న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. నాగాలాండ్‌లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంపై సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. కేంద్రానికి చీవాట్లు పెట్టింది.
కాగా నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే వీటిని పాటించడం లేదంటూ దాఖలైన ధిక్కార పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది.
సొంత పార్టీ అధికారంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. అదే రాష్ట్రంలో మీ(బీజేపీ) ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ చర్యలు ఉండవని సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
రిజర్వేషన్ అనేది నిశ్చయాత్మక చర్య అని, దీని ఆధారంగా మహిళా రిజర్వేషన్ ఉంటుందని కోర్టు పేర్కొంది. రాజ్యాంగ నిబంధనను ఉల్లఘించి ఎలా వ్యవహరిస్తారనేది అర్థం కావడం లేదని జస్టిస్ ఎస్‌కే కౌల్ అన్నారు. నాగాలాండ్ మహిళల విద్య, ఆర్థిక, సామాజిక స్థితిగతులు అత్యుత్తమంగా ఉన్న రాష్ట్రం అని.. మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేకపోతున్నారనేది అర్థం కావడం లేదని అన్నారు. విచారణ సందర్భంగా బీజేపీ పాలిత మణిపూర్‌లో జరిగిన హింసాకాండను కూడా ఆయన ప్రస్తావించారు.
చదవండి: మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు
Comments
Please login to add a commentAdd a comment