పర్యావరణహిత ఫ్రిజ్.. వాటర్ లీకేజీ అలారం! | students make refrigerator without power! | Sakshi
Sakshi News home page

పర్యావరణహిత ఫ్రిజ్.. వాటర్ లీకేజీ అలారం!

Published Sun, Mar 2 2014 1:23 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

పర్యావరణహిత ఫ్రిజ్.. వాటర్ లీకేజీ అలారం! - Sakshi

పర్యావరణహిత ఫ్రిజ్.. వాటర్ లీకేజీ అలారం!

హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యుత్తు అవసరం లేకుండానే పనిచేసే ఎకో ఫ్రెండ్లీ రిఫ్రిజిరేటర్‌తోపాటు యూఎస్‌బీ కాఫీ హీటర్, వాటర్ లీకేజీ అలారమ్, సోలార్ చార్జర్‌లను తయారు చేసి బంజారాహిల్స్‌లోని ముఫఖం జా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. కాలేజీ ఈ-సెల్ విభాగానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు షాజాద్, అజహర్, సాలికలు తాము తయారు చేసిన ఈ వస్తువులను శనివారం కళాశాల ఆవరణలో ప్రదర్శించారు. చెక్క పెట్టె, మట్టి కుండ, బొగ్గులను ఉపయోగించి తాము తయారుచేసిన పర్యావరణ హిత రిఫ్రిజిరేటర్ గ్రామాల్లో బాగా పనిచేస్తుందని, దీనిలో ఆహార పదార్థాలను మూడు రోజుల వరకూ నిల్వ ఉంచవచ్చని వారు తెలిపారు. ఈ ఫ్రిజ్‌ను ప్రయోగాత్మకంగా చిలుకూరు గ్రామంలో వినియోగించనున్నట్లు వెల్లడించారు.

 

అలాగే కాఫీ చల్లారకుండా ఉండేలా యూఎస్‌బీతో పనిచేసే కాఫీ హీటర్ కంప్యూటర్లపై పనిచేసేవారికి బాగా ఉపయోగపడుతుందన్నారు. ఏవైనా సంస్థలు ముందుకొస్తే వాటి సహకారంతో వీటిని మార్కెట్‌లోకి విడుదల చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement