
మార్కెట్లోకి సోలార్ రిఫ్రిజిరేటర్లు
8 పోల్ ఇన్వర్టర్ ఏసీ కూడా..
• శాంసంగ్ కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ రిషి సూరి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శాంసంగ్ ఇండియా కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్ విభాగంలో సరికొత్త శ్రేణి ఉత్పత్తులను విడుదల చేసింది. సౌర విద్యుత్‌తో నడిచే స్మార్ట్ కన్వర్టబుల్ ఫాస్ట్ ఫ్రీ, డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లను, 8 పోల్ మోటార్‌తో కూడిన డిజిటల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్లను గురువారమిక్కడ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శాంసంగ్ కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ రిషి సూరి మాట్లాడుతూ..
ఈ నూతన శ్రేణి ఉత్పత్తులు కొనుగోలుదారులకు విద్యుత్‌ను ఆదా చేయడంతో పాటూ 43 శాతం వేగంగా చల్లదనాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. ధరల విషయానికొస్తే రిఫ్రిజిరేటర్ల ధర రూ.14,900 నుంచి రూ.27,250, ఏసీల ధర రూ.35,900 నుంచి రూ.66,600లుగా ఉన్నాయని తెలియజేశారు. ‘‘దేశంలో 2015లో రూ.4.14 లక్షల కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమ 2017 నాటికి రూ.5.03 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. మొత్తం శాంసంగ్ మార్కెట్లో తెలుగు రాష్ట్రాల వాటా 20–25 శాతం ఉంటుందని.. విభాగాల వారీగా చూస్తే రిఫ్రిజిరేటర్లలో 45.8 శాతం, ఇన్వర్టర్ ఏసీలో 29 శాతం, టీవీల విభాగంలో 32.6 శాతం వాటాను కలిగి ఉన్నామని ఆయన వివరించారు.