Nagaland
-
అంతర్జాతీయ ఆవాసం!
అవును. ఈ బుల్లి ఇల్లు నిజంగానే రెండు దేశాల పరిధిలో విస్తరించింది! ఈ గమ్మత్తైన ఇల్లు ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లోని లోంగ్వా గ్రామంలో ఉంది. ఇది కాస్త భారత్‌లో, మిగతా భాగం మయన్మార్ పరిధిలో ఉంటుంది! భారత్, మయన్మార్ సరిహద్దు సరిగ్గా ఈ గ్రామం నడుమగా పోవడమే దీనికి కారణం. ప్రధాన ద్వారానికి ఆ పక్క సగంపై నాగాలాండ్ (భారత్), ఈ పక్క సగంపై సగాయింగ్ (మయన్మార్) అని రాసి ఉంటుంది కూడా. ఇంటి బయట ఠీవిగా నుంచున్నది దాని యజమాని టోనెయ్ ప్వాంగ్. అన్నట్టూ, ఆయన స్థానిక కోన్యాక్ నాగా గిరిజన తెగ నాయకుడు కూడా. ఆరకంగా చూస్తే ఆయన నివాసం లోంగ్వా గ్రామం మొత్తానికీ రాజప్రాసాదం వంటిదన్నమాట. ఈ ఇంటికి 100 ఏళ్ల పై చిలుకు చరిత్ర ఉంది. అంతర్జాతీయ సరిహద్దు మాత్రం 1971లో పుట్టుకొచ్చింది. ప్వాంగ్ ఇంటిని రెండు దేశాలకూ చెందేలా విడదీసింది. ‘‘అంతర్జాతీయ సరిహద్దు 50 ఏళ్ల కింద పుట్టుకొచ్చింది. మా ఇల్లు అంతకు 50 ఏళ్ల ముందునుంచే ఉంది. సరిహద్దు భూభాగాన్ని విభజిస్తుందేమో గానీ ఇది మా పూరీ్వకుల ఆవాసం. ఇందులో ఉండేందుకు మాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురవడం లేదు’’ అంటారు ప్వాంగ్. ఈ ఊళ్లోని వాళ్లంతా భారతీయులే. అందరికీ ఓటు హక్కు కూడా ఉంది. అయినా వారికి మయన్మార్ నుంచి పలు సంక్షేమ పథకాలు అందుతుండటం విశేషం! ఈ ఊళ్లో రెండు దేశాల సైన్యాలూ గస్తీ కాస్తుంటాయి. అంతేకాదు. ఈ ప్రాంతంలో భారత్, మయన్మార్ ప్రజలు వీసా తదితరాలేవీ అవసరం లేదు. -
గూగుల్ మ్యాప్‌తో పోలీసులు కాస్త దొంగలయ్యారు!
గూగుల్ మ్యాప్ మరోసారి హ్యాండిచ్చిన ఘటన ఇది. ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్నారు. అయితే అది కాస్త దారుణ పరాభవానికి దారి తీసింది. పోలీసులను దొంగలుగా భావించి చితకబాదిన జనం.. రాత్రంతా కట్టేసి బందీలుగా ఉంచుకున్నారు. చివరకు అసలు విషయం తెలిసి సారీ చెప్పి వదిలేశారు. అసోంలోని జోరాత్ జిల్లాకు చెందిన 16 మందితో కూడిన పోలీసు బృందం నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో ఈ బృందం గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంది. మ్యాప్ అసోంలోని ఓ తేయాకు తోటను చూపించింది. నిజానికి అది నాగాలాండ్‌లోని నాగాలాండ్‌లోని మోకోక్చుంగ్ జిల్లా ప్రాంతం. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం లోపలికి వెళ్లారు. అయితే.. వారి వద్దనున్న అధునాతన ఆయుధాలు చూసిన స్థానికులు వారిని దుండగులుగా పొరబడి చుట్టుముట్టి దాడి చేశారు. ఆపై వారిని బంధించారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న జోరాత్ పోలీసులు వెంటనే మోకోక్‌చంగ్ ఎస్పీతో మాట్లాడారు. దీంతో ఆయన స్థానికుల చేతుల్లో బందీలుగా ఉన్న పోలీసులను విడిపించేందుకు మరో బృందాన్ని పంపించారు. స్థానికులకు అసలు విషయం తెలియడంతో గాయపడిన పోలీసు సహా ఐదుగురిని విడిచిపెట్టారు. మిగిలిన 11 మందిని రాతంత్రా బందీలుగా ఉంచుకుని నిన్న ఉదయం విడిచిపెట్టడంతో కథ సుఖాంతమైంది. -
నాగాలాండ్‌లో 99.8 శాతం మాంసాహార ప్రియులు
-
గిరిజనుల ఐక్యతకు భారతీయ హార్న్‌బిల్
భారతదేశంలోని ఈశాన్యప్రాంతంలో ప్రతి డిసెంబర్లో నాగాలాండ్‌లోని రోలింగ్ కొండల మధ్య సుందరమైన కోహిమా ప్రాంతం నాగా తెగల సాంస్కృతిక వేడుకలకు కేంద్ర బిందువు అవుతుంది. అక్కడి గిరిజనులు తమ అరుదైన సంస్కృతిని ప్రదర్శించడానికి హార్న్‌బిల్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వివిధ తెగల మధ్య ఐక్యతకు, శాంతికి, సంస్కృతికి ప్రతీకగా పాతికేళ్లుగా ప్రతియేటా జరిగే ఈ వేడుకలో లక్షన్నరకు పైగా సందర్శకులు పాల్గొన్నారు. దీంతో ఈ వేడుక ప్రపంచమంతటినీ ఆకర్షించింది. పర్యాటకాన్ని ప్రోత్సహించడం, నాగా తెగల శక్తివంతమైన గుర్తింపును వెలుగులోకి తీసుకురావం ఈ వేడుక ముఖ్య ఉద్దేశ్యం. పండుగ సందర్భంగా ఇక్కడ ప్రతి తెగ దాని స్వంత సజీవ నృత్యాలు, పాటలు, ఆచారాలను ప్రదర్శించడమే కాదు నాగా వంటకాలు విభిన్న రుచులను అందిస్తాయి. స్థానిక కళాకారులు, హస్తకళాకారులు ప్రదర్శనలో భాగం అవుతారు. తద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది. చేతితో నేసిన వస్త్రాలు, సాంప్రదాయ ఆభరణాలు, వివిధ హస్తకళలతో నిండిన స్టాల్స్ పండుగకు వెళ్లేవారికి సాంస్కృతిక ్ర΄ాముఖ్యతతో కూడిన సావనీర్లను ఇంటికి తీసుకెళ్లడానికి సరైన అవకాశాన్ని అందిస్తాయి. నిర్దిష్ట తెగలు, వారి విలక్షణమైన సంప్రదాయాలకు నివాళులు అర్పిస్తూ ప్రత్యేక నేపథ్య సాయంత్రాలను ప్లాన్ చేయవచ్చు. ఉదాహరణకు కొన్యాక్ తెగ వారు వారి సంప్రదాయ పచ్చబొట్లు, పాటలు, కథలు వారి జీవన విధానంపై అవగాహన కలిగిస్తాయి. మరొక తెగ వారి ప్రాచీన నృత్యాల ద్వారా చారిత్రక కథలను వివరిస్తాయి.ఇదీ చదవండి: టీ లవర్స్ : టీ మంచిదా? కాదా? ఈ వార్త మీకోసమే!వివిధ తెగల మధ్య శాంతిఈ ఫెస్టివల్ తెగల మధ్య ఐక్యతను పెం΄÷ందిస్తుంది. గిరిజన సంఘర్షణల చుట్టూ తరచుగా గందరగోళ చరిత్ర ఉన్నందున, ఈ పండుగ వివిధ వర్గాల మధ్య అంతరాలను తగ్గిస్తుంది. భవిష్యత్ తరాలకు దేశీయ సంస్కృతుల పరిరక్షణకు భరోసానిస్తూ, నాగా యువకులు తమ మూలాలతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక వేదికగా మారుతుంది. వివిధ ΄ోటీలను నిర్వహించి గిరిజన యువతలో గర్వం, ప్రేరణను సృష్టిస్తుంది. రాత్రి సమయాల్లో జరిగే కచేరీలకు వివిధ ప్రాంతాల నుండి బ్యాండ్ లను ప్రదర్శిస్తారు. ప్రతి రోజు ఉత్సాహభరితమైన శ్రావ్యమైన పాటలతో ముగుస్తుంది. స్థానికులు, పర్యాటకులు, ప్రదర్శకులు కలిసి ఆనందాన్ని పొందడానికి వీలు కల్పిస్తుంది. పాతికేళ్లుగా హార్న్‌బిల్ ఫెస్టివల్ నాగా సంస్కృతిని పరిరక్షించడమే కాకుండా దాని అభివృద్ధిని కూడా వాగ్దానం చేస్తుంది. భవిష్యత్ తరాలకు ఈ విలువైన సంప్రదాయాలను వారసత్వంగా, భాగస్వామ్యం చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇలాంటి సంప్రదాయ వేడుకలు మన భారతీయ సంస్కృతిని ఇంకా సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి అనడానికి హార్నబిల్ ఓ ఉదాహరణగా నిలుస్తుంది. View this post on Instagram A post shared by Hornbill Festival Nagaland (@hornbillfestivalofficial) -
నాగాలాండ్‌పై హైదరాబాద్ ఘనవిజయం
అహ్మదాబాద్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా శనివారం జరిగిన తమ తొలి పోరులో హైదరాబాద్ 42 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 48.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాటర్ అరవెల్లి అవనీశ్ (82 బంతుల్లో 100; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఆకట్టుకోగా... ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), వరుణ్ గౌడ్ (57) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ తిలక్ వర్మ (0) విఫలమయ్యాడు. నాగాలాండ్ బౌలర్లలో ఇమ్లీవతి లెమ్టర్ 4, జొనాథన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నాగాలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. యుగంధర్ సింగ్ (80; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జగదీశ సుచిత్ (66; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో పోరాడినా లాభం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో నిశాంత్, ముదస్సిర్ రెండేసి వికెట్లు తీశారు. అవనీశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో సోమవారం ముంబైతో హైదరాబాద్ తలపడనుంది. -
Vijay Hazare Trophy: వన్డేల్లో కుర్రాళ్ల సత్తాకు పరీక్ష
న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్లో టి20 సమరం ముగిసిన తర్వాత ఇప్పుడు వన్డే పోరుకు రంగం సిద్ధమైంది. విజయ్‌హజారే వన్డే టోర్నీలో భాగంగా నేటినుంచి దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాలు వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యులైన ఎక్కువ మంది ఆటగాళ్లు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఉండగా...మున్ముందు వన్డే టీమ్‌లో స్థానం ఆశిస్తున్న ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు ఇది సరైన అవకాశం కానుంది. ఈ ఆటగాళ్ల కారణంగా టోర్నీపై ఆసక్తి పెరగడంతో పాటు తీవ్రమైన పోటీ కారణంగా మ్యాచ్‌లు హోరాహోరీగా సాగే అవకాశం కూడా ఉంది. బరోడా తరఫున ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగుతున్నాడు. టి20లో ఇప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పలువురు పేస్ బౌలర్లు వన్డే టీమ్‌లో తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అర్‡్షదీప్ సింగ్ (పంజాబ్), అవేశ్ ఖాన్ (మధ్యప్రదేశ్), ఖలీల్ అహ్మద్ (రాజస్తాన్), ముకేశ్ కుమార్ (బెంగాల్), యశ్ దయాళ్ (యూపీ) తమ బౌలింగ్‌కు పదును పెడుతున్నారు. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి (తమిళనాడు), కుల్దీప్ యాదవ్ (యూపీ), రవి బిష్ణోయ్ (రాజస్తాన్) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బ్యాటర్లలో అందరి దృష్టీ శ్రేయస్ అయ్యర్‌పై ఉంది. వన్డే టీమ్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్న అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా టి20 మెరుపులను దాటి వన్డే టీమ్‌లో రెగ్యులర్‌గా మారే క్రమంలో ఈ టోర్నీ తగిన వేదిక కానుంది. భారత ఆటగాడు రింకూ సింగ్ ఉత్తరప్రదేశ్ కెపె్టన్‌గా బాధ్యతలు తీసుకుంటున్నాడు. సీనియర్ స్థాయిలో అతను తొలిసారి సారథిగా వ్యవహరించనుండటం విశేషం. భారత ఆటగాడు, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ కెపె్టన్ అయిన సంజు సామ్సన్‌కు కేరళ జట్టులో చోటు లభించలేదు. తాము నిర్వహించిన శిక్షణా శిబిరంలో పాల్గొన్న ఆటగాళ్లనుంచే జట్టును ఎంపిక చేయాలని కేరళ క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకోవడంతో సామ్సన్ పేరును పరిశీలించనే లేదు. కర్నాటక టీమ్ కూడా సీనియర్ బ్యాటర్ మనీశ్ పాండేకు ఉద్వాసన పలికింది. ఇక కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని కర్నాటక అసోసియేషన్ స్పష్టం చేసింది. ముస్తాక్ అలీ ట్రోఫీలో 5 మ్యాచ్‌లలో కలిపి 117 పరుగులే చేసిన పాండే ప్రభావం చూపలేకపోయాడు. మరో వైపు ముస్తాక్ అలీ టి20 టోర్నీలో రాణించిన బెంగాల్ పేసర్, భారత సీనియర్ బౌలర్ మొహమ్మద్ షమీను వన్డే టీమ్‌లోకి కూడా తీసుకున్నారు.అయితే నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో మాత్రం షమీ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటాడని బెంగాల్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో జరిగే మరో మ్యాచ్‌లో త్రిపురతో బరోడా తలపడుతుంది. అహ్మదాబాద్‌లో జరిగే గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో నాగాలాండ్‌తో తిలక్ వర్మ సార«థ్యంలోని హైదరాబాద్ తలపడుతుంది. గ్రూప్ ‘బి’లో భాగంగా ముంబైలో జరిగే మ్యాచ్‌లో రైల్వేస్‌ను శ్రీకర్ భరత్ సార«థ్యంలోని ఆంధ్ర జట్టు ఎదుర్కొంటుంది. -
రాహుల్ అనుచితంగా ప్రవర్తించారు: మహిళా ఎంపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీపై నాగాలాండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ ఫగ్నాన్ కొన్యాక్ రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ బయట గురువారం(డిసెంబర్19) జరిగిన నిరసనల్లో తనకు రాహుల్ అత్యంత దగ్గరగా వచ్చి అసౌకర్యానికి కారణమయ్యారని ఆరోపించారు. గట్టిగా అరుస్తూ తనకు అత్యంత సమీపంలోకి వచ్చి తనతో అనుచితంగా ప్రవర్తించారని, ఇది తనను అసౌకర్యానికి గురి చేసిందని ఫిర్యాదు అనంతరం ఎంపీ కొన్యాక్ చెప్పారు. కాగా,పార్లమెంట్లో గురువారం గందరగోళం నెలకొంది. అంబేద్కర్‌ను అవమానించి కాంగ్రేస్సేనని బీజేపీ.. కాదు..కాదు బీజేపీ నేతలే రాజ్యాంగ నిర్మాతను అవమానించారంటూ అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు పోటా పోటీగా నిరసనలు చేపట్టారు. ఎంపీలు చేట్టిన నిరసనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పార్లమెంట్ సిబ్బంది ఎంపీ సారంగిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో గందరగోళం.. రేపటికి వాయిదా -
పండుగలకే పండుగ!
నాగాలాండ్‌లో జరిగే ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ను అక్కడి ప్రజలు ‘పండుగలకే పండుగ’గా అభివర్ణిస్తారు. పది రోజుల పాటు అత్యంత అట్టహాసంగా జరిగే పండుగ ఇది. ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ పండుగ నాగాలాండ్ కళా సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పడుతుంది. పదిహేడు తెగలకు చెందిన ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారు. నాగాలాండ్ రాజధాని కోహిమాకు చేరువలోని కిసామా హెరిటేజ్ విలేజ్‌లో పది రోజుల పాటు రకరకాల ప్రదర్శనలు, పోటీలు జరుగుతాయి. ఈ వేడుకలలో పాల్గొనే పదిహేడు తెగల ప్రజలు ఇక్కడ తమ తమ సంప్రదాయ రీతుల్లో గుడారాలను వేసుకుని ఉంటారు. ఉదయం వేళల్లో ఆరుబయట మైదానంలోను, వీథుల్లోను వివిధ రీతులకు చెందిన సంప్రదాయ సంగీత నృత్య ప్రదర్శనలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం వేళ ఆరుబయట విందు భోజనాలు జరుగుతాయి. ఈ వేడుక జరిగినన్ని రోజులూ ఆహార మేళాలు ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ తెగలకు చెందిన ప్రజల మధ్య సాంస్కృతిక స్నేహబాంధవ్యాలను పెంపొందించే ఉద్దేశంతో నాగాలాండ్ ప్రభుత్వం 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ, కళా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభించింది. ఈ వేడుకల్లో భాగంగా హస్తకళల ప్రదర్శనలు, స్థానిక పోరాట విద్యల ప్రదర్శనలు, రకరకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. వేడుకలు జరిగే మైదానంలో ఆహారశాలలు, వనమూలికల విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శనశాలలు వంటివి ఏర్పాటవుతాయి.ఈ వేడుకల్లో ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆరుబయట ఏర్పాటు చేసిన వేదికలపైన సంప్రదాయ, ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ‘మిస్ నాగాలాండ్’ అందాల పోటీలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా ‘హార్న్‌బిల్ ఇంటర్నేషనల్ రాక్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ వేడుకల్లో స్థానిక, అంతర్జాతీయ రాక్ బ్యాండ్ బృందాలు వేడుక జరిగే పదిరోజులూ కచేరీలు చేస్తారు. నాగాలాండ్ ప్రభుత్వం ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ నిర్వహణను ప్రారంభించిన తర్వాత రాష్ట్ర పర్యాటక ఆదాయం గణనీయంగా పెరిగింది. -
అందాల అడవి రైతు.. హార్న్‌బిల్
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యం విభిన్న వన్యప్రాణులకు నెలవు. ఇక్కడి అరుదైన పక్షులు, జంతు జాతులు పర్యావరణ ప్రేమికుల్ని అబ్బురపరుస్తాయి. పక్షిజాతుల్లో అత్యంత అరుదైన జీవనశైలి హార్న్‌బిల్ (ఫారెస్ట్ ఫార్మర్) పక్షుల సొంతం. వీటి స్వభావం అచ్చంగా మనుషుల్ని పోలి ఉంటుంది. మగ పక్షులు కుటుంబ బాధ్యతను మోస్తూ.. ఆడ పక్షులకు అవసరమైన తిండిని సంపాదిస్తూ.. వాటిని గూడు దాటకుండా బాధ్యతగా చూసుకుంటాయి. వీటిని అడవి రైతులుగా పిలుస్తుంటారు. పొడవైన ముక్కు, తోకలతో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనపడతాయి. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం హార్న్‌బిల్ పక్షులు ఎత్తైన చెట్లలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ గూళ్లలో నివసిస్తాయి. మగ పక్షులు పితృస్వామ్యాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తూ కుటుంబ పోషణను చూసుకుంటాయి. తల్లి పక్షి గూడులో గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతుంది. పిల్లలతో కలిసి మూడు నెలలపాటు ఎటూ కదలకుండా గూట్లోనే ఉండిపోతుంది. మగ హార్న్‌బిల్ ఆ మూడు నెలలు ఆహారాన్ని సేకరించి.. గూట్లో ఉన్న తల్లి, పిల్ల పక్షులకు నోటిద్వారా అందిస్తుంది. ఆహారం కోసం తిరిగే సమయంలో మగ హార్న్‌బిల్ వేటగాళ్ల బారినపడినా.. ప్రమాదవశాత్తు మరణించినా గూటిలో ఉన్న తల్లి పక్షితోపాటు పిల్ల పక్షులు కూడా ఆకలితో చనిపోతాయే తప్ప ఇంకే ఆహారాన్ని ముట్టవు. దీంతోపాటు హార్న్ బిల్ పక్షుల దాంపత్య జీవనం ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఇవి జీవితాంతం ఒకే పక్షితో జత కడతాయే తప్ప మరే పక్షిని దరిచేరనివ్వవు. నాగాలాండ్‌లో ఏటా ఉత్సవం హార్న్‌బిల్ పక్షుల జీవన విధానానికి ముగ్ధులైన నాగాలాండ్ వాసులు వాటి పేరిట ఏటా 10 రోజుల పాటు ఉత్సవాన్ని జరుపుకుంటారు. నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమాకు 12 కిలోమీటర్లు దూరంలో గల కిసామాలోని గిరిజనులు హార్న్‌బిల్ ఉత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తారు. డిసెంబర్ 1నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవంలో చిన్నా పెద్డా తేడా లేకుండా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుంటారు.రెండు రాష్ట్రాల పక్షి అరుణాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు రాష్ట్ర పక్షిగా హార్న్‌బిల్‌ను గుర్తించాయి. ఈ పక్షుల జీవన కాలం 40 నుంచి 50 సంత్సరాలని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. వీటి పొడవు 95 నుంచి 120 సెంటీమీటర్లు కాగా.. రెక్కలు విప్పినప్పుడు వీటి వెడల్పు 151 సెంటీమీటర్ల నుంచి 178 సెంటీమీటర్లు ఉంటుందని పేర్కొంటున్నారు. ఇవి సుమారు 4 కేజీల బరువు ఉంటాయి.ఫారెస్ట్ ఫార్మర్ హార్న్‌బిల్ మగ పక్షి పండ్లను సేకరించి తల్లి, పిల్లలకు ఆహారంగా అందిస్తుంది. గూడుకు చేరుకున్న పక్షి పండ్ల గింజలను తొలగించి మరీ పిల్లలు, తల్లి నోటికి అందిస్తుంది. అలా అందిస్తున్నప్పుడు.. అది వదిలేసిన గింజలు నేలపై పడి.. అడవిలో మొలకెత్తి చెట్లుగా ఎదుగుతాయి. అందుకే.. ఈ పక్షిని అడవి రైతుగా పేర్కొంటారు. -
నాగాలాండ్ పౌర హత్యలు: ఆర్మీ సిబ్బందిపై క్రిమినల్ కేసు రద్దు
ఢిల్లీ: నాగాలాండ్ మోన్ జిల్లాలో 13 మంది పౌరుల హత్య కేసులో ఆర్మీ సిబ్బందిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసుపై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. ‘ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లోని చేర్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తున్నాం. ఇక.. ఈ కేసును ఓ తార్కిక ముగింపునకు తీసుకురావచ్చు. అదేవిధంగా సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్మీకి సూచించాం’ అని సుప్రీంకోర్టు వెల్లడించింది.డిసెంబర్ 4, 2021న నాగాలాండ్‌లోని ఓటింగ్ గ్రామంలో మైనర్లను తీసుకెళ్తున్న ట్రక్కుపై ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపింద. అయితే ఆ ట్రక్కులో ఉన్నవాళ్లను ఆర్మీ సిబ్బంది మిలిటెంట్లుగా భావిసించి కాల్పులు జరిపింది.ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. దీంతో ఆ ప్రాంతంలో హింస చెలరేగడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపిన కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు మృతి చెందారు.చదవండి: ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్ -
ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..
నాగాలాండ్‌లోని లాంగ్వా చాలా ప్రత్యేకతలు కలిగిన గ్రామం. ఈ గ్రామం స్పెషలిటీ వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. ఇలాంటి గ్రామం మరొకటి ఉండే అవకాశం కూడా లేదన్నంత స్పెషాలిటీగా ఉంటుంది. ఎంత స్పెషల్ అంటే..ఒకే ఇంట్లో రెండు దేశాల సరిహాద్దును చూడొచ్చు. ఆ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? అదెలా సాధ్యం అంటే..నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో ఒకటి లాంగ్వా. ఇక్కడ 'కోన్యాక్ నాగా' అనే గిరిజన తెగ ఉంటుంది. ఈ గ్రామం మధ్యలోంచి ఇండియా, మయన్మార్ బోర్డర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బోర్డర్ గ్రామాన్ని విడదీయకపోవడం విశేషం. ఈ గ్రామ ప్రజలు హెడ్ హంటింగ్‌కు ప్రసిద్ధి. ఈ కోన్యాక్ తెగ ప్రజలు తమ శత్రువులపై యుద్ధం జరిపి.. విజయం సాధించిన గుర్తుగా శత్రువు తలని తీసి తమ గ్రామానికి అలంకరణగా ఉంచుతారు. ఇక్కడ ప్రజలు తమ ఇళ్లను ఏనుగు దంతాలు, హార్న్‌బిల్ ముక్కులు, మానవ పుర్రెలతో అలంకరించుకుంటారు. ఈ పుర్రెలు ఇలా గ్రామంలో ప్రతి ఇంటిపై ఉండటం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందనేది వారి నమ్మకం. ఈ గ్రామం నల్లమందు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లాంగ్వ్లోని కున్యాక్ నాగా తెగ పెద్దని అంఘ్ అని పిలుస్తారు. అతడిని అక్కడ ప్రజలు మహారాజుగా భావిస్తారు. అతని ఇల్లు ఇండో-మయన్మార్ సరిహద్దు గుండా వెళ్తుంది. చెప్పాలంటే అతడి ఇల్లుని రెండు భాగాలుగా విభజిస్తుంది. దీంతో అతడి కిచెన్ మయన్మార్‌లో ఉంటే బెడ్రూం ఏకంగా భారత్‌లో ఉంది. దాదాపు అక్కడ ఉండే ప్రజల ఇళ్లన్ని ఇలానే ఉంటాయి. ఆ గ్రామ పెద్దకి ఏకంగా 60 మంది భార్యలు. అతడి కృషి వల్ల లాంగ్వా గ్రామం ఎంతో అభివృద్ధి సాధించింది. అంతేగాదు ఇక్కడ ప్రజలకు రెండు దేశాల పౌరసత్వం లభిస్తుంది. ఒకప్పుడూ ఆ గ్రామంలో రహదారి సరిగా ఉండేది కాదు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సిబ్బంది కొండలా ఎత్తుగా ఉండే ఆ రహదారిని చక్కగా చదును చేసి బాగు చేయడంతో చక్కటి రవాణా కనెక్టివిటీ ఏర్పడింది. ఈ గ్రామాన్ని సందర్శించడానికి అనువైన సమయం అక్టోబర్ నుంచి మార్చి నెల సమయం. ఆ సమయంలో లాంగ్వా గ్రామం పండుగ వాతావరణంతో కళకళలాడుతూ ఆహ్లాదంగా ఉంటుంది. (చదవండి: 'లంగ్స్ ఆఫ్ చత్తీస్‌గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్‌మ్యాన్..) -
అనిశ్చితి కొనసాగితే అంతులేని నష్టం
ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడలేదు. మణిపుర్ రాజధాని ఇంఫాల్‌తో నాగాలాండ్‌ను కలిపే జాతీయ రహదారి మీద ఉన్న వంతెనను దుండగులు పేల్చేశారు. మరో ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేశారు. అరాచకం ఎంత స్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాంలో శాంతి యుగానికి నాంది పడింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్‌లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.హింస చెలరేగిన ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మరింత దారుణంగానే ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రధాన శక్తులు ఏకతాటిపైకి వచ్చి తక్షణ దిద్దుబాటు కోసం ఒక మార్గాన్ని అన్వేషించడమే ఇప్పుడున్న ఏకైక పరిష్కారం.సైన్యం లక్ష్యంగా దాడిమణిపుర్లో ఇటీవల జరిగిన మూడు సంఘటనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏప్రిల్ 24న కాంగ్పోక్పి జిల్లాలోని జాతీయ రహదారి–2పై ఉన్న వంతెన మీద దుండగులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ వంతెన ఇంఫాల్‌ను నాగాలాండ్‌లోని దిమాపూర్‌తో కలుపుతుంది. ఈ రహదారి రాష్ట్రానికి ప్రధాన జీవనాధారం. రాష్ట్రం నిలువునా చీలిపోయిన కారణంగా మణిపుర్ ప్రజలకు అవసరమైన సామగ్రిని తీసుకువెళ్లే 100కు పైగా ట్రక్కులు అక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది.ఏప్రిల్ 27న బిష్ణుపూర్ జిల్లాలోని నారాన్సీనా వద్ద జరిగిన దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు విడిది చేసి ఉన్న ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోనే ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంపు (ఐఆర్బీ) ఉంది. ఐఆర్బీలో సిబ్బంది ప్రధానంగా మైతేయి కమ్యూనిటీకి చెందినవారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది తమ శిబిరాన్ని ఖాళీ చేసే పనిలో ఉన్నారనీ, అక్కడ ఒక ప్లాటూన్ మాత్రమే మిగిలి ఉందనీ తెలియవచ్చింది.దాడి చేసినవారు ఐఆర్‌బీలోని మైతేయి సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని భావించే అవకాశం ఉంది; రాత్రిపూట దాడి జరిగినందున, వారు సీఆర్పీఎఫ్ శిబిరాన్ని ఐఆర్బీ అని పొరపడి ఉండొచ్చు.అయితే, ఆ దాడి లక్ష్యం సీఆర్పీఎఫ్ కూడా అయి ఉండవచ్చు – 1990ల మధ్యకాలంలో, అస్సాంలోని హిందీ మాట్లాడే ప్రజలను యథేచ్ఛగా హతమార్చడానికి ప్రయత్నించిన తిరుగుబాటు బృందం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా) కార్యాచరణను ఇది తలపింపజేస్తోంది. అప్పట్లో ఉల్ఫా కేంద్రప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి గట్టిగా ప్రయత్నించింది. అందులో విజయవంతం అయింది కూడా. ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుండి కొంతమంది ఎంపీలు హిందీ మాట్లాడే తమ సోదరులకు సహాయం చేయడానికి వెంటనే అస్సాంలో దిగారు. బయటి వ్యక్తులు తమ రాష్ట్రంలో దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించే ఒక వర్గం అస్సామీ జనాభాలో ఉండేది. అది ఇప్పటికీ అలాగే ఉంది.నారాన్సీనా ఘటనకు సంబంధించి, మణిçపుర్లో అరాచకం ఎంత తీవ్రస్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి. కాకపోతే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాలను వీరు గతంలో లక్ష్యంగా చేసుకోలేదని గమనించడం ముఖ్యం.ఒకే తాటిపైకి వస్తేనే...వంతెనపై ఐఈడీ పేలుడు, సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి సంబంధించిన అనుమానపు చూపు ప్రధానంగా కుకీ మిలిటెంట్ల వైపు మళ్లింది. అయితే, అది చేసింది ఎవరైనా కావచ్చు. 2023 మే 3 నుండి నియంత్రణ లేకుండా ఉన్న రాష్ట్రంలో, దాదాపు ప్రతి సమూహం సైనికీకరించబడింది.మూడో విషయం రాజకీయ అండదండలతో కొనసాగుతున్న అరాచకానికి సంబంధించినది. అక్రమ ఆయుధాలతో ఉన్న అరామ్బాయీ తెంగోల్ సభ్యులను పట్టుకున్న తర్వాత, సైన్యానికి చెందిన కాస్పిర్ వాహనాన్ని మీరా పైబీలు(మహిళా బృందాలు) అడ్డగించారు. వందలాది మంది మీరా పైబీలు కాస్పిర్ను చుట్టుముట్టి సైనికులను దూషించారు. ఆ సమయంలో గనక సైనిక సిబ్బంది సంయమనం కోల్పోయి ఉంటే రక్తపాతం జరిగి ఉండేది.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాం శాంతి యుగానికి నాంది పలికింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్‌లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ఇది రంగాపహాడ్(నాగాలాండ్) కేంద్రంగా పనిచేసే 3 కోర్కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మొత్తం నాయకత్వం కింద ఉండాలి. సహజంగానే సంప్రదింపుల తర్వాతే ఒక స్పష్టమైన స్వరం... శాంతి, సాధారణ స్థితికి రావడానికి కావాల్సిన వ్యూహాలు, మార్గాలు, సాధనాలపై దృష్టి పెట్టాలి. మణిçపుర్ విభజితమై ఉంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం దాదాపుగా పనిచేయడం లేదు. ఎటువంటి ఎదురూ లేని రాడికల్ మిలీషియా సంస్థకు పోలీస్ విభాగం తన బాధ్యతను వదిలేసుకుంది. కొంతమంది పోలీసులను ఆయుధాలు వదిలి వేయమని బలవంతం చేస్తూ అరామ్బాయీ తెంగోల్ ఒక డీఎస్పీని తీసుకెళ్లింది. ఇలాంటి తరుణంలో పోలీసులకు నాయకత్వం అవసరం. దురదృష్టవశాత్తు, అది పోలీసు శాఖ లోపల నుండి ఉద్భవించదు. దానిపై అధికారాన్ని 3 కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వంటి బలమైన సంస్థాగత మద్దతుతో కూడిన దృఢమైన నాయకుడికి అప్పగించాలి. అస్సాం రైఫిల్స్ అద్భుతంగా పని చేస్తోంది. కానీ అది పక్షపాత దృష్టితో ఉందని అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారు. మణిçపుర్ లోయ నివాసితులు దానిని తొలగించాలని కోరారు. మణిçపుర్లోని అనేక ప్రాంతాల నుండి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం తొలగించబడింది. దాంతో రాష్ట్రంలో ప్రభుత్వేతర శక్తులు చేస్తున్న చర్యలను ఎవరైనా చూడవచ్చు. అస్సాం రైఫిల్స్ ఇప్పటికే 3 కోర్ కార్యాచరణ కమాండ్ కింద ఉంది. కానీ దీనిని ఏకీకృత కమాండ్ వ్యవస్థ(యూసీఎస్)లో భాగం చేస్తే... ఆర్మీ, మణిపుర్ పోలీస్, కేంద్ర పారామిలిటరీ బలగాలతో దాని కార్యాచరణ కదలికలను క్రమాంకనం చేయడానికి అది వీలు కల్పిస్తుంది. అంతేగాక, యూసీఎస్ లోని ఇతర అంతిమ వినియోగదారులకు అనుగుణంగా పటిష్ఠమైన నిఘా వీలవుతుంది.అన్నీ కలగలిసే...మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్లకు పరస్పరం ముడిపడి ఉన్న సమస్యలే దీనికి కారణం. ఉదాహరణకు, ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ జోన్లను ఏర్పర్చిన తర్వాత, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్– ఇసాక్– ముయివా (ఎన్ఎస్సీఎన్–ఐఎమ్) సహాయంతో లోయ–ఆధారిత తిరుగుబాటు గ్రూపులు మణిçపుర్లోకి ప్రవేశించే సమస్యనుంచి ఎవరూ తప్పించుకోలేరు. అలాగే, ‘ఈస్టర్న్ నాగా నేషనల్ గవర్నమెంట్’ నుండి ఎన్ఎస్సీఎన్–ఐఎమ్కు లభిస్తున్న మద్దతు వెలుగులోనే, దక్షిణ అరుణాచల్‌లోని తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలలో జరిగే కుతంత్రాలను చూడాలి.భారత రాజ్యం, దాని సైన్యం చాలా శక్తిమంతమైనవి. అవి ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలవు. ఈ క్లిష్ట సమయంలో న్యూఢిల్లీ తీసుకోవాల్సిన ఏకైక చర్య తన బలగాలను బలోపేతం చేయడమే. అసాధ్యమైన వాటిని సాధించగల సామర్థ్యం సైన్యానికి ఉంది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిçపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.- వ్యాసకర్త భద్రత – తీవ్రవాద వ్యవహారాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- జైదీప్ సైకియా -
ఆ ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్.. కారణమిదే?
నాగాలాండ్‌లోని ఆరు తూర్పు జిల్లాల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద సిబ్బంది తొమ్మిది గంటల పాటు వేచి ఉన్నప్పటికీ ఒక్క ఓటరు కూడా ఓటు వేయలేదు. ‘ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ’ (ఎఫ్ఎన్టీ) బంద్ పిలుపుతో ఈ ప్రాంతంలోని నాలుగు లక్షల మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్‌పీఓ)ఎఫ్ఎన్టీ డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేదని ముఖ్యమంత్రి నీఫియు రియో వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతానికి స్వయంప్రతిపత్త అధికారాలను సిఫారసు చేశారన్నారు. కాగా 20 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన ప్రాంతంలోని 738 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సిబ్బంది ఉన్నారని నాగాలాండ్ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవ లోరింగ్ తెలిపారు. అయినప్పటికీ ఓటు వేసేందుకు ఎవరూ రాలేదని సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. నాగాలాండ్‌లోని 13.25 లక్షల మంది ఓటర్లలో తూర్పు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో 4,00,632 మంది ఓటర్లు ఉన్నారు. కాగా తౌఫెమాలో ఓటు వేసిన అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఎఫ్‌ఎన్‌టీకి సంబంధించిన ‘డ్రాఫ్ట్ వర్కింగ్ పేపర్’ను కేంద్ర హోంమంత్రికి అందజేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి విషయంలో ఈ ప్రాంతాన్ని విస్మరించాయని ఆరోపిస్తూ ఈఎన్‌పీవో ఆరు జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తోంది. నాగాలాండ్‌లో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఈఎన్‌పీవో గురువారం సాయంత్రం 6 గంటల నుండి రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో నిరవధిక బంద్‌ను ప్రకటించింది. -
నాగాలాండ్: ఆరు జిల్లాల్లో జీరో పోలింగ్
కోహిమా: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నాగాలాండ్‌లో అరుదైన రికార్డు నమోదైంది. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎంపీ సీటుకు శుక్రవారం(ఏప్రిల్19) పోలింగ్ జరిగింది. అయితే ఈ పోలింగ్‌కు ఆరు జిల్లాల ప్రజలు దూరంగా ఉన్నారు. ఈ ఆరు జిల్లాల్లో ఉన్న నాలుగు లక్షల ఓటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఒంటి గంటవరకు ఓటు వేయడానికి రాకపోవడం గమనార్హం. ఆరు జిల్లాలు కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్‌ను పరిష్కరించనందున ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ద ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్‌పీవో) పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఆరు జిల్లాల్లో ఈఎన్‌పీవో పబ్లిక్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆరు జిల్లాలతో కలిపి ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ(ఎఫ్ఎన్టీ) ఏర్పాటు చేయాలని ఈఎన్‌పీవో పోరాడుతోంది. మొత్తం ఆరు గిరిజన సంఘాలు కలిసి ఈఎన్‌పీవోను ఏర్పాటు చేశాయి. ఇదీ చదవండి.. కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ -
నాగాలాండ్‌లో ఎన్నికల బహిష్కరణ? ఈఎన్‌పీవో నిర్ణయం?
లోక్‌సభ ఎన్నికలను నాగాలాండ్‌లోని ఒక వర్గం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్‌పీవో) రాష్ట్రంలోని ఆరు జిల్లాలను కలిపి ప్రత్యేక పరిపాలన కేంద్రం లేదా రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూవస్తోంది. వీటిని నెరవేర్చని పక్షంలో రాష్ట్రంలోని ఏకైక లోక్‌సభ స్థానానికి జరిగే ఎన్నికల్లో పాల్గొనబోమని తేల్చిచెప్పింది. ఈఎన్పీవోతో పాటు అపెక్స్ నాగా బాడీ, ఆరు జిల్లాల్లోని దాని అనుబంధ సంస్థలు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ గత సంవత్సరం (ఫిబ్రవరి 27) అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. అయితే ఆ తరువాత ఈ విషయమై ప్రభుత్వం నుంచి హామీ వచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాదారు ఏకే మిశ్రా అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం కమిటీ సభ్యులు నాగాలాండ్‌ను అనేకసార్లు సందర్శించి, అక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించారు. మరోవైపు నాగాలాండ్‌లోని తూర్పు ప్రాంత ప్రజలకు స్వయంప్రతిపత్తి ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసిందని నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో ఇటీవల తెలిపారు. కాగా ఇఎన్పీవో ఇప్పటికే పబ్లిక్ ఎమర్జెన్సీని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఏ పార్టీకి అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పింది. -
డాన్స్‌తో ట్రాఫిక్ కంట్రోల్.. వీడియో వైరల్!
మనిషన్నాక ఏదోఒక అభిరుచి ఉంటుంది. కొందరికి సింగర్ కావాలని, మరికొందరికి యాక్టర్ కావాలనివుంటుంది. అలాగే రచయిత కావాలని, క్రీడాకారులు కావాలని కూడా కొందరు కోరుకుంటారు. అయితే కొంతమంది తమ అభిరుచిని వదిలి వేరే పని చేయాల్సి వస్తుంది. అలాంటివారు వారి అభిరుచిని వదులుకోలేరు. ఒక ట్రాఫిక్ పోలీస్ విషయంలో ఇదే కనిపించింది. అతనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించడాన్ని గమనించవచ్చు. అయితే అతను డ్యాన్స్ చేస్తూ, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడాన్ని చూడవచ్చు. ఒకసారి మూన్‌వాక్‌తో, మరోమారు స్టెప్పులు వేస్తూ.. వాహనాలకు సిగ్నల్ ఇస్తూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను నాగాలాండ్ ప్రభుత్వ పర్యాటక, ఉన్నత విద్యా శాఖ మంత్రి టెమ్జిన్ ఇమ్నా అలోంగ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 51 వేల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. వీడియోను చూసిన ఒక యూజర్ కామెంట్ బాక్స్‌లో.. ‘మా సింగం సార్.. ఇండోర్ నుండి వచ్చారు. నేను ఆయనను చూసేందుకు హైకోర్టు స్క్వేర్‌కి వెళ్తుంటాను’ అని రాశారు. మరొక యూజర్ ‘సూపర్’అని రాశారు. अपने Moves दिखाने के लिए सही Platform का इंतजार मत करो, Platform को सही खुद बना लो! 😉 pic.twitter.com/5WE4plySsH — Temjen Imna Along (@AlongImna) February 27, 2024 -
Hyd: 7 వికెట్లతో చెలరేగిన బౌలర్.. మనోళ్లదే ఆధిపత్యం
Ranji Trophy- Hyderabad vs Nagaland, Plate 1st Semi Final: రంజీ ట్రోఫీ- 2024 ప్లేట్ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో హైదరాబాద్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. నాగాలాండ్‌తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. తన్మయ్, తిలక్ సెంచరీలు ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (192 బంతుల్లో 164; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ తిలక్ వర్మ (135 బంతుల్లో 101; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. రోహిత్ రాయుడు (59; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. తన్మయ్, రోహిత్ రాయుడు రెండో వికెట్‌కు 143 పరుగులు... తన్మయ్, తిలక్ మూడో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. 462 డిక్లేర్డ్ ఇక రాహుల్ సింగ్ (5), రవితేజ (15) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కె.నితీశ్ రెడ్డి 26, ప్రజ్ఞయ్ రెడ్డి 47 పరుగులు సాధించగా.. తనయ్ త్యాగరాజన్ 22 రన్స్ స్కోరు చేశాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో భాగంగా మొత్తంగా 107 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత 8 వికెట్ల నష్టానికి 462 పరుగుల హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. సాకేత్ 3, కార్తికేయ 12 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో శనివారం బ్యాటింగ్ మొదలుపెట్టిన నాగాలాండ్‌కు హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపించారు. 60.1 ఓవర్లలోనే నాగాలాండ్ ఆట కట్టించారు. తనయ్ త్యాగరాజన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. రవితేజ రెండు, సాకేత్ ఒక వికెట్ దక్కించుకున్నారు. 206 పరుగులకే ఆలౌట్ చేసి.. ఫాలో ఆన్ నాగాలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ జోషువా ఒజ్కుమ్ అర్ధ శతకం(50)తో రాణించగా.. కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ 41, జగనాథ్ సినివాస్ 44, సుమిత్ కుమార్ 38 పరుగులు చేశారు. మిగతావాళ్లలో ఒక్కరు కూడా కనీసం 12 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు. ఈ క్రమంలో 206 పరుగులకే నాగాలాండ్ ఆలౌట్ కాగా.. హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో నాగాలాండ్‌ను ఫాలో ఆన్ ఆడించేందుకు హైదరాబాద్ మొగ్గు చూపింది. ఫలితంగా మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన నాగాలాండ్ శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిస్తే హైదరాబాద్ జట్టు మళ్లీ ఎలైట్ డివిజన్‌కు అర్హత సాధిస్తుంది. చదవండి: Ind vs Eng: గాయమా? నో ఛాన్స్.. అందుకే అయ్యర్‌పై వేటు! ఇప్పట్లో నో ఎంట్రీ -
Plate 1st Semi Final: తిలక్ వర్మ మెరుపు సెంచరీ
Ranji Trophy 2023-24- Hyderabad vs Nagaland, Plate 1st Semi Final: టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ రంజీ ట్రోఫీ-2024లో జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే రెండు శతకాలు బాదిన అతడు.. తాజాగా మరో సెంచరీ చేశాడు. ప్లేట్ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో భాగంగా నాగాలాండ్‌తో మ్యాచ్‌లో.. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ 101 పరుగులతో సత్తా చాటాడు. శతక్కొట్టిన తన్మయ్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం(164) బాదగా.. మరో ఓపెనర్ గహ్లోత్ రాహుల్ సింగ్(5) విఫలమయ్యాడు. తిలక్ వర్మ మెరుపు సెంచరీ వన్‌డౌన్ బ్యాటర్ రోహిత్ రాయుడు 59 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 135 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 101 రన్స్ చేశాడు. మిగతావాళ్లలో తెలుకపల్లి రవితేజ 15 పరుగులకే పెవిలియన్ చేరగా.. కె.నితీశ్ రెడ్డి, వికెట్ కీపర్ ప్రజ్ఞయ్ రెడ్డి క్రీజులో ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 90 ఓవర్లలో హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యే సరికి నితీశ్ రెడ్డి 21, ప్రజ్ఞయ్ రెడ్డి 12 పరుగులతో ఆడుతున్నారు. ఇక నాగాలాండ్ బౌలర్లలో కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ రెండు, తహ్మీద్ రహ్మాన్, ఖ్రివిస్టో కెన్స్, ఇమ్లీవతి లెమ్య్టూర్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలైట్ గ్రూపులో అడుగుపెట్టాలని హైదరాబాద్ పట్టుదలగా ఉంది. చదవండి: Ranji Trophy: రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం -
Rahul Gandi: హాజరవడం కష్టమే
చిఫొబొజౌ(నాగాలాండ్): అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ క్రతువు ఎన్నికల రంగులద్దుకుని ‘నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్–బీజేపీ’ ఫంక్షన్‌గా ముస్తాబవుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం నాగాలాండ్‌లోకి అడుగుపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర మంగళవారం సైతం వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారుల నడుమ కొనసాగింది. యాత్రను ముందుండి నడిపిస్తున్న రాహుల్ గాంధీ మంగళవారం రాష్ట్ర రాజధాని కోహిమాలో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అందిన ఆహా్వనాన్ని తమ పార్టీ అగ్రనేతలు సున్నితంగా తిరస్కరించడాన్ని ఆయన గట్టిగా సమరి్థంచారు. ‘‘ మందిరం ప్రారం¿ోత్సవానికి కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పారీ్టల నేతలు ఎవరు వెళ్లినా నేను మనసారా స్వాగతిస్తా. కానీ ఇప్పుడు ఆ కార్యక్రమం మొత్తం మోదీ, ఆర్ఎస్ఎస్ కేంద్రంగా తయారైంది. చక్కని వేడుకను ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజకీయ వేడుకగా మార్చేశాయి. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లొద్దని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా గాం«దీ భావించి ఉంటారు. కాంగ్రెస్ పారీ్టకి అన్ని మతాలు, సంప్రదాయాలు సమానమే. 22న అయోధ్య జరిగే కార్యక్రమం.. రాజకీయ ఉత్సవంలా మారిందని స్వయంగా కొందరు హిందూ మత పెద్దలే బహిరంగంగా విమర్శించారు. ఇలా కొత్తరూపును సంతరించుకున్న ఈ కార్యక్రమానికి మేం వెళ్లడం కష్టం. అసాధ్యం కూడా’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘ఇండియా కూటమి బలంగా ఉంది, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పారీ్టతో సీట్ల పంపకం విషయంలో నెలకొన్న విభేదాలు సమసి పోతాయి’’ అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. -
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత, వయినాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ కొనసాగుతోంది. నాగాలాండ్ రాజధాని కోహిమాలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. అయోధ్యలో జనవరి 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ కార్యక్రమమని దుయ్యబట్టారు. బీజేపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), బీజేపీ జనవరి 22న జరిపే రామ మందిర ప్రారంభోత్సం పూర్తిగా నరేంద్ర మోదీ రాజకీయ కార్యక్రమమని మండిపడ్డారు. ఇది ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కాబట్టి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రామ మందిర కార్యక్రమానికి హాజరు కావటం లేదని ప్రకటించినట్లు గుర్తుచేశారు. తమకు అన్ని మతాలపై విశ్వాసం ఉందని, అన్ని మతాలను అంతే సమానంగా ఆచరిస్తామని పేర్కొన్నారు. హిందు మతాన్ని పాటిస్తూ ఉన్నత స్థానంలో మతాచార్యులు సైతం రామ మందిర ప్రారంభ ఉత్సవాన్ని ఒక రాజకీయ కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ పనిగట్టుకొని రాజకీయం కోసమే రామ మందిర ప్రారంభోత్సవం నిర్వహించటం సరికాదన్నారు. అటువంటి రాజకీయ ప్రారంభోత్సవానికి హాజరుకావద్దని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చదవండి: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా షర్మిల.. నియమించిన కాంగ్రెస్ హైకమాండ్ -
హైదరాబాద్ ఘన విజయం
దీమాపూర్: రంజీ ట్రోఫీ సీజన్‌ను హైదరాబాద్ భారీ విజయంతో మొదలు పెట్టింది. ‘ప్లేట్’ గ్రూప్‌లో రెండో రోజే ముగిసిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్, 194 పరుగుల తేడాతో నాగాలాండ్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 35/1తో ఆట కొనసాగించిన నాగాలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే ఆలౌటైంది. ఆర్ఎస్ జగన్నాథ్ శ్రీనివాస్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ (5/43) ఐదు వికెట్లతో చెలరేగగా...సీవీ మిలింద్, కార్తీకేయ చెరో 2 వికెట్లు తీశారు. దాంతో హైదరాబాద్‌కు 321 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం ‘ఫాలో ఆన్’లో రెండో ఇన్నింగ్స్ ఆడిన నాగాలాండ్ మళ్లీ పేలవ బ్యాటింగ్‌లో 127 పరుగులకే కుప్పకూలింది. సుమిత్ కుమార్ (62) అర్ధ సెంచరీ సాధించాడు. సీవీ మిలింద్ 4 వికెట్లు పడగొట్టగా, తనయ్ త్యాగరాజన్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆంధ్ర 119/3 విశాఖ స్పోర్ట్స్: బెంగాల్‌తో జరుగుతున్న ‘ఎలైట్’ డివిజన్ రంజీ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ప్రశాంత్ కుమార్ (41), సీఆర్ జ్ఞానేశ్వర్ (33), షేక్ రషీద్ (32) వెనుదిరగ్గా...కెప్టెన్ హనుమ విహారి (6 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 289/4తో ఆట కొనసాగించిన బెంగాల్ 409 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ పొరేల్ (70) హాఫ్ సెంచరీ చేయగా, లలిత్ మోహన్‌కు 4 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఆంధ్ర మరో 290 పరుగులు వెనుకబడి ఉంది. -
తిలక్ వర్మ కెప్టెన్సీ అదుర్స్.. టెస్టుల్లో అరంగేట్రానికి ‘సై’!
Ranji Trophy 2023-24- Hyderabad Vs Nagaland: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌ను హైదరాబాద్ ఘన విజయంతో ఆరంభించింది. నాగాలాండ్‌ను ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో మట్టికరిపించి జయభేరి మోగించింది. కాగా ఈసారి రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ‘ప్లేట్’ డివిజన్లో పోటీపడుతోంది . ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ తిలక్ వర్మ వ్యవహరిస్తున్నాడు. తొలిరోజే పరుగుల వరద.. రాహుల్ డబుల్ ధమాకా ఈ క్రమంలో దీమాపూర్ వేదికగా నాగాలాండ్ జట్టుతో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. తొలిరోజే పరుగుల వరద పారించింది. ఆతిథ్య నాగాలాండ్ బౌలర్ల భరతం పట్టిన హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ సింగ్ గహ్లోత్ ద్విశతకం(214)తో అదరగొట్టాడు. తిలక్ వర్మ అజేయ సెంచరీ తిలక్ వర్మ అజేయ శతకం (112 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) నమోదు చేయగా... తన్మయ్ అగర్వాల్ (80; 12 ఫోర్లు) కూడా రాణించాడు. ఈ క్రమంలో 76.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 474 పరుగుల వద్ద హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆట ముగిసే సమయానికి నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 35 పరుగులు సాధించింది. ఇక 35/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన నాగాలాండ్ 51.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ కాగా.. హైదరాబాద్ ఫాలో ఆన్ ఆడించింది. చిత్తుగా ఓడిన నాగాలాండ్ అయితే, ప్రత్యర్థి జట్టు బౌలర్ల ధాటికి తాళలేక రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే చేతులెత్తేశారు నాగాలాండ్ బ్యాటర్లు. దీంతో ఇన్నింగ్స్ మీద 194 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం సాధించింది. రెండ్రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్ ముగిసిపోయింది. ఇక నాగాలాండ్‌తో మ్యాచ్‌లో తిలక్ వర్మ సేనలోని బౌలర్లలో టి.త్యాగరాజన్ అత్యధికంగా ఎనిమిది వికెట్లు పడగొట్టగా.. చామా మిలింద్కు ఆరు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో తెలుకపల్లి రవితేజ రెండు, కార్తికేయ మూడు, రోహిత్ రాయుడు ఒక వికెట్ పడగొట్టారు. కాగా తిలక్ కెప్టెన్సీలో హైదరాబాద్ వరుస విజయాలు సాధించాలని.. బ్యాటర్‌గానూ రాణించి అతడు టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, వన్డేలలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చరిత్ర సృష్టించిన రాహుల్ సింగ్ గతంలో సర్వీసెస్ జట్టుకు ఆడిన రాహుల్ సింగ్ గహ్లోత్ 157 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్స్‌లతో 214 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, ఈసారి హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు 143 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాహుల్ గుర్తింపు పొందాడు. చదవండి: BCCI: ఇంగ్లండ్‌తో తలపడే భారత్-‘ఏ’ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే -
సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ.. ధనాధన్ ఇన్నింగ్స్
Ranji Trophy 2023-24 Hyd Vs NGL: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ దుమ్ములేపాడు. నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 112 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా దేశవాళీ టెస్టు ఫార్మాట్ టోర్నీ రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ శుక్రవారం ఆరంభమైంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో నాగాలాండ్ జట్టుతో తలపడుతోంది. దిమాపూర్ వేదికగా మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య నాగాలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలో షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ రాయుడు 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే, అతడి స్థానంలో వన్‌డౌన్‌లో దిగిన గహ్లోత్ రాహుల్ సింగ్, మరో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(80)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. టీ20 తరహా బ్యాటింగ్ చేస్తూ 157 బంతుల్లో 136కు పైగా స్ట్రైక్‌రేటుతో ఏకంగా 214 పరుగులు సాధించాడు. రాహుల్ సింగ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 23 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ.. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా తెలుకపల్లి రవితేజ 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి హైదరాబాద్ 76.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 474 పరుగులు చేసింది. నాగాలాండ్ బౌలర్లలో కరుణ్ తెవాటియా, నగాహో చిషి, ఇమ్లివటి లెమ్టూర్, క్రెవిస్టో కెన్సె, కెప్టెన్ రొంగ్సెన్ జొనాథన్ ఒక్కో వికెట్ తీశారు. -
అంతర్జాతీయ తెలుగు మహా సభలకు విచ్చేయన్ను నాగలాండ్ గవర్నర్
రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ , చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంధ్రమేవ జయతే! అన్న నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా తేదీలు5,6,7 జనవరి 2024 శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలకు నాగాలాండ్ గవర్నర్ శ్రీ లా గణేషన్ విచ్చేయనున్నారని పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ చైతన్య రాజులు తెలిపారు. 7 జనవరి 2024 మధ్యాహ్నం 2 గంటలకు జరిగే "ఆంధ్రమేవ జయతే " సభలో వారు ముఖ్య అతిధిగా పాల్గొంటారు. అంధ్ర వాఙ్మయ వైజయంతి ప్రత్యేక సంచికను ఆవిష్కరించి, సౌజన్యం అందించిన వదాన్యులను సత్కరిస్తారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -డా.గజల్ శ్రీనివాస్,అధ్యక్షులు,9849013697 -
సార్.. ప్రేమలో పడ్డా కాస్త డబ్బు సర్దండి!
కోహిమా: రాజకీయ నాయకులకు తరచూ ఉద్యోగం, ఉపాధి, డబ్బు సాయం కావా లంటూ విజ్ఞాపనలు అందుతుండటం సహజంగా జరిగేదే. కానీ, ఓ యువకుడు మాత్రం తన కలల రాణితో ప్రేమ వ్యవ హారం సాగించేందుకు డబ్బు సర్దాలంటూ ప్రాధేయ పడ్డాడు. ఈ విడ్డూరం నాగాలాండ్‌లో చోటుచేసుకుంది. బీజేపీ నాగాలాండ్ అధ్యక్షుడు టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ తనకు ఎదురైన అరుదైన అనుభవాన్ని స్వయంగా ‘ఎక్స్’లో వివరించారు. ఆయనకు అరవింద పాండా అనే ఓ యువకుడు పంపిన మెయిల్లో ఇలా ఉంది.. ‘సర్, ఈ నెల 31వ తేదీన నా గర్ల్‌ఫ్రెండ్‌తో మొద టిసారిగా డేటింగ్‌కు వెళ్తున్నాను. కానీ, ఇప్పటి వరకు నాకు ఉద్యోగం రాలేదు. దయవుంచి కొద్దిగా సాయం చేయండి. ఏదో ఒకటి చేయండి సార్’అని అందులో ఉంది. అందుకాయన, ‘ఎలాంటి సాయం కావాలో చెప్పండి’అంటూ బదులి చ్చారు. ‘ఎక్స్’లో అలోంగ్ పోస్టుకు నెటిజన్లు తమాషా వ్యాఖ్యలతో స్పందించారు. యువకు డితోపాటు డేటింగ్‌కు వెళ్లాలంటూ అలోంగ్‌కు ఒకరు సూచించగా, అతడికి డబ్బు సాయం చేయాలని మరొకరు కోరారు. లవర్ బోయ్ అరవింద పాండాకు ఎమ్మెల్యేగా అవకాశమి వ్వాలని, అతడికి ఉద్యోగమి వ్వాలని.. ఇలా రకరకాల సూచ నలు చేశారు. తల్లిదండ్రులు ఎంపిక చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మరొకరు ఆ యువకుడికి తెలిపారు. ఆ యు వకుడు జీవితంలో కఠినమైన పాఠా లను నేర్చు కోవాల్సిన అవసరం ఉన్నందున ఆ వినతిని పట్టించుకోవద్దని కొందరు పేర్కొన్నారు. -
ఇండియా ఫస్ట్ సన్‌రైజ్.. నాగాలాండ్ మంత్రి వీడియో వైరల్..
కోహిమా: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్.. ఏదో ఒక కొత్త విషయంతో అభిమానుల ముందుకు వస్తుంటారు. కామెడీ, సందేశాత్మక, నాలెడ్జ్‌కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా భారత దేశంలో సూర్యోదయం మొదట అయ్యే దృగ్విషయాన్ని వీడియో రూపంలో పోస్టు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని డాంగ్ వ్యాలీని టెమ్జెన్ షేర్ చేశారు. అప్పుడే వెలుతురు వస్తుండగా.. అందమైన లోయ ప్రాంతాలు మనోహరంగా కనిపించాయి. మేఘాలు తాకుతున్న పర్వత శిఖరాల మధ్య నది పరవళ్లు, పచ్చని లోయ ప్రాంతాల్లో విహారాన్ని గుర్తు చేశారు. ఈశాన్య భారతం అందాలు సింపుల్‌గా ఒక్క వీడియోలో చూపించారు. గూగుల్ చేసి చూడండి అని ట్యాగ్‌ను జతచేసి వీడియోను పోస్టు చేశారు. భారత్‌లో మొదట సూర్యోదయం అయ్యే ప్రదేశంగా డాంగ్ లోయను చెప్పుకుంటారు. Google Kar Ke to Dekho 🤨 pic.twitter.com/FJYzzK9jYC — Temjen Imna Along (@AlongImna) September 13, 2023 ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. నెటిజన్లు కామెంట్లతో నింపేశారు. ప్రస్తుతం ఈశాన్య భారతం ట్రిప్‌లోనే ఉన్నా.. చాలా అందమైన ప్రదేశం అని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా తప్పకుండా చూడాలని మరో యూజర్ స్పందించారు. దేశంలో సూర్యుడు మొదట ముద్దాడే డాంగ్ లోయను మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: పార్క్‌లో సరదాగా.. -
Women : ఆడబిడ్డల ఆంధ్రా!
సాక్షి, అమరావతి: దేశంలో, రాష్ట్రంలో జననాల్లో బాలికల సంఖ్య పెరుగుతోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 2022–23లో బాలికల నిష్పత్తి 15కు పెరగ్గా, రాష్ట్రంలో 24కు పెరిగింది. దేశం మొత్తంతోపాటు చాలా రాష్ట్రాల్లో గతంలో కన్నా జననాల్లో బాలికల నిష్పత్తి పెరుగుతోందని, ఇది శుభపరిణామమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే బిహార్‌తో పాటు మిజోరాం, నాగాలాండ్‌లలో గతం కన్నా బాలికల నిష్పత్తి తగ్గడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. బేటీ బచావో బేటీ పఢావో పథకం ద్వారా బాలికలు, మహిళా సాధికారతకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం కింద జనన సమయంలో లింగ నిర్ధారణను గుర్తించే చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేసిందని, ఆడపిల్లల జననాల పట్ల అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టిందని తెలిపింది. ఆడపిల్లల అభివృద్ధికి ప్రోత్సాహం ఆడపిల్లల విద్య, పెరుగుదల, అభివృద్ధి, హక్కులకు మద్దతుగా సానుకూల చర్యలను ప్రోత్సహించడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకాలతో కూడిన కార్యాచరణ క్యాలెండర్ జారీ అయినట్లు తెలిపింది. దానిని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. లింగ నిష్పత్తి తగ్గకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు తెలిపింది. -
బిగ్ బ్రో.. హే చోటా బ్రో.. ఆనంద్ మహీంద్రా, నాగాలాండ్ మంత్రి ఫన్నీ ట్వీట్స్!
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra), నాగాలాండ్ మంత్రి, బీజేపీ నేత టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ (Temjen Imna Along) మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. ఆనంద్ మహీంద్రాను మంత్రి అలోంగ్ బిగ్ బ్రో అని సంబోధించగా.. మంత్రిని ఆనంద్ మహీంద్రా చోటా బ్రో అంటూ సంబోధించారు. నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఇటీవల ఎక్స్ (ట్విటర్)లో మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ వాహన (Mahindra Thar.e) చిత్రాన్ని పోస్ట్ చేస్తూ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆగస్టు 15న మహీంద్రా కంపెనీ ఆవిష్కరించింది. మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అలోంగ్ ప్రశంసిస్తూ ‘బిగ్ బ్రో ఆనంద్ మహీంద్రా.. కొత్త వాహనం నెక్ట్స్ లెవల్లో ఉంది’ అంటూ రాసుకొచ్చారు. వాహనాన్ని రూపొందించిన బృందానికి అభినందనలు తెలియజేశారు. అలోంగ్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా కూడా ప్రతిస్పదించారు. ‘హే చో బ్రో (చోటా బ్రో)’ అంటూ ఆప్యాయంగా సంబోధించారు. మహీంద్రా థార్.ఈ వాహనాన్ని ఉద్దేశిస్తూ ఇది మీ స్థాయికి చేరిందంటూ పేర్కొన్నారు. ఈ వాహనం లాంచ్ అయిన తర్వాత మిమ్మల్ని షికారుకు తీసుకెళ్తుందని అలోంగ్‌కు తెలియజేశారు. Hey Cho Bro (Chota Bro) @AlongImna Aakhir aapke level tak pahunch gaye! When this is launched, will take you for a spin in it… #TharE https://t.co/3eY8a24e9j — anand mahindra (@anandmahindra) August 20, 2023 -
నాడు కుక్క మాంసంపై నిషేధం.. నేడు ఎత్తివేత.. మధ్యలో ఏం జరిగింది?
రాష్ట్రంలో కుక్క మాంసం అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధిస్తూ నాగాలాండ్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను గౌహతి హైకోర్టు ఆమధ్య రద్దు చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2011పై ఈ సందర్భంగా పలు ప్రశ్నలు లేవనెత్తింది. కుక్క మాంసం అమ్మకాల నిషేధం వెనుక.. నాగాలాండ్ ప్రభుత్వం2020, జూలై 4న కుక్క మాంసాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేశారు. కుక్క మాంసం కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు. నోటిఫికేషన్లో తెలిపిన వివరాల ప్రకారం వాణిజ్య, రెస్టారెంట్లు వంటి ప్రదేశాలలో కూడా కుక్క మాంసం అమ్మకాలను నిషేధించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ 2014 సర్క్యులర్‌ను అనుసరించి నాగాలాండ్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్, 2011లో పేర్కొన్న జంతువులు మినగా ఇతర జాతుల జంతువులను వధించడాన్ని నిషేధించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్, 2011లోని రూల్ 2.5.1(a)లోని వివరాల ప్రకారం గొర్రెలు, మేకలు, పందులు,పౌల్ట్రీ, చేపలను ఆహారంగా భావించి, వాటిని వధించేందుకు అనుమతి కల్పించారు. ‘ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ హైకోర్టులో జస్టిస్ మార్లీ వాన్‌కుంగ్ సింగిల్ జడ్జి ధర్మాసనం కేసును విచారిస్తూ ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ- 2011లో కుక్క పేరు చేర్చకపోవడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎందుకంటే ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కుక్క మాంసం కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో దాని పేరును జాబితాలో చేర్చకపోవడం ఊహకు అతీతమేమీ కాదని వివరించింది. కుక్క మాంసం అంటే ఎంతో ఇష్టం నాగా ప్రాంతాల్లో నేటికీ కుక్క మాంసాన్ని ఇష్టంగా తింటున్నారని, ఇది శతాబ్దాలుగా కొనసాగుతోందని హైకోర్టు పేర్కొంది. ది అంగామి నాగాస్, ది ఏఓ నాగాస్ ది రెంగ్మా నాగాస్ తదితర పుస్తకాలు, వివిధ పత్రాలను పరిశీలిస్తే నాగాలాండ్‌లోని వివిధ గిరిజన సమూహాలలో కుక్క మాంసం వినియోగం శతాబ్దాలుగా వస్తున్నదని హైకోర్టు పేర్కొంది. ‘కుక్కలను హింసిస్తున్నారు’ విచారణ సందర్భంగా యానిమల్స్ అండ్ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్/ఇండియా తరఫు న్యాయవాది తన వాదనలో కుక్కలను స్మగ్లింగ్ చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నదన్నారు. కుక్కల కాళ్లకు తాడు కట్టి, దాని నోటికి కూడా తాడు కట్టి గోనె సంచిలో వేస్తారని పేర్కొన్నారు. వీటికి రోజుల తరబడి ఆహారం, నీరు ఇవ్వరని ఆరోపించారు. ఇది జంతువుల పట్ల క్రూరత్వం ప్రదర్శించడం కిందకు వస్తుందన్నారు. అయితే తాము కుక్క మాంసంపై నిషేధం విధించడాన్ని సమర్థించలేదని హైకోర్టు ముందు విన్నవించారు. దీనిపై స్పందించిన కోర్టు జంతువులపై క్రూరత్వానికి సంబంధించిన కేసుల్లో ఐపీసీని ఆశ్రయించవచ్చని తెలిపింది. ఇది కూడా చదవండి: బజరంగ్ దళ్ ఎప్పుడు, ఎలా ఆవిర్భవించింది? కాంగ్రెస్‌తో దీనికి కనెక్షన్ ఏమిటి? -
కేంద్రానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. నాగాలాండ్‌లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంపై సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. కేంద్రానికి చీవాట్లు పెట్టింది. కాగా నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే వీటిని పాటించడం లేదంటూ దాఖలైన ధిక్కార పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. సొంత పార్టీ అధికారంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. అదే రాష్ట్రంలో మీ(బీజేపీ) ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ చర్యలు ఉండవని సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ అనేది నిశ్చయాత్మక చర్య అని, దీని ఆధారంగా మహిళా రిజర్వేషన్ ఉంటుందని కోర్టు పేర్కొంది. రాజ్యాంగ నిబంధనను ఉల్లఘించి ఎలా వ్యవహరిస్తారనేది అర్థం కావడం లేదని జస్టిస్ ఎస్కే కౌల్ అన్నారు. నాగాలాండ్ మహిళల విద్య, ఆర్థిక, సామాజిక స్థితిగతులు అత్యుత్తమంగా ఉన్న రాష్ట్రం అని.. మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేకపోతున్నారనేది అర్థం కావడం లేదని అన్నారు. విచారణ సందర్భంగా బీజేపీ పాలిత మణిపూర్‌లో జరిగిన హింసాకాండను కూడా ఆయన ప్రస్తావించారు. చదవండి: మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు -
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ
ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నాగాలాండ్‌కు చెందిన పార్టీ నేతలంతా అజిత్ పవార్‌కు మద్దతు తెలుపుతున్నాం’ అని ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. . కాగా, జూలై 2న ఎన్సీపీని రెండుగా చీల్చిన అజిత్ పవార్ 30-35 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అందులో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తిరుగుబాటు అనంతరం కూడా అజిత్.. శరద్ పవార్‌తో రెండుసార్లు భేటీ కావడం విశేషం.. తన వర్గం నేతలతో కలిసి ముంబయిలోని శరద్ పవార్ నివాసానికి చేరుకొని, పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై ఆయనతో చర్చించారు. తమ విజ్ఞప్తిని విన్న శరద్ పవార్.. మౌనంగా ఉన్నారే తప్ప ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని రెబల్ ఎమ్మెల్యేలు వెల్లడించారు. చదవండి: మణిపూర్‌లో మహిళల నగ్న ఊరేగింపు.. ఆరోజు జరిగింది ఇదేనా! -
ఇది కదా లక్ అంటే.. గంటలో కోటి!
Nagaland State Lottery: ఏదో అదృష్టం కలిసి వస్తుందని చాలామంది లాటరీలు కొంటారు. మరికొందరైతే ఏళ్ల తరబడి లాటరీ టికెట్లు కొంటూనే ఉంటారు. ఆ బంపర్ఎ ప్రైజ్ తమకు ఎప్పుడు తగులుతుందా అని ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ లాటరీ టిక్కెట్ కొన్న గంటకే కోటి రూపాయలు గెలుచుకోవడం గురించి విన్నారా? పంజాబ్‌లో ఒక వ్యక్తికి ఇలాంటి జాక్‌పాట్ తగిలింది. ఈ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కావడం అతని వంతైంది. వివరాలను పరిశీలిస్తే.. పంజాబ్, గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన రూపీందర్‌జిత్ సింగ్ అగ్రికల్చర్ డెవలెప్మెంట్ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. అందరిలాగారే ఈయన కూడా గత ఏడాది కాలంగా లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు కానీ ఇంత తొందరగా లక్ష్మీ దేవి తన ఇంటికి నడిచి వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!) ఎప్పటిలాగే రూపీందర్‌జిత్ సింగ్ శనివారం మధ్యాహ్నం నాగాల్యాండ్ లాటరీ టిక్కెట్లు రూ.6 పెట్టి 25 టికెట్లను కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆఫీసుకెళ్లి తన పనిలో నిమగ్నమైపోయాడు. ఇంతలో దాదాపు గంట తరువాత లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఏకం రూ. కోటి గెలుచుకున్నట్టు సమాచారం అందించడంతో ఎగిరి గంతేశాడు రూపిందర్. ఇన్నళ్లకి తన కల నెలవేరిందని, ఈ డబ్బును తన పిల్లలు, కుటుంబం భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానన్నారు. అంతేకాదు ఆపదలో ఉన్న పేదలకు కూడా సాయం చేస్తానని చెప్పాడు రూపీందర్ కొండంత సంబరంతో. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?) తన అలవాటే తనను కోటీశ్వరుడిని చేసిందని రూపిందర్జిత్ చెప్పాడు. లాటరీని గెలుచుకున్నందుకు బ్యాంకు సిబ్బంది అభినందించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోన్లు చేశారు. కాగా గతంలో ఇదే ప్రాంతంలో కిరాణా దుకాణం యజమానికి రూ.2.5 కోట్ల లాటరీ బంపర్ ప్రైజ్ వచ్చింది. మరోసారి బంపర్ ప్రైజ్ గెలవడంతో డేరా బాబా నానక్ టౌన్ పేరు మరోసారి మారుమోగింది. ( -
భయంకర దృశ్యాలు.. కొండచరియలు విరిగి కార్లపైకి దూసుకొచ్చి..
నాగాలాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగి రోడ్డుపై పడటంతో ఆ దారిలో వెళ్తున్న రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. చుమౌకెడిమా జిల్లాలోని జాతీయ రహదారి 29పై మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం వెలుగుచూసింది. భారీ వర్షాల కారణంగా దిమాపూర్ నుంచి కోహిమా మధ్యరోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో వాహనాలు నిలిచిపోయాయి. ఇంతలో పక్కనే ఉన్న ఎత్తైన కొండపై నుంచి భారీ బండరాయి రోడ్డు మీదకు దూసుకురావడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో కొహిమా నుంచి వస్తున్న రెండు కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. సంఘటన స్థలంలోనే ఓ వ్యక్తి మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ‘పాకలా పహార్’ అని పిలుస్తారని తెలుస్తోంది. అయితే ఆ ప్రదేశంలో ఎక్కువగా కొండచరియలు విరిగిపడటం, రాళ్లు జారిపడటం తరుచుగా జరుగుతుంటాయి. మరోవైపు ఈ దుర్ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో విచారం వ్యక్తం చేశారు. Un desprendimiento de rocas en Nagaland, India, deja 2 muertos y 3 heridos tras aplastar un coche. 😳😳 pic.twitter.com/3cCqKT0y0k — Momentos Virales (@momentoviral) July 4, 2023 ఈ మేరకు ట్విటర్లో స్పందిస్తూ.. ‘దిమాపూర్, కోహిమా మధ్యనున్న జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం 5 గంటలకు బండరాయి పడిపోవడంతో ఇద్దరు మృతి చెందడంతోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు అత్యవసర సేవలు, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. Oo god😭 #Nagaland pic.twitter.com/uzpnawW3Ej — Tradeholics (@Tradeholics) July 4, 2023 -
నాటు పాట పాడుతున్న నాగలాండ్ రైతులు
-
నాటు పాట మామూలుగా లేదు
-
వాహ్ క్యా పోజ్ హై.. రాహుల్ గాంధీపై బీజేపీ మంత్రి ప్రశంసలు
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ లండన్ టూర్‌పై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కమలం పార్టీ నేత, నాగాలాండ్ మంత్రి తెజ్‌మెన్ ఇమ్నా అలోంగ్ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో నెటిజన్లు అవాక్కయ్యారు. లండన్‌లోని ఛాథం హౌస్‌లో రాహుల్ గాంధీ మాటామంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సూటు ధరించి జేబులో చేతులు పెట్టుకున్న ఫొటోను కాంగ్రెస్ ట్విట్టర్లో షేర్ చేసింది. 'మీరు ఒంటరిగా ఉన్నా సరే.. మీరు నమ్మినదాని కోసమే నిలబడండి' అని రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన తెజ్‌మెన్ .. రాహుల్ ఫొటో చాలా బాగా వచ్చిందని, అందరూ దీన్ని ఒప్పుకోవాల్సిందేని ప్రశంసించారు. అలాగే ఆయన పోజు నెక్స్ట్ లెవల్ అని ఆకాశానికెత్తారు. Stand up for what you believe in, even if it means you stand alone. pic.twitter.com/dV3fG4NfB9 — Congress (@INCIndia) March 6, 2023 ఏంటీ ఈయన రాహుల్‌ను ఇంతలా పొగుడుతున్నారు అని అనుకునేలోపే అసలు ట్విస్ట్ ఇచ్చారు తెజ్మన్. ఈ ఫొటో బాగుంది కానీ, దీని క్యాప్షనే ఒరిజినల్ కాదని సైటర్లు వేశారు. కనీసం క్యాప్షన్ అయినా సొంతంగా రాసుకోవచ్చుగా అని ఎద్దేవా చేశారు. कम से कम Caption तो खुद लिखा करो 🙄 pic.twitter.com/YvHUyfKGZF — Temjen Imna Along (@AlongImna) March 8, 2023 చదవండి: త్రిపుర సీఎంగా డాక్టర్ మాణిక్ సాహా ప్రమాణం -
మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణం
నాగాలాండ్, మేఘాలయా ముఖ్యమంత్రులుగా ఎన్డీపీపీ చెందిన నీఫియా రియో, నేఫనల్ పీపుల్స్ పార్టీకి చెందిన కాన్రాడ్ సంగ్మా మంగళవారం ప్రమాణం చేశారు. మొదటగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కాన్రాడ్ కె సంగ్మా మేఘాలయ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తోపాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. మంగళవారం సంగ్మా తోపాటు ఎన్పీపీకి చెందిన ప్రిస్టోన్ టిన్సాంగ్, స్నియావ్‌భలాంగ్ ధర్లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బీజేపీకి చెందిన అలెగ్జాండర్ లాలూ హెక్, యుడీపీకి చెందిన పాల్ లింగ్డో, కిర్మెన్ షిల్లా, హెచ్ఎస్పీడీపీకి చెందిన షక్లియార్ వార్జ్రీ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ మేరకు నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలలో యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ, హెచ్ఎస్పీడీపీకి నుంచి ఒక్కొక్కరు సంగ్మా మంత్రివర్గంలో సభ్యులుగా గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణం చేయించారు. ఇదేరోజు నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి)కి చెందిన నీఫియు రియో కూడా ప్రమాణ చేశారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నీఫియు ఐదోసారి ప్రమాణం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా టిఆర్ జెలియాంగ్, వై పాటన్ ప్రమాణ స్వీకారం చేయగా, రియో క్యాబినెట్‌లోని ఇతర సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే సోషల్ మీడియాలో కామెడీ చేస్తూ ఫేమస్ అయినా రాష్ట్ర బీజేపీ చీఫ్ టెమ్జెన్ ఇమ్నా అలోంగ్, నానాగాలాండ్ అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికైన ఇద్దరు మహిళల్లో ఒకరైన సల్హౌతుయోనువో క్రూసే మంత్రి మండలి సభ్యులుగా ప్రమాణం చేశారు. హోలీ తర్వాత రోజు గురువారం త్రిపురలో బీజేపీకి చెందిన మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్డీపీపీ, బీజేపీ రెండూ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా 72 ఏళ్ల రియోను ఎన్నుకున్నాయి. అలాగే రాష్ట్రంలోని అన్ని ఇతర పార్టీలు రియో నేతృత్వంలోని కూటమికి తమ మద్దతను ఇచ్చాయి. మేఘాలయాలో ఎన్పీపీ నేతృత్వంలోని కూటమి బీజేపీకి చెందిన ఇద్దరితో సహా మొత్తం 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం కాన్రాడ్ సంగ్మా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. సంగ్మా ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్నారు. ఆయన మంగళవారం ఇతర క్యాబినేట్ మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, సోమవారం కొత్తగా ఎన్నికైన 58 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయగా, ప్రొటెం స్పీకర్ తిమోతి షిరా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగ్మా కూడా హాజరయ్యారు. కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీకి స్పీకర్‌ను మార్చి9న ప్రత్యేక హౌస్‌లో సెషన్లో ఎన్నుకోనున్నట్టు సమాచారం. త్రిపురలో బీజేపీ నాయకుడు మాణిక్ సాహా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారని ఆ పార్టీ ప్రకటించింది. సోమవారం అగర్తలాలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో సాహాను ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భట్టాచారీ తెలిపారు. అంతేగాదు బీజేపీ దాని మిత్ర పక్షాలు త్రిపుర, నాగాలాండ్‌లో అధికారాన్ని నిలుపుకోగా, మేఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. (చదవండి: విమానం ల్యాండింగ్ అవుతుందనంగా.. ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం..) -
సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించి చరిత్ర సృష్టించిన మహిళా ఎమ్మెల్యేలు
కోహిమా: 60 ఏళ్ల నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అధికార ఎన్డీపీపీ టిక్కెట్‌పై పశ్చిమ అంగామీ స్థానం నుంచి హెకాని జకాలు, దిమాపూర్–3 స్థానం నుంచి సల్‌హోటనో క్రుసె విజయం సాధించారు. వారిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించడం విశేషం. నాగాలాండ్‌లో ఎన్డీపీపీ–బీజేపీ హవా నాగాలాండ్‌లో అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి మళ్లీ అధికార పీటం దక్కించుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు దక్కాయి. ఇతర పార్టీ లేవీ రెండంకెల సీట్లు సాధించలేకపోయాయి. ఎన్సీపీ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ(రామ్‌విలాస్ పాశ్వాన్) 2, ఆర్పీఐ(అథవాలే) 2, ఎన్పీఎఫ్ 2 సీట్లలో గెలుపొందాయి. జేడీ(యూ) ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కి ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీ ల అభ్యర్థులకు ఎన్డీపీపీ నేత, సీఎం రియో అభినందనలు తెలిపారు. -
ఈశాన్యంలో కమల వికాసం
అగర్తలా/షిల్లాంగ్/కోహిమా: ‘మిషన్ నార్త్ఈస్ట్’ పేరిట ఈశాన్య రాష్ట్రాల్లో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ కి నూతనోత్తేజం లభించింది. ఈశాన్య భారతంలో కమలం వికసించింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా శాసనసభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. త్రిపురలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ దక్కింది. 60 స్థానాలకు గాను సొంతంగా 32 స్థానాలు గెలుకొని, ఒక్కే ఒక్క స్థానంలో నెగ్గిన మిత్రపక్షం ఐపీఎఫ్టీతో కలిసి వరుసగా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ స్థానాలుండగా, నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి 37 స్థానాల్లో పాగా వేసింది. ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు లభించాయి. రెండు పార్టీలు కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. 60 స్థానాలున్న మేఘాలయాలో ఒంటరిగా పోటీకి దిగి, కేవలం 2 సీట్లే గెలుచుకున్న బీజేపీ కింగ్‌మేకర్‌గా అవతరిస్తుండడం గమనార్హం. 26 సీట్లలో నెగ్గిన అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వంలో బీజేపీ మళ్లీ జూనియర్ భాగస్వామిగా చేరినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. నాగాలాండ్‌లో 5, త్రిపురలో 3 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ మేఘాలయాలో సున్నా చుట్టేసింది. త్రిపురలో కొత్త పార్టీ తిప్రా మోథా ఏకంగా 13 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. త్రివేణికే ఈ మొత్త్తం క్రెడిట్: మోదీ ఎన్నికల్లో బీజేపీ స్థిరంగా విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ పనితీరు పట్ల కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. బీజేపీ గెలుపునకు గాను క్రెడిట్ మొత్తం ‘త్రివేణి’కే ఇవ్వాలన్నారు. బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు, ఆయా ప్రభుత్వాల పని సంస్కృతి, పార్టీ కార్యకర్తల అంకితభావం వల్లే విజయాలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈశాన్య ప్రాంతం ఢిల్లీకి, దిల్(హృదయం)కి ఎక్కువ దూరంలో లేదన్న సంగతి ఈ ఫలితాలను బట్టి తెలుస్తోందన్నారు. త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ కూటమి మళ్లీ అధికారం దక్కించుకోవడం పార్టీ కార్యకర్తలందరికీ గర్వకారణమని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. మర్ జా మోదీ(చనిపో మోదీ) అని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, ప్రజలు మాత్రం మత్ జా మోదీ(వెళ్లొద్దు మోదీ) అని నినదిస్తున్నారని ప్రధాని స్పష్టం చేశారు. ఫలితాలు నిరుత్సాహకరం:కాంగ్రెస్ త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు నిరుత్సాహం కలిగించాయని కాంగ్రెస్ పేర్కొంది. అయితే, ఉప ఎన్నికల్లో మూడు అసెంబ్లీ సీట్లలో సాధించిన విజయం ప్రోత్సాహం నింపిందని తెలిపింది. ఈ ఫలితాలపై సమీక్ష జరిపి, పార్టీ సంస్థాగత బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. త్రిపురలో కాషాయం రెపరెపలు త్రిపురలో బీజేపీ–స్థానిక పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) కూటమి రెండోసారి అధికారం దక్కించుకుంది. మొత్తం 60 సీట్లకు గాను ఎన్నికల్లో 33 సీట్లు గెలుచుకుంది. ప్రద్యోత్ కిశోర్ దేవ్‌వర్మ నేతృత్వంలోని తిప్రా మోథా పార్టీ 13 స్థానాలు గెలుచుకుంది. ఇక వామపక్షాలు–కాంగ్రెస్ కూటమికి 14 స్థానాలు లభించాయి. 28 స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా తెరవలేక చతికిలపడింది. ఆ పార్టీ కి కేవలం 0.88 శాతం ఓట్లు లభించాయి. ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు పడడం గమనార్హం. బీజేపీ, ఐపీఎఫ్‌టీకి 2018తో పోలిస్తే ఈసారి సీట్ల సంఖ్య తగ్గింది. తిప్రా మోథా పార్టీ గణనీయంగా పుంజుకోవడమే ఇందుకు కారణం. ఈసారి 55 స్థానాల్లో పోటీకి దిగిన బీజేపీకి 32 స్థానాలు గెలుచుకుంది. ఐపీఎఫ్‌టీకి కేవలం ఒక స్థానం లభించింది. 47 సీట్లలో పోటీ చేసిన సీపీఎం కేవలం 11 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ, ఆర్ఎస్పీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై 13 మంది పోటీ చేయగా, ముగ్గురు విజయం సాధించారు. టౌన్ బార్దోవాలీ స్థానంలో పోటీ చేసిన మాణిక్ సాహా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఆశి‹Ùకుమార్ సాహాపై 1,257 ఓట్ల తేడాతో గెలుపొందారు. మిస్టర్ క్లీన్‌కే మళ్లీ కిరీటం! త్రిపురలో మిస్టర్ క్లీన్‌గా గుర్తింపు పొందిన సాహా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించారు. దంత వైద్యుడైన సాహా గతంలో కాంగ్రెస్‌లో పనిచేశారు. 2016లో బీజేపీలో చేరారు. 2020లో త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. 2022 ఏప్రిల్ 3 నుంచి జూలై 4 దాకా రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. గత ఏడాది జరిగిన టౌన్ బార్దోవాలీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ విప్లవ్ దేవ్ స్థానంలో ఆయనను సీఎంగా నియమించింది. మాణిక్ సాహా నిజాతీయపరుడిగా, కష్టపడి పనిచేసే నాయకుడిగా ప్రజల మనసులు గెలుచుకున్నారు. నాగాలాండ్‌లో ఎన్డీపీపీ–బీజేపీ హవా నాగాలాండ్‌లో అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి మళ్లీ అధికార పీటం దక్కించుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు దక్కాయి. ఇతర పార్టీ లేవీ రెండంకెల సీట్లు సాధించలేకపోయాయి. ఎన్సీపీ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ(రామ్‌విలాస్ పాశ్వాన్) 2, ఆర్పీఐ(అథవాలే) 2, ఎన్పీఎఫ్ 2 సీట్లలో గెలుపొందాయి. జేడీ(యూ) ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కి ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీ ల అభ్యర్థులకు ఎన్డీపీపీ నేత, సీఎం రియో అభినందనలు తెలిపారు. చరిత్ర సృష్టించిన మహిళా ఎమ్మెల్యేలు 60 ఏళ్ల నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అధికార ఎన్డీపీపీ టిక్కెట్‌పై పశ్చిమ అంగామీ స్థానం నుంచి హెకాని జకాలు, దిమాపూర్–3 స్థానం నుంచి సల్‌హోటనో క్రుసె విజయం సాధించారు. వారిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించడం విశేషం. మేఘాలయలో హంగ్! మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీ కీ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. రాష్ట్రంలో హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. మేఘలయలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా, 59 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. సోహియోంగ్ నియోజకవర్గంలో యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) అభ్యర్థి డొంకుపర్ రాయ్ లింగ్డో ఫిబ్రవరి 20న మృతిచెందడంతో పోలింగ్ వాయిదా పడింది. ఈ ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్న అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అతిపెద్ద పార్టీ గా అవతరించింది. మెజార్టీ కి కొద్దిదూరంలోనే ఆగిపోయింది. కాన్రాడ్ సంగ్మా ప్రభుత్వంలో ఎన్పీపీ మిత్రపక్షంగా వ్యవహరించిన యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) 11 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్ 5, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలుచుకున్నాయి. ఒంటరిగా పోటీ చేసిన జాతీయ పార్టీ బీజేపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధినేత జేపీ నడ్డా వంటి అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనప్పటికీ ఆశించిన ఫలితందక్కలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్పీపీ నేత, ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మద్దతును కోరుతున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్పీపీకి సహకరించాలంటూ తమ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారని హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఎన్పీపీకి మద్దతు తెలియజేస్తూ లేఖ ఇవ్వబోతున్నామని మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మారీ చెప్పారు. ముఖ్యమంత్రి సంగ్మా దక్షిణ తురా స్థానంలో గెలిచారు. -
కొండల్లో కాషాయ రాగం
‘ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు... వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు!’ ఇది ఓ హిట్ సినిమాలో ఫైట్ చేసిన హీరోను ఉద్దేశించి ఓ ఛోటా విలన్ పాపులర్ డైలాగ్. సమయం, సందర్భం వేరైనా... గురువారం నాడు వెలువడ్డ మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయాలకు ఇదే డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. త్రిపుర అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా గెలిచి, బీజేపీ ఆ రాష్ట్రాన్ని స్వీప్ చేసింది. నాగాలాండ్‌లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీపీపీ కూటమి అధిక స్థానాలు సాధించి, సర్కారు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. మిగిలిన మేఘా లయలో ఎన్పీపీ అధిక స్థానాలు దక్కించుకున్నా, అక్కడా ప్రస్తుత సీఎం కన్రాడ్ సంగ్మా చూపు నిన్నటి దాకా తమ ప్రభుత్వంలో భాగమైన బీజేపీని మళ్ళీ కలుపుకోవడం మీదే ఉంది. వెరసి, ముచ్చటగా మూడు రాష్ట్రాలూ బీజేపీ జేబులోనే! అదీకాక అటు సీపీఎం, ఇటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తదితరుల్ని కనుమరుగు చేసి, కాషాయం రెపరెపలాడడం విశేషం. కొన్నేళ్ళ క్రితం ఈశాన్యంలో సీట్ల బలమే కాదు... ఓటర్ల బలగం కూడా లేని కాషాయ పార్టీ ఇప్పుడు అక్కడి రాష్ట్రాలన్నిటిలో కాంగ్రెస్‌ను తోసిపుచ్చి, తిరుగులేని శక్తిగా నిలవడం ఆషామాషీ కాదు. అందుకు ఆ పార్టీ దీర్ఘకాలిక వ్యూహం, ఎన్నికల లెక్కల్లో స్థానిక పొత్తులు వగైరా అనేకం ఉన్నాయి. గిరిజన జనాభా, క్రైస్తవులు ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ స్వరం మార్చింది. మతపరమైన అంశాలు, గొడ్డుమాంసంపై నిషేధం లాంటి ప్రస్తావనలే తేకుండా తెలివిగా వ్యవహ రించింది. మైనారిటీల అభద్రతనూ, సెంటిమెంట్లనూ రెచ్చగొట్టే తెలివితక్కువ పనికి దిగలేదు. పైగా, కేంద్రంలోని అధికారపక్షంతో స్నేహంగా సాగాలని భావించే అభివృద్ధి ఆధారిత ప్రజాస్వా మ్యాన్ని ఈ సుదూర పర్వతప్రాంత రాష్ట్రాలు నమ్మడం సాధారణం. అందుకు తగ్గట్లే పొరుగునే బీజేపీ పాలిత అస్సామ్‌లోని అభివృద్ధి నమూనాను చూపి, ఓటర్లను బీజేపీ తన వైపు తిప్పుకొంది. త్రిపురలో కాంగ్రెస్, టీఎంసీ, కొత్తగా వచ్చిన ‘టిప్రా మోటా పార్టీ’లతో త్రిముఖ పోటీని ఎదుర్కొన్న కమలనాథులు వరుసగా రెండోసారీ గద్దెనెక్కడం విశేషం. వ్యతిరేకతను ఎదుర్కొంటున్న విప్లవ్‌దేవ్‌ను సరైన సమయంలో సీఎంగా పక్కకు తప్పించి, మాణిక్ సాహాకు కిరీటం పెట్టడమూ బీజేపీకి వ్యూహాత్మకంగా ఫలించింది. గతంలో వరుసగా 7 సార్లు త్రిపురను పాలించి, శాసించిన సీపీఎంకు ఆ రాష్ట్రంలో ఇది వరుసగా రెండో పరాజయం. పైగా ఓట్లు 42 శాతం నుంచి 24 శాతానికి పడిపోవడం ఆ పార్టీకి ప్రమాదఘంటిక. ‘టిప్రా’ కింగ్‌మేకర్‌గా ఆవిర్భవించకున్నా, కలసి బరిలోకి దిగిన సీపీఎం – కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీసింది. బెంగాలీ ఓటర్లపై టీఎంసీ పెట్టుకొన్న ఆశ అడియాసైంది. 2018తో పోలిస్తే బీజేపీ కూటమికి 11 శాతం ఓట్లు తగ్గినా, కమల నాథులే సొంతంగా సర్కారు ఏర్పాటు చేసే స్థితికి చేరుకోవడం ప్రతిపక్షాల అనైక్యతకు ప్రతిఫలం! శుభవార్త ఏమంటే, అరవై ఏళ్ళ నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా మహిళలు ఎమ్మెల్యే లుగా ఎన్నిక కావడం! పితృస్వామ్య భావజాలం ప్రబలంగా ఉండే ఈ గడ్డపై గతంలో పట్టణ మునిసిపల్ ఎన్నికల్లో స్త్రీల రంగప్రవేశానికి ప్రయత్నం జరిగినా, హింస రేగి పోటీ నుంచి తప్పుకోవాల్సొచ్చింది. కానీ ఈసారి ఏకంగా ఇద్దరు మహిళలు గెలవడం గమనార్హం. ఇది మార్పు పవనాలకు ప్రతీక. ఇక, వివిధ రాష్ట్రాల పార్టీలు (జేడీ–యూ, లోక్‌జనశక్తి, శరద్ పవార్ ఎన్సీపీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా) నాగాలాండ్ బరిలో దిగడం చిత్రం. ఆరు సీట్లలో ఎన్సీపీ గెలవడం, పశ్చిమాన మహారాష్ట్ర నుంచి వచ్చి తూర్పున నాగాలాండ్‌లో సత్తా చాటి, పెద్ద ప్రతిపక్షంగా అవతరించడం విచిత్రం. ఈశాన్య రాష్ట్రాల్లో అంచనాలకు అల్లంత దూరంలో ఆగిన కాంగ్రెస్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన 6 ఉప ఎన్నికల్లో మాత్రం 3 చోట్ల విజయాలు సాధించింది. తమిళనాట ఈరోడ్ (ఈస్ట్), మహారాష్ట్రలోని కస్బాపేట్, బెంగాల్లో టీఎంసీ నుంచి చేజిక్కించుకున్న సాగర్‌దిఘీ స్థానాలు హస్తానికి కొంత ఊరట. ఈరోడ్ గెలుపు వెనుక అధికార డీఎంకెతో పొత్తు, కస్బాలో విజయానికి మహా వికాస్ ఆఘాడీ కూటమి మద్దతు, 2021 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బెంగాల్లో ఈసారి సీపీఎం అండ కాంగేయులకు కలిసొచ్చింది నిజమే. అయితే, 32 ఏళ్ళుగా కంచుకోటైన పుణేలోని కస్బాపేట్లో బీజేపీ ఓటమి ఆలోచన రేపుతోంది. అదే సమయంలో మిగతా 3 ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం, అందులోనూ రామ్‌గఢ్‌ను కైవసం చేసుకోవడం విస్మరించలేం. ఒకరకంగా ఈ ఫలితాలు ప్రతిపక్షాలకు ఆత్మశోధన అవకాశం. ఏ మాటకా మాట – ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలను బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ఏ మేరకు సీరియస్‌గా తీసుకున్నాయన్నది అనుమానమే. ప్రధాని, కేంద్ర హోమ్‌మంత్రి సహా పలువురు పదేపదే ఈశాన్యంలో పర్యటించారు. ప్రతిపక్షాలపై ప్రచారదాడి చేశారు. స్థానిక స్థితిగతులకు అనుగుణంగా వ్యాఖ్యలు, వ్యూహాలు మార్చుకున్నారు. ప్రతిపక్షాల్లో గెలిచితీరాలనే ఆ పట్టుదల, ఎన్నికల చాణక్యం కొరవ డ్డాయి. మరి రెండు నెలల్లో కర్ణాటక, ఆ వెంటనే మధ్యప్రదేశ్, రాజస్థాన్ – ఇలా అనేక రాష్ట్రాల్లో ఎన్ని కలు రానున్న వేళ ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు ఓ మేలుకొలుపు. ఐక్యత, ఐడియాలజీ ఏదీ లేకుండా ఒక్క మోదీ వ్యతిరేక మంత్రమే ఫలిస్తుందనుకుంటే పొరపాటు. ప్రత్యర్థి బలవంతుడైనప్పుడు ప్రత్యామ్నాయ వ్యూహాలు, అజెండాలు లేకుండా సవాలు చేస్తే శృంగభంగం తప్పదు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు మేలుకుంటే... కోలుకుంటాయి. లేదంటే, ఎన్నికలు ఏవైనా ఫలితాలు కాస్త అటూ ఇటుగా ఇలాగే ఉంటాయి. -
మహిళా ఎం.ఎల్.ఏలు చరిత్ర సృష్టించారు
నాగాలాండ్ ఏర్పడి 60 ఏళ్లు. 60 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఇప్పటి వరకూ ఒక్క మహిళ కూడా అడుగుపెట్టలేదు. ఇప్పుడు ఆ ఘనతను ఇద్దరు ఎం.ఎల్.ఏలు దక్కించుకొని చరిత్ర సృష్టించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హెకాని జకాలు, సల్‌హౌటనో క్రుసె విజయం సాధించారు. గురువారం ఓట్ల లెక్కింపు జరగగా డిమాపూర్–3 నుంచి హెకాని, పశ్చిమ అంగమె నుంచి క్రుసె విజయం సాధించారు. అక్కడి పాలనాధికారంలో స్త్రీలప్రాతినిధ్యం మొదలైంది. ఇది ఆగదు. మహిళలను ‘ఆకాశంలో సగం’ అంటాం. వారికి అవకాశాలలో సగం దక్కాలన్న ఉద్యమాలు బయలుదేరి చాలా కాలం అయ్యింది. కాని ఇంకా కొన్నిచోట్ల వారికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. పురుష భావజాలం స్త్రీలలో కూడా నాటుకు పోయి స్త్రీకి స్త్రీయే ప్రతికూలత సృష్టించేవరకూ వెళుతోంది. ఉదాహరణకు నాగాలాండ్‌లో పా లనాధికారంలో స్త్రీలు ఉండటాన్ని మొదటినుంచీ వ్యతిరేకించారు. అక్కడి మొత్తం ఓటర్లు 13 లక్షలు ఉంటే వారిలో దాదాపు ఆరున్నర లక్షల ఓటర్లు మహిళలే అయినా వారు ఒక్క మహిళనూ గెలిపించుకోలేదు. దానికి కారణం అక్కడ ఇంటి పెద్ద, సమూహం పెద్ద, ఊరి పెద్ద ఎవరికి ఓటెయ్యమంటే స్త్రీలు వారికే ఓటు వేయాలి. పురుషులే సంపా దనపరులు కనుక పురుషుల మాట వినాలని స్త్రీలు అనుకుంటారు. పురుషులు సహజంగానే స్త్రీల ్రపా తినిధ్యాన్ని అంగీకరించరు. కనుక 1963లో నాగాలాండ్ ఏర్పడితే... 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేవలం 20 మందికే సీట్లు దక్కాయి. కాని ఎవరూ గెలవలేదు. డిపా జిట్లు కూడా రాలేదు. 2018లో 5 మంది స్త్రీలు పోటీ చేస్తే వారిలో ఎవరూ గెలువలేదు. కాని ఈ ధోరణిలో ఇప్పుడు మార్పు వచ్చిందనే సంకేతాలు అందుతున్నాయి. 2023 ఎన్నికలలో మొత్తం 183 మంది అన్ని పా ర్టీల నుంచి బరిలో దిగగా వీరిలో నలుగురు స్త్రీలు ఉన్నారు. ఈ నలుగురిలో నేషనల్ డెమొక్రటిక్ ప్రో గ్రెసివ్ పా ర్టీ (ఎన్.డి.పి.పి) నుంచి ఇద్దరు మహిళలు హెకాని, క్రుసె గెలిచారు. బి.జె.పితో కలిసి ఎన్.డి.పి.పి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అందువల్ల ఈ ఇరువురిలో ఎవరైనా మంత్రి అయితే అదీ మరో చరిత్ర కాగలదు. ఏడు ఓట్లతో గెలిచిన క్రుసె నాగాలాండ్‌లోని పశ్చిమ అంగమి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు ఎన్.డి.పి.పి అభ్యర్థి, 56 సల్‌హౌటనో క్రుసె ఏడంటే ఏడే ఓట్లతో విజయం సాధించింది. పశ్చిమ అంగమెలో ఆమెకు ప్రత్యర్థిగా నిలిచిన నఖ్రో గతంలో నాగా పీపుల్స్ పా ర్టీలో ఉండేవాడు. ఆ తర్వాత ఎన్.డి.పి.పికి జంప్ చేశాడు. కాని ఈ ఎన్నికల్లో ఎన్.డి.పి.పి టికెట్ ఇవ్వక పోయేసరికి ఇండిపెండెంట్‌గా రంగంలో దిగాడు. అతణ్ణి ఓడించడానికి క్రుసె సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సి వచ్చింది. హోటల్స్ రంగంలో ఉన్న క్రుసె నాగాలాండ్‌లోని సామాజిక సంస్థలకు కలిసి పని చేస్తోంది. తన గిరిజన తెగ మహిళా విభాగానికి నాయకురాలిగా కూడా ఉంది. ఈమె గెలుపుతో అంగమిలో భారీ వేడుకలు మొదలయ్యాయి. జనం బారులు తీరి అభినందనలు తెలుపుతున్నారు. మొదటి విజేత హెకాని నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం జరిగిన ఫలితాల లెక్కింపులో ఆ రాష్ట్రంలో గెలిచిన మొదటి మహిళా ఎం.ఎల్.ఏగా ఎన్.డి.పి.పి అభ్యర్థి హెకాని జకాలు (47) మొదట డిక్లేర్ అయ్యింది. ఆ తర్వాతే రెండో మహిళా అభ్యర్థి క్రుసె గెలుపు ప్రకటితమైంది. అందువల్ల హెకాని విజయం విశేషంగా మారింది. డిమాపూర్–3 నియోజకవర్గంలో సిట్టింగ్ ఎం.ఎల్.ఏ జిమోమిని 1536 ఓట్లతో ఓడించింది హెకాని. అయితే ఈమెకు ఈ గెలుపు ఊరికే రాలేదు. సుదీర్ఘ కృషి ఉంది. డిమాపూర్లో పుట్టి పెరిగిన హెకాని ఢిల్లీలో చదువుకుంది. ఆ తర్వాత అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలో లా చదివింది. నాగాలాండ్‌లో ‘యూత్‌నెట్ నాగాలాండ్’ అనే ఎన్.జి.ఓను స్థాపించి యువతీ యువకుల చదువుకు,ఉపా ధికి మార్గం చూపింది. ‘మేడ్ ఇన్ నాగాలాండ్’ పేరుతో వస్తు ఉత్పత్తి, ఆవిష్కరణల కోసం కోహిమాలో ఒక సెంటర్ నడుపుతోందామె. అందుకే ఆమెకు నారీశక్తి పురస్కారం లభించింది. ఈ ఎన్నికలలో ఆమె తన విజయం కోసం గట్టిగా పోరాడింది. స్త్రీల విద్య, ఉపా ధికి హామీలు ఇచ్చింది. ఆమె కోసం అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ ప్రచారం చేశాడు. -
త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ ఘన విజయం.. మేఘాలయలో షాక్..
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్‌లో మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే బీజేపీ పూర్తి ఆధిక్యం కనబరిచింది. దీంతో, రెండు రాష్ట్రాల్లో వికర్టీని అందుకుంది. - త్రిపురలో 60 స్థానాలకు గానూ 33 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోవడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. - ఇక, కాంగ్రెస్, లెప్ట్ కూటమి 14 స్థానాల్లో విజయం సాధించగా.. కొత్త పార్టీ టిప్రా మోథా 13 స్థానాల్లో జయభేరి మోగించి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చింది. As per ECI, BJP leading on 33 seats out of 60 Assembly seats; Counting of votes underway#TripuraAssemblyElections2023 pic.twitter.com/uKPKZ0nzgP — ANI (@ANI) March 2, 2023 - నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. 60 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది ఎన్పీఎఫ్ రెండు స్థానాలు కైవసం చేసుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఇతరులు 21 చోట్ల విజయం సాధించడం గమనార్హం. - ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. మేఘాలయలో హంగ్... మరోవైపు.. మేఘాలయలో హంగ్ వచ్చింది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాన్రాడ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని బీజేపీ ప్రకటించింది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే మేఘాలయ ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగం కానుంది. ఫలితంగా మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లు అవుతుంది. ఇదిలా ఉండగా.. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో కూడా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ భారీ ఓటమిని చవిచూసింది. రెండు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. నాగాలాండ్‌లో అసలు ఖాతా తెరవలేకపోయింది. -
Election Results: మేఘాలయలో హంగ్.. బీజేపీ బిగ్ ప్లాన్!
► ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్‌లో మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే బీజేపీ పూర్తి ఆధిక్యం కనబరిచి రెండు రాష్ట్రాల్లో వికర్టీని అందుకుంది. త్రిపురలో 60 స్థానాలకు గానూ 33 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోవడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్, లెప్ట్ కూటమి 14 స్థానాల్లో విజయం సాధించగా.. కొత్త పార్టీ టిప్రా మోథా 13 స్థానాల్లో జయభేరి మోగించి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చింది. ► నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. 60 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది ఎన్పీఎఫ్ రెండు స్థానాలు కైవసం చేసుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఇతరులు 21 చోట్ల విజయం సాధించడం గమనార్హం. ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి ► మరోవైపు.. మేఘాలయలో హంగ్ వచ్చింది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాన్రాడ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని బీజేపీ ప్రకటించింది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే మేఘాలయ ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగం కానుంది. ఫలితంగా మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లు అవుతుంది. ► తమిళనాడులోని ఈరోడ్ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఈవీకేఎస్ ఎలన్గోవన్ ఘన విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో అధికార డీఎంకే కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది. ఈ విజయం సీఎం ఎంకే స్టాలిన్ వల్లే సాధ్యమైందని ఎలన్గోవన్ పేర్కొన్నారు. ఎన్నికల హామీలను 80శాతం నెరవేర్చినట్లు చెప్పారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 40కి 40 ఎంపీ స్థానాలు డీఎంకే కూటమే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. Credit of this victory goes to CM MK Stalin. He did 80% of the things that were promised by DMK in election manifesto. I feel proud to be a part of the Legislative Assembly which is headed by MK Stalin: DMK-backed Congress candidate EVKS Elangovan on his lead in #ErodeEastResults pic.twitter.com/J9XkJE70tT — ANI (@ANI) March 2, 2023 ► ఈశాన్య భారతంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ.. త్రిపురలో రెండో సారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ► ఇక, మేఘాలయలో ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ► రాత్రి 7 గంటలకు ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. మూడు రాష్ట్రాల విక్టరీ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. ► మహారాష్ట్రలోని పుణే జిల్లా కస్బా స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో, కాంగ్రెస్ శ్రేణులు, మహా వికాస్ అగాడీ కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ సంబురాలు చేసుకుంటున్నారు. #WATCH | Maharashtra: Maha Vikas Aghadi (MVA) workers celebrate in Pune as official EC trends show Congress candidate Dhangekar Ravindra Hemraj leading in Kasba Peth assembly by-election. pic.twitter.com/Duxyvm9K15 — ANI (@ANI) March 2, 2023 ► త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బోర్దోవలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం సాహా.. సీపీఎం అభ్యర్థి ఆశిష్‌కుమార్ సాహాపై విజయం సాధించారు. ► మేఘాలయలో హంగ్ దిశగా పోలింగ్ కౌంటింగ్ కొనసాగుతోంది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ 17 స్థానాల్లో ఆధిక్యంగా ఉంది. #MeghalayaElections | As per official EC trends, CM Conrad Sangma's National People's Party leading on 17 of the total 59 seats so far. Counting of votes still underway, trends on 47 seats known. pic.twitter.com/GsLOUPGgSd — ANI (@ANI) March 2, 2023 ► తమిళనాడులోని ఈరోడ్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. కాగా, ఉప ఎన్నికల్లో అధికార డీఎంకే కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. Tamil Nadu | E.V.K.S.Elangovan of Congress leading in Erode East by-election pic.twitter.com/IQ08d1Tv4L — ANI (@ANI) March 2, 2023 ► పూణేలోని చించావద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడింగ్ కొనసాగుతోంది. Pune, Maharashtra | Counting of votes underway for Kasba Peth by-elections pic.twitter.com/CUp88aRSL3 — ANI (@ANI) March 2, 2023 ► పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌డిగీ ఉప ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్, టీఎంసీ మధ్య హోరాహోరి కొనసాగుతోంది. ► మేఘాలయలో ఫలితాలు హంగ్ దిశగా వెళ్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కనపించడం లేదు. ► నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ ఆధిక్యంతో 50 స్థానాల్లో దూసుకుపోతోంది. ► త్రిపురలో 60 స్థానాలకు గానూ దాదాపు 39 స్థానాల్లో బీజేపీలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ► మేఘాలయలో ఎన్పీపీ 28, బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యం ► నాగాలాండ్‌లో బీజేపీ 21, ఎన్పీఎఫ్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ► త్రిపురలో బీజేపీ 24 స్థానాల్లో, ట్రిపా 10 స్థానాల్లో, లెఫ్ట్ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ► అరుణాచల్ ప్రదేశ్‌లోని లూమ్లా, జార్ఖండ్‌లోని రామ్‌ఘర్, తమిళనాడులోని ఈరోడ్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్డిగి అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం Counting of votes for Tripura, Nagaland & Meghalaya elections begins Counting for by-elections for Lumla assembly seat of Arunachal Pradesh, Ramgarh (Jharkhand), Erode East (Tamil Nadu), Sagardighi (West Bengal) & Kasba Peth, Chinchwad assembly seats of Maharashtra also begins pic.twitter.com/mMlLV3ryfV — ANI (@ANI) March 2, 2023 ► మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం ► ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మేఘాలయలోని తూర్పు పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో జిల్లా మేజిస్ట్రేట్ 144 సెక్షన్ విధించారు. Meghalaya | Section 144 imposed in Eastern West Khasi Hills district by the District Magistrate pic.twitter.com/JY8t1wHCp9 — ANI (@ANI) March 2, 2023 ► ముఖ్యంగా త్రిపుర అసెంబ్లీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. బీజేపీని ఓడించేందుకు లెఫ్ట్, కాంగ్రెస్ జట్టు కట్టి బరిలో దిగాయి. కొత్తగా తెరపైకి వచ్చిన టిప్రా మోతా కనీసం 15 స్థానాలకు పైగా గెలుచుకుని కింగ్‌మేకర్‌గా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ► నాగాలాండ్, మేఘాలయలో కూడా ఫలితాలపై చర్చ నడుస్తోంది. Nagaland | The counting of votes for the #NagalandAssemblyElections2023 will begin at 8 am; Visuals from counting centre at Deputy Commissioner's office in Kohima pic.twitter.com/XdT0sWc4e9 — ANI (@ANI) March 2, 2023 న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. కాగా, మూడు రాష్ట్రాల్లో 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మ్యాజిక్ ఫిగర్ 30 దాటిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. -
‘ఈశాన్య’ ఫలితాలు నేడే
న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈశాన్యాన మరింతగా విస్తరించాలన్న అధికార బీజేపీ ఆశలు ఏ మేరకు నెరవేరాయన్నది ఈ ఫలితాలతో తేలనుంది. ముఖ్యంగా ఈసారి అందరి దృష్టీ ప్రధానంగా త్రిపురపైనే నెలకొంది. అక్కడ పాతికేళ్ల వామపక్ష పాలనకు తెర దించుతూ అభివృద్ధి నినాదంతో బీజేపీ 2018లో సొంతంగా అధికారంలోకి రావడం తెలిసిందే. దాంతో ఈసారి బీజేపీని ఎలాగైనా నిలువరించేందుకు చిరకాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి మరీ లెఫ్ట్, కాంగ్రెస్ జట్టు కట్టి బరిలో దిగాయి. ఇక నాగాలాండ్, మేఘాలయల్లో కూడా బీజేపీ అధికార సంకీర్ణంలో భాగస్వామిగా ఉంది. అయితే మేఘాలయలో ఎన్నికల ముందు అధికార నేషనల్ పీపుల్స్ పార్టీతో బంధం తెంచుకుని సంకీర్ణం నుంచి బయటికొచ్చింది. అంతేగాక తొలిసారిగా మొత్తం 60 స్థానాలకూ పోటీ చేసింది! నాగాలాండ్‌లో మరోసారి ఎన్డీపీపీతో కలిసి బరిలో దిగింది. అక్కడ బీజేపీ అధికారం నిలుపుకుంటుందని, త్రిపురలో ఏకైక పెద్ద పార్టీగా మెజారిటీకి చేరువగా వస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం తెలిసిందే. ఇక త్రిపురలో హంగ్ తప్పకపోవచ్చని అంచనా వేశాయి. కొత్తగా తెరపైకి వచ్చిన టిప్రా మోతా కనీసం 15 స్థానాలకు పైగా గెలుచుకుని కింగ్‌మేకర్‌గా మారొచ్చని జోస్యం చెప్పాయి. -
నాగాలాండ్, త్రిపురలో బీజేపీ హవా.. మేఘాలయలో మాత్రం!
న్యూఢిల్లీ: ఈశాన్యాన మళ్లీ కమల వికాసమేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తాజాగా ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో నాగాలాండ్, త్రిపురల్లో మళ్లీ బీజేపీ కూటమే అధికారంలోకి వస్తుందని, మేఘాలయలో హంగ్ తప్పదని జోస్యం చెప్పాయి. అక్కడ అధికార ఎన్పీపీ మరోసారి ఏకైక పెద్ద పార్టీగా నిలుస్తుందని చెప్పాయి. త్రిపురలో ఎన్నో ఆశలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను కొత్త పార్టీ టిప్రా మోర్చా గట్టి దెబ్బ కొట్టనుంది. అధికార బీజేపీ జైత్రయాత్రకూ అది కాస్త అడ్డుకట్ట వేసిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయల్లో సోమవారం పోలింగ్ పూర్తయింది. మేఘాలయ రాష్ట్రంలో ఈసారి హంగ్ తప్పకపోవచ్చని అన్ని ఎగ్జిట్ పోల్సూ చెప్పడం విశేషం! అధికార ఎన్పీపీకి 18 నుంచి 26 సీట్లకు మించకపోవచ్చని అవి పేర్కొన్నాయి. ఇక బీజేపీకి దక్కుతున్నది 4 నుంచి గరిష్టంగా 11 స్థానాలే. కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి కాగా తృణమూల్‌కు మాత్రం ఎగ్జిట్ పోల్స్ 5 నుంచి 13 స్థానాల దాకా ఇచ్చాయి. యూడీపీకి ఇండియాటుడే, టైమ్స్ నౌ రెండూ 8 నుంచి 14 సీట్లిచ్చాయి. నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్డీపీపీ–బీజేపీ కూటమి అధికారాన్ని నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ ముక్త కంఠంతో పేర్కొన్నాయి. ఎన్డీపీపీకి 28–34 సీట్లు, బీజేపీకి 10 నుంచి 14 వస్తాయని ఇండియాటుడే అంచనా వేసింది. ఎన్పీఎఫ్కు 3 నుంచి 8 సీట్లు వస్తుండగా కాంగ్రెస్ 2 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. టైమ్స్ నౌ కూడా ఎన్డీపీపీకి 27–33 సీట్లు, బీజేపీకి 12–16 ఇవ్వగా ఎన్పీఎఫ్కు 6 సీట్లతో సరిపెట్టింది. త్రిపుర పాతికేళ్ల సీపీఎం కూటమి జైత్రయాత్రకు అడ్డుకట్ట వేస్తూ 2018లో బీజేపీ ఏకంగా 36 సీట్లతో మెజారిటీ సాధించి ఆశ్చర్యపరిచింది. దాంతో ఈసారి బీజేపీని ఎలాగైనా అడ్డుకునేందుకు సీపీఎం కూటమి తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. కానీ వాటి అవకాశాలకు కొత్తగా వచ్చిన టిప్రా మోతా భారీగా గండి కొట్టనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మోతా 9 నుంచి 16 సీట్లు దాకా గెలుచుకుంటుందని అంచనా వేశాయి. బీజేపీ మళ్లీ మెజారిటీ సాధిస్తుందని ఇండియాటుడే, జీ న్యూస్ అభిప్రాయపడగా 24 సీట్లకు పరిమితం కావచ్చని టైమ్స్ నౌ పేర్కొంది. కాంగ్రెస్–సీపీఎం కూటమికి ఏ ఎగ్జిట్ పోల్‌లోనూ గరిష్టంగా 21 సీట్లు దాటలేదు. బీజేపీకి 45 శాతం ఓట్లు రావచ్చని ఇండియాటుడే అంచనా వేసింది. లెఫ్ట్–కాంగ్రెస్ కూటమికి 32 శాతం, టిప్రా మోతాకు 20 శాతం వస్తాయని పేర్కొంది. హంగ్ నెలకొనే పక్షంలో ప్రత్యేక టిప్రా లాండ్ డిమాండ్‌కు జైకొట్టే పార్టీకే మద్దతిస్తామని టిప్రా మోతా అధ్యక్షుడు ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దేవ్ బర్మ ఇప్పటికే ప్రకటించారు. నాగాలాండ్‌లో 83%, మేఘాలయలో 75% ఓటింగ్ షిల్లాంగ్/కోహిమా: నాగాలాండ్‌లో ఓటర్లు పోటెత్తారు. దాంతో సోమవారం జరిగిన పోలింగ్‌లో మధ్యాహ్నం మూడింటికే 83.63% ఓటింగ్ నమోదైంది! ఇక మేఘాలయలో సాయంత్రం ఐదింటికల్లా 75% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూలు ఉండటంతో రెండు రాష్ట్రాల్లోనూ ఓటింగ్ శాతం మరింత పెరగనుంది. రెండు అసెంబ్లీల్లోనూ 60 స్థానాలకు గాను 59 సీట్లకు పోలింగ్ జరిగింది. కొన్ని బూత్‌ల్లో ఈవీఎంలతో సమస్య తలెత్తినా అధికారులు వెంటనే పరిష్కరించారు. -
ముగిసిన మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల పోలింగ్
Updates మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన పోలింగ్ ముగిసింది. మేఘాలయలో 59 అసెంబ్లీ స్థానాలకు 3,419 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ నిర్వహించగా.. నాగాలాండ్‌లో 59 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మేఘాలయ, నాగాలాండ్‌తోపాటు ఫిబ్రవరి 16న జరిగిన త్రిపుర ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి. ► నాగాలాండ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 81.94% పోలింగ్ నమోదైంది. ► మేఘాలయలో సాయంత్రం 5 గంటల వరకు 74.32% పోలింగ్ నమోదైంది. ► నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు 60.51% ఓటింగ్ నమోదైంది. ►మేఘాలయ తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చార్లెస్ పింగ్రోప్ షిల్లాంగ్‌లోని తన నియోజకవర్గం నోంగ్తిమ్మాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. #MeghalayaElections2023 :TMC State President Charles Pyngrope voting in his Nongthymmai constituency in Shillong pic.twitter.com/mk4S553sl1 — All India Radio News (@airnewsalerts) February 27, 2023 ► నాగాలాండ్‌లో ఉదయం 11 గంటల వరకు 38.68 శాతం ఓటింగ్ నమోదు. ► ఓటు హక్కు వినియోగించుకున్న మేఘాలయ సీఎం కార్నాడ్ సంగ్నా. గారో హిల్స్‌లోని తురా పోలింగ్ స్టేషన్లో ఆయన ఓటు వేశారు. ఈ సందర్బంగా సీఎం సంగ్మా మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది శుభపరిణామం. ఎన్నికల ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయని నా నమ్మకం అంటూ కామెంట్స్ చేశారు. Meghalaya CM Conrad Sangma cast his vote at Walbakgre -29 polling station in Tura, Garo Hills "People coming out in large no. to vote. This is good for democracy. I've not see this kind of voter turnout in the past. We are confident that it'll be in our favour," he says. pic.twitter.com/wFkELDuNpE — ANI (@ANI) February 27, 2023 9.00AM ► ఉదయం తొమ్మిది గంటల వరకూ మేఘాలయలో 12 శాతం, నాగాలాండ్‌లో 15.76 శాతం పోలింగ్ నమోదైంది నాగాలాండ్, మేఘాలయల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రోజు(సోమవారం) ఉదయం గం. 7.00లకు పోలింగ్ ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ జరుగనుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, రెండు రాష్ట్రాల్లో 552 మంది బరిలో ఉన్నారు. 34 లక్షలకు పైగా ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. మేఘాలయాలో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా, బరిలో 369 మంది అభ్యర్థులు నిలిచారు. 21.6 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 60 స్థానాలకుకు గాను 59 స్థానాల్లో పోటీ జరుగునుంది. ఇక్కడ ఒక స్థానాన్ని బీజేపీ ముందుగానే కైవసం చేసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఖతేజో కినిమి అకులుటో నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగాలాం్‌లో 183 మంది బరిలో ఉన్నారు. ఇక్కడ ఓటర్లు సంఖ్య 13లక్షలకుపైగా ఉంది. మేఘాలయాలో ఇప్పటిదాకా ఏపార్టీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. నాగాలాండ్‌లో ఏ పార్టీ అన్నిచోట్లా పోటీకి దిగలేకపోయింది. ఇక తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. -
చిన్న పార్టీల చుట్టూ...
మేఘాలయలో ప్రాంతీయ పార్టీలే జోరు మీదున్నాయి. ప్రస్తుతమున్న పార్టీలతో పాటుగా మరో రెండు పార్టీలు కొత్తగా బరిలోకొచ్చాయి. వాయిస్ ఆఫ్ ది పీపుల్స్ పార్టీ (వీపీపీ) , కేఏఎం మేఘాలయ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. వీపీపీ 18 సీట్లలోనూ కేఎంఎం 3 సీట్లలో మాత్రేమే పోటీ పడుతున్నప్పటికీ వాటి ప్రభావం బాగా ఉంటుందన్న అంచనాలున్నాయి. ఇతర పార్టీల్లా కాకుండా ఈ రెండు పార్టీలు స్వచ్ఛమైన రాజకీయాలు, అవినీతి రహిత ప్రభుత్వాలు అనే అంశాలపై దృష్టి సారించాయి. గత ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ సారి కూడా ఏ పార్టీకి మెజార్టీ దక్కే అవకాశాలైతే కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ముకుల్ సంగ్మా సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 21 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ 19 సీట్లలో నెగ్గిన నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), రెండే స్థానాలు గెలిచిన బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీలైన యూడీఎఫ్, పీడీపీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (హెచ్ఎస్పీడీపీ), మరికొందరు స్వతంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి బీజేపీ, ఎంపీపీ మధ్య విభేదాలు ముదిరాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఆర్. మారక్ గారో హిల్స్‌లో బ్రోతల్ హౌస్ నడుపుతున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, మారక్ ఇరువురు తుర పట్టణానికి చెందిన వారైనప్పటికీ వారి మధ్య సయోధ్య లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ సారి ఎన్నికల్లో మారక్‌కు పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది. మారక్‌పై ఉన్న సానుభూతితో గారో హిల్స్‌లోని 24 అసెంబ్లీ స్థానాల్లో పాగా వేయాలని యోచిస్తోంది. సంగ్మా సర్కార్‌కు మద్దతు ఉపసంహరించాలని బీజేపీ స్థానిక నాయకులు ఒత్తిడి తెచి్చనప్పటికీ పార్టీ ఆచి తూచి అడుగులు వేస్తోంది. క్రిస్టియన్ జనాభా అధికంగా ఉన్న బీజేపీ గత ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుపొంది ఇప్పుడు కనీసం డబుల్ డిజిట్‌పై దృష్టి పెట్టింది. అధికారంలో ఉన్న పార్టీలన్నీ ఎవరికి వారే పోటీ పడుతున్నట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అధికార వ్యతిరేకత ఎన్పీపీపైనే ఉంటుందని ఇతర పార్టీలు ధీమాగా ఉన్నాయి. మరోవైపు ఎన్పీపీ కూడా బీజేపీ హిందుత్వ విధానాలు తమ పార్టీకి ఎదురు దెబ్బగా మారుతుందన్న ఆందోళనతోనే ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని పార్టీలకు సవాల్ విసిరినా ఈసారి అంతర్గత కుమ్ములాటలతోనే ఆ పార్టీ సతమతమవుతోంది. గత ఎన్నికల్లో పార్టీలో ప్రధానంగా ఉన్న ముకుల్ సంగ్మా ఈసారి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఈశాన్య రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న టీఎంసీ ఈ సారి బలమైన పక్షంగా మారుతుందనే అంచనాలున్నాయి. మొత్తమ్మీద ఈ ముక్కోణపు పోటీలో మేఘాలయ ఎన్నికల చిత్రం ఎలా మారుతుందో చూడాలి. నాగాలాండ్‌లో మొత్తం 60 నియోజకవర్గాల్లో ఎవరూ అభ్యర్థుల్ని నిలబెట్టలేని పరిస్థితులున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలదే హవా. జాతీయ పార్టీల ఉనికి నామ మాత్రంగానే ఉంది. నాగాలాండ్‌లో ప్రస్తుతం నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) బీజేపీ కూటమి అధికారంలో ఉంది.ఎన్డీపీపీ 40 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంటే, బీజేపీ 19 నియోజకవర్గాల్లో బరిలో ఉంది. ఈ సారి ఎన్నికల్లో గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ ఎక్కువ ప్రభావం చూపించనుంది. ముఖ్యమంత్రి నిపుయో రియోకు సామాన్య ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో 26 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) అవతరించినప్పటికీ , బీజేపీతో ఎప్పట్నుంచో సంబంధాలున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్డీపీపీతో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ నాగా శాంతి చర్చలకు అత్యంత ప్రాధాన్యం ఇచి్చంది. ఈ సారి కూడా బీజేపీ ఎన్డీపీపీ కలిసి పోటీ చేయనున్నాయి. ఎన్డీపీపీ 40 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంటే బీజేపీ 20 స్థానాలకే పరిమితమైంది. గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్‌ను పరిశీలిస్తామన్న హామీతో బీజేపీ అత్యధిక సీట్లలో విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించవచ్చునన్న ఆశతో ఉంది. రాష్ట్ర జనాభాలో 88 శాతం క్రిస్టియన్లు ఉన్నారు. బీజేపీ అందరితోనూ రాజీపడుతూ నాగాలాండ్‌లో పట్టు బిగించాలని చూస్తోంది. క్రిస్టియన్ల ఓటు బ్యాంకుపైనే గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్ 23 సీట్లలో మాత్రమే పోటీకి దిగింది. గత రెండు సార్లు ఎన్నికల్ని పరిశీలిస్తే స్థానిక అంశాలపై అంతగా వ్యతిరేకత కనిపించడం లేదు. 2018లో పోటీకి దిగిన అధికార ఎమ్మెల్యేలలో 70 శాతం మంది మళ్లీ నెగ్గడం విశేషం. -
ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంది: ప్రధాని మోదీ
కోహిమా: ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుందని తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాగలాండ్‌లోని ఛుమౌకేదిమా జిల్లాలో ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో నడిపించేవారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో నాగలాండ్‌లో అస్థిరత్వం ఉండేదని మోదీ అన్నారు. అభివృద్ధిని పట్టించుకోకుండా వారసత్వ రాజకీయాలకే ఆ పార్టీ ప్రాధాన్యం ఇచ్చేదని విమర్శలు గుప్పించారు. నాగలాండ్ ప్రజల శ్రేయస్సు, శాంతి, పురోగతే బీజేపీ, ఎన్డీఏ ధ్యేయమని మోదీ అన్నారు. అందుకే తమ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేసినట్లు చెప్పారు. Nagaland CM Neiphiu Rio felicitates PM Narendra Modi ahead of his public address, in Dimapur pic.twitter.com/fIs2IxvzRQ — ANI (@ANI) February 24, 2023 నాగలాండ్‌లో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఫలితాలు ప్రకటిస్తారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ)తో కలిసి పోటీ చేసింది బీజేపీ. దీంతో ఎన్డీఏ కూటమి దాదాపు అన్నిస్థానాల్లో గెలిచింది. ఎన్డీపీపీ నేత నీఫ్యూ రియో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేక చతికిలపడింది. చదవండి: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా! -
Nagaland election: ఆకాశంలో సగమైనా... నాగాలాండ్‌లో మాత్రం శూన్యం
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ఆమె. ఎందులోనూ తక్కువ కాదు. ఆకాశంలో సగం. అన్నింటా కూడా సగం. ఇంటికే పరిమితమనేది గతించిన మాట. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా, ధాటిగా తనను తాను నిరూపించుకుంటోంది. మహిళలు అన్ని రంగాల్లోనూ గణనీయమైన పురోగతి సాధిస్తున్నారు. కానీ నాగాలాండ్‌లో మాత్రం మహిళలు ఒక విషయంలో మరీ వెనకబడ్డారు. ఇక్కడా తప్పు వారిది కాదు... అక్కడి పురుషాధిక్య సమాజానిది. ఆ రాష్ట్రంలో చదువులో, ఉద్యోగాల్లో లేని కట్టుబాటు రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం పెద్ద అడ్డుకట్టగా మారింది. నాగాలాండ్ శాసనసభకు ఇప్పటిదాకా ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు! నాగాలాండ్ 1963లో రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఇప్పటిదాకా శాసనసభకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ 13 సభల్లోనూ మహిళలకు అసలే ప్రాతినిధ్యం దక్కలేదు. 13 ఎన్నికల్లోనూ బరిలో దిగిన మహిళల సంఖ్య కేవలం 20 మాత్రమే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఐదుగురు మహిళలు పోటీ చేశారు. కానీ వీరిలో ముగ్గురికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఓవరాల్‌గా ఇప్పటిదాకా బరిలో దిగిన 20 మందిలో చాలామంది మహిళలకూ అదే ఫలితం దక్కింది! మహిళలు ప్రధాని అవడమే గాక ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టిన మన దేశంలో ఒక్క నాగాలాండ్‌లోనే ఎందుకీ దుస్థితి? అక్కడేమన్నా అక్షరాస్యత తక్కువగా ఉందా అంటే, ఆ సమస్యే లేదు. రాష్ట్రంలో మహిళల్లో కూడా అక్షరాస్యత ఏకంగా 76.11 శాతం. ఇది దేశ సగటు అక్షరాస్యత (64.6 శాతం) కన్నా ఎక్కువ. ఇంత అక్షరాస్యత ఉన్నా నాగా మహిళలు సాటి మహిళలకు ఓటేసేందుకు సుముఖంగా లేరు! రాష్ట్ర మొత్తం ఓటర్ల సంఖ్య 13.17 లక్షలు. వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు సగం, అంటే 6.56 లక్షలు. అయినా ఎందుకీ చిన్నచూపు? ఎందుకీ వివక్ష? స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2017లో నాగాలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమై నిరసనలు, ఆందోళనల దాకా వెళ్లింది! అక్కడ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యంపై ఎంత వ్యతిరేక భావన ఉందో దీన్నిబట్టే అర్థమవుతోంది. ఈ రిజర్వేషన్లను నిరసిస్తూ పెద్ద ఎత్తున చెలరేగిన హింసలో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు! రాజ్యాంగంలోని 371 (ఎ) ఆర్టికల్‌లో పేర్కొన్న ప్రత్యేక హక్కులకు ఇది విరుద్ధమన్నది నిరసనకారుల వాదన. నిర్ణయాధికారాల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండకూడదన్నది వారి డిమాండ్. నాగాలాండ్‌లో అత్యధిక శాతం ప్రజలు దీన్ని బలంగా విశ్వసిస్తారు. దీన్ని మార్చేందుకు మహిళల సాధికారత కోసం గళమెత్తే పలు స్వచ్ఛంద సంస్థలు ఎంత కృషి చేసినా లాభం లేకపోయింది. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి నిపూ రియో పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా పెద్దగా ఫలితమైతే లేదు. ఆయన తన నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు మహిళలకు టికెటిచ్చారు. కానీ మొత్తం 60 సీట్ల శాసనసభలో రెండే టికెట్లివ్వడం ఏ మేరకు సమన్యాయం చేసినట్టవుతుందో! కాంగ్రెస్, బీజేపీ అయితే మహిళలకు ఒక్కో టికెట్‌తోనే సరిపెట్టాయి. ప్రజలతో పాటు పార్టీలు కూడా మహిళల రాజకీయ ప్రాతినిధ్యానికి సరైన ప్రాధాన్యమివ్వడం లేదని ఈ సీట్ల కేటాయింపు చెప్పకనే చెబుతోంది. పార్లమెంటులో కూడా నాగాలాండ్ మహిళలకు దక్కిన ప్రాతినిధ్యం స్వల్పాతిస్వల్పం. అప్పుడెప్పుడో 1977లో రానో షైజా లోక్‌సభకు ఎన్నికవగా, తాజాగా 2022లో ఫంగ్నోన్ కొన్యాక్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రజలతో పాటు పార్టీల వైఖరి కూడా మారినప్పుడు మాత్రమే నాగాలాండ్ అసెంబ్లీలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం దక్కుతుంది. నాగాలాండ్ అసెంబ్లీకి మేఘాలయ, త్రిపురలతో పాటు ఈ నెలాఖర్లోగా పోలింగ్ పూర్తవుతుంది. త్రిపురకు ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు 27న పోలింగ్ జరగనుంది. కేవలం ఆరుగురు మహిళలు మాత్రమే నామినేషన్ వేశారు. వారిలో ఇద్దరు అధికార ఎన్డీపీపీ అభ్యర్థులు, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్కో అభ్యర్థి మిగలగా మరో ఇద్దరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆ నలుగురిలో ఒక్కరైనా నెగ్గి చరిత్ర సృష్టిస్తారో లేదో చూడాలి. కనీసం సగం మందైనా గెలిస్తే మహి ళల రాజకీయ ప్రాతినిధ్యంపై నాగాలాండ్ ప్రజ ల్లో ఉన్న విముఖత మెల్లమెల్లగా తొలగిపోతున్నట్టు భావించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం మార్చి 2న వెలువడే ఫలితాల్లో లభిస్తుంది. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీ ఏకగ్రీవ గెలుపు
కోహిమా: భారత ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. కాగా, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగనుంది. మార్చి 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నాగాలాండ్ అసెంబ్లీలో 60 స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నది. అయితే, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాగాలాండ్‌లో అధికారం చేజిక్కించుకోవాలనుంటున్న కాంగ్రెస్ పార్టీకి హస్తం పార్టీ నేత షాకిచ్చారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అకులుటో స్థానం నుంచి బరిలోకిదిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖేకషే సుమీ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శుక్రవారం.. ఆఖరి క్షణాల్లో తాను పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం, తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో, కాంగ్రెస్ బిగ్ షాక్ తగలింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత నామినేషన్ ఉపసంహరణ బీజేపీకి కలిసివచ్చింది. ఖేకషే సుమీ నామినేషన్ విత్ డ్రా కావడంతో ఆ స్థానంలో ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి కఝెటో కినిమీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో ఉన్న ఇద్దరిలో ఒకరు తప్పుకోవడంతో 68 ఏండ్ల కినిమీ యునానిమస్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కినిమీ ఎమ్మెల్యేగా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. -
ఆ బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి మంత్రి ఫిదా!
చిన్నారులకు సంబంధించిన పలు వీడియోలు చూసి ఉంటాం. వాటిల్లో వాళ్ల అమ్మనాన్నలు లేదా గురువులు వారి చేత దగ్గరుండి పాడించటం లేదా డ్యాన్సులు చేయించడం వంటివి చేస్తారు. అప్పుడూ ఎవరైన ధైర్యంగా చేయడం వేరు. కానీ ఇక్కడొక బుడ్డోడు మాత్రం పాఠశాలలో తన క్లాస్మేట్స్ అందరి ముందు ఏ మాత్రం బెణుకులేకుండా భలే అద్భుతంగా పాట పాడాడు. అతను పాడే విధానం ఏదో ఒక పెద్ద స్టార్ సింగర్ మాదిరి ఓ రేంజ్లో మంచి కాన్ఫిడెన్స్‌తో పాడాడు. దీన్ని చూసి నాగాలాండ్ ఉన్నత విద్య, గిరిజన వ్యవహారాల మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఫిదా అయ్యారు. ఇలాంటి ఆత్మవిశ్వాసమే జీవితంలో కావలని క్యాప్షెన్న్ జోడించి మరీ అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆత్మివశ్వాసం అంటే భయం లేకపోవడం కాదు, దానిని ఎదుర్కొంటూ ముందుగు సాగే సామర్థ్యం! అని చెబుతూ ఆ పిల్లవాడికి హ్యాట్సాప్ అంటూ ప్రశంసిస్తూ.. ట్వీట్ చేశారు. Bas itna confidence chahiye life me. 😀 "ज़िन्दगी जीने के लिए नज़रो की नहीं ! नज़ारो की ज़रूरत होती है !!" pic.twitter.com/EcGrUnXtUi — Temjen Imna Along (@AlongImna) January 18, 2023 (చదవండి: మోదీ ఇలా అనడం తొలిసారి కాదు!: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు) -
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
ఈశాన్య రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా
-
Viral Video: ‘మయన్మార్‌లో తింటే.. భారత్‌లో పడుకుంటారు’
నాగాలాండ్ మంత్రి టెన్జెన్ ఇమ్నా ఓ ఆసక్తికర వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ఇది భారత్, మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఓ ప్రత్యేకమైన గ్రామం గురించి తెలియజేస్తుంది. నాగాలాండ్‌లోని మోన్జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో లాంగ్వా ఒకటి. నాగాలాండ్ రాజధాని కొహిమాకు 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం భారత్, మయన్మార్ దేశాల సరిహద్దులుగా కలిగి ఉండటమే దీని ప్రత్యేకత లాంగ్వా గ్రామానికి ఓ వైపు మయన్మార్ దట్టమైన అడువులు ఉండగా.. మరోవైపు భారత్‌లోని వ్యవసాయ భూమి సరిహద్దుగా కలిగి ఉంది. 1970లో భారతదేశం, మయన్మార్ మధ్య సరిహద్దులు సృష్టించడానికి చాలా కాలం ముందే లాంగ్వా గ్రామం ఏర్పడింది. అధికారులు సరిహద్దు రేఖను గీస్తున్నప్పుడు, వారు తమ కమ్యూనిటీ విభజించేందుకు అంగీకరించలేదు. దీంతో గ్రామం గుండా సరిహద్దు గీశారు. అందుకే ఒక సరిహద్దు పిల్లర్‌పై బర్మీస్ బాషలో రాసి ఉంటే మరో పిల్లర్‌పై హిందీలో రాసి ఉంటుంది. లాంగ్వాలో కొన్యాక్ నాగా తెగకు చెందిన వారే అధికంగా నివసిస్తుంటారు. నాగాలాండ్‌లో గుర్తింపు పొందిన 16 గిరిజనుల్లో కొన్యాక్ తెగ అతి పెద్దది. కొన్యాక్ తెగకు ఆంగ్ అనే వ్యక్తి అధిపతిగా పిలవబడుతుంటాడు. లాంగ్వా గ్రామం భారత్, మయన్మార్ దేశాలను సరిహద్దులుగా కలిగి ఉన్నప్పటికీ ఓకే వ్యక్తి దీనిని పాలిస్తున్నాడు. అతని పాలన 75 గ్రామాలకు విస్తరించింది. ఇందులో కొన్ని మయన్మార్‌కు, మరికొన్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వానికి తన ప్రజలకు ఆంగ్ వారధిగా వ్యవహరిస్తుంటారు. అంతేగాక మయన్మార్, భారత్ సరిహద్దు రేఖ ఇతని ఇంటి గుండా వెళుతుంది. ఇతని ఇళ్లు ఇండియా, మయన్మార్‌ను వేరు చేస్తుంది. ఇంట్లోని సగభాగం భారత్‌లో ఉంటే మిగిలిన సగం మయన్మార్‌కు చెందుతుంది. అంటే ఆంగ్ తమ కిచెన్ నుంచి బెడ్ రూమ్‌లోకి వెళ్లాడమంటే ఏకంగా దేశ సరిహద్దు దాటడమే అన్నట్లు. అంతేగాక ఈ సరిహద్దు లాంగ్వా ప్రజలను విభజించడానికి బదులు రెండు దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. ఈ గ్రామం గుండా మొత్తం నాలుగు నదులు ప్రవహిస్తుండగా అందులో రెండు భారత్ భూభాగంలో ఉండగా.. మరో రెండు నదులు మయన్మార్ భూభాగం పరిధిలోకి వస్తాయి. దీనిని నాగాలాండ్ మంత్రి ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో ఆ కుటుంబం ఇండియాలో నిద్రపోతే(బెడ్రూం).. మయన్మార్‌లో తింటారు(కిచెన్) అంటూ నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. OMG | यह मेरा इंडिया To cross the border, this person just needs to go to his bedroom. बिलकुल ही "Sleeping in India and Eating in Myanmar" वाला दृश्य😃 @incredibleindia @HISTORY @anandmahindra pic.twitter.com/4OnohxKUWO — Temjen Imna Along (@AlongImna) January 11, 2023 -
రంజీ ట్రోఫీ చరిత్రలో నాలుగో అత్యల్పం.. నాగాలాండ్ చెత్త రికార్డు
రంజీ ట్రోఫీలో నాలుగో అత్యల్ప స్కోరు నమోదైంది. 2022-23 రంజీ ట్రోఫీలో భాగంగా నాగాలాండ్ జట్టు అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాగాలాండ్ 25 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా రంజీ చరిత్రలోనే నాలుగో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా రికార్డును సాధించింది. డిమాపుర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 25 పరుగులకే కుప్పకూలింది. కేవలం 18 ఓవర్లు మాత్రమే ఆడింది. ఉత్తరాఖండ్ బౌలర్లు మయాంక్ మిశ్రా, స్పప్నిల్ సింగ్ ఇద్దరే నాగాలాండ్ పతనాన్ని శాసించారు. ఫలితంగా ఉత్తరాఖండ్ 174 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మయాంక్ మిశ్రా 9 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 ఓవర్లు మెయిడెన్లు కావడం విశేషం, మరోపక్క స్వప్నిల్ సింగ్ 9 ఓవర్లు బౌలింగ్ చేసి 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇందులో 5 మెయిడెన్లు ఉన్నాయి. వీరిద్దరూ కలిపి 9 వికెట్లు తీయగా.. నాగాలాండ్ ఓపెనర్ యుగంధర్ సింగ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ జట్టు బ్యాటర్లలో నాగావో చిషి ఒక్కడే 10 పరుగులతో డబుల్ డిజిట్ స్కోరును అందుకోగలిగాడు. మిగిలివారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. వీరిలో ఆరుగురు డకౌట్లుగా నిలవడం గమనార్హం. 1951-52 సీజన్లో ముంబయిపై సౌరాష్ట్రా చేసిన స్కోరును తాజాగా నాగాలాండ్ సమం చేసింది. ఇక రంజీ చరిత్రలో అత్యల్ప స్కోరు హైదరాబాద్ పేరిట ఉంది. 2010-11 సీజన్లో రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 21 పరుగులకే ఆలౌటైంది. ఇక 1934-33 సీజన్లో నార్తర్న్ ఇండియాపై సదరన్ పంజాబ్ జట్టు 22 పరుగులతో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. 23 పరుగులతో సింద్, జమ్మూ-కశ్మీర్ మూడో అత్యల్ప స్కోర్లు చేశాయి. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యల్ప స్కోరు ఇంగ్లాండ్‌లో నమోదైంది. 1810లో లార్డ్స్ ఓల్డ్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బీఎస్ జట్టు 6 పరుగులకే ఆలౌటైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 10 కంటే తక్కువ స్కోరు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా రంజీ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్లలో నాగాలాండ్ కూడా చోటు దక్కించుకుంది. నాగాలాండ్ తన తదుపరి మ్యాచ్‌ను ఉత్తరప్రదేశ్, ఇలైట్ గ్రూప్-ఏతో ఆడనుంది. చదవండి: బిగ్‌బాష్ లీగ్‌లో సంచలనం..15 పరుగులకే ఆలౌట్ రోహిత్ కోసం సెంచరీ చేసినోడిని పక్కనబెడతారా? -
భారత్‌లో ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి..
వైవిధ్యమైన సంస్కృతికి, గొప్ప వారసత్వ సంపదకు నిలయం భారత్. పర్యాటకులను కట్టిపడేసే ఎన్నో ప్రకృతి సోయాగాలు మన దేశంలో ఉన్నాయి. అయితే భారత ఉపఖండంలోని మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించడం ఒకేలా ఉండదు. ముఖ్యంగా 6 పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా ఇన్నర్ లోన్ పర్మిట్(ఐఎల్పీ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లేకపోతే ఆ చోటుకు అసలు అనుమతించరు. ఐఎల్పీ పర్మిషన్ అంటే? ఇన్నర్ లోన్ పర్మిట్ అనేది కొత్తదేమీ కాదు. ఎప్పటి నుంచో అమల్లో ఉన్నదే. ఇతర దేశాలతో సరిహద్దు పంచుకునే సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు మాత్రమే ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. తరచూ పర్యటనలకు వెళ్లేవారికి దీని గురించి తెలిసే ఉంటుంది. ఆదివాసీ తెగల సంక్షేమంతో పాటు పర్యాటకులకు భద్రత కల్పించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఆరు ప్రదేశాలు ఇవే.. అరుణాచల్ ప్రదేశ్: గొప్ప సంస్కృతికి నిలయమైన ఈ ఈశాన్య రాష్ట్రం.. చైనా, భూటాన్, మయన్మార్ దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది. అందుకే ఈ ప్రాంతంలో పర్యటించాలనుకునే సందర్శకులు కోల్‌కతా, ఢిల్లీ, షిల్లాంగ్, గువాహటి రెసిడెంట్ కమిషనర్ల నుంచి ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక్కో సందర్శకుడు రూ.100 చెల్లించాలి. నెల రోజుల పాటు అనుమతి ఉంటుంది. నాగలాండ్.. సంప్రదాయ తెగలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్‌తో సరిహద్దు కలిగి ఉంది. ఈ సున్నితమైన ప్రాంతంలో పర్యటించాలనుకునే వారు ఢిల్లీ, కోల్‌కతా, కోహిమా, దిమాపూర్, షిల్లాంగ్, మొక్కోచుంగ్ డిప్యూటీ కమిషనర్ల నుంచి అనుమతి తీసుకోవచ్చు. లక్షద్వీప్.. భారత్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇదీ ఒకటి. అందమైన బీచ్‌లు, రుచికరమైన ఆహారానికి నిలయం. ఈ ప్రాంతంలో పర్యటించాలంటే పోలీస్ క్లియరెన్స్‌తో పాటు స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. మిజోరం.. ప్రకృతి సోయగాలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్, బంగ్లాదేశ్‌తో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉంది. ఆదివాసీలకు నిలయమైన ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ఏఎల్పీ తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సిల్చార్, కోల్‌కతా, షిల్లాంగ్, ఢిల్లీ, గువాహటి లీయాసోన్ అధికారుల నుంచి దీన్ని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విమానంలో వెళ్తే.. ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి ప్రత్యేక పాసులు తీసుకోవాలి. సిక్కిం.. భారత్‌లోని అతిచిన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. హిమాలయాలకు ప్రవేశ ద్వారం. అందమైన పచ్ఛికభూములు, అద్భుతమైన వంటకాలు, అనేక మఠాలు, స్పటిక సరస్సులు, కట్టిపడేసే ప్రకృతి అందాలకు నిలయం. మునుపెన్నడూ పొందని అనుభూతిని పర్యాటకులు ఇక్కడ పొందుతారు. సిక్కింలోని సోమ్గో, బాబా మందిర్ ట్రిప్, సింగలీలా ట్రెక్, నాథ్లా పాస్, జోంగ్రీ ట్రెక్, తంగు చోప్తా వ్యాలీ ట్రిప్, యుమెసామ్‌డాంగ్, యమ్తాంగ్, జోరో పాయింట్ ట్రిప్ వంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. లద్దాక్.. ప్రతి పర్యాటకుడు ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రాంతం ఇది. ఐఎల్పీ లేనిదే ఇక్కడకు రానివ్వరు. నుబ్రా వ్యాలీ, ఖార్డంగ్ లా పాస్, తో మోరిరి సరస్సు, పాంగాంగ్ త్సో సరస్సు, దాహ్, హను విలేజ్, న్యోమా, టర్టక్, డిగర్ లా, తంగ్యార్ వంటి ప్రదేశాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి. -
‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు.. కానీ’.. మరోమారు వార్తల్లోకి ఆ మంత్రి
కోహిమా: పరిస్థితులు ఎలా ఉన్నా సందర్భానుసారం నవ్వులు పూయించటంలో కొందరు నిష్ణాతులుంటారు. అలాంటి వారిలో నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఒకరు అని చెప్పకతప్పదు. తనలాగే ఒంటరిగా ఉండండంటూ జనాభా పెరుగుదలపై చమత్కారమైన సలహా ఇచ్చి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారు. అంతకు ముందు ఈశాన్య ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని జాత్యాహంకార వ్యాఖ్యలపైనా తనదైన శైలీలో సమాధానమిచ్చి వార్తల్లో నిలిచారు మంత్రి టెమ్జెన్. తాజాగా మరోమారు ‘చిన్న కళ్లు’ వ్యాఖ్యలతో వైరల్‌గా మారారు. తాజాగా తన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు మంత్రి టెమ్జెన్. తాను ఎల్లప్పుడూ ఫోటో పోజులకు రెడీ అని పేర్కొన్నారు. తనకు ఉన్న చిన్న కళ్లతోనే మైల్ దూరంలో ఉన్న కెమెరాలను గుర్తించగలనని చమత్కరించారు. ‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు.. కానీ, ఒక మైల్ దూరం నుంచి నేను కెమెరాను చూస్తాను. ఎల్లప్పుడూ పోజ్‌కు రెడీ. ఇది చదువుతున్నప్పుడు మీ పెదాలపై చిరునవ్వును చూస్తాను.’ అంటూ ట్వీట్ చేశారు. ఆదివారం ఉదయం ఫోటో షేర్ చేయగా కొన్ని గంటల్లోనే ఐదు వేల వరకు లైకులు, వందల కొద్ది కామెంట్లు వచ్చాయి. లాఫింగ్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. మీరు మమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారనే దాంట్లో ఎలాంటి సందేశం లేదు అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. దేశంలోనే అత్యంత వినోదభరితమైన మంత్రిగా మరొకరు పేర్కొన్నారు. My eyes may be small, but I can see the camera from a mile. Always pose ready. 📸 Also I can see you smile as you reading it! 😉 Good Morning pic.twitter.com/7ntWw5UMVx — Temjen Imna Along (@AlongImna) October 9, 2022 ఇదీ చదవండి: బార్కొలానా వీక్.. సముద్రంపై ‘తెరచాప’ పడవల పందెం -
నాలాగే ఒంటరిగా ఉండండి!... అంటూ పిలుపునిచ్చిన మంత్రి!
జులై 11 ప్రపంచ జనాభా దినోత్వం సందర్భంగా నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ కుటుంబ నియంత్రణపై అవగాహన పెంపొందించుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు పనిలో పనిగా జనాభా నియంత్రణ కోసం ఒక చిన్న పరిష్కార మార్గాన్ని కూడా సూచించారు. గత నెలలో ఈ శాన్య ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని అందరూ అంటారు గానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పి వార్తల్లో నిలిచారు. మళ్లీ మరోసారి కుటుంబ నియంత్రణ అంశంపై చాలా చమత్కారమైన పరిష్కార మార్గం చెప్పి మరోసారి వార్తలో నిలిచారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే....ఇది చాలా సున్నితమైన విషయం. జనాభా పెరుగుదలను నియంత్రించటం కోసం మనం సరైన మార్గాన్ని ఎంచుకుందాం. లేదా నాలాగే సింగిల్‌గా ఉంటూ...అందరం కలసి స్థిరమైన భవిష్యత్తు కోసం పాటుపడదాం. ఈ రోజు నుంచే సింగిల్ ఉద్యమంలో పాల్గొనండి అని నాగాలాండ్ మంత్రి ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు నాగాలాండ్ మంత్రికి చక్కటి హాస్య చతురత ఉందంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. On the occasion of #WorldPopulationDay, let us be sensible towards the issues of population growth and inculcate informed choices on child bearing. Or #StaySingle like me and together we can contribute towards a sustainable future. Come join the singles movement today. pic.twitter.com/geAKZ64bSr — Temjen Imna Along (@AlongImna) July 11, 2022 (చదవండి: రాష్ట్ర సీఎంను ఇలాగే ఆహ్వానిస్తారా?.. బీజేపీపై టీఎంసీ ఆగ్రహం) -
సాహసోపేత నిర్ణయం
అస్సాం, మేఘాలయ మధ్య సరిహద్దు ప్రాంతాల ఒప్పందం కుదిరిన నాలుగు రోజుల్లోనే ‘ఈశాన్యం’ నుంచి మరో మంచి కబురు వినబడింది. అస్సాం, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అమల్లో ఉంటున్న సాయుధ దళాల (ప్రత్యేకాధికారాల) చట్టాన్ని చాలా ప్రాంతాల్లో ఉపసంహరించుకుంటున్నారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావలసి ఉంది. అస్సాంలో మొత్తం 23 జిల్లాల్లో ఈ చట్టాన్ని పూర్తిగా, ఒక జిల్లాలో పాక్షికంగా ఉపసంహరించు కుంటున్నారు. గత డిసెంబర్లో సైన్యం ఒక వాహనంపై గురిచూసి కాల్పులు జరిపిన ఉదంతంలో 14 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయాక ఈ చట్టం అమలు నిలిపేయాలంటూ ఉద్యమించిన నాగాలాండ్‌లో మూడు జిల్లాల్లో పూర్తిగా, నాలుగు జిల్లాల్లో పాక్షికంగా ఉపసంహరిస్తున్నారు. తరచి చూస్తే ఇక్కడ 25 శాతం ప్రాంతం మాత్రమే ఆ చట్టం నుంచి విముక్తి పొందుతుంది. మణిపూర్‌లో ఆరు జిల్లాల్లో పాక్షికంగా తొలగిస్తున్నారు. కొండ ప్రాంత జిల్లాలన్నీ ఈ చట్టం నీడలోనే ఉంటాయి. బయటినుంచి చూసేవారికి ఒక చట్టం అమలును పూర్తిగానో, పాక్షికంగానో తొలగించడం పెద్ద విశేషంగా అనిపించకపోవచ్చు. కానీ ఆ రాష్ట్రాల పౌరులకు మాత్రం ఇది ఊహకందని అసాధారణ పరిణామం. వారికిది అరవైయ్యేళ్లుగా గుండెల మీది కుంపటి. హక్కుల సంఘాల నేతలు భిన్న సందర్భాల్లో చెప్పినట్టు ఈ చట్టం మృత్యువు పడగనీడ లాంటిది. ఆ పరిధిలో జీవించేవారు ఎవరైనా చిత్రహింసలు అనుభవించాల్సి రావొచ్చు. ఏ పౌరుడి దగ్గరైనా ఆయుధాలున్నాయని లేదా మిలి టెంట్లు తలదాచుకుని ఉండొచ్చని సాయుధ దళాలకు ‘సహేతుక మైన సంశయం’ వస్తే వారెంట్ అవసరం లేకుండానే అరెస్టు చేయొచ్చు. ప్రమాదకర వ్యక్తిగా అనుమానిస్తే కాల్చి చంపొచ్చు. సైన్యా నికి మాత్రమే కాదు... ఆ మాదిరి విధులు నిర్వర్తించే పోలీసులకు సైతం ఈ అధికారాలన్నీ ఉంటాయి. చట్టంలోని సెక్షన్ 3 కింద ఒక ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన మరుక్షణం నుంచి ఈ అపరిమిత అధికారాలు దఖలు పడతాయి. అందుకే దీన్ని స్వాతంత్య్రానంతరం తీసు కొచ్చిన అత్యంత కఠినమైన చట్టంగా అభివర్ణిస్తారు. కల్లోలిత ప్రాంతాల్లో నకిలీ ఎన్కౌంటర్లు, మహిళలపై అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయని తరచు ఆరోపణలు రివాజు. ఇదెంతవరకూ వచ్చిందంటే 2004లో మణిపూర్‌లో తంగజం మనోరమ చాను అనే మహిళను అరెస్టుచేసి చంపేశా రని ఆగ్రహించిన మహిళలు సైనికులు బస చేసిన భవనం ముందు వివస్త్రలుగా నిరసనకు దిగారు. ఈ చట్టం రద్దు కోసమే మణిపూర్‌కు చెందిన ఇరోం షర్మిల పదహారేళ్లపాటు నిరాహార దీక్ష చేశారు. సుప్రీంకోర్టులో 2012లో బూటకపు ఎన్కౌంటర్లపై పిటిషన్ దాఖలైన తర్వాతే చట్టం ఎంత కఠినమైనదో దేశమంతటికీ అర్థమైందని చెప్పాలి. 1979 మే మొదలుకొని 2012 వరకూ జరిగిన నకిలీ ఎన్కౌంటర్లలో తమ ఆప్తులు 1,528 మంది బలయ్యారని ఆ పిటిషన్ దాఖలు చేసిన వివిధ కుటుంబాలవారు ఆరోపించారు. వీరంతా మణిపూర్‌కు చెందినవారు. ఇందులో వాస్తవాలు నిర్ధారిం చేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఆరు ఉదంతాలను ఎంపికచేసి వాటిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలంటూ ఒక కమిషన్‌ను నియమించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిశీలించాక ఆ ఉదం తాల్లో మరణించినవారు అమాయకులేనని కమిషన్ నిర్ధారించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే నేతృత్వంలో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జేఎం లింగ్డో, మాజీ ఐపీఎస్ అధికారి ఏకే సింగ్ అందులో సభ్యులు. సాయుధ దళాల చట్టంకింద విధులు నిర్వర్తిస్తుం డగా ఇవి చోటుచేసుకున్నాయి గనుక, తమపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లు కొట్టేయాలని 350 మంది జవాన్లు ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శత్రువులని అనుమానం కలిగినంత మాత్రాన, ఆరోపణలొచ్చినంత మాత్రాన పౌరులను కాల్చిచంపడమంటే ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడినట్టేనని 2016లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అధికారంలోకొచ్చాక చట్టాన్ని రద్దుచేస్తామని లేదా సరళీకరిస్తామని చెప్పిన యూపీఏ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. చట్టం రద్దు తక్షణావసరమని కమిషన్ సిఫార్సు చేసింది. అన్ని వర్గాలనుంచీ మద్దతు లభించినా సైన్యం కాదనడంతో యూపీఏ వెనకడుగేసింది. తొలుత 2015లో త్రిపురలో మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సీపీఎం ప్రభుత్వం ఈ చట్టం అమలు నిలిపేసి చరిత్ర సృష్టించగా, తాజాగా మూడు రాష్ట్రాల్లో గణనీయమైన ప్రాంతాల్లో చట్టం ఉపసంహరించి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తాము ఉపసంహరించాలనుకుంటున్నా సైన్యం వినడం లేదని యూపీఏ ఏలుబడిలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం సిగ్గు విడిచి చెప్పడం ఎవరూ మరిచిపోరు. సంకల్పశుద్ధి ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే అన్ని పక్షాలనూ ఒప్పించడం అసాధ్యమేమీ కాదని కేంద్రం నిరూపించింది. చట్టాన్ని పౌరులు గౌరవించాలంటే ఆ చట్టం పౌరులపట్ల బాధ్యతాయుతంగా మెలగాలి. ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు అన్నిచోట్లా ప్రధాన మిలిటెంట్ బృందాల ప్రభావం మునుపటితో పోలిస్తే దాదాపు లేనట్టే. పైగా అవన్నీ కేంద్రంతో భిన్న సందర్భాల్లో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఒకటి రెండు సంస్థలు ఉనికి చాటుకుంటున్నా వాటికి ప్రజాదరణ లేదు. ఈశాన్యంలో ఇతరచోట్లా, జమ్మూ, కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సైతం సమీప భవిష్యత్తులో ఈ చట్టం రద్దుకు అనువైన పరిస్థితులు ఏర్పడ తాయనీ, ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందనీ ఆశించాలి. -
చరిత్ర సృష్టించిన ధోని జట్టు.. ఏకంగా 1008 పరుగుల ఆధిక్యంతో..!
Jharkhand Sets World Record In First Class Cricket: రంజీ ట్రోఫీ 2022లో భాగంగా నాగాలాండ్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సొంత జట్టు జార్ఖండ్ రికార్డుల మోత మోగించింది. ఏకంగా 1008 పరుగుల లీడ్‌ని సాధించి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 1000కి పైగా లీడ్ సాధించిన ఏకైక జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో ముంబై (1948-49లో మహారాష్ట్రపై 958 పరుగుల లీడ్) రికార్డ్‌ని బద్ధలు కొట్టడంతో పాటు మ్యాచ్‌ను డ్రా చేసుకుని క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే, ఈ మ్యాచ్ ద్వారా జార్ఖండ్ జట్టు పలు అపప్రదలను కూడా మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 591 పరుగుల ఆధిక్యం లభించినప్పటికీ ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించకపోగా, రెండో ఇన్నింగ్స్‌ని కూడా డిక్లేర్ చేయకుండా ఆడి క్రికెట్ అభిమానుల చీత్కారాలను ఎదుర్కొంది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా.. కేవలం రికార్డుల కోసమే జార్ఖండ్ రెండో ఇన్నింగ్స్ ఆడిందని (ఫాలో ఆన్ ఇవ్వకుండా) నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 880 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ సాధించిన ఈ స్కోర్ రంజీ చరిత్రలో నాలుగో అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. జార్ఖండ్ స్కోర్‌లో 3 శతకాలు, 3 అర్ధ శతకాలు నమోదయ్యాయి. వికెట్‌కీపర్ కుమార్ కుశాగ్రా (266) డబుల్ సెంచరీతో విరుచుకుపడగా, నదీమ్ (177), విరాట్ సింగ్ (107) శతకాలు బాదారు. అనంతరం నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగులకే కుప్పకూలడంతో జార్ఖండ్‌కు 591 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో జార్ఖండ్.. నాగాలాండ్‌ను ఫాలో ఆన్‌కు ఆహ్వానిస్తుందని అంతా ఊహించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జార్ఖండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 591 పరుగులు కలుపుకుని జార్ఖండ్‌కు 1008 పరుగుల ఆధిక్యం లభించింది. చదవండి: పేలిన జార్ఖండ్ డైనమైట్లు.. రంజీ చరిత్రలో భారీ స్కోర్ నమోదు -
పేలిన జార్ఖండ్ డైనమైట్లు.. రంజీ చరిత్రలో భారీ స్కోర్ నమోదు
రంజీ ట్రోఫీ చరిత్రలో నాలుగో అత్యధిక టీమ్ స్కోర్ నమోదైంది. 2022 సీజన్లో భాగంగా నాగాలాండ్‌తో జరుగుతున్న ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 880 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. టోర్నీ చరిత్రలో హైదరాబాద్ (1993/94 సీజన్లో ఆంధ్రపై 944/6) పేరిట అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఉండగా, రెండో అత్యధిక టీమ్ స్కోర్ తమిళనాడు (912/6), మూడో అత్యధిక స్కోర్ మధ్యప్రదేశ్ (912/6) పేరిట నమోదై ఉంది. తాజాగా జార్ఖండ్ 31 ఏళ్ల కిందట (1990/91) ముంబై చేసిన 855/ 6 పరుగుల రికార్డును బద్దలు కొట్టి, టోర్నీ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఝర్ఖాండ్ సాధించిన ఈ రికార్డు స్కోర్‌లో 3 శతకాలు, 3 అర్ధ శతకాలు నమోదు కాగా, ఇందులో ఓ ద్విశతకం, ఓ భారీ శతకం ఉంది. 17 ఏళ్ల యువ వికెట్‌కీపర్, 2020 భారత అండర్ 19 ప్రపంచకప్ జట్టు సభ్యుడు కుమార్ కుశాగ్రా డబుల్ సెంచరీ (270 బంతుల్లో 266; 37 ఫోర్లు, 2 సిక్సర్లు)తో విరుచుకుపడగా, నదీమ్ (304 బంతుల్లో 177; 22 ఫోర్లు, 2సిక్సర్లు), విరాట్ సింగ్ (153 బంతుల్లో 107; 13 ఫోర్లు)లు శతకాలు బాదారు. కుమార్ సూరజ్ (92 బంతుల్లో 69; 11 ఫోర్లు, సిక్స్), అంకుల్ రాయ్ (88 బంతుల్లో 59; 7 ఫోర్లు), రాహుల్ శుక్లా (149 బంతుల్లో 85 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు)లు అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిలో రాహుల్ శుక్లా 11వ నంబర్ ఆటగాడిగా వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి అజేయ అర్ధ సెంచరీ సాధించడం విశేషం. జార్ఖండ్ ఇన్నింగ్స్ అనంతరం బరిలోకి దిగిన నాగాలాండ్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. చదవండి: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం -
మేఘం వన్నె చిరుత.. సోషల్ మీడియాలో వైరల్
న్యూఢిల్లీ: మేఘం వన్నె చిరుతలు బయట కనిపించడం ఇప్పటి వరకు బహు అరుదు. సాధారణంగా తక్కువ ఎత్తులో ఉండే సతత హరిత అరణ్యాలలో కనిపించే ఈ రకమైన చిరుతలు మొట్టమొదటిసారిగా భారత్–మయన్మార్ సరిహద్దుల్లో నాగాలాండ్‌లోని 3,700 మీటర్ల ఎత్తైన పర్వత ప్రాంతా ల్లో కనిపించింది. 2020 జనవరి–జూన్ నెలల మధ్యలో పరిశోధకులు అమర్చిన 37 కెమెరాలు వీటి కదలికలను రికార్డు చేశాయి. భారత్‌లో ఇంత ఎత్తైన ప్రాంతాల్లో ఇవి కనిపించడం తొలిసారని పరిశోధకులు అంటున్నారు. ఈ రకం చిరుతలు ఇండోనేసియాతోపాటు హిమాలయ పర్వతాల్లో నివసిస్తుంటాయి. చాలా అరుదుగా కనిపిస్తుండటం తో వీటిని అంతరించిపోయే జాతిగా భావిస్తున్నారు. నాగాలాండ్‌లోని 65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని థానమిర్ కమ్యూనిటీ అటవీ ప్రాంతం లోని 7 చోట్ల ఇటువంటి చిరుతలు రెండు పెద్దవి, రెండు కూనలు కనిపించినట్లు వైల్డ్‌లైఫ్‌ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా(డబ్ల్యూపీఎస్ఐ) తెలిపింది. సుమారు 3,700 మీటర్ల ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోనూ ఇవి మనుగడ సాగించగలవని తాజా పరిశీలనతో రుజువైందని డబ్ల్యూపీఎస్ఐ పేర్కొంది. -
తప్పు చేసినా శిక్షకు అతీతులా?
ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్‌లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌ను పరిశీలించడానికి ఒక కమిటీని నియమించిన కేంద్రం కమిటీ నివేదిక ఇవ్వక ముందే ఆ రాష్ట్రంలో మరో ఆరు నెలలు చట్టాన్ని పొడిగిస్తున్నట్లు చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. డిసెంబర్ 4న నాగాలాండ్‌లో 13 మంది అమాయక పౌరులను తీవ్రవాదులుగా భావించి సాయుధ దళాలు కాల్చి చంపిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం ఇది పొరపాటున జరిగిన సంఘటన అని క్షమాపణలు చెప్పింది. నిజానికి ఇటువంటి సంఘటనలు ఈ చట్టం అమలులో ఉన్న ఈశాన్య భారతంలో సాధారణమే. తమను ఎవరూ శిక్షించలేరనీ, తాము శిక్షాతీతులమనీ భావిస్తున్న సైనిక దళాలు ఎన్నో అమానవీయ దురంతాలకు పాల్పడ్డాయి. ఒకప్పుడు రామ్వా గ్రామం వద్ద ఉన్న అస్సాం రైఫిల్స్ జవాన్లను ఆ గ్రామస్థులు క్రిస్మస్ వేడుకలకు ఆహ్వానించేవారు. అందుకే జవాన్లు ఈ ఏడాది కూడా రెండు కొత్త వాలీబాళ్లు, ఒక నెట్ బహుమతులుగా తీసుకొని రామ్వాకు వెళ్ళారు. కానీ గ్రామస్థులు ఆ బహుమతులను స్వీకరించడానికి నిరాకరించడంతో వారు విస్మయం చెందారు. తమతో ఫొటో దిగటానికి సైతం అక్కడి ఫుట్‌బాల్ క్రీడాకారులు నిరాకరిం చడం వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసింది. గ్రామీణుల ఈ ప్రవర్తనకు అత్యంత ముఖ్యమైన కారణమే ఉంది. రామ్వా, మణిపూర్‌లోని ఉఖ్రుల్–ఇంఫాల్ రహదారిలో ఉన్న ఒక చిన్న గ్రామం. నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో డిసెంబర్ 4న భారత భద్రతా దళాలు జరిపిన కాల్పులకు నిరసనగా అస్సాం రైఫిల్స్ సిబ్బంది రాకను గ్రామస్థులు హర్షించలేకపోయారు. నాటి కాల్పుల్లో ఏడుగురు బొగ్గు గని కార్మికులతో సహా 13 మంది పౌరులు మరణిం చారు. మణిపూర్ నాగాలకు, నాగాలాండ్ నాగాలకు మధ్య కనిపిస్తున్న ఈ సంఘీభావం వారిలో సైనిక దళాల పట్ల పెరిగిపోతున్న క్రోధానికి, పరాయీకరణ భావానికి ప్రతిబింబం అనవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం సంఘటనను ‘పొరపాటు’ పేరుతో దాటవేయడానికి ప్రయ త్నించింది. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో క్షమాపణ కూడా చెప్పారు. కానీ నాగాలు మోన్ కాల్పులను, అంతకు ముందు జరిగిన దురం తాల నుంచి వేరుగా చూడటం లేదు. శిక్ష పడుతుందనే భయం ఏ కోశానా లేని సైనిక దళాల సంస్కృతిలో ఒక భాగంగానే దీన్నీ చూస్తున్నారు. సీనియర్ కార్యకర్తగా, శాంతి ప్రక్రియలో దీర్ఘకాలం పాల్గొంటూ వచ్చిన డాక్టర్ అకుమ్ లాంగ్చారి... ‘‘భారత సైన్యంలోని 21వ పారా స్పెషల్ ఫోర్స్‌పై టిజిత్ పోలీస్ స్టేషన్ సుమోటో ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. అందులో ‘ఎలాంటి రెచ్చగొట్టే చర్యలూ ఎదురుకాక పోయినా వాహనంపై భద్రతా దళాలు గుడ్డిగా కాల్పులు జరిపాయి, ఫలితంగా అనేక మంది ఒటింగ్ గ్రామస్థుల హత్యలు జరిగాయి. అలాగే చాలా మంది తీవ్రంగా గాయాలపాలయ్యార’’ని పేర్కొన్నారు. అందువల్ల భద్రతా దళాల ఉద్దేశం పౌరులను హత్యచేయడం, గాయ పరచడమేనని స్పష్టమవుతోందని ఆ ఎఫ్ఐఆర్ పేర్కొందని అన్నారు. గత 63 సంవత్సరాలుగా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) విపరిణామాలను పరిశీలిస్తే... తాము ఏం చేసినా తమకు వచ్చే ముప్పేమీ లేదనే ధైర్యంతో సైనిక దళాలు అనేక అకృత్యాలకు పాల్పడ్డాయని అర్థమవుతుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన 1958 నుండి 1979 వరకు, సాయుధ దళాలు ఈశాన్య ప్రాంతంలోని నాగాలు నివసించే ప్రాంతాల్లో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించాయి. ఈ సమయంలో గ్రామాలు కాలి పోయాయి; కుటుంబాలు అడవుల్లో ఆకులు, అలములు తింటూ నివసించాయి; పురుషులు దారుణ హింసకు గురై మరణించారు. మహిళలు అత్యాచారానికి గుర య్యారు. ఇంత భారీ ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు కాకతా ళీయం కాదు. సైనిక శక్తిని ఉప యోగించి తిరుగు బాటును అణచివేసే విధానంలో భాగంగానే ఇన్ని దురంతాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత 1978–79లో నాగాలు మానవ హక్కుల కోసం నాగా పీపుల్స్ మూవ్‌మెంట్‌ను ఏర్పాటు చేసి, తమ బాధలన్నింటినీ డాక్యు మెంట్ చేయడం ప్రారంభించారు. దీంతో దేశమంతటికీ మొదటి సారిగా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం గురించి తెలి సొచ్చింది. 1982 ఆగస్టులో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అనే కొత్త తిరుగుబాటు సంస్థ సైనిక దళాలపై మొదటి మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో కొందరు సైనికులతో పాటు 21వ సిక్కు రెజి మెంట్ ఆఫీసర్ ఒకరు మరణించారు. మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు ఒక మహిళా నిజనిర్ధారణ బృందం వెళ్ళింది. సోషలిస్టు పార్లమెంటు సభ్యు రాలు ప్రమీలా దాదావతే నేతృత్వంలోని బృందంలో నేను కూడా సభ్యు రాలినే. మేము తిరిగి వచ్చి నివేదిక ఇస్తే ప్రచురణకు నోచుకోలేదు. 1983లో నాగా పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఏఎఫ్ఎస్పీఏను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసినప్పుడు, నేను కూడా పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ ప్రతినిధిగా సపోర్టింగ్ పిటిషన్ దాఖలు చేశాను. ఇంతకు ముందు మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌కు పంపారు. కానీ 14 ఏళ్లపాటు అవి విచారణకు నోచుకోలేదు. చివరికి 1997లో సుప్రీంకోర్టు పిటిషన్లను విచారించి సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం చెల్లుబాటును సమ ర్థించింది. తద్వారా ఆ చట్టం ప్రకారం పనిచేస్తున్న సాయుధ దళాలు తప్పు చేయలేదని చెప్పింది. ఇంతలో, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ 1987 జూలైలో మణిపూర్ సేనాపతి జిల్లా ఓనామ్ గ్రామంలో అస్సాం రైఫిల్స్ పోస్ట్‌పై మరో మెరుపుదాడి చేసింది. తమ నుంచి తిరుగుబాటు దారులు దోచుకువెళ్లిన ఆయుధాలను తిరిగి పొందడానికి అస్సాం రైఫిల్స్ ‘ఆపరేషన్ బ్లూబర్డ్’ అనే కోడ్ నేమ్‌తో తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఇది మూడు నెలలకు పైగా కొన సాగింది. ఈ కాలంలో అస్సాం రైఫిల్స్ చేసిన దురాగతాలకు అంతే లేదు. ఇద్దరు గర్భిణీ స్త్రీలు సైనికుల ముందే బహిరంగంగా ప్రస వించవలసి వచ్చింది. ఆపరేషన్ బ్లూబర్డ్ బాధితుల తరఫున నేను కొందరు న్యాయవాదులతో కలసి 1988 నుంచి 1991 వరకు ఈ కేసుపై పోరాడాను. కేసు ముగిసే సమయానికి మానవ హక్కుల ఉల్లంఘనపై దాదాపు పది సంపుటాల సాక్ష్యాలు ఉన్నాయి. అయినా 25 ఏళ్లకు 2019లో హైకోర్టు ఫైళ్లు కనిపించకుండా పోయినందున తీర్పు ఇవ్వలేక పోతున్నట్లు తెలిపింది. మణిపూర్ మహిళల నుంచి ఏఎఫ్‌ఎస్‌పీఏకు కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఎదురయ్యాయి. మొదటిది 2000 నవంబరులో ఇరోమ్ చాను షర్మిల నిరాహార దీక్ష రూపంలో ఎదురైంది. ఈ దీక్ష 16 ఏళ్లు సాగింది. అయినా ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయలేదు. తంగ్జాం మనోరమ అనే మహిళ కూడా ప్రభుత్వానికి సవాల్‌గా నిలవడంతో అస్సాం రైఫిల్స్... 32 ఏళ్ల మనోరమను అరెస్టు చేసి, హింసించి, ఆమె దేహాన్ని బుల్లెట్ లతో నింపి రోడ్డుపై పడవేసింది. ఆమె మరణంపై ఇచ్చిన న్యాయ మూర్తి నివేదిక ఎన్నడూ వెలుగు చూడలేదు. దీంతో సాయుధ దళ జవాన్లు తమను తాము శిక్షాతీతులుగా భావించుకుంటూ... ఆడ, మగ అనే తేడా లేకుండా అందరినీ నిర్భయంగా హత్య చేయడం, హింసిం చడం, అవమానించడం వంటి అమానవీయ చర్యలను కొనసాగించ డానికి వీలు కలుగుతున్నది. ఇలా ఈశాన్య భారతంలో సైనిక దళాల అకృత్యాలకు శిక్ష పడే అవకాశం లేకపోవడంతో అనేక విపరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో మొదటిది, ఈ చట్టం అమలులో ఉన్న ‘కల్లోలిత‘ ప్రాంతా లలో నివసిస్తున్న బాధితుల బాధలకు పరిష్కార వేదిక లేకుండా పోయింది. న్యాయానికి దూరమైన ప్రజలు కోపంతో ప్రభుత్వానికి దూరమవుతున్నారు. రెండవది, ఈ చట్టం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా దెబ్బతీసింది. మూడవది, 63 సంవత్స రాలుగా అంతర్గత భద్రత కోసం సాయుధ దళాలను ఉపయోగిం చడం వాటిని భ్రష్టు పట్టించడానికి దారితీసింది. 2021 డిసెంబర్లో 13 మంది పౌరుల హత్యల తరువాత, ఏఎఫ్ఎస్పీఏను నాగాలాండ్ నుండి ఉపసంహరించుకోవాలా వద్దా అని పరిశీలించడానికి హోంమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వక ముందే నాగాలాండ్‌లో ఈ చట్టాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం డిసెంబర్ 30న ప్రకటించింది. ఈ చట్టం కింద తలెత్తుతున్న సమస్యలు కేవలం ఈశాన్య రాష్ట్రాలకు చెందినవి మాత్రమే అనుకోకుండా ఇదొక జాతీయ సమస్యగా దేశ మంతా చర్చ జరగాలి. సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దు చేయాలి. – నందితా హక్సర్ మానవ హక్కుల న్యాయవాది, రచయిత -
నాగాలకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: అమాయక కూలీలపై ఆర్మీ కాల్పులతో రగిలిపోతున్న నాగాలాండ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గురువారం షాకిచ్చింది. సైనిక బలగాలకు విస్తృత అధికారాలు, శిక్ష భీతిని లేకుండా చేస్తున్న ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) నాగాలాండ్‌లో మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది. నాగాలాండ్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్తూ... అక్కడ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలిచేందుకు సాయుధ బలగాల మొహరింపు తప్పనిసరని తెలిపింది. అందువల్ల ఏఎఫ్ఎస్పీఏ–1958 సెక్షన్ 3 కింద నాగాలాండ్ రాష్ట్రం మొత్తాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. డిసెంబరు 30 నుంచి ఆరునెలల పాటు ఏఎఫ్ఎస్పీఏ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. చొరబాటుదారులు వస్తున్నారనే సమాచారంతో ఈనెల 3వ తేదీన ఆర్మీ నాగాలాండ్‌లోని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామ పరిసరాల్లో నిఘా పెట్టింది. పనులు ముగించుకొని ఒక ఓపెన్ జీపులో వస్తున్న బొగ్గుగని కార్మికులపైకి వారెవరనేది ధ్రువీకరించుకోకుండానే సైనికులు కాల్పు లు జరపడంతో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు సైనికులపై దాడి చేయగా.. ఒక జవాను మరణించారు. వీరిని అదుపు చేసే ప్రయత్నంలో ఆర్మీ మళ్లీ కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సైన్యానికి విస్తృత అధికారాలు కట్టబెడుతున్న ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయాలని ముఖ్యమంత్రి రిఫియూతో పాటు నాగాలాండ్‌లోని అన్ని రాజకీయపక్షాలూ, గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. పార్లమెంటులో ఈ ఘటనను లేవనెత్తిన విపక్షాలు ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని గట్టిగా కోరాయి. కమిటీ వేసి... అంతలోనే 1958లో ఏఎఫ్ఎస్పీఏను తెచ్చారు. అప్పటినుంచీ నాగాలాండ్‌లో ఇది అమలవుతోంది. ఆరునెలలకు ఒకసారి పొడిగిస్తూ పోతున్నారు. ఓటింగ్ ఘటన తర్వాత నాగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీన్ని గమనించిన నాగాలాండ్ ప్రభుత్వం డిసెంబరు 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి... ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలనే తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. ఏఎఫ్ఎస్పీఏ ఉపసంహరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం నాలుగురోజులు తిరగకముందే... దీన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. ఆమోదయోగ్యం కాదు: కేంద్రం నిర్ణయం ఆమోదయోగ్యం కాదని నాగా గిరిజన సంఘాలు తేల్చిచెప్పాయి. కొన్నితరాల పాటు నాగాలను అణచివేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర సర్కారు ఏఎఫ్ఎస్సీఏను పొడిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశా యి. ‘నాగా ప్రజల ఆకాంక్షలను కేంద్రం పట్టించుకోలేదు. చట్టం ఉపసంహరణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఎంతదూరమైనా వెళతాం’ అని నాగా హోహో సంస్థ ప్రధాన కార్యదర్శి కె. ఎలు ఎన్ డాంగ్ స్పష్టం చేశారు. కేంద్ర నిర్ణయంపై చర్చించడానికి జనవరి 7న సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఈఎన్‌పీవో అధ్యక్షుడు ఆర్.టి.సంగ్టామ్ తెలిపారు. -
ఏఎఫ్ఎస్పీఏ ఎత్తివేత పరిశీలనకు కమిటీ
కోహిమా/గువాహటి: సాయుధ బలగాల(ప్రత్యేక అధికారాల)చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)–1958ను ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా వివేక్ జోషి నేతృత్వంలోని ఈ కమిటీలో హోంశాఖ అదనపు కార్యదర్శి పీయూశ్ గోయల్ సభ్య కార్యదర్శిగా ఉంటారు. ఈ కమిటీ 45 రోజుల్లో తన నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఈ కమిటీలో నాగాలాండ్ చీఫ్ సెక్రటరీ, పోలీస్ డైరెక్టర్ జనరల్‌తోపాటు అస్సాం రైఫిల్స్(నార్త్) ఇన్స్పెక్టర్ జనరల్, సీఆర్పీఎఫ్ నుంచి ఒక ప్రతినిధి ఉంటారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నాగాలాండ్‌కు కల్లోలిత ప్రాంతంగా గుర్తింపును కొనసాగించడం/ రాష్ట్రం నుంచి ఏఎఫ్ఎస్పీఏను ఉపసంహరించడంపై స్పష్టత వస్తుందన్నారు. ఇటీవల మోన్ జిల్లాలో భదత్రాబలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు మృతి చెందడంతో ఏఎఫ్ఎస్పీఏను ఉపసంహరించాలనే డిమాండ్ ఊపందుకుంది. కాల్పులకు బాధ్యులుగా అనుమానిస్తున్న వారిపై సస్పెన్షన్ వేటు పడిందన్నారు. -
మాకు న్యాయం కావాలి.. పరిహారం కాదు!
కోహిమా: నాగాలాండ్‌లో సామాన్యులపైకి కాల్పులు జరిపిన భద్రతా సిబ్బందిని చట్టం ముందు నిలబెట్టేదాకా ప్రభుత్వం అందించే పరిహారాన్ని తీసుకునేదిలేదని మృతుల కుటుంబాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఓటింగ్ గ్రామస్తులు ఒక ప్రకటన విడుదల చేశారు. నాడు కాల్పుల్లో ఓటింగ్ గ్రామానికి చెందిన 14 మంది మృతి చెందడం తెల్సిందే. ‘వారి అంత్యక్రియల సమయంలో ఐదో తేదీన రాష్ట్ర మంత్రి కొన్యాక్, పోలీస్ డిప్యూటీ కమిషనర్ వచ్చి రూ.18.30లక్షలు ఇవ్వబోయారు. చదవండి: కశ్మీర్లో పోలీసుల బస్సుపై ఉగ్ర దాడి ఆ డబ్బును వారు ప్రేమతో ఇస్తున్నారని భావించాం. కానీ, అది ప్రభుత్వ పరిహారంలో మొదటి విడత అని మాకు తర్వాత తెలిసింది. సైనిక సిబ్బందిని ముందుగా చట్టం ఎదుట నిలబెట్టాలి. ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా బలగాల ప్రత్యేక చట్టాన్ని రద్దు చేయాలి. లేకుంటే ప్రభుత్వం అందించే ఎలాంటి పరిహారాన్ని మేం స్వీకరించబోం’ అని ఓటింగ్ గ్రామ కౌన్సిల్ తీర్మానం చేసింది. -
అలా చేసేందుకు ప్రయత్నించారు.. గొంతు విప్పిన ఓటింగ్ గ్రామస్తులు
కోహిమా: నాగాలాండ్ ఫైరింగ్ ఘటనలో భద్రతాదళాలు 13 మంది యువకులను చంపి, మిలిటెంట్లుగా చిత్రీకరించ చూశాయని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామస్తులు తెలిపారు. మృతదేహాలను దాచి, బట్టలు మార్చి, పక్కన ఆయుధాలను పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత గ్రామస్తులు గొంతు విప్పారు. ఓటింగ్ సిటిజెన్స్ ఆఫీస్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘డిసెంబర్ 4న 3:30గంటల సమయంలో బొగ్గుగనుల్లో పనిచేసే ఎనిమిది మంది యువకులతో పికప్ ట్రక్ గని నుంచి తిరిగి గ్రామానికి వస్తోంది. తెల్లారితే ఆదివారం సెలవురోజు. సాయంత్రం నాలుగున్నరకు అందులో ఉన్న ప్రయాణికుల గురించి ఏ వివరాలు తెలుసుకోకుండానే ట్రక్ మీద భద్రతాదళాలు దాడి చేశాయి. చదవండి: Nagaland Tragedy: నాగాలాండ్ నరమేథం తరువాత రోడ్డును బ్లాక్ చేసి... ట్రాఫిక్‌ను పాత పయనీర్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించాయి. ఎంతవరకూ పికప్ ట్రక్ గ్రామానికి రాకపోవడంతో ఆందోళనతో ఎదురుచూస్తున్నాం. తరువాత కాల్పులు జరిగాయని తెలిసింది. 8గంటలకు మేం వెళ్లేసరికి పికప్ ట్రక్ ఖాళీగా ఉంది. డ్రైవర్ సీటు ఎదురుగా అద్దానికి బుల్లెట్ దూసుకుపోయిన గుర్తులు కనిపించాయి. అంటే ట్రక్‌ను ఆపేందుకు వాళ్లు ముందుగా డ్రైవర్‌ను పాయింట్ బ్లాంక్‌లో కాల్చారు. తరువాత మోటార్‌బైక్‌లపై వెళ్లి భద్రతా బలగాల వాహనాలను పట్టుకునే ప్రయత్నం చేశాం. భద్రతా సిబ్బందిని అడిగితే తమకేమీ తెలియదన్నారు. అక్కడే ఓ టార్పాలిన్ కనిపించింది. దాన్ని తొలగించి చూస్తే... ఆరుగురు యువకుల మృతదేహాలు కనిపించాయి. వాళ్ల షర్ట్స్ తొలగించి ఉన్నాయి. మిలిటెంట్ల బట్టలు, బూట్లు వేసి ఆయుధాలను పెట్టే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై ప్రశ్నిస్తే... మాపైనా దాడికి దిగారు. కాల్పులు ప్రారంభించి మరికొందరిని చంపేశారు. ఇంకొందరిని గాయపరిచారు. జనాభాలోనూ, ప్రాంతంలోనూ మేం తక్కువ కావొచ్చు. కానీ... పోరాటంలో మా ప్రాణాలు ఇవ్వడానికైనా, శత్రువుల తలలు తీయడానికైనా సిద్ధంగా ఉంటాం’’ అని గ్రామస్తులు ఉద్ఘాటించారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న నాగాలాండ్ పోలీసులు ఎస్పీఎఫ్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఇండియన్ ఆర్మీ ఈ ఘటనపై మేజర్ జనరల్ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించింది. -
సైనికులపై హత్య కేసు
కోహిమా/న్యూఢిల్లీ: నాగాలాండ్‌లో సైనిక దళాల కాల్పుల్లో 14 మంది కూలీలు మరణించిన ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణానికి బాధ్యులుగా గుర్తిస్తూ 21వ పారా స్పెషల్ ఫోర్స్ జవాన్లపై సోమవారం సుమోటోగా హత్య కేసు నమోదు చేశారు. ఈ మేరకు మోన్ జిల్లాలోని తిజిత్ పోలీసు స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 302, 307, 34 కింద కేసు పెట్టారు. హత్యా, హత్యాయత్నం, నేరపూరిత చర్య అభియోగాల కింద ఈ కేసు నమోదయ్యింది. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉండడంతో మోన్ పట్టణంలో 144 సెక్షన్ విధించారు. నాగాలాండ్ బంద్ ప్రశాంతం జవాన్ల కాల్పుల్లో 14 మంది అమాయక కూలీల మృతికి నిరసనగా పలు గిరిజన సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు సోమవారం నాగాలాండ్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా భద్రతా దళాలు, విద్యార్థుల మధ్య స్వల్పంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఐదు రోజులపాటు సంతాప దినాలుగా పాటిస్తామని నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్(ఎన్ఎస్ఎఫ్) ప్రకటించింది. వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయడమే కూలీల త్యాగానికి అసలైన నివాళి అవుతుందని ఎన్ఎస్ఎఫ్ నేతలు ఉద్ఘాటించారు. శనివారం, ఆదివారం జరిగిన కాల్పుల ఘటనల్లో మొత్తం 28 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. హార్న్‌బిల్ ఫెస్టివల్ ఒక్కరోజు నిలిపివేత సందర్శకులతో సందడిగా కనిపించే నాగా సంప్రదాయ గ్రామం కిసామా సోమవారం ఎవరూ లేక బోసిపోయింది. ఇక్కడ జరుగుతున్న హార్న్‌బిల్ ఫెస్టివల్‌ను ప్రభుత్వం నిలిపివేయడమే ఇందుకు కారణం. కూలీల మరణానికి సంతాప సూచకంగా నాగాలాండ్ ప్రభుత్వం ఈ ఫెస్టివల్‌ను ఒక్కరోజు నిలిపివేసింది. దేశవిదేశీ పర్యాటకులను ఆకర్శించడమే లక్ష్యంగా ఈ వేడుకను ప్రతిఏటా 10 రోజులపాటు రాజధాని కోహిమా సమీపంలోని కిసామా గ్రామంలో వైభవంగా నిర్వహిస్తుంటారు. హార్న్‌బిల్ ఫెస్టివల్లో పాల్గొనబోమంటూ పలు గిరిజన సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మృతిచెందిన 14 మంది కూలీల కుటుంబాలకు నాగాలాండ్ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. రాష్ట్ర రవాణా మంత్రి పైవాంగ్ కోన్యాక్ విలేజ్ కౌన్సిల్ చైర్మన్‌కు ఈ పరిహారం మొత్తాన్ని అందజేశారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ఇస్తామన్నారు. చనిపోయిన పౌరుల కుటుంబాలకు రూ.11 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని రాష్ట్ర సీఎం నీఫియూ రియో చెప్పారు. జవాన్ల కాల్పుల్లో మరణించిన 14 మంది కూలీల అంత్యక్రియలను సోమవారం మోన్ జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్ గ్రౌండ్ వద్ద నిర్వహించారు. బలగాల కాల్పులపై మోన్‌లో స్థానికుల ఆందోళన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) సోమవారం కేంద్రం, నాగాలాండ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సైనికుల కాల్పులు, అమాయక కూలీల మృతిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ సంఘటనపై మీడియాలో వచ్చిన వార్తలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆరు వారాల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ రక్షణ శాఖ కార్యదర్శి, కేంద్రం హోంశాఖ కార్యదర్శి, నాగాలాండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నాగాలాండ్‌లో సైన్యం కాల్పుల అనంతరం జనం ఎదురుదాడిలో మృతిచెందిన జవాను ఉత్తరాఖండ్ రాష్ట్రం తెహ్రా జిల్లా నౌలీ గ్రామానికి చెందిన గౌతమ్‌లాల్ అని అధికారులు వెల్లడించారు. అతడు ‘21 బెటాలియన్ ఆఫ్ పారాచూట్ రెజిమెంట్’లో పారాట్రూపర్‌గా పని చేస్తున్నాడని చెప్పారు. -
Nagaland Tragedy: నాగాలాండ్ నరమేథం
ఈశాన్య భారతంలో తిరుగుబాట్లను అణిచే పేరిట దశాబ్దాలుగా అమలవుతున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం పౌరుల జీవితాల్లో ఎంతటి కల్లోలం సృష్టిస్తున్నదో తెలియడానికి శనివారం చోటుచేసుకున్న నాగాలాండ్ నరమేథమే తార్కాణం. ఆ రాష్ట్రంలోని మోన్ జిల్లాలో 13మంది పౌరులు, ఒక జవాను మరణించడానికి దారి తీసిన ఈ ఉదంతం అత్యంత విషాదకరమైనది. వాహ నంలోని వారిని తిరుగుబాటుదారులుగా పొరబడి కాల్పులు జరిపామని సైన్యం ఇస్తున్న సంజాయిషీ నేర తీవ్రతను తగ్గించలేదు. వారి ప్రకటన ప్రకారం నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగా లాండ్ –ఖప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే)లోని చీలిక వర్గం తిరుగుబాటుదారులు ఫలానా వాహనంలో వస్తున్నారని నిఘా సంస్థలు సమాచారం ఇచ్చాయి. దాని ఆధారంగా కాల్పులు జరిపామని సైన్యం అంటున్నది. తిరుగుబాటుదారుల గురించి అంత ఖచ్చితమైన సమాచారం అందించిన నిఘా సంస్థకూ, దాన్ని విశ్వసించిన సైన్యానికీ సమీపంలోని బొగ్గు గనిలో పనిచేస్తూ రోజూ అదే సమయా నికి వాహనంలో కూలీలు వెళ్తారన్న ఇంగితం లేకపోవడం, జాగరూకతతో వ్యవహరించాలన్న స్పృహ కొరవడటం క్షమార్హంకాదు. పద్ధతిగా అయితే ఇలాంటి దాడుల సమయంలో స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలి. కానీ, అక్కడ కార్యకలాపాలు చూసే అస్సాం రైఫిల్స్‌కు కూడా చెప్పకుండా సైన్యంలోని ఒక ఎలైట్ యూనిట్ తనకు తానే నిర్ణయం తీసుకుని ఈ దాడికి పాల్పడిందని వస్తున్న కథనాలు ఆందోళనకరమైనవి. బలగాలమధ్య సమన్వయం లేదని దీన్నిబట్టి అవగతమవుతోంది. అసలు సైన్యం నిర్వహిస్తున్న ఆపరేషన్ల తీరుతెన్నులనే ఈ ఉదంతం ప్రశ్నార్థకం చేస్తున్నది. ఆ వాహనంలో నిజంగా తిరుగుబాటుదారులే వెళ్తున్నా అచ్చం వారి మాదిరే పొంచివుండి దాడి చేయాలనుకోవడం సరికాదు. గత నెలలో మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఒక కమాండింగ్ ఆఫీసర్‌నూ, మరో ఆరుగురినీ తిరుగుబాటుదారులు బలితీసుకున్ననాటినుంచీ సూత్రధారుల కోసం గాలింపు మొదలైంది. తిరుగుబాటుదారులను సజీవంగా పట్టుకుంటేనే ఆ అధికారి మరణానికి కారకులెవరో, వారి కార్యకలాపాలేమిటో తెలిసేది. అందుకు భిన్నంగా పొంచివుండి హఠాత్తుగా గుళ్ల వర్షం కురిపించడం వల్ల దేశ భద్రతకు కలిగే ప్రయోజనమేమిటి? కాస్తయినా ఆలోచించారా? వాహ నాన్ని ఆపడానికి బలగాలు ప్రయత్నించాయని, కానీ వారు ‘పారిపోయే ప్రయత్నం’ చేయడంతో అందులో తీవ్రవాదులు వెళ్తున్నారని భావించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన ప్రకటన హేతుబద్ధంగా లేదు. తీవ్రవాదులు వాహనంలో ఉండుంటే మారణాయుధాలతో దాడికి దిగరా? వాహనం ఆపనంత మాత్రాన అందులో తీవ్రవాదులే ప్రయాణిస్తున్నారన్న నిర్ధార ణకు రావడం సబబేనా? నాగాలాండ్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశాలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. ఘటన జరిగాక మృతదేహాలపై ఉన్న దుస్తులను తొలగించి, ఖాకీ దుస్తులు వేసేందుకు బలగాలు ప్రయత్నించాయని ఆ దర్యాప్తు చెబుతోంది. మరణించినవారు తీవ్రవాదులని కట్టుకథలల్లడానికి ఈ పని చేశారా అన్నది తేలాలి. ఆ రాష్ట్రంలో ఉన్నది ఎన్డీపీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం. కానీ బీజేపీ నేతలకే అక్కడ రక్షణ కరువు! ఘటనాస్థలికి బీజేపీ జెండాతో వెళ్తున్న తమ వాహనంపై కూడా బలగాలు కాల్పులు జరిపి, ఒకరి ప్రాణం తీశాయని, మరో ముగ్గురు గాయపడ్డా రని మోన్ జిల్లా బీజేపీ నేత అంటున్నారు. ఇదంతా వింటుంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే జీవిస్తున్నామా అనే సందేహం రాకమానదు తీవ్రవాదాన్ని అదుపు చేయడం, శాంతిభద్రతల్ని పరిరక్షించడం ప్రభుత్వాల కర్తవ్యం. మయ న్మార్కూ, చైనాకూ కూతవేటు దూరంలో ఉండే నాగాలాండ్ వంటిచోట అది మరింత అవసరం. కానీ కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా చట్టాలు ఉండకూడదు. రాజ్యాంగంలోని అధికరణలను సైతం అపహాస్యం చేసేలా సైన్యానికి అపరిమిత అధికారాలిస్తున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం ఈ పోకడే పోతోంది. పర్యవసానంగా ఇది అమలవుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట నిత్యం మానవ హక్కుల ఉల్లంఘన సాగుతూనే ఉంది. అక్రమ నిర్బం ధాలు, అత్యాచారాలు, బూటకపు ఎన్కౌంటర్లు, మనుషుల్ని మాయం చేయడం వంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మణిపూర్ ఎన్కౌంటర్ ఘటనలపై 2013లో దర్యాప్తు చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే కమిషన్ సాయుధ బలగాల చట్టం అశాంతికి కారణమవుతున్నదని తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధ చర్య లకు పాల్పడిన భద్రతా బలగాలకు ఏ రక్షణా ఉండబోదని సుప్రీంకోర్టు ఒక కేసులో స్పష్టం చేసింది. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ ఆ చట్టాన్ని రద్దు చేయాలని 2005లో సూచించింది. నిర్భయ ఉదం తంలో నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ నివేదిక సైతం ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పింది. అయినా ఆనాటి యూపీఏ సర్కారుకు పట్టలేదు. అది జరిగితే భద్రతా బలగాల నైతిక స్థైర్యం దెబ్బ తింటుందన్నదే ప్రభుత్వాల వాదన. మరి పౌరుల నైతిక స్థైర్యం సంగతేమిటి? నాగాలాండ్ ఉదం తంలో కారకుల్ని శిక్షిస్తామని సైన్యం అంటున్నది. కేంద్రం కూడా హామీ ఇస్తోంది. మంచిదే. కానీ ఇన్ని దశాబ్దాలుగా ఎంతమందిని శిక్షించారు... లెక్కలు తీస్తారా? సాయుధ బలగాల (ప్రత్యేకాధి కారాల) చట్టం అమల్లో ఉన్నంతకాలం ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. చట్టం రద్దు చేయాలన్న నాగాలాండ్, మేఘాలయ సీఎంల తాజా డిమాండ్ ముమ్మాటికీ సబబే. ఇప్పటికైనా కేంద్రం ఆలోచించాలి. ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. -
Amit Shah: పొరపాటు వల్లే కాల్పులు
న్యూఢిల్లీ: నాగాలాండ్‌లో తీవ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం ఉన్నప్పటికీ వారిని గుర్తించడంలో భద్రతా దళాలు పొరపాటు పడడం వల్లే కాల్పులు జరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై సిట్ నెల రోజుల్లోగా విచారణ పూర్తి చేస్తుందన్నారు. భవిష్యత్తులో తీవ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు చేపట్టినప్పుడు ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్ని భద్రతా దళాలకు సూచించారు. ఈ మేరకు షా సోమవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. తృణమూల్ మినహా ప్రతిపక్షాల వాకౌట్ అమిత్ షా ప్రకటనపై కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీ తదితర ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం, కాల్పులకు బాధ్యులైన వారిపై చర్యల గురించి ఆయన మాటమాత్రమైనా ప్రస్తావించలేదని మండిపడ్డాయి. షా ప్రకటనను నిరసిస్తూ సభను నుంచి వాకౌట్ చేశాయి. టీఎంసీ వాకౌట్ చేయలేదు. ఎలాంటి ప్రశ్నలకు ఆస్కారం ఇవ్వకుండా హోంమంత్రి ఏకపక్షంగా ప్రకటన చేసి వెళ్లిపోయారని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ దుయ్యబట్టారు. అంతకుముందు నాగాలాండ్ ఘటనను ప్రతిపక్షాలు సభలో లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్‌చేశాయి. (చదవండి: Maharashtra: ప్రేమించి, పారిపోయి పెళ్లి.. గర్భిణీ అక్క తల నరికిన తమ్ముడు.. తీసుకొని) హైదరాబాద్ నైపర్‌కు ‘జాతీయ’ హోదా బిల్లుకు లోక్‌సభ ఆమోదం హైదరాబాద్, అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, కోల్‌కతా, రాయ్‌బరేలీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్(నైపర్)లకు ‘జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థ’ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. ఈ మేరకు నైపర్(సవరణ) బిల్లు–2021ను ఆరోగ్య మంత్రిæ మాండవియా సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టంగా మారితే నైపర్‌లకు ఒకేరకమైన జాతీయ హోదా లభిస్తుందని తెలిపారు. నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టంలో దొర్లిన తప్పిదాన్ని సరిచేయడానికి సవరణ బిల్లు–2021ను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో అదే దృశ్యం రాజ్యసభ నుంచి 12 మంది సభ్యుల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు పట్టు వీడటం లేదు. సోమవారం కూడా ఆందోళనకు దిగాయి. దీంతో నాలుగు సార్లు సభ వాయిదాపడింది. రాజ్యసభలో నినాదాల మధ్యే నాగాలాండ్ ఘటనపై షా ప్రకటన చేశారు. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. చదవండి: నాగాలాండ్ రాష్ట్రం మోన్ జిల్లాలో దారుణం -
17 మంది అమాయకులు బలి.. ఇంకెన్నాళ్లీ చట్టం?
సాక్షి, నేషనల్ డెస్క్: వచ్చిందెవరో ధ్రువీకరించుకోకుండానే... వారి వద్ద ఆయుధాలున్నాయా? దాడికి ప్రయత్నిస్తున్నారా? అనేవి ఏవీ చూడకుండా పనులకెళ్లి తిరిగి వస్తున్న కూలీలపై ఆర్మీ జవాన్లు కాల్పులకు తెగబడటం విభ్రాంతికలిగించింది. బొగ్గు గనిలో పని పూర్తిచేసుకొని పాటలు పాడుకుంటూ వాహనంలో ఇళ్లకు తిరిగి వస్తున్న కార్మికులపై సైనికులు తుపాకులు ఎక్కుపెట్టారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 17కే చేరింది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి దారుణాలు కొత్తేమీ కాదు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) కట్టబెట్టిన అపరిమిత అధికారాలతోనే సైన్యం ఇలాంటి అతిక్రమణలకు, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. తిరుగుబాట్లను, వేర్పాటువాదాన్ని, నిషేధిత ఉగ్రసంస్థలను అణచివేసే చర్యల పేరిట అమాయాకుల ఊచకోత, మహిళలపై సైన్యం అకృత్యాలు చేసిన దృష్టాంతాలెన్నో ఉన్నాయి. ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని ఇక్కడి పౌర సమాజం, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఎన్నో ఏళ్లుగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతిని, అలజడులను నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వాల యం త్రాంగాలకు సాధ్యం కాకపోవడంతో ఆరు దశాబ్దాల కిందట 1958లో కేంద్ర ప్రభుత్వం ‘ఏఎఫ్ఎస్పీఏ’ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం... ►కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన ప్రదేశాల్లో శాంతిభద్రతలను కాపాడే అధికారం సైనిక బలగాలకు దఖలు పడుతుంది. ►ఐదుగురికి మించి ఒకేచోట గుమిగూడకుండా ఆర్మీ నిషేధం విధించగలదు. ►ఎవరైనా ఈ ఆజ్ఞలను ఉల్లంఘించారని భావిస్తే బలప్రయోగం ద్వారా నియంత్రించొచ్చు. ముందస్తు హెచ్చరిక జారీచేసి కాల్పులూ జరపొచ్చు. ►సమంజసమైన అనుమానం ఉంటే వారెంటు లేకుండానే ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. అరెస్టుకు కారణాలను వివరిస్తూ తర్వాత సమీపంలోని పోలీసుస్టేషన్లో సదరు వ్యక్తిని లేదా వ్యక్తులను అప్పగించవచ్చు. ►వారెంటు లేకుండానే ఎవరి ఇంట్లోకైనా ప్రవేశించి సోదాలు జరపొచ్చు. ►ఆయుధాలు కలిగి ఉండటాన్ని నిషేధించొచ్చు. ఏది కల్లోలిత ప్రాంతమంటే... భిన్న మతాలు, జాతులు, భాషలు, కులాలు, ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగి ఘర్షణలు తలెత్తితే... ఆ ఏరియాను ‘కల్లోలిత ప్రాంతం’గా ప్రకటించే వీలును ఏఎఫ్ఎస్పీఏ చట్టంలోని సెక్షన్–3 కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం (హోంశాఖ), లేదా రాష్ట్ర గవర్నర్ మొత్తం రాష్ట్రాన్ని లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించొచ్చు. శాంతిభద్రతలను కాపాడటానికి రాష్ట్ర యంత్రాంగానికి సైనిక బలగాల సాయం అవసరమైన చోట్ల ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏఎఫ్ఎస్పీఏను ప్రయోగించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే వదిలివేయవచ్చు. ఎక్కడెక్కడ అమలులో ఉంది? అస్సాం, నాగాలాండ్, మణిపూర్ (మణిపూర్ మున్సిపల్ కౌన్సిల్ ఏరియాను మినహాయించి), అరుణాచల్‌ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్, లాంగ్డింగ్, తిరప్ జిల్లాల్లో ఈ చట్టం అమలులో ఉంది. నాగాలాండ్‌లో డిసెంబరు 31 దాకా దీన్ని పొడిగిస్తూ ఈ ఏడాది జూన్ 30నే ఆదేశాలు జారీ అయ్యాయి. అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 11న మరో ఆరునెలలు ఈ చట్టం అమలును పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. మేఘాలయలో ఏప్రిల్ 1, 2018న ఈ చట్టాన్ని కేంద్రం ఎత్తివేసింది. 16 ఏళ్ల పోరాటం ఇరోమ్ షర్మిల... మణిపూర్ ఉక్కుమహిళగా ఖ్యాతికెక్కిన ఈ పేరు చిరపరిచితమే. 2000 నవంబరులో మణిపూర్‌లోని మలోమ్ పట్టణంలో బస్సు కోసం వేచిచూస్తున్న 10 మంది సాధారణ పౌరులను అస్సాం రైఫిల్స్ దళం కాల్చి చంపింది. ఈ మలోమ్ ఊచకోతకు నిరసనగా, ఏఎఫ్ఎస్పీఏను ఉపసంహరించాలనే డిమాండ్‌తో 28 ఏళ్ల ఇరోమ్ షర్మిల నిరాహార దీక్షకు దిగారు. మూడు రోజులకే ఆత్మహత్యకు ప్రయత్నించిందనే అభియోగంపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 2000 నవంబర్ నుంచి 2016 ఆగస్టు దాకా పోలీసు కస్టడీలోనే ఇరోమ్ షర్మిల నిరాహారదీక్షను కొనసాగించారు. ఈ సమయంలో ట్యూబ్ ద్వారా ఆమెకు బలవంతంగా ద్రవాహారం అందించారు. కేంద్రం ఈ చట్టాన్ని ఎంతకీ ఉపసంహరించుకోకపోవడంతో ఆమె మనసు మార్చుకొని 2016 ఆగస్టు 9న తన దీక్షను విరమించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఇరోమ్ సొంత పార్టీ పెట్టి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి మణిపూర్ సీఎం ఓక్రమ్ ఇబోబీ సింగ్‌పై పోటీచేశారు. కేవలం 90 ఓట్లు మాత్రమే పడ్డాయి. తమ ప్రజలపై అకృత్యాలను ఎండగడుతూ... ప్రపంచం దృష్టిని అకర్షించి, ఏకధాటిగా 16 ఏళ్లు దీక్ష చేసినా... సొంత జనమే ఆదరించలేదు. సాయుధ బలగాల అకృత్యాలకు ఊతమిచ్చే ఈ నిరంకుశ చట్టం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
అమాయక కూలీలపై పేలిన ఆర్మీ తూటా
కోహిమా/గువాహటి/న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో దారుణం జరిగింది. తీవ్రవాదుల ఏరివేత ఆపరేషన్ గురి తప్పింది. బొగ్గు గనిలో పని పూర్తిచేసుకొని పాటలు పాడుకుంటూ వాహనంలో ఇళ్లకు తిరిగి వస్తున్న కార్మికులపై సైనికులు తుపాకులు ఎక్కుపెట్టారు. కాల్పుల్లో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమయం గడుస్తున్నా ఇంటికి చేరుకోని తమవారిని వెతుకుతూ గ్రామస్థులు బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక కంటిముందు కనిపించిన రక్తపాతాన్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. అక్కడే ఉన్న మిలటరీ వాహనాలను చుట్టుముట్టి, నిప్పు పెట్టారు. జవాన్లపై దాడికి దిగారు. అప్రమత్తమైన జవాన్లు ఆత్మరక్షణ కోసం తుపాకులకు మళ్లీ పనిచెప్పారు. ఈసారి మరో ఏడుగురు పౌరులు ప్రాణాలొదిలారు. గ్రామస్థుల దాడిలో ఒక జవాను మరణించాడు. సైనికుల కాల్పుల్లో మొత్తం 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మోన్ జిల్లాలోని తిరూ ఏరియాలో ఓతింగ్ గ్రామం వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మరొకరి మృతి సైనికుల కాల్పులు, పేదల మరణంపై ఆదివారం నాగాలాండ్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనం వీధుల్లోకి వచ్చారు. సైన్యం అకృత్యానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. 17 మందిని పొట్టనపెట్టుకున్న జవాన్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోన్ జిల్లాలో కోన్యాక్ యూనియన్ ఆఫీసు, అస్సాం రైఫిల్స్ క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయంలోని పలు భాగాలను దహనం చేశారు. వారిని అడ్డుకోవడానికి భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నాగాలాండ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. తప్పుడు సమాచారం, వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందకుండా మోన్ జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయినప్పటికీ కార్యాలయాల విధ్వంసానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 17 మంది మృతదేహాలకు మోన్ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం అస్సాంకు తరలించినట్లు చెప్పారు. ‘సిట్’ ఏర్పాటు తాజా సంఘటనపై విచారణ కోసం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందానికి నాగాలాండ్ ఐజీ నేతృత్వం వహిస్తున్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని, రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని సీఎం నీఫియూ రియో విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించరాదని కోరారు. సైనికుల కాల్పుల ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణేకు ఉన్నతాధికారులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. 17 మంది మరణించడం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం ప్రకటించారు. వారి కుటుం బాలకు ట్విట్టర్లో సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. హార్న్‌బిల్ ఫెస్టివల్ బహిష్కరిస్తున్నాం పౌరులపై సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరపడాన్ని ఈస్ట్రర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్‌పీఓ) ఖండించింది. ఈ సంఘటనకు నిరసనగా హార్న్‌బిల్ ఫెస్టివల్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫెస్టివల్లో పాల్గొనరాదంటూ స్థానిక గిరిజన తెగలకు పిలుపునిచ్చింది. నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలపాలంది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్శించడానికి నాగాలాండ్ ప్రభుత్వం ప్రస్తుతం హార్న్‌బిల్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మోన్ జిల్లా పొరుగు దేశమైన మయన్మార్‌తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది. ఎన్ఎస్సీఎన్–కేలోని యుంగ్ ఆంగ్ ముఠా ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. అసలేం జరిగింది? నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–ఖప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే) అనే తీవ్రవాద సంస్థలో ఒక భాగమైన యుంగ్ ఆంగ్ ముఠా సభ్యులు తిరూ ఏరియాలో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న సైనికులు గాలింపు చర్యలు ప్రారంభించారు. పని ముగించుకొని వాహనంలో వస్తున్న కార్మికులను ఎన్ఎస్సీఎన్–కే తీవ్రవాదులుగా భ్రమపడి, కాల్పులు జరిపారు. చిన్న పొరపాటు భారీ హింసాకాండకు దారితీసింది. రెండుసార్లు జరిగిన కాల్పుల్లో మొత్తం 17 మంది బడుగు జీవులు బలయ్యారు. ఒక జవాను సైతం ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం పరిణామాలపై ‘కోర్టు ఆఫ్ ఎంక్వైరీ’ కోసం ఆదేశాలు జారీ చేసినట్లు సైన్యం ప్రకటించింది. జనం దాడిలో తమ సైనికులు కొందరు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది. 17 మంది సాధారణ ప్రజలు చనిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకర సంఘటన అని పేర్కొంది. కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది? ‘‘నాగాలాండ్‌లో సైన్యం కాల్పులపై కేంద్ర ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాలి. సొంత దేశంలోనే పౌరులకు, భద్రతా సిబ్బందికి రక్షణ లేని పరిస్థితి ఉంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది. 17 మంది పౌరుల మరణం నా హృదయాన్ని కలచివేసింది’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ సమగ్ర దర్యాప్తు జరపాలి ‘‘నాగాలాండ్‌లో సైన్యం కాల్పుల్లో పౌరుల మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి -
ఈశాన్యానికి లాంగ్‌మార్చ్?
సాక్షి, హైదరాబాద్: కీలక నేతల మరణాలు, లొంగుబాట్ల నేపథ్యంలో ఉనికి కోసం మావోయిస్టు పార్టీ వ్యూహం మారుస్తోందా? కేడర్‌ను కాపాడుకు నేందుకు ఈశాన్య రాష్ట్రాలకు ‘మార్చ్’ చేస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొన్నాళ్ల పాటు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతాలను వదిలేయాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమబెంగాల్ ద్వారా నాగాలాండ్ చేరువ వ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. కార్యకలాపాల నిర్వహణకు ఏమాత్రం అను కూలంగా లేని వాతావరణం కావడంతో ఉన్న నేత లను, కేడర్‌ను కాపాడుకునే పనిలో మావోయిస్టు పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఏవోబీలో ఉన్న ఆరు కమిటీలను రెండు కమిటీలుగా, ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న 4 కమిటీలను రెండు కమిటీలుగా మార్చేసిన మావో యిస్టు పార్టీ.. కేడర్‌ను కాపాడే పనిలో నిమగ్న మైంది. ఆర్కే మరణం, హిడ్మా ఆరోగ్య పరిస్థితి, పెద్దగా కార్యకలాపాలు లేని తెలంగాణ కమిటీ.. ఇలా అన్ని కమి టీలు దీనావస్థలో ఉండటంతో కేవలం ఆత్మరక్షణ కోసమే కార్యాచరణ రూపొందిం చుకున్నట్టు తెలిసింది. బలంగా ఉన్న అబూజ్మడ్ (ఛత్తీస్‌గఢ్)ను సైతం వదిలి వెళ్లక తప్పదనే కేంద్ర కమిటీ సూచనతో ఆత్మరక్షణ చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. ఎందుకీ పరిస్థితి.. ఛత్తీస్‌గఢ్, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీలపై బలగాలు రెండేళ్లుగా ప్రత్యేక దృష్టి సారించాయి. కేంద్ర హోంశాఖతోపాటు ఆయా రాష్ట్రాల పోలీస్ విభాగాలు సంయుక్తంగా ప్రతీ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టాయి. ఆయా ప్రాంతాల్లో బేస్ క్యాంపులను పెంచుకొని ప్రత్యేక శాటిలైట్ ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. దీంతో మావోయిస్టు పార్టీకి చేరాల్సిన ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, మందులు, డబ్బులు, ఆయుధాలు.. ఇలా ప్రతీ వ్యవహారంసైనా కదలికలను బేస్ క్యాంపుల ద్వారా పసిగట్టి నియంత్రించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండానే ఇన్ఫార్మర్లు/కొరియర్లుగా వ్యవహరిస్తున్న వారిని నియంత్రించి సక్సెస్ అయ్యారు. మావో అగ్రనేత ఆర్కే మరణం కూడా ఇందులోభాగమే అని ఆ పార్టీ బహిరంగంగానే ఆరోపించింది. మందులు, ఇతర నిత్యావసరాలను అడ్డుకొని ఆరోగ్యం క్షీణించేలా చేశారని ఆర్కే భార్య కూడా ఆరోపించింది. వారసంతలపైనా నిఘా అబూజ్మడ్తోపాటు ఏవోబీలోని వారసంతలపైనా బలగాలు నిఘా పటిష్టం చేశాయి. ప్రతీ కుటుంబం ప్రతీ వారం కొనుగోలు చేసే వస్తువులపై నిఘా పెట్టింది. మునుపటి వారం కన్నా ఎక్కువ కొనుగోలు చేస్తే ఇంట్లో ఏదైనా శుభకార్యముందా? లేక మావోయిస్టు పార్టీకి అందించేందుకు కొనుగోలు చేశారా అన్నంత లోతుగా ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నాయి. సర్జరీ ఆధారిత మందులు, పెయిన్ కిల్లర్లు, కరోనా మెడిసిన్స్.. ఇలా ఆయా ఏరియాల్లోని మందుల షాపుల్లో కొనుగోలు చేసే వ్యక్తులను గుర్తించి కౌన్సెలింగ్ సైతం చేసింది. కొనుగోలుదారుల కదలికలను పసిగట్టి కొరియర్లను తమవైపు తిప్పుకోవడంలో కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర బలగాలు సక్సెస్ అయినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టంచేశాయి. దీనివల్లే అనారోగ్యం బారిన పడిన సీనియర్ నేతల మరణాలు జరిగినట్టు చెప్తున్నాయి. ఇదేకాకుండా రెండేళ్ల నుంచి జరిగిన రాష్ట్ర, కేంద్ర కమిటీ కీలక నేతల లొంగుబాట్లు ఆ పార్టీని మరింత అఘాతంలోకి నెట్టాయని భావిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర కమిటీలు అవలంబించే విధానాలు, వ్యూహాత్మక చర్యలను పసిగట్టి నిలువరించడంలో బలగాలు సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కొన్నాళ్లపాటు ఈ రెండు ప్రాంతాలను వదిలి వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడినట్టు బలంగా వినిపిస్తోంది. ఎనిమిది నెలలుగా ఒక్క నియామకం లేదు... ఒకవైపు కీలక నేతల మరణాలు, మరోవైపు లొంగుబాట్లతో అతలాకుతలం అవుతున్న మావోయిస్టు పార్టీని కొత్త రక్తం లేక మరింత చీకట్లోకి నెట్టింది. ఛత్తీస్‌గఢ్, ఏవోబీ, తెలంగాణ, మహారాష్ట్రలో కొత్త నియామకాలు ఏమాత్రం జరగలేదు. ఎనిమిది నెలలుగా అంటే ఈ ఏడాదిలో దాదాపుగా రిక్రూట్మెంట్ లేకుండా చేయడంలో పోలీసులు పైచేయి సాధించారు. నియామకాలు జరగకపోవడంపై ఒక్క ఉదాహరణ మావోయిస్టు పార్టీ నుంచే వినిపిస్తోంది. ఆర్కే తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో ఒక ప్లాటూన్ కేవలం ఆయన రక్షణ కోసమే పనిచేసింది. మంచానికే పరిమితమైన ఆర్కేను కంటికి రెప్పలా కాపాడేందుకు ఆయన చుట్టూ ఉన్న ప్లాటూన్ రక్షణ దళానికి కాపలాగా లోకల్ గెరిల్లా టీమ్ రక్షణ కవచంగా నిలిచింది. ఇలా మూడు నెలల పాటు ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ఏవోబీ జోనల్ కమిటీ ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆర్కే కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. కేవలం తన కోసం రెండు వ్యవస్థలు కార్యకలాపాలు చేయకుండా ఉండిపోవడం పార్టీకి నష్టాన్ని కల్గిస్తుందని, కొంతమంది మినహా మిగతా బృందాలు కార్యకలాపాల్లో నిమగ్నమవ్వాలని సూచించారని తెలిసింది. నియామకాలను విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని పదేపదే చెప్పినట్టు సమాచారం. కొద్దిరోజులు దూరంగా..! ప్రస్తుత కీలక పరిణామాలతో ఈ రెండు ప్రాంతాల నుంచి కొద్దిరోజులపాటు దూరంగా ఉండటం మంచిదని, అందుకు ఈశాన్య రాష్ట్రాలకు వలస వెళ్లకతప్పదని కేంద్ర కమిటీ భావిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఛత్తీస్‌గఢ్, ఏవోబీలో ఉన్న కీలక నేతలు, ముఖ్య కేడర్‌ను పశ్చిమబెంగాల్ మీదుగా నాగాలాండ్‌కు చేరుకోవాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చినట్టు పార్టీలోనూ చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీ ఉనికికే ప్రమాదం అన్న పరిస్థితుల్లో ఈ ప్రాంతాల్లో కార్యకలాపాలకు బ్రేక్ ఇచ్చి నాగాలాండ్ రావాల్సినట్టుగా ఆదేశాలున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కార్యకలాపాల విస్తృతికి అక్కడి నుంచే పనిచేయాలన్న ఆలోచనలో కేంద్ర కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది. -
కాఫీ క్లాసులు.. జమీర్ కృషి వృథా పోలేదు
వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్లడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు కొందరు. కొందరు మాత్రం కాస్త ఆగి వెనక్కి చూసి ఆగిపోయిన వారికి ఆసరాగా నిలుస్తారు. అండగా నిలబడతారు. జకైట్సొనో జమీర్ రెండో కోవకు చెందిన మహిళ. ‘కాఫీ లేడీ ఆఫ్ నాగాలాండ్’గా పేరు తెచ్చుకున్న జమీర్ విజయవంతమైన వ్యాపారిగా ఎదగడం వెనుక కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలను తట్టుకొని నిలబడిన పట్టుదల ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగ లేకపోవడంతో చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది జమీర్‌కు. కుటుంబానికి ఆసరాగా నిలవడానికి ఏదైనా చిన్నవ్యాపారమో, ఉద్యోగమో చేయాలనుకుంది. కాని ఏం చేయాలి? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఆ సమయంలోనే ఒక వర్క్‌షాప్‌కు హాజరైంది జమీర్. తోట నుంచి కప్పు వరకు కాఫీ ప్రస్థానాన్ని ఆ వర్క్‌షాప్‌లో చెప్పారు. కాఫీ రుచిగా ఉండడానికి ఎన్ని విషయాలు దోహద పడతాయో అనే విషయం తనకి ఆసక్తికరంగా అనిపించింది. కాఫీ ఎలా పుడుతుందో తెలుసుకున్న క్లాసులోనే ‘బిజినెస్ ఐడియా’ పుట్టింది! ఈ క్లాస్‌ల స్ఫూర్తితో ‘ఫార్మర్ స్క్వేర్’అనే కేఫ్‌ను దిమపూర్లో మొదలుపెట్టింది. అయితే మొదలుపెట్టిన కొన్ని నెలలకే ఆ కేఫ్ మూతపడింది. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి... అన్నట్లుగా తయారైంది పరిస్థితి. నిరాశ చీకట్లో కొట్టుమిట్టాడుతున్న రోజుల్లో తన కోసం మరో ద్వారం తెరుచుకుంది. జర్మనీకి సంబంధించిన ఒక డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏజెన్సీ ‘హర్ అండ్ నౌ’ అనే సహాయక కార్యక్రమాన్ని చేపట్టింది. మరొకరైతే ‘కాఫీకో దండం. వ్యాపారం మనకు అచ్చిరాదు’ అని వెళ్లకుండా ఉండేవారేమో! కాని జమీర్ ఈ కార్యక్రమాల్లో భాగం కావడం ద్వారా తాను చేసిన తప్పులు, చేయకూడని తప్పులు, వ్యాపార వ్యూహం ఎలా ఉండాలి? మనదైన ప్రత్యేకత ఏమిటీ, ప్రాడక్ట్ మార్కెటింగ్ ప్లాన్స్ ఎలా ఉండాలి....ఇలా రకరకాల విషయాలు తెలుసుకుంది. ‘ఫార్మర్ స్క్వేర్’తో మరోసారి బరిలోకి దిగింది. ఈసారి మాత్రం తన కల తనని నిరాశ పరచలేదు. ‘లెస్ ఈజ్ మోర్’ అనేది తన కీలక వ్యాపార సూత్రంగా మారింది. తాజా గ్రౌండ్ కాఫీని అందించడంలో ‘ఫార్మర్ స్క్వేర్’ కేఫ్‌లకు మంచి పేరు వచ్చింది. పక్కన ఉన్న రాష్ట్రాలకు కూడా వ్యాపారం విస్తరించింది. తన విజయంతో సంతృప్తి పడకుండా తనలాంటి వారిని మరింత మందిని తయారుచేసే పనిలో ఉంది జమీర్. ఆర్థికంగా వెనకబడిన మహిళలకు కాఫీ నిపుణుల చేత వర్క్‌షాప్‌లు నిర్వహించడమే కాదు వ్యాపారం ఎలా చేయాలి? నష్టాలు రాకుండా ఎలా చూడాలి... ఇలా రకరకాల విషయాలు నేర్పిస్తుంది. మరోవైపు కాఫీ పంటల సాగులో మహిళలను ప్రోత్సహిస్తూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ‘క్వాలిటీ కాఫీ కల్చర్’ అనేది ఆమె ఎజెండాగా మారింది. ‘రకరకాల కారణాల వల్ల తీవ్రమైన నిరాశాæనిస్పృహల్లో ఉన్న సమయంలో, పెద్దగా ఆసక్తి లేకపోయినా సరే కాఫీ వర్క్‌షాప్‌కు వెళ్లాను. అక్కడ కేవలం సాంకేతిక విషయాలు మాత్రమే నేర్చుకున్నానంటే పొరపాటు. మనో బలాన్ని ఇచ్చే విషయాలు అనేకం విన్నాను. సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి నన్ను నేను నిరూపించుకోవాలనే ఉత్సాహంలో ఉన్నాను’ అంటుంది నలభై రెండు సంవత్సరాల కికాన్. జమీర్ కృషి వృథా పోలేదు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది! చదవండి: Meenakshi Vashist: దీపం వెలిగింది -
అస్సాం, నాగాలాండ్‌ల మధ్య కీలక ఒప్పందం
దిమాపుర్/గువాహటి: అస్సాం, నాగాలాండ్‌ల మధ్య ముదిరిన సరిహద్దు వివాదానికి తాత్కాలిక బ్రేక్ పడే దిశగా ఇరు రాష్ట్రాలు కలసి నిర్ణయం తీసుకున్నాయి. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బరువా, నాగాలాండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జే ఆలంలు శనివారం భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల బలగాలు మోహరించి ఉన్న దెసోయ్ లోయ అడవి/సురాంగ్‌కాంగ్ లోయ ప్రాంతాల నుంచి పరస్పరం వెనక్కు వెళ్లాలని ఒప్పందం చేసుకున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో వివాదాస్పదంగా ఉన్న పలు గ్రామాల నుంచి బలగాలను వెనక్కు పంపడం ద్వారా అక్కడ శాంతి నెలకొల్పే ప్రయత్నం జరుగుతోంది. 24 గంటల్లోగా బలగాలు వెనక్కు వెళ్లాలని ఇరు ప్రభుత్వాల నేతలు కలసి నిర్ణయించారు. నాగాలాండ్ డిప్యూటీ సీఎం వై పట్టాన్, అస్సాం విద్యా శాఖ మంత్రి రనోజ్ పెగు ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఇరు రాష్ట్రాలు కలసి మానవరహిత ఏరియల్ వెహికల్ (యూఏవీ) ద్వారా ఆయా ప్రదేశాలను మానిటర్ చేయనున్నారు. బలగాలను వెనక్కు తీసుకెళ్లే బాధ్యతలను సరిహద్దు (వివాదమున్న) జిల్లాల ఎస్పీలకు అప్పగించారు. వివాదాలను తగ్గించేందుకు అవసరమైన కీలక పరిష్కారం ప్రధాన కార్యదర్శుల భేటీ ద్వారా జరిగినట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. -
వైరల్: దుస్తులు చించేసి, మరీ ఘోరంగా..
‘‘ఐదుగురు రాక్షసులు ఒక అమ్మాయిని దుస్తులు చించేసి.. శారీరకంగా హింసించారు. ఆపై వీడియోలు తీసి షేర్ చేశారు. హింసించిన వాళ్లలో ఒక మహిళ కూడా ఉంది’’.. మానవత్వం తలదించుకునే రీతిలో జరిగిన ఈ ఘోరమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియలో దుమారం రేపుతోంది. అత్యాచార అవమానం తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుందని, ఘటనకు కారకులైనవాళ్లను కఠినంగా శిక్షించాలని #justiceforloviassumi హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌ను కుదిపేస్తోంది. ఇందులో వాస్తవమెంత ఉందంటే.. జోధ్‌పూర్(రాజస్థాన్) : ఇరవై ఐదేళ్ల లోవీ అస్సుమీ ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు ఉత్తర భారతాన్ని కుదిపేస్తోంది. నాగాలాండ్‌కు చెందిన లోవి.. జోధ్‌పూర్‌లో ఓ రెస్టారెంట్లో పని చేస్తోంది. మే 23న తానుంటున్న గదిలో ఆమె ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ లోపు ఇంటర్నెట్లో ఒక వీడియో రిలీజ్ అయ్యింది. నలుగురు వ్యక్తులు, ఓ మహిళ కలిసి ఓ అమ్మాయిని దుస్తులు చించేసి శారీరకంగా హింసించిన వీడియో అది. ఆ వీడియోను ఇంటర్నెట్లో ఉంచారు. కొందరు లోవీ అస్సుమీ ఉరికి వేలాడుతున్న ఫొటోలను, వేధింపుల వీడియోను, అందులోని స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేశారు. ఆ వీడియోలో ఉంది లోవి అస్సుమీ అని, ఆ అవమాన భారం తట్టుకోలేకే ఆమె సూసైడ్ చేసుకుందని ప్రచారం మొదలైంది. దీంతో ఆమెకు న్యాయం జరగాలని సోషల్ మీడియా ఉద్యమిస్తోంది. వేర్వేరే ఘటనలు అయితే నాగాలాండ్ యువతి సూసైడ్‌కి, ఆ వీడియోలకు సంబంధం లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ అడిషినల్ డీజీపీ రాబిన్ హిబు కార్యాలయం నుంచి ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయ్యింది. అవి రెండు వేర్వేరు ఘటనలని, ఈమేరకు జోధ్‌పూర్ డీజీపీతో సంప్రదించి ధృవీకరించినట్లు చెప్పారు. అంతేకాదు వీడియోలను నాగాలాండ్ యువతి సూసైడ్‌కి ముడిపెట్టి వైరల్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు, ఈ మేరకు దర్యాప్తు జరపాలని గుజరాత్, మిజోరాం, రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ సమాచారంతో కొందరు యూట్యూబర్లు ఈ వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మృగాల్ని శిక్షించాల్సిందే! అయితే ఘటనలో ఉన్న బాధితురాలు ఎవరైనా సరే.. నిందితులను శిక్షించాల్సిందేనని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అస్సాం పోలీసులు ఫేస్బుక్లో ఒక ప్రకటన పోస్ట్ చేశారు. వీడియోలో ఐదుగురు ఉన్నారని, వాళ్ల ఆచూకీ చెబితే నజరానా అందిస్తామని తెలిపింది. ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలిదు. కానీ, నిందితుల సమాచారం అందిస్తే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం అని అస్సాం పోలీసులు వెల్లడించారు. అయితే వీడియోల్లో ఆ గ్యాంగ్ ఇద్దరు అమ్మాయిలపై దాష్టీకానికి పాల్పడినట్లు గుర్తించామని కొందరు చెప్తున్నారు. -
నాలుగు బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్..
ఇండోర్: దేశవాళీ మహిళల క్రికెట్లో ముంబై జట్టు అనితర సాధ్యమైన రికార్డును నమోదు చేసింది. సీనియర్ వన్డే ట్రోఫీలో భాగంగా ముంబై, నాగాలాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కేవలం నిమిషాల వ్యవధిలో పూర్తయింది. తొలుత నాగాలాండ్ జట్టును 17 పరుగులకే ఆలౌట్ చేసిన ముంబై మహిళా జట్టు.. అనంతరం లక్ష్యాన్ని కేవలం 4 బంతుల్లోనే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నాగాలాండ్ జట్టు.. ముంబై కెప్టెన్, మీడియం పేసర్ సయాలీ సత్ఘరె (8.4 ఓవర్లలో 7/5) ధాటికి 17.4 ఓవర్లలో 17 పరుగలకే చాపచుట్టేసింది. సయాలీ ధాటికి నాగాలాండ్‌కు చెందిన ఒక్క బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోర్‌ని నమోదు చేయలేకపోయారు. సయాలీకి తోడుగా దాక్షిణి (2/12), ఎస్. థాకోర్ (1/0) రాణించారు.అనంతర స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబై కేవలం 4 బంతుల్లోనే విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ ఇషా ఓజా, వృషాలీ భగత్ వరుసగా మూడు బౌండరీలు, ఒక సిక్సర్ బాదడంతో మరో 49.2 ఓవర్లు మిగిలుండగానే 10 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సయాలికి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. -
కోవిడ్ టీకా: పడిపడి నవ్విన పోలీసు అధికారి
కోహిమా: మహమ్మారిని తరిమేందుకు దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ రెండవ దశ ముమ్మురంగా కొనసాగుతోంది. మొదటి దశలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి టికా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు కోవిడ్ సెంటర్‌కు వచ్చిన ఓ పోలీసు అధికారి పడిపడి నవ్వుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా వ్యాక్సిన్ వేసుకునే సమయంలో చాలా మంది భయపడటం మనం గమనించాము. కానీ ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ మంగళవారం ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియోలో టీకా వేసుకునేందుకు వచ్చిన నాగాలాండ్ పోలీసు అధికారి నవ్వుతూ కనిపించాడు. ఈ వీడియోలో వ్యాక్సినేషన్ సెంటర్‌కు వచ్చిన పోలీసు అధికారికి టీకా ఇచ్చేందుకు నర్సు అతని భజాన్ని తాకింది. దీంతో సదరు పోలీసు చెక్కిలిగింతలు పుట్టినట్లు ఒక్కసారిగా నవ్వుడం ప్రారంభించాడు. అలా అతడు ఎందుకు నవ్వుతున్నాడో అక్కడి వారికేవరికి అర్థం కాలేదు. ‘చివరికి అతడికి వ్యాక్సిన్ వేశారా లేదో తెలీదు. కానీ నర్సు అతడిని తాకగానే చెక్కిలిగింతలు పెట్టినట్లుగా అత్యుత్సాహంతో నవ్వడం ప్రారంభించాడు’ అంటూ ఆయన ఈ వీడియోను షేర్ చేశారు. #Covid19 #Vaccination gem apparently from #Nagaland. Not sure whether he had it finally but Looks like he was more anxious about the 'tickling' शायद सुई से नहीं , #स्पर्श की #गुदगुदी से हंगामा हो रहा था । pic.twitter.com/9ZTmX3URnc — Rupin Sharma IPS (@rupin1992) March 7, 2021 -
నాగాలాండ్‌లో అరుదైన దృశ్యం.. 58 ఏళ్ల తర్వాత
కోహిమా: శాసనాలు రూపొందించే చట్టసభలో దాదాపు 58 ఏళ్లుగా జాతీయ గీతం ఆలపించడం లేదు. దేశవ్యాప్తంగా ‘జనగణమన’ ఆలపించడం సంప్రదాయం. కానీ ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ అసెంబ్లీలో మాత్రం ఇంతవరకు జాతీయ గీతం ఆలపించలేదు. ఐదు దశాబ్దాల అనంతరం తొలిసారిగా ఇప్పుడు జనగణమనను సభ్యులు పాడారు. ఈ కొత్త సంప్రదాయం ప్రారంభమవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 1962లో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడగా రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా ఆ అసెంబ్లీలో జనగణమనను ప్రజాప్రతినిధులు ఆలపించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగం ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపించి కొత్త సంప్రదాయానికి తెర లేపారు. ఈ పరిణామం ఫిబ్రవరి 12వ తేదీన శుక్రవారం ప్రారంభమైంది. మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తేమ్జన్ ఇమ్నా ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీలో ఎందుకు జనగణమన గీతం ఆలపించడం లేదో తమకు తెలియదని అసెంబ్లీ అధికారులు చెప్పారు. ఏది ఏమైనా ఇప్పటికైనా ఈ కొత్త సంప్రదాయాన్ని వెలుగులోకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. స్పీకర్ షరిన్‌గైర్ లాంగ్‌కుమార్ నేతృత్వంలో నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో ఆధ్వర్యంలో ఈ పరిణామం జరిగింది. 58 years after Nagaland became a state, Jana Gana Mana played in the assembly for the first time. Members of the Assembly stand as the National Anthem “Jana Gana Mana” is played in the House for the very first time in the history of the Nagaland Legislative Assembly. pic.twitter.com/nHLauZhucv — Nandan Pratim Sharma Bordoloi 🇮🇳 (@NANDANPRATIM) February 19, 2021 -
వైరల్: గుడిసెకు కాళ్లు వచ్చాయా?
న్యూఢిల్లీ: ఏదైనా ఓ భారీ వస్తువును ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకువెళ్లాలంటే కొంతమంది సమిష్టిగా పని చేయాల్సిందే. ఎంత పెద్ద పనైనా బృందంగా ఏర్పడి చేస్తే ఎటువంటి అలసట లేకుండానే పూర్తవుతుంది. ఇటువంటి ఓ పనిని నాగాలాండ్‌లోని ఓ గ్రామ ప్రజలు చేయగా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది స్థానికులు నాగాలాండ్‌లోని ఒక గ్రామంలో ఏకంగా ఓ గుడిసె ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కాలినడకన చేతులపై మోస్తూ మార్చారు. ఆ గుడిసెను నాలుగు వైపుల పట్టుకొని అది ఉన్న ప్రదేశం నుంచి కొత్త ప్రదేశానికి మార్చారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామెన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఐక్యతమే మహా బలం అని నాగాలు మనకు చూపించే వీడియో ఇది. నాగాలాండ్‌లోని ఓ గ్రామంలో హౌస్ షిఫ్టింగ్ చాలా పురోగతిలో ఉంది’ అని కామెంట్ జత చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సుమారు 9 వేల మంది నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను చేసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. ‘చక్రాలు లేకుండానే షిఫ్టింగ్.. అద్భుతం’, ‘వావ్.. ఇది టీం వర్క్ అంటే’, ‘గుడిసెకు కాళ్లు వచ్చాయా?’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.