అంతర్జాతీయ తెలుగు మహా సభలకు విచ్చేయన్ను నాగలాండ్‌ గవర్నర్‌ | The Governor of Nagaland visited the International Telugu Mahasabhas | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ తెలుగు మహా సభలకు విచ్చేయన్ను నాగలాండ్‌ గవర్నర్‌

Published Sat, Dec 16 2023 7:13 AM | Last Updated on Sat, Dec 16 2023 7:13 AM

The Governor of Nagaland visited the International Telugu Mahasabhas  - Sakshi

రాజమహేంద్రవరం:  ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ , చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంధ్రమేవ జయతే!  అన్న నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా  తేదీలు5,6,7 జనవరి 2024  శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది  సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలకు నాగాలాండ్  గవర్నర్ శ్రీ లా గణేషన్  విచ్చేయనున్నారని పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ చైతన్య రాజులు  తెలిపారు.

7 జనవరి 2024  మధ్యాహ్నం  2 గంటలకు జరిగే "ఆంధ్రమేవ జయతే " సభలో వారు ముఖ్య అతిధిగా పాల్గొంటారు.  అంధ్ర వాఙ్మయ వైజయంతి ప్రత్యేక సంచికను ఆవిష్కరించి, సౌజన్యం అందించిన వదాన్యులను సత్కరిస్తారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -డా.గజల్ శ్రీనివాస్,అధ్యక్షులు,9849013697

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement