
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్ (సేవింగ్స్ ఖాతాల్లోని బ్యాలెన్స్)పై వడ్డీ రేటును పావు శాతం మేర తగ్గించింది. సేవింగ్స్ ఖాతాల్లో బ్యాలెన్స్ రూ.50 లక్షల వరకు ఉన్న వారికి ఇక మీదట 2.75 శాతం రేటు అమలవుతుంది. అదే మాదిరి రూ.50 లక్షలకు పైన బ్యాలెన్స్ ఉన్న వారికి 3.25 శాతం రేటు లభిస్తుంది.
బుధవారం నుంచే కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ఎస్‌బీఐ సైతం సేవింగ్స్ డిపాజిట్లపై 2.70 శాతం రేటు అమలు చేస్తుండడం గమనార్హం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా తాజాగా సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును 0.25% తగ్గించి 2.75% చేసింది. రూ.50 లక్షలకు మించిన మొత్తంపై వడ్డీ రేటు 3.5% ఉండగా 3.25 శాతానికి తగ్గించింది.