Central Government Issues Revised Guidelines For COVID-19 Vaccination Programme - Sakshi
Sakshi News home page

కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం నూతన మార్గదర్శకాలు

Published Tue, Jun 8 2021 1:48 PM | Last Updated on Tue, Jun 8 2021 7:06 PM

Centre Issues New Guidelines For Covid Vaccination - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది.  జాతీయ టీకా కార్యక్రమానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. జూన్‌ 21లోపు రెండు వారాల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. జనాభా, కరోనా కేసులను బట్టి రాష్ట్రాలకు టీకాలను కేటాయించనున్నట్టు వెల్లడించింది. టీకాల వృథాను బట్టి రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ కేటాయింపుల్లో కోత విధిస్తామని కేంద్రం పేర్కొంది. 

అన్ని ఆస్పత్రులకు సమానంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించింది. ప్రైవేట్‌ ఆస్పత్రులకు కావాల్సిన డోసుల వివరాలను రాష్ట్రాలే ఇవ్వాలని తెలిపింది. పేదలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టీకా వేయించుకోవడం కోసం ఈ-వోచర్లు ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొంది. ఇక కోవిడ్-19 వ్యాక్సిన్ల సేకరణ, వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

(చదవండి: సువేందు అధికారి ఢిల్లీ పర్యటన.. కారణం ఇదేనా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement