శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్ పార్క్
సాన్‌హొసే (యూఎస్): మొబైల్స్ తయారీలో ఉన్న చైనా కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటున్నాయని సామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్, సీఈవో జె.బి.పార్క్ తెలిపారు. ఏఐ అవసరాల కోసం వ్యక్తిగత డేటాను పంచుకుంటే చైనీస్ హ్యాండ్‌సెట్ తయారీ సంస్థలతో ముప్పు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. భారత్‌లో ప్రత్యర్థి సంస్థలతో పోటీ ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.
‘బలమైన ప్రత్యర్థి లేదా పోటీ లేకపోతే జీవితం చాలా బోరింగ్‌గా ఉంటుంది. సవాళ్లను మేము ఆస్వాదిస్తాం. మొబైల్, ఏఐ సాంకేతికతపై దృష్టి పెట్టడమేగాక మొత్తం వ్యవస్థకు సేవలు అందించే సంస్థగా మారడానికి ప్రయతి్నస్తున్నాం. భారత స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు 2025 పెద్ద సంవత్సరంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. ఇందుకు సామ్‌సంగ్ సిద్ధంగా ఉంది’ అని వివరించారు.
ప్రస్తుతం 800 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన సూపర్–ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఆపిల్ నుండి, అలాగే 400–600 డాలర్ల విభాగంలో చైనీస్ హ్యాండ్‌సెట్ తయారీదారుల నుండి సామ్‌సంగ్ పోటీ ఎదుర్కొంటోంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తీవ్ర పోటీ ఉంటుందని పార్క్ అన్నారు. చిన్న పట్టణాల్లోనూ కంపెనీ తయారీ ప్రీమియం ఫోన్ల వాడకం పెరిగిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment