
నట్వర్ ఠక్కర్
గువాహటి: నాగాలాండ్ గాంధీగా పేరు గాంచిన సామాజిక కార్యకర్త నట్వర్ ఠక్కర్(86) ఆదివారం మృతి చెందారు. మహాత్మాగాంధీ బోధనలు, భావాల వ్యాప్తికి ఆయన విశేష కృషి చేశారు. వృద్ధా ప్య సంబంధ అనారోగ్యంతో చికిత్స పొందుతూ గువాహటిలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చనిపోయారు. 1932లో మహారాష్ట్రలో జన్మించిన ఠక్కర్.. తన 23 ఏళ్ల వయసులో నాగాలాండ్‌కు వచ్చి అక్కడే సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టారు. చుచుయిమ్‌లాంగ్ అనే గ్రామంలో ‘నాగాలాండ్ గాంధీ ఆశ్రమం’ను స్థాపించారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగాలాండ్ గాంధీ చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం 1994లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారాన్ని, 1999లో పద్మశ్రీ అవార్డ్‌ను ప్రకటించింది.