వేరబుల్స్ మార్కెట్‌లో షియోమీది 2వ స్థానం | xiaomi on the 2nd position in the market variable | Sakshi
Sakshi News home page

వేరబుల్స్ మార్కెట్‌లో షియోమీది 2వ స్థానం

Published Tue, Jun 9 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

వేరబుల్స్ మార్కెట్‌లో షియోమీది 2వ స్థానం

వేరబుల్స్ మార్కెట్‌లో షియోమీది 2వ స్థానం

న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ అంతర్జాతీయ వేరబుల్స్ మార్కెట్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయం రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదికలో వెల్లడైంది. గతేడాది కేవలం రూ.999 ధరకే షియోమీ ‘మి బాండ్ ’ పేరుతో తన తొలి వేరబుల్స్‌ను చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. కేవలం ఏడాదిలోపే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. అగ్రస్థానంలో ఫిట్‌బిట్ ఉంది. తర్వాతి స్థానాల్లో గార్మిన్, శామ్‌సంగ్, జాబోన్, పెబుల్, సోని కొనసాగుతున్నాయి. యాపిల్ తన వేరబుల్స్‌తో ఇతర కంపెనీలకు ఎలాంటి పోటీ ఇస్తుందో, వేరబుల్స్ మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉందని వేరబుల్స్ రీసెర్చ్ మేనేజర్ రామన్ లామస్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement