ్చు. కాఫీను, కాఫీ పౌడర్‌ను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే.. అది దాని చుట్టూ ఉన్న ఆహార పదార్థాల రుచిని తీసేసుకుంటుంది. పుచ్చకాయలను కట్ చేయకుంటే వాటిని బయటే ఉంచాలంటున్నారు నిపుణులు. వాటిని ముక్కలు చేసిన తర్వాతనే ఫ్రిజ్‌లో నిల్వచేయవచ్చని తెలిపారు. బ్రెడ్ స్లైసులను రిఫ్రిజిరేటర్లో ఉంచితే త్వరగా పాడైపోతాయి. ..పీచ్, ప్లమ్, బ్లాక్‌బెర్రీ, ఆవకాడోలను రిఫ్రిజిరేటర్లో కంటే బయటే ఉంచాలి. (చదవండి: పచ్చసొన తినకపోతే ఏం జరుగతుందో తెలుసా?) -
వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్
సాధారణ రిఫ్రిజిరేటర్‌ను ఇంట్లో వాడుకోగలం గాని, బయటకు తీసుకుపోలేం. నడివేసవిలో దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు రిఫ్రిజిరేటర్ ఉంటే బాగుండనపిస్తుంది. పోర్టబుల్ కూల్‌డ్రింక్ చిల్లర్స్ వంటివి ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. ఇదీ చదవండి: నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్ తాజాగా పోర్టబుల్ మొబైల్ రిఫ్రిజిరేటర్‌ను అమెరికన్ బహుళజాతి సంస్థ ఏంకర్ అందుబాటులోకి తెచ్చింది. ‘ఎవర్ఫ్రాస్ట్ పవర్డ్ కూలర్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసిన ఈ మొబైల్ రిఫ్రిజిరేటర్ రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది 33 లీటర్లు, 43 లీటర్లు, 53 లీటర్ల పరిమాణాల్లో దొరుకుతుంది. ఇందులో మంచినీళ్లు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, పండ్లు, కూరగాయలు వంటివి పెట్టుకోవచ్చు. మొబైల్ ఫోన్లో దీని యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, యాప్ ద్వారా ఇందులోని ఉష్ణోగ్రతను కోరుకున్న రీతిలో నియంత్రించుకునే వెసులుబాటు కూడా ఉంది. దీని ప్రారంభ ధర 1464 డాలర్లు (సుమారు రూ.1.21 లక్షలు) మాత్రమే! -
షాక్‌లో శాస్త్రవేత్తలు.. బయటపడ్డ 5000 ఏళ్ల నాటి ఫ్రిడ్జ్.. అందులో ఏం దాచేవారో తెలుసా!
చరిత్రను వెలికితీయడంతో పాటు వాటి ఆధారాలను భద్రపరచే లక్ష్యంతో పురావస్తు శాఖ పని చేస్తుంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి వారికి ఆశ్చర్యం కలిగించే ఘటనలు ఎదురవుతుంటాయి. తాజాగా దక్షిణ ఇరాక్‌లో తవ్వకాలు జరుపుతున్న పురావస్తు శాస్త్రవేత్తల బృందానికి అటువంటి అనుభవమే ఎదురైంది. దాదాపు 5000 సంవత్సరాల నాటి రెస్టారెంట్ అవశేషాలు బయటపడ్డాయి. 5వేల ఏళ్ల నాటి ఫ్రిడ్జ్.. వివరాల్లోకి వెళితే.. సుమేరియన్ నాగరికతకు ముఖ్యమైన కేంద్రంగా పిలిచే పురాతన లగాష్ శిధిలాల మధ్య పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు ప్రారంభించారు. ఈనేపథ్యంలో ఇటీవల అక్కడ 5వేల ఏళ్ల నాటి రెస్టారెంట్‌ను కనుగొన్నారు. అందులో ఆ కాలం నాటి ఓవెన్, కొన్ని బెంచీలు, గిన్నెలు, ఇతర పాత్రలలో బయటపడ్డాయి. అన్నింటికంటే విచిత్రంగా ‘జీర్’ అనే పిలిచే మట్టి రిఫ్రిజిరేటర్ బయట పడటం శాస్త్రవేత్తలును ఆశ్చరపరిచింది. ఆ ఫ్రిజ్‌లో బీర్‌ను దాచినట్టు వారికి రుజువులు కూడా దొరికాయి. అంతేకాకుండా ఆ పురాతన బీర్ తయారు చేసే ఒక రెసిపీని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు చెప్పారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, పిసా విశ్వవిద్యాలయ బృందాల సంయుక్త ప్రయత్నాల ఫలితంగా ఈ ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి. ఈ తవ్వకాల ఆ బృందం.. డ్రోన్ ఫోటోగ్రఫీ, థర్మల్ ఇమేజింగ్, మాగ్నెటోమెట్రీ, మైక్రో-స్ట్రాటిగ్రాఫిక్ శాంప్లింగ్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకున్నారు. -
నిమిషాల్లోనే ఐస్‌క్యూబ్స్.. అంతేనా మరెన్నో ప్రత్యేకతలు ఈ ఫ్రిజ్ సొంతం!
ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్ తయారు చేసుకోవాలంటే, కొన్ని గంటల ముందుగానే ట్రేలో నీరు నింపి, డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మామూలు రిఫ్రిజిరేటర్లలో ఐస్ తయారవడానికి ఆరు నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది. అయితే, ఈ ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్ నిమిషాల్లోనే తయారవుతాయి. ఇళ్లల్లో వాడుకునే ఫ్రిజ్‌లను ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోలేం. ఈ ఫ్రిజ్నైతే ఎక్కడికైనా ఈజీగా తీసుకుపోవచ్చు. ఇది పోర్టబుల్ ఫ్రిజ్. సాధారణ ఫ్రిజ్‌ల కంటే చాలా తేలిక కూడా. కాస్త పెద్ద సూట్‌కేసు సైజులో ఉండే ఈ ఫ్రిజ్‌కు చక్రాలు కూడా ఉంటాయి. కాబట్టి మోత బరువు లేకుండానే దీనిని కోరుకున్న చోటుకు తేలికగా తరలించవచ్చు. ఇందులోని ట్రేలో నీరు నింపేసి పెడితే, కేవలం పన్నెండు నిమిషాల్లోనే పద్దెనిమిది ఐస్‌క్యూబ్స్ తయారవుతాయి. ఇందులో నీళ్లు, పాలు, కూల్‌డ్రింక్స్, కూరగాయలు, పండ్లు వంటివి భద్రపరచుకునేందుకు కూడా వీలవుతుంది. ఇది పూర్తిగా సోలార్ చార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్‌చేస్తే, ఇరవై నాలుగు గంటల వరకు నిరాటంకంగా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా దీనిలోని అడ్జస్ట్మెంట్స్ను ఎక్కడి నుంచైనా మార్చుకోవచ్చు. అమెరికాకు చెందిన ‘ఎకో ఫ్లో’ కంపెనీ ఈ అత్యాధునిక పోర్టబుల్ రిఫ్రిజిరేటర్‌ను రూపొందించింది. దీని ధర 899 డాలర్లు (రూ.73,402) మాత్రమే! చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మార్పులు రానున్నాయ్, నిమిషానికి 2 లక్షల టికెట్లు! -
తమిళనాడు: ఫ్రిజ్ పేలి ముగ్గురు మృతి
-
తమిళనాడు: విషాదం.. ఫ్రిజ్ పేలి ముగ్గురు మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. చెంగల్పట్టు జిల్లా కోదండరామ్ నగర్లో ఘటన జరిగింది. మరణించిన వారిని గిరిజ (63), రాధ (55), రాజ్‌కుమార్ (47)గా గుర్తించారు. కుదువంచెరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రెండు నెలల క్రితం లవ్ మ్యారేజ్.. అంతలోనే షాకింగ్ ఘటన.. అసలు ఏం జరిగింది? -
మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా? అయితే ఈ పరికరం ఉండాల్సిందే!
బయట ఉంచినప్పటి కంటే ఫ్రిజ్‌లో ఉంచితే ఆహార పదార్థాలు, పానీయాలు మరింత ఎక్కువకాలం తాజాగా ఉంటాయని తెలిసిందే. ఫ్రిజ్‌లో కూడా కొంత పరిమితి వరకే ఇవి తాజాగా ఉంటాయి. ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలు, పానీయాల తాజాదనం పరిమితిని మరింత పెంచడానికి ఒక బుల్లిసాధనం అందుబాటులోకి వచ్చింది. ఫొటోలో కనిపిస్తున్నది అదే! ‘ప్యూర్ ఎయిర్ ఫ్రిజ్ ఫుడ్ లైఫ్ ఎక్స్టెండర్’ పేరిట అమెరికాకు చెందిన ‘గ్రీన్‌టెక్ ఎన్విరాన్మెంటల్’ సంస్థ రూపొందించిన ఈ బుల్లి పరికరాన్ని ఫ్రిజ్‌లో ఉంచితే చాలు, ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాలు, పానీయాలు మూడువారాల పాటు ఏమాత్రం చెడిపోకుండా నిక్షేపంగా తాజాగా ఉంటాయి. ‘ప్యూర్ ఎయిర్’ లీథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని మూడు వారాలకు ఒకసారి చార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రిజ్‌లోని పదార్థాలను తాజాగా ఉంచడమే కాకుండా, ఇది ఫ్రిజ్‌లోని గాలిని శుభ్రపరుస్తుంది కూడా. ఇందులోని అయానైజేషన్, యాక్టివేటెడ్ ఆక్సిజన్ టెక్నాలజీ ఫ్రిజ్‌లో వెలువడే ఈథెలిన్ గ్యాస్‌ను ఎప్పటికప్పుడు తగ్గించేస్తుంది. ఫలితంగా ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పదార్థాలు మరింత ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. ఆహార పదార్థాల వృథాను ఈ పరికరం గణనీయంగా అరికట్టగలదని దీని తయారీదారులు చెబుతున్నారు. చదవండి: Coding Contest: టెన్త్ క్లాస్ కుర్రాడికి బంపరాఫర్, భారీ ప్యాకేజ్‌తో పిలిచి ఐటీ జాబ్ ఇస్తామంటే! -
హాట్ అండ్ కూల్ ట్రావెలింగ్ రిఫ్రిజిరేటర్.. ధర 6 వేలు!
Hot And Cool Traveling Refrigerator: ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. దూర ప్రాంతాలకు వెళ్తున్నపుడు నాలుగు జతల బట్టలతో సహా ఆ నాలుగు రోజులకు సరిపడా ఫుడ్ కూడా వెంట తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. పండ్లు, కూరగాయలు, వండుకున్న పదార్థాలను నిలవ ఉంచుకోవాలన్నా.. కాలానికి తగ్గట్టు చల్లటి పానీయాలు, వేడివేడి కాఫీలు అందుబాటులో పెట్టుకోవాలన్నా.. ఇలాంటి మినీ కూలర్ అండ్ వార్మర్‌ను మీ లాగేజ్లో భాగం చేసుకోవాల్సిందే. దీన్ని బెడ్ రూమ్‌లో, ఆఫీస్ క్యాబిన్లో, ప్రయాణాల్లో ఎక్కడైనా చక్కగా వినియోగించుకోవచ్చు. దీని పైభాగంలో ప్రత్యేకమైన హ్యాండిల్ కూడా ఉంటుంది. దాంతో ఎక్కడికైనా సులభంగా మోసుకుని వెళ్లొచ్చు. ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ డివైజ్. దీని కూలింగ్ రేంజ్ 20 డిగ్రీల సెల్సియస్. హీటింగ్ రేంజ్ 60 డిగ్రీల సెల్సియస్. దాంతో వేసవిలో చల్లని శీతలపానీయాలను, శీతాకాలంలో వేడివేడి కాఫీలను అందిస్తుంది. ఇందులో కావాల్సిన టాబ్లెట్స్, బ్యూటీ కాస్మెటిక్స్ ఇలా అన్నింటినీ స్టోర్ చేసుకోవచ్చు. పైగా ఇది స్టైలిష్ టెంపర్డ్ గ్లాస్ ప్యానెల్ కలిగి ఉండటంతో దీన్ని క్లీన్ చేసుకోవడం చాలా తేలిక. అవసరాన్ని బట్టి ఇందులో బాస్కెట్స్‌ను అమర్చి, చిన్న చిన్న విభాగాలుగా మార్చుకుని, చాలా రకాలు స్టోర్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మధ్యలో పెట్టుకునే ర్యాక్స్ లేదా బాస్కెట్స్‌ను తొలగించి.. పొడవాటి డ్రింక్ బాటిల్స్ వంటివి పెట్టుకోవచ్చు. దీనికి రెండు పవర్ మోడ్స్ లభిస్తాయి. ఒకటి ఇంట్లో పవర్ సాకెట్‌కి అమర్చుకునేది. మరొకటి కారులో కనెక్ట్ చేసుకునేది. భలే ఉంది కదూ! ధర: 80 డాలర్లు (రూ.6,101) చదవండి: Ice Cream Maker: 10 నిమిషాల్లో ఐస్‌క్రీమ్ రెడీ.. ధర రూ.2,215! -
10 నిమిషాల్లో ఐస్‌క్రీమ్ రెడీ.. దీని ధర రూ.2,215
ఎండాకాలం వచ్చిందంటే.. పిల్లలే కాదు పెద్దలు కూడా స్నాక్స్ బదులుగా ఐస్‌క్రీమ్‌నే కోరుకుంటారు. అలాంటి వారికి ఈ మినీ మేకర్ భలే చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చూడటానికి మేకర్లా లేదే? చిన్నగిన్నెలా కనిపిస్తుందే అనుకుంటున్నారా? అదే దీని ప్రత్యేకత. హైక్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్‌లో రూపొందిన ఈ బౌల్‌ని 12 గంటల పాటు డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అలా చేస్తే ఐస్‌క్రీమ్ రెసిపీ సిద్ధం చేసుకున్న 10 నిమిషాల్లోనే.. ఈ బౌల్ చల్లచల్లని ఐస్‌క్రీమ్‌ని అందిస్తుంది. అదెలా అంటే లిక్విడ్ రూపంలో ఉన్న రెసిపీని ఇందులో పోసుకుని స్పూన్‌తో బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ, కలుపుకుంటూ ఉండాలి. అలా చెయ్యగా చెయ్యగా గడ్డ కట్టి పదే పది నిమిషాల్లో ఐస్‌క్రీమ్ తయారవుతుంది. ఇలాంటి బౌల్స్ ఫ్రిజ్‌లో ఉంటే.. ఎవరికి వారే అప్పటికప్పుడు ఐస్‌క్రీమ్ తయారు చేసుకుని తినొచ్చు. ధర : 29 డాలర్లు (రూ.2,215) చదవండి: Beauty Tips: కళ్ల చుట్టూ నల్లటి వలయాలు.. పెళుసైన పెదాలు.. ఈ క్రేజీ పెన్‌తో చెక్! -
సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ ఆర్డర్ చేస్తే ఇంట్లో కురిసిన డబ్బుల వర్షం
ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ ఆర్డర్ చేయగా ఫ్రిడ్జ్‌తో పాటు దాదాపు రూ.కోటి వరకు డబ్బులు ఇంటికి వచ్చాయి. ఈ డబ్బులు చూసి ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి చివరకు ఏమైందో ఏమోగానీ ఆ డబ్బులను తీసుకుని వెళ్లి పోలీసులకు అప్పగించాడు. అతడి నిజాయతీని పోలీసులు మెచ్చుకుని అసలు ఫ్రిడ్జ్ విక్రయించిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అయితే ఆ డబ్బుల విషయం చెప్పకుండా ఉంటే కోటీశ్వరుడు అయ్యే అవకాశాన్ని ఆయన నిజాయతీ చాటుకుని కోల్పోయాడు. ఈ సంఘటన దక్షిణ కొరియాలో జరిగింది. దక్షిణ కొరియాలోని జెజు ద్వీపానికిచెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో సెకండ్ ఫ్రిడ్జ్ ఆర్డర్ చేయగా ఆగస్ట్ 6వ తేదీన ఇంటికి వచ్చింది. వచ్చిన ఫ్రిడ్జ్ శుభ్రం చేస్తున్నాడు. ఈ సమయంలో ఫ్రిడ్జ్ కింద ఓ స్టిక్కర్ కనిపించగా తొలగించాడు. వెంటనే డబ్బుల కట్టలు బయటకు వచ్చాయి. వందలు.. వేలు కాదు ఏకంగా రూ.96 లక్షల (లక్షా 30 వేల డాలర్లు) నగదు లభ్యమైంది. ఈ నగదు చూసిన అతడు షాక్‌కు గురయ్యాడు. వెంటనే తేరుకుని సంబరపడ్డాడు. ఆ తర్వాత ఏం ఆలోచించాడో ఏమో.. వెంటనే ఆ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. నగదును తీసుకున్న పోలీసులు ఫ్రిడ్జ్ విక్రయించిన వ్యక్తి ఎవరోనని గాలిస్తున్నారు. అయితే విక్రయించిన వ్యక్తి దొరకకపోతే ఫ్రిడ్జ్ కొన్న వ్యక్తికే ఆ డబ్బు చెందుతుంది. అయితే కొరియా చట్టం ప్రకారం ఆ నగదులో 22 శాతం పన్ను కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. -
ఏసీ, రిఫ్రిజిరేటర్లకు ఫుల్ డీమాండ్
భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఈ సంవత్సరం సాధారణ స్థాయి కంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డీ) పేర్కొనడంతో శీతలీకరణ పరికర తయారీదారులు ఏసీ, రిఫ్రిజిరేటర్లకు ఫుల్ డీమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వాతావరణంతో పాటు పెరుగుతున్న కరోనా కేసులు, వర్క్ హోమ్ చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో దేశంలో ఏసీ, రిఫ్రిజిరేటర్ల డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. "గత 3-4 నెలలుగా ఎయిర్ కండీషనర్ల విభాగంలో 25 శాతం వృద్ధిని సాధించాము, ఇక ముందు కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నాము. ఈ ఏడాది క్యూ4 వరకు 100 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నాము" అని పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ & సీఈఓ మనీష్ శర్మ పేర్కొన్నారు. ఈ డిమాండ్ ఎయిర్ కండిషనర్లు మాత్రమే పరిమితం కాకుండా పానాసోనిక్ రిఫ్రిజిరేటర్లలో 30 శాతం రికార్డు వృద్ధిని సాదించనున్నట్లు పేర్కొన్నారు. మునుపటి సంవత్సరాలకు భిన్నంగా ఈ ఏడాది దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలలో అధిక డిమాండ్ ఉన్నట్లు వారు పేర్కొన్నారు. "ఈ వేసవి కాలంలో పట్టణ మినీ-మెట్రో నగరాలలో బ్రాండెడ్ గృహోపకరణాల వాడకం పెరిగే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మరి ముఖ్యంగా గ్రామీణ, టైర్ 2 & 3 నగరాల నుంచి డిమాండ్ పెరుగుతుంది" అని వోల్టాస్ ప్రతినిధి పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పరికరాలను తయారు చేస్తున్నట్లు వోల్టాస్ పేర్కొంది. చదవండి: చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే! -
ఏసీలు, ఫ్రిజ్‌లు కొనేవారికి షాక్!
న్యూఢిల్లీ: 2021-22 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ ఉత్పత్తుల్లో దిగుమతి చేసుకొనే వాడే విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీ పెంచేశారు. దిగుమతి చేసుకున్న విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెరగడం వల్ల రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఎల్ఈడీ లైట్లు, మొబైల్ ఫోన్లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీల్లో కీలకంగా వాడే కంప్రెషర్‌పై 2.5 శాతం, ఎలక్ట్రిక్ మోటార్లపై 10-15 శాతం కస్టమ్స్ డ్యూటీ పెంచారు. దేశీయ ఎలక్ట్రానిక్ తయారీ రంగం వేగంగా వృద్ధి చెందడానికి విదేశీ వస్తువుల దిగుమతిపై ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని విధించిందని సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయ అవసరాలకు అనుగుణంగా 40 శాతం రిఫ్రిజిరేటర్లు, 20 శాతం ఎయిర్ కండీషనర్ల స్థానికంగా ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది.(చదవండి: గృహ కొనుగోలుదారులకు శుభవార్త!) తాజాగా కస్టమ్స్ సుంకం పెంచడంతో స్వల్పంగా ఒక శాతం అంటే రూ.100 నుంచి రూ.500 మధ్య ధరలు పెరుగనున్నాయి. ఈ పెంపు అనేది ఇండస్ట్రీపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) అధ్యక్షుడు కమల్‌నంది పేర్కొన్నారు. రిఫ్రిజిరేటర్లపై 12.5 శాతం, ఏసీలపై 15 శాతం పన్ను విధించనున్నందున మొత్తం కంప్రెషర్ ధర 25-30 శాతం ఎక్కువవుతుందన్నారు. పానాసోనిక్ ఇండియా సీఈవో మనీశ్ శర్మ మాట్లాడుతూ.. కస్టమ్స్ సుంకం పెంపు ప్రభావం 0.6 శాతం ఉంటుందని చెప్పారు. రెండు పెద్ద కంపెనీలు కంప్రెషర్ తయారీకి ఉత్పాదక యూనిట్లు ప్రారంభించాయని, కానీ కరోనాతో అంతరాయం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. -
రిఫ్రిజిరేటర్లో 41 మంది
తెస్సలోనికి: ట్రక్‌లో దాక్కొని గ్రీస్ దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన 41 మందిని పోలీసులు గుర్తించారు. ట్రక్ రిఫ్రిజిరేటర్లో వలసదారులు ఉండగా, జార్జియాకు చెందిన ట్రక్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. జాంతి, కొమొతిని నగరాల మధ్య ఈ ట్రక్కును కనుక్కున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాక్కున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, అవసరమైన ఏడు మందికి ప్రాథమిక చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. వీరు అఫ్గానిస్తాన్ వాసులుగా భావిస్తున్నారు. -
రిఫ్రిజిరేటర్ ట్రక్కులో 41 మంది సజీవంగా!
గ్రీస్ : ఓ రిఫ్రిజిరేటర్ ట్రక్కులో 41 మంది సజీవంగా ఉన్న శరణార్థులను గ్రీస్ పోలీసులు అరెస్టు చేశారు. గ్రీకు నగరం గ్జాంతిలో పోలీసులు రోజూవారీ తనిఖీల్లో భాగంగా ట్రక్కును ఆపారు. దీంతో ఆ ట్రక్కులో ఉన్నవారంతా పోలీసులకు దొరికిపోయారు. శరణార్థులంతా ఆఫ్ఘనిస్తానీలని తేలింది. ట్రక్కులో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఆన్ చేయకపోవడం వల్ల వాళ్లంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో ట్రక్కు డ్రైవర్‌ను, శరణార్థులను పోలీస్‌లు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
నిన్ను రీసైకిల్ చేస్తాం
సాక్షి, : సరికొత్తగా ఏ పని చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం చేసిన ఒక్క పని మనల్నిఆకాశానికి ఎత్తేస్తోంది. అయితే అప్పుడప్పుడు ఇలాంటివి తమకు ప్రతికూలంగానూ మారుతాయి. ఇలాంటి సంఘటనే స్పెయిన్‌లో చోటుచేసుకుంది. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు ఓ వ్యక్తి. తను చేస్తున్న పని గొప్పదని హీరోలా ఫీలయ్యి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ తింగరి పని కాస్తా పోలీసుల వరకు చేరి చివరికి జీరో అయ్యాడు. వివరాలు.. స్పెయిన్‌లోని ఓ వ్యక్తి ఇంట్లోని రిఫ్రిజిరేటర్ వాడుకకాలం పూర్తవడడంతో దాన్ని లోయలో పడేశాడు. అంతటతో ఊరుకోక పడేసే ముందు వెటకారంగా దీన్ని నేనిలా రీసైకిల్ చేస్తున్నానంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్తా వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వెళ్లడంతో, ఆగ్రహించిన పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుని ఫ్రిడ్జ్ పడేసిన చోటుకు తీసుకెళ్లారు. లోయలో పడిన రిఫ్రిజిరేటర్‌ను అతనితోనే బయటకు తీయించారు. పోలీసలూ తమ వంతు సాయం చేశారు. పర్యావరణానికి హాని కలిగించేలా వ్యవహరించిన వ్యక్తి నిర్లక్ష్యపు పనికి స్థానిక కోర్టు జరిమానా విధించే అవకాశముందని పోలీసులు తెలిపారు. అయితే ఆ వ్యక్తి పేరును మాత్రం బయటికి వెల్లడించలేదు. -
ఫ్రిజ్ పేలి విద్యార్థిని మృతి
-
బీటెక్ విద్యార్థినిని బలిగొన్న ఫ్రిజ్
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్ పేలి ఓ బీటెక్ విద్యార్థిని దుర్మరణం చెందింది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్‌లో జరిగింది. వివరాల మేరకు.. దీపిక అనే యువతి శ్రీ ఇందు కాలేజ్‌లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం దీపిక కుటుంబసభ్యులు మొత్తం ఓ ఫంక్షన్‌కు వెళుతూ రావాల్సిందిగా ఆమెను కోరారు. పరీక్షలు ఉన్నందున చదువుకోవాలని చెప్పిన దీపిక ఇంట్లోనే ఉండిపోయింది. మధ్యాహ్న సమయంలో ఆకలివేయటంతో ఫ్రిజ్‌లో ఉన్న పులిహోర తినటానికి ఫ్రిజ్‌ను తెరిచింది. మొదట పొగలు ఆపై పెద్ద శబ్ధంతో ఫ్రిజ్ పేలింది. ఆ పేలుడు ధాటికి దీపిక కాలిపోయి ప్రాణాలు విడిచింది. ఇళ్లు మొత్తం పొగతో దుమ్మకొట్టుకుపోయింది. ఆ ఇంట్లోనుంచి పొగలు రావటం గమనించిన ఇంటి పక్కల వారు దీపిక కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ఇంటికి చేరుకుని లోపలికి వెళ్లి చూడగా దీపిక గుర్తుపట్టలేని విధంగా కాలి విగతజీవిగా కనిపించింది. కూతురి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
హయ్యర్ నుంచి అత్యాధునిక రిఫ్రిజిరేటర్
హైదరాబాద్: చైనాకు చెందిన హయ్యర్ ప్రీమియం గ్లాస్ ఫినిష్‌తో, పక్క, పక్కన డోర్లతో కూడిన అత్యాధునిక రిఫ్రిజిరేటర్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. చాక్లెట్, బ్లాక్ గ్లాస్ ఫినిష్‌తో రెండు రకాలుగా ఇది లభిస్తుందని కంపెనీతెలియజేసింది. ప్రత్యేక ఫీచర్లు మెరుగైన పనితీరుతో పాటు అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయని పేర్కొంది. అడ్డంగా ఉండే డిజిటల్ కంట్రోల్ ప్యానల్‌ను పై భాగంలో కుడివైపున ఏర్పాటు చేసింది. క్విక్ కూల్, జీరో డిగ్రీ ఫ్రెష్, ఫిష్, మీట్, డ్రై ఫ్రూట్స్, సూపర్ కూల్, సూపర్ ఫ్రీజ్ ఫీచర్లు ఉన్నాయి. 688 లీటర్ల సైజు కలిగిన ఈ రిఫ్రిజిరేటర్లో 420 లీటర్ల రిఫ్రిజిరేటర్ సెక్షన్ కాగా, 261 లీటర్లు ఫ్రీజర్ సెక్షన్ కోసం కేటాయించింది. హెచ్ఆర్ఎఫ్–748సీజీ/కేజీ మోడల్ ధర రూ.1,01,000.