అంధ్రమేవ జయతే.. రాజమహేంద్రవరంలో "అంతర్జాతీయ తెలుగు మహాసభలు" | Teulugu Maha Sabhalu In 2024 | Sakshi
Sakshi News home page

అంధ్రమేవ జయతే.. రాజమహేంద్రవరంలో "అంతర్జాతీయ తెలుగు మహాసభలు"

Published Wed, Oct 11 2023 9:47 AM | Last Updated on Wed, Oct 11 2023 9:58 AM

Teulugu Maha Sabhalu In 2024  - Sakshi

రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్,చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ రాజరాజ నరేంద్రుల వారి పట్టాభిషేక సహస్రాబ్ది ఉత్సవాల నీరాజనం గా 2వ అంతర్జాతీయ తెలుగు మహా సభలు -2024, జనవరి 5, 6,7 తేదీలు 2024 ఉదయం 8.30 నుండి మూడు రోజుల పాటు గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాలయ ప్రాంగణం రాజమహేంద్రవరం. అంధ్ర ప్రదేశ్ లో నిర్వహించనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ ,చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ చైతన్యరాజులు, పరిషత్ కార్యదర్శి శ్రీ రెడ్డప్ప ధవేజీ పాత్రికేయ సమావేశంలో తెలిపారు.

తెలుగు భాషా వికాసం కోసం..
అంధ్రమేవ జయతే ! అన్న నినాదంతో తెలుగు భాషలోని షుమారు 25 పై ప్రముఖులతో సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలాది మంది విద్యార్థులు తెలుగు సంస్కృతి , భారతీయతల పై సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు , జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, పీఠాధిపతులు , చలనచిత్ర ప్రముఖులు అతిథులుగా రానున్నారని తెలిపారు.

ప్రాంగణం లో ఒక ప్రధాన వేదిక, రెండు ఉప వేదికలు, గ్రంధాల, ఆయుర్వేద, చిరు ధాన్యాలు, , కొండపల్లి, లేపాక్షి, ఏటికొప్పాక కళలు , తెలుగు వైభవం చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ కళల తో పాటు సంచార జాతుల కళా ప్రదర్శనలకు కూడా పెద్ద పీట వేస్తామని తెలిపారు. షుమారు 50 దేశాల నుండి ప్రతినిధులు హాజరు అయ్యే అవకాశం ఉందని, రాష్ట్రేతర తెలుగు సంఘాల వారిని కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రవేశ రుసుము లేకుండా మహా సభల సాంస్కృతిక, సాహితీ వేదికల నిర్వహణ జరుగుతుందని తెలిపారు.

శ్రీ రాజరాజ నరేంద్రుల వారి పట్టాభిషేక సహస్రాబ్ది సందర్భంగా తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలతో వేయి కవితలతో ,వేయి మంది కవులతో సహస్ర కవితా నీరాజనం ఇవ్వనున్నామని నిర్వాహకులు తెలిపారు. సదస్సులు, కవి సమ్మేళనాలతో కలిపి పాల్గొనేవారు 3000 మంది , సాంస్కృతిక కార్యక్రమాలు 15 వేల మంది వీక్షించే సదుపాయం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ కేశిరాజు రామప్రసాద్, శ్రీ శర్మ లు ముఖ్య సమన్వయ కర్తలుగా ఉంటారని తెలిపారు. త్వరలో తెలుగు మహా సభలు 2024 వెబ్సైట్ కూడా ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ పాత్రికేయ సమావేశం లో పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ మేడికొండ శ్రీనివాస్, డా.కడిమిళ్ళ వరప్రసాద్ సహస్రావధాని, కోశాధికారి శ్రీ రాయప్రోలు భగవాన్, సంయుక్త కార్యదర్శులు శ్రీ పొన్నపల్లి రామారావు, శ్రీ మంతెన రామకుమార్ , సలహాదారులు శ్రీ బాబూశ్రీ,, శ్రీ అడ్డాల వాసుదేవరావు, , కవి సమ్మేళనం సమన్వయ కర్త డా. ఎస్.ఆర్ .ఎస్ కొల్లూరి లు పాల్గొన్నారు. డా.గజల్ శ్రీనివాస్ 9849013697

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement