బీటెక్‌ విద్యార్థినిని బలిగొన్న ఫ్రిజ్‌ | BTech Girl Died Due To Refrigerator Blast In Hyderabad | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థినిని బలిగొన్న ఫ్రిజ్‌

Published Fri, Dec 28 2018 12:46 PM | Last Updated on Fri, Dec 28 2018 1:36 PM

BTech Girl Died Due To Refrigerator Blast In Hyderabad - Sakshi

దీపిక(ఫైల్‌)

సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్‌ పేలి ఓ బీటెక్‌ విద్యార్థిని దుర్మరణం చెందింది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్‌లో జరిగింది. వివరాల మేరకు.. దీపిక అనే యువతి శ్రీ ఇందు కాలేజ్‌లో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం దీపిక కుటుంబసభ్యులు మొత్తం ఓ ఫంక్షన్‌కు వెళుతూ రావాల్సిందిగా ఆమెను కోరారు. పరీక్షలు ఉన్నందున చదువుకోవాలని చెప్పిన దీపిక ఇంట్లోనే ఉండిపోయింది. మధ్యాహ్న సమయంలో ఆకలివేయటంతో ఫ్రిజ్‌లో ఉన్న పులిహోర తినటానికి ఫ్రిజ్‌ను తెరిచింది.

మొదట పొగలు ఆపై పెద్ద శబ్ధంతో ఫ్రిజ్‌ పేలింది. ఆ పేలుడు ధాటికి దీపిక కాలిపోయి ప్రాణాలు విడిచింది. ఇళ్లు మొత్తం పొగతో దుమ్మకొట్టుకుపోయింది. ఆ ఇంట్లోనుంచి పొగలు రావటం గమనించిన ఇంటి పక్కల వారు దీపిక కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ఇంటికి చేరుకుని లోపలికి వెళ్లి చూడగా దీపిక గుర్తుపట్టలేని విధంగా కాలి విగతజీవిగా కనిపించింది. కూతురి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement