టైమ్‌కు రావల్సిందే: నాగాలాండ్ సీఎం
కోహిమా: ప్రభుత్వ ఉద్యోగులందరు సమయపాలన పాటించాలని నాగలాండ్ నూతన ముఖ్యమంత్రి షురోజిలి లీజిత్సు ఆదేశించారు. ఉద్యోగులదరూ ఉదయం 9.30లోపు తమ కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వర్తించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలుంటే కొంత ముందుగా బయలుదేరాలని సలహా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోని ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు ఎవరు కల్గించవద్దని, తను కూడా కల్గించనన్నారు.
తన వల్ల ఏ ఒక్కరు ట్రాఫిక్‌లో ఇరుక్కోవడం ఇష్టం లేదని పేర్కొన్నారు. ప్రజల సేవకుడినని, నగరమంతా తిరుగుతూ సేవలందిస్తానని లీజిత్సు తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా తనని ప్రయివేటుగా కలుసుకోవడానికి అపాయింట్మెంట్ ఇవ్వద్దని, అధికారులకు సూచించారు. వారు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు ఎవరయినా అందరు సెక్రట్రియేట్‌కు రావలని, అక్కడ అందరికి అందుబాటులో ఉంటానని లీజిత్సు తెలిపారు.