చేతిలో గన్లు పట్టుకుని ఫొటోకు పోజిస్తున్న కొత్తజంట
కోహిమ : పెళ్లి.. జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతి. అయితే ఓ పెళ్లిలో వధూవరులు చేసిన పని.. వారికే కాకుండా ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులకు కూడా థ్రిల్‌ని పరిచయం చేసింది. పెళ్లి వేడుకలో పూలు, పళ్లు, రకరకాల బహుమతులతో ఫొటోలకు పోజివ్వడం సరిపోదన్నట్టుగా ఓ జంట తుపాకులు చేతబూనారు. ఏకే 56, ఎం16 గన్‌లు పట్టుకుని ఫొటోలు దిగారు. దీంతో అక్కడికొచ్చిన అతిథులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వివరాలు.. నాగా వేర్పాటువాద నాయకుడు బహతో కిబా కొడుకు వివాహం దిమాపూర్‌లో ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో నూతన దంపతులు ఆటోమాటిక్ రైఫిల్స్ ఏకే 56, ఎమ్16లను పట్టుకుని ఫొటోలకు ఫోజిచ్చారు. అయితే, తుపాకులు పట్టుకుని ఫొటోలు దిగడమేంటని అక్కడికి వచ్చిన జనం ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. పబ్లిక్‌లో మారణాయుధాలతో ఫొటోలేంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే బహతో కిబాకు విమర్శలపాలడటం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ జర్నలిస్టులను చంపుతానని బెదిరించి ఆయన పతాక శీర్షికల్లో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment