న్యూఢిల్లీ: పాదరక్షలకు నూతన నాణ్యతా ప్రమాణాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 24 పాదరక్షల ఉత్పత్తులకు సంబంధించి నిర్ధేశిత ప్రమాణాలను పెద్ద, మధ్యస్థాయి కంపెనీలు, దిగుమతిదారులు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. చైనా తదితర దేశాల నుంచి చౌకగా దేశంలోకి దిగుమతి అవుతున్న నాసిరకం పాదరక్షల ఉత్పత్తులకు కళ్లెం వేసేందుకు కేంద్ర సర్కారు నూతన నిబంధనలను తీసుకొచి్చంది. ఇక చిన్న స్థాయి ఫుట్‌వేర్ తయారీ సంస్థలకు కొంత సమయాన్ని ఇచి్చంది. ఇవి నూతన నాణ్యత ప్రమాణాలను 2024 జనవరి 1 నుంచి అనుసరించాల్సి ఉంటుంది.
సూక్ష్మ సంస్థలు 2024 జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉంటుందని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. గడువును మరింత పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. నూతన నాణ్యత నియంత్రణ ప్రమాణాలు దేశీయంగా నాణ్యమైన పాదరక్షల తయారీకి వీలు కలి్పంచడంతోపాటు, నాణ్యత లేమి ఉత్పత్తుల దిగుమతులకు చెక్ పెడతాయని చెప్పారు. నిజానికి ఈ నూతన నాణ్యతా ప్రమాణాలను కేంద్ర సర్కారు 2020 అక్టోబర్‌లోనే నోటిఫై చేయడం గమనార్హం. కరోనా కారణంగా ఏర్పడిన అవరోధాల నేపథ్యంలో మూడు పర్యాయాలుగా గడువు పొడిగిస్తూ వచ్చారు.
జాబితాలో ఉన్నవి..
తోలు, పీవీసీ, రబ్బర్‌లో ఎలాంటి మెటీరియల్ వినియోగించాలి? సోల్స్, హీల్స్ కోసం ఏవి వినియోగించాలనేది ప్రమాణాల్లో పేర్కొన్నారు. రబ్బర్ గమ్ బూట్స్, పీవీసీ శాండల్స్, రబ్బర్ హవాయి చెప్పల్స్, స్లిప్పర్స్, మౌల్డెడ్ ప్లాస్టిక్ ఫుట్‌వేర్, స్కావెంజింగ్ పనుల కోసం వినియోగించే పాదరక్షలు, క్రీడా పాదరక్షలు, డెర్బీ బూట్లు, అల్లర్ల నిరోధక బూట్లు, మౌల్డెడ్ సాలిడ్ రబ్బర్ సోల్స్, హీల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 54 పాదరక్షల ఉత్పత్తుల్లో నాణ్యత ప్రమాణాల పరిధిలోకి 27 ఉత్పత్తులు, మెటీరియల్‌ను తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment