రాష్ట్రంలో కుక్క మాంసం అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధిస్తూ నాగాలాండ్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను గౌహతి హైకోర్టు ఆమధ్య రద్దు చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2011పై ఈ సందర్భంగా పలు ప్రశ్నలు లేవనెత్తింది.
కుక్క మాంసం అమ్మకాల నిషేధం వెనుక..
నాగాలాండ్ ప్రభుత్వం2020, జూలై 4న కుక్క మాంసాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేశారు. కుక్క మాంసం కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు. నోటిఫికేషన్‌లో తెలిపిన వివరాల ప్రకారం వాణిజ్య, రెస్టారెంట్లు వంటి ప్రదేశాలలో కూడా కుక్క మాంసం అమ్మకాలను నిషేధించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2014 సర్క్యులర్‌ను అనుసరించి నాగాలాండ్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్, 2011లో పేర్కొన్న జంతువులు మినగా ఇతర జాతుల జంతువులను వధించడాన్ని నిషేధించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్, 2011లోని రూల్ 2.5.1(a)లోని వివరాల ప్రకారం గొర్రెలు, మేకలు, పందులు,పౌల్ట్రీ, చేపలను ఆహారంగా భావించి, వాటిని వధించేందుకు అనుమతి కల్పించారు.
‘ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’
హైకోర్టులో జస్టిస్ మార్లీ వాన్‌కుంగ్ సింగిల్ జడ్జి ధర్మాసనం కేసును విచారిస్తూ ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ- 2011లో కుక్క పేరు చేర్చకపోవడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎందుకంటే ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కుక్క మాంసం కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో దాని పేరును జాబితాలో చేర్చకపోవడం ఊహకు అతీతమేమీ కాదని వివరించింది.
కుక్క మాంసం అంటే ఎంతో ఇష్టం
నాగా ప్రాంతాల్లో నేటికీ కుక్క మాంసాన్ని ఇష్టంగా తింటున్నారని, ఇది శతాబ్దాలుగా కొనసాగుతోందని హైకోర్టు పేర్కొంది. ది అంగామి నాగాస్, ది ఏఓ నాగాస్ ది రెంగ్మా నాగాస్ తదితర పుస్తకాలు, వివిధ పత్రాలను పరిశీలిస్తే నాగాలాండ్‌లోని వివిధ గిరిజన సమూహాలలో కుక్క మాంసం వినియోగం శతాబ్దాలుగా వస్తున్నదని హైకోర్టు పేర్కొంది.
‘కుక్కలను హింసిస్తున్నారు’
విచారణ సందర్భంగా యానిమల్స్ అండ్ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్/ఇండియా తరఫు న్యాయవాది తన వాదనలో కుక్కలను స్మగ్లింగ్ చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నదన్నారు. కుక్కల కాళ్లకు తాడు కట్టి, దాని నోటికి కూడా తాడు కట్టి గోనె సంచిలో వేస్తారని పేర్కొన్నారు. వీటికి రోజుల తరబడి ఆహారం, నీరు ఇవ్వరని ఆరోపించారు. ఇది జంతువుల పట్ల క్రూరత్వం ప్రదర్శించడం కిందకు వస్తుందన్నారు. అయితే తాము కుక్క మాంసంపై నిషేధం విధించడాన్ని సమర్థించలేదని హైకోర్టు ముందు విన్నవించారు. దీనిపై స్పందించిన కోర్టు జంతువులపై క్రూరత్వానికి సంబంధించిన కేసుల్లో ఐపీసీని ఆశ్రయించవచ్చని తెలిపింది.
ఇది కూడా చదవండి: బజరంగ్ దళ్ ఎప్పుడు, ఎలా ఆవిర్భవించింది? కాంగ్రెస్‌తో దీనికి కనెక్షన్ ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment