బ్రిటన్ ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్
లండన్: బ్రిటన్‌లో కరోనా కేసులు తీవ్రతరమవుతూ ఉండడంతో ప్రభుత్వం మరిన్ని ఆంక్షల్ని విధించింది. ఈ ఆంక్షల్ని అతిక్రమిస్తే 10 వేల పౌండ్లు (దాదాపుగా 10 లక్షల రూపాయలు) వరకు జరిమానాలు విధించడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 28 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఇంటి నుంచి పని చేసుకునే సౌకర్యం లేని నిర్మాణ రంగంలో కార్మికులు, ఆదాయం కోల్పోయిన ఇతర వర్గాల వారికి 500 పౌండ్లు ఇస్తామని ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్ వెల్లడించారు.
యూకే ప్రస్తుతం కరోనా వైరస్ రెండో దశ ఎదుర్కొంటోందని , నిబంధనల్ని ఎవరైనా అతిక్రమిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. వైరస్‌ని నియంత్రించాలంటే కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు సెల్ఫ్ క్వారంటైన్ 14 రోజుల నిబంధనల్ని అతిక్రమిస్తే వెయ్యి నుంచి 10 వేల పౌండ్ల జరిమానా విధిస్తామన్నారు. తరచూ ప్రయాణాలు సాగించే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు కోవిడ్ నిబంధనల్ని పాటించడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment