new guidelines
-
రంజీల్లో ‘స్టార్స్’ వార్!
ఆహా... ఎన్నాళ్లకెన్నాళ్లకు... మనస్టార్లు దేశవాళీ బాటపట్టారు. కింగ్ కోహ్లి ఢిల్లీ తరఫున ఆడితే... హైదరాబాద్‌కు సిరాజ్ పేస్ తోడైతే... కేఎల్ రాహుల్ కర్ణాటకకు జై కొడితే... జడేజా ఆల్‌రౌండ్ ఆటతో సౌరాష్టకు ఆడితే అవి రంజీ మ్యాచ్‌లేనా? రసవత్తర మ్యాచ్‌లు కావా? కచ్చితంగా అవుతాయి. తదుపరి రంజీ దశ పోటీలు తారలతో కొత్త శోభ సంతరించుకుంటున్నాయి. అభిమానులకు నాలుగు రోజులూ ఇక క్రికెట్ పండగే! చూస్తుంటే గంభీర్ సిఫార్సులతో రూపొందించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త మార్గదర్శకాలు ఎంతటి స్టార్లయినా దేశవాళీ కోసం తగ్గాల్సిందేనని నిరూపించబోతున్నాయి. న్యూఢిల్లీ: దేశవాళీ రంజీ ట్రోఫీలోని చివరి రౌండ్ మ్యాచ్‌లూ పసందుగా సాగనున్నాయి. అభిమాన క్రికెటర్లు నాలుగు రోజుల ఆటకు అందుబాటులోకి రావడమే దేశవాళీ క్రికెట్‌కు సరికొత్త పండగ తెస్తోంది. ఇదివరకు చెప్పినట్టుగానే విరాట్ కోహ్లి ఢిల్లీ ఆడే తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఢిల్లీ డి్రస్టిక్ట్స్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) సోమవారం ఈ విషయాన్ని వెల్లడించడమే కాదు... రైల్వేస్ జట్టుతో ఈ నెల 30 నుంచి జరిగే పోరుకోసం ఢిల్లీ జట్టును ప్రకటించింది. అందులో కింగ్ కోహ్లి ఉండటమే విశేషం. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫిబ్రవరి 2వ తేదీ వరకు అతను తన అభిమానులను దేశవాళీ మ్యాచ్ ద్వారా అలరించేందుకు సిద్ధమయ్యాడు. కేవలం మ్యాచ్ రోజుల్లోనే కాదు... ఢిల్లీ సహచరులతో పాటు కలిసి కసరత్తు చేసేందుకు అతను మంగళవారం జట్టుతో చేరతాడని ఢిల్లీ కోచ్ శరణ్‌దీప్ సింగ్ ధ్రువీకరించారు. కొన్నిరోజులుగా టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ (ప్రస్తుత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోచ్)తో కలిసి బ్యాటింగ్‌లో శ్రమిస్తున్నాడు. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడు రంజీతో అతను రియల్‌గా బ్యాటింగ్ చేయనున్నాడు. ఇదే జరిగితే 2012 తర్వాత కోహ్లి రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో డీడీసీఏ తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సెక్యూరిటీ సిబ్బందిని పెంచింది. ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చింది. సౌరాష్ట్రతో ఢిల్లీ ఆడిన గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన రిషభ్ పంత్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం కాస్త వెలతే! కానీ ‘రన్ మెషిన్’ కోహ్లి శతక్కొట్టే ఇన్నింగ్స్ ఆడితే మాత్రం ఆ వెలతి తీరుతుంది. హైదరాబాద్ పేస్‌కా బాస్... సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా, షమీలాంటి అనుభవజ్ఞులతో పాటు భారత జట్టు పేస్ దళానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సిరాజ్ ఇప్పుడు హైదరాబాద్ బలం అయ్యాడు. గురువారం నుంచి నాగ్‌పూర్‌లో విదర్భ జట్టుతో జరిగే ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్ బరిలోకి దిగుతున్నాడు. నాగ్‌పూర్ ట్రాక్ పేస్‌కు అవకాశమిచ్చే వికెట్. ఈ నేపథ్యంలో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగే అవకాశముంది. అతను నిప్పులు చెరిగితే సొంతగడ్డపై విదర్భకు కష్టాలు తప్పవు! సరిగ్గా ఐదేళ్ల క్రితం 2020లో చివరి రంజీ మ్యాచ్ కూడా విదర్భతోనే ఆడిన సిరాజ్... మళ్లీ ఆ ప్రత్యర్థితోనే దేశవాళీ ఆట ఆడబోతున్నాడు. జడేజా వరుసగా రెండో మ్యాచ్ ఎలైట్ గ్రూప్ ‘డి’లో ఉన్న సౌరాష్ట్ర తరఫున ఈ నెల 23 నుంచి ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ఆడిన స్టార్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్ ఆడేందుకు సై అంటున్నాడు. గత మ్యాచ్‌లో అతని ఆల్‌రౌండ్ ‘షో’ వల్లే నాలుగు రోజుల మ్యాచ్ కాస్త రెండే రోజుల్లో ముగిసింది. రెండు ఇన్నింగ్స్ (5/66, 7/38)ల్లో కలిపి 12 వికెట్లు తీసిన జడేజా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో 38 పరుగులు కూడా చేశాడు. సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. గురువారం నుంచి అస్సామ్‌తో జరిగే పోరులో మళ్లీ జోరు కనబరచాలనే లక్ష్యంతో రంజీ బరిలోకి దిగుతున్నాడు. అస్సామ్ను హిట్టర్ రియాన్ పరాగ్ నడిపిస్తున్నాడు. భుజం గాయం నుంచి కోలుకున్న పరాగ్ ఐపీఎల్ ద్వారానే అందరికంటా పడ్డాడు. ఫిట్నెస్తో రాహుల్ రెడీ కర్ణాటక తరఫున ఎలైట్ గ్రూప్ ‘సి’లో పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనే కేఎల్ రాహుల్ ఆడాలనుకున్నాడు. కానీ మోచేతి గాయం కారణంగా ఆ రంజీ పోరు ఆడలేకపోయిన స్టార్ ఓపెనర్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో హరియాణా జట్టుతో ఢీకొనేందుకు రెడీ అయ్యాడు. రాహుల్ చివరి సారిగా 2020లో బెంగాల్‌తో జరిగిన రంజీ సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఐదేళ్ల తర్వాత సొంతరాష్ట్రం తరఫున దేశవాళీ మ్యాచ్ ఆడనున్నాడు. అతని చేరికతో కర్ణాటక బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టం అయ్యింది. అంతేకాదు. దేవదత్ పడిక్కల్, సీమర్ ప్రసిధ్ కృష్ణలు కూడా ఆడుతుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ ముగ్గురు ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రోహిత్, జైస్వాల్, అయ్యర్ గైర్హాజరు ఈ రంజీ ట్రోఫీలో ముంబై ఆడాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ భారత కెపె్టన్ రోహిత్ శర్మ సహా యువ సంచలనం యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్లు ఆసక్తి కనబరిచారు. ఈ త్రయం జమ్మూకశ్మీర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బరిలోకి దిగింది. అయితే ఇంగ్లండ్‌తో వచ్చే నెల 6, 9, 12 తేదీల్లో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం వీరంతా భారత జట్టులో చేరాల్సివుండటంతో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే పోరుకు అందుబాటులో ఉండటం లేదని ముంబై వర్గాలు వెల్లడించాయి. -
ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం (IT Company) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు మరో షాకిచ్చింది. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని (WFH) పూర్తిగా తొలగించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్న టీసీఎస్ అందులోనూ కీలక మార్పులు చేసింది.ఆఫీస్ హాజరు మినహాయింపుల కోసం అభ్యర్థనలకు సంబంధించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) విధానాన్ని టీసీఎస్ తాజాగా సవరించింది. కార్యాలయ హాజరు అవసరాలను కఠినతరం చేసింది. కంపెనీ తన భారతీయ సిబ్బందికి చేసిన ప్రకటన ప్రకారం.. ఆఫీస్ హాజరు మినహాయింపు కోసం ఉద్యోగులు ఒక త్రైమాసికంలో గరిష్టంగా ఆరు రోజులు వ్యక్తిగత అత్యవసర పరిస్థితులను కారణంగా పేర్కొనవచ్చు. ఒక వేళ ఈ మినహాయింపులను వాడుకోలేకపోయినా తరువాత త్రైమాసికానికి బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా ఉండదు.ఎంట్రీల్లోనూ పరిమితులుఇక ఒక ఎంట్రీలో గరిష్టంగా 30 మినహాయింపులను సమర్పించడానికి ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. నెట్‌వర్క్‌కు సంబంధించిన సమస్యలైతే ఒకేసారికి ఐదు ఎంట్రీలు నివేదించవచ్చు. 10 రోజులలోపు పూర్తి చేయని మినహాయింపు అభ్యర్థనలు వాటంతటవే రిజెక్ట్ అవుతాయి. ఆలస్యంగా చేసే సమర్పణలకు సంబంధించి ప్రస్తుత తేదీ నుండి మునుపటి రెండు తేదీల వరకు మాత్రమే బ్యాక్‌డేటెడ్ ఎంట్రీకి అనుమతి ఉంటుంది. అలాగే ప్రస్తుత నెలలో డబ్ల్యూఎఫ్‌వో ఎంట్రీ కేటగిరీ లేకపోతే తదుపరి నెల 5వ తేదీ వరకు దాన్ని నివేదించవచ్చని కంపెనీ నోట్ పేర్కొంది.కార్యాలయ హాజరు ఆదేశం నుండి మినహాయింపులను అభ్యర్థించడానికి లార్జ్ స్కేల్ అప్లోడ్లు లేదా బ్యాకెండ్ ఎంట్రీలను టీసీఎస్ నిషేధించింది. ఐదు రోజుల వర్క్‌వీక్ హాజరు విధానాన్ని అవలంబించడంలో కొన్ని ఇతర భారతీయ ఐటీ సంస్థలతో పాటు టీసీఎస్ ముందంజ వేసింది. ఇతర సంస్థలు వారానికి రెండు నుండి మూడు రోజుల పాటు కార్యాలయంలో హాజరును తప్పనిసరి చేశాయి. హాజరు సమ్మతితో వేరియబుల్ పేని ముడిపెట్టాయి.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ జీతాల పెంపు.. ఎంత పెరుగుతాయంటే..ఉద్యోగులు స్థిరత్వం సాధించిన తర్వాత ఈ విధానాన్ని నిలిపివేసే అవకాశం ఉందని టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కాడ్ చెప్పినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాత లక్కడ్ మాట్లాడుతూ ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు పూర్తి వేరియబుల్ వేతనాన్ని పొందేందుకు అర్హులని, మిడ్, సీనియర్ లెవల్ సిబ్బంది వేరియబుల్ వేతనం వారి పనితీరుపై ఆధారపడి ఉంటుందని వివరించారు.40,000 మంది నియామకంటీసీఎస్ ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 5,000 మంది తగ్గినట్లు టీసీఎస్ తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఫ్రెషర్లకు ఉద్యోగా అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో మిలింద్ లక్కడ్ స్పష్టం చేశారు.టీసీఎస్ సంస్థలో ఉద్యోగం పొందాలంటే.. కేవలం కోడింగ్ నైపుణ్యాలు ఉంటే సరిపోదని.. అభ్యర్థులకు తగిన విద్యార్హతలు కూడా ఉండాలని లక్కడ్ వెల్లడించారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోవని స్పష్టం చేశారు. ఏఐ వల్ల ఉద్యోగుల సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపారు. మనిషి ఆలోచనా శక్తికి ఉన్న ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే క్లయింట్లను నేరుగా సంప్రదించాల్సిన విభాగాలలో.. ఇతర అవసరమైన విభాగాల్లో మానవ వనరుల ప్రాధాన్యత తప్పకుండా ఉంటుందని మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. -
బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర విద్యుత్ శాఖ బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు (బీసీఎస్), బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల (బీఎస్ఎస్) ఓనర్లు, మార్చుకోతగిన బ్యాటరీలను చార్జ్ చేసేందుకు ప్రస్తుతమున్న విద్యుత్ కనెక్షన్‌నే ఉపయోగించుకోవచ్చు. కనెక్టెడ్ లోడ్‌ను పెంచుకున్నా, పెంచుకోకపోయినా ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. మెరుగైన స్వాపింగ్, చార్జింగ్ కోసం ట్రక్కులు, బస్సులు లాంటి భారీ వాహనాలు లిక్విడ్–కూల్డ్ స్వాపబుల్ బ్యాటరీలను వినియోగించవచ్చు. -
కోచింగ్ సెంటర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు చేయకూడదని కేంద్రం హెచ్చరించింది. కోచింగ్ కేంద్రాలు చేసే 100 శాతం జాబ్ గ్యారెంటీ, 100 శాతం సెలెక్షన్ వంటి తప్పుడు ప్రకటనలను నియంత్రించేందుకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థకు (CCPA) అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా ఇప్పటివరకు సీసీపీఏ 54 నోటీసులు జారీ చేయగా.. రూ. 54.60 లక్షల జరిమానాలు విధించింది.‘విద్యార్థుల నుంచి కోచింగ్ సెంటర్లు ఉద్దేశపూర్వకంగా కొంత సమాచారాన్ని దాచడం తాము గమనించాం. అందుకే కోచింగ్ సెంటర్ల నిర్వహకుల కోసం కొత్తమార్గదర్శకాలను రూపొందించామని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని అయితే ప్రకటనల నాణ్యత వినియోగదారుల హక్కులను దెబ్బతీయకూడదని ఆమె అన్నారు.కొత్త మార్గదర్శకాల ప్రకారం..కోచింగ్ సెంటర్లు అందించే కోర్సులు, వ్యవధికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేయకూడదు. ఉదా: ఫీజు విధానం, వాపస్ పాలసీ, ఎగ్జామ్ ర్యాంకింగ్, జాబ్ గ్యారంటీ, జీతం పెరుగుదల వంటివిఅభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత వారి రాతపూర్వక అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్లు అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉపయోగించకూడదు. కోర్సుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయాలి.చాలా మంది యూపీఎస్సీ విద్యార్థులు తమ స్వంతంగా చదవుకొని ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేస్తారు. కోచింగ్ సెంటర్ల నుంచి ఇంటర్వ్యూ మార్గదర్శకాలను మాత్రమే తీసుకుంటారు. ఈ విషయంలో విద్యార్ధులకు ముందే స్పష్టత ఇవ్వాలిఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులు తమ వద్ద ఏ కోర్సులో శిక్షణ తీసుకున్నారో తెలియజేయాలి.చట్టబద్ధంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి.కోచింగ్ సెంటర్లు తమ అభ్యర్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, భద్రత కల్పించాలి.నిబంధనలు ఉల్లంఘించిన వారికి వినియోగదారుల రక్షణ చట్టం కింద జరిమానాలు విధించనున్నారు. -
ఖరీఫ్ నుంచే కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్, : మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా దారి మళ్లించడం, నాణ్యమైన బియ్యం విక్రయించి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖను మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడకుండా మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సోమవారం మంత్రి ఉత్తమ్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమావేశంలో ఈ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు తెలిసింది. కెపాసిటీకి అనుగుణంగా కేటాయింపులు రైస్‌మిల్లులు తమకు కేటాయించిన ధాన్యాన్ని ఏడాదిన్నర వరకు కూడా మిల్లింగ్ పూర్తి చేయకుండా తమ వద్దే నిల్వ ఉంచుకుంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. తద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, ఎఫ్‌సీఐ రీయింబర్స్మెంట్ ఇవ్వడంలో ఆలస్యం చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మిల్లులు సీఎంఆర్ కోసం ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో 16 గంటలు పనిచేయాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ముడి బియ్యం ఇచ్చే రా రైస్ మిల్లులకు వడ్లు కేటాయిస్తే 8 గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో రోజుకు 16 గంటలు మిల్లింగ్ చేసి 75 రోజుల్లో కేటాయించిన ధాన్యంలో 67శాతం రా రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లుల కెపాసిటీకి అనుగు ణంగా ధాన్యం కేటాయించనున్నారు. 25 శాతం బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరిమిల్లింగ్ కోసం ధాన్యం తీసుకునే మిల్లర్లు ధాన్యం విలువకు అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీ తప్ప నిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అను గుణంగా నిబంధనలు సవరించారు. కేటాయించిన ధాన్యం మిల్లింగ్ కెపాసిటీని బట్టి మిల్లింగ్‌కు వచ్చే 15 రోజుల ముందే 25 శాతం బ్యాంక్ గ్యారంటీని సమర్పించాల్సి ఉంటుంది. లీజు మిల్లుదారుడైతే కేటాయించిన ధాన్యంలో 50 శాతం బ్యాంక్ గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుంది. లీజు తీసుకున్న మిల్లులో గతంలో ఓనర్ సీఎంఆర్ డెలివరీ పెండింగ్ లేనట్టు డీఎంల నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతే మిల్లులకు కేటాయింపులు ఉంటాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలులో ఉన్న మిల్లర్లకు సైతం ధాన్యం కేటాయింపులు ఉండవని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.డిఫాల్టర్లపై ఉక్కుపాదంగతంలో అక్రమాలకు పాల్పడినట్టు తేలిన మిల్లర్లకు, ఫేక్ ట్రక్ షీట్లు సృష్టించి కేసుల్లో ఇరుకున్న వారికి, 6 ఏ ఈసీ యాక్ట్, క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్న వారికి ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కేటాయించకూడదని, వీరికి ఈ సీజన్‌తోపాటు వచ్చే రెండు సీజన్ల వరకు వడ్లు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. డిఫాల్ట్ అయిన మిల్లర్లు బకాయి పడ్డ సీఎంఆర్‌ను అప్పగించి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకుంటేనే కొత్తగా ధాన్యం కేటాయించనున్నారు. మిల్లర్లు లీజు డీడ్ ఇవ్వడంతోపాటు కేటాయించిన ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి కానుంది. కలెక్టర్ల పర్యవేక్షణ...జిల్లాల వారీగా రైస్‌మిల్లుల్లో సాగే సీఎంఆర్‌పై కలెక్టర్లకే బాధ్యతలు అప్పగించనున్నా రు. ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లింగ్ వరకు వారే కీలకం. బాయిల్డ్ రైస్‌మిల్లర్లు ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు డిసెంబర్ 31లోగా ఎఫ్ఆర్కే బ్లెండింగ్, సోర్టెక్స్ మెషీన్లు ఇన్స్టాల్ చేసుకు నేలా ఆయా జిల్లాల కలెక్టర్ చర్యలు తీసు కొని, వారికే ధాన్యం కేటాయించాల్సి ఉంటుంది. జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి అర్హత ఉన్న మేరకే ధాన్యం కేటాయించాలి. మిల్లు లను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేటాయించిన ధాన్యం దారిమళ్లినా, ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రైవేట్‌గా విక్రయించినా క్రిమినల్ చర్యలు తప్పనిసరి. -
ఇకపై పరగడుపున కొలెస్ట్రాల్టెస్ట్ అక్కర్లేదు!
ఇప్పటివరకూ రక్తంలో కొలెస్ట్రాల్విలువలు తెలుసుకోడానికి రాత్రి భోజనం తర్వాత కనీసం 12 గంటలపాటు ఆగాక..ఉదయమే ఏదీ తినకుండా పరగడుపున ఈ పరీక్ష చేయించాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఆంక్షలేమీ ఉండవని కార్డియాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) పేర్కొంది. ‘లిపిడ్ ప్రొఫైల్’పరీక్ష ఇకపై పరగడుపున చేయించాల్సిన అవసరం లేదని సీఎస్ఐ తెలిపింది. రక్తంలో ఈ విలువలు నార్మల్‌గా లేకపోవడాన్ని ‘డిస్లిపిడేమియా’అని పేర్కొంటారు. ఇలా లేకపోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశముంటుంది. ఈ మేరకు సీఎస్ఐ తొలిసారిగా ‘డిస్లిపిడేమియా’కు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. నిజానికి ఇప్పటివరకూ మన దేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిర్దేశించిన మార్గదర్శకాలనే అనుసరిస్తున్నాయి. అయితే కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 22 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పడింది. ఇటీవలే అది డిస్లిపిడేమియా మార్గదర్శకాలనూ, మంచి, చెడు కొలె్రస్టాల్ల నార్మల్ తాలూకు కొత్త విలువలను వెల్లడించింది. ఈ సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆనరరీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ధూర్జటి ప్రసాద్ సిన్హా మాట్లాడుతూ ఇకపై పరగడుపున మాత్రమే లిపిడ్ ప్రొఫైల్ అక్కర్లేదనే సూచన తొలగిపోవడం అందరికీ మంచి సౌలభ్యం కలిగించే అంశమన్నారు. దీంతో అనేకమంది ఎప్పుడంటే అప్పుడు ఈ పరీక్ష చేయించుకునే సౌకర్యం కలిగిందని చెప్పారు. ఈ మార్గదర్శకాల ప్రకారం..» లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష వీలైనంత త్వరగా (18 ఏళు దాటేనాటికే) చేయించుకోవాలి. అయితే కుటుంబంలో గుండెజబ్బులు, రక్తంలో కొలె్రస్టాల్ మోతాదులు ఎక్కువగా ఉన్న కుటుంబాల్లోని వారు (అంటే ఫెమీలియల్ హైపర్ కొలెస్టెరాలేమియా హైరిస్క్ పేషెంట్స్) అంతకంటే ముందే ఈ పరీక్ష చేయించుకోవచ్చు. » ముప్పు ఎక్కువగా (హైరిస్్క) ఉన్నవారు మినహాయించి మిగతా అందరికీ చెడు కొలె్రస్టాల్ మోతాదుల (ఎల్డీఎల్–సీ) నార్మల్ విలువ 100 ఎంజీ/డీఎల్. » ముప్పు ఎక్కువగా ఉన్నవారు మినహాయించి మిగతా అందరికీ హెచ్‌డీఎల్ కాకుండా మిగతా అన్ని కొలెస్ట్రాల్ల మోతాదుల (నాన్–హెచ్‌డీఎల్–సీ) నార్మల్ విలువ 130 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉండాలి. » డయాబెటిస్ / హైబీపీ వల్ల ముప్పు ఎక్కువగా (హైరిస్్క) ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్–సీ) విలువ 70 ఎంజీ/డీఎస్ కంటే తక్కువగా ఉండాలి. » ఈ నార్మల్ విలువల కంటే ఎక్కువగా ఉండటంతో పాటు ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు ఎక్కువగా ఉన్నట్టయితే అది గుండెపోటు (హార్ట్ స్ట్రోక్) లేదా గుండెజబ్బులు (పెరిఫెరల్ హార్ట్ డిసీజ్)లకు దారితీయవచ్చని తెలుసుకోవాలి. ఈ ట్రైగ్లిజరైడ్స్ కొవ్వుల నార్మల్ విలువ 150 ఎంజీ/డీఎల్‌కు లోపున ఉండాలని గుర్తుంచుకోవాలి. » మరీ ఎక్కువ ముప్పు (వెరీ హై–రిస్్క) ఉన్న పేషెంట్స్... అంటే గుండెపోటు వచ్చి ఉన్నవారు, యాంజైనా అనే చాతీనొప్పి వచ్చినవారు, దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బు (సీకేడీ) ఉన్నవారిలో చెడు కొలె్రస్టాల్ (ఎల్డీఎల్) మోతాదులు 55 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగానూ మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) కాకుండా మిగతాది (నాన్–హెచ్‌డీఎల్) కొలెస్ట్రాల్ మోతాదులు 85 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.– సాక్షి హెల్త్‌డెస్క్ -
మరింత చేరువగా గ్రీన్ ఎనర్జీ
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీఈఆర్సీ కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. సౌర, పవన, జల విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీని వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు, ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు, విద్యుత్ చట్టంలో మార్పులు చేస్తూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్, చార్జీలు, బ్యాంకింగ్ నిబంధనలను ఏపీఈఆర్సీ ‘నియంత్రణ’ పేరుతో రూపొందించింది. గతేడాది డ్రాఫ్ట్ రూపంలో తీసుకువచ్చి, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న ఏపీఈఆర్సీ... వీటికి ఆమోదం తెలిపింది. దేశంలో 2070కి కర్భన ఉద్గారాలను నెట్‌జీరో స్థాయికి తీసుకురావాలని, ఇందుకోసం 2030కి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని నెలకొల్పాలన్న కేంద్రం లక్ష్యానికి కూడా ఈ నిబంధనలు దోహదపడతాయని ఏపీఈఆర్సీ పేర్కొంది. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఓపెన్ యాక్సెస్ చేయడానికి, ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్‌లు, డిస్కంలకు ఈ ‘నియంత్రణ’ వర్తిస్తుంది.ఇవీ నిబంధనలు... » గ్రీన్ ఎనర్జీ నూతన నిబంధనల ప్రకారం ఓపెన్ యాక్సెస్‌ను పొందడానికి దివాలా తీసిన, డిస్కంలకు రెండు నెలలు కంటే ఎక్కువకాలం బకాయిలు ఉన్న, అనధికారికంగా విద్యుత్ వినియోగం, విద్యుత్ దొంగతనం కేసు పెండింగ్‌లో ఉన్న సంస్థలకు అర్హత లేదు. » అర్హులైన వారికి స్వల్పకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్‌ను మంజూరు చేయడానికి (ఏపీఎస్‌ఎల్‌డీసీ) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. » దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ మంజూరు కోసం ఏపీ ట్రాన్స్‌కో నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్‌కు అన్ని దరఖాస్తులు నేరుగా రాష్ట్ర నోడల్ ఏజెన్సీలకు సింగిల్ విండో ద్వారా వెళతాయి.» సెంట్రల్ నోడల్ ఏజెన్సీ పోర్టల్‌లో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్‌కు సంబంధించిన మొత్తం çసమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అన్ని కొత్త గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలు(జనరేటర్ల)కు కనెక్టివిటీ మంజూరు చేస్తారు.» ప్రస్తుతం ఉన్న వినియోగదారులు, ఉత్తత్పి సంస్థలు, ఒప్పందాలు, ప్రభుత్వ విధానం ప్రకారం ఓపెన్ యాక్సెస్‌ను పొందడం కొనసాగించవచ్చు. వారికి సంబంధిత ఒప్పందాల్లో పేర్కొన్న విధంగానే చార్జీలు వర్తిస్తాయి.» గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ట్రాన్స్మిషన్ చార్జీలు, వీలింగ్, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీలు, స్టాండ్‌బై చార్జీలు, బ్యాంకింగ్, రియాక్టివ్ ఎనర్జీ చార్జీలను నిబంధనల మేరకు విధిస్తారు.» 2032 డిసెంబర్ లోగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి, ఓపెన్ యాక్సెస్‌లో వినియోగదారులకు సరఫరా చేసే ఆఫ్‌షోర్ విండ్ ప్రాజెక్ట్‌ల నుంచి జరిగే విద్యుత్ ఉత్పత్తికి అదనపు సర్‌చార్జ్ వర్తించదు. దీర్ఘకాలిక, మధ్యస్థ కాలవ్యవధిలో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ.లక్ష కాగా, స్వల్పకాలానికి రూ.25 వేలు కడితే సరిపోతుంది. బ్యాంకింగ్ నెలవారీ బిల్లింగ్ సైకిల్ ఆధారంగా ఉండాలి. -
పెన్షన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు
-
Delhi: 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవద్దు
న్యూఢిల్లీ: పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కట్టడి చేసేందుకు, వాటిని చట్టపరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు ప్రకటించింది. 16 ఏళ్లలోపు విద్యార్థులను కోచింగ్ సెంటర్లలో చేర్చుకోవద్దని, ర్యాంకులు, మంచి మార్కులు గ్యారెంటీ అంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలివ్వరాదని గురువారం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కోచింగ్ కేంద్రాల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, అగ్ని ప్రమాదాలు, అసౌకర్యాలు, విద్యాబోధన విధానాలకు సంబంధించిన పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్న నేపథ్యంలో వీటిని ప్రకటించింది. ‘గ్రాడ్యుయేషన్ కంటే తక్కువ అర్హత కలిగిన వారిని ట్యూటర్లుగా పెట్టుకోరాదు. విద్యార్థులను ఆకర్షించేందుకు మంచి మార్కులు, ర్యాంకు గ్యారెంటీ అంటూ వారి తల్లిదండ్రులకు తప్పుడు హామీలు ఇవ్వకూడదు. 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోరాదు. సెకండరీ స్కూలు పరీక్ష రాసిన వారిని మాత్రమే తీసుకోవాలి’అని తెలిపింది. కోచింగ్ నాణ్యత, వారికి కల్పించే సౌకర్యాలు, సాధించిన ఫలితాల గురించి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తప్పుదోవ పట్టించే ఎలాంటి ప్రకటనలను కోచింగ్ సంస్థలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. మానసిక ఒత్తిడికి గురయ్యే వారికి తక్షణమే అవసరమైన సాయం అందించే యంత్రాంగం ఉండాలి. సైకాలజిస్టులు, కౌన్సిలర్ల పేర్లను విద్యార్థులు, తల్లిదండ్రులకు అందజేయాలని కేంద్ర విద్యాశాఖ ఆ మార్గదర్శకాల్లో వివరించింది. -
కోచింగ్ సెంటర్లకు కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: విద్యార్థుల ఆత్మహత్యలు, సౌకర్యాల లేమి, టీచర్ల కొరత, అధిక ఫీజులు వంటి సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. 16 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న విద్యార్ధులను కోచింగ్ సెంటర్లో చేర్చుకోరాదని వెల్లడించింది. సెకండరీ పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తరువాత మాత్రమే విద్యార్ధులను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది. చదవండి: Gujarat: పడవ బోల్తా.. 13 మంది విద్యార్థులు మృతి ►శిక్షణ కేంద్రాల్లో విద్యార్హత కలిగిన సిబ్బందిని నియమించుకోవాలి. వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ కంటే తక్కువ అభ్యసించిన వారిని సిబ్బందిగా నియమించుకోరాదు. ►విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా.. ర్యాంకులు, మార్కుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు. సిబ్బంది అర్హత, కోచింగ్ సెంటర్ వివరాలు, శిక్షణ అందించే కోర్సులు, వసతి సౌకర్యాలు, ఫీజు రిఫండ్ గురించిన సమాచారం వెబ్సైట్లో పొందుపరచాలి. ►కోచింగ్ సెంటర్లో ఇచ్చే శిక్షణకు సంబంధించి, అక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు సాధించిన ఫలితాల గురించి మోసపూరిత ప్రకటనలు చేయకూడదు. ► కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు సరిపోయే స్థలం కేటాయించి కనీస సౌకర్యాలు(విద్యుత్, వెంటిలేషన్, లైటింగ్, స్వచ్ఛమైన తాగునీరు,భద్రతా చర్యలు’ ఏర్పాటు చేయాలి. ► అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం నివారించేందుకు భద్రతా ప్రమాణాలు పాటించాలి. ► శిక్షణ ఇచ్చే వ్యక్తి లేదా సంస్థ కోచింగ్ ప్రారంభించిన మూడు నెలల వ్యవధిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ► ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్వహిస్తుంటే.. గుర్తింపు రద్దవుతుంది. ► ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆయా బ్రాంచ్‌లను రిజిస్ట్రేషన్ చేయాలి. ► కోచింగ్ తీసుకునే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌తో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ►న్యాయమైన, సహేతుకమైన ఛార్జీలు, రుసుము రసీదులు, వాపసు విధానాలు వివరంగా ఉండాలి. -
డాక్టర్లుగా నటించే సెలబ్రిటీలకు కొత్త రూల్! మార్గదర్శకాలు విడుదల
వైద్య ఆరోగ్య సంబంధమైన ఉత్పత్తుల ప్రకటనల్లో హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు, డాక్టర్లుగా నటించే సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయన్సర్లు, వర్చువల్ ఇన్ఫ్లుయన్సర్లు వీక్షకులను తప్పుదారి పట్టించకుండా డిస్ల్కైమర్లు వేయడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ప్రకటనల్లో అసలైన వైద్య నిపుణులు, హెల్త్, ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్‌లు నటించినా కూడా వైద్య, ఆరోగ్య సంబంధ సమాచారాన్ని తెలియజేసేటప్పుడు, ఆయా ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేస్తున్నప్పుడు తాము ధ్రువీకరణ పొందిన హెల్త్/ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్‌లు లేదా వైద్య నిపుణులమనే విషయాన్ని బహిర్గతం చేయాలని సూచించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్ శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) సహా వాటాదారులతో చర్చించిన అనంతరం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయన్సర్లు, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు.. ఆరోగ్య నిపుణులుగా లేదా వైద్య నిపుణులుగా నటిస్తూ వైద్య, ఆరోగ్య సమాచారాన్ని తెలియజేస్తున్నప్పుడు, వైద్య ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేసేటప్పుడు తాము చెప్పే విషయాలు వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టమైన డిస్ల్కైమర్లు వేయడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటికి మినహాయింపు అయితే వ్యక్తుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నిర్దిష్ట ఉత్పత్తులు, సేవలతో సంబంధం లేని సాధారణ వెల్నెస్, ఆరోగ్య సలహాలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే నీరు ఎక్కువగా తాగండి.. వ్యాయామం చేయండి.. బాగా నిద్రపోండి.. వంటి సాధారణ సలహాలు ఇవ్వవచ్చు. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ మార్గదర్శకాల అమలును చురుకుగా పర్యవేక్షిస్తుంది. ఉల్లంఘనలకు పాల్పడితే వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం జరిమానాలు విధించవచ్చు. -
కృత్రిమ తీపితో క్యాన్సర్!
వాషింగ్టన్: కూల్ డ్రింకులు తదితర బేవరేజెస్‌ల్లో నాన్ షుగర్ స్వీటెనర్(ఎన్ఎస్ఎస్)ల వాడకంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటిని వాడటం మానేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మే నెలలో కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రపంచంలో అత్యంత సాధారణంగా వాడే కృత్రిమ స్వీటెనర్లలో ఒకటైన ఆస్పర్టెమ్తో క్యాన్సర్ ప్రమాదం ఉన్నదంటూ తాజాగా పరిశోధనలో తేలడంతో దీని వినియోగంపై అమెరికాలో సమీక్ష మళ్లీ మొదలైందని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. అత్యంత విరివిగా వాడే కృత్రిమ షుగర్ పదార్థం ఒకటి క్యాన్సర్‌కు కారకంగా మారే అవకాశం ఉందని వచ్చే నెలలో డబ్ల్యూహెచ్‌వో క్యాన్సర్ రీసెర్చ్ ఏజెన్సీ ప్రకటించనుందంటూ రాయిటర్స్ తెలిపింది. ఆస్పర్టెమ్‌ను వాడొచ్చంటూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్‌డీఏ) 1981లోనే అనుమతులిచి్చంది. అయిదేళ్లకోసారి ఈ అనుమతిని సమీక్షిస్తూ వస్తోంది. భారత్ సహా 90కి పైగా దేశాల్లో అస్పర్టెమ్ వినియోగంలో ఉంది. ఆస్పర్టెమ్‌లో ఎలాంటి కేలరీలు ఉండవు. చక్కెర కంటే సుమారు 200 రెట్లు తీపిని ఇది కలిగిస్తుంది. ఆస్పర్టెమ్‌ను వినియోగించేందుకు 2009లో భారత ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్ సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) అనుమతినిచి్చంది. ఆస్పర్టెమ్‌ను 95% కార్పొనేటెడ్ సాఫ్ట్ డ్రింకుల్లో స్వీటెనర్‌గా వాడుతున్నారు. బేవరేజెస్ మార్కెట్ షేర్లో అతిపెద్దదైన రెడీ టూ డ్రింక్ టీల్లో 90% వరకు వినియోగిస్తున్నారు. మిగతా స్వీటెనర్లతో పోలిస్తే ఆస్పర్టెమ్, అసెసల్ఫేమ్–కె అనే వాటి వాడకంతో క్యాన్సర్ ప్రమాదం కాస్త ఎక్కువేనంటూ గతేడాది ఫ్రాన్సులో చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది. -
చైనా మొబైల్ కంపెనీలకు షాక్
న్యూఢిల్లీ: దేశంలో కార్యకలాపాలు నిర్వహించే చైనా మొబైల్ తయారీ కంపెనీలకు కేంద్ర సర్కారు స్పష్టమైన మార్గదర్శనం చేసింది. భారత్‌లో విక్రయాలకు, భారత్ నుంచి ఎగుమతుల కోసం మొబైల్ ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ ఉపకరణాలను ఇక్కడే తయారు చేయాలని, భారతీయ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించాలని కోరినట్టు తెలిసింది. భారత్‌లో కార్యకలాపాలకు స్థానిక భాగస్వాములను చేర్చుకోవాలని కోరింది. కేంద్రం నిర్వ హించిన సమావేశానికి హాజరైన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లు ఈ వివరాలను మీడియాతో పంచుకోవడం వల్ల బయటకు తెలిసింది. అంతేకాదు సదరు జా యింట్ వెంచర్ కంపెనీల్లో కీలక స్థానాల్లో భారతీయులనే నియమించుకోవాలని కూడా కోరింది. సీఈవో, సీవోవో, సీఎఫ్‌వో, సీటీవో తదితర స్థానాలకు భారతీయులను తీసుకోవాలని ఆదేశించింది. భారత కాంట్రాక్టు తయారీ సంస్థలను నియమించుకోవాలని, స్థానికంగానే విడిభాగాల తయారీని కూడా చేపట్టాలని కూడా కోరింది. ప్రస్తుతం చైనీ సంస్థలు ఇక్కడ అసెంబ్లింగ్ వరకే చేస్తుండడం గమనార్హం. విడిభాగాల తయారీని కూడా భారత భాగస్వామ్య సంస్థలతో కలసి చేపట్టి, ఇక్కడి నుంచి మరిన్ని ఎగుమతులు చేయాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పంపిణీదారులు కూడా స్థానికులే ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు చైనా డి్రస్టిబ్యూటర్లను కలిగి ఉన్నాయి. భారత చట్టాలను విధిగా అనుసరించాలని, పన్ను ఎగవేతలకు పాల్పడరాదని తేల్చి చెప్పింది. చైనాకు చెందిన షావోమీ, ఒప్పో, రియల్మీ, వివోతోపాటు, ఇండియా సెల్యులర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ)కు ఇటీవలి సమావేశంలో కేంద్రం ఈ మేరకు సూచనలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సమావేశాన్ని నిర్వ హించింది. ఇది నిజమేనన్నట్టు.. దేశీ కాంట్రాక్టు తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్‌తో షావోమీ ఒ ప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. భారత్‌లో మొబైల్ ఫోన్లను తయారు చేసి ఇవి ఎగుమతి చేయనున్నాయి. మరికొన్ని సంస్థలతోనూ ఇదే విధమైన భాగస్వామ్యంపై డిక్సన్ చర్చలు నిర్వహిస్తుండడం గమనార్హం. -
పాదరక్షలకు నాణ్యతా ప్రమాణాలు
న్యూఢిల్లీ: పాదరక్షలకు నూతన నాణ్యతా ప్రమాణాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 24 పాదరక్షల ఉత్పత్తులకు సంబంధించి నిర్ధేశిత ప్రమాణాలను పెద్ద, మధ్యస్థాయి కంపెనీలు, దిగుమతిదారులు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. చైనా తదితర దేశాల నుంచి చౌకగా దేశంలోకి దిగుమతి అవుతున్న నాసిరకం పాదరక్షల ఉత్పత్తులకు కళ్లెం వేసేందుకు కేంద్ర సర్కారు నూతన నిబంధనలను తీసుకొచి్చంది. ఇక చిన్న స్థాయి ఫుట్‌వేర్ తయారీ సంస్థలకు కొంత సమయాన్ని ఇచి్చంది. ఇవి నూతన నాణ్యత ప్రమాణాలను 2024 జనవరి 1 నుంచి అనుసరించాల్సి ఉంటుంది. సూక్ష్మ సంస్థలు 2024 జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉంటుందని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. గడువును మరింత పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. నూతన నాణ్యత నియంత్రణ ప్రమాణాలు దేశీయంగా నాణ్యమైన పాదరక్షల తయారీకి వీలు కలి్పంచడంతోపాటు, నాణ్యత లేమి ఉత్పత్తుల దిగుమతులకు చెక్ పెడతాయని చెప్పారు. నిజానికి ఈ నూతన నాణ్యతా ప్రమాణాలను కేంద్ర సర్కారు 2020 అక్టోబర్‌లోనే నోటిఫై చేయడం గమనార్హం. కరోనా కారణంగా ఏర్పడిన అవరోధాల నేపథ్యంలో మూడు పర్యాయాలుగా గడువు పొడిగిస్తూ వచ్చారు. జాబితాలో ఉన్నవి.. తోలు, పీవీసీ, రబ్బర్‌లో ఎలాంటి మెటీరియల్ వినియోగించాలి? సోల్స్, హీల్స్ కోసం ఏవి వినియోగించాలనేది ప్రమాణాల్లో పేర్కొన్నారు. రబ్బర్ గమ్ బూట్స్, పీవీసీ శాండల్స్, రబ్బర్ హవాయి చెప్పల్స్, స్లిప్పర్స్, మౌల్డెడ్ ప్లాస్టిక్ ఫుట్‌వేర్, స్కావెంజింగ్ పనుల కోసం వినియోగించే పాదరక్షలు, క్రీడా పాదరక్షలు, డెర్బీ బూట్లు, అల్లర్ల నిరోధక బూట్లు, మౌల్డెడ్ సాలిడ్ రబ్బర్ సోల్స్, హీల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 54 పాదరక్షల ఉత్పత్తుల్లో నాణ్యత ప్రమాణాల పరిధిలోకి 27 ఉత్పత్తులు, మెటీరియల్‌ను తీసుకొచ్చారు. -
బ్యాంకింగ్ మోసాలపై త్వరలో కొత్త మార్గదర్శకాలు
ముంబై: ఖాతాాలను మోసపూరితమైనవిగా వర్గీకరించడానికి సంబంధించి సవరించిన కొత్త మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ త్వరలో ప్రకటించనుంది. ఫ్రాడ్ వర్గీకరణ మార్గదర్శకాల అంశంపై పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ముకేశ్ జైన్ ఈ విషయాలు తెలిపారు. ఎగవేతదారును ఫ్రాడ్‌గా ముద్ర వేసే ముందు వారు తమ వాదనలను వినిపించేందుకు అవకాశం కల్పించేలా బ్యాంకులు సహజ న్యాయ సూత్రాలను పాటించాలంటూ బ్యాంకులకు సుప్రీం కోర్టు ఇటీవల ఓ కేసులో స్పష్టం చేసిన నేపథ్యంలో జైన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
కోపరేటివ్ బ్యాంకులకు ఏకరూప ప్రొవిజన్ నిబంధనలు
ముంబై: పట్టణ కోపరేటివ్ బ్యాంకులకు సంబంధించి స్టాండర్డ్ రుణ ఆస్తుల విషయంలో ప్రొవిజన్ నిబంధనలను ఏకరీతిలో మార్పు చేస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్లో పట్టణ కోపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ టైర్ 1, 2, 3, 4 అని నాలుగు కేటగిరీలుగా చేసింది. అంతకుముందు వరకు అవి కేటగిరీ 1, 2గానే ఉండేవి. ఇప్పుడు వాటి కేటగిరీతో సంబంధం లేకుండా ప్రామాణిక రుణ ఆస్తులకు కేటాయింపుల విషయంలో అన్నింటికీ ఒకే విధమైన నిబంధనలను ప్రకటించింది. అగ్రికల్చర్, ఎస్ఎంఈ రంగాలు స్టాండర్డ్ కిందకు వస్తాయి. ఈ రుణ ఆస్తులు అన్నింటికీ 0.25 శాతం కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. అలాగే, వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగ రుణాలకు సంబంధించి 1 శాతం కేటాయింపులు చేయాలి. కమర్షియల్ రియల్ ఎస్టేట్ – రెసిడెన్షియల్ హౌసింగ్ సెక్టార్ రుణాలకు 0.75 శాతం కేటాయింపులు చేయాలి. ఇతర అన్ని రకాల రుణాలకు 0.4 శాతం కేటాయింపుల నిబంధన వర్తిస్తుంది. -
గ్రీన్ డిపాజిట్లకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) ‘గ్రీన్ డిపాజిట్ల’ను పొందేందుకు ఉద్దేశించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ డిపాజిట్ నిధులను పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ ట్రాన్స్పోర్ట్, గ్రీన్ బిల్డింగ్‌ల వంటి ఫైనాన్సింగ్ కార్యకలాపాలకు ఉపయోగించడానికి వీలు కలుగుతుంది. వాతావరణ మార్పును ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్లిష్టమైన సవాళ్లలో ఒకటిగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఉద్గారాలను తగ్గించడంతోపాటు వాతావారణంలో సుస్థిరతను ప్రోత్సహించేందుకు వివిధ ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజా ఫ్రేమ్‌వర్క్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. -
కమీషన్లపై బీమా కంపెనీలకు స్వేచ్ఛ
న్యూఢిల్లీ: కమీషన్ల పరంగా పరిమితులను బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. బీమా కంపెనీలు తమ పాలసీలను విక్రయించే మధ్యవర్తులకు కమీషన్లు చెల్లిస్తుంటాయి. ఈ భారం పరోక్షంగా పాలసీదారులపైనే పడుతుంది. అందుకే లోగడ ఈ విషయంలో ఐఆర్డీఏఐ పరిమితులు పెట్టింది. తాజాగా వీటిని ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. మధ్యవర్తులకు ఎంత కమీషన్ చెల్లించాలన్నది బీమా కంపెనీలే నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. కాకపోతే పాలసీదారుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఇది ఉండాలని స్పష్టం చేసింది. పాలసీదారులు, ఏజెంట్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కమీషన్ పాలసీని ఇన్సూరెన్స్ కంపెనీ బోర్డ్ రూపొందించుకోవాలంటూ తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. కమీషన్లలో సౌలభ్యం ఉంటే అది దేశంలో బీమా కవరేజీ వ్యాప్తికి దోహదపడుతుందని, వ్యయాల పరంగా సామర్థ్యాలను పెంచుతుందని పేర్కొంది. బోర్డు స్థాయిలో నిర్ణయించే కమీషన్ అనేది తాజా నోటిఫికేషన్లో పేర్కొన్న నిర్వహణ వ్యయ పరిమితుల పరిధిలోనే ఉండాలని స్పష్టంగా నిర్ధేశించింది. నూతన నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నోటిఫికేషన్ తేదీ నుంచి ప్రతి మూడేళ్లకోసారి నిబంధనలను సమీక్షిస్తామని ఐఆర్డీఏఐ ప్రకటించింది. ఇప్పటి వరకు బీమా కంపెనీలు చెల్లించే కమీషన్లను ఉత్పత్తుల వారీగా ఐఆర్డీఏఐ నిర్ణయిస్తోంది. తాజా సవరణలు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయనే అభిప్రాయాన్ని ఐఆర్డీఏఐ వ్యక్తం చేసింది. నూతన వ్యాపార నమూనాలు, ఉత్పత్తులు, వ్యూహాల అభివృద్ధికి వీలు కల్పిస్తాయని పేర్కొంది. సవరించిన నిర్వహణ వ్యయ పరిమితులు, కమీషన్ పరిమితులు అనేవి సరైన మార్గంలో ఉన్నాయని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ తపన్ సింఘాల్ తెలిపారు. -
ఎఫ్‌పీఐలకు కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: సమాచార వెల్లడి అంశంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీలు) నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సవరించింది. ఎఫ్‌పీఐల నిర్మాణం(స్ట్రక్చర్), యాజమాన్యం(కామన్ ఓనర్షిప్) తదితర అంశాలలో ప్రస్తావించదగ్గ మార్పులు ఉంటే 7 పని దినాలలోగా తెలియజేయవలసి ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా రిజిస్టర్కాదలచిన ఎఫ్‌పీఐల విషయంలో అవసరాన్నిబట్టి అదనపు డాక్యుమెంట్లను దాఖలు చేయవలసిందిగా సెబీ ఆదేశించనుంది. తాజా మార్గదర్శకాలతో సెబీ నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో ఈ నెల 14 నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తద్వారా నిబంధనలను మరింత పటిష్ట పరచింది. వెరసి స్ట్రక్చర్, యాజమాన్య నియంత్రణ తదితర అంశాలలో అక్రమ లేదా తప్పుదారి పట్టించే మార్పులు చోటుచేసుకుంటే సెబీతోపాటు, తత్సంబంధిత డిపాజిటరీకు ఏడు పనిదినాలలోగా వివరాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఇదేవిధంగా విదేశీ నియంత్రణ సంస్థలు ఏవైనా చర్యలు తీసుకుంటున్నా నిర్ణత గడువులోగా వెల్లడించవలసి ఉంటుంది. జరిమానాలు, దర్యాప్తులు, పెండింగ్ కార్యాచరణ తదితర అంశాలుంటే వారం రోజుల్లోగా తెలియజేయాలి. ఎఫ్‌పీఐ లేదా ఇన్వెస్టర్ గ్రూప్ యాజమాన్య నియంత్రణ, స్ట్రక్చర్ అంశాలలో ప్రత్యక్ష లేదా పరోక్ష మార్పులు చోటు చేసుకుంటే తాజా నిబంధనలు వర్తిస్తాయి. ఇదేవిధంగా డిపాజిటరీ పార్టిసిపెంట్లు ఈ సమాచారాన్ని సెబీకి రెండు రోజుల్లోగా వెల్లడించవలసి ఉంటుంది. -
గోవాలో మద్యం సేవించడం, సెల్ఫీలపై కొత్త రూల్స్.. ఇవి తెలుసుకోండి
గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?. గోవా వెళ్లి బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ మందు తాగాలని అనుకుంటున్నారా?.. అయితే తాజాగా గోవా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మార్గదర్శకాలను ఒక్కసారి తెలుసుకోండి. లేకపోతే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఇంతకీ ఆ గైడ్‌లైన్స్ ఏంటంటే.. గోవాకు వచ్చే పర్యాటకుల ప్రైవసీ, భద్రతను దృష్టిలో పెట్టుకుని అక్కడి బీజేపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. జనవరి 26 వ తేదీన గోవా పర్యాటక శాఖ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఇందులో భాగంగా గోవాకు వచ్చే పర్యాటకులు మోసపోకుండా, అసంతృప్తికి గురికాకుండా ఉండేందుకు కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. బీచ్‌లో బహిరంగంగా మద్యం సేవించేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొంది. చట్టబద్ధంగా లైసెన్స్ పొందిన ప్రాంతాల్లో బాధ్యతాయుతంగా మద్యం సేవించవచ్చు. అలాగే, ఎవరైనా టూరిస్టులు గోవాలో సన్ బాత్ లేదా బీచ్‌లో సరదాగా గడుపుతున్న సమయంలో వారికి ఫొటోలు సీక్రెట్‌గా తీయకూడదు. వారి ఫొటోలు తీయడానికి ముందస్తుగా వారి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో వంట చేయడంపై కూడా నిషేధించారు. ఇలా చేస్తే.. వారికి రూ.50 వేల వరకు జరిమానా విధించనున్నట్టు స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు పర్యాటక శాఖలో నమోదు చేసుకున్న హోటళ్లలోనే బస చేయాలని కూడా మార్గదర్శకాల్లో సూచించింది. దీంతో, పర్యాటకుల భద్రతతోపాటు వారికి భద్రతకు భంగం కలుగకుండా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే, ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. అంతే కాకుండా గోవాలోని చారిత్రక కట్టడాలను పాడుచేయవద్దని పర్యాటకులకు గోవా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది. గోవాకు వచ్చే పర్యాటకులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మార్గదర్శకాల్లో క్లియర్‌గా చెప్పారు. -
ఇన్ఫ్లుయెన్సర్లకు కేంద్రం కొత్త నిబంధనలు, రూ.50 లక్షల ఫైన్..3 ఏళ్ల నిషేధం!
తప్పుదారి పట్టించే ప్రకటనలపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కొత్త మార్గ దర్శకాలు విడుదల చేసింది. వాటికి అనుగుణంగా ఇన్ఫ్లుయెన్సర్లు వ్యవహరించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని స్పష్టం చేసింది. దేశీయంగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ 2025 నాటికి 20 శాతం వృద్ధి సాధించి రూ.2,800కోట్లకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర విభాగానికి చెందిన సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటక్షన్ అథారిటీ (సీసీపీఏ) మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్పై దృష్టిసారించింది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కొత్త నిబంధనలు విధించింది. 'ఎండార్స్మెంట్ నో హౌస్' సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, వర్చువల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల(అవతార్ లేదా కంప్యూటర్ జనరేటెడ్ క్యారెక్టర్) కోసం 'ఎండార్స్మెంట్ నో హౌస్' పేరుతో కొత్త మార్గదర్శకాలను వినియోగదారుల వ్యవహారాల శాఖ జారీ చేసింది. నిబంధనలు పాటించాల్సిందే, లేదంటే సీసీపీఏ చీఫ్ కమీషనర్ నిధి ఖరే మార్గదర్శకాలను వివరించారు. ఆ నిబంధనల మేరకు... ఇన్ఫ్లుయెన్సర్లు పొందే గిఫ్ట్, హోటల్ అకామిడేషన్,ఈక్విటీ (మనీ), డిస్కౌంట్స్, అవార్డ్లు, ఎండార్సింగ్ ప్రొడక్ట్స్, సర్వీస్ - స్కీమ్ వంటి అంశాల్లో తాము విధించిన నిబంధనలకు లోబడి వ్యవహరించాలని, ఉల్లంఘించిన పక్షంలో, వినియోగదారుల రక్షణ చట్టం - 2019 ప్రకారం తప్పుదారి పట్టించే ప్రకటనలకు సూచించిన జరిమానా వర్తిస్తుంది. అంతేకాదు బ్యాన్ చేయడం, ఎండార్స్‌మెంట్స్‌ను తిరిగి వెనక్కి తీసుకుంటామని కూడా తెలిపింది. రూ.50లక్షల జరిమానా, మూడేళ్ల పాటు నిషేధం సీసీపీఏ తయారీదారులు, ప్రకటనదారులు, ఎండార్సర్లపై రూ.10 లక్షల జరిమానా, అంతకంటే ఎక్కువ ఉల్లంఘనలు ఉంటే రూ. 50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. తప్పుదారి పట్టించే ప్రకటనల్ని ప్రసారం చేసినందుకు గాను ఇన్ ఫ్లూయన్సర్ ఏడాది పాటు నిషేధం, లేదంటే తీవ్రతను బట్టి ఆ నిషేధాన్ని 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. వినియోగదారుల రక్షణే ధ్యేయంగా మార్గదర్శకాలను విడుదల చేసిన వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. అనైతిక వ్యాపార కార్యకలాపాలు చేసేందుకు ప్రసారం చేసే తప్పుడు ప్రకటనల నుండి వినియోగదారుల రక్షించేందుకు సీసీపీఏ పరిధిలో మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. లక్షమందికి పైగా ఇన్ఫ్లుయెన్సర్లు 2022లో ఇండియన్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ పరిమాణం రూ. 1,275 కోట్లు ఉండగా.. ఆ పరిమాణం 2025 నాటికి 19-20 చొప్పున వార్షిక వృద్ధి రేటుతో రూ. 2,800 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే మంచి సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నవారు దేశంలో లక్షకు పైగా ఉన్నారు అని రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు. ఎలా బహిర్ఘతం చేయాలి! పైన పేర్కొన్నట్లు ఇన్ఫ్లుయెన్సర్లు లబ్ధి పొందితే సంబంధిత వివరాలను పోస్ట్‌లలో, వీడియోలలో స్పష్టం చెప్పాలి. ఏదైనా కంపెనీ నుంచి ఓ స్పాన్సర్ కంటెంట్ ప్రమోట్ చేస్తుంటే.. సంబంధిత కంపెనీ పోర్టల్ లింక్స్, హ్యాష్ ట్యాగ్స్ జత చేయడం కాకుండా.. కంపెనీ వివరాలు ఫోటోల్లో, వీడియోలో యాడ్ చేయాలి. వీడియోలో, డిస్క్లోజర్లు కేవలం వివరణలో మాత్రమే కాకుండా ఆడియో, వీడియో ఫార్మాట్లో వీడియోలో తెలిపాలి. లైవ్ స్ట్రీమ్ అయితే మొత్తం స్ట్రీమింగ్ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ప్లే చేయాలని సూచించారు. టీవీ, ప్రింట్, రేడియో వంటి సంప్రదాయ మీడియా సంస్థ నిబంధనలు పాటిస్తున్నాయని, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు విభిన్నంగా వ్యవహరిస్తున్నాయని రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు. -
హరిత హైడ్రోజన్‌కు త్వరలో మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా హరిత హైడ్రోజన్ తయారీకి భారత్‌ను ప్రధాన హబ్‌గా తీర్చిదిద్దే విధంగా త్వరలోనే ప్రమాణాలు, మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. దేశీయంగా ఎలక్ట్రోలైజర్ల తయారీ కోసం 15 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించి ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంపై (పీఎల్ఐ) కసరత్తు చేసినట్లు ఆయన చెప్పారు. 2030 నాటికి దీన్ని 60 గిగావాట్ల స్థాయికి పెంచుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే క్రమంలో ఎలక్ట్రోలైజర్లను తక్కువ సుంకాలతో ఎప్పటివరకూ దిగుమతి చేసుకోవచ్చనేది కేంద్రం నిర్దిష్ట గడువు నిర్దేశిస్తుందని, ఆ తర్వాత నుంచి భారీ సుంకాలు అమల్లోకి వస్తాయ ని చెప్పారు. అలాగే హరిత హైడ్రోజన్ తయారీలో దేశీ పరిశ్రమ తగు రీతిలో పోటీపడే స్థాయికి ఎదిగే వరకూ తొలుత కొన్నేళ్ల పాటు పీఎల్ఐ స్కీము అందుబాటులో ఉంటుందని సింగ్ వివరించారు. దాదాపు రూ. 19,744 కోట్ల జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్‌ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఆయన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మిషన్ కింద వచ్చే అయిదేళ్లలో 5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. -
కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. వాళ్లకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ఉదయం కోవిడ్‌పై సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేశారు. అయితే చైనా, దక్షిణకొరియా, జపాన్, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్యాసెంజర్లకే ఇది వర్తిస్తుంది. పరీక్షల్లో వీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తారు. ఆక్సిజన్‌పై ఆరా.. అలాగే దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యతపైనా కేంద్రం ఆరా తీసింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల విషయంపై ప్రతివారం సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది. హాస్పిటల్స్‌లో లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని సూచించింది. ఆక్సిజన్ కంట్రోల్ రూమ్స్ మళ్లీ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సరిగా పనిచేస్తున్నాయా లేదో మాక్ డ్రిల్ నిర్వహించాలంది. ఆక్సిజన్ డిమాండ్ సరఫరా వినియోగంపై ప్రత్యేక యాప్ నిర్వహించాలని లేఖలో పేర్కొంది. చదవండి: హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు.. -
బెట్టింగ్ సైట్ల ప్రకటనలొద్దు టీవీ చానళ్లకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: బెట్టింగ్ సైట్లకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల ప్రసారంపై కేంద్రం సోమవారం మార్గదర్శకాలను విడుదలచేసింది. ‘ఆన్లైన్ బెట్టింగ్ సైట్లను వాటికి సంబంధించిన వార్త వెబ్సైట్లను, వాటి ఉత్పత్తులు/సేవల సంబంధ అంశాలను చూపే వాణిజ్య ప్రకటనల ప్రసారం మానుకోండి’ అని న్యూస్ వెబ్సైట్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ప్రైవేట్ శాటిలైట్ చానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం సూచించింది. ఈ మార్గదర్శకాలు, చట్టాన్ని అతిక్రమిస్తే తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయని ప్రైవేట్ శాటిలైట్ చానళ్లను కేంద్రం హెచ్చరించింది. వార్తలను ప్రచురించే పబ్లిషర్లకు, డిజిటల్ మీడియాకూ ఇదే తరహా సూచనలిస్తూ విడిగా మార్గదర్శకాలను పంపింది. ‘సొంత న్యూస్ వెబ్సైట్ల మాటున కొన్ని బెట్టింగ్ సంస్థలు తమను తాము అడ్వర్టైజ్ చేసుకుంటున్నాయి. బెట్టింగ్ సంస్థల లోగోలే ఆ న్యూస్ వెబ్సైట్లకూ ఉంటున్నాయి. ఈ వెబ్సైట్లు ఏవీ భారత చట్టాలకు లోబడి అధీకృత యంత్రాంగం వద్ద రిజిస్టర్ కాలేదు. తప్పుడు వాణిజ్య ప్రకటనలు, వార్తలు ప్రసారం చేస్తూ బెట్టింగ్, గ్యాబ్లింగ్‌కు పాల్పడుతున్నాయి. వీటిలో కొన్ని ప్రొఫెషనల్ స్పోర్ట్స్ బ్లాగ్లు, క్రీడా వార్తల వెబ్సైట్లుగా చెలామణి అవుతున్న విషయంపై వినియోగదారుల వ్యవహారాల విభాగాన్ని అప్రమత్తం చేశాం’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. -
సోషల్ స్టాక్ ఎక్స్చేంజీలకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సోషల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎస్ఎస్ఈ)కి సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం విడుదల చేసింది. ఈ ఎక్సే్చంజీలో నమోదు చేసుకునేందుకు ఉండాల్సిన అర్హతా ప్రమాణాలు, వెల్లడించాల్సిన వివరాలు మొదలైన అంశాలను ఇందులో పొందుపర్చింది. లాభాపేక్ష లేని సంస్థలు (ఎన్పీవో) నిధులు సమీకరించుకునేందుకు అదనపు మార్గాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది జులైలో సెబీ కొన్ని నిబంధనలు ప్రతిపాదించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం సమీకరించిన నిధుల వినియోగం గురించిన వివరాలను త్రైమాసికం ముగిసిన నాటి నుంచి 45 రోజుల్లోగా ఎస్‌ఎస్‌ఈకి ఎన్పీవో తెలియజేయాలి. అలాగే ఆర్థిక సంవత్సరం ముగిసిన 90 రోజుల్లోగా సదరు నిధుల వినియోగంతో సాధించిన సామాజిక ప్రయోజనాల వివరాలను (ఏఐఆర్)ను కూడా సమర్పించాలి. మరిన్ని వివరాలు .. ► చారిటబుల్ ట్రస్టుగా ఎన్పీవో నమోదై ఉండాలి. కనీసం మూడేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తుండాలి. క్రితం ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 10 లక్షల నిధులు సమీకరించుకుని, రూ. 50 లక్షల మేర వ్యయాలు చేసినదై ఉండాలి. ► అత్యధికంగా విరాళాలిచ్చిన టాప్ 5 దాతలు, ఇన్వెస్టర్ల వివరాలు వెల్లడించాలి. బడ్జెట్, కార్యకలాపాల స్థాయి, ఉద్యోగులు.. వాలంటీర్ల సంఖ్య, ప్రోగ్రామ్‌వారీగా నిధుల వినియోగం మొదలైనవి తెలియజేయాలి. ► నియంత్రణ సంస్థ నిర్దేశించిన 16 అంశాల్లో ఏదో ఒక దానిలో ఎన్పీవో కార్యకలాపాలు సాగిస్తున్నదై ఉండాలి. పేదరికం, అసమానతలు, పౌష్టికాహార లోపం మొదలైన వాటి నిర్మూలన, విద్య.. ఉపాధి కల్పనకు తోడ్పాటునివ్వడం మొదలైన అంశాలు వీటిలో ఉన్నాయి. ► అఫోర్డబుల్ హౌసింగ్ సంస్థలు తప్ప కార్పొరేట్ ఫౌండేషన్లు, రాజకీయ లేదా మతపర కార్యకలాపాలు సాగించే సంస్థలు, ట్రేడ్ అసోసియేషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే హౌసింగ్ కంపెనీలను సోషల్ ఎంటర్‌ప్రైజ్‌గా గుర్తించరు. స్టాక్ బ్రోకర్ల కట్టడికి నిబంధనలు.. క్లయింట్ల సెక్యూరిటీలు, నిధులను స్టాక్ బ్రోకర్లు దుర్వినియోగం చేయకుండా నివారించేందుకు సెబీ కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం క్లయింట్ల డీమ్యాట్ ఖాతాల్లో నుంచి సెక్యూరిటీలను ట్రేడింగ్ మెంబరు పూల్ ఖాతాల్లోకి బదలాయించడాన్ని డిపాజిటరీలు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 25 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. -
తెలుగు పరిశ్రమలో కొత్త మార్గదర్శకాలు
కరోనా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ–తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) ఇటీవల నాలుగు కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్‌లు నిలిపివేసి, సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం సెస్టెంబర్ 1 నుంచి చిత్రీకరణ పునః ప్రారంభించుకోవచ్చని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో నిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు. షూటింగ్‌లు కూడా ఆరంభం అయ్యాయి. తాజాగా పారితోషికం, ఓటీటీ, థియేట్రికల్ అండ్ ఎగ్జిబిషన్, ఫెడరేషన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ, టీఎఫ్‌సీసీ ఓ లేఖను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు సెప్టెంబరు 10 నుంచి అమలులోకి వస్తాయన్నట్లుగా టీఎఫ్సీపీ పేర్కొంది. కాగా ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాలు జరిపాకే ఈ కొత్త మార్గదర్శకాలను నిర్ణయించినట్లుగా టీఎఫ్‌సీసీ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఆ లేఖలో పేర్కొన్న మార్గదర్శకాలు ఈ విధంగా.... ప్రొడక్షన్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్ ► నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రోజువారీ వేతనాలు ఉండవు. ► నటీనటులు వారి పారితోషికంలోంచే వ్యక్తిగత సిబ్బంది వేతనాలు చెల్లించుకోవాలి. అలాగే స్థానిక రవాణా, బస, స్పెషల్ ఫుడ్ వంటివి నటీనటులే సమకూర్చుకోవాలి. ఒప్పందాల ప్రకారమే నిర్మాతలు ఆర్టిస్టులకు పారితోషికాలను చెల్లిస్తారు. నటీనటులతో పాటు ప్రధాన సాంకేతిక నిపుణులకూ ఇవే నియమాలు వర్తిస్తాయి. ► సినిమా షూటింగ్ ప్రారంభించడా నికి ముందే పారితోషికాలకు సంబంధించిన ఒప్పందాలు పూర్తవుతాయి. వీటి ప్రకారమే చెల్లింపులు ఉంటాయి. ► కాల్షీట్స్ టైమింగ్, సెట్స్‌లో క్రమశిక్షణకు సంబంధించిన నియమాలు కఠినంగా అమలు చేయబడతాయి. నిర్మాతల సౌకర్యార్థం సినిమాకు సంబంధించిన షూటింగ్ రిపోర్ట్‌ను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఓటీటీ : ► ఓ సినిమా ఏ టీవీ చానెల్లో ప్రసారం కానుంది? ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది? అనే అంశాలను టైటిల్స్‌లో కానీ, సినిమా ప్రదర్శనల్లో కానీ, ప్రమోషన్స్‌లో కానీ బహిర్గతం చేయకూడదు. ► థియేటర్స్‌లో రిలీజైన ఓ సినిమా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలి. థియేట్రికల్ అండ్ ఎగ్జిబిషన్ ► వీపీఎఫ్ (వర్చ్యువల్ ప్రింట్ ఫీ)కి సంబంధించిన చార్జీల విషయమై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో నేడు జరగాల్సిన సమావేశం 6కి వాయిదా పడింది. ► తెలంగాణలో మల్టీప్లెక్స్‌లకు ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారో ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతే ఇస్తారు. సినీ కార్మికుల సంఘం: ► కార్మికులకు సంబంధించిన సమస్యలపై తుది చర్చలు జరుగుతున్నాయి. రేట్ కార్డ్స్ ఫైనలైజ్ అయ్యాక వీటి వివరాలు అన్ని నిర్మాణ సంస్థలకు పంపించడం జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తీసుకున్న నిర్ణయాల విషయమై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణుతో చర్చలు జరిపారని భోగట్టా. కొత్త మార్గదర్శకాలను ‘మా’కి లేఖ రూపంలో పంపారని సమాచారం. నటీనటుల వ్యక్తిగత సిబ్బంది పారితోషికం, సొంత రవాణా ఖర్చులు వంటివాటిపై ‘మా’ సుముఖత వ్యక్తపరిచిందట. కొత్త మార్గదర్శకాలను నటీనటులందరికీ ‘మా’ త్వరలో అధికారికంగా పంపనుందని సమాచారం. ► కొత్త మార్గదర్శకాల్లో రోజువారీ వేతనాల గురించిన అంశం ఒకటి. మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో పెద్ద రేంజ్ ఉన్నవారు రోజువారీ వేతనాలు తీసుకుంటారు. అయితే ఇకపై వారికి కూడా సినిమాకి ఇంత అని పారితోషికం నిర్ణయించాలనుకుంటున్నారు. మరి.. రోజువారీ వేతనాలు తీసుకునేది ఎవరూ అంటే.. అట్మాస్ఫియర్ కోసం సీన్లో నిలబడేవాళ్లు, అటూ ఇటూ కదులుతూ కనిపించేవాళ్లు, డైలాగ్స్ చెప్పే జూనియర్ ఆర్టిస్టులు .. ఇలా చిన్న స్థాయి కళాకారులు రోజువారీ వేతనాల కిందకు వస్తారు. -
చైల్డ్ ఆర్టిస్టులను ఇక అలా చూపించొద్దు: కొత్త మార్గదర్శకాలు రెడీ!
న్యూఢిల్లీ: సీరియళ్లు, రియాలిటీ షోలంటూ బుల్లితెర మీదే కాదు.. సిల్వర్‌స్క్రీన్‌పై ఈ మధ్య డిజిటల్ స్క్రీన్ మీద కూడా పిల్లలను అభ్యంతరకరంగా, ఇబ్బందికరంగా చూపిస్తున్నారు. ఈ వ్యవహారంపై వీక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. ఈ తరుణంలో.. వినోద రంగానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) డ్రాఫ్ట్ గైడ్లెన్స్ జారీ చేసింది. సినిమాలు, టీవీ, రియాలిటీ షో, షార్ట్ ఫిల్మ్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వార్తలు, సోషల్ మీడియా వెబ్సైట్ కంటెంట్ విషయంలోనూ కొత్త గైడ్‌లైన్స్ వర్తిస్తాయని ఎన్సీపీసీఆర్ స్పష్టం చేసింది. సైబర్ చట్టాలు, పిల్లల హక్కులకు సంబంధించిన ఇతర చట్టాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ రూల్స్‌ను సిద్ధం చేసింది కమిషన్. తాజా డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం.. మూడు నెలల కంటే తక్కువ వయసున్న పసికందులను తెరపై చూపించకూడదు. అయితే.. చనుబాలు..రోగ నిరోధక శక్తి లాంటి అవగాహన కార్యక్రమాల కోసం మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనను పాటించకుంటే.. మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. సినిమా, సీరియళ్లు, ఓటీటీ .. ఇలా అన్ని కేటగిరీలకు ఈ రూల్స్ వర్తిస్తాయి. అంతేకాదు.. చిల్ట్రన్ ఇన్ న్యూస్ మీడియా అనే కేటగిరీని ప్రత్యేకంగా చేర్చింది ఎన్సీపీసీఆర్. దీని ప్రకారం.. పిల్లలు న్యూస్ ఛానెల్స్ లేదంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్‌లో ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు.. వాళ్లకు ఇబ్బందికలిగించేలా వ్యవహారించకూడదు. ముఖ్యంగా బాధితుల విషయంలోనూ విజువల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే.. సంబంధిత చానెల్స్‌పై శిక్షలు కఠినంగా ఉంటాయి. ఈ గైడ్ లైన్స్ ప్రకారం.. నిర్భంధంతో పని చేయించుకోవడం తదితర అంశాలతో పాటు లేబర్ చట్టం ప్రకారం ఇక్కడ వర్తిస్తుంది. అలాగే.. సోషల్ మీడియా కూడా పిల్లలపై హింస విషయంలో బాధ్యతయుతంగా వ్యవహరించాలని కోరింది. ధూమపానం, మద్యపానంతో పాటు అత్యాచార బాధితులుగా, లైంగిక వేధింపుల బాధితులుగా, ఇబ్బందికర పరిస్థితులలో చూపించకూడదు. భారీ భారీ డైలాగులతో.. సమాజంపై చెడు ప్రభావం చూపించేలా పాత్రలను డిజైన్ చేయడం మేకర్లు మానుకోవాలని మార్గదర్శకాల్లో సూచించింది ఎన్సీపీసీఆర్. చివరిసారిగా.. 2011లో మార్గదర్శకాలను జారీ చేసింది ఎన్సీపీసీఆర్. ఈ నేపథ్యంలోనే చాలా ఏళ్ల తర్వాత.. కొత్త చట్టాలు, పాత నిబంధనల సవరణల ఆధారంగా భారీ మార్పులతో డ్రాఫ్ట్ గైడ్‌లెన్స్‌ను.. అదీ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే సిద్ధం చేసింది ఎన్సీపీసీఆర్. వినోద రంగం నుంచి ఓ ప్రత్యేక కమిటీ ఈ మార్గదర్శకాల ప్రతిపాదనలను పరిశీలించి.. అభ్యంతరాలను, మార్పులు చేర్పులను తెలపనుంది. -
AP: మీరు టీచరా?.. ఈ నూతన మార్గదర్శకాలు మీకోసమే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల సర్దుబాటుపై పాఠశాల విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పాఠశాల విద్య) బి.రాజశేఖర్ జీవో 117ను జారీచేశారు. జాతీయ విద్యాహక్కుచట్టం, నూతన జాతీయ విద్యావిధానాలను అనుసరించి పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో భాగంగా టీచర్ల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ ఈచర్యలు చేపట్టింది. అంగన్వాడీ సెంటర్లు, నాన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ స్కూళ్లను పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్, ఫౌండేషనల్ స్కూల్, ఫౌండేషనల్ స్కూల్ ప్లస్, ప్రీ హైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ పాఠశాలలుగా ఇవి పునర్వ్యవస్థీకరణ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి తగ్గ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అవసరమైన మేర సెకండరీ గ్రేడ్ టీచర్లను, సబ్జెక్టు టీచర్లను సమకూర్చేలా ప్రభుత్వం ఈ సర్దుబాటు ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియకోసం ఆయా జిల్లాల డీఈవోలు ముందుగా మండలం, పాఠశాల వారీగా విద్యార్థుల సంఖ్య, అవసరమైన టీచర్ల సంఖ్యతో జాబితాలను రూపొందించాలి. వీటి ఆధారంగా టీచర్లను సర్దుబాటు చేస్తారు. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, మ్యాపింగ్ కారణంగా ఏ ఒక్క పాఠశాల మూతపడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. జీవోలో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. కొత్త విధానంలో ఆయా స్కూళ్లలో 9, 10 తరగతుల్లో 20 మందికి మించి విద్యార్థులున్న చోట డ్యూయల్ మీడియం ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక్కడ అదనపు సెక్షన్‌ను ఏర్పాటు చేస్తారు. ♦ఏదైనా పోస్టు ఖాళీగా, మిగులుగా ఉండి అది వేరే అవసరమైన స్కూలుకు మార్పు చేయాలని ప్రతిపాదిస్తే ఆ పోస్టును సదరు స్కూలుకు బదలాయించాలి ♦ఖాళీ పోస్టు లేకుంటే ఆ స్కూలులోని టీచర్లలో జూనియర్ టీచర్‌ను బదిలీ చేయాలి ♦పాఠశాలలోని సీనియర్ ఉపాధ్యాయుడు కొత్త పాఠశాలలో పనిచేయడానికి ఇష్టపడితే అతనినే బదిలీ చేయవచ్చు. సూళ్లలో టీచర్ల సంఖ్య ఇలా ఫౌండేషనల్ స్కూళ్లలో (పీపీ1, పీపీ–2, 1, 2 తరగతులు) ♦విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో 1:30 నిష్పత్తిలో టీచర్లుండాలి ♦1, 2 తరగతులకు 30 మంది వరకు విద్యార్థులుంటే ఒక ఎస్జీటీని నియమించాలి ♦1, 2 తరగతుల్లో 31కు మించి విద్యార్థులుంటే 2వ టీచర్‌ను కేటాయించాలి ♦ఆపై ప్రతి 30 మంది అదనపు విద్యార్థులకు మరో ఎస్జీటీని నియమించాలి. ♦ఫౌండేషనల్ (1, 2 తరగతులు) స్కూళ్లలో 10 మంది కన్నా పిల్లలు తక్కువగా ఉంటే వాటి విషయంలో ప్రతిపాదనలను కమిషనర్‌కు పంపించాలి. ఫౌండేషనల్ ప్లస్ స్కూళ్లు (పీపీ1, పీపీ2, 1 నుంచి 5 తరగతులు ♦ఈ స్కూళ్లలో 30 మంది విద్యార్థులుంటే ఒక ఎస్జీటీని నియమించాలి ♦విద్యార్థుల సంఖ్య 31 దాటితే రెండో ఎస్జీటీని కేటాయించాలి ♦ఆపై ప్రతి 30 మంది అదనపు విద్యార్థులకు మరో ఎస్జీటీని ఇవ్వాలి ♦121 మంది విద్యార్థులుంటే ప్రైమరీ స్కూలు హెడ్మాస్టర్ పోస్టును ఏర్పాటు చేస్తారు. ♦10 మందికన్నా తక్కువగా విద్యార్థులుంటే కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపాలి. ప్రీ హైస్కూలు 3 నుంచి 8 తరగతులు ♦ఈ స్కూళ్లలో 1, 2 తరగతులుంటే కనుక వాటిని అదే ఆవరణలో ఫౌండేషనల్ స్కూళ్లుగా కొనసాగించాలి. ♦3–8 తరగతుల వరకు 6 సెక్షన్లకు ఆరుగురు, 7 సెక్షన్లకు ఏడుగురు, 8 సెక్షన్లకు 8 మంది సబ్జెక్టు టీచర్లుగా స్కూల్ అసిస్టెంట్లను ఏర్పాటు చేయాలి. సీనియర్ మోస్ట్ టీచర్ హెచ్ఎంగా వ్యవహరించాలి. ♦195 మందికన్నా ఎక్కువ మంది ఉంటే 3 కిలోమీటర్ల లోపు వేరే హైస్కూల్ లేకుంటే వీటిని హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేయాలి. ♦98 మందికన్నా పిల్లలు తక్కువగా ఉంటే ఎస్ఏ బదులు ఎస్జీటీలను కేటాయించాలి. ♦అన్ని ప్రీ హైసూ్కళ్లను 8వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయాలి. 3 నుంచి 10 తరగతులు, టీచర్లు ఇలా.. ♦3 నుంచి 10వ తరగతి వరకు ఉండే హైస్కూళ్లలో సెక్షన్ల వారీగా ఎంతమంది ఏ యే సబ్జెక్టు టీచర్లుండాలో జీవోలో పట్టిక రూపంలో పొందుపరిచారు. 8 సెక్షన్లుంటే 10 మంది, 9 సెక్షన్లుంటే 11 మంది స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు టీచర్లను కేటాయించాలి. ఆపై ప్రతి అదనపు సెక్షన్‌కు అదనంగా ఒక స్కూల్ అసిస్టెంట్‌ను కేటాయించాలి. ♦ 6 నుంచి 10వ తరగతి వరకు ఉండే హైస్కూళ్లలో 5 సెక్షన్లకు 8 మంది ఎస్ఏలను సబ్జెక్టు టీచర్లను కేటాయించాలి.ఈ స్కూళ్లలో ప్రతి అదనపు సెక్షన్‌కు అదనంగా ఒక్కో ఎస్ఏ టీచర్‌ను కేటాయించాలి. -
నూపుర్ వ్యవహారం.. బీజేపీ దిద్దుబాటు చర్యలు
న్యూఢిల్లీ: ఓ టీవీ డిబేట్లో ముహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల తాలుకా ప్రభావం.. బీజేపీని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. దేశంలో రాజకీయ విమర్శలు ఎదురుకాగా.. ముఖ్యంగా ఇస్లాం దేశాల అభ్యంతరాలతో వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) దిద్దుబాటు చర్యలకు దిగింది. నూపుర్ శర్మ వ్యాఖ్యల వ్యవహారం లాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆచితూచి వ్యవహరించాలని ఆదేశించింది. బీజేపీ అధికార ప్రతినిధులు, ప్యానెలిస్టులు మాత్రమే టీవీ డిబేట్లలలో పాల్గొనాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వాళ్లను ఎంపిక చేసి పంపించే బాధ్యతను మీడియా సెల్‌కు అప్పజెప్పింది. అంతేకాదు.. టీవీ డిబేట్లను వెళ్లే ప్రతినిధులు ఎవరైనా సరే.. మతపరమైన చర్చ జరపకూడదని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ‘‘నిగ్రహ భాష ఉపయోగించండి. ఉద్రేకంగా మాట్లాడొద్దు. ఆందోళన చెందొద్దు. ఎవరి ప్రోద్బలంతో కూడా పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను ఉల్లంఘించవద్దు’’ అని స్పష్టం చేసింది. అంతేకాదు పార్టీ లైన్‌కు అనుకూలంగా నడుచుకోవాలని, డిబేట్లకు వెళ్లే ముందు అంశంపై పూర్తిస్థాయి పరిజ్ఞానంతోనే ముందుకు వెళ్లాలని సూచించింది. తాజా రూల్స్ ప్రకారం.. టీవీ డిబేట్లో పాల్గొనే ప్రతినిధులు పార్టీ ఎజెండా నుంచి పక్కదారి పట్టకూడదు. ఎవరు రెచ్చగొట్టినా ఉచ్చులో పడి వ్యాఖ్యలు చేయొద్దు అని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఓ టీవీ డిబేట్లో వ్యాఖ్యలు చేసినందుకే నూపుర్ శర్మపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే ఆమెను పార్టీని నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. అదే విధంగా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు మరో నేత నవీన్ కుమార్ జిందాల్‌ను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. ఖతర్, కువైట్, యూఏఈ, పాకిస్థాన్, మాల్దీవ్, ఇండోనేషియా.. ఇలా దాదాపు పదిహేను దేశాలు నూపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశాయి. చదవండి: అలా చేయకుంటే.. నూపుర్ శర్మ అంతుచూస్తాం -
CDS Post: కేంద్రం కీలక నిర్ణయం
సీడీఎస్ నియామకం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ సైనికాధికారులకూ అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ గతేడాది డిసెంబరు 8న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అప్పటినుంచి సీడీఎస్ గా ఇంకా ఎవరినీ నియమించలేదు. అయితే, సీడీఎస్ నియామకం కోసం కసరత్తులు చేస్తున్న కేంద్రం అర్హత ప్రమాణాలను కాస్త సడలించాలని నిర్ణయించుకుంది. సీడీఎస్ పదవి కోసం... రిటైరైన సైనికాధికారులు కూడా పరిగణనలోకి వస్తారని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు మూడు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇకపై ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన రిటైర్డ్ చీఫ్ లు కూడా సీడీఎస్ అయ్యే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న వారు, సర్వీసులో ఉన్న త్రీస్టార్ ఆఫీసర్లు, చీఫ్ గా వ్యవహరించి పదవీ విరమణ చేసిన 62 ఏళ్ల లోపు వయసున్న వారు, 62 ఏళ్ల లోపు వయసున్న రిటైర్డ్ త్రీస్టార్ ఆఫీసర్లు... సీడీఎస్ పదవి కోసం అర్హులవుతారని కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో... రిటైర్డ్ అయిన అధికారులను కూడా పరిశీలనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. చదవండి: 22,850 అడుగుల ఎత్తులో.. -
మంకీపాక్స్‌పై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: మంకీపాక్స్‌పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్‌లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా కేంద్రం చర్యలు చేపట్టింది. అనుమానిత కేసుల శాంపిళ్లను పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపాలని సూచించింది. గత 21 రోజులలో మంకీపాక్స్ సోకిన దేశాలకు ప్రయాణించిన చరిత్ర ఉన్న ఏ వయస్సు వారైనా, తీవ్రమైన దద్దుర్లు, వాపు, జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, తీవ్రమైన బలహీనత వంటి ఇతర లక్షణాలు కలిగి ఉంటే మంకీపాక్స్ వైరస్ వ్యాధితో బాధపడుతున్నట్లు అనుమానిస్తున్నారు. వీరికి కొద్ది రోజులు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇదిలాఉంటే, మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్యల గణనీయంగా పెరుగుతోంది. ప్రజారోగ్యానికి మంకీపాక్స్ ముప్పు పొంచి ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఇప్పటివరకు 23 దేశాల్లో 257 కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. మరో 120 మందిలో లక్షణాలను గుర్తించామని వెల్లడించింది. కొన్ని దేశాల్లో బయటపడిన మంకీపాక్స్ వేగంగా వ్యాప్తిచెందుతున్నదని స్పష్టం చేసింది. చదవండి: (కారులో వెళ్తున్న ప్రధాని మోదీ.. యువతి చేతిలో ఆ ఫోటో చూడగానే..) -
రిటర్న్‌ల స్క్రూటినీకి మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్నులను స్క్రూటినీకి ఎంపిక చేసే విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది. వీటి ప్రకారం పన్ను ఎగవేతకు సంబంధించి ఏ అధికారిక ఏజెన్సీల దగ్గర సమాచారమున్నా స్క్రూటినీ చేపట్టవచ్చు. అయితే, పూర్తి స్థాయి పరీక్షకు నిర్దిష్ట కేసులను ఎంపిక చేసేందుకు ప్రిన్సిపల్ కమిషనర్ / ప్రిన్సిపల్ డైరెక్టర్ / కమిషనర్ / డైరెక్టర్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు చెల్లుబాటయ్యే అనుమతులు లేకుండా చారిటబుల్ ట్రస్టులు మినహాయింపులను క్లెయిమ్ చేసిన కేసుల్లో.. సర్వే, సెర్చి, జప్తులకు సంబంధించిన కేసుల్లో.. నోటీసుల జారీ కోసం ముందస్తుగా అనుమతులు తీసుకోవాలి. పూర్తి స్థాయి స్క్రూటినీలో భాగంగా పన్ను చెల్లింపుదారులు నిజాయితీగానే మినహాయింపులు పొందారా అన్నది ఆదాయపు పన్ను శాఖ అధికారులు పరిశీలిస్తారు. ఆదాయం తక్కువగా, నష్టాలను ఎక్కువగా చూపడం లాంటివేవీ చేయలేదని ధృవీకరించుకునేందుకు స్క్రూటినీ నిర్వహిస్తారు. -
ఇక డ్రైవింగ్ ‘పరీక్ష’ లేదు!
సాక్షి, అమరావతి: ఇకపై లైసెన్సు కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో నిర్దేశిత శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్ పొందితే చాలు.. రవాణా శాఖ కార్యాలయం డ్రైవింగ్ లైసెన్సును మంజూరు చేయనుంది. అదే సమయంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల గుర్తింపు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ‘డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు–2022’ నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుత విధానంతో పాటు ఇది కూడా కొనసాగనుంది. కొత్త విధానాన్ని ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. లైసెన్సుల జారీ సులభతరం.. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి పరీక్ష పాస్ కావాలి. థియరీ, ప్రాక్టికల్ పరీక్షల్లో అర్హత సాధించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చే విధానం ప్రకారం.. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ శిక్షణా కేంద్రం జారీ చేసే సర్టిఫికెట్ కాపీతో పాటు అవసరమైన గుర్తింపు కార్డుల కాపీలు జతచేసి దరఖాస్తు చేస్తే రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్సు ఇస్తుంది. దీనివల్ల లైసెన్సుల కోసం నిరీక్షించే సమయం తగ్గుతుందని.. లైసెన్సుల జారీ విధానం సరళతరం, సులభతరం అవుతుందన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. నిబంధనలు కఠినతరం.. ఈ ప్రక్రియలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల పాత్ర కీలకం కానుండటంతో.. గుర్తింపు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. గుర్తింపు పొందిన శిక్షణా కేంద్రం జారీ చేసే సర్టిఫికెట్‌ను మాత్రమే రవాణా శాఖ పరిగణనలోకి తీసుకోనుంది. ► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే.. ట్రాక్ కోసం కనీసం ఎకరా భూమి ఉండాలి. భారీ వాహనాల డ్రైవింగ్ స్కూల్‌కు అయితే కనీసం 2 ఎకరాల భూమి ఉండాలి. వాటిలో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం టెస్టింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలి. ► డ్రైవింగ్‌పై ప్రాథమికంగా అవగాహన కల్పించేందుకు స్టిమ్యూలేటర్ ఏర్పాటు చేయాలి. ► శిక్షకులు కనీసం ఇంటర్మీడియట్ పాస్ కావడంతో పాటు కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. ► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ శిక్షణా కాలం కనీసం నాలుగు వారాల్లో 29 గంటల పాటు ఉండాలి. వాటిలో థియరీ క్లాసులు 8 గంటలు, ప్రాక్టికల్ క్లాసులు 21 గంటల పాటు నిర్వహించాలి. ► భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కాలం ఆరు వారాల్లో కనీసం 38 గంటలు ఉండాలి. ఇందులో థియరీ క్లాసులు 8 గంటలు, ప్రాక్టికల్ క్లాసులు 30 గంటలు నిర్వహించాలి. ► అన్ని అర్హతలు కలిగిన డ్రైవింగ్ స్కూల్‌కు ఐదేళ్ల పాటు గుర్తింపు ఇస్తారు. అనంతరం రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. -
ఏపీ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు.. ఇక సులభంగా మ్యుటేషన్లు
సాక్షి, అమరావతి: భూ యాజమాన్య హక్కులకు సంబంధించి మ్యుటేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు పలు అంశాలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు స్పష్టతనిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) సాయిప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. ముందే సబ్ డివిజన్ తప్పనిసరి మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారు దానికి ముందే సర్వే నెంబర్‌ను సబ్ డివిజన్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేశారు. సబ్ డివిజన్ ప్రక్రియ పూర్తై రికార్డుల్లో సర్వే నెంబర్లు, పేర్లన్నీ ఆ ప్రకారం ఉన్నట్లు నిర్థారించుకున్న తర్వాతే మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభించాలని తహశీల్దార్లకు సూచించారు. పాస్బుక్ల జారీ కూడా మ్యుటేషన్ సమయంలోనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. మ్యుటేషన్‌తోపాటు పాస్‌బుక్ కోసం దరఖాస్తు స్వీకరించి రెండింటినీ ఒకేసారి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములపై.. ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యుటేషన్ చేయరాదని సూచించారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో చేయాల్సి వచ్చినప్పుడు ఆ బాధ్యతను పూర్తిగా జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. అది కూడా కలెక్టర్ల నుంచి వచ్చిన ఫైలు ఆధారంగా చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తహశీల్దార్లకు ఉన్న ఈ అధికారాన్ని జేసీలకు బదలాయించారు. వారసత్వ వివాదాలకు సంబంధించి మ్యుటేషన్ల విషయంలో ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను తహశీల్దార్ అదే సమయంలో ఇవ్వాలని నిర్దేశించారు. మ్యుటేషన్ చేసుకునే సమయంలోనే ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను దరఖాస్తుదారుడు ఇచ్చినప్పుడు మళ్లీ ఆ కుటుంబం గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చుక్కల భూములు, అసైన్డ్ మ్యుటేషన్‌పై స్పష్టత చుక్కల భూముల చట్టం వచ్చే నాటికి 12 సంవత్సరాలు దాటి సంబంధిత భూములు దరఖాస్తు చేసుకున్న వారి స్వాధీనంలోనే ఉన్నట్లు రికార్డుల ప్రకారం నిర్థారణ అయితే వాటికి మ్యుటేషన్ చేయవచ్చని సూచించారు. తీర్పులు వెలువడిన కేసులు, కోర్టు ద్వారా వేలం పాట నిర్వహించిన ఆస్తులను కొనుగోలు చేసిన వారికి వెంటనే యాజమాన్య హక్కులు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసైన్డ్ భూములకు సంబంధించి రికార్డుల్లో ఉన్న వ్యక్తులే మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే చేయాలని, మూడో వ్యక్తి ఎవరైనా దరఖాస్తు చేస్తే తిరస్కరించాలని స్పష్టం చేశారు. భూముల రీ సర్వే పూర్తయిన చోట సర్వే పూర్తయినట్లు జారీ చేసే 13 నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే అప్పటివరకు ఉన్న మ్యుటేషన్ దరఖాస్తులను క్లియర్ చేయాలని నిర్దేశించారు. మ్యుటేషన్ దరఖాస్తులను చిన్న కారణాలతో తిరస్కరించకూడదని, ఎందుకు తిరస్కరించారో స్పష్టమైన కారణాలు చూపాలని, ఇంకా ఏ డాక్యుమెంట్లు కావాలో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. మ్యుటేషన్ కోసం వచ్చే దరఖాస్తుల్లో 45 శాతం తిరస్కారానికి గురవుతుండడంతో పలు అంశాలపై స్పష్టత ఇస్తూ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. -
మండుటెండలోనూ తప్పని పని.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు కూలీలను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ఇప్పటికే వేసవి భృతి, మజ్జిగ పంపిణీ వంటి అదనపు సౌకర్యాల్లో కోత పెట్టిన కేంద్రం తాజాగా మరో ఇబ్బందికర నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు పూటల పని విధానం అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దీనిని కూలీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాగైతే పనికి వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి: కలెక్టర్ చెట్టు కింద కూర్చోలేరుగా: సుప్రీంకోర్టు ఇప్పటికే వేసవి భృతి రద్దు జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కూలీలు చేసిన పనిని కొలతలు ఆధారంగా లెక్కించి రోజుకు రూ.245 వేతనం చెల్లించాలి. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నాలుగైదు గంటల పాటు కష్టపడుతున్నా సగటు కూలి రూ.150 నుంచి రూ.190 మధ్యనే లభిస్తోంది. ఎండాకాలంలో పనులు చేసే కూలీలకు వేసవి భత్యం కింద మూడు నెలల పాటు సగటున 25 శాతం వేతనం అదనంగా చెల్లించాలి. అయితే ఈ పథకం కేంద్రం అ«దీనంలోకి వెళ్లినప్పటి నుంచీ వేసవి భృతిని రద్దు చేశారు. దీంతో వేతనం గిట్టుబాటు కావడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు. రెండు పూటలా సాధ్యమా? ఉపాధి పనులు ప్రస్తుతం ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జాబ్ కార్డు కలిగిన కూలీల కుటుంబాల వారికి కేటాయించిన 100 రోజుల పని దినాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విధిగా పనులకు హాజరు కావాలి. ఎంత మంది పనులకు వచ్చారనే విషయాన్ని ఉపాధి హామీ పథకం మేట్లు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం మరోసారి మస్టర్లో నమోదు చేయాలి. ఇప్పటికే స్థానికంగా పనులు లేక కొన్ని గ్రామాల్లోని కూలీలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. చదవండి: జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ కీలక ఆదేశాలు రెండు పూటల పని విధానంతో గ్రామం నుంచి మండల పరిధిలోని నాలుగు కిలోమీటర్ల వరకూ రెండుసార్లు తిరగలేక కూలీలు పని ప్రదేశంలోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ ఉదయం ఉపాధి పనికి వెళ్లినా.. మధ్యాహ్నం నుంచి వ్యవసాయ పనులు, పశువుల పెంపకం ద్వారా వారు కొంత ఆదాయం పొందేవారు. ఇప్పుడు ఆ అవకాశం ఉండదని కూలీలు వాపోతున్నారు. ఈ పరిణామం ఉపాధి పనులకు వచ్చే కూలీలపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విస్తృతంగా పనులు జరుగుతున్న ప్రస్తుత సమయంలో కేంద్రం విధించిన ఇటువంటి నిబంధనలు కూలీలకు శరాఘాతంగా మారనున్నాయి. కేంద్రం కొత్తగా ఇచ్చిన ఈ జీఓను రద్దు చేయాలని కూలీలు డిమాండు చేస్తున్నారు. కేంద్ర నిబంధనలు పాటిస్తున్నాం ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నడుస్తోంది. కొత్త ఉత్తర్వులను ఏప్రిల్ 1 నుంచి తప్పకుండా అమలు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఇక నుంచి రెండు పూటలా పని చేయాలి. అప్పుడే కూలీల ఖాతాల్లో పూర్తి వేతనం జమ అవుతుంది. కచ్చితంగా పని చేయాలని మేం బలవంతం చేయడం లేదు. ఉదయం, సాయంత్రం మస్టర్ అంటే కొంత ఇబ్బందే. భవిష్యత్తులో కూలీల సంఖ్య తగ్గే అవకాశం కూడా ఉంటుంది. – ఎ.ముఖలింగం, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా -
క్రిప్టో కరెన్సీ.. ఇది చాలా రిస్క్ గురూ!
ముంబై: క్రిప్టో కరెన్సీలు, నాన్–ఫంజిబుల్ టోకెన్ల ప్రకటనలకు సంబంధించి అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలి ఏఎస్సీఐ మార్గదర్శకాలు ప్రకటించింది. వీటి ప్రకారం ఇకపై ఈ సాధనాల ప్రకటనల్లో ఇవి ‘అవ్యవస్థీకృతమైనవి, అత్యధిక రిస్కులకు అవకాశమున్నవి‘ అని పేర్కొనడం తప్పనిసరి కానుంది. ఇలాంటి లావాదేవీల వల్ల నష్టం వాటిల్లితే నియంత్రణ సంస్థలపరంగా పరిష్కార మార్గాలేమీ ఉండకపోవచ్చని కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ప్రస్ఫుటంగా కనిపించేలా ఉండాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. క్రిప్టోలుగా వ్యవహరించే అన్ని వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ), నాన్ ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ)కు ఇవి వర్తిస్తాయి. వివాదాస్పద క్రిప్టో సాధనాలు, సర్వీసుల ప్రకటనలు మార్కెట్‌ను ముంచెత్తుతున్న నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు, ప్రభుత్వం, ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలతో సంప్రదింపుల మేరకు ఏఎస్సీఐ తాజా గైడ్‌లైన్స్ రూపొందించింది. ఈ అసెట్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఇంకా చట్టమేదీ చేయకపోయినప్పటికీ.. వీటి లావాదేవీలపై వచ్చే లాభాల మీద పన్ను వేయాలని మాత్రం ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఓవైపు క్రిప్టోలను పూర్తిగా నిషేధించాలని ఆర్బీఐ పట్టుబడుతుండగా మరోవైపు ప్రభుత్వం మాత్రం పన్ను విధించాలని ప్రతిపాదించడం అనేది వీటికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నంగా భావించవచ్చని పరిశ్రమ చెబుతోంది. నిబంధనలు.. ► ప్రింట్ ప్రకటనల్లో అయిదో వంతు స్థలాన్ని డిస్‌క్లెయిమర్ కోసం కేటాయించాలి. వీడియో ప్రకటన అయితే, ఆఖర్లో సాదా బ్యాక్‌గ్రౌండ్‌పై టెక్ట్స్‌ను సాధారణ వేగంతో వాయిస్ ఓవర్ ద్వారా చెప్పాల్సి ఉంటుంది. వీడియో యాడ్లలో కనీసం అయిదు సెకన్ల పాటైనా చూపాలి. అదే రెండు నిమిషాలు పైగా సాగే ప్రకటనల్లోనైతే యాడ్ ప్రారంభం కావడానికి ముందు, ఆ తర్వాత ఆఖర్లోనూ చూపాలి. ఆడియో, సోషల్ మీడియా పోస్టులు మొదలైన వాటికి కూడా ఇది వర్తిస్తుంది. ► కరెన్సీ, సెక్యూరిటీలు, కస్టోడియన్, డిపాజిటరీలు మొదలైన పదాలన్నీ నియంత్రణ సంస్థ పరిధిలోని ఉత్పత్తులుగా ప్రజలు భావించే అవకాశం ఉన్నందున వీడీఏ సాధనాలు లేదా సర్వీసుల ప్రకటనల్లో అడ్వర్టైజర్లు వీటిని వాడకూడదు. ► ఆయా సాధనాలకు సంబంధించి గత పనితీరు గురించి పాక్షికంగా కూడా చూపకూడదు. మైనర్లతో యాడ్స్ తీయకూడదు. ► భవిష్యత్తులో కచ్చితంగా లాభాలు పెరుగుతాయనే హమీ ఇచ్చే పదజాలం వాడకూడదు. ► వీడిఏ సాధనాల్లోని రిస్కులను తగ్గించి చూపే విధంగా ప్రకటనలు ఉండకూడదు. అలాగే నియంత్రిత అసెట్స్‌తో పోల్చి చూపకూడదు. ► వినియోగదారులు తప్పుదోవ పట్టకుండా చూసే క్రమంలో.. యాడ్స్‌లో నటించే సెలబ్రిటీలూ ప్రకటనల్లో చెప్పే విషయాల గురించి క్షుణ్నంగా తెలుసుకుని వ్యవహరించాలి. -
అలాగైతే బడులు తెరవచ్చు!
న్యూఢిల్లీ: కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో బడులను తెరవచ్చని కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, కొత్త కేసులు స్థిరంగా తగ్గుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. అందుకే బడులు తెరవడంపై మార్గదర్శకాలు విడుదల చేశామన్నారు. దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, సిక్కిం, కర్ణాటక, త్రిపుర, తమిళనాడు, గోవా, మణిపూర్ సహా 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే పాఠశాలలు పూర్తిస్థాయిలో తెరుచుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి స్వీటీ ఛాంగ్సన్ చెప్పారు. అసోం, ఛత్తీస్‌గఢ్, చండీగఢ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, మిజోరం, రాజస్తాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మేఘాలయ, కేరళ, నాగాలాండ్, గుజరాత్, డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమబెంగాల్ సహా 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పాక్షికంగా తెరుచుకున్నాయని, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, పుదుచ్ఛేరి, జార్ఖండ్, లద్దాఖ్, జమ్మూకశ్మీర్, ఒడిశా, దిల్లీ తదితర 9 రాష్ట్రాల్లో ఇంకా పాఠశాలలు పునఃప్రారంభం కాలేదని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో స్కూలు సిబ్బంది వ్యాక్సినేషన్ పూర్తికావచ్చిందన్నారు. ప్రస్తుతం దేశంలో 268 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉందని పాల్ చెప్పారు. కరోనా వల్ల దేశీయ చిన్నారుల విద్యాభ్యాసం తీవ్రంగా దెబ్బతింటోందని అందరిలో ఆందోళన ఉందన్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు బడులు తెరిచేందుకు యత్నించాలన్నారు. పాఠశాలలకు నూతన మార్గదర్శకాలివే.. ► పిల్లల మధ్య 6 అడుగులు దూరం ఉండేలా తరగతుల్లో సీటింగ్ ఏర్పరచాలి. ► పాఠశాలలో పరిశుభ్ర వాతావరణం ఉంచుతూ, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ► పాఠశాల బస్సులు/వ్యాన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ► విద్యార్థులు, సిబ్బంది అంతా మాస్కులు ధరించాలి. ► పిల్లలను స్కూళ్లకు పంపేందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని తీసుకొనేలా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు చేపట్టాలి. ► ఒకవేళ తల్లిదండ్రులు ఆన్లైన్ తరగతులవైపే మొగ్గుచూపితే అందుకు అనుమతించాలి. ► ఇల్లులేని, వలస కూలీల పిల్లలు, కోవిడ్ సోకిన పిల్లలపై ప్రత్యేక దృష్టిసారించాలి. -
omicron variant: విదేశాల నుంచి వస్తే మార్గదర్శకాలివే..
న్యూఢిల్లీ: కరోనా కేసులు ఉధృతరూపం దాలుస్తూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు నడుం బిగించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించి ఇప్పటివరకు అమల్లో ఉన్న మార్గదర్శకాలను సవరించింది. కరోనా కేసులు ప్రమాదకరస్థాయిలో ఉన్న ఎట్ రిస్క్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులందరూ వారం పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాలంటూ శుక్రవారం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 11 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, తదుపరి ఆదేశాలు అందేవరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇటలీ నుంచి అమృత్‌సర్‌కి వచ్చిన ఎయిరిండియా విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిబంధన విధించింది. మార్గదర్శకాలివే.. ► ప్రయాణికులు తమ వివరాలను, 14 రోజుల కిందట వరకు చేసిన ప్రయాణాలను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి ► ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వాలి ► విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ విమానాశ్రయంలో దిగిన వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఫలితం వచ్చిన తర్వాతే బయటకు వెళ్లాలి. ఈ పరీక్ష కోసం ముందుగానే సువిధ పోర్టల్‌లో బుక్ చేసుకోవచ్చు. ► పరీక్షల్లో పాజిటివ్ వస్తే ఐసోలేషన్కుపంపిస్తారు. ► నెగెటివ్ వచ్చినప్పటికీ వారం పాటు క్వారంటైన్ తప్పనిసరి. 8వ రోజు ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకొని రిపోర్ట్‌ని సువిధ వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఆ పరీక్షలో నెగిటివ్ వస్తే మరో వారం పాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. ► ఎట్ రిస్క్ కాని దేశాల నుంచి వచ్చిన వారు (అంతర్జాతీయ ప్రయాణికుల్లో 2% మంది) కూడా విమానాశ్రయంలో రాండమ్ పరీక్షలు చేయించుకొని నెగెటివ్ వచ్చినా హోంక్వారంటైన్ ఉండాలి ► అయిదేళ్లలోపు చిన్నారులకు పరీక్షల నుంచి మినహాయింపు. పెరిగిన ఎట్ రిస్క్ దేశాల జాబితా ఒమిక్రాన్ కేసులు ప్రమాదకరంగా విజృంభిస్తున్న ఎట్‌రిస్క్ దేశాల జాబితాలో మరికొన్నింటిని చేర్చింది. అవి..యూకే సహా అన్ని యూరప్ దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, ఘనా, మారిషస్ న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో, ఇథియోపియా, కజకిస్తాన్, కెన్యా, నైజీరియా, ట్యునీషియా, జాంబియా. -
హోం క్వారంటైన్ ఇక ఏడు రోజులే
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు విస్తృతంగా వ్యాపిస్తూ థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో హోం క్వారంటైన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వేరియెంట్ ప్రమాదకారి కాకపోవడంతో హోం క్వారంటైన్ వ్యవధిని 10 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించింది. కోవిడ్–19 స్వల్ప లక్షణాలు కలిగిన వారు, ఏ లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారికి హోం క్వారంటైన్ కాల పరిమితిని తగ్గిస్తూ బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన దగ్గర్నుంచి ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ప్రజలెవరూ సొంత వైద్యం చేసుకోవద్దని సూచించింది. వైద్యుడిని సంప్రదించకుండా సీటీ స్కాన్, ఎక్స్‌రేలు, రక్త పరీక్షలు చేయించుకోవద్దని హితవు చెప్పింది. వైద్యులు చెప్పకుండా సొంతంగా స్టెరాయిడ్స్ వంటివి తీసుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించింది. ► ఎవరికైనా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణై స్వల్ప లక్షణాలు, లేదంటే అసలు లక్షణాలు లేకపోతే వారు హోం క్వారంటైన్ ఉంటే సరిపోతుంది. ► కరోనా సోకిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం రాకపోతే మాస్కులు ధరించి వారు బయట తిరగవచ్చు. ► స్వల్ప లక్షణాలున్న వారు హోం క్వారంటైన్ ముగిసిన తర్వాత తిరిగి కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. కోవిడ్–19 నెగెటివ్‌గానే వారిని పరిగణిస్తారు. ► 60 ఏళ్ల వయసు పైబడి గుండె, కిడ్నీ వంటి వ్యాధులున్న వారు వైద్యుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్లో ఉండాలి. ► హెచ్ఐవీ, కేన్సర్ రోగులు మాత్రం కరోనా సోకిన వెంటనే ఆస్పత్రిలో చేరాలి ► జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు హోం క్వారంటైన్ కేసుల్ని పర్యవేక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి బాధ్యత వహించాలి. ► క్షేత్ర స్థాయిలో ఎఎన్ఎం, శానిటరీ ఇన్స్పెక్టర్, మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్‌తో కూడిన కోవిడ్ బృందాలు హోం క్వారంటైన్ రోగుల్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. ► రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఆధారంగా ఈ బృందాలు రోగులకు కరోనా కిట్లను అందించాలి. డేంజర్ బెల్స్ భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్రం తెలిపింది. వైరస్ వ్యాప్తిని సూచించే ఆర్–వాల్యూ ప్రస్తుతం ఏకంగా 2.69కు చేరింది. డెల్టా వేరియెంట్ కారణంగా సెకండ్ వేవ్ అత్యంత ఉధృతంగా ఉన్నపుడు సైతం గరిష్ట ఆర్– వాల్యూ 1.69 శాతమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. నగరాల్లో వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఒమిక్రానే ప్రధాన వేరియెంట్‌గా అవతరించిందని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటాన్ని నివారించాలన్నారు. -
ఐపీవో నిధుల వినియోగానికి కళ్లెం
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూ నిధుల వినియోగంసహా మ్యూచువల్ ఫండ్ తదితర పలు విభాగాలలో నిబంధనలను సవరించింది. మంగళవారం(28న) సమావేశమైన సెబీ బోర్డు ప్రిఫరెన్షియల్ షేర్లు, ఫండ్ పథకాల నిలిపివేత, సెటిల్మెంట్ విధానాలు, కంపెనీ ఎండీ పునర్నియామకం, ఒత్తిడిలోపడ్డ రుణాలలో పెట్టుబడులు వంటి పలు మార్గదర్శకాలలో మార్పులకు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వివరాలు చూద్దాం.. ముందస్తు అనుమతి... సెబీ తాజా సవరణలు అమలులోకి వచ్చాక కంపెనీ ఎండీ, హోల్‌టైమ్ డైరెక్టర్ లేదా మేనేజర్ ఎంపికకు ఇకపై వాటాదారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. సాధారణ వాటాదారుల సమావేశంలో తిరస్కారానికి గురైన అధికారుల ఎంపిక లేదా పునర్నియామకానికి ముందస్తు అనుమతిని పొందవలసి ఉంటుంది. ఇక మార్కెట్లను ముంచెత్తుతున్న పబ్లిక్ ఇష్యూలపైనా సెబీ దృష్టి సారించింది. 2022లో మరిన్ని కంపెనీల ఐపీవోల నేపథ్యంలో ఇష్యూ నిధుల విని యోగంపై ఆంక్షలు విధించింది. స్పష్టతలేని కంపెనీయేతర వృద్ధి అవకాశాలకు వినియోగించదలచిన నిధులకు ఇవి వర్తించనున్నాయి. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు ఐపీవోలో విక్రయానికి ఉంచదలచిన షేర్ల సంఖ్యపైనా పరిమితులు అమలుకానున్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు జారీ చేసే ఈక్విటీలో 50%కి లాకిన్ పిరియడ్ 90 రోజులకు పెరగనుంది. మిగిలిన వాటాకు ప్రస్తుత 30 రోజుల గడువే అమలుకానుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించే నిధులపైనా సెబీ పర్యవేక్షణ ఉంటుంది. కొత్త టెక్ ఐపీవోలు.. ఇటీవల కొత్తతరహా టెక్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణ చేపడుతున్న నేపథ్యంలో సెబీ తాజా నిబంధనలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగుకు వీలుగా ఐపీవోలకు వస్తున్న కంపెనీల ధరల శ్రేణి నిర్ణయంపై ఆంక్షలు ఉండబోవని సెబీ చైర్పర్సన్ అజయ్ త్యాగి స్పష్టం చేశారు. ప్రైస్ డిస్కవరీ(ధరల నిర్ణయం) అనేది మార్కెట్ ఆధారితమని, ప్రపంచవ్యాప్తంగా ఈ విధానాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. కాగా.. సెబీ తాజా నిర్ణయాలలో భాగంగా ఒత్తిడిలోఉన్న రుణాల(ఆస్తుల)లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రత్యేక సిట్యుయేషన్ ఫండ్స్(ఎస్‌ఎస్‌ఎఫ్‌లు)కు తెరలేవనుంది. కేవలం మొండి రుణాలలో ఇన్వెస్ట్ చేసేందుకే వీటిని ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాల(ఏఐఎఫ్‌లు)లో ఉపవిభాగం కింద అనుమతించనున్నారు. దివాలా చట్టంలో భాగంగా ఆర్బీఐ నిబంధనలు అనుమతించిన మొండి రుణాల కొనుగోలుకే ఎస్ఎస్ఎఫ్కు అవకాశముంటుంది. ఈ బాటలో ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఏఆర్సీ)లు, ఒత్తిడిలోపడ్డ కంపెనీలు జారీ చేసిన సెక్యూరిటీలలోనూ బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రిఫరెన్స్ షేర్లు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టే కంపెనీలకు ధరల నిర్ణయం, లాకిన్ వంటి అంశాలలోనూ సెబీ నిబంధలను సరళీకరించింది. వీటితోపాటు లాకిన్ పీరియడ్‌లో ఉన్నప్పటికీ ప్రిఫరెన్షియల్ పద్ధతిలో పొందిన షేర్లను ప్రమోటర్లు తనఖాలో ఉంచేందుకు నిబంధనలను సరళీకరించింది. ఇక లిక్విడిటీగల కంపెనీ ప్రిఫరెన్షియల్ ఇష్యూకి ఫ్లోర్ ధరను 90–10 రోజుల సగటు ధర కంటే అధికంగా నిర్ణయించవలసి ఉంటుంది. ఇల్లిక్విడ్ సెక్యూరిటీ విషయంలో రిజిస్టర్డ్ స్వతంత్ర విలు వ మదింపు సంస్థ ఫ్లోర్ ధరను నిర్ణయించవచ్చు. ప్రస్తుతం 2 లేదా గత 26 వారాల్లో అత్యధిక ధరను ఫ్లోర్ ధరగా నిర్ణయిస్తుండటం తెలిసిందే. ఎంఎఫ్ ఇన్వెస్టర్లు.. మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) ఇన్వెస్టర్లకు రక్షణ కల్పిస్తూ సెబీ నిబంధనలను సవరించింది. వీటి ప్రకారం ఎంఎఫ్లకు చెందిన మెజారిటీ ట్రస్టీలు ఏవైనా పథకాలను నిలిపివేయదలిస్తే యూనిట్ హోల్డర్ల నుంచి తప్పనిసరిగా అనుమతిని తీసు కోవలసి ఉంటుంది. అంతేకాకుండా 2023–24 ఆర్థిక సంవత్సరం నుంచి ఎంఎఫ్‌లు తప్పనిసరిగా దేశీ ప్రమాణాల ప్రకారం ఖాతాలను నిర్వహించవలసి వస్తుంది. ఇక సెటిల్మెంట్ దరఖాస్తులను కంపెనీలు షోకాజ్ నోటీసు జారీ అయిన 60 రోజుల్లోగా దాఖలు చేయవలసి ఉంటుంది. అంతర్గత కమిటీ సమావేశం తదుపరి సవరించిన సెటిల్మెంట్ షరతులను 15 రోజుల్లోగా తెలియజేయవలసి ఉంటుంది. తద్వారా సెటిల్మెంట్ ప్రక్రియల నిబంధనలను క్రమబద్ధీకరించింది. -
ఇక ఇబ్బంది లేకుండా స్కూళ్ల మ్యాపింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమల్లో భాగంగా చేపట్టిన స్కూళ్ల మ్యాపింగ్‌లో అక్కడక్కడ ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ పాఠశాల విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎస్.సురేష్‌కుమార్ మంగళవారం రాత్రి పొద్దుపోయాక అన్ని జిల్లాల విద్యాధికారులు, ప్రాంతీయ సంచాలకులకు సవివర సర్క్యులర్ జారీచేశారు. పాఠశాల విద్యలో ఉత్తమ అభ్యసన ఫలితాల కోసం విద్యాశాఖలోని మానవవనరులను, మౌలిక సదుపాయాలను సాధ్యమైనంత సమర్థ వినియోగానికి చేపట్టిన సంస్కరణలలో విధివిధానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మాదిరి అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఒకే ఆవరణలో, లేదా 250 మీటర్లలోపు హైస్కూళ్లకు అనుసంధానం చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు కొన్ని ప్రాంతాల్లో మ్యాపింగ్ కూడా పూర్తిచేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన నిబంధలున్నా.. కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇబ్బందులు వచ్చాయి. వాటిని పరిష్కరిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేతీరున ఉండేలా కొత్తగా సమగ్రమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. సర్క్యులర్ ప్రకారం మ్యాపింగ్‌లో చేపట్టాల్సిన అంశాలు ఇలా ఉన్నాయి.... ► ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు హైస్కూళ్లకు అనుసంధానం తరువాత మిగిలిన 1, 2 తరగతుల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:30 వరకు ఉంటుంది. ► 3, 4, 5 తరగతుల విద్యార్థులను హైస్కూళ్లకు అనుసంధానం చేసిన అనంతరం ఫౌండేషనల్ స్కూళ్లలోని 1, 2 తరగతుల బోధనకు ప్రాథమిక పాఠశాలలోని సెకండరీ గ్రేడ్ టీచర్లలో సర్వీసు పరంగా అందరికన్నా జూనియర్‌ను నియమించాలి. ► మిగతా హెడ్మాస్టర్, ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లతో సహా ఇతర టీచర్లను మ్యాపింగ్ అయిన హైస్కూళ్లకు అనుసంధానించాలి. ► మ్యాపింగ్ అనంతరం 3 నుంచి 10వ తరగతి వరకు ఉండే ఈ హైస్కూళ్లలో వర్క్‌లోడ్, తరగతుల వారీగా టైమ్‌టేబుల్ అనుసరించి స్టాఫ్‌ప్యాట్రన్ ఒక హెడ్మాస్టర్, ఒక పీఈటీ లేదా ఒక స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)తో 9 మంది టీచర్లుంటారు. వీరిలో సబ్జెక్టు టీచర్లు ఉంటారు. స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, ఎస్జీటీలు ఉంటారు. ► ఆయా హైస్కూళ్లలో అదనపు సెక్షన్లు ఉంటే అవసరమైన అదనపు సిబ్బంది ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. ► అదనపు సిబ్బంది అవసరమైన హైస్కూళ్లకు సమీపంలో మ్యాపింగ్ అయిన ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో అదనంగా ఉన్న సిబ్బందిని నియమించాలి. సమీపంలో అలాంటి స్కూళ్లు లేకుంటే ఆ మండలంలో ఏ స్కూలులో అదనపు సిబ్బంది ఉన్నా వారిని నియమించవచ్చు. మండల పరిధిలో కూడా లేనిపక్షంలో జిల్లాలోని ఏ స్కూలు నుంచైనా సర్దుబాటు చేయవచ్చు. ► హైస్కూళ్లలోని టీచర్లను వినియోగించుకోవడంలో హెడ్మాస్టర్కు అధికారముంటుంది. అకడమిక్ క్యాలెండర్‌లోని సూచనలను అనుసరించి ఆయా టీచర్ల అర్హతలను పరిగణనలోకి తీసుకొని హెడ్మాస్టర్ సబ్జెక్టుల వారీగా బాధ్యతలు అప్పగించవచ్చు. ► ఆయా సబ్జెక్టులకు సంబంధిత సబ్జెక్టు టీచర్లు, లేదా క్వాలిఫైడ్ టీచర్లనే నియమించాలి. ► మిగతా టీచర్లకు రెమిడియల్ తరగతులు, లైబ్రరీ, ఆర్ట్, డ్రాయింగ్ తదితర అంశాల బాధ్యతలు అప్పగించాలి. ► పాఠశాలల మ్యాపింగ్ సమయంలో తల్లిదండ్రుల కమిటీ తీర్మానం మేరకు ఒకే కాంపౌండ్‌లో 1 నుంచి 10వ తరగతి వరకు మిశ్రమ పాఠశాలగా కొనసాగించవచ్చు. ► మ్యాపింగ్ హైస్కూళ్లలో వసతి సరిపడా లేనిపక్షంలో 3, 4, 5 తరగతుల విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగించవచ్చు. హైస్కూళ్లలోని టీచర్లతో ఈ తరగతుల విద్యార్థుల బోధనను కొనసాగించాల్సి ఉంటుంది. హైస్కూల్ హెడ్మాస్టర్ ఈ బాధ్యతలు చూస్తారు. ► మ్యాపింగ్ స్కూళ్ల క్యాడర్ స్ట్రెంగ్త్, వారి వేతనాలు, అమలు తదితర అంశాలకు సంబంధించి డీఈవోలు చర్యలు చేపట్టాలి. మధ్యాహ్న భోజనం అందించడానికి వీలుగా ఎండీఎం డైరెక్టర్ ఐఎంఎంఎస్ అప్లికేషన్లలో తగిన మార్పులు చేయాలి. -
Omicron Variant: ప్రస్తుతానికి.. ఒమిక్రాన్‌తో ముప్పు లేదు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ రూపాంతరితం దేశంలోకి కూడా ప్రవేశించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ వైరస్‌తో ఇక థర్డ్ వేవ్ తప్పదేమోనన్న భయాలు పెరిగిపోతున్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వేరియెంట్‌తో ప్రస్తుతానికి మాత్రం ముప్పు లేదని చెబుతోంది. వ్యాక్సిన్ వేసుకొని, కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తే సరిపోతుందని అంటోంది. కొత్త వేరియెంట్‌తో ప్రజల్లో వచ్చే సందేహాలకు సమాధానాలిచ్చే ప్రయత్నం కేంద్ర ఆరోగ్య శాఖ చేసింది. అవేంటో చూద్దాం. థర్డ్ వేవ్ వస్తుందా ? ఒమిక్రాన్ కేసులు కొన్ని రెట్ల వేగంతో పెరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఈ వేరియెంట్లో తీవ్ర లక్షణాలేమీ కనిపించలేదు. ఇప్పటికే భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతూ ఉండడం, డెల్టా వైరస్ కారణంగా యాంటీ బాడీలు అత్యధికుల్లో వృద్ధి చెందాయని సెరో సర్వేల్లో తేలడంతో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉండే అవకాశాలే ఉన్నాయి. అయితే ఈ విషయం ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనాకి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ పాటించాలి. మాస్కు కచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోకపోతే తప్పనిసరిగా వేయించుకోవాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లడం మానాలి. గాలి , వెలుతురు ధారాళంగా ఉండేలా చూసుకోవాలి. ఒమిక్రాన్‌పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పని చేస్తాయా ? ప్రస్తుతం లభిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియెంట్‌ని అడ్డుకోలేవని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవు. వైరస్ కొమ్ము జన్యువుల్లో చోటు చేసుకున్న కొన్ని మార్పుల కారణంగా టీకా సామర్థ్యం తగ్గే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే వ్యాక్సిన్లు వేసుకున్న వారు, కరోనా సోకిన వారిలో ఏర్పడిన యాంటీబాడీలతో కణజాలంలో ఏర్పడే రోగనిరోధక శక్తి ఇంకా కొనసాగుతుంది. అయితే వ్యాధి తీవ్రతని తగ్గించడానికి తప్పనిసరిగా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఒమిక్రాన్ ఎంత ఆందోళనకరం ? వైరస్‌లో వస్తున్న మార్పులు, ఎంత వేగంతో వ్యాప్తి చెందుతుంది, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడం, రీ ఇన్ఫెక్షన్లు వంటివాటిపై అంచనాలన్నింటినీ క్రోడీకరించి ఈ వైరస్‌ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. కరోనా వైరస్ ఉన్నంతకాలం జన్యుమార్పులు, కొత్త రూపాంతారితాలు పుట్టుకురావడం సాధారణంగా జరిగేదే. సాధారణంగా వేరియెంట్లలో ఎక్కువ శాతం ప్రమాదకరం కాదు. ఎక్కువజన్యు మార్పులు జరిగిన వైరస్ బలహీన పడుతుంది. ఒమిక్రాన్ ఆ కోవలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
Omicron Variant: మళ్లీ ఆంక్షల చట్రంలోకి.. మరిన్ని దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి
లండన్, జోహెన్నెస్‌బర్గ్, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్(బి.1.1.529) కేసులు పలు దేశాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా బ్రిటన్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఇజ్రాయెల్‌లో కేసులు నిర్ధారణయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో బ్రిటన్‌లో ముగ్గురికి, ఆస్ట్రేలియాలో ఇద్దరికి, జర్మనీలో ఇద్దరికి, ఇటలీ, ఇజ్రాయెల్, బెల్జియంలలో ఒక్కొక్కరికీ ఈ వేరియెంట్ సోకిందని పరీక్షల్లో తేలింది. ఇక దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్‌కు వచ్చిన ప్రయాణికుల్లో 61 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణైతే వారిలో 13 మందికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకిందని అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి ఖతర్ ఎయిర్వేస్ విమానంలో సిడ్నీకి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకిందని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. డెల్టా కంటే శరవేగంగా ఈ వేరియెంట్ కేసులు వ్యాపిస్తూ ఉండడంతో భయాందోళనలకు లోనైన 18 దేశాలు దక్షిణాఫ్రికా నుంచి రాకపోకల్ని నిలిపివేశాయి. ఇజ్రాయెల్ తమ దేశాల సరిహద్దుల్ని మూసేసింది. ఆఫ్రికాలోని 50 దేశాల నుంచి రాకపోకల్ని నిషేధించింది. యూకేలో మళ్లీ మాస్కులు ఇంగ్లాండ్‌లో మంగళవారం నుంచి దుణాకాలు, వ్యాపారసముదాయాలు, ప్రజారవాణా వ్యవస్థల్లో మంగళవారం నుంచి మళ్లీ మాస్కులు ధరించడం తప్పనిసరి చేయనున్నారు. యూకేకు వచ్చే విదేశీ ప్రయాణీకులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులను తప్పనిసరి చేస్తామని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావేద్ ఆదివారం వెల్లడించారు. మొరాకో సోమవారం నుంచి రెండువారాల పాటు తమ దేశంలోకి వచ్చే విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రపంచానికి త్వరితంగా వెల్లడిస్తే శిక్షిస్తారా? ఒమిక్రాన్ వేరియెంట్ ఎంత ప్రమాదకరమో ఇంకా నిర్ధారణ కాకుండానే అంతర్జాతీయ సమాజం రవాణా ఆంక్షలు విధించడంపై దక్షిణాఫ్రికా ఆవేదన వ్యక్తం చేస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికుల్ని రానివ్వకపోవడం అత్యంత క్రూరమైన చర్యని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాము ఎంతో ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించి కొత్త వేరియెంట్‌ని కనుగొనడం తమకు శిక్షగా మారిందని అంటోంది. ‘‘సైన్స్ అద్భుతం చేస్తే ప్రశంసించాలి కానీ శిక్షించకూడదు’’ అని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ‘రిస్క్’ ఉన్న దేశాల నుంచి వస్తే... ఆర్టీ–పీసీఆర్ ఫలితాలొచ్చాకే ఇంటికి న్యూఢిల్లీ: ‘రిస్క్’ దేశాల నుంచి (ఒమిక్రాన్ జాడలు బయటపడుతున్న దేశాలు) లేదా వాటిమీదుగా వస్తున్న ప్రయాణికులు అందరూ భారత్‌లో దిగగానే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని, పరీక్షల ఫలితాలు వచ్చేదాకా వారు విమానాశ్రయంలోనే వేచి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ట్రాన్సిట్‌లో ఉన్న వారు కూడా పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే... తదుపరి ప్రయాణం నిమిత్తం విమానాల్లోకి బోర్డింగ్ కావొచ్చని తెలిపింది. సురక్షిత జాబితాలోని దేశాల నుంచి వచ్చే వారు ఇళ్లకు వెళ్లడానికి అనుమతిస్తారని, అయితే 14 రోజుల పాటు వీరు స్వీయ ఆరోగ్యపరిరక్షణ చూసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముప్పులేని దేశాల నుంచి వచ్చేవారిలోనూ ఐదుశాతం మందిని యాదృచ్ఛికంగా ఎంపిక చేసి విమానాశ్రయంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ఆరోగ్యోశాఖ వెల్లడించింది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపింది. కాగా ఈ నెల 24వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి వచ్చిన ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒమిక్రాన్ వేరియెంటో, కాదో తేల్చుకోవడానికి అతని శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ రక్షణను ఏమార్చొచ్చు: గులేరియా ‘‘ఒమిక్రాన్ వేరియెంట్ వైరస్ కొమ్ములో 30 పైచిలుకు జన్యుపరమైన మార్పులున్నట్లు సమాచారం. ఫలితంగా ఇది రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోగలదు. కాబట్టి ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తాయనేది (ఈ వేరియెంట్ నుంచి ఎంతమేరకు రక్షణ కల్పిస్తాయనేది) నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది’’ అని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. వైరస్ పైనుండే కొమ్ముల ద్వారానే కరోనా ఆతిథ్య కణంలోకి ప్రవేశించి అక్కడ వృద్ధి చెందుతుందనే విషయం తెలిసిందే. ‘ఎక్కువమటుకు వ్యాక్సిన్లు స్పైక్ ప్రొటీన్ (వైరస్‌పై నుంచే కొమ్ములకు)లకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీలను తయారుచేయడం ద్వారా రక్షణ కల్పిస్తాయి. అలాంటి స్పైక్ ప్రొటీన్‌లో పెద్దసంఖ్యలో జన్యుపరమైన మార్పులుంటే యాంటీబాడీలు వాటిని అంత సమర్థంగా అడ్డుకోలేకపోవచ్చు’ అని గులేరియా పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌పై ఎంత సమర్థంగా పనిచేస్తాయనేది పరిశోధించి నిర్ధారించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ ముప్పు అన్ని దేశాలకు పొంచి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచడం, కరోనా పరీక్షలు ఎక్కువ చేయడం, కరోనా హాట్‌స్పాట్‌ల్లో నిరంతర పర్యవేక్షణ, ఆస్పత్రుల్లో సదుపాయాలను పెంచడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేయడం, ప్రజలందరూ కోవిడ్–19 నిబంధనల్ని తుచ తప్పకుండా పాటించడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆదివారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్, బోస్ట్వానా నుంచి వచ్చే ప్రయాణికుల్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయాలని, అందరికీ కరోనా పరీక్షలతో పాటు ఏ వేరియెంట్ సోకిందో తెలిసే వరకు క్వారంటైన్లో ఉంచాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కరోనా వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించానికి ఏర్పాటు చేసిన ఇన్సాకాగ్ ల్యాబొరేటరీకి శాంపిల్స్ పంపాలన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించకుండా వైరస్ ఎంతవరకు వ్యాప్తి చెందిందో తెలుసుకోవడం కష్టమవుతుందన్నారు. 5శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు ఉండేలా రాష్ట్రాలన్నీ చర్యలు చేపట్టాలన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్ అన్న విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి అన్ని రాష్ట్రాలు కృషి చెయ్యాలన్నారు. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్: టీకా సర్టిఫికేట్, క్వారంటైన్ తప్పనిసరి
ముంబై: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త వేరియంట్ కట్టడి కోసం రాష్ట్రాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ విధించింది. అవేంటంటే.. (చదవండి: Omicron: న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం) 1. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తప్పక పాటించాలి. 2. రాష్ట్రానికి వచ్చే దేశీయ ప్రయాణికులు తప్పనసరిగా టీకా రెండు డోసులు తీసుకుని ఉండాలి. లేదా.. 72 ముందు చేసిన పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి. 3. బస్సు, టాక్సీ, ఇతర వాహనాల్లో కోవిడ్ రూల్స్ ఉల్లంఘించినట్లు తెలిస్తే.. డ్రైవర్, కండక్టర్ 500 రూపాయల జరిమానా చెల్లించాలి. 4. బస్సుల్లో ఈ ఉల్లంఘనలు చోటు చేసుకుంటే.. ట్రాన్స్పోర్ట్ యజమాని 1000 రూపాయల జరిమానా చెల్లించాలి. 5. ఏదైనా కార్యక్రమానికి హాజరయ్యే బంధువులు, నిర్వహకులు, సిబ్బంది తప్పనిసరిగా టీకా రెండు డోసులు తీసుకోవాలి. 6. టీకా రెండు డోసులు తీసుకున్న వారికే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లభిస్తుంది. 7. సినిమాల హాళ్లు, ఫంక్షన్ హాల్స్ వంటి వాటిలోకి 50 శాతం మందికి మాత్రమే అనుమతి. 8. దక్షిణాఫ్రికా నుంచి ముంబై విమానాశ్రయానికి వచ్చే వారు తప్పనిసరిగా క్వారంటైన్లోకి వెళ్లాల్సిందే. #COVID19 | Maharashtra Govt issues fresh restrictions & permissions. All travellers into state from any int'l destination shall be governed by directions of Govt of India in this respect. Domestic travellers shall either be fully vaccinated or carry RT-PCR test valid for 72 hrs. pic.twitter.com/rSQBik6aPQ — ANI (@ANI) November 27, 2021 తెలంగాణలో... ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఆదివారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ కానున్నారు. చదవండి: ఒకే చోట 281 కేసులు.. లాక్డౌన్ విధిస్తారా?! డబుల్ డోస్ వ్యాక్సిన్.. అయినా 66 మందికి సోకిన కరోనా! -
ఇన్వెస్టర్ సర్వీస్ సపోర్ట్.. మార్గదర్శకాలను సరళీకరించిన సెబీ
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సర్వీసుల అభ్యర్థనలను ప్రాసెస్ చేయడంలో నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సరళీకరించింది. తద్వారా రిజిస్ట్రార్, షేరు బదిలీ ఏజెంట్(ఆర్టీఏ)గా వ్యవహరించే సంస్థల సులభ వ్యాపార నిర్వహణకు వీలు కల్పించింది. అంతేకాకుండా ఫిజికల్ సెక్యూరిటీస్ కలిగిన వాటాదారులు పాన్, కేవైసీ, నామినేషన్ వివరాలు అందించడంలోనూ మార్గదర్శకాలను జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి తాజా నిబంధనలు అమలుకానున్నాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి సంబంధిత డాక్యుమెంట్లలో ఏ ఒక్కటి లేకున్నా ఆర్టీఏలు ఇన్వెస్టర్ల ఫోలి యోలను నిలిపివేసేందుకు వీలుంటుంది. డాక్యుమెంట్లు లభించాక మాత్రమే తిరిగి యాక్టివేట్ చేసేందుకు అధికారం లభిస్తుంది. ఇన్వెస్టర్లు 2022 మార్చి 31కల్లా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. -
దుర్ఘటన జరిగితే సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: పురపాలికల పరిధిలో జరిగే అభివృద్ధి, నిర్వహణ, మరమ్మతు పనుల వర్క్సైట్లలో ఇటీవల వరుస దుర్ఘటనలు జరిగి ప్రాణనష్టం సంభవించడం పట్ల రాష్ట్ర పురపాలక శాఖ సీరియస్ అయింది. ఏదైనా ఘటన జరిగి ప్రాణనష్టం సంభవించినా, ఎవరైనా గాయాలపాలైనా.. అందుకు కారణమైన క్షేత్రస్థాయి సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. వీరితో సహా సంబంధిత కాంట్రాక్టర్/నిర్మాణ సంస్థ అధిపతిపై క్రిమినల్ చర్యలు కేసులు పెట్టాలని మున్సిపల్ కమిషనర్లను కోరింది. హైదరాబాద్‌లో ఇటీవల రాత్రి వేళలో నిబంధనలకు విరుద్ధంగా మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికులు గల్లంతై మరణించడం.. అభివృద్ధి పనుల కోసం తీసిన గుంతలను పూడ్చకపోవడంతో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు వాటిలో పడి మృతి చెందడం వంటి ఘటనలు జరిగాయి. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘటనలు జరిగినట్లు పురపాలక శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో వర్క్సైట్లలో తీసుకోవాల్సిన రక్షణ చర్యల విషయంలో మార్గదర్శకాలను ప్రకటిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతిమ బాధ్యత కమిషనర్లదే.. : పురపాలికలు రోజువారీగా చేపట్టే నీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ క్లీనింగ్, వీధి దీపాలు వంటి పనులతో పాటు ఫ్లై ఓవర్ల నిర్మాణం వరకు అన్ని రకాల పనుల సైట్లలో పౌరులు/కార్మికులు/ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అభివృద్ధి, నిర్వహణ పనులు కాంట్రాక్టర్లు చేస్తున్నా, దీనిని సాకుగా తీసుకుని సిబ్బంది, విభాగాధిపతులు రక్షణ చర్యల పట్ల నిర్లక్ష్యం చేయరాదన్నారు. పురపాలికల పరిధిలోని వర్క్సైట్ల వద్ద అంతిమంగా రక్షణ బాధ్యత మున్సిపల్ కమిషనర్లదేనని స్పష్టం చేశారు. తవ్వకాలు జరిపేటప్పుడు కనీసం 1.5 మీటర్ల ఎత్తుతో బారికేడ్లు ఏర్పాటు చేసి వాటికి ఎల్ఈడీ లైట్లు బిగించాలని, ప్రజలను అప్రమత్తం చేసేందుకు 100 మీటర్ల దూరంలోనే డేంజర్ సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో సూచించారు. -
E- చలాన్లపై కొత్త మార్గదర్శకాలు జారీ
-
రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై ఆంక్షల్లేవ్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై కేంద్రం ఎలాంటి ఆంక్షలు సిఫారసు చేయలేదు. క్వారంటైన్, ఐసోలేషన్‌లకు సంబంధించి రాష్ట్రాలు సొంత ప్రొటోకాల్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించింది. కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ప్రవేశాలకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు కావాలని కోరుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. సెకండ్‌వేవ్‌లో దేశవ్యాప్తంగా కేసులు క్షీణిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని అంతర్ రాష్ట్ర ప్రయాణాలు సులభతరం చేసే ఉద్దేశంతో తగిన జాగ్రత్తలు పాటిస్తూ దేశీయ ప్రయాణాలకు ఒకే తరహా ప్రోటోకాల్ ఉండేలా దేశీయ ప్రయాణ (రైలు, బస్సు , విమానం) మార్గదర్శకాలు సవరిస్తున్నట్లు తెలిపింది. ఈ మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తాయని, తద్వారా అంతర్ రాష్ట్ర ప్రయాణాలు సులభతరం చేస్తుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ పేర్కొంది. ప్రయాణాల్లో పాటించాల్సిన ఆరోగ్య ప్రొటోకాల్ ► ప్రయాణాల సమయంలో ప్రయాణికులు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. కోవిడ్–19 లక్షణాలు లేనప్పుడే ప్రయాణం చేయాలి. ► ప్రయాణికులు మాస్క్, ఫేస్ కవర్, ఆరు అడుగుల భౌతికదూరం పాటిం చాలి. ► ప్రయాణ సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ► మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ తప్పనిసరిగా చేసుకోవాలి. ► ప్రయాణ సమయంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చినట్లైతే విమాన/బస్సు/రైలు సిబ్బందికి తెలియజేయాలి. ► గమ్యస్థానం చేరిన తర్వాత లక్షణాలు కనిపిస్తే జిల్లా నిఘా అధికారి లేదా జాతీయ కాల్ సెంటర్ 1075కు తెలపాలి. విమానాశ్రయాలు/రైల్వే స్టేషన్లు/బస్ స్టేషన్లకు సూచనలు ► కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రకటన చేయాలి ► థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే ప్రయాణికులను అనుమతించాలి. వెలుపలికి పంపాలి. ► ప్రయాణ సమయంలో వినియోగించిన మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు పారవేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. ► విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు తరచుగా శుభ్రపరచాలి. ► లక్షణాలు లేని వారు 14 రోజులపాటు స్వీయ పరిరక్షణ హామీతో బయటకు వెళ్లడానికి అనుమతించాలి. ► ఒకవేళ లక్షణాలు బయటపడితే వారిని ఆరోగ్య కేంద్రాలకు తరలించడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. ► ప్రయాణికులకు అందుబాటులో మాస్కులు, పీపీఈకిట్లు, గ్లౌజులు ఉంచాలి. రాష్ట్రాలకు సూచనలు ► రైలు, రహదారి, విమానయానం, నీటి మార్గాల ద్వారా అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ► ఒకవేళ రాష్ట్రంలో ప్రవేశించాలంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని నిబంధన పెడితే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలి. ► రెండు డోసుల టీకా తీసుకున్నవారు, రెండో డోసు తీసుకున్నా ధ్రువపత్రం ఇంకా అందని వారు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వారిని ఆర్టీపీసీఆర్ పరీక్ష నుంచి మినహాయించాలి. ► ప్రయాణం తర్వాత లక్షణాలు కనిపిస్తే వారికి రాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయడానికి ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాలి. ► స్థానిక ప్రయోజనాల నిమిత్తం రాష్ట్రాలు అవసరమైతే అదనంగా ఆంక్షలు విధించొచ్చు. -
శునకాలతో వాకింగా?.. ఈ రూల్స్ తప్పనిసరి
సాక్షి, బెంగళూరు: పెంపుడు కుక్కలను యజమానులు రోడ్ల మీద, పార్కులకు, చెరువు గట్లకు వాకింగ్‌కు తీసుకెళ్లడం, అవి ఇతరుల మీద పడి కరవడం, ఆ తరువాత గొడవలు జరగడం వంటివి తరచూ సంభవిస్తున్నాయి. ఈ తరహా గొడవలకు అడ్డుకట్ట వేసేలా బెంగళూరు పాలికె కొత్తగా 7 నిబంధనలను జారీచేసింది. ఈ నిబంధనలు తప్పనిసరి.. పెంపుడు కుక్కలకు రేబీస్ వ్యాక్సిన్ తప్పనిసరి. వాటిని ఎప్పుడు పడితే అప్పుడు వాకింగ్‌కు వెళ్లరాదు. నిర్ణీత సమయంలోనే తీసుకెళ్లాలి. చెరువుల వద్ద వాకింగ్ చేసేటప్పుడు కుక్కల నోటికి బుట్టను అమర్చాలి. బయట వాకింగ్ సమయంలో కుక్కలు కాలకృత్యాలు చేస్తే యజమాని శుభ్రపరచాలి. లేదంటే రూ.500 జరిమానా కట్టాలి. చెరువుల వద్ద వాకింగ్ సమయంలో వాటికి ఆహారం వేయరాదు. రాట్‌వీలర్, జర్మన్ షెఫర్డ్స్, పిట్‌బుల్, డాబర్‌మేన్, గ్రేట్‌డేన్ శునకాలను చెరువుల వద్దకు తీసుకు రాకూడదు. వాగ్వాదాలు పెరగడం వల్లనే.. నగరంలో శునకాలను పెంచుకోవడం ప్రతిష్టకు చిహ్నంగా మారింది. ఎంత ఖరీదైన కుక్క ఉంటే అంత గొప్పగా భావిస్తారు. తమతో పాటు వాకింగ్‌కు వెంట కుక్కలను తీసుకెళ్లడం ఫ్యాషన్‌గా మారింది. అనేక ఏళ్లు నుంచి ప్రజలు, పెంపుడు కుక్కల యజమానుల మధ్య గొడవలు ఏర్పడుతున్నాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని బీబీఎంపీ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది. చదవండి: Chennai: అదే జరిగితే మరో 80 ఏళ్లలో చెన్నై, తూత్తుకుడి.. -
పెద్దల ఔషధాలు పిల్లలకు వద్దు
న్యూఢిల్లీ: కోవిడ్–19 చికిత్సలో భాగంగా పెద్దలకు ఇస్తున్న కొన్నిరకాల ఔషధాలను పిల్లలకు కూడా ఉపయోగిస్తున్నారని, ఇలా చేయడం సరైంది కాదని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా మూడో వేవ్‌లో పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో చిన్నారుల కోవిడ్–కేర్ సేవల విషయంలో బుధవారం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఐవర్‌మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఫావిపిరావిర్ వంటి డ్రగ్స్, డాక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్‌ను పిల్లలకు ఇవ్వొద్దని ప్రతిపాదించింది. వీటిని కరోనా బారినపడిన పెద్దల కోసమే ఉపయోగించాలని గతంలోనే సూచించినట్లు గుర్తుచేసింది. వైరస్ సోకిన పిల్లలకు చికిత్స అందించడంలో అలసత్వం పనికిరాదని, తగిన మౌలిక సదుపాయాలను ఇప్పటినుంచే ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పుడున్న సదుపాయాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని తెలిపింది. ఎలాంటి అనూహ్య పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు ► ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు కరోనా సులభంగా సోకే ప్రమాదం ఉంది. అందుకే పిల్లలకు సైతం కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక అలాంటివారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ► కరోనా చికిత్సలో పెద్దలకు ఉద్దేశించిన ఔషధాలను పిల్లలపై ప్రయోగించకూడదు. వాటిని పిల్లల కోసం సిఫార్సు చేయలేదు. ► భవిష్యత్తులో కరోనా పాజిటివ్ కేసులు పెరిగితే.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసికట్టుగా పనిచేయాలి. ► లాక్డౌన్లు పూర్తిగా ఎత్తివేశాక, పాఠశాలలు, కళాశాలలు మళ్లీ తెరిచాక ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఉమ్మడిగా ఎదుర్కోవాలి. ► జిల్లాల్లో కరోనా సెకండ్ వేవ్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు నమోదైన రోజువారీ కేసుల ఆధారంగా థర్డ్‌వేవ్‌లో ఎంతమంది పిల్లలకు కరోనా సోకనుందో, వారిలో ఎంతమంది ఆసుపత్రుల్లో చేరుతారో అంచనాకు రావొచ్చు. దీనిప్రకారం కరోనా బాధిత పిల్లల సంరక్షణ కోసం ఆసుపత్రుల్లో అదనపు పడకలు ఏర్పాటు చేయాలి. ► సుశిక్షితులైన వైద్యులు, నర్సులను నియమించుకోవాలి. వైద్య సిబ్బంది విషయంలో కొరత రాకుండా జాగ్రత్తపడాలి. ► పిల్లల ఆసుపత్రుల్లో కరోనా బాధిత చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుండాలి. పిల్లలకు కరోనా చికిత్స అందిస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులను కూడా అనుమతించవచ్చు. ► పిల్లలకు కరోనా సోకినప్పటికీ చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కొందరిలో స్వల్ప లక్షణాలే బయటపడుతున్నాయి. ఇలాంటివారు ఇంట్లోనే తల్లిదండ్రుల సంరక్షణలోనే కోలుకుంటున్నారు. లక్షణాలున్న పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు భావిస్తే ఆసుపత్రికి తరలించాలి. ► ఇంట్లో చికిత్స పొందుతున్న కరోనా బాధిత చిన్నారులకు ఆశా వర్కర్ల సేవలు అవసరం. -
టీకా కేటాయింపుల్లో తెలంగాణకు ప్రాధాన్యత తగ్గే అవకాశాలు..!
సాక్షి, హైదరాబాద్: టీకా కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ పంపిణీకి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ మేరకు సవరించిన మార్గదర్శకాలను మంగళవారం జారీ చేసింది. నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల జనాభా, పాజిటివ్ కేసుల సంఖ్య, వ్యాక్సిన్ల వృథా వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలిపింది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ముందుగా వ్యాక్సినేషన్ చేయించే ఆలోచన కనిపిస్తోంది. రాష్ట్రంలో పాజిటివిటీ 1.5% కంటే తక్కువే ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాప్తి అత్యంత తక్కువగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రోజువారీగా చేస్తున్న పరీక్షలను బట్టి చూస్తే పాజిటివిటీ రేటు 1.5 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు వైద్యశాఖ ప్రకటిస్తోంది. అంటే కొన్ని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తీవ్రత తక్కువగా ఉంది. ఇది వ్యాక్సిన్ కేటాయింపులపై ప్రభావం చూపించే అవకాశం ఉందని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కరోజులో 1.66 లక్షల టీకాల పంపిణీ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల వరకు మొత్తం 69,36,590 టీకాలు పంపిణీ చేశారు. ఇక సోమవారం ఒక్కరోజు 1,66,818 మందికి టీకాలు ఇవ్వగా.. మొదటి డోసు 1,54,208, రెండో,డోసు 12,610 మంది ఉన్నారు. వీరిలో హైరిస్క్ కేటగిరీకి చెందిన వారు 1,28,460 మంది ఉన్నట్లు వైద్య శాఖ వివరించింది. చదవండి: Coronavirus: ‘ఐరిస్’తో వ్యాపిస్తుందా? -
కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం నూతన మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. జాతీయ టీకా కార్యక్రమానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. జూన్ 21లోపు రెండు వారాల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. జనాభా, కరోనా కేసులను బట్టి రాష్ట్రాలకు టీకాలను కేటాయించనున్నట్టు వెల్లడించింది. టీకాల వృథాను బట్టి రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయింపుల్లో కోత విధిస్తామని కేంద్రం పేర్కొంది. అన్ని ఆస్పత్రులకు సమానంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించింది. ప్రైవేట్ ఆస్పత్రులకు కావాల్సిన డోసుల వివరాలను రాష్ట్రాలే ఇవ్వాలని తెలిపింది. పేదలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా వేయించుకోవడం కోసం ఈ-వోచర్లు ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొంది. ఇక కోవిడ్-19 వ్యాక్సిన్ల సేకరణ, వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: సువేందు అధికారి ఢిల్లీ పర్యటన.. కారణం ఇదేనా!) -
కరోనా బాధిత బాలలను కాపాడుకుందాం
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి వల్ల ప్రభావితులైన చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూచించింది. కరోనా బాధిత బాలల రక్షణపై తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు శాఖ, పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. కరోనా వల్ల దేశంలో ఇప్పటిదాకా 9,346 మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని పోగొట్టుకున్నారని, వీరిలో 1,700 మంది బాలలు ఇద్దరినీ కోల్పోయారని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసిందని గుర్తు చేసింది. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మార్గదర్శకాలు ► కోవిడ్‌తో ప్రభావితులైన చిన్నారులను సర్వేల ద్వారా గుర్తించాలి. ప్రతి ఒక్క చిన్నారి సమగ్ర సమాచారాన్ని సేకరించాలి. ఆ అవసరాలను ట్రాక్ చైల్డ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ► తల్లిదండ్రులిద్దరూ కరోనా బారినపడితే వారి పిల్లలను తాత్కాలికంగా శిశు సంరక్షణ కేంద్రాల్లో చేర్పించాలి. ఆలనాపాలనా చూసేవారు లేకపోతే సాయం అందజేయాలి. ► శిశు సంరక్షణ పథకాల కింద బాధిత పిల్లల పునరావాసం కోసం వెంటనే తాత్కాలిక ఏర్పాట్లు చేయాలి. ► శిశు సంరక్షణ కేంద్రాల్లో కరోనా సోకిన చిన్నారులకు అక్కడే ఐసోలేషన్ గదులు సిద్ధం చేయాలి. ► పిల్లలో మానసిక సమస్యలు తలెత్తకుండా సైకాలజిస్టుల కౌన్సెలింగ్ ఇప్పించాలి. ► కరోనా వల్ల అనాథలుగా మారిన బాలలలకు జిల్లా కలెక్టర్లు సంరక్షకులుగా వ్యవహరించాలి. ► బాధిత బాలల అవసరాలను గుర్తించి, వాటిని తీర్చేందుకు, ప్రభుత్వం అందజేసే ప్రయోజనాలను వారికి చేరవేసేందుకు కలెక్టర్లు ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ► కరోనా వల్ల తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలైన పిల్లల ఆస్తులు పరులపాలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదే. ఇందుకోసం రిజిస్ట్రేషన్, రెవెన్యూ విభాగం సేవలు ఉపయోగించుకోవాలి. ► బాధిత పిల్లలపై వేధింపులు, వారి అక్రమ రవాణా, అక్రమ దత్తత, బాల్య వివాహాలు, బాల కార్మికులుగా మారడంపై పోలీసు శాఖ నిరంతరం దృష్టి పెట్టాలి. -
కోవిడ్–19 చికిత్సకు నూతన విధానాలు: రెడ్డీస్
న్యూఢిల్లీ: ఫార్మా రంగ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కోవిడ్–19 చికిత్సకు నూతన విధానాలను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. కొన్ని నెలల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. మహమ్మారి చికిత్సలో ఉపయోగించే ఔషధాల సరఫరాలో ఎటువంటి ఆటంకం ఉండబోదని స్పష్టం చేసింది. రెమ్‌డెసివిర్‌తోసహా పలు ఔషధాల సరఫరాను డిమాండ్‌కు తగినట్టు పెంచామని వివరించింది. ‘సాధ్యమైన అన్ని మార్గాల్లో, అత్యంత ఆవశ్యకతతో రోగులకు సేవ చేయాలని నిర్ణయించాం. కోవిడ్–19 చికిత్సకు కావాల్సిన నివారణ ఔషధాల అభివృద్ధి, వాణిజ్యీకరణకై వివిధ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం’ అని డాక్టర్ రెడ్డీస్ కో–చైర్మన్, ఎండీ జి.వి.ప్రసాద్ తెలిపారు. భారత్‌లో తొలి 25 కోట్ల డోసుల స్పుత్నిక్–వి వ్యాక్సిన్ విక్రయాలకు తమకు హక్కులు ఉన్నాయని కంపెనీ సీఈవో ఇరెజ్ ఇజ్రాయెలీ వెల్లడించారు. అన్నీ అనుకూలిస్తే 12 నెలల్లో ఈ డోసులను సరఫరా చేస్తామని చెప్పారు. -
ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోండి ఇలా..
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా సొంతంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకునేలా పుణేకు చెందిన మైలాబ్ సంస్థ రూపొందించిన ‘కోవి సెల్ఫ్’ టెస్ట్ కిట్‌కు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గురువారం ఆమోద ముద్ర వేసింది. రూ.250కి లభ్యమయ్యే ఈ కిట్ ద్వారా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు (ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్) వైద్య నిపుణుల సహాయం లేకుండానే సొంతంగా పరీక్షించుకోవచ్చు. సొంతంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఎలా చేసుకోవాలనే విషయంపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని వీడియో రూపంలో అందుబాటులోకి తెచి్చంది. ‘కోవి సెల్ఫ్’ టెస్ట్ కిట్ యూజర్ మ్యాన్యువల్‌లో కూడా కిట్‌ను ఎలా ఉపయోగించొచ్చనే సూచనలు ఉంటాయి. కోవిడ్ లక్షణాలు ఉన్న వారితో పాటు కోవిడ్ రోగులను కలిసిన వారు ఈ కిట్‌ను ఉపయోగించాలి. ముక్కులో నుంచి నమూనాలు తీసుకుని ఈ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పాజిటివ్‌గా తేలితే మళ్లీ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు. పరీక్షలు ఇలా చేసుకోవాలి.. ఈ కిట్‌ను ఉపయోగించే వారు మొదట ‘కోవి సెల్ఫ్’ యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలి. పరీక్ష చేసుకోవడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కుని తడిలేకుండా చూసుకోవాలి. కోవిసెల్ఫ్ కిట్‌లో 3 విడి భాగాలు ఉంటాయి. నాసల్ స్వాబ్ (ముక్కులో నుంచి శాంపిల్ తీసుకునేందుకు), శాంపిల్ తీసిన తర్వాత స్వాబ్‌ను పెట్టేందుకు ఉపయోగించే ఒక చిన్న ట్యూబ్, టెస్ట్ కార్డు (పరీక్ష ఫలితాన్ని తెలిపేది) ఉంటాయి. నాసల్ స్వాబ్‌ను ముక్కు రంధ్రాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపల వరకు పెట్టుకుని కనీసం 5 సార్లు తిప్పాలి. ప్రత్యేక ద్రవంతో కూడిన ట్యూబ్‌ను తెరిచి ఈ స్వాబ్ తలభాగాన్ని అందులో మునిగేలా పెట్టి 10 సార్లు తిప్పాలి. స్వాబ్‌ను విరగ్గొట్టిన తర్వాత ట్యూబ్‌కు మూత పెట్టి, దాన్ని నెమ్మదిగా ఒత్తుతూ ట్యూబ్ మూతలోని రంధ్రం ద్వారా రెండు చుక్కలను టెస్ట్ కార్డు చివరలో ఉండే చిన్న గుంతలాంటి భాగంలో వేయాలి. కిట్‌ను ఉపయోగించేవారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత టెస్ట్ కార్డు ఫోటో తీసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మొబైల్ యాప్‌లో ఫలితం కనిపిస్తుంది. 20 నిమిషాల తర్వాత కనిపించే ఫలితాన్ని ఇన్‌వ్యాలిడ్‌గా భావించాలి. ఈ ఫలితాన్ని ఐసీఎంఆర్ కోవిడ్ టెస్టింగ్ పోర్టల్‌లో భద్రపరుస్తారు. పాజిటివ్‌గా తేలితే కోవిడ్ నిబంధనల మేరకు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. చదవండి: కరోనా.. తెల్లారితే కూతురు పెళ్లి.. అంతలోనే తండ్రి చదవండి: పాపం! అయినా అమ్మ దక్కలేదు.. -
కరోనా సంక్రమణపై కేంద్రం నూతన అడ్వైజరీ జారీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన భయాందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు, మహమ్మారిని అణచివేయడానికి ప్రతీ ఒక్కరు మాస్క్‌లు ధరించడంతో పాటు సామాజిక దూరాన్ని పాటించడం, శానిటేషన్ చేసుకోవడం, వెంటిలేషన్ ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించగలుగుతామని కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ విజయ్ రాఘవన్ కార్యాలయం నుంచి విడుదల చేసిన మార్గదర్శకాల్లో తెలిపారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి గాలి పీల్చడం, మాట్లాడటం, పాడటం, నవ్వడం, దగ్గు లేదా తుమ్ము మొదలైన వాటిలో బిందువులు (డ్రాప్లెట్స్), ఏరోసోల్స్ రూపంలో విడుదలయ్యే లాలాజలం వైరస్ వ్యాప్తికి ప్రా«థమిక లక్షణమని తెలిపారు. లక్షణాలు కనిపించని కరోనా సోకిన వ్యక్తి కూడా వైరస్‌ను వ్యాపిస్తాడని వివరించారు. లక్షణాలు లేని వ్యక్తులు వైరస్ వ్యాప్తి చెందించే అవకాశం ఉన్నందున ప్రజలు రెండు మాస్క్‌లు ధరించడం కొనసాగించాలని, లేదా ఎన్–95 మాస్క్ ధరించాలని సూచించారు. వైరస్ ఒక వ్యక్తికి సోకిన తరువాత అనేకమందికి వ్యాపించే ప్రమాదం ఉంటుందని అందువల్ల వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తి కావడాన్ని ఆపివేయడం వలన వ్యాధి సంక్రమణ రేటు తగ్గుతుందని తెలిపారు. దీనికి ప్రతీ ఒక్కరి సహకారం అవసరమని, మాస్క్‌లు, వెంటిలేషన్, సామాజికదూరం, శానిటేషన్ ద్వారా వైరస్‌పై చేస్తున్న పోరాటంలో గెలవవచ్చని అడ్వైజరీలో తెలిపారు. వెంటిలేషన్‌తో తగ్గనున్న వ్యాప్తి.. ముఖ్యంగా వైరస్ గాలిలో 10 మీటర్ల వరకు వ్యాప్తి చెందుతుందని కరోనా సంక్రమణపై ప్రభుత్వం తెలిపింది. వైరస్ సోకిన వ్యక్తి డాప్లెట్స్ 2 మీటర్ల వరకు వ్యాప్తి చెందగా, ఏరోసోల్, డ్రాప్లెట్స్ కంటే 5 రెట్లు ఎక్కువ వ్యాపిస్తుందని సూచించారు. కరోనా లక్షణాలు లేని వ్యక్తులు కూడా సంక్రమణ వ్యాప్తి చెందుతారని తెలిపారు. అందువల్ల ప్రజలు కరోనా ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలన్నారు. మరోవైపు వెంటిలేషన్ చాలా తక్కువగా ఉన్న ఇళ్లు, కార్యాలయాల్లో వెంటిలేషన్ పెంచడం వల్ల వైరల్ ప్రభావాన్ని బాగా తగ్గించడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయని అడ్వైజరీలో ప్రస్తావించారు. వెంటిలేషన్ కారణంగా వైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపింది. కిటికీలు, తలుపులు తెరవడం, ఎగ్జాస్ట్ వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా గాలిలో పేరుకుపోయిన వైరస్ పలుచపడి, ప్రసార ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. వెంటిలేషన్ మెరుగుపరచడానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర ప్రాధాన్యతతో తీసుకోవాలని సూచించారు. క్రాస్ వెంటిలేషన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వ్యాధి వ్యాప్తిని తగ్గించగలుగుతాయన్నారు. కార్యాలయాలు, ఆడిటోరియంలు, షాపింగ్ మాల్స్ మొదలైనవాటిలో పైకప్పు వెంటిలేటర్లను వాడటం మంచిదని, ఫిల్టర్లను తరచుగా శుభ్రపరచడం, మార్చడం చాలా మంచిదని సూచించారు. రెండు మాస్క్‌లు ధరించాలి... ప్రజలు రెండు మాస్క్‌లను లేదా ఎన్ 95 మాస్క్ ధరించాలని ప్రభుత్వం పేర్కొంది. అవి మరింత ఎక్కువగా వైరస్ బారి నుంచి రక్షిస్తాయి. రెండు మాస్క్‌లు ధరించినట్లయితే, మొదట సర్జికల్ మాస్క్ ధరించాలని, ఆపై దానిపై బిగుతుగా ఉండే కాటన్ మాస్క్ ధరించాలని సూచించారు. ఎవరైనా సర్జికల్ మాస్క్ లేకపోతే, వారు 2 కాటన్ మాస్క్‌లు ధరించాలి. అయితే సర్జికల్ మాస్క్ ఒక్కసారి మాత్రమే వాడాలి. కానీ ఒకవేళ మీరు 2 మాస్క్‌లు ధరిస్తే, మీరు 5 సార్లు సర్జికల్ మాస్క్‌ని ఉపయోగించవచ్చు. అయితే ప్రతిసారి సర్జికల్ మాస్క్ వాడిన తరువాత 7 రోజులు ఎండలో ఉంచాలి. ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ పరీక్ష... ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర ఆరోగ్య కార్యకర్తలకు వేగంగా యాంటిజెన్ పరీక్షలు చేయడానికి శిక్షణ ఇవ్వాలి. ఈ ఆరోగ్య కార్యకర్తలకు ఇప్పటికే వ్యాక్సిన్లు వేసినా సర్టిఫైడ్ ఎన్–95 మాస్క్‌ను, ఆక్సీమీటర్‌ను అందించాలని సూచించారు. ఏరోసోల్ అంటే ఏమిటి..? ఏరోసోల్స్, డ్రాప్లెట్స్కు పరిమాణం తప్ప రెండింటి మధ్య తేడాలేదు. ఐదు మైక్రాన్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే బిందువులను శాస్త్రవేత్తలు ఏరోసోల్స్ అని పిలుస్తారు. -
గోల్డ్ ఎక్స్చేంజీకి మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: పసిడి ట్రేడింగ్‌కు సంబంధించి గోల్డ్ ఎక్సే్చంజీ ఏర్పాటుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విస్తృతమైన మార్గదర్శకాలను ప్రతిపాదించింది. దేశీయంగా స్పాట్ మార్కెట్లో రేట్ల విధానం పారదర్శకంగా ఉండేందుకు ఇవి తోడ్పడనున్నాయి. వీటి ప్రకారం ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ రూపంలో ట్రేడింగ్ ఉంటుంది. 1 కిలో, 100 గ్రాములు, 50 గ్రాములు, కొన్ని నిబంధనలకు లోబడి 10 గ్రాములు, 5 గ్రాముల పసిడిని కూడా ప్రతిఫలించేలా ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్)లో ట్రేడ్ చేయొచ్చు. ఇందుకు సంబంధించిన చర్చాపత్రం జారీ చేయడంతో పాటు వాల్ట్ మేనేజర్లకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను కూడా సెబీ ప్రతిపాదించింది. సెబీ ఇంటర్మీడియరీలుగా వాల్ట్ మేనేజర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భారీ స్థాయిలో బంగారం వినియోగించే భారత్‌లో .. పసిడి ట్రేడింగ్, ఫిజికల్ డెలివరీ మొదలైన వాటన్నింటిలో పారదర్శకత తెచ్చేందుకు ప్రతిపాదిత గోల్డ్ ఎక్సే్చంజ్ తోడ్పడగలదని సెబీ పేర్కొంది. ఈ చర్చాపత్రంపై సంబంధిత వర్గాలు జూన్ 18లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. అసలు ఈజీఆర్‌ల ట్రేడింగ్ కోసం ప్రత్యేకంగా కొత్త ఎక్సే్చంజీ అవసరమా లేక ప్రస్తుతమున్న స్టాక్ ఎక్సే్చంజీలనే ఉపయోగించుకోవచ్చా అన్న అంశంపై కూడా అభిప్రాయాలు తెలపాలంటూ సెబీ కోరింది. మూడు దశలు... సెబీ మార్గదర్శకాల ప్రకారం ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్ ట్రేడింగ్ ప్రక్రియలో మొత్తం మూడు దశలు ఉంటాయి. తొలి దశలో భౌతిక రూపంలోని బంగారానికి సరిసమాన విలువ గల ఈజీఆర్‌ను రూపొందిస్తారు. ఇందుకోసం వాల్ట్ మేనేజర్లు, డిపాజిటరీలు, స్టాక్ ఎక్సే్చంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్ల మధ్య సమన్వయం కోసం ఉమ్మడిగా ఇంటర్ఫేస్ను ఏర్పాటు చేసుకోవచ్చని సెబీ సూచించింది. ఇక రెండో దశలో ఈజీఆర్‌ను ఎక్సే్చంజీలో లిస్ట్ చేస్తారు. దానికి సంబంధించి రోజువారీ సమాచారాన్ని డిపాజిటరీలు.. ఎక్సే్చంజీలకు తెలియజేస్తాయి. లావాదేవీలను క్లియరింగ్ కార్పొరేషన్ సెటిల్ చేస్తుంది. చివరిగా మూడో విడతలో ఈజీఆర్‌ను మళ్లీ భౌతిక బంగారం రూపంలోకి మారుస్తారు. దీన్ని పొందడానికి కొనుగోలుదారు ఈజీఆర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వాల్టుల్లో భౌతిక రూపంలో బంగారం లేకుండా వాల్ట్ మేనేజర్లు.. ఈజీఆర్‌ను రూపొందించడానికి ఉండదు. మరింత మంది ఇన్వెస్టర్లను మార్కెట్లోకి ఆకర్షించే దిశగా స్వల్ప పరిమాణం.. 5 గ్రాములు, 10 గ్రాముల స్థాయిలోనూ ట్రేడింగ్ అనుమతించవచ్చని సెబీ తెలిపింది. అయితే, అంత తక్కువ పరిమాణంలో పసిడి డెలివరీలో ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. లబ్ధిదారు కొనుగోలు చేసిన ఈజీఆర్ కనీసం 50 గ్రాముల దాకా చేరితేనే దాన్ని భౌతిక పసిడి రూపంలోకి మార్చవచ్చని పేర్కొంది. -
గ్రామీణ, గిరిజన ప్రాంతాలపై దృష్టి సారించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నగరాలు, పెద్ద పట్టణాలను వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను, గిరిజన తండాలను సైతం చుట్టేస్తోంది. చిన్నచిన్న పట్టణాల్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పల్లె ప్రజల అవగాహనారాహిత్యం వైరస్ వ్యాప్తికి ఆజ్యం పోస్తోంది. సరైన సమయంలో చికిత్స అందక బాధితులు కన్నుమూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు గ్రామాలు, చిన్న పట్టణాల్లో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం కొత్త మార్గదర్శకాలు, ప్రామాణిక నియమావళిని (ఎస్ఓపీ) జారీ చేసింది. గ్రామాలు, పట్టణాల్లో ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో కరోనా బారినపడినప్పటికీ లక్షణాలు లేనివారి కోసం, హోం ఐసోలేషన్‌లో ఉండడం సాధ్యం కాని బాధితుల కోసం 30 పడకల కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అన్ని ప్రజారోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, హెల్త్ సెంటర్లు, వెల్నెస్ సెంటర్లలో సరిపడా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు (ఆర్ఏటీ) కిట్లు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఈ మార్గదర్శకాల్లో ఇంకా ఏం ప్రస్తావించారంటే... ► శ్వాస, అనారోగ్య సమస్యలతో బాధపడేవారిపై నిఘా పెట్టాలి. కరోనా కేసులు గుర్తించి వారికి ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి. మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించాలి. ► ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించడానికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలకు శిక్షణ ఇవ్వాలి. ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు అందుబాటులో ఉంచాలి. ► లక్షణాలు లేనప్పటికీ కరోనా సోకిన వారిని క్వారంటైన్లో ఉంచాలి. 80 నుంచి 85 శాతం కేసుల్లో లక్షణాలు ఉండట్లేదు. వీరికి ఆసుపత్రి అవసరం లేదు. ఇంట్లో లేదా కరోనా కేర్ సెంటర్లో ఐసోలేషన్ సదుపాయం కల్పించాలి. కుటుంబ సభ్యులూ క్వారంటైన్ పాటించాలి. ► కరోనా రోగులకు పారాసిటమాల్, ఐవెర్‌మెక్టిన్, దగ్గు సిరప్, మల్టీ విటమిన్ల్లతో కూడిన హోం ఐసోలేషన్ కిట్లు అందజేయాలి. ► శ్వాసలో ఇబ్బంది, ఆక్సిజన్ సాచురేషన్ 94 కన్నా తక్కువ, ఛాతీ భాగంలో నొప్పి, మానసిక ఆందోళన ఉన్న వారికి తక్షణమే వైద్య సదుపాయం అందించాలి. ► ఆక్సిజన్ స్థాయి 94 కన్నా తక్కువ ఉన్న వారికి ఆసుపత్రుల్లో బెడ్ల సదుపాయం కల్పించాలి. ► తక్కువ, లక్షణాలు లేని వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు, మోడరేట్ కేసుల వారిని డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్‌కు, తీవ్రంగా ఉన్న కేసులు డెడికేటెడ్ కోవిడ్ ఆసుపత్రులకు పంపాలి. ► కేసుల సంఖ్య, కరోనా తీవ్రత బట్టి కాంటాక్ట్ ట్రేసింగ్ తప్పకుండా చేయాలి. ► పట్టణ శివారు ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేర్ సెంటర్లలో 30 పడకలుండాలి. గిరిజన ప్రాంతాల్లో.... గ్రామీణప్రాంతాలతో పోలిస్తే గిరిజన ప్రాంతా ల్లో అదనపు సవాళ్లు ఉండడంతోపాటు ఆరోగ్య సేవలు తక్కువగా, సామాజికంగా, ఆర్థికంగా భౌగోళికంగానూ దూరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో.... ► ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత గ్రామ సభ తీసుకోవాలి. కోవిడ్–కేర్ కార్యక లాపాల్లోనూ కీలకపాత్ర పోషించాలి. ► మొబైల్ మెడికల్ యూనిట్లు ఏర్పాటు చేసి కోవిడ్‌కేర్ సెంటర్లతో అనుసంధానించాలి. ► ఎంఎంయూల్లో వైద్యాధికారి, ఫార్మాసిస్టు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి. -
పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19 బాధితులకు చికిత్స అందించే విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లు, కోవిడ్ కేర్ సెంటర్లు, హెల్త్ సెంటర్లలో వారిని చేర్చుకోవడానికి కరోనా పాజిటివ్ రిపోర్టు తప్పనిసరి కాదని తేల్చిచెప్పింది. అంటే నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు రిపోర్టు ఉన్నా, లేకపోయినా ఆసుపత్రిలో చేర్చుకొని వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు కరోనా బాధితుల అడ్మిషన్ల విషయంలో జాతీయ విధానంలో కేంద్ర ఆరోగ్య శాఖ మార్పులు చేసింది. ఏ ఒక్క బాధితుడికి కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ వైద్య సేవలను నిరాకరించడానికి వీల్లేదని పేర్కొంది. ఆక్సిజన్, అత్యవసర ప్రాణాధార ఔషధాల సహా ఇతర సేవలను తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేసింది. బాధితుడు మరో నగరానికి, పట్టణానికి చెందినవాడైనప్పటికీ ఆసుపత్రిలో చేర్చుకోవాల్సిందేనని వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి బారిన పడిన బాధితులకు ప్రభావవంతమైన, సమగ్రమైన చికిత్స వేగవంతంగా అందించాలన్నదే లక్ష్యమని ఆరోగ్య శాఖ తెలిపింది. అందుకే జాతీయ విధానంలో మార్పులు చేసినట్లు వివరించింది. అవసరం అనే ప్రాతిపదికగానే.. అనుమానిత కరోనా రోగులను పాజిటివ్ రిపోర్టు లేకపోయినా కోవిడ్ కేర్ సెంటర్(సీసీసీ), డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్(డీసీహెచ్‌సీ)లో చేర్చుకోవాలని∙ఆరోగ్య శాఖ ఉద్ఘాటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో ఇది వర్తిస్తుందని వెల్లడించింది. సదరు బాధితుడి స్వస్థలం ఆసుపత్రి ఉన్న నగరం/పట్టణం కాకపోయినా ప్రవేశం నిరాకరించరాదని సూచించింది. అవసరం అనే ప్రాతిపదికన ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని పేర్కొంది. హాస్పిటల్ సేవలు అవసరమైన వారికి మాత్రమే పడకలు కేటాయించాలని, అవసరం లేని వారికి కేటాయించరాదని స్పష్టం చేసింది. డిశ్చార్జ్ పాలసీకి అనుగుణంగానే పేషెంట్లను డిశ్చార్జ్ చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు 3 రోజుల్లోగా అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. -
దయచేసి వినండి.. రైలు ప్రయాణికులకు గమనిక
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే శాఖ తాజాగా మరిన్ని కోవిడ్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు వెయిటింగ్‌లిస్టులో ఉన్న ప్రయాణికులు రైలు ఎక్కిన తరువాత కొంత మొత్తం రుసుము చెల్లించి ప్రయాణం చేసేందుకు అవకాశం ఉండగా ఇక నుంచి వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులను అనుమతించబో మని రైల్వే శాఖ స్పష్టం చేసింది. తాజా నిబంధనల ప్రకారం రిజర్వేషన్ టికెట్ ఉన్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాలు ఇవీ.. అన్రిజర్వ్డ్ కోచ్‌లు ఉన్న రైళ్లలో మాత్రమే రిజర్వేషన్లేని ప్రయాణికులను అనుమతిస్తారు. కోవిడ్ దృష్ట్యా ప్రీపెయిడ్ కేటరింగ్ సౌకర్యాన్ని రద్దు చేశారు. తాజా నిబంధనల మేరకు ప్రయాణికులు తమ టికెట్ బుకింగ్‌తో పాటే గతంలో లాగా ఆహారపదార్థాలను బుక్ చేసుకొనేందుకు అవకాశం లేదు. ‘రెడీ టు ఈట్ భోజనం’, ప్యాక్ చేసిన ఐటమ్స్ మాత్రమే రైళ్లలో లభిస్తాయి. ఐఆర్సీటీసీ ద్వారా ఈ సదుపాయం లభిస్తుంది. రైళ్లలో ప్రయాణికులకు ఇకపై దుప్పట్లు ఇవ్వరు. ఈ నిబంధనలు తప్పనిసరి.. రైల్వేస్టేషన్లు, రైళ్లలో కచ్చితంగా ఫేస్‌మాస్కులను ధరించాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. శానిటైజర్ వెంట తెచ్చుకోవాలి. థర్మల్ స్క్రీనింగ్‌లో ఎలాంటి లక్షణాలు లేని వాళ్లను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. గమ్యస్థానాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే కోవిడ్ నిబంధనలను పాటించాలి. ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాలి. మరో 28 రైళ్లు రద్దు సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు వెళ్లే 28 రైళ్లను తాజాగా రద్దు చేసింది. ఈ నెలాఖరుకు కొన్ని..జూన్ మొదటి వారానికి మరికొన్ని రైళ్లు నిలిచిపోనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ గురువారం మీడియాకు వెల్లడించారు. తిరుపతి–విశాఖపట్నం, సికింద్రాబాద్–కర్నూలుసిటీ, కాకినాడ టౌన్–లింగంపల్లి, కాకినాడ టౌన్–రేణిగుంట, విజయవాడ–లింగంపల్లి, కరీంనగర్–తిరుపతి, గూడూరు–విజయవాడ, నాందేడ్–జమ్ముతావి, సికింద్రాబాద్–విశాఖపట్టణం, బిట్రగుంట–చెన్నై, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్, నర్సాపూర్–నాగర్సోల్, సికింద్రాబాద్– విజయవాడ, హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ తదితర రూట్లలో రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లు రద్దైన వాటిలో ఉన్నాయి. -
కరోనాపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు పెరుగుతుండడం.. కరోనా వ్యాప్తి తీవ్రం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారికి గురువారం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. స్వల్ప లక్షణాలున్నా, లక్షణాలు లేకున్నా ఇంటికే పరిమితం కావాలని సూచించింది. బీపీ, షుగర్ ఉన్నవారు వైద్యుల సలహా పాటించాలని తెలిపింది. కరోనా బాధితులు 3 పొరల మాస్క్ ధరించాలని పేర్కొంది. వీలైనంత ఎక్కువగా నీరు, ద్రవ ఆహారం తీసుకోవాలని ప్రజలకు విన్నవించింది. ఆక్సిజన్ స్థాయిలు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఐసోలేషన్ నుంచి పది రోజుల తర్వాత బయటకు రావొచ్చని పేర్కొంది. చివరి 3 రోజుల్లో జ్వరం రాకపోతే కరోనా పరీక్ష అవసరం లేదని స్పష్టం చేసింది. -
చెక్ బౌన్స్ సత్వర పరిష్కారానికి సుప్రీం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు కోర్టుల్లో పేరుకుపోయిన చెక్‌బౌన్స్ కేసుల సత్వర పరిష్కానానికి సుప్రీకోర్టు మార్గదర్శకాలను జారీచేసింది. ఒక లావాదేవీకి సంబంధించి ఒక వ్యక్తిపై ఒకే సంవత్సరంలో దాఖలైన వివిధ కేసులను కలిపి ఒకేసారి విచారించేలా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కు చట్ట సవరణలు చేయాలని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నతస్థాయి ధర్మాసనం కేంద్రానికి నిర్దేశించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, బీఆర్ గవాయ్, ఏఎస్ బోపన్న, ఎస్ రవీంద్రభట్‌లు ఉన్నారు. 1973, సీఆర్పీసీ 219వ సెక్షన్ ప్రకారం ప్రస్తుతం ఈ తరహాలో మూడు కేసులు మాత్రమే కలిపి విచారించాల్సి ఉంది. ఇక చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి వేగవంతమైన విచారణకు వీలైన ‘‘సమ్మరీ ట్రైల్’’ నుంచి కొంత ఆలస్యానికి కారణమయ్యే ‘‘సమన్స్ ట్రైల్’’కు మార్చడానికి కారణాలు ఏమిటన్నది సంబంధిత మేజిస్ట్రేట్ తప్పనిసరిగా రికార్డు చేసేలా తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు 27 పేజీల ఉత్తర్వుల్లో సూచించింది. కోర్టుల్లో 35 లక్షల చెక్‌బౌన్స్ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్ కేసుల్లో 15 శాతం పైగా) పేరుకుపోవడం ఒక ‘వింత’ని ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
మ్యూచువల్ ఫండ్స్: ఈ మార్గదర్శకాలు తెలుసా?
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) సంస్థలు తమ ట్రస్టీలకు.. అలాగే నియంత్రణ సంస్థ సెబీకి, అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ ట్రస్టీలు సెబీకి సమర్పించాల్సిన వివరాల నమూనాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించి నూతన మార్గదర్శక సూత్రాలను సెబీ సోమవారం విడుదల చేసింది. ఏఎంసీలు రెండు నెలలకోసారి, అరు నెలలకోసారి సెబీకి సమర్పించాల్సిన కాంప్లియన్స్ సర్టిఫికెట్ (నిబంధనల అమలు వివరాలు)ను నిలిపివేసింది. రెండు నెలలకు ఓసారి, ఆరు నెలలకు ఓసారి సమర్పించే వివరాలను సైతం ఇక మీదట త్రైమాసిక నివేదికలో పొందుపరచాల్సి ఉంటుందని సెబీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. త్రైమాసిక నివేదికలో.. అమల్లో ఉన్న పథకాలు, కొత్తగా ఆవిష్కరించిన పథకాలు, తాజాగా గడువు తీరిన పథకాలు, మూసివేసిన లేదా విలీనం చేసిన పథకాల వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏవేనీ మూసివేసిన పథకాలు ఉంటే.. వాటికి సంబంధించి చేసిన చెల్లింపులను ప్రతీ త్రైమాసిక నివేదికలో పేర్కొనాలి. ప్రతీ త్రైమాసికం ముగిసిన అనంతరం 21 రోజుల్లోగా వివరాలతో నివేదికలను సమర్పించాలని సెబీ నిర్దేశించింది. చదవండి: స్టార్టప్‌ల లిస్టింగ్‌కు సెబీ బూస్ట్ -
వీకెండ్ లాక్‌డౌన్‌తో హిందీ చిత్రాలకు షాక్
హిందీ చిత్రాలకు కరోనా పెద్ద షాక్ ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం బాలీవుడ్‌ను కష్టాలపాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 15 మందికిపైగా బాలీవుడ్ స్టార్స్ కరోనా బారినపడ్డారు. థియేటర్స్‌లో సీటింగ్ ఆక్యుపెన్సీని యాభై శాతానికే పరిమితం చేయడం వల్ల సినిమాల రిలీజ్లు కూడా వాయిదాలు పడుతు న్నాయి. ఈ కారణాలతోనే బాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌ను అనౌన్స్ చేసింది. దీంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లైంది బాలీవుడ్ పరిస్థితి. నైట్ కర్ఫ్యూ వలన సెకండ్ షో సినిమాలు రద్దు అవుతాయి. ఈ ప్రభావం ఇండస్ట్రీపై పడుతుంది. సాధారణంగా సినిమా రిలీజ్లు అన్నీ వీకెండ్స్‌లోనే ఉంటాయన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం తాజా వీకెండ్ లాక్డౌన్ కారణంగా కొత్త సినిమాల విడుదల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వీకెండ్ లాక్డౌన్ శుక్రవారం రాత్రి 8గంటల నుంచి సోమవారం ఉదయం 7గంటల వరకు ఉంటుంది. ఈ ప్రకారం శుక్రవారం ఫస్ట్ షో తర్వాత మళ్లీ థియేటర్లో బొమ్మ పడేది సోమవారం ఫస్ట్ షోతోనే. ఈ పరిస్థితులు కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. మరోవైపు సినిమాల ప్రదర్శనే కాదు... షూటింగ్‌లపై కూడా నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ల ప్రభావం పడుతుంది. ఇప్పటివరకు షూటింగ్ లొకేషన్స్‌లో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం షూట్ చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం షూట్ లోకేషన్లో 33శాతం మంది క్రూ మెంబర్స్‌కు మాత్రమే అనుమతి. ఈ నిబంధన ప్రకారం భారీ యాక్షన్ సీక్వెన్స్‌లకు, క్రౌడ్ ఎక్కువ కావాల్సిన సన్నివేశాల చిత్రీకరణకు, సాంగ్స్‌కు బ్రేక్ పడక తప్పదు. అలాగే నైట్ కర్ఫ్యూతో నైట్ షూటింగ్‌లు అన్నీ రద్దు అవుతాయి. ఈ పరిణామాలు బాలీవుడ్‌ను మరింత కుదిపేస్తాయి. ‘‘గత ఏడాది సెప్టెంబర్‌లో ఉన్న పరిస్థితుల మాదిరిగానే పెద్ద సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు, పెద్ద ఫైట్ సీన్స్‌కు అనుమతి లేదు. 33శాతం క్రూ మెంబర్స్‌తో మాత్రమే లొకేషన్లో షూట్ చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బిన్ తివారి. సినీ ప్రముఖలందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను విధించిందని ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. -
Night Curfew: మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ
సాక్షి ముంబై: మహారాష్ట్రలో 27వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలుకానున్న నైట్ కర్ఫ్యూకు సంబంధించిన మార్గదర్శకాలను మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నైట్ కర్ఫ్యూ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఏడు వరకూ ఉండనుంది. అయితే అత్యవసర సేవలను ఇందులోనుంచి మినహాయించారు. మరోవైపు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. మాస్క్ లేకుండా తిరిగితే రూ. 500, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ. 1000, కర్ఫూ సమయంలో అయిదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడితే రూ. 1000 జరిమానా వసూలు చేయనున్నారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 15వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి. మార్గదర్శకాల వివరాలు... ► రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ► కర్ఫ్యూ సమయంలో బీచ్‌లు, ఉద్యానవనాలు, సార్వజనిక ప్రాంతాలు మూసేయనున్నారు. ► కర్ఫ్యూ సమయంలో అయిదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడరాదు. ► బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మివేయరాదు. ► ముఖానికి మాస్క్, కనీసం ఆరు అడుగుల దూరం (సోషల్ డిస్టిన్స్). చేతులను తరచు సానిటైజ్ చేసుకోవాలి. ► మాస్క్ లేకుంటే రూ 500 జరిమానా ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసి నియమాను ఉల్లంఘిస్తే రూ. 1000 జరిమానాను వసూలు చేయనున్నారు. ► కర్ఫ్యూ సమయంలో సినిమా హాళ్లు, హోటళ్లు, మల్టిప్లెక్స్, బార్లు అన్ని మూసి ఉండనున్నాయి. అయితే హోటళ్లు హోం డెలివరి చేసుకోవచ్చు. ► వివాహానికి 50 మందికి అవకాశం. ► అంత్యక్రియలకు 20 మంది మించకూడదు. ► ధార్మిక స్థలాలలో భౌతిక దూరం పాటించేలా ఆయా ధార్మిక స్థలాల ట్రస్టులు చూడాలి. అదేవిదంగా ఆన్లైన్ దర్శనం కల్పించాలి. అన్ని నియమాలతోనే ధార్మిక స్థలాల్లోకి అనుమతించాలి. ► కొన్ని ఆంక్షలతో ప్రజా రవాణా కొనసాగుతుంది. ► ప్రైవేట్ సంస్థలు (ఆరోగ్య, అత్యవసర సేవలు మినహా) 50 శాతం సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యేలా చూడాలి. -
కేంద్రం అలర్ట్: కరోనా కట్టడికి ‘ట్రిపుల్ టీ’లు
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వైరస్ కట్టడి చేసేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ కట్టడికి ముఖ్యంగా మూడు ‘టీ’లు ప్రతిపాదించింది. టెస్ట్.. ట్రాక్.. ట్రీట్ అంటే పరీక్షలు చేయడం.. పాజిటివ్ తేలితే వారు ఎవరెవరినీ కలిశారో ట్రేస్ చేయడం.. అనంతరం చికిత్స అందించడం అని అర్థం. కరోనా పరీక్షలు పెంచండి.. జాగ్రత్తలు పాటించండి అని ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు 70 శాతం పెంచాలి. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచి వైద్యం అందించాలి. పాజిటివ్ బాధితులు ఎవరెవరిని కలిశారో ట్రేసింగ్ చేయాలి. కేసులు అధికంగా ఉంటే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలి. ఆ జోన్లో ఇంటింటి సర్వే చేసి పరీక్షలు చేయాలి. రద్దీ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు. మాస్క్‌లు, భౌతిక దూరం, శానిటైజర్ వినియోగం పెంచాలి. నిర్లక్క్ష్యం చేసే వారిపై జరిమానా విధించాలి. వైరస్ తీవ్రతను బట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరిని ఆంక్షలు, చర్యలు తీసుకోవచ్చు. అంతరాష్ట్ర రాకపోకలపై నిషేధం విధించలేదు. ప్రజలతో పాటు సరుకు రవాణాకు రాష్రా్టల మధ్య అనుమతులు అవసరం లేదు. విద్యాలయాలు, కార్యాలయాలు, రవాణా, హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు ఉద్యానవనాలు, జిమ్ కేందద్రాలు తదితర ప్రాంతాల్లో కరోనా నిబంధనలు విధిగా పాటించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగాలి. వీలైనంత ఎక్కువగా ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాల్లో తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మార్గదర్శకాలు వర్తిస్తాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. చదవండి: తెలంగాణలో విద్యాసంస్థలు బంద్ -
మాస్క్ సరిగా లేకుంటే దింపేయండి
ముంబై: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? మాస్కు ధరించారా? అది ముక్కు కిందికో, గడ్డానికో ధరిస్తే సరిపోదు. ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉంచాలి. అలా లేకపోతే నిర్దాక్షిణ్యంగా విమానం నుంచి దింపేస్తారు. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) దేశంలో అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. విమానాల్లో కోవిడ్–19 ప్రోటోకాల్స్‌ను కఠినంగా అమలు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికుల పట్ల దయ చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతుండడంతో పౌర విమానయాన సంస్థలకు డీజీసీఏ శనివారం నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. విమానాల్లో ప్రయాణికులు మాస్కులు సక్రమంగా ధరించకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు ఇటీవలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీసీఏను, విమానయాన సంస్థలను ఆదేశించింది. విమానాల్లో తరచుగా తనిఖీలు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు డీజీసీఏ సర్క్యులర్ జారీ చేశారు. ఇందులో ఏముందంటే... ► మాస్కులు లేనివారిని ఎయిర్‌పోర్టుల్లోకి అనుమతించరాదు. ► విమానాల్లో ప్రయాణికులు మాస్కులు సరిగ్గా ధరించేలా, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి. ► విమానాశ్రయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రయాణం ముగిశాక విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేదాకా మాస్కు ఉండాల్సిందే. ► కోవిడ్–19 ప్రోటోకాల్స్‌ను ఎలాంటి రాజీ లేకుండా కఠినంగా అమలు చేయాలి. ► విమానం బయలుదేరే ముందు పదేపదే సూచించినా మాస్కు సరిగ్గా ధరించకపోతే సదరు ప్రయాణికుడిని వెంటనే దింపేయాలి. ► విమానం ప్రయాణిస్తుండగా మాస్కులు సరిగ్గా లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వారిని నిబంధనలు అతిక్రమించిన ప్రయాణికులుగా పరిగణించాలి. ► కొన్ని అత్యవసర సందర్భాల్లో మినహా మిగిలిన సమయంలో మాస్కును ముక్కు నుంచి కిందకు జార్చరాదు. ► కోవిడ్–19 నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, డీజీసీఏ గైడ్‌లైన్స్ ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి. -
పాడొద్దు... అరవొద్దు... మాస్కులు తీయొద్దు!
టోక్యో: విశ్వ క్రీడల నిర్వహణ విషయంలో ముందుకే వెళ్తున్న ఆతిథ్య జపాన్ దేశం అక్కడ తు.చ. తప్పకుండా పాటించాల్సిన నిబంధనల చిట్టాను విడుదల చేసింది. టోక్యోకు వెళ్లే విదేశీ అథ్లెట్లు తినేటపుడు, పడుకునేటపుడు తప్ప అన్ని వేళలా మాస్కులు ధరించాల్సిందే! అక్కడి ప్రజా రవాణా వాహనాల్ని అనుమతి లేనిదే వినియోగించరాదు. ఇలాంటి ఎన్నో కట్టుబాట్లతో టోక్యో ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ‘ప్లేబుక్’ను బుధవారం విడుదల చేసింది. మీడియాతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు... మెగా ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు అంతా బాధ్యతతో మెలగాలని సూచించారు. ఆటగాళ్లే కాదు... ప్రేక్షకులకు ఇందులో బంధనాలున్నాయి. తమ ఫేవరెట్ అథ్లెట్లకు మద్దతుగా ప్రేక్షకులు అరవడంగానీ పాడటంగానీ చేయడం నిషిద్ధం. కరోనా మహమ్మారి ప్రమాదం పొంచిఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అథ్లెట్లు, సహాయక సిబ్బంది, ఇతర సిబ్బంది, ప్రేక్షకులు అందరూ తమ మార్గదర్శకాలను నిక్కచ్చిగా పాటించాల్సిందేనని కార్యనిర్వాహక కమిటీ తెలిపింది. ఈ మెగా ఈవెంట్‌ను చూసేందుకు విదేశీ ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు లేవు. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని కమిటీ పేర్కొంది. -
చేతికి బ్యాండ్లు, ముఖానికి మాస్కులు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల హామీ మేరకు కరోనాపై యుద్ధం ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ మాదిరిగా కాకుండా ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ వైట్‌హౌస్‌లో కరోనా నిబంధనల అమలు ప్రారంభించారు. చేతికి రిస్ట్ బ్యాండ్లు (ఈ బ్యాండ్‌లో ట్రాకర్ సాయంతో కోవిడ్ రోగుల్ని గుర్తించవచ్చు) ముఖానికి మాస్కులు తప్పనిసరి చేశారు. భౌతిక దూరం నిబంధనలు అమలయ్యేలా ఉద్యోగుల సీట్లను ఆరడగుల దూరంలో ఏర్పాటు చేశారు. కరోనాపై పోరాటమే తన ప్రథమ ప్రాధాన్యంగా బైడెన్ గురువారం పలు ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘కరోనాతో మరణించే వారి సంఖ్య 4 లక్షలు దాటిపోయింది, రెండో ప్రపంచ యుద్ధ మృతులు కంటే ఇది ఎక్కువ. వచ్చే నెల మృతులు 5 లక్షలు దాటిపోతాయి. అందుకే ఈ వైరస్‌పై యుద్ధ ప్రాతిపదికన పోరాటం చేయాలి’’ అని బైడెన్ చెప్పారు. అమెరికా అంటువ్యాధుల నిఫుణుడు డాక్టర్ ఫాసీ, ఇతర వైద్య రంగ ప్రముఖుల సహకారంతో కరోనా కట్టడికి వ్యూహాన్ని రచించారు. కరోనా కట్టడికి వ్యూహం ► బహిరంగ ప్రదేశాల్లో 100 రోజుల పాటు అందరూ మాస్కులు ధరించాలి. ► ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌లోకి వచ్చినప్పుడు భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. ► శ్వేత సౌధానికి వచ్చే వారంతా చేతికి కరోనా ట్రాకర్ బ్యాండ్ ధరించాలి. ► అమెరికాకు వచ్చే ప్రతీ ఒక్కరూ కరోనా పరీక్ష చేయించుకున్నా కే విమానం ఎక్కాలి ► అమెరికాలో దిగాక విధిగా హోంక్వారంటైన్లో ఉండాలి. -
బ్రిటన్ ప్రయాణికులకు కరోనా టెస్ట్
న్యూఢిల్లీ: యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పని సరిచేస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 8 నుంచి జనవరి 30 వ తేదీ వరకు బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులందరూ సొంత ఖర్చుతో తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలంటూ కేంద్రం తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. ప్రయాణానికి 72 గంటల ముందు కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు సర్టిఫికెట్ తెచ్చుకోవాలని మార్గదర్శకాల్లో వెల్లడించారు. కొత్త కరోనా యూకేలో బయటపడి, అత్యంత వేగంగా విస్తరిస్తోండడంతో డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై భారత్ నిషే«ధం విధించింది. ఆ తరువాత నిషేధాన్ని జనవరి 7 వరకు పొడిగించింది. బ్రిటన్ నుంచి భారత్‌కి వారానికి కేవలం 30 విమానాలను నడుపుతున్నారు. జనవరి 23 వరకు ఇలాగే కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రయాణికుల వద్ద తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉండేలా వైమానిక సిబ్బంది చూసుకోవాలి. ఆర్టీ–పీసీఆర్ పరీక్షల ఫలితం వచ్చే వరకు ప్రయాణీకులు వేచి ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి. సంబంధిత రాష్ట్రాల అధికారులను సంప్రదించి కోవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను ప్రత్యేక యూనిట్లలో సంస్థాగత ఐసోలేషన్‌లో ఉంచాలి. పాజిటివ్ పేషెంట్లకు తిరిగి 14వ రోజు మళ్ళీ కోవిడ్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు నెగెటివ్ వచ్చే వరకు వారిని ఐసోలేషన్‌లో ఉంచాలి. పాజిటివ్ వచ్చిన ప్రయాణీకుల పక్క సీట్లలో కూర్చున్న వారినీ, ముందు మూడు వరుసలు వెనక మూడు వరసల్లో ప్రయాణించిన వారిని క్వారంటైన్సెంటర్లలో ఉంచాలని వివరించారు. విమానాశ్రయంలో నెగెటివ్ వచ్చినప్పటికీ 14 రోజుల వరకు హోం క్వారంటైన్‌లోనే ప్రయాణికులు ఉండాలి. రాష్ట్ర లేదా జిల్లా అధికార యంత్రాంగం వీరిని పర్యవేక్షిస్తూ ఉండాలి. ఈ మార్గదర్శకాలు సక్రమంగా అమలు జరిగేందుకు విమానాశ్రయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి. 6 నుంచి యూకేకు విమానాలు ఇండియా–యూకే మధ్య విమాన సేవలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 6వ తేదీన భారత్ నుంచి యూకేకు, 8వ తేదీన యూకే నుంచి ఇండియాకు ఫ్లయిట్లు ప్రారంభమవుతాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రతి వారం 30 విమానాలను నడుపుతాయని చెప్పారు. ఇందులో ఇండియా, యూకేవి తలా పదిహేను విమానాలుంటాయన్నారు. ఈ షెడ్యూల్ జనవరి 23 వరకు కొనసాగుతుందని చెప్పారు. భారత ప్రభుత్వం డిసెంబర్ 23న ఇండియా–యూకేల మధ్య విమాన సర్వీస్‌లను రద్దు చేయడం తెల్సిందే. -
వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం రూల్స్
న్యూఢిల్లీ : దేశంలో టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త సంవత్సరంలో మొదలయ్యే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం తొలివిడత జూలై వరకు కొనసాగుతుందని, ఈ విడతలో 25 నుంచి 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో తొమ్మిది వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉండగా మూడు కంపెనీల వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయి. మార్గదర్శకాలు.. ► ఒక్కో వ్యాక్సిన్ కేంద్రంలో ఒకే రోజు వంద మందికి, అవసరమైతే 200 మందికి టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ► వ్యాక్సిన్ తీసుకునేవారు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన కో–విన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ► హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 50 ఏళ్ల వయసుపైబడిన వారికి తొలి దశలో వ్యాక్సిన్ ఇవ్వాలి. ఎన్నికల ఓటర్ల జాబితాను బట్టి 50 ఏళ్ల వయసు పైబడిన వారిని గుర్తించాలి. ► 50 ఏళ్ల వయసు ఉన్న వారిని కూడా మళ్లీ రెండు గ్రూపులుగా విభజించాలి. తొలుత 60 ఏళ్లకి పైబడిన వారికి ఇవ్వాలి. ► వ్యాక్సినేషన్ బృందంలో వ్యాక్సినేటర్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్, ఆగ్జిలరీ నర్స్ మిడ్వైఫ్, లేడీ హెల్త్ విజిటర్లు ఉంటారు. వీరే కాకుండా పోలీసు శాఖకు చెందిన వారు సహాయకులుగా ఉంటారు. ► వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. జనవరి నుంచి వ్యాక్సినేషన్‌కు చాన్స్ : సీరమ్ చీఫ్ అదార్ పూనావాలా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) చీఫ్ అదార్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ నాటికి మళ్లీ కరోనా ముందు నాటి పరిస్థితులు వస్తాయన్నారు. ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సంబంధించి అనుమతులు లభించే అవకాశం ఉందన్నారు. దేశ జనాభాలో 20% మందికి వ్యాక్సిన్ ఇవ్వగానే సాధారణ పరిస్థితులు వస్తాయని అంచనా వేశారు. -
ప్రమాదకరంగా సెకండ్ వేవ్
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ వచ్చేంతవరకు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటించాలని, కరోనా మార్గదర్శకాలు అమలయ్యేలా చూసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేసింది. దేశంలో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాల బెంచ్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉండబోతోందని హెచ్చరించింది. ‘‘కరోనా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలి. దేశ ప్రజల్లో 60 శాతం మంది మాస్కులు పెట్టుకోవడం లేదు. 30శాతం మంది గడ్డం కిందకి మాస్కుల్ని వేలాడదీస్తున్నారు. గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. ఆంక్షల్ని కఠినతరం చేయాలి’’ అని స్పష్టం చేసింది. ఒకే రోజు 43 వేలకు పైగా కేసులు నమోదు దేశంలో 24 గంటల్లో 43,082 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 93,09,788కి చేరుకుంది. ఒకే రోజు 492 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య లక్షా 35 వేల 715కి చేరుకుంది. ఆ రాష్ట్రాల నుంచే దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పది రాష్ట్రాల నుంచి 77% కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకి తెలిపింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయంటూ ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఢిల్లీలో రాష్ట ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల కేసుల సంఖ్య బాగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. అయితే రాష్ట్రాలు చర్యలు తీసుకోకపోతే కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూసే బాధ్యత కేంద్రానిదేనని బెంచ్ స్పష్టం చేసింది. -
రాత్రిపూట కర్ఫ్యూ విధించొచ్చు
దేశవ్యాప్తంగా కరోనా సంక్రమణ హద్దులు దాటుతున్న వేళ కట్టడికి కేంద్రం మరోసారి రంగంలోకి దిగింది. శీతాకాలం ప్రారంభమై, కోవిడ్–19 పాజిటివ్ కేసుల్లో మళ్ళీ పెరుగుదల ఉన్న నేపథ్యంలో బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు డిసెంబర్ 1 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా అమలులో ఉంటాయి. సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ఇప్పటికే ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో కఠినంగా అమలు అవుతున్న కొన్ని నిబంధనలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కచ్చితంగా పాటించాల్సిందేనని ఆదేశించింది. కరోనా సంక్రమణను ఆపేందుకు జన సమర్ధక ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నియంత్రించాలని, పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ పెంచాలని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ సూచించింది. కొన్ని ప్రాంతాలలో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో కోవిడ్–19 సంక్రమణను తనిఖీ చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రాత్రిపూట కర్ఫ్యూ వంటి ఆంక్షలను స్థానికంగా విధించుకోవచ్చని తెలిపింది. అయితే కంటైన్మెంట్ జోన్ బయట లాక్డౌన్ విధించే ముందు మాత్రం రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది. మార్గదర్శకాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలను ప్రజలు కచ్చితంగా పాటించేలా స్థానిక జిల్లా, పోలీసు, మునిసిపల్ అధికారులు బాధ్యత వహించాలని కేంద్రం ఆదేశించింది. ► మాస్క్‌లు, భౌతికదూరం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించనివారికి తగిన జరిమానా విధించాలని మార్గదర్శకాల్లో స్పష్టంగా ఆదేశించింది. వైరస్ సంక్రమణ కట్టడికి కార్యాలయాల్లోనూ మాస్క్‌లు ధరించని వ్యక్తులకు జరిమానాలు విధించాలని తెలిపింది. ఆరోగ్య సేతు యాప్‌ను విధిగా అందరూ వినియోగించాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల 50 శాతం కెపాసిటీతో సినిమా థియేటర్ల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చిన కేంద్రం, స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతిని క్రీడాకారుల శిక్షణ నిమిత్తం మాత్రమే ఇచ్చింది. ఆధ్యాత్మిక, సామాజిక, క్రీడ, వినోద, విద్య , సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య , వారు హాజరైన వేదిక సామర్థ్యంలో 50 శాతానికి మించకూడదని తెలిపింది.మార్కెట్లు, వారాంతపు సంతలకు నియమాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో జారీ చేయనుంది. ► పాజిటివ్ కేసును గుర్తించిన తర్వాత వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారి వివరాలను సేకరించటంతో పాటు, వారిని గుర్తించటం, క్వారంటైన్ చేయటం వంటి పనులన్నింటినీ 72 గంటల్లో కనీసం 80శాతం పూర్తి చేయాలని సూచించింది. అంతేగాక కోవిడ్–19 రోగులకు వెంటనే హోం ఐసోలేషన్ నిబంధనలను పాటిస్తూ చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సూక్ష్మ స్థాయిలో, జిల్లా అధికారులు కంటైన్మెంట్ జోన్ల గుర్తింపులో అప్రమత్తంగా ఉండాలని, కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పేర్కొన్నారు. ► కోవిడ్–19 సంక్రమణ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన మరింత పెంచాలని సూచించారు. వీక్లీ కేస్ పాజిటివిటీ రేటు 10 శాతానికి మించితే, ఒకేసారి కార్యాలయానికి హాజరయ్యే ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు, సామాజిక దూరం పాటించేందుకు వీలుగా కార్యాలయ సమయాలను మార్చాలని రాష్ట్రాలకు, యూటీలను కేంద్రం ఆదేశించింది. 92 లక్షలు దాటిన కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 92 లక్షలు దాటింది. 24 గంటల్లో 44,376 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. మంగళవారం వెలుగుచూసిన కేసుల కంటే బుధవారం 6,079 కేసులు ఎక్కువగా ఉండటం గమనార్హం. బుధవారం బయట పడిన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 92,22,216కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 481 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,34,699కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య బుధవారానికి 86,42,771కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.72 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,44,746గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.82 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.46గా ఉంది. -
లాక్డౌన్? కేంద్రం కొత్త మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని, జనాలను నియంత్రించాలని, కాంటాక్ట్ ట్రేసింగ్ను పెంచాలని రాష్ట్రాలను కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరు 1 నుంచి ఇవి అమలవుతాయని తెలిపింది. నిర్దేశించిన నియంత్రణ చర్యలను ఖచ్చితంగా పాటించాలా అదేశించింది. ఇందుకు స్థానిక జిల్లా, పోలీసు, మునిసిపల్ అధికారులు బాధ్యత వహించాలని పేర్కొంది. (కరోనా: మన దేశంలో ఎందుకు ఇలా అవుతోంది?) కొత్త మార్గదర్శకాలు కేంద్రం అనుమతిలేకుండా రాష్ట్రాలు స్థానికంగా లాక్‌డౌన్‌ను విధించలేవు, కానీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం "నైట్ కర్ఫ్యూ" వంటి ఆంక్షలను అమలు చేయవచ్చు. మాస్క్‌లు, భౌతికదూరం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. మార్కెట్లు, వారాంతపు సంతలకు నియమాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో జారీ చేయనుంది. కరోనా ప్రస్తుత పరిస్థితి ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే రాత్రి పూట కర్ఫ్యూ విధించుకోవచ్చు. ఒకవేళ లాక్డౌన్ విధించాలనుకుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుండి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. సూక్ష్మ స్థాయిలో, జిల్లా అధికారులు కంటైన్మెంట్ జోన్ల గుర్తింపులోఅప్రమత్తంగా ఉండాలి. ఈ జాబితాను రాష్ట్రాలు / కేంద్ర ప్రాంతాలు వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలి. దీన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా షేర్ చేయాలి. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి. ఇంటింటికీ పర్యవేక్షణ, నిఘా ఉండాలి. వైద్యం, అత్యవసర సేవలు, అవసరమైన వస్తువులు, సేవల సరఫరాను మినహాఈ జోన్లలో ప్రజల కదలికలపై నియంత్రణ అమలు కావాలి. ఇందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించనివారికి తగిన జరిమానా విధించాలని ఆదేశించింది. అంతేకాదు కార్యాలయాల్లో ఫేస్ మాస్క్‌లు ధరించని వ్యక్తులపై కూడా జరిమానాలు విధించాలని తెలిపింది. రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఆరోగ్య సేతు యాప్‌ను విధిగా అందరూ వినియోగించాలి. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చిన కేంద్ర హోంశాఖ అంతర్జాతీయ ప్రయాణికులను నిబంధనల ప్రకారం అనుమతించాలని పేర్కొంది. కంటైన్ మెంట్ జోన్ల వెలుపల 50శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లకు అనుమతి. క్రీడాకారుల శిక్షణ నిమిత్తం మాత్రమే స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి. సామాజిక, ఆధ్యాత్మిక, క్రీడా/వినోద/ విద్య/సాంస్కృతిక/ మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య వేదిక సామర్థ్యంలో 50 శాతానికి మించకూడదు. ఇతర కార్యక్రమాలకు 200 మందికి పైగా వ్యక్తులు అనుమతించబడరు. ఈ నిబంధనలు 2020 డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయని భావిస్తున్నారు. -
ప్రేక్షకులు ఎక్కడ?
నిండుగా ఉంటేనే థియేటర్స్‌కి అందం. థియేటర్స్ నడిపేవారికి ఆనందం. థియేటర్ గేట్‌కి హౌస్‌ఫుల్ బోర్డ్‌కి మించిన మెడల్ ఏముంటుంది? అయితే కరోనా థియేటర్స్ బిజినెస్‌ను బాగా దెబ్బకొట్టింది. ఏడు నెలలు ఖాళీగా, సందడి లేకుండా ఉండిపోయాయి హాళ్లు. థియేటర్స్ మళ్లీ తెర్చుకోండి, కానీ కొన్ని షరతులు అంది ప్రభుత్వం. 50 శాతం మించి ఆడియన్స్‌కు అనుమతి లేదు. అక్టోబర్ 15న దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. మరి థియేటర్స్‌కి ప్రేక్షకులు వచ్చారా? పరిస్థితి ఏంటి? చూద్దాం. లాక్డౌన్ సమయంలో సినిమా హాళ్లు మూసివేసి ఉన్నప్పుడు, ప్రేక్షకులు వస్తారో రారా అనేది పక్కనపెడితే ముందైతే థియేటర్స్ తెరవాలి, దాన్ని నమ్ముకున్నవాళ్ల పరిస్థితి ఏంటి? అనే వాదనలు వినిపించాయి. జాగ్రత్తలు తీసుకుందాం, జనమే అలవాటు పడతారు అనే ధైర్యం కూడా ఉంది థియేటర్స్ యాజమాన్యంలో. అక్టోబర్ 15నుంచి థియేటర్స్ తెరుచుకోమని, గైడ్‌లైన్స్ ఇచ్చింది ప్రభుత్వం. 50 శాతం సీట్లకు మాత్రమే అనుమతి ఉండడంతో కొత్త చిత్రాలేవీ రిలీజ్ చేయలేదు. గతంలో విడుదలైన చిత్రాలనే మళ్లీ ప్రదర్శిస్తూ థియేటర్స్‌ను ప్రారంభించారు. చాలా ప్రాంతాల్లో మునుపటికంటే టికెట్ రేట్ చాలా తగ్గించారు. ప్రేక్షకులను థియేటర్స్‌కి ఆకర్షించే భాగంలో ఇదొకటì . అయితే థియేటర్స్‌కి వస్తున్న ప్రేక్షకుల సంఖ్య చాలా చాలా తక్కువ ఉండటం షాక్‌కి గురి చేస్తోంది. పలు చోట్ల పట్టుమని పదిమంది కూడా కనిపించలేదట. ఢిల్లీలో... ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ ప్రాంతంలో కోవిడ్ గైడ్‌లైన్స్‌తో థియేటర్ గేట్లు తెరిచారు. 300 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్లో 150 వరకు అనుమతిస్తూ, టికెట్ కౌంటర్ వద్ద సిబ్బంది టికెట్లు తెంచడానికి రెడీ అయ్యారు. ఏడు నెలలవుతోంది, టికెట్లు చింపి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినవాళ్లకు చిన్న షాక్ తగిలింది. కేవలం ఐదుగురు మాత్రమే సినిమా చూడటానికి వచ్చారు. ఇంకెవరైనా వస్తారని అరగంట ఆగారు. ఉహూ... వచ్చిన ఆ ఐదుగురికి సినిమా వేశారు. ‘ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే కుతూహలంతోనే వచ్చాను’ అని సమాధానమిచ్చాడో ప్రేక్షకుడు. గురువారం మ్యాట్నీ షో పరిస్థితి ఇది. శుక్రవారం కుటుంబంతో కలసి సినిమా చూడాలని ముందు రోజు టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆ థియేటర్‌కి వచ్చిన వ్యక్తి, ‘ఇంకా ఇంట్లోనే ఉంటే మానసికంగా ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. అందుకే థియేటర్లో సినిమా చూడాలనుకున్నాం’ అనడం విశేషం. వైజాగ్‌లో.. వైజాగ్‌లో వరుణ్ ఐనాక్స్, పూర్ణ అనే థియేటర్‌ను ఓపెన్ చేశారు. ‘అల వైకుంఠపురములో, భీష్మ’ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రేక్షకుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇక్కడ కూడా ప్రేక్షకుల సంఖ్య పదికి దాటలేదు. వైజాగ్‌లో రాత్రి 7 గంటల షో ఎప్పుడూ హౌస్‌ఫుల్. అది కూడా ఏడుగురుకంటే ఎక్కువ మంది లేరట. ఇలా షోకి వెయ్యి రూపాయిల వసూళ్లు కూడా రావడంలేదట. ఓ మూడు పాత ఇంగ్లిష్ సినిమాలను రిలీజ్‌కి రెడీ చేసి, ప్రేక్షకులు రాకపోవడంతో షోలు రద్దు కూడా చేశారని సమాచారం. ఖర్చులు కూడా మిగలవు థియేటర్స్‌లో ఒక్క షో వేస్తే... తెగిన టికెట్లు, కరెంటు బిల్లులు, థియేటర్ రెంటు ఇలా ప్రతీది లెక్క కట్టుకుని మిగిలినది లాభం. ఇక వసూళ్లు వెయ్యి రూపాయిలైతే కరెంటు బిల్లు ఖర్చులు కూడా రావు. ఇలా నడపడమెందుకు? అనే ఆలోచన కూడా రాకమానదు. ఈ క్లిష్ట పరిస్థితి గురించి చర్చించడానికి థియేటర్స్ యూనియన్‌కి సంబంధించి త్వరలో ఓ మీటింగ్ జరిగే అవకాశం ఉందని తెలిసింది. పాత సినిమాలు కదా, థియేటర్స్‌కి ఏం వెళ్తాం అని ప్రేక్షకులు భావిస్తున్నారా? కరోనా టైమ్‌లో ఇంటిపట్టున ఉండటం బెటర్ అనుకుంటున్నారా? కొత్త సినిమాలు పడితే థియేటర్స్ వైపు నడుస్తారా? థియేటర్స్‌కు మళ్లీ పూర్వ వైభవం ఎప్పుడు? ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నలే. -
విశ్వవిజేతలు కూడా ఆడి అర్హత సాధించాల్సిందే!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘వరల్డ్ టూర్ ఫైనల్స్’ టోర్నమెంట్ నిబంధనల్లో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కీలక మార్పులు చేసింది. గతంలో ‘ప్రపంచ చాంపియన్స్’ హోదాలో ర్యాంకింగ్స్‌తో నిమిత్తం లేకుండా ఆటగాళ్లు నేరుగా ఈ టోర్నీలో పాల్గొనేవారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎత్తివేసిన బీడబ్ల్యూఎఫ్ ఇతర వరల్డ్ టూర్ టోర్నీల్లో సాధించిన పాయింట్ల ప్రకారమే అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేస్తామని ప్రకటించింది. ‘కొత్త నిబంధనల ప్రకారమే బ్యాంకాక్‌లో జరుగనున్న ఫైనల్స్ టోర్నీకి అర్హులైన ఆటగాళ్లను అనుమతిస్తాం. వరల్డ్ చాంపియన్లకు ఎలాంటి మినహాయింపు లేదు. వరల్డ్ టూర్ టోర్నీల్లో సాధించిన పాయింట్లనే పరిగణలోకి తీసుకుంటాం’ అని బీడబ్ల్యూఎఫ్ ప్రకటన విడుదల చేసింది. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన పీవీ సింధు ఇక ఆ హోదాతో టోర్నీలో పాల్గొనే అవకాశం లేదు. ఇప్పటికే డెన్మార్క్ ఓపెన్ నుంచి తప్పుకున్న సింధు... ‘ఆసియా’ టోర్నీల్లో సత్తా చాటి ‘ఫైనల్స్’కు అర్హత సాధించాల్సి ఉంటుంది. బీడబ్ల్యూఎఫ్ నిర్దేశించిన ప్రమాణాల మేరకు సింధు ఆసియా లెగ్–1, 2 టోర్నీల్లో రాణించి ‘ఫైనల్స్’కు అర్హత సాధిస్తుందని ఆమె తండ్రి పీవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. ‘సింధు ప్రపంచ చాంపియన్, గతంలో ‘ఫైనల్స్’ టైటిల్ కూడా నెగ్గింది. ప్రస్తుతం మా లక్ష్యం ఒలింపిక్స్, ఆల్ ఇంగ్లండ్ టైటిల్’ అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా సవరించిన∙షెడ్యూల్ ప్రకారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వేదికగా జనవరి 27–31 మధ్య ‘ఫైనల్స్’ టోర్నీ జరుగుతుంది. జనవరి 12–17 మధ్య ఆసియా ఓపెన్–1, జనవరి 19–24 మధ్య ఆసియా ఓపెన్–2 ఈవెంట్లు జరుగుతాయి. -
రేప్ కేసుల విచారణ 2నెలల్లో..
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో చట్ట ప్రకారం రెండు నెలల్లోపు విచారణ పూర్తి చేసి, చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న దారుణాలు, హాథ్రస్ ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఈమేరకు కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి మరణ వాంగ్మూలం రికార్డు చేయలేదన్న నెపంతో, మరణవాంగ్మూలాన్ని విస్మరించరాదని కేంద్రం తన మార్గదర్శకాల్లో తేల్చి చెప్పింది. సీఆర్పీసీ ప్రకారం నేరం జరిగిన వెంటనే తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ విషయాల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధితులకు న్యాయం జరగదని, కనుక పోలీసులు నేరం జరిగినట్టు ఫిర్యాదు అందిన తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంది. ఒకవేళ నేరం జరిగిన ప్రాంతం సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోనికి రాకపోయినప్పటికీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంది. పోలీసులకు చట్టాలను గురించి అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఒకవేళ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వాటిని విచారించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించిన మార్గదర్శకాల్లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. సీఆర్పీసీ సెక్షన్ 173 అత్యాచారం కేసుల్లో విచారణ రెండు నెలల్లో ముగించాలని చెపుతోందని, సీఆర్పీసీ సెక్షన్ 164–ఎ ప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలిని ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు గుర్తింపు కలిగిన వైద్యులచే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని హోం శాఖ తెలిపింది. సాక్ష్యాల చట్టం–1872 ప్రకారం, చనిపోయిన వ్యక్తి మరణానికి ముందు రాతపూర్వకంగా గానీ, నోటి మాట ద్వారాగానీ ఇచ్చిన వాంగ్మూలాన్ని నిజమని నమ్మితీరాలని, విచారణలో అది తొలిసాక్ష్యమని చెపుతోంది. లైంగిక దాడి సాక్ష్యాల సేకరణ (ఎస్ఏఈసీ) కిట్లను వాడేందుకు పోలీసులకు, ప్రాసిక్యూటర్లకు, వైద్య సిబ్బందికి శిక్షణనిస్తున్నట్టు హోం శాఖ తెలిపింది. విచారణను ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ఐటీఎస్ఎస్ఓ) ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలంది. పదే పదే అత్యాచారాలకు పాల్పడేవారిని గుర్తించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ స్థాయిలోని డేటాబేస్‌ని వాడుకోవాలని తెలిపింది. అత్యాచార నేరాలను విచారించేందుకు కేంద్రం, కఠినమైన చట్టాలను తీసుకొచ్చినట్లు పేర్కొంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వాలని, నిర్ణీత కాల వ్యవధిలో చార్జ్‌షీట్ దాఖలయ్యేలా చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. -
ఎన్నికల ప్రచారాలు షురూ
న్యూఢిల్లీ: ఇది ఎన్నికల సీజన్. అక్టోబర్, నవంబర్లలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 11 రాష్ట్రాల్లో 56 స్థానాలకు, బిహార్‌లోని ఒక పార్లమెంటు సీటుకి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. సెప్టెంబర్ 30న ఇచ్చిన అన్‌లాక్ 5 నిబంధనల్ని కేంద్ర హోంశాఖ సవరిస్తూ గురువారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించడానికి అనుమతినిచ్చింది. ఈ ఉత్తర్వులు వెంటనే ఆమల్లోకి వస్తాయని హోంశాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 15 వరకు ఎలాంటి ఎన్నికల సభలు నిర్వహించవద్దని సెప్టెంబర్ 30న విడుదల చేసిన అన్‌లాక్ 5లో పేర్కొన్న కేంద్ర హోంశాఖ వాటిని సవరించింది. ఎన్నికల ర్యాలీలో 200 మంది వరకు పాల్గొనవచ్చునని తెలిపింది. ఇక ఏదైనా భవనం లోపల ఎన్నికల సమావేశాలు నిర్వహిస్తే సగం హాలు వరకు మాత్రమే జనానికి అనుమతినివ్వాలని వెల్లడించింది. ఇక ఎన్నికల ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా చేయాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. -
15 నుంచి తెరుచుకోనున్న థియేటర్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ తాజాగా అన్‌లాక్–5 మార్గదర్శకాలను జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా బుధవారం అన్‌లాక్–5 మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా పాఠశాలలు, విద్యా, శిక్షణ సంస్థలు తెరిచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. 50 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు అనుమతిచ్చింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను యథాతథంగా కొనసాగించింది. అక్టోబర్ 15 నుంచి అనుమతించేవి.. ► 50 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవచ్చు. దీనికోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక నియమావళి జారీ చేస్తుంది. ► వాణిజ్య శాఖ జారీ చేసే ప్రత్యేక నియమావళి ఆధారంగా వాణిజ్య సంస్థలు (బిజినెస్ టు బిజినెస్) ఎగ్జిబిషన్లు తెరుచుకోవచ్చు. ► క్రీడాకారుల శిక్షణ కోసం ఉపయోగించే స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి. దీనిపై క్రీడల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రామాణిక నియమావళి జారీ చేస్తుంది. ► ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా ఎంటర్టైన్మెంట్ పార్కులు, ఈ తరహా సంస్థలు తెరుచుకోవచ్చు. విద్యా సంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు.. ► అక్టోబర్ 15 తర్వాత పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ సంస్థలను దశల వారీగా ప్రారంభించుకునే వెసులుబాటును కేంద్రం రాష్ట్రాలకు విడిచిపెట్టింది. అయితే ఆయా సంస్థలు కేంద్రం విధించిన షరతులను పాటించాలి. ► ఆన్లైన్ విద్య, దూరవిద్య కొనసాగాలి. హాజరు నిబంధనలు అమలు చేయరాదు. ► విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఆన్లైన్ తరగతులకు హాజరు కావడానికి ఇష్టపడితే అందుకు వారిని అనుమతించాలి. ► తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో మాత్రమే పాఠశాలలు, శిక్షణ సంస్థలకు విద్యార్థులు హాజరుకావచ్చు. ► పాఠశాలలు, శిక్షణ సంస్థలను తెరిచేందుకు కేంద్ర విద్యా శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించి నియమావళి తయారు చేసుకోవాలి. ► రాష్ట్రాల ప్రామాణిక నియమావళిని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలి. ► కరోనా పరిస్థితిని అంచనా వేసి కేంద్ర హోం శాఖతో సంప్రదించి కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలు ప్రారంభించవచ్చు. ► సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రీమ్‌లోని పీహెచ్డీ, పీజీ విద్యార్థులకు అక్టోబర్ 15 నుంచి ఉన్నత విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతిస్తారు. ఈ విషయంలో కేంద్ర నిధులతో పనిచేసే ఉన్నత విద్యా సంస్థల అధిపతి ఈ అవసరాన్ని గుర్తిస్తారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ వర్సిటీలు తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం. 50 శాతం భర్తీకి అనుమతి.. ► సామాజిక, విద్య, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మత, రాజకీయ వేడుకలు, ఇతర సమ్మేళనాలకు సంబంధించి ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం 100 మంది వరకు అనుమతించారు. అక్టోబర్ 15 తర్వాత కంటైన్మెంట్ జోన్ల వెలుపల 100 మందికి మించి ఇలాంటి సమావేశాల నిర్వహించే అనుమతిని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. ఇందుకు ఈ నియమాలు పాటించాలి. ► హాల్ సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం భర్తీకి అనుమతిస్తారు. గరిష్టంగా 200 మందికి మించకూడదు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, థర్మల్ స్కానింగ్, హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ వాడకం తప్పనిసరి. అంతర్జాతీయ ఆంక్షలు యథాతథం.. ► హోం శాఖ అనుమతించిన ప్రయాణాలు మినహా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయి. ► కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. ► కంటైన్మెంట్ జోన్ల వెలుపల రాష్ట్రాలు కేంద్రంతో సంప్రదించకుండా లాక్డౌన్ విధించరాదు. -
డెబిట్, క్రెడిట్ కార్డులు : ఆర్బీఐ కొత్త నిబంధనలు
-
రేపటి నుంచి టీవీల ధరలకు రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ : డ్రైవింగ్ లైసెన్స్ నుంచి ఆరోగ్య బీమా వరకూ అక్టోబర్ 1 నుంచి పలు నూతన నిబంధనలు అమలవనున్నాయి. పలు వస్తువులపై పన్ను భారాలతో పాటు కొన్ని వెసులుబాట్లూ అందుబాటులోకి రానున్నాయి. టీవీల ధరలు పెరగడంతో పాటు, విదేశాలకు పంపే నగదుపై అదనపు పన్ను బాదుడు అమలవనుంది. నూతన నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్సు పొందడం సులభతరం కానుంది. గురువారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ఈ చలాన్‌ను ఆన్లైన్ పోర్టల్‌లో పొందుపరచాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు పరిమిత డాక్యుమెంట్లు సరిపోతాయని, హార్డ్ కాపీని అధికారులు అడగరని తెలిపింది. అనర్హతకు గురైన డ్రైవింగ్ లైసెన్సులు, పునరుద్ధరించిన లైసెన్సుల వివరాలను ఈ పోర్టల్‌లో రికార్డు చేస్తూ ఎప్పటికప్పుడు తాజాపరుస్తారు. ఇక ఆరోగ్య బీమా రంగంలో మూడు కీలక మార్పులను చేపట్టినట్టు బీమా నియంతరణ సంస్థ ఐఆర్డీఏ వెల్లడించింది. బీమా కంపెనీలు వినియోగదారులు సులభంగా అర్ధం చేసుకునేలా పాలసీలను రూపొందించడంతో పాటు టెలిమెడిసిన్‌కూ బీమా కవరేజ్‌ను వర్తింపచేస్తాయి. బీమా క్లెయిమ్‌లను బీమా కంపెనీలు సులభంగా పరిష్కరించనున్నాయి. పెరగనున్న టీవీల ధరలు మరోవైపు అక్టోబర్ 1 నుంచి టీవీల ధరలు భారం కానున్నాయి. టీవీల దిగుమతులపై 5 శాతం కస్టమ్ సుంకాలను ప్రభుత్వం విధించనుంది. తాజా నిర్ణయంతో 32 అంగుళాల టీవీ రూ 600, 42 అంగుళాల టీవీల ధరలు రూ 1200 నుంచి రూ 1500 వరకూ పెరగనున్నాయి. చదవండి : బడ్జెట్ ధరల్లో శాంసంగ్ స్మార్ట్ టీవీలు విదేశాలకు పంపే నగదుపై మరింత పన్ను విదేశాల్లో చదువుకునే పిల్లలకు తల్లితండ్రులు పంపే నగదు, బంధువులకు సాయం చేస్తూ పంపే మొత్తాలపై అదనంగా 5 శాతం మూలం వద్ద పన్ను (టీసీఎస్) విధిస్తారు. ఆర్బీఐ రెమిటెన్స్ పథకం కింద విదేశాలకు పంపే మొత్తాలపై టీసీఎస్ చెల్లించాలని ఫైనాన్స్ చట్టం, 2020 పేర్కొంది. -
డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆంక్షలు
సాక్షి, ముంబై: బ్యాంకు కార్డు మోసాలకు చెక్ పెడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త గైడ్ లైన్స్ అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డులకు మరింత రక్షణ కల్పించేలా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని ఆర్బీఐ వెల్లడించింది. తక్షణమే అన్ని బ్యాంకులు, కార్డులను జారీ చేసే కంపెనీలు డెబిట్, క్రెడిట్ కార్డుల అనవసరంగా అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపు సేవలను తీసివేయాలని, కార్డు వినియోగదారుడు అభీష్టం మేరకు ఆ సౌకర్యాన్ని కల్పించాలని ఆర్బీఐ కొత్త మార్గ దర్శకాలను జారీ చేసింది.. క్రెడిట్ కార్డులను ఇంటర్నేషనల్, ఆన్ లైన్ లావాదేవీలకు, కాంటాక్ట్ లెస్ కార్డ్ లావాదేవీలకు వాడాలంటే, ముందస్తు అనుమతి తప్పనిసరి. వాడకంపై ముందుగానే పరిమితులను పెట్టుకోవచ్చు. ఈ పరిమితి దాటి కార్డు ద్వారా లావాదేవీకి ప్రయత్నిస్తే, వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్ ఫోన్ కు సమాచారం అందుతుంది. కస్టమర్లు తమ కార్డులను ఏటీఎం, ఎన్ఎఫ్సీ, పీఓఎస్, ఈ-కామర్స్ లావాదేవీలకు వాడకుండా తాత్కాలికంగానూ నిషేధించుకోవచ్చు. బ్యాంకులు జారీచేసే క్రెడిట్, డెబిట్ కార్డులుఏటీఎంలలోనూ, పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) వద్ద మాత్రమే పనిచేస్తాయి. కస్టమర్లకు వారి నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కు ఖాతాను జత చేస్తారు. ఈ నిబంధన ప్రీ పెయిడ్, గిఫ్ట్ కార్డులకు మాత్రం వర్తించదు. ఎలా అంటే మొబైల్ లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా మీ బ్యాంక్ ఖాతాకు లాగిన్ అవ్వాలి. కార్డులు విభాగంలోకి వెళ్లి ' మేనేజ్ కార్డ్స్ ' ఎంచుకోవాలి. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఇక్కడ మనకు కావాల్సిన దాన్ని ఎంచుకుని డిసేబుల్ చేయాలి. మళ్లీ కావాలనుకున్నపుడు దానికనుగుణంగా ఆన్ - ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ట్రాన్సాక్షన్ పరిమితిని కూడా సెట్ చేసుకోవచ్చు. -
కోవిడ్ నిబంధనల్ని అతిక్రమిస్తే భారీ జరిమానాలు
లండన్: బ్రిటన్‌లో కరోనా కేసులు తీవ్రతరమవుతూ ఉండడంతో ప్రభుత్వం మరిన్ని ఆంక్షల్ని విధించింది. ఈ ఆంక్షల్ని అతిక్రమిస్తే 10 వేల పౌండ్లు (దాదాపుగా 10 లక్షల రూపాయలు) వరకు జరిమానాలు విధించడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 28 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఇంటి నుంచి పని చేసుకునే సౌకర్యం లేని నిర్మాణ రంగంలో కార్మికులు, ఆదాయం కోల్పోయిన ఇతర వర్గాల వారికి 500 పౌండ్లు ఇస్తామని ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్ వెల్లడించారు. యూకే ప్రస్తుతం కరోనా వైరస్ రెండో దశ ఎదుర్కొంటోందని , నిబంధనల్ని ఎవరైనా అతిక్రమిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. వైరస్‌ని నియంత్రించాలంటే కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు సెల్ఫ్ క్వారంటైన్ 14 రోజుల నిబంధనల్ని అతిక్రమిస్తే వెయ్యి నుంచి 10 వేల పౌండ్ల జరిమానా విధిస్తామన్నారు. తరచూ ప్రయాణాలు సాగించే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు కోవిడ్ నిబంధనల్ని పాటించడం లేదన్నారు. -
ఆస్కార్... కొత్త రూల్స్
96వ ఆస్కార్ అవార్డు నుంచి ఉత్తమ చిత్రానికి సంబంధించిన ఎంపిక విధానం, అందులోని పలు రూల్స్‌ను మారుస్తున్నట్టు ప్రకటించింది అకాడమీ ఆఫ్ మోషన్స్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్. 2024లో 96వ ఆస్కార్ వేడుక జరగనుంది. అప్పటినుంచి కొత్త విధానం అమలులోకి వస్తుంది. అకాడమీ ఏర్పాటు చేసిన కొత్త నియమ, నిబంధనలు పాటించిన చిత్రాలను మాత్రమే ఉత్తమ చిత్రానికి ఎంపిక చేయాలనుకుంటోంది కమిటీ. ఇక నిబంధనల విషయానికి వస్తే...ఆస్కార్‌కు ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వాలంటే... ఓ సినిమాలోని ప్రధాన పాత్ర లేదా సహాయ పాత్ర తప్పకుండా భిన్న వర్గాలకు సంబంధించినది అయి ఉండాలి. కథలోని ఐడియా తక్కువ ప్రాతినిధ్యం వహించిన వర్గానికి సంబంధించింది అయి ఉండాలి. అంతే కాదు చిత్రబృందంలోనూ వివిధ వర్గాలకు సంబంధించినవాళ్లను భాగం చేయాలి. ఇలా పలు నియమాలు పెట్టింది ఆస్కార్. ఈ నియమాలన్నింటినీ పాటిస్తేనే ఉత్తమ చిత్రం విభాగానికి సినిమా ఎంపికవుతుంది. అన్ని వర్గ, వర్ణ, లింగ బేధాలను సమానంగా ఉంచేందుకు, సినిమాల్లో భిన్నతను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకుందట కమిటీ. ఈ నియామాలను కేవలం సినిమాలో మాత్రమే కాదు, సినిమా చేసే టీమ్, స్టూడియో అన్నింట్లోనూ పాటించాలని పేర్కొంది. -
ఎన్నికలు @ కోవిడ్
న్యూఢిల్లీ: ఎన్నికల ఇంటింటి ప్రచారంలో ఐదుగురే పాల్గొనాలి..పోలింగ్ బూత్‌లలో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలి..ఈవీఎం బటన్ నొక్కే ముందు ఓటర్లు గ్లవ్స్ ధరించాలి..కోవిడ్–19 నేపథ్యంలో ఎన్నికల కమిషన్(ఈసీ) తాజాగా విడుదల చేసిన ఎన్నికల మార్గదర్శకాల్లో ఇవి కొన్ని..! కేంద్రం విడుదల చేసిన కోవిడ్–19 కంటైయిన్మెంట్ మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల బహిరంగ సభలు, సమావేశాలను రాజకీయ పార్టీలు నిర్వహించుకోవాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. కోవిడ్–19 సమయంలో జరిగే సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వివరించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు నామినేషన్లను ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. డిపాజిట్లను కూడా ఆన్లైన్లో చెల్లించవచ్చు. ఎన్నికల ప్రక్రియ సమయంలో కూడా మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, పీపీఈ కిట్ల వాడకం వంటి ప్రామాణిక రక్షణ చర్యలను కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో నివాసం ఉండే ఓటర్ల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేస్తామని ఈసీ తెలిపింది. ఒకవైపు, కరోనా మహమ్మారి ముప్పు మరింత తీవ్రం కానుందని ఆందోళనలు వ్యక్తమవుతుండగా, ఈసీ నిబంధనలకు లోబడి మొట్టమొదటి ఎన్నికలు బిహార్ అసెంబ్లీకి జరిగే అవకాశాలున్నాయి. అయితే, బిహార్ ఎన్నికలపై ఈసీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈసీ జారీ చేసిన విస్తృత మార్గదర్శకాలివీ.. ► నామినేషన్ దాఖలు, పత్రాల పరిశీలన, గుర్తుల కేటాయింపు వంటివి సజావుగా సాగేందుకు భౌతిక దూరం నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి చాంబర్ ఉండాలి. అభ్యర్ధులకు రిటర్నింగ్ అధికారి ముందుగానే సమయం కేటాయించాలి. ► నామినేషన్ వేసేందుకు ఎన్నికల అధికారి వద్దకు వెళ్లే అభ్యర్ధి వెంట ఇద్దరు వ్యక్తులు, రెండు వాహనాలు మాత్రమే ఉండాలి. ► ఇంటింటి ప్రచా రం సమయంలో భద్రతా సిబ్బంది మినహాయించి అభ్యర్థి సహా ఐదుగురే పాల్గొ నాలి. రోడ్‌షోల్లో పాల్గొ నే వాహన కాన్వాయ్‌లో భద్రతా సిబ్బందిని మిన హాయిస్తే ఐదు వాహనాలే ఉండాలి. ► కోవిడ్–19 మార్గదర్శకాలకు లోబడి బహిరంగ సమావేశాలు, సభలు ఏర్పాటు చేసుకోవాలి. ► జిల్లా ఎన్నికల అధికారి ముందుగా అనుమతించిన చోటే బహిరంగ సభలు జరపాల్సి ఉంటుంది. సభలకు హాజరయ్యే వారు భౌతిక దూరం వంటివి పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఎన్నికల సభలకు హాజరయ్యే వారి సంఖ్య రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎస్డీఎంఏ) పేర్కొన్న పరిమితికి లోబడి ఉండేలా చూడటం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీ బాధ్యత. ► పోలింగ్‌కు కనీసం ఒక రోజు ముందు పోలింగ్ స్టేషన్లను తప్పనిసరిగా పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయాలి. ► అన్ని పోలింగ్ స్టేషన్ల ప్రవేశద్వారం వద్ద థర్మల్‌స్కానర్లు ఏర్పాటు చేయాలి. ఎన్నికల సిబ్బంది కానీ పారామెడికల్ సిబ్బంది కానీ పోలింగ్ స్టేషన్ ప్రవేశ ద్వారం వద్దే ఓటర్లకు థర్మల్ స్కానింగ్ చేపట్టాలి. ► ఓటర్లందరికీ శరీర ఉష్ణోగ్రతలు గమనించాలి. అనుమానాస్పదంగా ఉంటే రెండు పర్యాయాలు ఉష్ణోగ్రతలు తీసుకోవాలి. ఆరోగ్యశాఖ జారీ చేసిన సురక్షిత స్థాయికి మించి కనిపిస్తే వారికి పోలింగ్ ముగిసే చివరి గంటలో ఓటేసేందుకు అవకాశం ఇస్తారు. ► కోవిడ్–19 సోకి క్వారంటైన్లో గడుపుతున్న వారికి కూడా పోలింగ్ ముగిసే ఆఖరి గంటలో అవకాశం కల్పిస్తారు. ► పోలింగ్ బూత్‌లో ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కేముందు వారికి డిస్పోజబుల్ గ్లవ్స్ అందజేస్తారు. ► పోలింగ్ స్టేషన్లో ప్రస్తుతం ఉన్న 1,500 మంది ఓటర్లకు బదులు.. వెయ్యి మందికి మించి ఉండరాదు. ► ఎన్నికల ప్రక్రియ సమయంలో కోవిడ్–19 సంబంధిత ఏర్పాట్లు, నివారణ చర్యలు వంటివి పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నోడల్ అధికారులు ఉంటారు. ఎన్నికల అధికారుల శిక్షణ కూడా ఆన్లైన్లోనే జరిపే అవకాశం ఉంది. ► ఎన్నికల సిబ్బందిలో కోవిడ్–19 లక్షణాలున్న వారిని గుర్తించి, వారికి బదులుగా మరొకరిని నియమించే ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు చూసుకుంటారు. ► ఓట్ల లెక్కింపు కేంద్రానికి తీసుకువచ్చే ముందు ఈవీఎంలు, వీవీప్యాట్లను శానిటైజ్ చేయాలి. -
కోవిడ్ ప్రొటోకాల్‌తో వేడుకలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండడంతో ఢిల్లీ ఎర్రకోటలో ఇవాళ జరిగే 74వ స్వాతంత్య్ర దిన వేడుకలకు రక్షణ శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. జాతీయ పతాకం ఎగుర వేయడం దగ్గర్నుంచి, ప్రధాని ప్రసంగం, జాతీయ గీతాలాపన వరకు ప్రతీ కార్యక్రమంలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు, పీపీఈ కిట్లు ధరించేలా మార్గదర్శ కాలను రూపొందించింది. ఎర్రకోట పరిసరా ల శానిటైజేషన్ దగ్గర్నుంచి హాజరయ్యే అతిథుల పాటించే భౌతిక దూరం వరకు ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంది. పోలీసు సిబ్బందితో వివిధ అంచెల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ప్రతీ ఏడాది జరిగే పంద్రాగస్టు వేడుకలకి, ఈసారి జరిగే వేడుకలు ఎలా భిన్నమో వివరిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరసగా ఏడోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఎర్రకోట వేదికగా ఆయన శనివారం చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. కోవిడ్ సంక్షోభం, చైనాతో ఉద్రిక్తతలు, ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మోదీ ఏం మాట్లాడతారని ఆసక్తిగా చూస్తున్నారు. ► ఈసారి వేడుకలకి దౌత్యప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు కలిపి 4 వేల మందికి ఆహ్వా నం అందింది. ఏటా హాజరయ్యే వారిలో ఇది 20% మాత్రమే. ► పాఠశాల విద్యార్థులకు బదులుగా ఎన్సీసీ సిబ్బంది ఈసారి వేడుకల్లో పాల్గొంటారు ► ఇద్దరి అతిథుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీట్ల ఏర్పాటు. అతిథులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ► ఎర్రకోట లోపలికి వచ్చే ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు. కరోనా లక్షణాలున్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలించేలా అంబులెన్స్‌లు సిద్ధం. ► భద్రత విధుల్లో పాల్గొనే పోలీసులందరికీ పీపీఈ కిట్లు. ► ఈసారి వేడుకల్ని చూసే అవకాశం కరోనా వైరస్‌తో పోరాడి విజేతలైన 1,500 మందికి కల్పించారు. వారిలో 500 మంది పోలీసు సిబ్బంది. -
జిమ్‌లు రేపట్నుంచే..
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: నాలుగున్నర నెలల విరామం తర్వాత దేశవ్యాప్తంగా జిమ్‌లు, యోగా కేంద్రాలు బుధవారం నుంచి తెరుచుకోనున్నాయి. అన్‌లాక్–3.0లో వీటిని తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘యోగా కేంద్రాలు, జిమ్‌లలో కరోనా వ్యాప్తి నివారణ మార్గదర్శకాలను’ సోమవారం జారీ చేసింది. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వారిని మాత్రమే యోగా కేంద్రాలు, జిమ్‌లలోకి అనుమతించాలని తేల్చిచెప్పింది. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలోని యోగా కేంద్రాలు, జిమ్‌లు మూసి ఉంటాయి. ఈ జోన్ల వెలుపల ఉన్న వాటిని మాత్రమే తెరిచేందుకు అనుమతిస్తారు. మార్గదర్శకాలివే.. ► స్పాలు, స్టీమ్ బాత్, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలి. ► యోగా సెంటర్లు, జిమ్‌లలో అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకోవాలి. వ్యక్తుల మధ్య కనీసం 4 మీటర్ల దూరం ఉండేలా రీడిజైనింగ్ చేయించాల్సి ఉంటుంది. ► జిమ్‌లో సెంట్రలైజ్డ్ ఏసీ లేదా సాధారణ ఏసీ ఉంటే గది ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉంచాలి. వెంటిలేషన్ అధికంగా ఉండేలా చూడాలి. ► 65 ఏళ్ల వయసు పైబడినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు జిమ్‌లకు వెళ్లకపోవడమే మంచిది. ► హ్యాండ్ శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతే ఎవరైనా యోగా సెంటర్/జిమ్ లోపలికి ప్రవేశించాలి. ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ టెస్టు కూడా చేయించుకోవడం తప్పనిసరి. ► ఫేస్ మాస్కు/కవర్ ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. ► యోగా కేంద్రం/జిమ్‌లో ఉన్నంత సేపు ఆరోగ్యసేతు యాప్ ఉపయోగించాలి. ► జిమ్/యోగా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితో పాటు విజిటర్స్ తప్పకుండా ఫేస్ షీల్డ్‌లు ధరించాలి. ► కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి కఠినమైన వ్యాయామాలు చేసేముందు పల్స్ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవాలి. -
విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసింది. ఆగస్ట్ 8 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఆ వివరాలు.. ► విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులంతా www.newdelhiairport.in లో 7 రోజుల పాటు పెయిడ్ ఇన్సిట్యూషనల్ క్వారంటైన్లో, 7 రోజులు హోం క్వారంటైన్లోఉంటామని అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ► కుటుంబంలో ఎవరైనా చనిపోయినవారు, వృద్ధులు, సీరియస్ వ్యాధులున్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలున్నవారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండవచ్చు. అయితే, వారు బోర్డింగ్‌కు మూడు రోజుల ముందే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ► ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో నెగటివ్ వచ్చినవారు కూడా ఆ డాక్యుమెంట్ చూపించి, 14 రోజుల హోం క్వారంటైన్ అవకాశం పొందవచ్చు. ఆ పరీక్ష బోర్డింగ్‌కు గరిష్టంగా నాలుగు రోజుల లోపు జరిపి ఉండాలి. ► అంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఎలాంటి కోవిడ్–19 లక్షణాలు లేనివారినే బోర్డింగ్‌కు అనుమతిస్తారు. ► భూ సరిహద్దుల ద్వారా వచ్చేవారు కూడా పై నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ► ప్రయాణంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే మాస్క్, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర నిబంధనలు పాటించాలి. ► ప్రయాణికుల్లో ఎవరికైనా కోవిడ్–19 లక్షణాలు కనిపిస్తే.. వారిని ఫ్లైట్/షిప్ గమ్యస్థానం చేరిన వెంటనే కోవిడ్ స్పెషల్ హెల్త్ సెంటర్లకు తరలించి, చికిత్స అందిస్తారు. -
అన్‌లాక్ ఇలా..
సాక్షి, హైదరాబాద్ : సాధారణంగా ఏదైనా రెస్టారెంట్‌కు కుటుం బంతో కలసి వెళ్లినప్పుడు మనం ఏం చేస్తాం? మెనూ కార్డు తీసుకొని ఆర్డర్ ఇచ్చేందుకు ఇంటిల్లిపాదీ దాన్ని తరచితరచి చూస్తాం. ఆపై మనం పక్కనపెట్టిన కార్డును పక్క టేబుల్‌పై ఉన్న కస్టమర్లకు వెయిటర్లు ఇవ్వడమూ చూస్తుంటాం. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇకపై మెనూ కార్డు చేతులు మారే పరిస్థితికి తెరపడనుంది. ప్లాస్టిక్ మెనూ కార్డు స్థానంలో డిస్పోజబుల్ (ఒకసారి వినియోగించి పారేసే) మెనూ కార్డు దర్శనమివ్వనుంది. వీలైతే కాంటాక్ట్‌లెస్ ఆర్డర్ల విధానం అమల్లోకి రానుంది. హోటళ్లు, రెస్టారెంట్లలోని ఏసీల్లో ఉష్ణోగ్రత కేవలం 24–30 డిగ్రీల సెల్సియస్‌కే పరిమితం కానుంది. హోటళ్లు, షాపింగ్ మాళ్లను సందర్శించే వినియోగదారుల కోసం ఈ మేరకు కొత్త నిబంధనలు ఎదురుచూస్తున్నాయి. దేశంలో కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు 80 రోజు లుగా మూతపడిన వాణిజ్య కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లను ఈ నెల 8 నుంచి తిరిగి తెరిచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తాజాగా సడలింపుల మార్గదర్శకాలను ప్రకటించింది. షాపింగ్ మాళ్లు, వాణిజ్య కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు కేటగిరీలవారీగా నిబంధనలు విధించింది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. సుదీర్ఘ విరామం తర్వాత తెరుస్తున్నందున ముందుగా శానిటైజేషన్ చేశాకే ఉద్యోగులు, సిబ్బందిని లోనికి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే... కరోనా వ్యాప్తిని నిలువరించడంలో కీలకమైన భౌతికదూరం పాటించడంతోపాటు ప్రతి వ్యక్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, ఏవైనా వస్తువులు తాకినప్పుడు లేదా పనికి ముందు, తర్వాత తప్పకుండా చేతులను శానిటైజర్/హ్యాండ్‌వాష్/సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు శుభ్రపర్చుకోవాలని కేంద్రం సూచించింది. ప్రతి వాణిజ్య కార్యాలయం, హోటల్, రెస్టారెంట్, షాపింగ్ మాల్లో యాజమాన్యం, సిబ్బంది తప్పనిసరిగా మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలని, వినియోగదారులను తాకకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది. విధులకు వచ్చే ఉద్యోగులు, సిబ్బందితోపాటు వినియోగదారులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని, జ్వరం, దగ్గు తదితర లక్షణాలతో వచ్చే వారి గురించి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి లేదా 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది. కేటగిరీలవారీగా కేంద్రం మార్గదర్శకాలు ఇవీ... హోటళ్లు, అనుబంధ యూనిట్లు... ► గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారిని అనుమతించొద్దు. ►పనిచేసే సిబ్బంది తప్పకుండా మాస్కులు ధరించడంతోపాటు చేతికి గ్లౌజులు తొడుక్కోవాలి. ►కస్టమర్లు క్యూలలో నిల్చొనేటప్పుడు తప్పకుండా 6 అడుగుల భౌతికదూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ►రిసెప్షన్ వద్ద శానిటైజర్లు, వాష్ ఏరియాల్లో తప్పకుండా హ్యాండ్‌వాష్‌లు ఏర్పాటు చేయాలి. ► హోటల్‌కు వచ్చే అతిథుల వివరాలను పూర్తిగా నమోదు చేసుకోవాలి. అందుకు ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేయాలి. కార్యాలయాల్లో... ► ఎక్కువ మంది సిబ్బంది ఉండే కార్యాలయాలు సిబ్బందిని ఒకేసారి కాకుండా విడతలుగా లేదా వర్క్ ఫ్రం హోంకు అవకాశం ఇవ్వాలి. ► ప్రతి ఉద్యోగికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు మాస్కు వేసుకునేలా చేడాలి. ► లిఫ్ట్‌ల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. కార్యాలయం ప్రవేశంలోనే శానిటైజర్లు ఏర్పాటు చేసి వాటితో శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలి. ► శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నవారిని, జలుబు, దగ్గు తదితర లక్షణాలున్నవారికి ప్రవేశం అనుమతించవద్దు. ► మీటింగ్‌లను వీలైనంత తగ్గించుకొని ఆన్లైన్ పద్ధతిలో ఆదేశాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి. ► వాలెట్ పార్కింగ్ సిబ్బంది పూర్తి జాగ్రత్తతో ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలి. రెస్టారెంట్లలో... ► కస్టమర్ల్ల సీటింగ్ స్పేస్ విశాలంగా ఉండేలా, వ్యక్తుల మధ్య ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాట్లు చేయాలి. ► 50% సీటింగ్ సామర్థ్యానికి మించి వినియోగదారులను అనుమతించకూడదు. ► వృద్ధులు, చిన్నపిల్లల్ని అనుమతించవద్దు. ► డిస్పోజబుల్ మెనూలను వాడాలి. ఒకరు వాడిన మెనూను మరొకరు వాడకుండా చూడాలి. ► బట్ట న్యాప్కిన్లకు బదులు వినియోగదారులకు కాగితపు న్యాప్కిన్లు ఇవ్వాలి. ► కాంటాక్ట్‌లెస్ అర్డర్లతోపాటు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించాలి. ► ప్రధానంగా పార్శిల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలి. టేక్ అవేను ప్రోత్సహించేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. ► డోర్ డెలివరీ చేసే సిబ్బందికి తరచూ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడంతోపాటు శానిటైజర్ వినియోగాన్ని విస్తృతంగా వాడేలా చూడాలి. ► సెంట్రలైజ్డ్ ఏసీ వాడకాన్ని తగ్గించి బయటిగాలి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ► కస్టమర్లు వచ్చి వెళ్లిన వెంటనే శానిటైజేషన్ చేయాలి. షాపింగ్ మాల్స్‌లో... ► లోనికి వచ్చే ఉద్యోగులు మొదలు కస్టమర్లకు ప్రవేశద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాట్లు చేయాలి. ► షాపింగ్‌మాల్ సామర్థ్యంలో సగం మందికే ప్రవేశం కల్పించాలి. ► ప్రతి కస్టమర్ ఎడం పాటించేలా చూసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి. ► ఉద్యోగులు, సిబ్బంది చేతికి గ్లౌజులు వేసుకున్నాకే కస్టమర్లకు వస్తువులు అందించాలి. ► పిల్లల ఆట ప్రాంగణాలను తెరవకూడదు. ► లిఫ్ట్ వినియోగాన్ని తగ్గించి ఎస్కలేటర్లను ప్రోత్సహించాలి. కస్టమర్ల తాకిడిని బట్టి వీలైనప్పుడల్లా షాపింగ్ మాల్‌ను సోడియం హైపోక్లోరైడ్ లాంటి ద్రావణంతో శానిటైజ్ చేయాలి. -
శబరిమల దర్శనానికి మార్గదర్శకాలు జారీ
-
భూ యజమానులకు 60% వాటా!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చేపట్టే ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులకు ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ కింద భూమిలిచ్చేందుకు ముందుకొచ్చే భూ యజమానులను ప్రోత్సహిం చేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంగా హెచ్ఎండీఏ చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత వెసులుబాటు కలిగించే విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ► ల్యాండ్‌పూలింగ్ పథకం కింద సేకరించిన స్థలాల్లో ఇప్పటివరకు భూయజమానులు, హెచ్ఎండీఏల వాటా 50:50 శాతముండగా, తాజాగా భూయజమానుల వాటాను ప్రభుత్వం 60 శాతానికి పెంచి, హెచ్ఎండీఏ వాటాను 40 శాతానికి తగ్గించింది. దీంతో హెచ్ఎండీఏకు ల్యాండ్ పూలింగ్ పథకం కింద భూములిచ్చేందుకు వచ్చే వారికి పూర్తి స్థాయి భద్రతతో పాటు ప్రయోజనాలూ పెరగనున్నాయి. ► హెచ్ఎండీఏ వాటాలో 5 శాతాన్ని ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూ ఎస్), 10 శాతాన్ని దిగువ స్థాయి ఆదాయ వర్గాలు (ఎల్ఐజీ), 10 శాతం స్థలాన్ని మధ్య స్థాయి ఆదాయ వర్గాల (ఎంఐఈ) గృహ నిర్మాణ ప్రాజెక్టుల కోసం కేటాయిస్తారు. ► హెచ్ఎండీఏతో పాటు స్థలాలు పొందిన ఇతర యజమానులు జోన్ల నిబంధనలు పాటిస్తూ తమ వాటాలను రెసిడెన్షియల్/రెసిడెన్షియల్ కమ్ కమర్షి యల్/ఇన్స్టిట్యూషనల్/ఐటీ/కార్యాలయాలు/ఇతర అవసరాలకు వాడుకు నేలా కేటాయింపులు/ అమ్మకాలు/ వేలం/లీజుకు ఇచ్చుకోవచ్చు. ► నాలా చార్జీలను హెచ్ఎండీఏనే భరించ నుంది. అలాగే హెచ్ఎండీఏకు కేటాయించిన స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ఫీజులనూ భరిస్తుంది. ► ఇటు భూవినియోగ మార్పిడి చార్జీలను సైతం హెచ్ఎండీఏ భరించనుంది. ► రిజర్వు స్థలాలు/ఓపెన్ స్థలాలకు ప్రహరీ గోడలు, ఫెన్సింగ్ ఏర్పాటు ఖర్చులను హెచ్ఎండీఏ భరిస్తుంది. ► హెచ్ఎండీఏ లేఔట్ డ్రాఫ్ట్ అప్రూవల్ అయిన నాటి నుంచి మూడు నెలల్లోపు ల్యాండ్ ఓనర్లకు ప్లాట్లు కేటాయిస్తారు. ► ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 500 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. -
కోవిడ్-19 : గంటలో చికిత్స షురూ..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్ రోగులను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు గంటల తరబడి వేచిచూసేలా చేయడం, కొందరు రోగులు వెనుతిరిగి వెళుతున్న వార్తల నేపథ్యంలో కరోనా వైరస్ రోగుల చికిత్సకు ఢిల్లీ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం కోవిడ్-19 రోగుల నుంచి ఎలాంటి వివరాలు సేకరించకుండా అంబులెన్స్ నుంచి నేరుగా చికిత్స అందచేసే ప్రాంతానికి తరలించే ప్రక్రియను 15 నిమిషాల్లో పూర్తిచేయాలి. గంటలోపు రోగికి చికిత్స అందించేలా వైద్యుడు హాజరు కావడంతో పాటు వేచిఉండే ప్రాంతంలో సైతం ఆహారం, నీరు అందుబాటులో ఉంచాలి. ఆస్పత్రిలో బెడ్లు అందుబాటులో లేకుంటే మరోచోటకు తరలించే బాధ్యత సదరు ఆస్పత్రే వహించాలని తాజా నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది. మరో ఆస్పత్రికి తరలించే లోగా రోగికి అవసరమైన చికిత్సను చేపట్టాలి. దేశ రాజధానిలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతుండటం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. చదవండి : తబ్లిగీ జమాత్ సభ్యులకు కేంద్రం షాక్! -
కొన్ని నిబంధనలను సడలించాలి
టీవీ, ఫిల్మ్ షూటింగ్‌లకు కొన్ని షరతులతో కూడిన నియమ, నిబంధనలతో ముంబై ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ షరతుల్లో ‘65ఏళ్లకు పై బడినవారిని షూటింగ్స్‌కు అనుమతించవద్దు’, ‘షూటింగ్ లొకేషన్లో తప్పనిసరిగా ఒక డాక్టర్, ఓ నర్స్, ఓ అంబులెన్స్ ఉండాలి’ అనే నిబంధనలను పునఃపరిశీలించాలని ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టీడీఏ) ప్రభుత్వాన్ని కోరింది. తాజాగా ‘ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ కూడా ఈ రెండు నిబంధనలపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. ఇవి కాకుండా ప్రభుత్వం సూచించిన నిబంధనల్లో మరికొన్నింటిని తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను విడుదల చేసింది. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘స్టూడియోలో లేదా లొకేషన్‌కి దగ్గర్లోని హాస్పటల్స్, అపార్ట్‌మెంట్స్‌లో చిత్రబృందం బస చేసేలా నిర్మాతలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం సూచన సాధ్యమైంది కాదు. ఇప్పటికే హోటల్స్, అపార్ట్‌మెంట్స్‌ను కోవిడ్ 19 బాధితుల కోసం వినియోగిస్తున్నారు. కేవలం చిత్రబృందం కోసమే ఓ అపార్ట్‌మెంట్‌ను ఈ క్లిష్ట పరిస్థితుల్లో తీసుకోవడం కుదరకపోవచ్చు. అలాగే సినిమాల్లోని కుటుంబ సన్నివేశాల కోసం నిజమైన కుటుంబాన్నే ఎంపిక చేసుకుని షూటింగ్ చేయాలన్న సూచన అర్థరహితమైనది. ఎందుకంటే ఒకే కుటుంబంలో అందరూ యాక్టర్స్ ఉండరు. షూటింగ్ లొకేషన్స్‌లో ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఎలా అమలు అవుతున్నాయని పరిశీలించడానికి ఓ ఇన్స్పెక్టర్ ఉండాలని కొన్ని వర్కర్స్ అసోసియేషన్స్ వారు కోరుతున్నారు (ప్రభుత్వం సూచించకపోయినా). కానీ ఇది సరైంది కాదు. షూటింగ్స్ ఎలా జరుగుతున్నాయో ఓ వీడియో రూపంలో చిత్రీకరించి ప్రభుత్వ ప్రతినిధులకు నిర్మాతలు అందజేసే ఏర్పాటు జరుగుతుంది’’ అని ఆ లేఖలో పేర్కొంది. -
జేఎన్టీయూలో డిటెన్షన్ రద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మ్–డిలో డిటెన్షన్‌ను జేఎన్టీయూ రద్దు చేసింది. వివిధ సెమిస్టర్లలో విద్యార్థులు పాస్, ఫెయిల్‌తో సంబంధం లేకుండా (గతంలో డిటెయిన్ అయిన వారిని కూడా) తర్వాతి సెమిస్టర్‌కు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), రాష్ట్ర ఉన్నత విద్యామండలి జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ మార్గదర్శకాలను జేఎన్టీయూ గురువారం జారీ చేసింది. అందులోని ప్రధాన అంశాలివే.. 2020–21 విద్యా సంవత్సరంలో డిటెన్షన్ విధానం ఉండదు. నిర్దేశిత సబ్జెక్టులు పాస్ కాకున్నా విద్యార్థులంతా తర్వాతి సెమిస్టర్‌కు అనుమతి. ముందుగా ఫైనల్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ. ప్రతి సబ్జెక్టు పరీక్ష 2 గంటలే. గరిష్ట మార్కుల్లో తేడా ఉండదు. పరీక్షల్లో 8 ప్రశ్నలకు 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. తప్పనిసరి పార్ట్ అనేది లేదు. ప్రతి ప్రశ్నకు 20 నిమిషాల సమయం ఉంటుంది. లాక్డౌన్ కాలమంతా విద్యార్థులు కాలేజీలకు హాజరైన ట్లుగానే పరిగణనలోకి. అయితే హాజరు తక్కువగా ఉన్న వారి వివరాలు వెబ్సైట్లో నమోదు. ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు సంబంధిత కాలేజీలోనే నిర్వహణ. కాలేజీల మార్పు ఉండదు. కాలేజీల మూసివేతకు దరఖాస్తు చేసిన కాలేజీల విద్యార్థులకు సమీప కాలేజీలో పరీక్షలు. బీటెక్ నాలుగో సంవత్సరం, రెండో సెమిస్టర్, బీపార్మసీ రెండో సెమిస్టర్ పరీక్షలు, ఎంబీఏ, ఎంసీఏ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి మొదలు. రవాణా సదుపాయం లేక పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులు 45 రోజుల్లో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. బీటెక్ ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్ రెండో సెమిస్టర్ పరీక్షలు, ఫార్మ్–డి రెండో, మూడో, నాలుగో, 5వ సంవత్సరం, పార్మ్–డి (పీబీ) సెకండియర్ పరీక్షలు జూలై 16 నుంచి ప్రారంభం. ఆగస్టు 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. ప్రథమ బీటెక్, బీపార్మసీ ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్, నాలుగో సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు 3వ తేదీ నుంచే ఉంటాయి. ఎంబీఏ, ఎంసీఏ ఫస్టియర్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్, ఎంసీఏ సప్లిమెంటరీ ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు, ఎంటెక్, ఎంఫార్మసీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్, ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫార్మ్–డి ఫస్టియర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలూ అప్పుడే ఉంటాయి. జూలై 1 నుంచి 15 వరకు కాంటాక్టు తరగతులు, ల్యాబ్ ఎక్స్పరిమెంట్స్, ల్యాబ్ పరీక్షల నిర్వహణ. బీటెక్, బీఫార్మసీ సెకండ్ సెమిస్టర్ (రెగ్యులర్), ఫస్ట్ సెమిస్టర్ (సప్లిమెంటరీ) పరీక్షలకు ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు (రిజిస్ట్రేషన్) ఈనెల 6లోగా పూర్తి చేయాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తదితర ఫీజులను విద్యార్థులు కాలేజీకి రాకుండా ఆన్లైన్లో చెల్లించే ఏర్పాట్లు చేయాలి. ఫీజుల చెల్లింపు, ఫలితాల వివరాలను విద్యార్థులకు తెలియజేసేందకు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయాలి. కరోనా జాగ్రత్తలు తప్పనిసరి... ► విద్యార్థులు, సిబ్బంది క్యాంపస్‌లో ఉన్నప్పుడు మాస్క్‌లు కచ్చితంగా ధరించాలి. మాస్క్‌లు ధరించిన వారినే సెక్యూరిటీ సిబ్బంది అనుమతించాలి. ► ప్రతి భవనం వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు, సిబ్బంది వాటిని ఉపయోగించేలా చూడాలి. ► తరగతి గదులు, పరీక్ష హాళ్లు, ల్యాబ్‌లలో భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. ► థర్మల్ స్కానింగ్ తప్పనిసరిగా అమలు చేయాలి. తరగతి గదులు, ప్రయోగశాలలను, కాలేజీ బస్సులను ప్రతిరోజూ శానిటైజ్ చేయాలి. ► ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఐసోలేట్ చేసి చికిత్స అందించాలి. ► పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రతి బెంచ్‌కు ఒకరే.. అదీ జిగ్‌జాగ్‌లో కూర్చోబెట్టాలి. -
రైల్వే టీటీఈలకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: 137 ఏళ్లుగా రైల్లో తెల్ల డ్రెస్సుపై నల్ల కోటు ధరించి దగ్గరికొచ్చి టికెట్ చెక్ చేసే రైల్వే టికెట్ కలెక్టర్ రూపం కరోనా కారణంగా మారిపోనుంది. వీరికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను రైల్వే బోర్డు విడుదల చేసింది. ఇకపై వారు చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించి దూరంగా నిలబడి భూతద్దం ద్వారా టికెట్లను పరిశీలించనున్నారు. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న 100 జంట రైళ్లలో వీరు ఈ విధంగా కనిపించే అవకాశం ఉంది. కరోనా ముప్పును తగ్గించేందుకు టై, కోటును ధరించకుండా విధులు నిర్వహించాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అయితే పేరు కలిగిన ప్లేట్ మాత్రం ధరిస్తారని చెప్పింది. విధుల్లోకి వెళ్లే ముందు వీరికి థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఒకవేళ ఉద్యోగులకు శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉంటే ముందే చెప్పాల్సిందిగా కోరింది. వారికి తగిన మాస్కులు, ముఖానికి అడ్డు పెట్టుకునే కవచాలు, గ్లౌజులు, తలకు ధరించే కవర్లు, శానిటైజర్లు, సోపులు అందించనున్నట్లు చెప్పింది. టికెట్లను పరిశీలించేందుకు భూతద్దం ఇవ్వనున్నట్లు చెప్పింది. టికెట్లను తాకకుండా పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి సీనియర్ టికెట్ కలెక్టర్ ఇంచార్జ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అవి రెగ్యులర్ రైళ్లు కాదు వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు చేరవేయడానికి ప్రవేశపెట్టిన శ్రామిక్ ప్రత్యేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లువెత్తుతున్న విమర్శలపై రైల్వేశాఖ వివరణ ఇచ్చింది. అవి రెగ్యులర్ రైళ్లు కాదని, వలస కూలీల అవసరాన్ని బట్టి వాటి గమ్యస్థానాన్ని పొడిగించడం లేదా కుదించడం.. దారి మళ్లించడం వంటివి చేస్తున్నామని, అందువల్లే కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. మే 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 3,840 ప్రత్యేక రైళ్లు నడిపామని, వీటిలో 52 లక్షల మంది ప్రయాణించారని రైల్వేబోర్డు చైర్మన్ వి.కె.యాదవ్ చెప్పారు. అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు శ్రామిక్ రైళ్లలో ప్రయాణించకపోవడమే మంచిదని సూచించింది. మే 27న ఈ రైళ్లలో మరణించిన తొమ్మిది మందికి అంతకు ముందే ఆరోగ్య సమస్యలున్నట్టు తేలిందని వెల్లడించింది. ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నంబర్లు 139, 138కు ఫోన్ చేయాలని కోరింది. -
శుభ్రంగా పని చేసుకుందాం
సినిమా షూటింగ్ అంటే సందడి. ఓ హడావిడి. ఓ గందరగోళం. లొకేషన్ అంతా యూనిట్ సభ్యులతో కిటకిటలాడుతుంది. రానున్న రోజుల్లో సందడి ఉంటుంది కానీ లొకేషన్లో ఉండేవాళ్ల సంఖ్య తగ్గుతుంది. హడావిడి ఉంటుంది.. భద్రతతో కూడినది. కరోనా పూర్తిగా తొలగిపోలేదు. పనులన్నీ మెల్లిగా ప్రారంభమయ్యాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ షూటింగ్‌కి అనుమతులు ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. షూటింగ్ చేసే పరిసరాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి నిబంధనలు పాటించాలి? వంటి విషయాలతో ప్రతీ ఇండస్ట్రీ కొన్ని గైడ్లెన్స్ తయారు చేసుకుంటోంది. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన టీవీ మరియు సినిమాల చిత్రీకరణలో ‘ఇలాంటి భద్రతలను పాటిస్తూ షూటింగ్ చేసుకుంటాం’ అని ప్రొడ్యూసర్స్ గిల్డ్ కొన్ని గైడ్ లైన్స్‌తో ఓ లేఖను మహారాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అందులోని గైడ్ లైన్స్‌ని నిర్మాణ సంస్థలు పాటించాలని.. ఇవన్నీ పాటిస్తూ ‘శుభ్రంగా’ పని చేసుకుందాం అని గిల్డ్ కోరనుంది. కొన్ని గైడ్ లైన్స్ ఈ విధంగా. ► లొకేషన్‌కి అడుగుపెట్టే ముందు ప్రతిఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వారితో పాటు తెచ్చుకున్నవన్నీ శానిటైజ్ చేయడం తప్పనిసరి. ► లొకేషన్లో ఉండేవాళ్లందరూ తప్పకుండా మాస్కులు ధరించే పని చేయాలి. వాడిన మాస్క్‌ను జాగ్రత్తగా పడేయాలి. ఎక్కడపడితే అక్కడ వదిలేయకూడదు. ► సెట్లో చేతులు కలపడాలు, కౌగిలించుకోవడాలు మానేయాలి. ► చిత్రీకరణలో వాడే తినుబండరాలను సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ► లొకేషన్లో ప్రతిఒక్కరూ కనీసం రెండు మీటర్ల దూరం పాటించాలి. ► ఈ జాగ్రతలన్నీ అలవాటుగా మరేంత వరకూ ప్రతిరోజూ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో షూటింగ్‌కి ముందు ఓ డ్రిల్లా చేయాలి. ► షూటింగ్‌కి 45 నిమిషాల ముందే ప్రతీ ఒక్కరూ లొకేషన్లో ఉండేలా చూసుకోవాలి. ► ప్రతీరోజూ షూటింగ్‌కి ముందు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన ఏజెన్సీ ద్వారా స్టూడియో మొత్తాన్ని శానిటైజ్ చేయించాలి. ► లొకేషన్లో చేతులు శుభ్రపరుచుకోవడానికి వీలుగా బేసిన్లు ఏర్పాటు చేయాలి. ► ఇంట్లో ఉండి అయినా చేయగలిగే పని అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని ప్రోత్సహించాలి. 60 ఏళ్లకు పైబడిన వాళ్లు, ఆరోగ్యం బాగాలేని వాళ్లను ఇంటి నుండి పని చేసేలా చూడాలి. ► సినిమాకు పని చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్ సర్టిఫికెట్‌ను నిర్మాణ సంస్థకు అందజేయాలి. ► ఫేస్ మాస్కులను, గ్లౌజ్‌లను తప్పనిసరిగా వాడేలా చూసుకోవాలి. ► నటీనటుల ఆడిషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో చేసుకునేలా చూసుకోవాలి. ► చిత్రీకరణ జరిపే లొకేషన్ ఏ జోన్లోఉందో చూసుకుని దాన్ని బట్టి అనుమతులు తీసుకుని చిత్రీకరణ జరపాలి. ► లొకేషన్స్ కోసం వెతకడానికి వెళ్లినప్పుడు టీమ్‌లో తక్కువ మంది ఉండేట్టు చూసుకోవాలి. ► మేకప్, హెయిర్ స్టయిల్ ఆర్టిస్ట్‌లు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించే మేకప్, స్టయిలింగ్ చేయాలి. కచ్చితంగా చేతులు శుభ్రం చేసుకుని మేకప్ వేయాలి. ► యాక్టర్ మేకప్ వేసుకున్న తర్వాత మాస్క్ ధరించడం కుదరకపోతే ఫేస్ మాస్క్ వేసుకోవాలి. ► విగ్గులు, సవరాలు తప్పకుండా శానిటైజ్ చేసినవే వాడాలి. ► సినిమాకు వాడే కాస్ట్యూమ్స్ తప్పకుండా శుభ్రపరిచినవే వాడాలి. ► క్యాటరింగ్ చేసేవాళ్లు తప్పనిసరి పీపీఈ కిట్స్ ధరించాలి. అవసరమైతే ఇంట్లో తయారు చేసుకున్న భోజనం తీసుకురావడం బెస్ట్. ► వీలైనంత అవుట్ డోర్ షూటింగ్స్ తగ్గించుకోవాలి. వీలైనంత తక్కువమంది స్టాఫ్ పని చేసేట్టు చూసుకోవాలి. -
8 కేటగిరీల వారికే కరోనా టెస్టులు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఎవరికి చేయాలనే దానిపై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. పరిస్థితిని బట్టి ఇప్పటివరకూ నాలుగు దఫాలుగా మార్గదర్శకాలు ఇచ్చిన ఐసీఎంఆర్ సోమవారం ఐదోసారి సవరించిన గైడ్‌లైన్స్‌ను ఇచ్చింది. ఇందులో భాగంగా 8 రకాల కేటగిరీల వాళ్లకు విధిగా ఆర్టీ–పీసీఆర్ (రియల్ టైమ్ పల్మనరీ చైన్ రియాక్షన్) పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు ఈ మార్గదర్శకాలను అనుసరించి వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. 8 కేటగిరీల్లో ఎవరెవరు? ► ఐఎల్ఐ (ఫ్లూ లక్షణాలు ఉన్న) వాళ్లకు.. వ్యక్తిగతంగా గానీ, అంతర్జాతీయ ప్రయాణం చేసిన వారికి(14 రోజుల్లో). ► కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్ అయిన ఐఎల్ఐ లక్షణాలు ఉన్నవారికి. ► ఆస్పత్రుల్లో పనిచేస్తూ ఐఎల్ఐ లక్షణాలున్న వారు, వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో సంబంధం ఉన్నవారు. ► తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్(సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్)తో బాధపడుతున్నవారు. ► ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోయినా(అసింప్టమాటిక్) హైరిస్క్ పాజిటివ్ కేసులతో సంబంధం ఉన్నవారు లేదా టెస్టు చేసిన తర్వాత కరోనాగా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్ అయినవారు. æ హాట్స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లలో వైరస్ లక్షణాలున్న అందరికీ. ► ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందుతూ ఐఎల్ఐ లక్షణాలు కనిపించిన వారికి. ► ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో జ్వరం లేదా జలుబు లక్షణాలున్నా... ఐఎల్ఐ లక్షణాలు కనిపించిన వారికి. æ కరోనా నిర్ధారణ పరీక్ష చేయలేదన్న కారణంతో ప్రసవాలు లాంటి అత్యవసర సేవలను వాయిదా వేయరాదు. -
లాక్డౌన్ 4.0: కొత్త నిబంధనలు ఇవే!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించింది. ఈ మేరకు నాలుగో విడత లాక్డౌన్ మార్గదర్శకాలు తెలుపుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఎక్కడెక్కడ ఉండాలో నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దేశంలో చిక్కు కుపోయిన విదేశీయులు, ఇతర ప్రాంతాల్లో చిక్కు కుపోయిన వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతరుల తరలింపునకు అనుమతినిచ్చింది. అదే విధంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వ్యక్తుల రాకపోకలు నిషేధిస్తూ... అవసరమైన సేవలకు మాత్రం మినహాయింపునిచ్చింది.(భారత్‌లో ఒకే రోజు 5,242 పాజిటివ్ కేసులు) లాక్డౌన్ 4.0: సోమవారం నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధలు 1. విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. మందులు, ఔషధాలు ఇతరత్రా వైద్య పరికరాలు సరఫరా చేసే విమానాలు ఎంహెచ్ఏ ప్రత్యేక అనుమతితో నడుస్తాయి. దేశీయ ఎయిర్ అంబులెన్సులు, వివిధ వర్గాలను చేరవేసేందుకు ప్రత్యేక విమానాలకు మాత్రమే అనుమతి. 2. కేవలం శ్రామిక్ రైళ్ల ప్రయాణానికి మాత్రమే అనుమతి. అదే విధంగా నిత్యావసరాలు సరఫరా చేసే ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడుస్తాయి. 3. కంటైన్మెంట్ జోన్లలోని షాపింగ్ మాల్స్ మినహా ఇతర ప్రాంతాల్లోని దుకాణాలు తెరిచేందుకు అనుమతి. సెలూన్లు, స్పాలు తెరచుకోవచ్చు. 4. ఢిల్లీ మెట్రో సహా అన్ని మెట్రో సర్వీసులు మే 31 వరకు బంద్. 5. సామాజిక, రాజకీయ, మతపరమైన సమావేశాలకు అనుమతి లేదు. మే 31 వరకు ప్రార్థనా మందిరాలు అన్నీ మూసివేత. 6. 65 ఏళ్ల వృద్ధులు, గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు ఇంటికే పరిమితం కావాలి. 7. రాత్రి 7 నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఎవరూ బయటకు రాకూడదు. అత్యవసరాల నిమిత్తం, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బయటకు వచ్చే వీలుంటుంది. 8. నిత్యావసరాలు సహా ఇతర వస్తువులు డెలివరీ చేసేందుకు ఇ- కామర్స్ కంపెనీలకు అనుమతి. అయితే కంటోన్మెంట్ జోన్లలో మాత్రం ఈ వెసలుబాటు ఉండదు. 9. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లు మే 31వరకు మూసివేసే ఉంటాయి. అయితే రెస్టారెంట్లలో టేక్అవే సర్వీసులకు అనుమతి. 10. కంటైన్మెంట్ జోన్లు మినహా.. అంతరాష్ట్ర, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకు అనుమతి. బస్సులు సహా ఇతర వాహనాలు నడుపవచ్చు. అయితే రాష్ట్రాల మధ్య పరస్పర అనుమతితోనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 11. పట్టణాలు, నగరాల్లో ప్రయాణాల(టాక్సీలు, ఆటోరిక్షాలు)పై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. 12. మే 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు మూసివేత. 13. స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతి. అయితే ప్రేక్షకులు మైదానానికి రావడం నిషిద్ధం. -
ప్లాంట్లను ప్రారంభించే ముందు జాగ్రత్త
న్యూఢిల్లీ: విశాఖపట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న విషవాయు లీకేజీ తరహా ప్రమాదాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ–ఎన్డీఎంఏ) పలు మార్గదర్శకాలను జారీ చేసింది. లాక్డౌన్ అనంతరం పరిశ్రమలను ప్రారంభించే సమయంలో ఉద్యోగులు, కార్మికుల రక్షణకు, ప్లాంట్ భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఈ మార్గదర్శకాలను రూపొందించింది. లాక్డౌన్ కారణంగా కొన్ని వారాలుగా పరిశ్రమలు మూతపడిన కారణంగా, వాల్వ్‌లు, పైప్‌ల్లో మిగిలిపోయి ఉన్న రసాయనాలతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముందని ఎన్డీఎంఏ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించింది. మూసివేత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కొన్ని ప్లాంట్లు తీసుకుని ఉండకపోవచ్చని పేర్కొంది. ప్రమాదకర రసాయనాలు, మండే స్వభావమున్న రసాయనాల స్టోరేజ్ ట్యాంక్‌ల నిర్వహణ విషయంలోనూ జాగ్రత్త అవసరమని సూచించింది. పైప్‌లు, వాల్వ్‌లు, వైర్లలో ఎలాంటి లీకేజీల్లేకుండా చూసుకోవాలంది. పరిశ్రమను ప్రారంభించిన తరువాత అన్ని జాగ్రత్తలు తీసుకుని తొలివారం ట్రయల్ రన్ మాత్రమే చేయాలని పేర్కొంది. ట్రయల్ రన్ సమయంలో అసాధారణ శబ్దాలు రావడం కానీ, పొగ వెలువడడం కానీ జరుగుతుందేమో పరిశీలించాలంది. వెంటనే ఉత్పత్తిని పెంచాలని ప్రయత్నించవద్దని, ప్లాంట్ అంతా శానిటైజ్ చేయాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉద్యోగులు, కార్మికుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలంది. అందరికీ శానిటైజర్లు, మాస్క్‌లు సరఫరా చేయాలంది. సమస్య తీవ్రంగా ఉంటే ప్లాంట్‌ను మూసివేసి, మెయింటెనెన్స్ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండే పరిశ్రమల్లో భద్రత చర్యలపై ఆయా రాష్ట్రాల్లోని విపత్తు నిర్వహణ సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. మేనేజీరియల్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది షిఫ్ట్‌కు 33% ఉండేలా చూసుకోవాలని, ఈ విషయంలో హోం శాఖ మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. -
విద్యాసంస్థలకు హెచ్ఆర్డీ గైడ్‌లైన్స్
న్యూఢిల్లీ: పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమయ్యాక విద్యార్థుల రక్షణకోసం చేపట్టాల్సిన చర్యలపై మానవ వనరుల మంత్రిత్వ శాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. పాఠశాలల్లో ఉదయపు అసెంబ్లీలను రద్దు చేయడం. క్రీడాకార్యకలాపాలను నిలిపివేయడం, స్కూల్ బస్సులకు నిబంధనలను తయారుచేయడం, స్కూల్ యూనిఫామ్‌లో మాస్కులను తప్పనిసరి చేయడం. మరుగుదొడ్లు వినియోగించడంలో పాటించాల్సిన నియమాలూ, క్యాంటీన్ల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యాసంస్థల భవనాలను క్రమం తప్పకుండా డిస్ఇన్ఫెక్ట్ చేయడం లాంటి కీలకమైన విషయాలు ఈ మార్గదర్శకాల్లో ఉన్నాయి. ఇప్పటికే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాంటి కొన్ని విద్యాసంస్థల్లో భౌతిక దూరం పాటించేందుకూ, విజిటర్స్‌ని పరిమితం చేసేందుకూ, షిఫ్ట్‌ల విధానంలో తరగతులు, లాబొరేటరీల సమయాల్లో మార్పు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆన్లైన్ పరీక్షలు, పోటీ పరీక్షల నిర్వహణలో కూడా రక్షణ చర్యలు చేపట్టాలని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. నూతన విద్యార్థులకు సెప్టెంబర్ నుంచి, సీనియర్ విద్యార్థులకు ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభించనున్నటు యూజీసీ ప్రకటించింది. సెమిస్టర్ పరీక్షలను ఆన్లైన్లో కానీ, నేరుగా గానీ జూలై నెలలో నిర్వహించుకోవచ్చని యూజీసీ సిఫార్సు చేసింది. పది, పన్నెండు తరగతులలో మిగిలిన సబ్జెక్టులకు పరీక్షలను త్వరలోనే నిర్వహించనున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) తెలిపింది. -
దేశంలో 11,933కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
-
12 వేలకు అడుగు దూరంలో..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పైపైకి ఎగబాకుతోంది. మంగళవారం నుంచి బుధవారం వరకు.. గత 24 గంటల్లో 39 మంది కన్నుమూశారు. మహారాష్ట్రలో 18 మంది, ఉత్తరప్రదేశ్‌లో ఆరుగురు, గుజరాత్లో నలుగురు, మధ్యప్రదేశ్‌లో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, తెలంగాణలో ఒకరు, తమిళనాడులో ఒకరు, పంజాబ్‌లో ఒకరు, మేఘాలయాలో ఒకరు మృతిచెందారు. కొత్తగా 1,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 11,933కు, కరోనా సంబంధిత మరణాల సంఖ్య 392కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. యాక్టివ్ కరోనా పాజిటవ్ కేసులు 10,197 కాగా, 1,343 మంది చికిత్సతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా చోటుచేసుకున్న 392 మరణాల్లో 178 మరణాలు మహారాష్ట్రలోనే వెలుగుచూడడం గమనార్హం. మహారాష్ట్రలో ఇప్పటిదాకా 2,687 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,561, తమిళనాడులో 1,204, రాజస్తాన్‌లో 1,005, మధ్యప్రదేశ్‌లో 987, ఉత్తరప్రదేశ్‌లో 735, గుజరాత్లో 695 కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 170 జిల్లాలను కరోనా హాట్స్పాట్లుగా, 207 జిల్లాలను నాన్–హాట్స్పాట్లుగా గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ బుధవారం చెప్పారు. నాన్–హాట్‌స్పాట్ జిల్లాల్లోనూ కరోనా తీవ్రత పెరిగే అవకాశం(పొటెన్షియల్) ఉన్నందున అక్కడ నియంత్రణ చర్యలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. భారత్‌లో కరోనా వ్యాప్తి ఇంకా సామూహిక సంక్రమణ దశకు చేరుకోలేదని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్లలో పని చేయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించామని, కరోనా అనుమానితులను గుర్తించడానికి వీరంతా ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యలు మరింత పటిష్టం హాట్స్పాట్లుగా గుర్తించిన జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. అక్కడ మనుషుల కదలికలపై కఠినమైన ఆంక్షలు అమలవుతాయని స్పష్టం చేసింది. హాట్స్పాట్లలో అన్ని రకాల వైద్య సేవలకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని వెల్లడించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కంటైన్మెంట్ జోన్లలో ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్‌లు, మందుల దుకాణాలు, ఫార్మసీలు, జన ఔషధీ కేంద్రాలు, వైద్య ఉపకరణాల దుకాణాలు, మెడికల్ ల్యాబ్‌లు, వెటర్నరీ ఆసుపత్రులు యథాతథంగా పని చేస్తాయని తెలిపింది. -
‘లాక్డౌన్’ ఆంక్షలు.. సడలింపులు..
సాక్షి, న్యూఢిల్లీ: రెండో దశ లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని శిక్షించదగ్గ నేరంగా నిర్ధారించారు. మద్యం, గుట్కా, పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించారు. అన్ని రకాల ప్రజా రవాణాను మే 3వ తేదీ వరకు నిషేధించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలు ఏప్రిల్ 20 వ తేదీ నుంచి కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. అయితే, వాటిలోని కార్మికులు, సిబ్బంది భౌతిక దూరం సహా అన్ని సాధారణ లాక్డౌన్ నిబంధనలను పాటించాలి. మే 3వ తేదీవరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తరువాత కొన్ని కార్యకలాపాలకు అనుమతిస్తామని కూడా ఆయన చెప్పారు. అందులో భాగంగానే లాక్డౌన్ కాలంలో ఆచరించాల్సిన, ఆచరించకూడని చర్యలతో కూడిన సమగ్ర మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. నిబంధనల సడలింపు వైరస్ హాట్ స్పాట్స్‌కు, కంటైన్మెంట్ జోన్స్‌కు వర్తించబోదని స్పష్టం చేసింది. తాము నిర్దేశించిన నిబంధనలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కచ్చితంగా పాటించాలని, అవసరమైతే, స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని, మరింత కఠినమైన ఆంక్షలను విధించవచ్చని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే లక్ష్యంతో ఏప్రిల్ 20 నుంచి పలు నిబంధనలను సడలించారు. వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగడం, ధాన్య సేకరణ జరగడం, దినసరి, రైతు కూలీలకు ఉపాధి కల్పించడం ఈ నిబంధనల సడలింపు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మార్గదర్శకాలివీ.. ► అన్ని పని ప్రదేశాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ సదుపాయాలను కల్పించాలి. ► ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్ వర్కర్లు, ప్లంబర్లు, మోటారు మెకానిక్‌లు, కార్పెంటర్లు తమ పనులు చేసుకోవచ్చు. ► మే 3 వరకు అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా ప్రయాణాలు నిషేధం. అందువల్ల మే 3 వరకు బస్సు, మెట్రో సర్వీసులు కూడా నడవవు. ► ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఎస్ఈజెడ్ల్లోని పరిశ్రమలు, ఎగుమతులు చేసే పారిశ్రామిక కేంద్రాలు, ఇతర పారిశ్రామిక టౌన్ షిప్స్ కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు. ► విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, రైలు సర్వీసులు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, జిమ్స్, క్రీడాకేంద్రాలు, ఈత కొలనులు, బార్ అండ్ రెస్టారెంట్స్ పై మే 3 వరకు నిషేధం కొనసాగుతుంది. ► మత ప్రాంతాలు, ప్రార్థనాకేంద్రాలను మే 3 వరకు మూసేయాలి. అప్పటివరకు రాజకీయ,క్రీడ, సామాజిక, మత కార్యక్రమాలపై కూడా నిషేధం కొనసాగుతుంది. ► హైవేలపై ఉన్న దాబాలు(హోటళ్లు), ట్రక్ రిపేరింగ్ షాప్స్, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన కాల్ సెంటర్లు ఏప్రిల్ 20 నుంచి కార్యకలాపాలను ప్రారంభించవచ్చు. ► వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన సామగ్రిని అమ్మే, వాటిని మరమ్మత్తులు చేసే షాపులను ఏప్రిల్ 20 నుంచి తెరవొచ్చు. వ్యవసాయ, పండ్ల తోటల రంగాలకు సంబంధించిన కార్యకలాపాలను నేటి నుంచే ప్రారంభించవచ్చు. ► ఔషధ, వైద్య పరికరాల తయారీ యూనిట్లు, ఆరోగ్య మౌలిక వసతులకు సంబంధించిన యూనిట్లు ఏప్రిల్ 20 నుంచి కార్యకలాపాలను ప్రారంభించవచ్చు. ► లాక్డౌన్ సమయంలో కిరాణా షాపులు, పండ్లు, కూరగాయల దుకాణాలు/బండ్లు, మిల్క్ బూత్స్, మాంసం, చేపలు అమ్మే దుకాణాలు తెరిచే ఉంటాయి. ► అనుమతించిన పరిశ్రమలు ఫ్యాక్టరీ ప్రాంగణం, లేదా దగ్గర్లోని భవనాల్లో సిబ్బంది, ఇతర కార్మికులు ఉండేందుకు సదుపాయాలు కల్పించాలి. భౌతిక దూరం తదితర నిబంధనలను అమలు చేయాలి. ► రక్షణ, పారా మిలటరీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, విపత్తు నిర్వహణ, ఎన్ఐసీ, ఎఫ్‌సీఐ, ఎన్సీసీ, నెహ్రూ యువ కేంద్ర, కస్టమ్స్ కార్యాలయాలు యథావిధిగా పనులు చేసుకోవచ్చు. మిగతా శాఖల్లో డిప్యూటీ సెక్రటరీ ఆపై హోదా ఉన్న అధికారులు కచ్చితంగా 100% హాజరు పాటించాలి. మిగతా ఉద్యోగులు అవసరాన్ని బట్టి 33% వరకు హాజరయ్యేలా చూసుకోవాలి. ప్రజల అవసరాలను బట్టి, అవసరమైన ఇతర కార్యకలాపాలకు రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలు ఏప్రిల్ 20 నుంచి అనుమతినివ్వవచ్చు. ► లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నియమిత సంఖ్యలో పారిశ్రామిక కార్యకలాపాలకు అనుమతినిచ్చారు. ► ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో కార్యకలాపాలు, ఈ కామర్స్ కార్యకలాపాలు, డేటా, కాల్ సెంటర్ విధులు, ఆన్లైన్ బోధన, దూరవిద్య విధానాలను కొనసాగించవచ్చు. ► నిత్యావసర వస్తువులను నేరుగా వినియోగదారుల ఇళ్ల వద్దకే సరఫరా చేసే విధానాన్ని అధికారులు ప్రోత్సహించాలి. ► బ్యాంకులు, బీమా కార్యాలయాలు, నగదు నిర్వహణ సంస్థలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు యథావిధిగా పనిచేస్తాయి. ► అన్ని సంస్థలు వీలైనంత వరకు ఉద్యోగులు తమ ఇళ్లలో నుంచే విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలి. ► ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలను సరఫరా చేసే ఈ కామర్స్ సంస్థలకు అనుమతి. ► కచ్చితంగా కొనసాగించాల్సిన అవసరం ఉన్న ఉత్పత్తి సంస్థలు రాష్ట్రాల అనుమతితో పనులు చేపట్టవచ్చు. ► బొగ్గు, ఇతర ఖనిజ ఉత్పత్తిలో ఉన్న సంస్థలు పనులు ప్రారంభించవచ్చు. ► ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ఉత్పత్తి సంస్థలు విధులు ప్రారంభించవచ్చు. ► నిత్యావసర, నిత్యావసరంకానివి అనే భేదం లేకుండా అన్ని వస్తువుల రవాణాకు అనుమతినిచ్చారు. ► అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాల్లో 20 మందికి మించి పాల్గొనరాదు. ► రోడ్లు, భవనాలు, సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ఇతర పారిశ్రామిక ప్రాజెక్టులు, పునరుత్పాదిత ఇంధన రంగంలోని ప్రాజెక్టులు, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల్లో నిర్మాణ పనులకు అనుమతినిచ్చారు. -
లాక్డౌన్ : పాటించాల్సిన కొత్త రూల్స్
న్యూఢిల్లీ : మే 3వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించిన కేంద్రం.. అందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. లాక్డౌన్ పూర్తయ్యే వరకు విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. థియేటర్లు, మాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, బార్లు మూసివేయనున్నట్టు తెలిపింది. అయితే ఏప్రిల్ 20 తర్వాత మాత్రం కొన్ని రంగాలకు కేంద్రం సడలింపులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ సంబంధిత అన్ని కార్యక్రమాలను కొనసాగించవచ్చని తెలిపింది. ఆన్లైన్ షాపింగ్ ద్వారా నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమతిచ్చింది. బ్యాంకుల కార్యకలాపాలు యథాతథంగా కొనసాగనున్నట్ట చెప్పింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల నిర్వహణకు అనుమతి కల్పించింది. అయితే కరోనా హాట్స్పాట్లలో మాత్రం ఈ మార్గదర్శకాలు వర్తించవని తెలిపింది. అక్కడ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నట్టు స్పష్టం చేసింది. హాట్స్పాట్లను ప్రకటించే అధికారం రాష్ట్రాలదేనని తెలిపింది. హాట్స్పాట్లలో ఎటువంటి జనసంచారం ఉండకూడదని తెలిపింది. హాట్స్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరింది. ప్రజలు బయటకు వచ్చినప్పుడు ఫేస్ మాస్క్‌లను ధరించడం తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది. కొత్త మార్గదర్శకాలు.. కాఫీ, తేయాకు తోటల్లో 50 శాతం మ్యాన్‌పవర్‌కు అనుమతి రాష్ట్ర సరిహద్దులు దాటేందకు వ్యక్తులను అనుమతి నిరాకరణ అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి జాతీయ ఉపాధిహామీ పనులకు అనుమతి ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు అనుమతి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు దుకాణలకు అనుమతి వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు అనుమతి అనాథ, దివ్యాంగ, వృద్ధ ఆశ్రమాల నిర్వహణకు అనుమతి భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు నిర్మాణ రంగ పనులకు స్థానికంగా ఉన్న కార్మికులకు మాత్రమే అనుమతి రాజకీయ సమావేశాలు, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి చదవండి : కరోనా : 11 వేలు దాటిన కేసులు.. 377 మంది మృతి లాక్డౌన్ పొడిగింపు; రైల్వేకు దెబ్బ -
మరికొన్ని మినహాయింపులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌కు ఆదేశించిన నేపథ్యంలో దీనినుంచి కొన్నిటికి మినహాయింపులు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్బీఐ, ఆర్బీఐ నియంత్రించే ఫైనాన్షియల్ మార్కెట్లు, పే అండ్ అకౌంట్స్ అధికారులు, కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) క్షేత్రస్థాయి అధికారులు, పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ, పెన్షన్ సేవలు, అటవీ సిబ్బందిని లాక్డౌన్ పరిధి నుంచి మినహాయించారు. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో కార్గో సేవల నిర్వహణ సిబ్బంది, బొగ్గు తవ్వకాలు, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే రెసిడెంట్ కమిషనర్లు, సిబ్బంది, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో పనిచేసే కస్టమ్స్ సిబ్బందిని కూడా లాక్డౌన్ నుంచి మినహాయించారు. జంతు ప్రదర్శన శాలల(జూ) నిర్వహణ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందితోపాటు అనాధ బాలల సంరక్షణ సిబ్బంది, అనాథలు, వితంతు శరణాలయాలు, పశు వైద్యశాలలు, మందుల షాపులు (జన ఔషధి దుకాణాలతో కలిపి), ఫార్మా రీసెర్చ్ ల్యాబ్‌లు, బ్యాంకింగ్ ఆధారిత ఐటీ సేవలు, ఏటీఎం నిర్వహణ ఏజెన్సీలను కూడా లాక్డౌన్ నుంచి మినహాయించారు. ఎవరేం వాడాలి? న్యూఢిల్లీ: మాస్కులు, గ్లౌజ్‌లు, కళ్లజోళ్లు, డిమాండ్ పెరగడంతో ఎవరెవరు ఎలాంటి రక్ష ణ ఉపకరణాలు వాడాలో చెప్తూ్త కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. దాని ప్రకారం.. ► కోవిడ్ రోగులకు చికిత్సచేసేవారికి పూర్తిస్థాయిలో రక్షణ ఉపకరణాలు ఉండాలి. ► పరిపాలన సిబ్బందిని ‘నో–రిస్క్’ జాబితాలో చేర్చారు. వీరికి ఈ వ్యక్తిగత రక్షణ పరికరాల అవసరం ఉండదు. పరిపాలన విభాగానికి చెందిన వారెవరూ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ప్రయాణికులకు సమాచారం అందించే హెల్త్ డెస్క్ సిబ్బందిని ‘లో– రిస్క్’ కేటగిరీలో చేర్చారు. వీరు మూడు పొరలున్న మెడికల్ మాస్క్, చేతి తొడుగులు వాడాలి. 3పొరల మెడికల్ మాస్క్ ద్రవాలను అడ్డుకోగలదు. రోగుల దగ్గు, తుమ్ముల ద్వారా వెలువడే ద్రవాలు శరీరంలోకి చేరకుండా కాపాడతాయి. ► పారిశుధ్య కార్మికులను మధ్యమస్థాయి ప్రమాదం ఉన్న ‘మోడరేట్ రిస్క్’ కేటగిరీలో ఉంచారు. తరచూ నేలను, ఉపరితలాలను శుభ్రం చేసే వీరికి ఎన్95 మాస్క్ అందించాలి. వైద్య పరీక్షలు నిర్వహించే వైద్యులు, నర్సులకు కూడా ఇంతే స్థాయిలో ప్రమాదం ఉంటుంది. ► రోగులను రవాణా చేసే వారికి పూర్తిస్థాయిలో ప్రమాదం ఉన్నందున అన్ని రకాల వ్యక్తిగత రక్షణ పరికరాలు అందుబాటులో ఉండాలి. ఇదే విధంగా నమూనాలు సేకరించే అధికారులకు, పరిశోధనశాల నిపుణలకు కూడా పూర్తిస్థాయిలో ఈ పరికరాలు అందించాలి. ► స్వీయ నిర్బంధంలో ఉన్న వారికి ప్రమాదం తక్కువ. కుటుంబంలో ఎవరైనా క్వారంటైన్లో ఉంటే వారికి సేవలందించే వ్యక్తి చేతి తొడుగులు తొడుక్కోవడం అవసరం. మిగిలిన కుటుంబ సభ్యులకు ఎలాంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు అవసరం లేదు. -
ఎంఎస్‌వోలకు షాక్: వినియోగదారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: చార్జీల మోతతో ఇబ్బందులు పడుతున్న కేబుల్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో కేబుల్ బిల్లులు తగ్గనున్నాయి. ఈ మేరకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కస్టమర్ల ప్రయోజనాలు కాపాడే దిశగా ట్రాయ్ కేబుల్, బ్రాడ్‌కాస్టింగ్ నిబంధనలకు కొత్త సవరణలు చేసింది. దీనికి సంబంధించి ఎంఎస్‌వోలకు ట్రాయ్ కొత్త గైడ్‌లైన్స్‌ను కూడా విడుదల చేసింది. తద్వారా కేబుల్ టీవీ ఆపరేటర్లకు భారీ షాకిచ్చింది. బ్రాడ్కాస్టర్లు విధించే చానల్ గరిష్ఠ ధరను రూ.19 నుంచి రూ. 12కు తగ్గించింది. అలాగే నెట్వర్క్ కెపాసిటీ ఫీజు(ఎన్సీఎఫ్)ను రూ.130 గా నిర్ణయించియింది. ఈ నిబంధనలు మార్చి1 నుంచి అమల్లోకి వస్తాయి. అంతేకాదు ఈ కొత్త నిబంధనలను ఈ నెలాఖరు (జనవరి) నాటికి వెబ్సైట్లో ఉంచాలని కూడా ఎంఎస్‌వోలను ఆదేశించింది. తాజా సవరణలో భాగంగా అన్ని ఫ్రీ చానెళ్లకు వసూలు చేసే ఫీజును ట్రాయ్ రూ. 140కి పరిమితం చేసింది. ఒక ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువ టీవీలుంటే వాటికి ఎన్సీఎఫ్లో 40 శాతం చొప్పున అదనంగా వసూలు చేసుకోవచ్చని తెలిపింది. దీన్ని 200 చానెళ్లకు రూ. 130గా సవరించింది. అంతేకాదు.. 200కు మించి ఎన్ని ఫ్రీ ఛానల్స్‌కి అయినా.. రూ.160కి మించి చెల్లించనక్కర్లేదని స్పష్టం చేసింది. సమాచార మంత్రిత్వ శాఖ తప్పనిసరిగా ప్రసారం చేయాలని నిర్ధారించిన ఛానెళ్లను ఎన్సీఎఫ్లో చానెళ్ల కింద లెక్కించకూడదని తెలిపింది. డీడీ ఛానల్స్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది. 26 డిడి చానల్స్ టారీఫ్‌లో కాకుండా అదనమని ట్రాయ్ పేర్కొంది. ఆరునెలలకు అంతకుమించిన దీర్ఘకాలిక సబ్‌స్క్రిప్షన్స్‌కు డీపీఓలు డిస్కౌంట్లు ఆఫర్ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. డీపీఓలు వసూలు చేసే ఫీజుపై నెలకు రూ. 4 లక్షల పరిమితి విధించింది. దీంతో పాటు ఆల్‌కార్ట్ చానెల్లు, ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్, చానెల్ బొకెట్ తదితరాలకు సంబంధించిన నిబంధనల్లో కూడా మార్పులు తెస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది. పూర్తి వివరాలు: https://main.trai.gov.in/notifications/press-release/trai-releases-amendments-tariff-order-interconnection-regulations-లో లభ్యం. -
సోషల్ మీడియాలో విశృంఖలత్వానికి చెక్..
-
సోషల్ మీడియాలో విశృంఖలత్వానికి చెక్..
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో విపరీత ధోరణులకు అడ్డుకట్ట వేసేలా సామాజిక మాధ్యమాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సోషల్ మీడియా వేదికల్లో విద్వేష ప్రసంగాలు, నకిలీ వార్తలు, ప్రతిష్టను దిగజార్చే పోస్టులు, జాతివ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించేలా వచ్చే ఏడాది జనవరి 15 నాటికి నూతన నిబంధనలు ఖరారు చేయనున్నారు. సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి కీలక విధివిధానాలను వచ్చే ఏడాది జనవరి 15 నాటికి సిద్ధం చేస్తామని సర్వోన్నత న్యాయస్ధానానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్ వంటి సామాజిక మాథ్యమాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు, అభ్యంతరకర పోస్టులను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు నోటీసులకు స్పందనగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు పేర్కొంది. -
స్టార్టప్‌లకు కేంద్రం తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. స్టార్టప్‌లు పన్ను మినహాయింపులు పొందేందుకు ఏంజెల్ ఇన్వెస్టర్లతో కలుపుకుని పెట్టుబడి పరిమితిని ప్రస్తుతమున్న రూ 10 కోట్ల నుంచి రూ 25 కోట్లకు పెంచింది. ఐటీ చట్టం,1961, సెక్షన్ 56(2) కింద పన్ను మినహాయింపులకు ఆయా సంస్థల్లో పెట్టుబడి పరిమితిని పెంచే ప్రక్రియను త్వరలో ప్రభుత్వం వెల్లడిస్తుందని అధికారులు పేర్కొన్నారు. పన్ను రాయితీలు పొందేందుకు అవసరమైన నిబంధనలను సరళీకరిస్తూ నోటిపికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది. ఏదేని సంస్థ ప్రారంభించిన ఏడేళ్ల వరకూ ఇచ్చే స్టార్టప్ హోదాను ప్రస్తుతం పదేళ్ల వరకూ పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు స్టార్టప్‌ల వార్షిక టర్నోవర్ పరిమితిని ప్రస్తుతమున్న రూ 25 కోట్ల నుంచి రూ 100 కోట్లకు పెంచారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
పంచాయతీ కార్యదర్శులకు కొత్త బాధ్యతలు
సాక్షి, ఆలేరు : గ్రామపంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నూతనంగా మరో 30 విధులను అప్పగించింది. గతంలో వీరు 64బాధ్యతలను నిర్వహించేవారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 401 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2018–పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కార్యదర్శి గ్రామంలో పాలన బాధ్యతలను చూసుకోవటంతో పాటు సర్పంచ్‌కు సబార్డినేట్‌గా వ్యవహరించాలని సూచించింది. పంచాయతీలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, నిర్వహణ, త్రాగునీరు, వీధిదీపాలు, రోడ్లు, డ్రైనేజీ, మొక్కలు నాటడం, పారిశుద్య కార్యక్రమాలు అమలు చేయాలని కోరింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 42, సెక్షన్ 286 ప్రకారం, సెక్షన్ 43 ప్రకారం అప్పగించిన అన్ని బాధ్యతలు వి«ధులు నిర్వర్తించాలని తెలిపింది. సెక్షన్ – 6 (8)లో ప్రకారం పంచాయతీ ఎజెండా రూపకల్పన బాధ్యత కార్యదర్శిదేనని పేర్కొంది. గ్రామ పాలకవర్గం ఆమోదంతో వీటిని అమలు చేయాలని సూచించింది. 24గంటల్లో అనుమతి భవన నిర్మాణాలకు 24గంటల్లోనే అనుమతినివ్వాలని సూచించింది. అంతే కాకుండా లేఔట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 7రోజుల్లో అనుమతినివ్వాలని ఆదేశించింది. అలాగే లేఔట్ల అనుమతిలో పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతీ లేఔట్లో 15శాతం భూభాగాన్ని తనఖా చేయాలని కోరింది. అలాగే గ్రామంలో తీసుకునే నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు పై ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలకు సమాచారం అందించాలని సూచించింది. జనన, మరణాలతో పాటు వివాహ రిజిస్టేషన్ల నిర్వహణ చేయాల్సి ఉంటుంది. మార్గదర్శకాలు ఇవే.. పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వానికి సబార్డినేట్‌గా వ్యవహరించాలి. గ్రామ సభకు ఎజెండా తయారు చేసి అందులోని అంశాలు సభ్యులందరికి తెలిసేలా ప్రచారం చేయాలి. ప్రతీ 3నెలలకు ఒకసారి ఖర్చు లెక్కలను పంచాయతీ ఆమోదానికి సమర్పించాలి. వరదలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు, రోడ్లు, రైలు ప్రమాదాలు సం¿¶ వించినప్పుడు సహాయ చర్యల్లో పాల్గొనాలి. గ్రామంలో వ్యాధులు ప్రబలినప్పుడు అధికారులకు తెలియపరచాలి. గ్రామాల్లోని అవసరాలను గుర్తించి గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారిలో పాలుపంచుకోవాలి. అలాగే ఎంపీపీ, ఎంపీడీఓ, ఈఓ (పీఆర్ ఆర్డీ) నిర్వహించే నెలవారీ సమావేశాలకు హాజరు కావాలి. గ్రామసభలో లబ్ధిదారుల గుర్తింపు, వారికి రుణ పంపిణీ, రుణాలు వసూలుకు సహకరించాలి. అంశాల వారీగా ఎజాండాలను సిద్ధం చేసి, గ్రామపంచాయతీ ఆమోదం పొందడం. ఎజెండాను ప్రదర్శించడం, దండోర వేయించడం, గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో నోటీసులను అంటించి ప్రజలకు సమాచారం చేరేలా చూడడం. బలహీన వర్గాలు, ఎస్టీ, ఎస్సీ వాడల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలు, పంచాయతీ తీసుకుంటున్న ఫలాలు అందేలా చూడడం. వార్షిక పరిపాలన నివేధికను రూపొందించి గ్రామపంచాయతీ ఆమోదం తీసుకోవడం. నెలవారీ సమీక్షలు, ప్రగతి నివేదికల రూపకల్పన, ఉన్నతాధికారులకు నివేదికను అందించడం, సర్పంచ్‌తో కలిసి అభివృద్ధి పనులకు పర్యవేక్షణ ప్రతీ త్రైమాసికంలో ఒకసారి పంచాయతీ ఆర్థిక వ్యవహారాలను ఆధాయ, వ్యయ వివరాలను పంచాయతీ ఆమోదించడంతో పాటు ఈవీపీఆర్డీలకు సమాచారం ఇవ్వడం. -
2019 తర్వాత కార్లలో ఇవి ఉండాల్సిందే...
సాక్షి,న్యూఢిల్లీ: నెత్తురోడుతున్న రోడ్లతో హైవేలు నరకకూపాలుగా మారుతుండటంతో కేంద్రం మేలుకుంది. 2019, జులై 1 తర్వాత తయారయ్యే కార్లు కచ్చితంగా ఎయిర్‌బ్యాగ్స్, సీట్ బెల్డ్ రిమైండర్స్, 80 కిమీ వేగం దాటితే హెచ్చరిక వ్యవస్థను పొందుపరచాలని కార్ల తయారీ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ కానున్నాయి. ఈ నిబంధనల అమలు కాలపరిమితిని ఆమోదించిన రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ త్వరలో ఈ మార్గదర్శకాలను నోటిఫై చేయనుంది.ప్రసుతం లగ్జరీ కార్లలోనే ఈ ఫీచర్లుండగా, 2019 జులై నుంచి ప్రభుత్వం పేర్కొన్న భద్రతా ప్రమాణాలు అన్ని కార్లకూ అనివార్యం చేశారు. ఏటా రోడ్డు ప్రమాదాల్లో వాహనదారులు, ప్రయాణీకులు సహా పాదచారులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. 2016లో మితిమీరిన వేగంతోనే 74,000 మంది మృత్యువాత పడ్డారు. నూతన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కార్లలో అమర్చే కొత్త సిస్టమ్‌లో 80 కిమీల వేగం దాటితే ఆడియో హెచ్చరికలను జారీ చేసే వ్యవస్థను పొందుపర్చారు. వాహనం వేగం 100 కిమీ దాటితే హెచ్చరిక వ్యవస్థ నుంచి భారీ శబ్ధంతో ఆడియో హెచ్చరికలు జారీ అవుతాయి. వాహనం 120 కిమీ వేగం దాటితే నాన్ స్టాప్ అలర్ట్స్తో డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. కారు రివర్స్ చేసే క్రమంలోనూ రివర్స్ అలర్ట్స్ జారీ కానున్నాయి. నూతన భద్రతా ప్రమాణాలతో రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలు గణనీయంగా తగ్గుతాయని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. -
పెట్టుబడుల ఉపసంహరణ: ఆ కంపెనీలపై కొరడా
సాక్షి,న్యూఢిల్లీ: అక్రమాలకు, తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన కళంకిత కంపెనీలను ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణలో పాల్గొనడాన్ని ప్రభుత్వం నిషేధించనుంది. కేంద్రం తాజాగా జారీ చేసిన నూతన డిజిన్వెస్ట్‌మెంట్ మార్గదర్శకాల్లో ఈ మేరకు స్పష్టం చేసింది. అవకతవకలకు పాల్పడటం, నిబంధనల ఉల్లంఘనలపై న్యాయస్థానం నుంచి ప్రతికూల తీర్పులు ఎదుర్కొన్న కంపెనీలు, రెగ్యులేటరీ యంత్రాంగాలు, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ప్రతికూల ఆదేశాలు అందుకున్న సంస్థలు పీఎస్‌యూ కంపెనీల డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనర్హమైనవిగా ప్రభుత్వ నోటిఫికేషన్ పేర్కొంది. ఇక ఏదేని కంపెనీపై సెబీ ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు వెలువరిస్తే వాటిని న్యాయస్దానాలు నిర్దారించిన అనంతరమే ఆ బిడ్డర్‌ను అనర్హులుగా ప్రకటిస్తారని తాజా మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో డిజిన్వెస్ట్మెంట్కు బిడ్డర్ల ఎంపిక కోసం ఆయా కంపెనీల నికర ఆస్తులు, అనుభవాలను ప్రభుత్వం పరిశీలించేది. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను దక్కించుకునేందుకు ఆసక్తి చూపే పార్టీల అర్హత, అనర్హతలను విశ్లేషించే క్రమంలో ఇతర క్రైటిరియానూ పరిశీలించాలని తాజాగా నిర్ణయించిన క్రమంలో నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్ధల్లో వాటాల విక్రయాన్ని పారదర్శకంగా చేపట్టేందుకు కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా అర్హులను ఎంపిక చేసేందుకు తాజా మార్గదర్శకాలను వెలువరించినట్టు ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ ఎసెట్ మేనేజ్మెంట్ పేర్కొంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ15,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. -
టీవీ ప్రసారాల పంపిణీదారులకు కొత్త మార్గదర్శకాలు
విడుదల చేసిన ట్రాయ్ న్యూఢిల్లీ: టెలివిజన్ ప్రసారాల పంపిణీలో అనైతిక విధానాలకు చెక్ పెట్టే దిశగా ట్రాయ్ కీలక ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. టీవీ చానళ్ల ప్రసారాలను అందించే కేబుల్, డీటీహెచ్, ఐపీటీవీ ఇలా అన్ని రకాల ప్లాట్‌ఫామ్‌లకు ఒకే విధమైన ఇంటర్ కనెక్షన్ మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ఒకే విధమైన నియంత్రిత విధానంతో ఈ రంగంలోని భిన్న రకాల పంపిణీదారులు అందరికీ పారదర్శకమైన, సమాన పోటీ అవకాశాలకు వీలు కలుగుతుందని శుక్రవారం తాను విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాల ప్రతిలో ట్రాయ్ పేర్కొంది. హెచ్ఐటీఎస్ (హెడ్ ఎండ్ ఇంద ద స్కై ఆపరేటర్), ఐపీటీవీ, డీటీహెచ్, కేబుల్ టీవీలకు ప్రస్తుతం రెండు రకాల వేర్వేరు నియంత్రిత విధానాలు అమల్లో ఉన్నాయి. వీటిలో హెచ్ఐటీఎస్ అనేది కేబుల్ చానల్స్‌ను ప్రసారం చేసే శాటిలైట్ మల్టిప్లెక్స్ సర్వీస్. టెలివిజన్ ప్రసార రంగంలో వినియోగదారుడు, బ్రాడ్ కాస్టర్ మధ్య మధ్యవర్తులు చాలా మంది ఉంటారు. అందరికీ ఒకే విధమైన ఇంటర్ కనెక్షన్ నిబంధనను అమలు చేయడం వల్ల పోటీ వేగం పుంజుకుని, వినియోగదారుడికి నాణ్యమైన సేవలు అందుతాయన్నది ట్రాయ్ యోచన. టీడీహెచ్, కేబుల్ ఆపరేటర్లు టీవీ చానళ్లను ప్రసారం చేసినందుకు ఒక్కో చానల్‌కు ఒక్కో వినియోగదారుడి నుంచి గరిష్టంగా 20పైసలు మాత్రమే వసూలు చేసేలా ట్రాయ్ తాజా ముసాయిదా మార్గదర్శకాల్లో పరిమితి విధించింది. ఇక ఏదేనీ బ్రాడ్‌కాస్టర్(చానల్), ఆ చానల్ పంపిణీదారుడి మధ్య ప్రత్యేక ఒప్పందాలను నిషేధించే నిబంధనను తీసుకొచ్చింది. చానల్, డిస్ట్రిబ్యూటర్ మధ్య ఈ విధమైన ఒప్పందంతో ఇతర పంపిణీదారులు సదరు చానల్ ప్రసారాలను అందించే అవకాశం ఉండదు. టెలివిజన్ ప్రసారాల పంపిణీలో వివిధ దశల్లో పారదర్శకత, వివక్ష లేకుండా ఉండడం వల్ల ఆరోగ్యకరమైన పోటీకి దోహదం చేస్తుందని ట్రాయ్ పేర్కొంది. -
ప్రొఫెసర్‌గా పదేళ్లు కాదు.. ఐదేళ్లు చాలు
- వీసీల నియామకాల్లో నిబంధనలు సడలింపు - విద్యా శాఖ నిర్ణయం.. త్వరలో నోటిఫికేషన్ జారీ - ఉస్మానియా సహా తొమ్మిది వర్సిటీలకు వైస్ చాన్స్లర్లు - వచ్చే నెలాఖరులోగా నియామకాలు పూర్తి చేసేందుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వైస్ చాన్స్‌లర్(వీసీ) పోస్టుల భర్తీలో నిబంధనలు సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. వీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా పని చేసి ఉండాలన్న ప్రధానమైన నిబంధన ఉంది. అయితే రాష్ట్రంలో కొన్ని కేటగిరీల్లో వైస్ చాన్స్‌లర్ పోస్టుకు పదేళ్ల సీనియారిటీ కలిగిన ప్రొఫెసర్లు లేకపోవడంతో దీనిని ఐదేళ్లకు తగ్గించాలని నిర్ణయించింది. తద్వారా వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎక్కువ మందికి అవకాశం కల్పించవచ్చని భావిస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో వివిధ కోణాల్లో ఆలోచించినా.. వీసీల నియామకాలకు దరఖాస్తు చేసుకునే వారిలో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఏమైనా రిజర్వేషన్ కల్పిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలను ప్రభుత్వం గతంలో చేసింది. వీసీల నియామకాలకు సంబంధించిన అన్ని నిబంధనలను, మార్గదర్శకాలను పరిశీలించిన అధికారులు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించడం సాధ్యం కాదని తేల్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకే కాకుండా అన్ని కేటగిరీల వారికి ఐదేళ్ల సడలింపు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేసి త్వరలోనే నోటి ఫికేషన్‌ను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. గత వారమే నోటిఫికేషన్ జారీ చేయాలని భావించినా అప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నోటిఫికేషన్ జారీని నిలిపివేశారు. ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం లేఖ రాశారు. ఇందుకు ఈసీ కూడా ఇటీవల ఓకే చెప్పింది. దీంతో రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్లు లేని ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలతోపాటు శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, పొట్టిశ్రీరాములు తెలుగు, అంబేడ్కర్ ఓపెన్, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయాల వైస్ ఛాన్స్లర్ల నియామకాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్స్లర్ పోస్టు భర్తీ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్న నేపథ్యంలో ఆ వర్సిటీకి వీసీ నియామకంపై తర్వాత దృష్టి సారించాలన్న నిర్ణయానికి వచ్చింది. తొలుత తొమ్మిది వర్సిటీలకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఆ తర్వాత సెర్చ్ కమిటీలు వచ్చిన దర ఖాస్తుల్లో అర్హతలను బట్టి ప్రాధాన్య క్రమంలో ప్రభుత్వానికి ఒక్కో వర్సిటీకి ముగ్గురి పేర్లను సూచించనున్నాయి. మొత్తంగా వచ్చే నెలాఖరులోగా వీసీల నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. -
అంగన్వాడీలపై వేటుకు వేట!
- క్రమశిక్షణ చర్యల పేరిట అంగన్వాడీలపై వేధింపులు - ప్రవేశాలు తక్కువ ఉన్న కేంద్రాలను మూసివేయాలని సర్కారు ఆదేశాలు - ప్లేస్కూళ్లను కట్టడి చేయకుండా ప్రవేశాలెలా పెరుగుతాయంటున్న వర్కర్లు సాక్షి, హైదరాబాద్: లాలించే మనుషులపై పాలించేవారు వేట మొదలు పెట్టారు. అమ్మగా, ఆయాగా చిన్నారుల ఆలనాపాలనా చూసుకునే అంగన్వాడీలపై ప్రభుత్వం వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి అనేక రకాల సాకులను వెతుకుతూ కత్తులు నూరుతోంది. దీనిలో భాగంగా జీవో 14ను వాడుకునేందుకు సిద్ధమైంది. దీంతో అంగన్వాడీలకు ఉద్యోగభద్రత లేకుండా పోతోంది. వారి పరిస్థితి దినదినగండంగా మారుతోంది. ఇటీవల వారికి గౌరవ వేతనం పెంచడంతో ఆర్థికభారం పెరిగిందని, కొన్ని అంగన్వాడీ కేంద్రాలను ఎత్తేసి దీనికి సంబంధించిన లెక్క సరిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్)లో పనిచేస్తున్న అంగన్వాడీవర్కర్లు, సహాయకుల ఉద్యోగాలు ఎప్పుడు ఊడతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో నియామకమైన కార్యకర్తలను తొలగించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఆయా పోస్టులను తమ వర్గంవారికి ఇప్పించుకునేందుకు ప్రస్తుతం పనిచేస్తున్నవారిపై లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. స్థానిక నేతల ఒత్తిడుల మేరకు జీవో 14ను సాకుగా చూపి అంగన్వాడీలపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమిస్తోంది. మరోవైపు లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉన్న కేంద్రాలను మూసివేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది. తగినన్ని ప్రవేశాలు(అడ్మిషన్లు) తీసుకు రాలేకపోయిన ఆయా కేంద్రాల వర్కర్లను, సహాయకులను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. విధులపట్ల నిర్లక్ష్యం వహించిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలను కూడా జీవోలో పేర్కొంది. ముందస్తు అనుమతి లేకుండా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కేంద్రానికి హాజరు కాకున్నా, కేంద్రానికి వచ్చే 3 నుంచి ఆరేళ్ల చిన్నారుల హాజరు 90 శాతం కన్నా తక్కువగా ఉన్నా తనిఖీ అధికారులు మెమోలు జారీ చేయవచ్చు. ఇలా రెండు, మూడు మెమోలు పొందిన కార్యకర్తలను జీవో 14 ప్రకారం వెంటనే తొలగించవచ్చు. ఆహార నిల్వకు సంబంధించి భౌతిక, బుక్ బ్యాలెన్స్‌లో తేడా ఉన్నా వెంటనే తొలగించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. జీవోలోని ఇలాంటి అంశాలను ఆసరాగా చేసుకొని స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు అంగన్వాడీ కేంద్రాలపై అధికారులతో ఆకస్మిక తనిఖీలు చేయించి వారి పొట్టగొట్టాలని ప్రయత్నిస్తున్నారని అంగన్వాడీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్లేస్కూళ్లను కట్టడి చేయకుండా ప్రవేశాలు ఎలా? ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ ప్లేస్కూళ్లను నియంత్రించకుండా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశాలను పెంచడం ఏవిధంగా సాధ్యమవుతుందని అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మూడేళ్ల వయస్సున్న చిన్నారులకు అనధికారికంగా అడ్మిషన్లు ఇస్తున్న ఆయా పాఠశాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. ఇక మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులుండే అంగన్వాడీ కేంద్రాలు అన్ని సందర్భాల్లో పరిశుభ్రంగా ఉండడం సాధ్యం కాదంటున్నారు. ఒకరిద్దరు చిన్నారులు ఉండే ఇళ్లలోనే ప్రతిక్షణం పరిశుభ్రంగా ఉంచేందుకు వీలు కాదని, అలాంటప్పుడు 20-30 మంది చిన్నారులు ఉండే చోట కొంత ఇబ్బందులు ఉంటాయంటున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా అధికారులు శుభ్రత లేదనే సాకుతో తమపై వేటు వేయాలని చూస్తున్నారని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో 14ను రద్దు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నాయి. -
మెడికల్ బిల్లులపై మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్ : హెల్త్‌స్కీంలో భాగంగా ప్రభుత్వాసుపత్రులకు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగుల చికిత్సకు సంబంధించిన బిల్లు రూపకల్పన, తద్వారా వచ్చిన నిధులను వైద్యులు ఇతర సిబ్బందికి ఎలా పంచాలి అన్నదానిపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌సహాని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐసీయూలో ఉండే రోగి చికిత్సకు రోజుకు రూ.2,500, ఏసీ వార్డుకు రూ.1,500, శస్త్రచికిత్స అనంతరం సాధారణ వార్డుకు రోజుకు రూ.1000, ఆపరేషన్ థియేటర్ చార్జీల కింద గంటకు రూ.2వేల నుంచి రూ.3వేలు, ఆహారానికి రోజుకు వంద రూపాయలు, రక్తనిధికి సంబంధించిన చార్జీలను ఒక్కో బ్యాగు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. ఉద్యోగులకు వైద్య చికిత్సల ద్వారా ప్రభుత్వాసుపత్రికి వచ్చే సొమ్ములో 20 శాతం నిధులను రివాల్వింగ్ ఫండ్ కింద ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ తీసుకుంటుంది. ఆ నిధులతో ఆసుపత్రుల్లో యంత్రాలు, ఇతర పరికరాలను సమకూరుస్తారు. మిగతా 80 శాతంలో 45 శాతం రోగుల చికిత్సల కోసం ఖర్చు చేస్తారు. 35 శాతం సొమ్మును వైద్యులు, నర్సులు తదితర వైద్య సేవలు అందించిన వారు తీసుకోవాలి. ఈ 35 శాతం సొమ్ములో ఎలా పంచుకోవాలో వివరించారు. ఇందులో శస్త్రచికిత్స చేసినవారు లేదా వైద్యసేవలు అందించిన వైద్య బృందం 75 శాతం, రక్తపరీక్షలు లేదా ఎక్స్‌రేలు (ఇన్వెస్టిగేషన్స్) చేసిన వారికి 10 శాతం, నర్సింగ్ సిబ్బందికి 10 శాతం, నాల్గవ తరగతి ఉద్యోగులకు 5 శాతం ఇవ్వాలి. వైద్యులకిచ్చే 75 శాతం సొమ్ములో 55 శాతం సంబంధిత డాక్టర్లు తీసుకుంటే, మిగతా 20 శాతం నిధులు అనస్థీషియన్ (మత్తు డాక్టరు) తీసుకోవాలని పేర్కొన్నారు.