న్యూఢిల్లీ: దేశంలో కార్యకలాపాలు నిర్వహించే చైనా మొబైల్ తయారీ కంపెనీలకు కేంద్ర సర్కారు స్పష్టమైన మార్గదర్శనం చేసింది. భారత్‌లో విక్రయాలకు, భారత్ నుంచి ఎగుమతుల కోసం మొబైల్ ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ ఉపకరణాలను ఇక్కడే తయారు చేయాలని, భారతీయ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించాలని కోరినట్టు తెలిసింది. భారత్‌లో కార్యకలాపాలకు స్థానిక భాగస్వాములను చేర్చుకోవాలని కోరింది. కేంద్రం నిర్వ హించిన సమావేశానికి హాజరైన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లు ఈ వివరాలను మీడియాతో పంచుకోవడం వల్ల బయటకు తెలిసింది.
అంతేకాదు సదరు జా యింట్ వెంచర్ కంపెనీల్లో కీలక స్థానాల్లో భారతీయులనే నియమించుకోవాలని కూడా కోరింది. సీఈవో, సీవోవో, సీఎఫ్‌వో, సీటీవో తదితర స్థానాలకు భారతీయులను తీసుకోవాలని ఆదేశించింది. భారత కాంట్రాక్టు తయారీ సంస్థలను నియమించుకోవాలని, స్థానికంగానే విడిభాగాల తయారీని కూడా చేపట్టాలని కూడా కోరింది. ప్రస్తుతం చైనీ సంస్థలు ఇక్కడ అసెంబ్లింగ్ వరకే చేస్తుండడం గమనార్హం. విడిభాగాల తయారీని కూడా భారత భాగస్వామ్య సంస్థలతో కలసి చేపట్టి, ఇక్కడి నుంచి మరిన్ని ఎగుమతులు చేయాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
పంపిణీదారులు కూడా స్థానికులే ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు చైనా డి్రస్టిబ్యూటర్లను కలిగి ఉన్నాయి. భారత చట్టాలను విధిగా అనుసరించాలని, పన్ను ఎగవేతలకు పాల్పడరాదని తేల్చి చెప్పింది. చైనాకు చెందిన షావోమీ, ఒప్పో, రియల్‌మీ, వివోతోపాటు, ఇండియా సెల్యులర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ)కు ఇటీవలి సమావేశంలో కేంద్రం ఈ మేరకు సూచనలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సమావేశాన్ని నిర్వ హించింది. ఇది నిజమేనన్నట్టు.. దేశీ కాంట్రాక్టు తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్‌తో షావోమీ ఒ ప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. భారత్‌లో మొబైల్ ఫోన్లను తయారు చేసి ఇవి ఎగుమతి చేయనున్నాయి. మరికొన్ని సంస్థలతోనూ ఇదే విధమైన భాగస్వామ్యంపై డిక్సన్ చర్చలు నిర్వహిస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment