రాహుల్‌ అనుచితంగా ప్రవర్తించారు: మహిళా ఎంపీ ఫిర్యాదు | Nagaland Bjp Woman Mp Complaint On Lop Rahulgandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌ నాతో అనుచితంగా ప్రవర్తించారు: మహిళా ఎంపీ ఫిర్యాదు

Published Thu, Dec 19 2024 4:56 PM | Last Updated on Thu, Dec 19 2024 6:04 PM

Nagaland Bjp Woman Mp Complaint On Lop Rahulgandhi

న్యూఢిల్లీ: ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీపై నాగాలాండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ ఫగ్నాన్‌‌ కొన్యాక్‌ రాజ్యసభ చైర్మన్‌ ధన్‌ఖడ్‌కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌ బయట గురువారం(డిసెంబర్‌19) జరిగిన నిరసనల్లో తనకు రాహుల్‌ అత్యంత దగ్గరగా వచ్చి అసౌకర్యానికి కారణమయ్యారని ఆరోపించారు. గట్టిగా అరుస్తూ తనకు అత్యంత సమీపంలోకి వచ్చి తనతో అనుచితంగా ప్రవర్తించారని, ఇది తనను అసౌకర్యానికి గురి చేసిందని ఫిర్యాదు అనంతరం ఎంపీ కొన్యాక్‌ చెప్పారు. 

కాగా,పార్లమెంట్‌లో గురువారం గందరగోళం నెలకొంది. అంబేద్కర్‌ను అవమానించి కాంగ్రేస్సేనని బీజేపీ.. కాదు..కాదు బీజేపీ నేతలే రాజ్యాంగ నిర్మాతను అవమానించారంటూ అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంట్‌ ముందు పోటా పోటీగా నిరసనలు చేపట్టారు. ఎంపీలు చేట్టిన నిరసనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. 

కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పార్లమెంట్‌ సిబ్బంది ఎంపీ సారంగిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 

ఇదీ చదవండి: పార్లమెంట్‌లో గందరగోళం.. రేపటికి వాయిదా 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement