Shurhozelie Liezietsu
-
'13నాటికి సీఎం పదవికి రాజీనామా చేయమన్నారు'
కోహిమా: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి పదవి విషయంలో అధికార నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్-ఎన్పీఎఫ్లో చీలిక ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్ పీబీ ఆచార్య కీలక నిర్ణయం తీసుకున్నారు. బలం నిరూపించుకోవాలని సీఎం లీ జిట్సును గవర్నర్ ఆదేశించారు. ఈ నెల 15న అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని సూచించారు. కాగా నాగాలాండ్‌లో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) అధినేతగా ఉన్న షుర్హోజెలీ లీజియెట్సు కొత్త ముఖ్యమంత్రిగా మూడు నెలల కిందటే ఎంపికయ్యారు. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలలో 42 మంది ఆయనకే మద్దతు పలకడంతో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టీఆర్ జెలియాంగ్ రాజీనామా చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న జెలియాంగ్ నిర్ణయంపై ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు తిరగబడ్డ కారణంగా వారి ఒత్తిడికి తలొగ్గిన ఆయన రాజీనామా చేయడంతో 81 ఏళ్ల లీజియెట్సు పగ్గాలు చేపట్టారు. అయితే, అనూహ్యంగా ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు రెబల్ అభ్యర్థులుగా మారి లిజియుట్సుకు ఎదురు తిరిగారు. జెలియాంగ్కు మద్దతు పలికారు. దీంతో తనకు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే హక్కు ఉందని, ప్రస్తుతం తనకు 44మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో లీజియెట్సుకు జూలై 13 వరకు గడువు ఇచ్చినట్లు జెలియాంగ్ తెలిపారు. -
టైమ్‌కు రావల్సిందే: నాగాలాండ్ సీఎం
కోహిమా: ప్రభుత్వ ఉద్యోగులందరు సమయపాలన పాటించాలని నాగలాండ్ నూతన ముఖ్యమంత్రి షురోజిలి లీజిత్సు ఆదేశించారు. ఉద్యోగులదరూ ఉదయం 9.30లోపు తమ కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వర్తించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలుంటే కొంత ముందుగా బయలుదేరాలని సలహా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోని ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు ఎవరు కల్గించవద్దని, తను కూడా కల్గించనన్నారు. తన వల్ల ఏ ఒక్కరు ట్రాఫిక్‌లో ఇరుక్కోవడం ఇష్టం లేదని పేర్కొన్నారు. ప్రజల సేవకుడినని, నగరమంతా తిరుగుతూ సేవలందిస్తానని లీజిత్సు తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా తనని ప్రయివేటుగా కలుసుకోవడానికి అపాయింట్మెంట్ ఇవ్వద్దని, అధికారులకు సూచించారు. వారు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు ఎవరయినా అందరు సెక్రట్రియేట్కు రావలని, అక్కడ అందరికి అందుబాటులో ఉంటానని లీజిత్సు తెలిపారు. -
ప్రతిపక్షమే లేని రాష్ట్రానికి కొత్త సీఎం
నాగాలాండ్‌లో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) అధినేతగా ఉన్న షుర్హోజెలీ లీజియెట్సు కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలలో 42 మంది ఆయనకే మద్దతు పలకడంతో ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న జెలియాంగ్ నిర్ణయంపై ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు తిరగబడ్డారు. వారి ఒత్తిడికి తలొగ్గిన ఆయన రాజీనామా చేయడంతో 81 ఏళ్ల లీజియెట్సు పగ్గాలు చేపట్టేందుకు ముందుకొచ్చారు. నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలుండగా.. వాటిలో 48 స్థానాలను నాగా పీపుల్స్ ఫ్రంట్ గెలుచుకుంది. మిగిలిన 12 స్థానాలు కూడా దాని మిత్రపక్షానికే రావడంతో.. అసలు అక్కడ ప్రతిపక్షం అన్నదే లేదు. 2015 సంవత్సరంలో కూడా ఒకసారి జెలియాంగ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి, నాగాలాండ్ నుంచి ఉన్న ఏకైక ఎంపీ నెయిఫియు రియో అప్పట్లో ఈ ప్రయత్నం చేసి, తాను సీఎం అవ్వాలనుకున్నారు గానీ కుదరలేదు. ఈసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనుకున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం లీజియెట్సును తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆయన కూడా ఎన్పీఎఫ్ నేతృత్వంలోని డెమొక్రాటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ (డాన్)కు నేతృత్వం వహించేందుకు అంగీకరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించకుండా.. పరిపాలనను పునరుద్ధరించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
మరో రాష్ట్రంలో 'తమిళ' డ్రామా
-
మరో రాష్ట్రంలో 'తమిళ' డ్రామా
కోహిమా: తమిళనాడు రిసార్టు రాజకీయాలు ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ కు పాకాయి. ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్ పై అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు చెందిన 40 ఎమ్మెల్యేలు బుధవారం తిరుగుబాటు చేశారు. వీరిని అసోంలోని కాజీరంగా ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన రిసార్టుకు తరలించారు. దీంతో నాగాలాండ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఎన్పీఎఫ్ పార్టీ అధ్యక్షుడు షుర్ హోజెలీ లీజీట్సు ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. గవర్నర్ ఆచార్యతో కలిసి సీఎం జెలియాంగ్ గురువారం ఢిల్లీ వెళ్లారు. వీరిద్దరూ శుక్రవారం పీఎంఓ మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ నేత రాంమాధవ్, ఎంపీ, మాజీ సీఎం నైపూ రియోతో సమావేశమయ్యారు. గవర్నర్ ఢిల్లీ నుంచి రాగానే పరిస్థితులు లీజీట్సు కు ప్రతికూలంగా మారాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని నైపూ రియోకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. జెలియాంగ్ కంటే ముందు నాగాలాండ్ సీఎంగా నైపూ రియో పనిచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఆయన సీఎం పదవిని వదులుకున్నారు. మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో ప్రభుత్వానికి, నాగా గిరిజనులకు మధ్య వివాదం నడుస్తుండడంతో గత కొద్ది రోజులుగా హింసాత్మక ఘటనలతో నాగాలండ్ అట్టుడుకుతోంది. జెలియాంగ్ రాజీనామా చేయాలని నాగాలాండ్ ట్రైబల్ యాక్షన్ కమిటీ(ఎన్ టీఏసీ) గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సంక్షోభం తలెత్తింది. 60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీలో ఎన్పీఎఫ్ కు 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.