Mobile manufacturing company
-
చైనా మొబైల్ కంపెనీలకు షాక్
న్యూఢిల్లీ: దేశంలో కార్యకలాపాలు నిర్వహించే చైనా మొబైల్ తయారీ కంపెనీలకు కేంద్ర సర్కారు స్పష్టమైన మార్గదర్శనం చేసింది. భారత్‌లో విక్రయాలకు, భారత్ నుంచి ఎగుమతుల కోసం మొబైల్ ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ ఉపకరణాలను ఇక్కడే తయారు చేయాలని, భారతీయ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించాలని కోరినట్టు తెలిసింది. భారత్‌లో కార్యకలాపాలకు స్థానిక భాగస్వాములను చేర్చుకోవాలని కోరింది. కేంద్రం నిర్వ హించిన సమావేశానికి హాజరైన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లు ఈ వివరాలను మీడియాతో పంచుకోవడం వల్ల బయటకు తెలిసింది. అంతేకాదు సదరు జా యింట్ వెంచర్ కంపెనీల్లో కీలక స్థానాల్లో భారతీయులనే నియమించుకోవాలని కూడా కోరింది. సీఈవో, సీవోవో, సీఎఫ్‌వో, సీటీవో తదితర స్థానాలకు భారతీయులను తీసుకోవాలని ఆదేశించింది. భారత కాంట్రాక్టు తయారీ సంస్థలను నియమించుకోవాలని, స్థానికంగానే విడిభాగాల తయారీని కూడా చేపట్టాలని కూడా కోరింది. ప్రస్తుతం చైనీ సంస్థలు ఇక్కడ అసెంబ్లింగ్ వరకే చేస్తుండడం గమనార్హం. విడిభాగాల తయారీని కూడా భారత భాగస్వామ్య సంస్థలతో కలసి చేపట్టి, ఇక్కడి నుంచి మరిన్ని ఎగుమతులు చేయాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పంపిణీదారులు కూడా స్థానికులే ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు చైనా డి్రస్టిబ్యూటర్లను కలిగి ఉన్నాయి. భారత చట్టాలను విధిగా అనుసరించాలని, పన్ను ఎగవేతలకు పాల్పడరాదని తేల్చి చెప్పింది. చైనాకు చెందిన షావోమీ, ఒప్పో, రియల్మీ, వివోతోపాటు, ఇండియా సెల్యులర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ)కు ఇటీవలి సమావేశంలో కేంద్రం ఈ మేరకు సూచనలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సమావేశాన్ని నిర్వ హించింది. ఇది నిజమేనన్నట్టు.. దేశీ కాంట్రాక్టు తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్‌తో షావోమీ ఒ ప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. భారత్‌లో మొబైల్ ఫోన్లను తయారు చేసి ఇవి ఎగుమతి చేయనున్నాయి. మరికొన్ని సంస్థలతోనూ ఇదే విధమైన భాగస్వామ్యంపై డిక్సన్ చర్చలు నిర్వహిస్తుండడం గమనార్హం. -
యాపిల్ ఐఫోన్ 14.. ఇక కష్టమే..
-
వైఎస్సార్ జిల్లాలో విదేశీ మొబైల్స్ తయారీ!
సాక్షి, అమరావతి/వైఎస్సార్: విదేశీ ఫోన్ ట్రింగ్ ట్రింగ్‌తో త్వరలోనే వైఎస్ఆర్ కడప జిల్లా మారుమ్రోగనుంది. కోవిడ్–19 తర్వాత విదేశీ ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇప్పుడు ఇండియాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తుండటంతో ఈ కంపెనీలను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) ఏర్పాటు చేస్తోంది. వైఎస్ఆర్ కడప జిల్లా కోపర్తి వద్ద సుమారు 500 ఎకరాల్లో ఈఎంసీ3ని అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే తిరుపతి సమీపంలో వికృతమాళ వద్ద 113.27 ఎకరాల్లో ఈఎంసీ1 , 501.40 ఎకరాల్లో ఈఎంసీ 2 ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 500 ఎకరాల్లో కోపర్తి వద్ద ఈఎంసీ3ని అభివృద్ధి చేయనున్నారు. తైవాన్‌కు చెందిన పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాయని, దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక చర్చలు కూడా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. (ప్రజా నాడి తెలిసిన నేత మరిలేరు) మొబైల్ తయారీ యూనిట్ల ఆకర్షణే లక్ష్యం యాపిల్, రెడ్మీ వంటి ఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఫాక్స్‌కాన్ కోపర్తి ఈఎంసీలో యూనిట్ ఏర్పాటు అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. అలాగే యాపిల్ ఫోన్ తయారు చేసే మరో తైవాన్ సంస్థ పెగాట్రాన్ కూడా కోపర్తిలో యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కోవిడ్–19 తర్వాత పలు విదేశీ కంపెనీలు ఇండియాలో యూనిట్లు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని, వీటిని ఆకర్షించడం కోసం కోపర్తిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈఎంసీ–3ని అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే విదేశాలకు చెందిన సుమారు 22 కంపెనీలు ఇండియాలో యూనిట్లు పెట్టడానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాయని, వీటిలో అత్యధిక భాగం రాష్ట్రానికి తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే కడప జిల్లా యాపిల్ ఫోన్ ట్రింగ్ ట్రింగ్‌లతో మారుమ్రోగనుంది. (‘అమూల్’ శిక్షణా తరగతులు) -
కార్బన్ నుంచి ‘ఔరా9’ స్మార్ట్‌ఫోన్
బెంగళూరు : పలు రకాల హ్యాండ్సెట్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న ప్రముఖ దేశీ మొబైల్ తయారీ కంపెనీ కార్బన్ తాజాగా ‘ఔరా9’ అనే మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.6,999. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల తెర, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. -
లెనొవొ ‘కె3 నోట్’@ 9,999
విక్రయాలు ఫ్లిప్‌కార్ట్‌లోనే న్యూఢిల్లీ : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ లెనొవొ తాజాగా ‘కె3 నోట్’ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని కోసం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,999. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4జీ, 5.5 అంగుళాల హెచ్డీ తెర, 1.7 గిగాహెర్ట్జ్ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రిజిస్ట్రేషన్ ఫ్లిప్‌కార్ట్‌లో గురువారం నుంచి ప్రారంభ మయ్యింది. -
ఐబాల్ నుంచి కోబాల్ట్4
- ఫోన్‌తోపాటు 4 డిటాచబుల్ లె న్స్ - ధర రూ.8,499 ముంబై: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఐబాల్ తన కోబాల్ట్ సిరీస్‌లో ‘ఎంఎస్ఎల్ఆర్ కోబాల్ట్4’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8,499. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టాకోర్ ప్రాసెసర్, 5 అంగుళాల హెచ్డీ తెర, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 ప్రాంతీయ భాషల సపోర్ట్, ఫ్లాష్‌తో కూడిన 8 ఎంపీ రియర్ కెమెరా, ఫ్లాష్ ఉన్న 3.2 ఫ్రంట్ కెమెరా, 8 జీబీ మెమరి, డ్యూయెల్ సిమ్, 3జీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా ఫిష్ఐ లెన్స్, మైక్రో లెన్స్ (10ఎక్స్ జూమ్) వైడ్ యాంగిల్ లెన్స్, 8ఎక్స్ జూమ్ లెన్స్ అనే నాలుగు డిటాచబుల్ లెన్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇవి ఫోన్‌తోపాటు వస్తాయి. వీటి వల్ల మంచి నాణ్యత గల ఫొటోలను తీసుకోవడం వీలవుతుంది. -
వేరబుల్స్ మార్కెట్లో షియోమీది 2వ స్థానం
న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ అంతర్జాతీయ వేరబుల్స్ మార్కెట్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయం రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదికలో వెల్లడైంది. గతేడాది కేవలం రూ.999 ధరకే షియోమీ ‘మి బాండ్ ’ పేరుతో తన తొలి వేరబుల్స్‌ను చైనా మార్కెట్లో ప్రవేశపెట్టింది. కేవలం ఏడాదిలోపే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. అగ్రస్థానంలో ఫిట్‌బిట్ ఉంది. తర్వాతి స్థానాల్లో గార్మిన్, శామ్సంగ్, జాబోన్, పెబుల్, సోని కొనసాగుతున్నాయి. యాపిల్ తన వేరబుల్స్‌తో ఇతర కంపెనీలకు ఎలాంటి పోటీ ఇస్తుందో, వేరబుల్స్ మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉందని వేరబుల్స్ రీసెర్చ్ మేనేజర్ రామన్ లామస్ తెలిపారు.