Telugu Mahaa sabhalu
-
‘ఇంగ్లీష్ మీడియం.. మీ పిల్లలకేనా?..మా పిల్లలకొద్దా?’
విశాఖపట్నం, సాక్షి: తెలుగు వికాసం ముసుగులో బడుగు బలహీన వర్గాల పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని, అసలు తెలుగు వికాసం కోసం మాట్లాడిన వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివారా? అని విదసం ఐక్య వేదిక ప్రశ్నిస్తోంది. ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలంటూ తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది. తెలుగు మహా సభలు తీర్మానాలను వ్యతిరేకిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం రద్దును మేము ఖండిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఉండాలి. వేదిక మీద మాట్లాడిన వారి పిల్లలు ఎక్కడ చదువుకున్నారు?. మీ పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా?.. మా పిల్లల మాత్రం మీ దొడ్లుల్లో పశువులు కాయలా.. అసలు తెలుగు వికాసం కోసం మాట్లాడిన వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివారా?.. .. తెలుగు మహా సభల వేదిక మీద ఉన్నవారు కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా మాట్లాడారు. వేదికపై ఒకరు కూడా బడుగు బలహీను వర్గాలకు చెందిన వారు లేరు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నది బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలే!. అందుకే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి. ప్రపంచీకరణలో ఉద్యోగాల రావాలంటే ఇంగ్లీష్ అవసరం. ఇంగ్లీష్ కి వచ్చిన వారికే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఇంగ్లీషు రాక ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు రాక నష్టపోతున్నారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని విదసం ఐక్య వేదిక పేర్కొంది. -
దోహాలో తొమ్మిదొవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
ఈ నెల నవంబర్ 22,23, 2024 తేదీలలో మధ్య ప్రాచ్య దేశాలలో తొలిసారిగా ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు భారత మాజీ ఉప రాష్ట్రపతి “పద్మవిభూషణ్” ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కుటుంబ సమేతంగా ప్రధాన అతిధిగా విచ్చేస్తున్నారు. ఈ వేడుకలో స్థానిక చిన్నారుల స్వాగత నృత్యం, ఉపాధ్యాయుల సత్కారంతో సదస్సు ప్రారంభం అవుతుంది. ఖతార్ దేశంలో భారత రాయబారి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు.పది మధ్య ప్రాచ్య దేశాల అధ్యక్షులు, భారతదేశం, అమెరికా, ఆఫ్రికా మొదలైన అనేక ప్రాంతాల నుంచి సుమారు 75 మంది వక్తలు, 250 మంది సాహిత్య ప్రతినిధులు, తెలుగు రాష్త్రాల మంత్రి వర్యులు, సినీ గేయ రచయితలు, కవులు, పండితులు నమోదు చేసుకుని ప్రయాణానికి సంసిధ్దంగా ఉన్నారు. సదస్సు తర్వాత దోహా మహానగర సందర్శనం ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ సదస్సులో ప్రముఖ కథకులు, సాహితీ వేత్త ప్రొ. రామా చంద్రమౌళి (వరంగల్) గారెకి ప్రతిష్టాత్మకమైన జీవన సాఫల్య పురస్కార ప్రదానం జరుగుతుంది. ఈ సదస్సులో విభిన్న అంశాల మీద నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, సినీ కవి మౌనశ్రీ మల్లిక్ మొదలైన సుమారు 35 మంది ప్రముఖ కవుల స్వీయ రచనా పఠనం, ఆ ప్రాంతంలో ఆచార్య అద్దంకి శ్రీనివాస్ గారు సంచాలకులుగా శ్రీమతి బులుసు అపర్ణ గారి తొలి మహిళా అష్టావధానం, కవి జొన్నవిత్తుల గారి శతక గ్రంధావిష్కరణతో సహా 33 నూతన గ్రంధాల ఆవిష్కరణ, కొత్తగా రూపొందించబడిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి సమగ్ర వెబ్ సైట్ ఆవిష్కరణ మొదలైన అంశాలతో పాటు పుస్తక ప్రదర్శన-విక్రయశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.మొదటి రోజు..అనగా నవంబర్ 22, 2024 నాడు సాయంత్రం ప్రత్యేక ఆహ్వానితుల గౌరవార్ధం విందు భోజనం, ప్రముఖ గాయనీ గాయకులు Y.S రామకృష్ణ, లలిత దంపతులు (హైదరాబాద్), సుచిత్ర బాలాంత్రపు (సుచిత్ర ఆర్ట్ క్రియేషన్స్, కాకినాడ), రాంప్రసాద్ (విశాఖ) వారి సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శనలు మొదలైన ఆసక్తికరమైన అంశాలతో వినోద కార్యక్రమం జరుగుతుంది.ప్రతిష్టాత్మకమైన ఈ 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కేవలం ఖర్చుల నిమిత్తం వదాన్యుల ఆర్థిక సహకారం అర్థిస్తున్నాం. వివరాలు జత పరిచిన ప్రకటనలో చూసి స్పందించమని కోరుతున్నారు నిర్వాహకులు. ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి యూ ట్యూబ్ లింక్ లో చూడవచ్చు. ఈ కార్యక్రమం ప్రధాన నిర్వాహకులు వంగూరి చిట్టెన్ రాజు, భాగవతుల వెంకప్ప, విక్రమ్ సుఖవాసి, రాధిక మంగిపూడి, శాయి రాచకొండ, వంశీ రామరాజు తదితరులు. (చదవండి: డల్లాస్‌లో నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన) -
అంతర్జాతీయ తెలుగు మహా సభలకు విచ్చేయన్ను నాగలాండ్ గవర్నర్
రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ , చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంధ్రమేవ జయతే! అన్న నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా తేదీలు5,6,7 జనవరి 2024 శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలకు నాగాలాండ్ గవర్నర్ శ్రీ లా గణేషన్ విచ్చేయనున్నారని పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ చైతన్య రాజులు తెలిపారు. 7 జనవరి 2024 మధ్యాహ్నం 2 గంటలకు జరిగే "ఆంధ్రమేవ జయతే " సభలో వారు ముఖ్య అతిధిగా పాల్గొంటారు. అంధ్ర వాఙ్మయ వైజయంతి ప్రత్యేక సంచికను ఆవిష్కరించి, సౌజన్యం అందించిన వదాన్యులను సత్కరిస్తారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -డా.గజల్ శ్రీనివాస్,అధ్యక్షులు,9849013697 -
అంధ్రమేవ జయతే.. రాజమహేంద్రవరంలో "అంతర్జాతీయ తెలుగు మహాసభలు"
రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్,చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ రాజరాజ నరేంద్రుల వారి పట్టాభిషేక సహస్రాబ్ది ఉత్సవాల నీరాజనం గా 2వ అంతర్జాతీయ తెలుగు మహా సభలు -2024, జనవరి 5, 6,7 తేదీలు 2024 ఉదయం 8.30 నుండి మూడు రోజుల పాటు గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాలయ ప్రాంగణం రాజమహేంద్రవరం. అంధ్ర ప్రదేశ్ లో నిర్వహించనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ ,చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ చైతన్యరాజులు, పరిషత్ కార్యదర్శి శ్రీ రెడ్డప్ప ధవేజీ పాత్రికేయ సమావేశంలో తెలిపారు. తెలుగు భాషా వికాసం కోసం.. అంధ్రమేవ జయతే ! అన్న నినాదంతో తెలుగు భాషలోని షుమారు 25 పై ప్రముఖులతో సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలాది మంది విద్యార్థులు తెలుగు సంస్కృతి , భారతీయతల పై సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు , జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, పీఠాధిపతులు , చలనచిత్ర ప్రముఖులు అతిథులుగా రానున్నారని తెలిపారు. ప్రాంగణం లో ఒక ప్రధాన వేదిక, రెండు ఉప వేదికలు, గ్రంధాల, ఆయుర్వేద, చిరు ధాన్యాలు, , కొండపల్లి, లేపాక్షి, ఏటికొప్పాక కళలు , తెలుగు వైభవం చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ కళల తో పాటు సంచార జాతుల కళా ప్రదర్శనలకు కూడా పెద్ద పీట వేస్తామని తెలిపారు. షుమారు 50 దేశాల నుండి ప్రతినిధులు హాజరు అయ్యే అవకాశం ఉందని, రాష్ట్రేతర తెలుగు సంఘాల వారిని కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రవేశ రుసుము లేకుండా మహా సభల సాంస్కృతిక, సాహితీ వేదికల నిర్వహణ జరుగుతుందని తెలిపారు. శ్రీ రాజరాజ నరేంద్రుల వారి పట్టాభిషేక సహస్రాబ్ది సందర్భంగా తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలతో వేయి కవితలతో ,వేయి మంది కవులతో సహస్ర కవితా నీరాజనం ఇవ్వనున్నామని నిర్వాహకులు తెలిపారు. సదస్సులు, కవి సమ్మేళనాలతో కలిపి పాల్గొనేవారు 3000 మంది , సాంస్కృతిక కార్యక్రమాలు 15 వేల మంది వీక్షించే సదుపాయం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ కేశిరాజు రామప్రసాద్, శ్రీ శర్మ లు ముఖ్య సమన్వయ కర్తలుగా ఉంటారని తెలిపారు. త్వరలో తెలుగు మహా సభలు 2024 వెబ్సైట్ కూడా ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ పాత్రికేయ సమావేశం లో పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ మేడికొండ శ్రీనివాస్, డా.కడిమిళ్ళ వరప్రసాద్ సహస్రావధాని, కోశాధికారి శ్రీ రాయప్రోలు భగవాన్, సంయుక్త కార్యదర్శులు శ్రీ పొన్నపల్లి రామారావు, శ్రీ మంతెన రామకుమార్ , సలహాదారులు శ్రీ బాబూశ్రీ,, శ్రీ అడ్డాల వాసుదేవరావు, , కవి సమ్మేళనం సమన్వయ కర్త డా. ఎస్.ఆర్ .ఎస్ కొల్లూరి లు పాల్గొన్నారు. డా.గజల్ శ్రీనివాస్ 9849013697 -
కన్నుల పండువగా ‘సాంస్కృతికోత్సవాలు’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘సాంస్కృతికోత్సవాల’కు పెద్దపీట వేశారు. ప్రతినిధులు, ఆహూతులందరూ ఒకేచోట కూర్చొని మహాసభలను వీక్షించేందుకు అనువుగా అన్ని కార్యక్రమాలను ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం వద్దకు మార్చారు. దీంతో రవీంద్రభారతిలో ప్రతి రోజు నిర్వహించ తలపెట్టిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, తెలుగు లలిత కళాతోరణంలో నాలుగు రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపాదిం చిన వివిధ జిల్లాలకు చెందిన జానపద కళారూపాల ప్రదర్శనలు రద్దయ్యాయి. తెలుగు సాహిత్యం, సంస్కృతి, చరిత్ర ప్రధాన అంశాలుగా తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న దృష్ట్యా సాంస్కృతిక కార్యక్రమాలను పరిమితం చేసి ఎల్బీ స్టేడియంకు మార్చినట్లు మహాసభలను పర్యవేక్షిస్తున్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. మూడు చోట్ల నిర్వహించడం వల్ల ఎక్కువ మంది వేడుకల్లో పాల్గొనే అవకాశంఉండదనే ఉద్దేశంతో కూడా మార్పు అనివార్యమైనట్లు పేర్కొన్నారు. ఈ నెల 15న మహాసభల ఆరంభం నుంచి 18వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికపైనే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు సాహిత్య సదస్సు ఉంటుంది. ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం లేదు. వందేమాతరం శ్రీనివాస్ గీతంతో.. మహాసభలు ప్రారంభం రోజు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు వందేమాతరం శ్రీనివాస్ గీతంతో ఆరంభమవుతాయి. మహాసభల ప్రాశస్త్యంపై ఈ గీతాన్ని రూపొందించారు. ఆ తర్వాత రాధారెడ్డి, రాజారెడ్డి ‘మన తెలంగాణ’ నృత్య రూపక ప్రదర్శన ఉంటుంది. అనంతరం ‘లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ’ ఆధ్వర్యంలో రామాచారి బృందం తెలుగు పద్యాలు, గీతాల ఆలాపన, దేశిపతి శ్రీనివాస్ రూపొందించిన నృత్యరూపకం ‘జయ జయస్తు తెలంగాణ’ తదితర కార్యక్రమాలు ఉంటాయి. ♦ 16వ తేదీ రెండో రోజు హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచారి, శేషాచారి శత గళాసంకీర్తన, రామదాసు కీర్తనలు, అంతర్జాతీయ మూకాభినయ కళాకారుడు మైమ్ మధు ప్రదర్శన ఉంటాయి. వింజమూరి రాగసుధ కూచిపూడి నృత్య ప్రదర్శన, కాలిఫోర్నియాలో ఉంటున్న కళాకారిణి షిర్నికాంత్ ప్రదర్శన, డాక్టర్ అలేఖ్య పుంజాల ‘రాణీరుద్రమ దేవి’నృత్య రూప ప్రదర్శన ఉంటాయి. ♦ 17వ తేదీ మూడో రోజు రసమయి బాలకిషన్ సారథ్యంలో జానపద విభావరి ఉంటుంది. లక్నోలో ఉంటున్న కళా మీనాక్షి, ముంబైకి చెందిన నృత్య కళాంజలి జానపద ప్రదర్శనలు ఉంటాయి. మంగళ, రాఘవరాజు భట్ల జానపద నృత్య ప్రదర్శన ఉంటుంది. ♦ 18వ తేదీ నాలుగో రోజు కార్యక్రమాల్లో మలేషియా తెలుగువారి కదంబ కార్యక్రమం, ప్రముఖ నటీనటులు, సినీ సంగీత దర్శకులు, గాయనీ గాయకులు పాల్గొనే సినీ సంగీత విభావరి ఉంటుంది. ప్రతి రోజు కార్యక్రమాల ఆరంభానికి ముందు అరగంట పాటు ‘తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యం’పై సినిమా ప్రదర్శన ఉంటుంది. వేదికల మార్పు.. ♦ రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్ర మాలు రద్దయిన దృష్ట్యా ప్రధాన ఆడిటోరియంలో బాలలు, మహిళల సాహిత్యం, ప్రవాస తెలుగువారి సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ♦ రవీంద్రభారతి మినీ ఆడిటోరియంలో అష్టావధానం ఉంటుంది. ♦ పబ్లిక్‌గార్డెన్స్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ♦ తెలంగాణ సారస్వత పరిషత్ హాల్లో శతావధానం ఉంటుంది. -
పప్పు.. హల్వా.. పాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ఈనెల 15 నుంచి నిర్వహించ నున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ వంటకాలు ఏర్పాటు చేయనున్నా రు. సభలకు హాజరవుతున్న ప్రతినిధులకు 4 రోజుల పాటు భోజనాలందించే బాధ్యతను పౌరసరఫరాల శాఖ తీసుకుంది. ఉత్తరభారత వంటకాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 16వ తేదీ...: తెల్ల అన్నంతో పాటు వెజ్ బిర్యాని, వడియాల పులుసు, బగార బైగాన్, బెండకాయ ప్రై, పాలకూర పప్పు, చింతకాయ–పండు మిర్చి చట్నీ, దొండకాయ పచ్చడి, పచ్చి పులుసు, టమాటా రసం, చింతపండు పులిహోర, క్యారె ట్ హల్వా, భక్షాలు, పూరీతో పాటు పన్నీర్ బట్టర్ మసాలా అందిస్తారు. 17వ తేదీ...: జీరా రైస్, బీరకాయ – టమాట, సోయాకూర, మెంతుల పులుసు, వంకాయ సోగి, పుంటి కూర పప్పు, దోసకాయ చట్నీ, పచ్చి మిర్చి తొక్కు, పచ్చి పులుసు, దగడ్డ పులుసు, పెసరు గారెలు, బూందీలడ్డు, సోరకాయ హల్వా, చపాతీ, ఆలూ మట్టర్ ఏర్పాటు చేశారు. 18వ తేదీ...: భగారా రైస్, క్యాప్సికం కూర, సొరకాయ పొడి పప్పు, ఆలూ వేపుడు, గంగవాయిలు–మామిడికాయ పప్పు, టమాట చట్నీ, బీరకాయ పచ్చడి, పచ్చి పులుసు, మజ్జిగ చారు, మక్క గారెలు, ఖుర్బానికా మీటా, ఐస్ క్రీం, జొన్న రొట్టెతో నార్త్ ఇండియన్ స్పెషల్ మిక్స్డ్ వెజ్ కర్రీ ఉంటుంది. 19వ తేదీ...: టమాటా రైస్, చిక్కుడుకాయ – టమాటా కూర, వంకాయ పులుసు, కంద వేపుడు, టమాట పప్పు, వంకాయ చట్నీ, పుంటికూర చట్నీ, పచ్చి పులుసు, దాల్చా, అరటికాయ బజ్జీ, డబుల్ కా మీటా, బెల్లం జిలేబీ, రుమాల్ రోటీతో పాటు నార్త్ ఇండియన్ స్పెషల్ ఆలూ పాలక్ అందజేస్తారు. ప్రతీ రోజూ అందించే వంటకాలు వైట్ రైస్, సలాడ్, సకినాలు, సర్వపిండి, చల్ల మిరపకాయలు, పాపడ్, పొడులు (3 రకాలు), చట్నీలు (3 రకాలు), నెయ్యి, పెరుగు, పప్పు చారు, కట్ మిర్చీ, పాన్ (స్వీట్, సాదా) అందజేస్తారు. -
అమెరికా మొదలు ఆస్ట్రేలియా వరకు అతిథుల రాక
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాల క్రితం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడ్డ తెలుగువారు మాతృభూమిని ముద్దాడేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు వేదిక కాబోతున్నాయి. ఉద్యోగం లేదా వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డ పూర్వతరం వారి వారసులు ఎంతో మంది ఇప్పుడు మహాసభల కోసం హైదరాబాద్ రాబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా స్వదేశానికి రానివారు కూడా ఈ తెలుగు ఉత్సవాల పేరుతో మళ్లీ స్వదేశాగమనం చేయనున్నారు. అమెరికా మొదలుకుని ఆస్ట్రేలియా వరకూ దాదాపు 70 దేశాల నుంచి సుమారు 410 మంది మహాసభలకు రానున్నారు. వెయ్యేళ్ల తెలుగు భాషను తలచుకునే మహాసభలను భాషాభిమానులు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును అద్భుతంగా నిర్వహించి భేష్ అనిపించుకున్న రాష్ట్ర ప్రభుత్వం అదే ఊపులో దేశం దృష్టిని ఆకర్షించేలా మహాసభలను నిర్వహించబోతోంది. అహో అనిపించేలా.. బాణసంచా.. ఒలింపిక్స్ ఆకర్షణ అనగానే ఠక్కున మదిలో మెదిలేది ప్రారంభ వేడుకలో నిర్వహించే బాణసంచా వెలుగులే.. భారీ వ్యయంతో లయబద్ధంగా సాగే బాణసంచా కార్యక్రమాన్ని వీక్షించి ప్రపంచవ్యాప్తంగా జనం మైమరిచిపోతారు. ఈ స్థాయిలో ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా జరగని విధంగా ప్రపంచ తెలుగు మహాసభల్లో బాణసంచా కార్యక్రమం ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఈ బాణసంచా కార్యక్రమం జరగనుంది. తొలిరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభలను ప్రారంభించినట్టు ప్రకటించగానే దాదాపు 15 నిమిషాల పాటు ఏకధాటిగా బాణసంచా వెలుగుజిలుగులు ఉంటాయి. చివరిరోజు సభలకు బాణసంచా వెలుగులతోనే ముగింపు పలకనున్నారు. ప్రారంభ వేడుక సందర్భంగా లక్ష వాట్ల ఆడియో సిస్టమ్ నుంచి సంగీత తరంగాలు వెలువడుతుండగా, వాటికి అనుగుణంగా ఆకాశంలో అగ్నిపూల వాన కురుస్తుంది. రూ.రెండున్నర కోట్ల వ్యయం కాగల ఈ భారీ ఈవెంట్‌కు హెచ్ఎండీఏ టెండర్లు పిలిచింది. దేశంలో పేరుగాంచిన సంస్థకే టెండర్ దక్కే అవకాశం ఉంది. గతంలో ఆఫ్రోఏషియన్ గేమ్స్ సందర్భంగా గచ్చిబౌలి మైదానంలో నిర్వహించిన ఫైర్వర్క్స్ దేశం దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు వాటిని తలదన్నే రీతిలో ఒలింపిక్స్ స్థాయిలో ప్రారంభ వేడుక ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయటంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. కుదిరితే లేజర్‌షో కూడా ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. వెరసి ఏ రాష్ట్రంలోనూ స్థానిక ఉత్సవాల్లో ఇప్పటి వరకు కనిపించని భారీతనం ప్రత్యక్షమయ్యేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ బస్సులు అందుబాటులో.. మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చేవారు హోటళ్లకు, వేదికల వద్దకు చేరుకునేందుకు వీలుగా 200 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. విమానాశ్రయం నుంచి మల్టీయాక్సల్ గరుడ ప్లస్ బస్సులు నాలుగు సిద్ధంగా ఉంటాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి వచ్చే వారి కోసం వజ్ర ఏసీ మినీ బస్సులు, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు ఏర్పాటు చేశారు. వీటిల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఆర్టీసీకి అద్దె చెల్లిస్తుంది. ఇక పేర్లు నమోదు చేసుకున్న వారికి ఉచితంగా భోజన ఏర్పాట్లు చేయగా.. మిగతావారికి చవక ధరలకు భోజనం దొరికేలా చర్యలు తీసుకుంటున్నారు. స్టేడియంలో భోజనాల కోసం 60 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో ఘుమఘుమలాడే తెలంగాణ వంటకాలు తక్కువ ధరలకే సిద్ధంగా ఉంటాయి. 25 పుస్తక స్టాళ్లు, నాణేలు, శాసనాలు, వస్త్రాల స్టాళ్లు కూడా ఉంటాయి. విదేశీ ప్రతినిధులకు పెద్దపీట.. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో విదేశీ ప్రతినిధుల సంఖ్య చాలా పలుచగా ఉండేది. ఈసారి విదేశీ కళ ఉట్టిపడేలా మహాసభలు నిర్వహించాలని ఆది నుంచి భావిస్తున్న సీఎం ఆ దిశగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటంతో వివిధ దేశాల్లోని తెలుగు సంఘాలను కలుపుకుని ప్రవాస తెలు గువారు సభలకు భారీ సంఖ్యలో హాజరయ్యే లా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఫలితంగా 70 దేశాల నుంచి 410 మంది మహాసభలకు హాజరయ్యేందుకు అంగీకారం తెలిపినట్టు అధికారులు చెపుతున్నారు. అయితే, విదేశీయులు అంతగా ఆసక్తి చూపకపోవటం అధికారులను కొంత నిరుత్సాహానికి గురిచేసింది. దీంతో ప్రవాస తెలుగు వారు తప్ప విదేశీయుల హాజరు నామమాత్రమే కానుంది. -
ఘనంగా తెలం‘గానం’
సాక్షి, హైదరాబాద్: మన ఓరుగల్లు కొన్ని వందల ఏళ్ల క్రితం, అంటే మహ్మద్ బీన్ తుగ్లక్ హయాంలో కొంతకాలం పాటు సుల్తానాబాద్‌గా పేరు మార్చుకుంది! అంతేనా... ముల్క్–ఎ–తెలంగాణ పేరిట ఓ నాణేన్నీ విడుదల చేశాడు తుగ్లక్!! దక్షిణాదిలో లభించిన తుగ్లక్ నాణెం ఇదొక్కటే!!! ఈ నాణెం డిసెంబర్ 15 నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేదికైన ఎల్బీ స్టేడియంలో ఆహూతులకు కనువిందు చేయనుంది. ఇలాంటి మరెన్నో విశేషాలతో ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు భాషా విభవాన్నే గాక తెలంగాణ ఘన చరిత్రనూ ప్రపంచానికి చాటనున్నాయి. అరుదైన, పురాతన నాణేలు, శాసనాలు, కాలగర్భంలో కలిసిపోయిన ప్రాచీన ఆలయాల నమూనాలు, చరిత్రను తెలియజెప్పే పుస్తకాలు తదితరాలు మహాసభల వేదికపై కొలువుదీరనున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో అదృశ్యమైన ఆలయాలు చూస్తారా... శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఎన్నో అద్భుత, చారిత్రక దేవాలయాలు నీట మునిగి కనుమరుగయ్యాయి. వాటి నమూనాలను పురావస్తు శాఖ అప్పట్లోనే రూపొందించింది. కృష్ణా, తుంగభద్ర నదీ తీరాల్లోని అలంపూర్, ప్రాగటూరు, జట్‌ప్రోలు తదితర ప్రాంతాల్లో నిర్మితమైన ఈ ఆలయాల నమూనాలను పురావస్తు శాఖ ఆధీనంలోని హెరిటేజ్ సెంటినరీ (శ్రీశైలం పెవిలియన్) మ్యూజియంలో ఉంచారు. వాటిలోంచి ముఖ్యమైన పది నమూనాలను తెలుగు మహాసభల వేదిక వద్ద ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇవేగాక మన చరిత్ర ఘనతను తెలియజెప్పే 100 వరకు పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఆసక్తి ఉన్నవారు వీటిని కొనుక్కోవచ్చు కూడా! శిల్పాల ప్రదర్శనకు వెనకడుగు! ఇటీవల ముంబై ఛత్రపతి శివాజీ ప్రదర్శనాలయంలో బ్రిటిష్ మ్యూజియంతో కలసి ఏర్పాటు చేసిన ప్రదర్శనలో విదేశీయులను సైతం బాగా ఆకట్టుకుంటున్న శిల్పం తెలంగాణదే. బుద్ధుడి జీవితంలో ముఖ్య ఘట్టాలను మూడు భాగాలుగా చిత్రించిన ఆ నాలుగున్నర అడుగుల శిల్పం సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో లభించింది. ఇలాంటి మరెన్నో అద్భుత పురాతన శిల్పాలు మన మ్యూజియంలో పదిలంగా ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇవి కనువిందు చేస్తే సందర్భోచితంగా ఉండేదని భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి మహాసభల వేదిక వద్ద పురావస్తు విశేసాలను ప్రదర్శనకు ఉంచాలన్న ఆలోచనే అధికారుల్లో తొలుత లేదు! ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం పురమాయించడంతో పురావస్తు శాఖ హడావుడిగా రంగంలోకి దిగింది. తక్కువ సమయంలోఅరుదైన ఆ విగ్రహాలను వేదికకు తరలించడం తదిరాలు కుదరకపోవచ్చనే అను మానంతో ఇలా నాణేలు, శాసన నకళ్లు, పుస్తకాలతో అధికారులు సరిపెడుతున్నారు. - తెలంగాణ ఘన చరిత్రకు సజీవ జ్ఞాపకంగా మిగిలిన దాదాపు 140 అరుదైన నాణేలను ఎల్బీ స్టేడియం ప్రధాన వేదిక వద్ద వీక్షకుల కోసం ప్రదర్శనకు ఉంచుతున్నారు. ప్రాచీన కాలంనాటి ముద్రల నాణేలు (పంచ్ మార్క్డ్) మొదలుకుని శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, బహమనీలు, కుతుబ్షాహీల్టు, విజయనగర రాజులు, నిజాంల దాకా తెలంగాణలో చలామణీ అయిన పలు నాణేలు కొలువుదీరనున్నాయి. - వెయ్యేళ్ల తెలుగుగా మన భాషకు ప్రాచీన హోదా దక్కేందుకు ఆధారభూతమైన కుడిత్యాల శాసనం చూడాలనుకుంటే తెలుగు మహాసభలకు రావాల్సిందే. ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో తవ్వకాల్లో వెలుగు చూసిన ఈ శాసనంపై తెలుగు లిపి కనిపించింది. ఇది క్రీ.శ. 945 నాటి శాసనమని నిరూపితమైంది. సంస్కృతం, కన్నడంతోపాటు తెలుగులో కందపద్యం రాసి ఉన్న ఈ శాసనం కూడా మహాసభల్లో కొలువుదీరనుంది. దీనితోపాటు మరో నాలుగైదు పురాతన శాసనాల నకళ్లను కూడా ప్రదర్శనకు ఉంచుతున్నారు. -
తెలుగు మహాసభలను విజయవంతం చేద్దాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 15 నుండి 19వ తేదీ వరకు నిర్వహించే ఈ మహాసభలకు రాష్టపతి, ఉప రాష్ట్రపతితోపాటు ఇతర ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారితో కలసి సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చే సాహితీ ప్రముఖులకు బస, భోజనం, రవాణా తదితర సౌకర్యాల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, ప్రత్యేక వలంటీర్లను నియమించుకోవాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, హెచ్వోడీలు, యూనివర్సిటీ వీసీలకు ప్రారంభ, ముగింపు వేడుకల్లో పాల్గొనేలా సర్క్యులర్ రూపొందించాలని ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హాకు సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, ముఖ్యకార్యదర్శులు సునీల్ శర్మ, రజత్ కుమార్, సీవీ ఆనంద్, కార్యదర్శులు బి.వెంకటేశం, సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, వాటర్‌బోర్డు ఎండీ దానకిషోర్, పీసీబీ సభ్యకార్యదర్శి సత్యనారాయణరెడ్డి, టూరిజం కార్పొరేషన్ ఎం.డి. క్రిస్టినాచౌంగ్త్, సాట్స్ ఎం.డి. దినకర్ బాబు, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్ కలెక్టర్ యోగితారాణా, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, హైదరాబాద్ సీపీ శ్రీనివాసరావు, సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలుగు యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ, గ్రంధాలయ సంస్థల చైర్మన్ శ్రీధర్, ఆధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో లేజర్ షో తెలుగు మహాసభలకు ప్రముఖ క్రీడాకారులను ఆహ్వానించాలని ఎస్పీ సింగ్ ఆదేశించారు. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడి యంలో ప్రముఖ నిపుణులతో లేజర్ షో నిర్వహించాలని, నగరంలో 100 స్వాగత ద్వారాలతోపాటు ఎయిర్‌పోర్టు, బస్, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిం చారు. టెలివిజన్ చానళ్లల్లో అడ్వర్టయిజ్ మెంట్, సెల్ ఫోన్ల ద్వారా వాయిస్ మేసేజ్ ప్రచారం నిర్వహించాలన్నారు. పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. వేడుకల సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక బుక్ స్టాల్స్ , ఫుడ్ కోర్ట్, హస్తకళల స్టాల్స్ ఏర్పాటుతోపాటు మంచినీటి సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
తెలుగు వైభవాన్ని చాటేలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగు భాష వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. అందులో తెలుగు భాషా ప్రక్రియలన్నింటికి సంబంధించిన ప్రదర్శనలు జరగాలన్నారు. దేశ నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు ఈ మహాసభల్లో పాల్గొంటారని.. వారికి అవసర మైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై బుధవారం ప్రగతి భవన్లో సీఎం సమీక్షించారు ‘‘పద్య సాహిత్యం, గద్య సాహిత్యం, అవధానం, జానపదం, సంకీర్తనా సాహిత్యం, కథాకథన రూపాలు తదితర అంశాల్లో ఉద్ధండులైన ఎంతో మంది తెలంగాణ బిడ్డలు తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి కృషి చేశారు. వారందరినీ స్మరించుకోవాలి. వారు తెలుగు భాష కోసం చేసిన కృషిని చాటి చెప్పాలి. తెలంగాణలో వెలుగొందిన భాషా ప్రక్రియలన్నింటినీ మరోసారి ప్రపంచానికి చూపాలి’’ అని పేర్కొన్నారు. వందల ఏళ్ల నుంచి తెలంగాణలో తెలుగు భాష వర్ధిల్లుతూ వస్తోందని.. అనేక మంది పండితులు, కవులు, రచయితలతోపాటు నిరక్షరాస్యులు కూడా బతుకమ్మలాంటి పాటల ద్వారా జానపద పరంపరను కొనసాగించారని పేర్కొన్నారు. విస్తృతంగా ఏర్పాట్లు మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరంలో విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని.. స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. తెలుగు భాషలో పద్యాలు, పాటలు, వివిధ ప్రక్రియలకు సంబంధించిన ఆడియోలు ప్రతీ చోట వినిపించాలని... ప్రతీ ప్రక్రియ ప్రదర్శనకు వేర్వేరు వేదికలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎక్కడ ఏయే కార్యక్రమాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పారు. సాహి త్య అకాడమీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు, తెలుగు వర్సిటీ వీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గొప్ప చరిత్రను ఘనంగా చాటాలి తెలంగాణ గొప్ప చరిత్రను ఘనంగా చాటుకునేందుకు తెలుగు మహాసభలు ఉపయోగపడాలని కేసీఆర్ పేర్కొన్నారు. మహాసభల సందర్భంగా తెలుగు భాషలోని అన్ని ప్రక్రియలకు సంబంధించి ప్రత్యేక వేదిక ద్వారా ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో తెలుగు సంఘాలున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలున్నారు. దేశ, విదేశాల్లో పరిపాలన, రాజకీయాలతో పాటు చాలా రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్న తెలుగువారు ఉన్నారు. వారందరినీ తెలంగాణలో జరిగే మహాసభలకు ఆహ్వానించాలి. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఆహ్వానించాలి. అమెరికాతో సహా తెలుగు వారు ఎక్కువగా ఉన్న దేశాల్లో.. ఏపీతో సహా తెలుగువారున్న రాష్ట్రాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించి ఆహ్వానించాలి..’’అని అధికారులకు సూచించారు. -
అబ్బురపరిచేలా తెలుగు మహా సభలు
తెలంగాణ సాహితీమూర్తుల ప్రతిభ ప్రధానాంశంగా సభలు - అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం - సాహితీవేత్తలందరినీ ఆహ్వానించి గౌరవించాలి - రాష్ట్రావతరణ రోజున మహాసభలకు అంకురార్పణ సాక్షి, హైదరాబాద్: తెలుగు భాష, సాహిత్యాభివృద్ధికి తెలంగాణలో జరిగిన కృషి ప్రపంచానికి తెలిసేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన వారిని, వివిధ రకాల సాహితీ ప్రక్రియల్లో విశేష పాత్ర పోషించిన వారిని మహాసభలకు ఆహ్వానించి గౌరవించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ సన్నాహక సమావేశం శుక్రవారం ప్రగతి భవన్లో జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ దినమైన జూన్ 2న హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో తెలుగు మహాసభల అంకురార్పణ జరపాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రముఖులు, తెలుగు పండితులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలన్నారు. ప్రారంభ సభకు హాజరయ్యే పండితులకు ఆన్ డ్యూటీ అవకాశం ఇవ్వడంతోపాటు రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పారు. అంకురార్పణ సభ తర్వాత వారం, పది రోజులపాటు సభలను నిర్వహించాలని, మహా సభల్లో వివిధ సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు. వారందరినీ స్మరించుకోవాలి... ‘‘తెలుగు భాషాభివృద్ధి, సాహితీ వికాసానికి తెలంగాణకు చెందిన ఎందరో మహానుభావులు విశేష కృషి చేశారు. అన్ని సాహిత్య ప్రక్రియల్లో విశేష ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. పోతన నుంచి మొదలుకుంటే ఆధునిక సాహిత్యం వరకు అనేక రచనలు చేసిన వారున్నారు. ఎన్నో సాహిత్య ప్రక్రియలను సుసంపన్నం చేసిన వారున్నారు. వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. సంప్రదాయ సాహిత్యం, అవధానం, ఆధునిక సాహిత్యంలో తెలంగాణ వ్యక్తులు చేసిన కృషి తెలిసేలా సభలు నిర్వహించాలి. సినీ, పాత్రికేయ, కథా రచన, నవలా రచన, కవిత్వం, హరి కథ, బుర్ర కథ, యక్షగానం తదితర అంశాల్లో తెలంగాణ సాహితీమూర్తులు ప్రదర్శించిన ప్రతిభాపాటవాలు ప్రధానాంశాలుగా తెలుగు మహాసభలు జరగాలి...’’అని సీఎం దిశానిర్దేశం చేశారు. పగలు సదస్సులు... రాత్రి కళారూపాలు మహాసభల్లో పగటిపూట సదస్సులు, రాత్రిళ్లు పేరిణి నృత్య ప్రదర్శన సహా వివిధ కళారూపాలు ప్రదర్శించాలని సీఎం సూచించారు. అలాగే కవి సమ్మేళనాలు, సాహిత్య గోష్టులు, అవధానాలు, విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ, కవితా పోటీలు నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రముఖులు రాసిన వ్యాసాలు, సాహిత్య రచనలను ముద్రించాలని సూచించారు.ఆంధ్రప్రదేశ్‌తోపాటు ముంబై, సూరత్, భివండి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, షోలాపూర్, ఒడిశా తదితర ప్రాంతాల్లోనూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారిని సభలకు ఆహ్వానించాలని సీఎం సూచించారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా, గల్ఫ్ తదితర దేశాల్లో తెలుగు భాష, సాహిత్యానికి సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలను మహాసభల్లో భాగస్వాములను చేయాలన్నారు. తెలంగాణ సాంçస్కృతిక శాఖ సమన్వయంతో ఈ సభలు జరుగుతాయని చెప్పారు.