భువనేశ్వర్: ఒడిశాలోని సంభల్‌పూర్‌లో శనివారం నాగాలాండ్‌కు చెందిన ఓ లారీపై రూ.6.53 లక్షల జరిమానా విధించి పోలీసులు కొత్త రికార్డు సృష్టించారు. ట్రాఫిక్ నిబంధనలు ఏడింటిని ఉల్లంఘించారన్న కారణంగా ఇంతటి భారీ జరిమానా వేశారు. ఐదేళ్లుగా రోడ్ ట్యాక్స్ కట్టని కారణంగా ఎన్‌ఎల్ 08డీ 7079 నెంబరు ఉన్న ట్రక్‌పై రూ.6.40 లక్షల జరిమానా విధిస్తూ సంభల్‌పూర్ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారి చలాన్ రాశారు. వాహనాన్ని దిలీప్ కర్తా అనే డ్రైవర్ నడుపారు. యజమాని పేరు శైలేశ్ గుప్తా. దీంతోపాటు రూ.వంద సాధారణ జరిమానాగా, ఆదేశాలను ఉల్లంఘించినందుకు రూ.500, వాయు, శబ్ద కాలుష్య ఉల్లంఘనలకు రూ.1000, సరుకులు రవాణా చేయాల్సిన వాహనంలో ప్రయాణీకులను తీసుకెళుతున్నందుకు రూ.5000, పర్మిట్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.5000, పర్మిట్ నిబంధనలను పాటించనందుకు రూ.1000 జరిమానా విధించినట్లు రసీదులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment