Heavy fines
-
మాస్క్ లేకుంటే కొరడా
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపు తప్పుతుండడంతో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలని అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ పెడచెవిన పెట్టేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మాస్క్‌లు ధరించని వారికి విధిస్తున్న జరిమానాల విషయంలో నిబంధనలు వివిధ రాష్ట్రాల్లో మారాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ పెరగడంతో మాస్క్ ధరించని వారికి విధించే జరిమానా రూ. 500 నుంచి రూ.2000కు పెంచారు. గుజరాత్లో భారీగా జరిమానాలు వసూలు కరోనాను కట్టడి చేసేందుకు జరిమానాలు విధించడంలో గుజరాత్ అధికారులు ఇతర రాష్ట్రాల కంటే కాస్త ముందున్నారు. జూన్ 15 నుంచి ఇప్పటì వరకు రాష్ట్రంలో మాస్క్‌లు ధరించనివారికి అధికారులు చలాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 26 లక్షల మంది ప్రజల నుంచి రూ.78 కోట్లు జరిమానా వసూలు చేశారు. ఈ మొత్తం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సంవత్సరపు ఆదాయం కంటే ఎక్కువ అని అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని కెవాడియాలో 2018 అక్టోబర్ 31న ఏకతా విగ్రహాన్ని ప్రారంభించారు. దీని తరువాత, పర్యాటకుల నుంచి ఏడాదిలో రూ. 63.50 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా అహ్మదాబాద్‌లో ప్రతి నిమిషానికి అత్యధికంగా 120 మందికి జరిమానా విధించారు. అధికారులు నిరంతరం సూచనలు చేస్తున్నప్పటికీ చాలామంది ప్రజలు ఇప్పటికీ మాస్క్‌లు ధరించట్లేదు. మాస్క్‌లు ధరించని ప్రజలకు జరిమానా మొత్తాన్ని పెంచాలని డిమాండ్ సైతం వచ్చింది. మాస్క్ ధరించకుండా దొరికితే గుజరాత్లో తప్పనిసరిగా కరోనా పరీక్ష చేస్తున్నారు. ఒకవేళ రిపోర్ట్ పాజిటివ్‌గా వస్తే రూ. వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక వారిని వెంటనే ఆసుపత్రికి చికిత్స కోసం పంపిస్తారు. 45 వేల కొత్త కేసులు దేశంలో 24 గంటల్లో 45,209 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90.95 లక్షలకు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 501 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,227కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఆదివారానికి 85,21,617కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,40,962గా ఉంది. కాగా, ప్రధాని మోదీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో మంగళవారం వర్చువల్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. కోవిడ్ అంశంపైనే రెండు సమావేశాలు జరిగే అవకాశం ఉందని సమాచారం. -
కోవిడ్ నిబంధనల్ని అతిక్రమిస్తే భారీ జరిమానాలు
లండన్: బ్రిటన్‌లో కరోనా కేసులు తీవ్రతరమవుతూ ఉండడంతో ప్రభుత్వం మరిన్ని ఆంక్షల్ని విధించింది. ఈ ఆంక్షల్ని అతిక్రమిస్తే 10 వేల పౌండ్లు (దాదాపుగా 10 లక్షల రూపాయలు) వరకు జరిమానాలు విధించడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 28 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఇంటి నుంచి పని చేసుకునే సౌకర్యం లేని నిర్మాణ రంగంలో కార్మికులు, ఆదాయం కోల్పోయిన ఇతర వర్గాల వారికి 500 పౌండ్లు ఇస్తామని ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్ వెల్లడించారు. యూకే ప్రస్తుతం కరోనా వైరస్ రెండో దశ ఎదుర్కొంటోందని , నిబంధనల్ని ఎవరైనా అతిక్రమిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. వైరస్‌ని నియంత్రించాలంటే కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు సెల్ఫ్ క్వారంటైన్ 14 రోజుల నిబంధనల్ని అతిక్రమిస్తే వెయ్యి నుంచి 10 వేల పౌండ్ల జరిమానా విధిస్తామన్నారు. తరచూ ప్రయాణాలు సాగించే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు కోవిడ్ నిబంధనల్ని పాటించడం లేదన్నారు. -
ఎడ్ల బండికి చలానా
న్యూఢిల్లీ: సవరించిన మోటారు వాహనాల చట్టం కింద నిబంధనల అతిక్రమణకు భారీ జరిమానాలు విధిస్తుండటం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. సోమవారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో భారీ చలాన్లపై ప్రజలు తీవ్ర ఆందోళన చేశారు. వారి నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఉత్తరాఖండ్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తుండటంతో ఆగ్రహం చెందిన డెహ్రాడూన్‌లోని చార్బా గ్రామ రైతులు రెండు మోటార్‌సైకిళ్లను తగులబెట్టారు. కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు తమపై భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు రైతులు ఆరోపించారు. చార్బా గ్రామానికి చెందిన రియాజ్ హసన్ అనే ఎడ్ల బండి యజమానికి పోలీసులు రూ. వెయ్యి చలానా విధించడంతో రైతుల్లో ఆగ్రహం మొదలైంది. అయితే వాహన చట్టంలో ఎడ్లబండికి చలానా విధించే నిబంధన లేదని తెలుసుకున్న పోలీసుల నాలిక్కరుచుకున్నారు. అనంతరం చలాన్ రద్దు చేసినప్పటికీ, రైతుల్లో ఈ విషయం తీవ్ర ఆవేదన కలిగించింది. భారీ చలాన్లపై రైతులు సోమవారం రోడ్డెక్కడంతో నిరసన హింసాత్మకంగా మారింది. -
ట్రక్కు 6.53 లక్షల జరిమానా
భువనేశ్వర్: ఒడిశాలోని సంభల్‌పూర్‌లో శనివారం నాగాలాండ్‌కు చెందిన ఓ లారీపై రూ.6.53 లక్షల జరిమానా విధించి పోలీసులు కొత్త రికార్డు సృష్టించారు. ట్రాఫిక్ నిబంధనలు ఏడింటిని ఉల్లంఘించారన్న కారణంగా ఇంతటి భారీ జరిమానా వేశారు. ఐదేళ్లుగా రోడ్ ట్యాక్స్ కట్టని కారణంగా ఎన్ఎల్ 08డీ 7079 నెంబరు ఉన్న ట్రక్‌పై రూ.6.40 లక్షల జరిమానా విధిస్తూ సంభల్పూర్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి చలాన్ రాశారు. వాహనాన్ని దిలీప్ కర్తా అనే డ్రైవర్ నడుపారు. యజమాని పేరు శైలేశ్ గుప్తా. దీంతోపాటు రూ.వంద సాధారణ జరిమానాగా, ఆదేశాలను ఉల్లంఘించినందుకు రూ.500, వాయు, శబ్ద కాలుష్య ఉల్లంఘనలకు రూ.1000, సరుకులు రవాణా చేయాల్సిన వాహనంలో ప్రయాణీకులను తీసుకెళుతున్నందుకు రూ.5000, పర్మిట్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.5000, పర్మిట్ నిబంధనలను పాటించనందుకు రూ.1000 జరిమానా విధించినట్లు రసీదులో ఉంది. -
జరిమానాలపై జనం బెంబేలు
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి కొత్తగా అమల్లోకి తీసుకువచ్చిన మోటార్ వాహనాల (సవరణ) చట్టం ప్రకారం పడుతున్న భారీ జరిమానాలు ఇవి. చిన్న చిన్న ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకే వేలు దాటి లక్షల్లో పెనాల్టీ పడుతుంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ చట్టంతో సామాన్యులపై మోయలేని భారం పడుతోందని సగానికి పైగా రాష్ట్రాలు అమల్లోకి తీసుకురావడానికి నిరాకరించాయి. చివరికి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కొత్త చట్ట ప్రకారం జరిమానాలు విధిస్తే జనంలో చెడ్డ పేరు వస్తోందని గగ్గోలు పెడుతున్నాయి. కేంద్రం చేసిన చట్టాన్ని తాము కూడా అమలు చేయలేమంటూ చేతులెత్తేశాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొదట గుజరాత్ ఈ స్థాయిలో జరిమానాలు విధించలేమని తేల్చి చెప్పేస్తే, ఇప్పుడు అదే బాటలో మహారాష్ట్ర, కర్ణాటక కూడా నడుస్తున్నాయి. ప్రపంచంలోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ ముందు వరసలో ఉందని, ప్రమాదాలు నివారించి, ప్రజల ప్రాణాలు కాపాడడానికే ఈ జరిమానాలు తీసుకువచ్చామని కేంద్ర రోడ్లు, రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమర్థించుకున్నా, సమాజంలో వివిధ వర్గాలతో సుదీర్ఘ చర్చల అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పినా ఆయనకు నిరసన సెగలు తగులుతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు గడ్కరీ ఇంటి ముందు ధర్నాలకు దిగారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ జరిమానాలపై తీవ్రంగా కామెంట్లు పెడుతున్నారు. జోకులు, మెమెలతో నెటిజన్లు హడావుడి చేస్తున్నారు. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్థాయిలో జరిమానాలు విధించడం ఇష్టం లేక చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు జరిమానాలు తగ్గించడానికి కసరత్తు చేస్తున్నాయి. గుజరాత్ బాటలో..! బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ ఈ పెనాల్టీలపై తొలిసారి నోరు మెదిపింది. ఈ స్థాయి లో జరిమానాలు సరైన పద్ధతి కాదంటూ సగానికి సగం జరిమానాలను తగ్గించింది. దాదాపుగా 90 శాతం కేసుల్లో జరిమానాల్లో మార్పులు చేసింది. హెల్మెట్ లేకపోతే రూ.500, లైసెన్స్ లేకపోతే రూ2000... ఇలా చాలా కేసులకు సంబంధించి జరిమానాలను సగానికి సగం తగ్గించింది. ఇక గుజరాత్ బాటలోనే ఉత్తరాఖండ్ కూడా నడిచింది. ఎన్నికలున్నాయనే... కొత్త చట్టం కింద పన్నులు విధించడానికి కొన్ని రాష్ట్రాలు వెనక్కి తగ్గడానికి, ఎన్నికలకు సంబంధం ఉందనే విశ్లేషణ లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్, మహారాష్ట్ర, హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే మహారాష్ట్ర, జార్ఖండ్‌లు ఈ కొత్త చట్టాన్ని అమలు చేయలేమని చెప్పేశాయి. అయితే తాము తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల కోసం కాదని, ప్రజల కోసమేనని మహారాష్ట్ర అంటోంది. భారీస్థాయిలో జరిమానాలు విధించలేమని తేల్చేసిన రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర జరిమానాలు తగ్గించడానికి కసరత్తు చేస్తున్న రాష్ట్రాలు: పంజాబ్, గోవా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఉత్తరాఖండ్ -
కిర్గియోస్‌కు రూ.80 లక్షల జరిమానా!
సిన్సినాటి: కెరీర్ ఆరంభంనుంచి వివాదాలతో సహవాసం చేస్తున్న ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ ఇప్పుడు దూషణల పర్వాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లాడు! ఫలితంగా భారీ జరిమానాకు గురవడంతో పాటు నిషేధానికి కూడా చేరువయ్యాడు. సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ రెండో రౌండ్లో పరాజయం అనంతరం అతని ప్రవర్తన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)కి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ మ్యాచ్‌లో కరెన్ కచనోవ్ (రష్యా) 6–7, 7–6, 6–2తో కిర్గియోస్‌ను ఓడించాడు. మ్యాచ్ ముగిశాక కిర్గియోస్ అంపైర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చెత్త అంపైర్ అంటూ దుర్భాషలాడుతూ అతని వైపు ఉమ్మేశాడు! మ్యాచ్‌లో అప్పటికే టైమ్ నిబంధనను అతిక్రమించడం, అనుమతి లేకుండా కోర్టును వీడటం, రెండు సార్లు రాకెట్లు విరగ్గొట్టడంవంటి చేసేశాడు. దాంతో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ ఏటీపీ ఏకంగా ఈ ఒక్క మ్యాచ్‌లోనే 9 అభియోగాలు నమోదు చేసింది. అన్నీ కలిపి లక్షా 13 వేల డాలర్లు (సుమారు రూ. 80 లక్షలు) జరిమానాగా విధించింది. ఇది తక్షణ చర్య మాత్రమేనని, మున్ముందు పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత కిర్గియోస్‌పై మరింత తీవ్ర చర్య ఉండవచ్చని కూడా ఏటీపీ ప్రకటించింది. ప్రపంచ 27వ ర్యాంకర్ అయిన 24 ఏళ్ల కిర్గియోస్‌పై నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో శిక్షలకు గురయ్యాడు. -
తాగి నడిపితే..ఇకపై రూ.10 వేలు ఫైన్!
సాక్షి, న్యూఢిల్లీ : వాహనదారులు ఇక మీదట జాగ్రత్తగా నిబంధనలను పాటించాల్సిందే. లేదంటే జరిమానాల మోత మోగనుంది ఈ మేరకు మోటారు వాహనాల (సవరణ) బిల్లులో ప్రతిపాదిత మార్పులను కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, రహదారి భద్రత, నిబంధనల ఉల్లంఘనపై జరిమానాతో పాటు అవినీతిని అరికట్టడం లాంటి అంశాలను ప్రధానంగా ఈ బిల్లు పరిగణనలోకి తీసుకుంది. ప్రతిపాదిత సవరణ ప్రకారం మద్యం తాగి వాహనం నడిపితే జరిమానాను ఐదు రెట్లు పెంచనుంది. అలాగే ప్రమాదకరమైన రేసింగ్‌లు, అతివేగంగా నడిపితే జరిమానాను ఏకంగా పది రెట్లు పెంచేందుకు ప్రతిపాదించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో సవరణ బిల్లును రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టనుంది తాజా నిబంధనల ప్రకారం జరిమానా తాగి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపితే రూ. 5వేలుగా ఉండనుంది. రోడ్డు ప్రమాద మృతులకు రూ. పది లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. 2 లక్షలు పరిహారం మరో ముఖ్యమైన నిబంధన. ప్రైవేటు రవాణా సంస్థలు లైసెన్సింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా విధించాలని ఈ సవరణ ప్రతిపాదించింది. ఓవర్ లోడింగ్ వాహనాలు రూ. 20 వేల పెనాల్టీ కట్టేలా బిల్లులో నిబంధనల్ని చేర్చారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకూ జరిమానా విధించేలా బిల్లును రూపొందించారు. అంతేకాదు రహదారి ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వారికి, లేదా సమాచారం అందించిన వ్యక్తులు వేధింపులకు గురికాకుండా ఉండేలా ప్రతిపాదిత సవరణ చేసింది. అలాగే థర్డ్‌పార్టీ బీమాను గరిష్టంగా రూ.10 లక్షలు పరిమితం చేయాలనేది మరో ప్రతిపాదన. కొత్త వాహనాల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, డ్రైవింగ్ లైసెన్స్ , వాహన రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ తప్పనిసరి అని తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీ విషయంలో కూడా మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం 50 సంవత్సరాల వయస్సున్న ఒక వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ 20 వరకు సంవత్సరాలు చెల్లుతుంది. అయితే దీంట్లో వివిధ కేటగిరీలను చేర్చాలని భావిస్తోంది. ఉదాహరణకు, లైసెన్స్ హోల్డర్ వయస్సు 30-50 సంవత్సరాల మధ్య ఉంటే 10 సంవత్సరాల వరకు మాత్రమే( ప్రస్తుతం 20 ఏళ్ళతో పోలిస్తే) చెల్లుతుంది. కాగా ఈ సవరణలకు సంబంధించిన ఈ బిల్లుకు లోక్‌సభలో 2017 లో ఆమోదం లభించినప్పటికీ రాజ్యసభ మద్దతు పొందడంలో విఫలమైంది. ఈ ప్రతిపాదనలతో కూడిన బిల్లు చట్టం రూపం దాల్చాలంటే ఉభయ సభల అనుమతి పొందాల్సి ఉంటుంది. -
అంబులెన్సుకు దారివ్వకుంటే రూ.10 వేల ఫైన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సోమవారం నాడిక్కడ సమావేశమైంది. ఈ భేటీలో మోటార్ వాహనాల(సవరణ) బిల్లు–2019తో పాటు డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు–2019కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వాహనాలు నడిపేటప్పడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధించేలా నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిప్రకారం అంబులెన్స్, ఇతర అత్యవసర సేవల వాహనాలను దారి ఇవ్వకుంటే రూ.10,000 వరకూ జరిమానా విధిస్తారు. డ్రైవింగ్ చేసేందుకు అనర్హులైనప్పటికీ వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకూ జరినామా విధించేలా బిల్లును రూపొందించారు. సీటు బెల్ట్ లేకుంటే లైసెన్స్ రద్దు.. రోడ్లపై అతివేగంతో దూసుకెళ్లే వాహనదారులకు రూ.1,000 నుంచి రూ.2,000 జరిమానా విధించాలని బిల్లులో నిబంధనలు చేర్చారు. ఇక ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2,000 కట్టాలి. వాహనాల్లో సీటు బెల్టు ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా చెల్లించడంతో పాటు 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తారు. ద్విచక్ర వాహనాలపై హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తే రూ.1,000 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దవుతుంది. ఒకవేళ మైనర్ పిల్లలు రోడ్డు ప్రమాదానికి కారకులైతే వారి తల్లిదండ్రులు/ సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు. సదరు తల్లిదండ్రులు/ సంరక్షకులకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించవచ్చు. ఇలాగే ప్రమాదానికి కారణమైన రిజిస్ట్రేషన్‌ను రద్దుచేస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించే వాహనదారులకు విధిస్తున్న రూ.100 జరిమానాను ఈ బిల్లులో రూ.500కు పెంచుతూ బిల్లును రూపొందించారు. అధికారుల ఆదేశాలు పాటించకుంటే విధించే పెనాల్టీని రూ.500 నుంచి రూ.2 వేలకు పెంచారు. ఒకవేళ లైసెన్స్ అందుకోకుండానే వాహనాలు నడిపితే, లైసెన్స్ లేకుండా నడిపేవారికి రూ.5,000 జరిమానా విధించనున్నారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేసేవారికి రూ.5,000, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఓవర్ లోడింగ్ వాహనాలు రూ.20 వేల పెనాల్టీ కట్టేలా బిల్లులో నిబంధనల్ని చేర్చారు. ఒకవేళ ఈ నిబంధనలను స్వయంగా సంబంధిత అధికారులు ఉల్లంఘిస్తే జరిమానా రెట్టింపు అవుతుంది. డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లుకు ఆమోదం.. నేరాల్లో వ్యక్తులను గుర్తించేందుకు ఉద్దేశించిన డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు–2019కు కేబినెట్ ఓకే చెప్పింది. బిల్లు ప్రకారం ప్రభుత్వం జాతీయ డీఎన్ఏ బ్యాంకు, ప్రాంతీయ డీఎన్ఏ బ్యాంకులను ఏర్పాటుచేస్తుంది. ఈ బ్యాంకుల్లో నేరం జరిగిన ప్రాంతంలోని డేటా, నిందితుల డేటా, అదృశ్యమైన వ్యక్తుల డేటా, గుర్తుతెలియని మృతుల డేటాను విడివిడిగా నిర్వహించాలి. అలాగే ఈ బిల్లు ప్రకారం డీఎన్ఏ రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేస్తారు. డీఎన్ఏను విశ్లేషించే ప్రతీ ల్యాబ్ ఈ సంస్థ నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. ఏడేళ్లు అంతకంటే ఎక్కువశిక్ష పడే నేరాలు లేదా హత్య కేసుల్లో డీఎన్ఏ సేకరణకు నిందితుల అంగీకారం అక్కర్లేదు. ఈ రెండు బిల్లులను త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. -
సోషల్ మీడియాకు సంకెళ్లు
గత ఏడాది ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో షికార్లు చేసిన పుకార్లు.. దేశంలో పలుచోట్ల అల్లర్లు, మూక హత్యలకు అసలు కారణంగా నిలిచాయి. దీంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, పుకార్లను కట్టడిచేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు కదిలింది. కొత్త సంవత్సరంలో ఈ దిశగా ఐటీ చట్టాన్ని సవరిస్తోంది. భారీగా జరిమానాలు వేసి అసత్యవార్తలు, అశ్లీల సమాచారాన్ని వ్యాప్తి చేసే మాధ్యమాలను నియంత్రించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలకు భారత్‌లో ఖాతాదారులు చాలా ఎక్కువ. గత ఏడాది అనుభవాలతో ఇవి కొన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ఫేక్ న్యూస్‌పై ప్రజలకు అవగాహన కలిగిస్తూ, హెచ్చరిస్తూ భారీస్థాయిలో ప్రకటనలు ఇస్తున్నాయి. అసభ్య, అసత్య సందేశాలు, సమాచారం పంపకుండా ఖాతాదారులను కట్టడి చేసేందుకు యత్నిస్తున్నాయి. కేంద్రం హెచ్చరికలు ఖాతాదారుల సమాచారాన్ని దొంగిలించి తద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీ మంత్రి రవి శంకర్ ఫేస్బుక్, వాట్సాప్‌లను హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో తమ మాధ్యమం ద్వారా అనైతిక సమాచారం వ్యాప్తి కాకుండా ఫేస్బుక్ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో ఎన్నికల ప్రకటనలు పోస్టుచేసే వారు వారి వివరాలు, ఎక్కడ నుంచి పోస్టు చేస్తున్నారనేవి విధిగా వెల్లడించాల్సిందే. 15 కోట్ల వరకు జరిమానా వదంతులు, అశ్లీల సమాచారాన్ని, దృశ్యాలను నియం త్రించడంలో విఫలమైన వెబ్సైట్లు, యాప్‌లపై భారీ జరిమానా విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ‘ డేటా ప్రొటెక్షన్ బిల్లు’ పేరుతో ముసాయిదాను ఖరారు చేసింది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, గూగుల్ వంటి సోషల్ మీడియా, ఇంటర్నెట్ సంస్థల అధిపతులతో ఐటీ శాఖ అధికారులు సమావేశమయ్యారు. మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టి, వాటి జవాబుదారీతనాన్ని పెంచే మార్గాలపై చర్చించారు. ‘అసత్య, అశ్లీల సమాచా రం సోషల్ మీడియాలోకి ఎక్కడ నుంచి వస్తోందో గుర్తించాలి, దాన్ని తొలగించాలి. ఈ దిశగా ప్రభుత్వం చట్టాన్ని సవరించనుంది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండాలి’ అని ఓ ఉన్నతాధికారి అన్నారు. నిబంధలను ఉల్లంఘించిన కంపెనీలపై రూ. 15 కోట్లు లేదా వాటి ప్రపంచవ్యాప్త టర్నోవర్‌లో 4శాతం ఈ రెండింటిలో ఏది ఎక్కువయితే దాన్ని జరిమానాగా విధించాలని ప్రతిపాదించారు. -
పూరి జగన్నాథుని గుడిలో ఆంక్షలు
భువనేశ్వర్: పూరిలో కొలువై ఉన్న జగన్నాథస్వామి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఒడిశా రాష్ట్ర సర్కారు కొన్ని ఆంక్షలు విధించింది. ఆలయ గర్భగుడిలోకి వీవీఐపీలు సహా ఎవరినీ అనుమతించవద్దని స్పష్టం చేసింది. ‘పరమానిక్ దర్శన్’, ‘సహన మేళా దర్శన్’ వేళలో భక్తులకు గర్భగుడి ప్రవేశం నిలిపివేయమని పేర్కొంది. ఆలయంలోని ‘బిటార్ కథ’వరకు మాత్రమే భక్తులను అనుమతించాలని తెలిపింది. సేవకులను తప్ప మరెవరినీ గర్భగుడిలోకి ప్రవేశించనీయవద్దని సూచించింది. నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ జరిమానా విధించాలని పేర్కొంది. -
భారత సంతతి వ్యక్తికి భారీ జరిమానా
న్యూయార్క్: అమెరికాలోని ఫ్లోరిడా కేంద్రంగా పనిచేసే ఓ కంపెనీలో సీఓఓ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్)గా విధులు నిర్వర్తించే భారత సంతతి వ్యక్తి మోసం ఆరోపణలపై అక్కడి ప్రభుత్వానికి 7.5 లక్షల డాలర్లను చెల్లించేందుకు అంగీకరించారు. ‘ఫ్రీడమ్ హెల్త్’ సంస్థ వివిధ అక్రమ మార్గాల్లో అమెరికా ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున సొమ్ము కాజేసింది. ఇదే కంపెనీకి సిద్ధార్థ పగిడిపాటి సీఓఓగా ఉన్నారు. ఈ కంపెనీ 2008–2013 మధ్య ప్రభుత్వానికి నకిలీ పత్రాలు ఇచ్చి రీయింబర్స్మెంట్ రూపంలో భారీ మొత్తంలో సొమ్ము పొందింది. మోసాన్ని ప్రభుత్వం గుర్తించడంతో వారికి ఇచ్చిన సొమ్మును వెనక్కు రాబడుతోంది. ఆరోపణలను తొలగించుకునేందుకు ఈ కంపెనీ మొత్తం 3.25 కోట్ల డాలర్లను ప్రభుత్వానికి చెల్లించేందుకు అంగీకరించింది. అలాగే సిద్ధార్థ కూడా ఏడున్నర లక్షల డాలర్లను జరిమానాగా చెల్లించనున్నారు. -
రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా
మార్పు లేకపోతే దుకాణం మూసివేత అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం సిటీబ్యూరో: దుకాణదారులు, వ్యాపారులు రోడ్లపై చెత్త వేస్తే జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు భారీ జరిమానాలు విధించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రెండుసార్లు జరిమానాల విధించినా మార్పు రాకపోతే దుకాణాలను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై శనివారం రాత్రి సహాయ వైద్యాధికారులతో (ఏఎంఓహెచ్‌లతో) ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఏఎంఓహెచ్‌లు ఉదయం ఆరు గంటలకల్లా తప్పనిసరిగా క్షేత్ర స్థాయి విధుల్లో ఉండాల్సిందేనన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్ర స్థాయి తనిఖీలకు వెళ్లినవారు అక్కడి ఫొటోలను తనకు సెల్‌ఫోన్ ద్వారా పంపించాలని... 7 గంటలకు పారిశుద్ధ్య సిబ్బంది హాజరు వివరాలను ఎస్సెమ్మెస్ ద్వారా ఇవ్వాలని ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అప్పటివరకు తొలగించిన మొత్తం చెత్త వివరాలు, హాజరైన సిబ్బంది సమాచారం పంపాలన్నారు. రహదారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తాచెదారాలు కనిపించకూడదన్నారు. ఒకవేళ చెత్త కనిపిస్తే సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, శానిటరీ జవాన్లను బాధ్యులుగా చేయాలన్నారు. ఈ విషయాన్ని వారికి స్పష్టం చేయాలని సూచించారు. నిత్యం చెత్త ఉండే ప్రాంతాలను గుర్తించి... అక్కడ యుద ్ధప్రాతిపదికన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. మార్కెట్ యార్డులు.. దుకాణాలు ఉండే ప్రాంతాల్లో దుకాణదారులుసొంతంగా చెత్తడబ్బాలు ఏర్పాటు చేసుకొని వాటిల్లోనే చెత్తవేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది కనీసం ఏడు గంటల పాటు విధుల్లో ఉండేలా ఏఎంఓహెచ్‌లు పర్యవేక్షించాలని సూచించారు. రహదారుల వెంబడి తినుబండారాలు విక్రయించేవారు రోడ్లపై చెత్త వేయకుండా చూడాలని, పరిశుభ్రత పాటించేలా వారికి అవగాహన కల్పించాలని స్పెషలాఫీసర్ ఆదేశించారు. తనిఖీలకు ప్రత్యేక బృందాలు.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో పారిశుద్ధ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉందని సోమేశ్‌కుమార్ చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను ఆకస్మికంగా తనిఖీలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో జోన్‌కు కనీసం ఐదు బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు తాను కూడా తనిఖీలు నిర్వహిస్తానన్నారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ఉదయం 6 గంటల నుంచే తనిఖీలు చేపడతారని తెలిపారు. భవన నిర్మాణ సామగ్రిని ఎవరూ రోడ్లపై వేయకుండా చూడాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ఆరోగ్యం-పారిశుద్ధ్యం) రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘రోడ్డు’ నేరస్తులపై కొరడా!
ప్రమాదాలకు పాల్పడితే భారీ జరిమానాలు, జైలుశిక్ష - పిల్లలు మరణిస్తే రూ. 3 లక్షల జరిమానా, ఏడేళ్ల జైలు - కొత్త మోటారు వాహనాల బిల్లులో ప్రతిపాదనలు న్యూఢిల్లీ: దేశంలో ఏటా లక్షన్నర మందిని బలిగొంటున్న రోడ్డు ప్రమాదాలకు, వాటికి కారణమయ్యే వారికి చెక్ పెట్టేందుకు కేంద్రం కొరడా ఝళిపించనుంది. రహదారి భద్రత పెంచి, నిబంధనలు ఉల్లంఘించే నేరస్తులపై ఉక్కుపాదం మోపేందుకు కొత్త మోటారు వాహనాల బిల్లును ప్రతిపాదించింది. ఇందులో భారీ జరిమానాలు, ఏడేళ్లకుపైగా జైలు శిక్ష, వాహనాల జప్తు, డ్రైవింగ్ లెసైన్సుల రద్దు తదితర ప్రతిపాదనలు ఉన్నాయి. ‘కొత్త రోడ్డు భద్రత, రవాణా బిల్లు-2014’ పేరుతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మం త్రిత్వ శాఖ శనివారం దీన్ని విడుదల చేసింది. ప్రజల నుంచి, సంబంధిత రంగాల నుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించేందుకు దీని వివరాలు వెల్లడించింది. సలహాలు స్వీకరించాక బిల్లును ఖరారు చేసి శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెడతారు. బిల్లులోని ముఖ్య ప్రతిపాదనలు.. ► కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదంలో పిల్లల మృతికి కారణమైతే నేరస్తుడికి రూ. 3 లక్షల జరిమానా, ఏడేళ్లకు తక్కువ కాకుండా జైలుశిక్ష. ► వాహనాల తయారీ డిజైన్‌లో లోపాలుంటే ఒక్కో వాహనానికి రూ. 5 లక్షల జరిమానా, జైలుశిక్ష. వాహనాలను సురక్షితంకాని పరిస్థితుల్లో నడిపితే రూ. 1 లక్షవరకు జరిమానా, లేదా ఆరు నెలల నుంచి ఏడాది జైలుశిక్ష, లేదా ఇవి రెండూ. ► మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే(తొలి నేరం కింద) రూ.25 వేల జరిమానా, లేదా మూడు నెలలకు మించని జైలుశిక్ష, లేదా ఇవి రెండూ, ఆరు నెలలు డ్రైవింగ్ లెసైన్స్ సస్పెన్షన్. మూడేళ్లలోపు రెండోసారి ఈ నేరానికి పాల్పడితే రూ. 50వేల పెనాల్టీ, లేదా ఏడాది జైలు శిక్ష, లేదా ఇవి రెండూ. వీటితోపాటు లెసైన్స్ ఏడాది సస్పెన్షన్. తర్వాత కూడా డ్రంక్ డ్రైవింగ్ చేస్తే లెసైన్స్ రద్దు, 30 రోజుల వరకు వాహనం జప్తు. ► స్కూల్ బస్సు డ్రైవర్ మద్యం తాగి నడిపితే రూ. 50 వేల జరిమానా, మూడేళ్లవరకు జైలుశిక్ష. 18-25 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు ఇలాంటి నేరానికి పాల్పడితే వెంటనే లెసైన్స్ రద్దు. జరిమానాల విధింపు కోసం గ్రేడెడ్ పాయింట్ వ్యవస్థ. ► ట్రాఫిక్ సిగ్నళ్లను మూడుసార్లు ఉల్లంఘిస్తే రూ. 15 వేల జరిమానా. నెలపాటు లెసైన్స్ రద్దు, తప్పనిసరిగా తాజా డ్రైవింగ్ శిక్షణ. పదేపదే ప్రమాదాలకు కారణమయ్యేవారిని గుర్తించేందుకు ఎలక్ట్రానిక్ డిటెక్షన్, కేంద్రీకృత నేర సమాచార వ్యవస్థ. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద సీసీటీవీలు. వాహనాల్లో వేగ నియంత్రణ, డ్రైవర్ల నిద్రమత్తు గుర్తింపు తదితర భద్రతా పరికరాల ఏర్పాటు. ► ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన తొలి గంటలోనే(గోల్డెన్ అవర్) నగదు రహిత చికిత్స మోటార్ యాక్సిడెంట్ ఫండ్ ఏర్పాటు. దీనికింద.. రోడ్డు వాడుకునే వారందరినీ తప్పనిసరిగా బీమా పరిధిలోకి తెస్తారు. క్షతగాత్రులు, ప్రమాద మృతుల బంధువులు దీన్నుంచి డబ్బు కోరవచ్చు. లక్ష్యాలు.. వచ్చే ఐదేళ్లలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యను రెండు లక్షలమేర తగ్గించడం. ప్రస్తుతం ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగుతుండగా, 1.4 లక్షల మంది చనిపోతున్నారు. ► స్వతంత్రప్రతిపత్తిగల మోటారు వాహనాల నియంత్రణ- రోడ్డు భద్రత ప్రాధికార సంస్థ ఏర్పాటు. వాహనాలకు సంబంధించి మెరుగైన డిజైన్లు. భారీవాహనాల రీడిజైనింగ్. ► డ్రైవింగ్ లెసైన్సుల జారీకి సింగిల్‌విండో ఆటోమేటెడ్ వ్యవస్థ. ఆటోమేటెడ్ డ్రైవింగ్ పరీక్ష, నకిలీ లెసైన్సుల నియంత్రణకు బయోమెట్రిక్ విధానం. వాహనాల తయారీదారులు, రవాణా విభాగాలు, బీమా కంపెనీల కోసం సమగ్ర డేటాబేస్. సులభంగా వాహనాల బదిలీ. ► వాహనాల ఏకీకృత రిజిస్ట్రేషన్ వ్యవస్థ, నేషనల్ రోడ్ ట్రాన్స్పోర్ట్-మల్టీనేషనల్ కోఆర్డినేషన్ అథారిటీ, జాతీయ రహదారులపై ట్రాఫిక్ నియంత్రణ కోసం హైవే ట్రాఫిక్ రెగ్యులేషన్-ప్రొటెక్షన్ ఫోర్స్. గూడ్స్ ట్రాన్స్పోర్ట్-నేషనల్ ఫ్రైట్ పాలసీ. ► రోడ్డు రవాణా సామర్థ్యం, భద్రత పెంపుతో స్థూల జాతీయోత్పత్తి 4 శాతం పెరుగుతుందని అంచనా. ఈ రంగంలో పెట్టుబడుల పెంపు ద్వారా 10 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ► అభివృద్ధి చెందిన అమెరికా, కెనడా, సింగపూర్, జపాన్, బ్రిటన్, జర్మనీల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలకు అనుగుణంగా ఈ బిల్లు రూపొందించారు. కాగా, వేగం, సామర్థ్యం, సురక్షితం, లాభదాయకమైన రవాణా వ్యవస్థను నెలకొల్పడం ఈ బిల్లు లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఈ రంగంలో పారదర్శకత కోసం ఈ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యమిచ్చామన్నారు. యాక్సిడెంట్ నిధితో ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందుతుందని, లక్షలాది ప్రాణాలను కాపాడొడచ్చని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఢీకొట్టండి... పారిపోండి!
రోడ్డుపై వేగంగా కారు నడపాలని, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి అడ్డదిడ్డంగా దూసుకుపోవాలని అనిపిస్తుందా? నిజంగా అలా చేస్తే గనక.. ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు వడ్డిస్తారు. ప్రమాదాలు జరిగి మనకు దెబ్బలు తగలడమో, అవతలివారికి తగిలితే జైలుకు పోవడమో ఖాయం. అదే ఫోన్లో అయితే? మన కారు.. మన ఇష్టం. నచ్చిన వేగంతో మెచ్చిన రోడ్డుపై అడ్డదిడ్డంగా దూసుకుపోవచ్చు. హెవీ ట్రాఫిక్‌లో ప్రత్యేకమైన రంగుల్లోనే ఉన్న వాహనాలు ఢీకొడుతూ స్పోర్ట్స్ కారుతో నడిరోడ్డుపై వీరవిహారం చేయొచ్చు. లేదా కామ్‌గా, చాకచక్యంగా డ్రైవ్ చేయొచ్చు. దీనికి టిల్ట్ లేదా టచ్.. రెండు ఆప్షన్లూ ఉన్నాయి. అందువల్ల మనం ఉన్న పొజిషన్‌కు అనుగుణంగా ఈ గేమ్ తనకు తాను టిల్ట్(రొటేట్) అవుతుంది. ఈ ఉచిత ఆప్ ఐఫోన్, ఐపాడ్, ఐపాడ్టచ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కావాలంటే ఆపిల్ ఆప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.